ఇండియాఫస్ట్ లైఫ్ కుటుంబము తన ఉద్యోగులు, ఏజెంట్లు మరియు పంపిణీదారుల యొక్క ప్రయత్నాలను సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో కలగలపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంది.

సూక్ష్మ బీమాతో సామాన్య ప్రజా విపణికి సహాయపడుట
సామాన్య ప్రజలకు బీమా చేరడానికి గాను, భారతదేశానికి సమంజసమైన, పారదర్శకమైన, చౌకైన, క్రమబద్ధమైన మరియు ప్రస్తుత మౌలిక వసతులను ప్రభావితం చేసే ఒక ఆర్థిక చేకూర్పు నమూనా అవసరమై ఉంది. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వద్ద మేము, సామాన్య ప్రజానీకానికి సమంజసంగా ధర చేయబడిన, సులువైన, సమగ్రమైన మరియు సమర్థవంతమైన సేవలు అందించే బీమాను అందజేయుటకై ఒక ప్రయాణం సిద్ధం చేశాము. బీమా పరిశ్రమ కేవలం స్థోమతకు తగినదిగా మాత్రమే కాకుండా సామాన్య ప్రజా విపణికి అందుబాటులో మరియు ఆకర్షణీయంగా ఉండేలా చేసేందుకు మేము శతవిధాలా కృషి చేస్తున్నాము.

ఆర్థికపరమైన చేకూర్పు బీమా (పిఎంజెజెబివై):
ఇండియా ఫస్ట్ లైఫ్ అనేది, భారత ప్రభుత్వముచే ప్రవేశపెట్టబడిన ఆర్థిక చేకూర్పు పథకములో చురుగ్గా పాల్గొనే ఒక బీమా కంపెనీగా ఉంది. పిఎంజెజెబివై అనేది, రు 330 ల నిర్ధారిత ప్రీమియముతో మరియు రు 200,000 వర్తింపుతో ఉండే సామూహిక అవధి హామీ వర్తింపుకు అనుసంధానం చేయబడిన ఒక బ్యాంకు ఖాతా. సంపూర్ణంగా సమ్మిళితం చేయబడిన మరియు తక్కువ ఖర్చుతో కూడిన పంపిణీ నమూనా కలిగియున్న సాంకేతికతను ఉపయోగించి కంపెనీ ఈ పథకాన్ని తన బ్యాంకు భాగస్వాముల ద్వారా అందిస్తోంది. ఈ పథకం ప్రారంభమైన 2015 జూన్ నుండి దీని క్రింద ఒక సంవత్సరంలో సుమారుగా 25 లక్షల జీవితాలు బీమా చేయబడ్డాయి.

తన ఉత్పత్తులను గ్రామ స్థాయి ఔత్సాహికుల (వి.ఎల్.ఇ లు) ద్వారా పంపిణీ చేయడానికై ఒక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా చేకూర్పు అభివృద్ధి యొక్క కొవ్వొత్తిని ధరించడం పట్ల ఇండియాఫస్ట్ లైఫ్ గర్విస్తోంది. ఇరువురు భాగస్వాముల యొక్క సాంకేతికత పోర్టల్స్ యొక్క సమ్మేళనం కారణంగా పంపిణీ ప్రక్రియ సంపూర్ణంగా సాటిలేనిదిగా ఉంది. ఇండియాఫస్ట్ లైఫ్ ఈ గ్రామ స్థాయి ఔత్సాహికులకు చేయూతనిస్తుంది మరియు సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచుటలో ఒక కీలకమైన పాత్రను పోషించుటకు గాను సి.ఎస్.సి ఉద్యమము ద్వారా గ్రామీణ భారతావని యొక్క నైపుణ్యాలకు పదును పెడుతుంది.

మారుమూల గ్రామీణ సమాజాలకు బీమాను విస్తరించుట
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క సూక్ష్మ మరియు సామాన్య ప్రజా విపణి బీమా వ్యూహములో భాగంగా, భారతదేశం యొక్క మారుమూల గ్రామీణ జిల్లాలలో ఇండియాఫస్ట్ లైఫ్ బీమా పాలసీలను పంపిణీ చేయుటకు గాను 'ఐఎఫ్ఎంఆర్ గ్రామీణ ఛానల్స్’ తో అది ఒక కట్టుబాటు చేసుకొంది. ఇండియాఫస్ట్ లైఫ్, భారతదేశములోని తమిళనాడు వ్యాప్తంగా ఐదు జిల్లాలలో పనిచేసే నాలుగు కేంద్రాలలో క్షేత్రీయ గ్రామీణ ఆర్థిక సేవల (కెజిఎఫ్ఎస్) ద్వారా జీవిత బీమా పాలసీలను అందజేస్తుంది.

మా ఉద్యోగులు వారి సమాజాలకు ఎలా సహాయపడతారు
పండుగ వేడుకల కాలాల్లో భారతీయులుగా మేము, మా కానుకల ద్వారా చిరునవ్వులు వ్యాపింపజేస్తాము. ఇండియాఫస్ట్ లైఫ్ ఆవరణాలలో స్వచ్ఛంద సంస్థలచే స్టాళ్ళను ఏర్పాటు చేయించడం ద్వారా, మా ఉద్యోగుల వేడుకల సంబరాలు వర్ధిల్లేలా మేము చూసుకుంటాము.

ఇండియాఫస్ట్ లైఫ్ ఉద్యోగులు కేవలం తమకు మరియు తమ ప్రియమైన కుటుంబాలకు ఉదారంగా బహుమతి వస్తువులు కొనుగోలు చేయడమే కాకుండా అభాగ్యులు మరియు అవసరంలో ఉన్నవారి సంక్షేమం కోసం ఒక విరాళము రూపంలో దుస్తులు, బ్యాగులు, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలు మొదలగు వస్తువులను అందిస్తూ వారిలో ఆనంద దరహాసాలు వ్యాపింపజేస్తుంటారు.

ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద కార్పొరేట్ సామాజిక బాధ్యత అనేది, కేవలం సంస్థకు మాత్రమే కాదు, కంపెనీతో అనుబంధం ఉన్న అందరికీ ఒక గర్వభావన కలిగేలా అందరి ప్రమేయమును నిర్ధారించుకునే ఒక నిరంతర పెట్టుబడిగా ఉంటుంది. ఏదో ఒక సామెత చెప్పినట్లుగా, ‘దాతృత్వం ఇంటినుండే మొదలవుతుంది.’ ద్రవ్య రూపములో ప్రయోజనాల ద్వారా కావచ్చు, లేదా కేవలం ఒక సహాయ హస్తం అందించడం ద్వారా కావచ్చు, సమాజానికి తోడ్పాటు అందించడం మరియు దానికి తిరిగి ఇవ్వడంపై ఇండియాఫస్ట్ లైఫ్ దృష్టి సారిస్తుంది.

CSR INITIATIVES FOR THE FINANCIAL YEAR 2019-20

IndiaFirst Life has partnered with the following as a part of our CSR initiatives for the Financial Year 2019-20.

1.SEWA:
SEWA partnership will help us to tap women empowerment initiatives.

2.CSC Academy:
CSC Academy partnership will help us in providing livelihood enhancement projects.

3.Prime Ministers National Relief Fund for COVID-19:
Our contribution is made with an intent to help India fight the war against COVID-19 which is an unprecedented situation being faced across the World.