శ్రీ. విక్రమాదిత్య సింగ్ ఖిచీ - డైరెక్టర్

శ్రీ. విక్రమాదిత్య సింగ్ ఖిచీ

డైరెక్టర్

శ్రీ ఖిచీ గారు బి.ఎస్.సి పట్టభద్రులు మరియు సి.ఎ.ఐ.ఐ.బి నుండి వృత్తినైపుణ్యతా విద్యార్హతలతో ఎం.బి.ఎ (ఆర్థికశాస్త్రము మరియు మార్కెటింగ్) చేశారు మరియు జీవిత బీమా సహచరులుగా ఉన్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో చేరకముందు అతడు దేనా బ్యాంక్ లో ఫీల్డ్ జనరల్ మేనేజరు (గుజరాత్ వ్యవహారాలు) గా పని చేస్తూ ఉండినారు.

అతడు 1985 డిసెంబరులో దేనా బ్యాంకులో ప్రొబేషనరీ అధికారిగా చేరారు, క్రమేపీ అంచెలంచెలుగా ఎదుగుతూ మే నెల 2015 లో ఫీల్డ్ జనరల్ మేనేజరు (గుజరాత్ వ్యవహారాలు) గా పదోన్నతి పొందారు.

అతడు దేనా బ్యాంకులో 33 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో పని చేయడం ద్వారా తన కార్య వ్యవధిలో క్షేత్ర స్థాయిలో పనినిర్వహణ అనుభవము యొక్క మిశ్రమాన్నీ మరియు కంట్రోలింగ్ కార్యాలయములో ప్లానింగ్/పాలసీ రూపకల్పనను నేర్పించారు. అతడు పనిచేసిన కాలములో, అతడు రిటెయిల్ బ్యాంకింగ్, మార్కెటింగ్ (నూతన చొరవ & ఉత్పాదన అభివృద్ధి), మర్చంట్ బ్యాంకింగ్, రికవరీ యాజమాన్యము, విదేశీ వ్యాపార కేంద్రము మొదలగు ముఖ్య విభాగాల వ్యాప్తంగా ఎంతో సమృద్ధమైన అనుభవం గడించారు.

గుజరాత్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనరుగా తన విధులను నిర్వర్తిస్తూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు మరియు గుజరాత్ లో ప్రభుత్వము యొక్క అసంఖ్యాకమైన ఆర్థిక చేకూర్పు చొరవలను అమలు చేయుటలో సీనియర్ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులు, భారతీయ రిజర్వు బ్యాంకు మరియు వివిధ బ్యాంకుల యొక్క ఉన్నతాధికారులు, బీమా కంపెనీలు మరియు వివిధ సంస్థలతో సమన్వయ కృషి జరిపారు.

శ్రీ. ఎం. నాగరాజు - డైరెక్టర్

శ్రీ. ఎం. నాగరాజు

డైరెక్టర్

శ్రీ ఎం. నాగరాజు గారు 2017 ఏప్రిల్ 7 వ తేదీన జనరల్ మేనేజరుగా బాధ్యతలు స్వీకరించారు మరియు ప్రస్తుతం హైదరాబాదులోని బ్యాంక్ ప్రధాన కార్యాలయములో మానవ వనరుల విభాగము, శిక్షణ మరియు మద్దతు సేవల విధులకు బాధ్యులుగా ఉంటున్నారు.

అతడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము నుండి రాజకీయ శాస్త్రములో పట్టభద్రులుగా పట్టా, ఎం.బి.ఏ (హెచ్.ఆర్) పుచ్చుకున్నారు మరియు ఐఐబిఎఫ్ నుండి సిఎఐఐబి పొందారు. అతను 1983 జూలైలో బ్యాంకులో చేరారు మరియు క్షేత్ర వ్యాప్తంగా అదే విధంగా పరిపాలన మరియు యాజమాన్య స్థాయిలలో వివిధ హోదాలలో పనిచేసిన తర్వాత జనరల్ మేనేజరు స్థాయికి పదోన్నతి పొందారు. అతను బ్యాంక్ యొక్క చెన్నై జోన్ లో జోనల్ మేనేజరుగా పనిచేశారు. అతను ముంబైలో బ్యాంక్ యొక్క కోశాగారమునకు నాయకత్వం వహించారు. తన మునుపటి కార్యవిధులలో అతను చిన్న మరియు ప్రత్యేకించి అతిపెద్ద శాఖలకు శాఖాధిపతిగా పనిచేశారు మరియు కార్పొరేట్ క్రెడిట్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, విజిలెన్స్ విభాగాలు, బ్యాంక్ యొక్క అపెక్స్ కళాశాలలో బోధకులుగా మరియు ఇడి గారికి ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీగా కూడా పనిచేశారు.

ఒక ధృఢమైన వ్యాపార చతురతతో నాయకుడిగా, అతను బ్యాంకులో పలు కర్తవ్య బాధ్యతలను అతి సమర్థవంతంగా నిర్వర్తించారు.

శ్రీ నరేంద్ర ఓస్తవాల్ - డైరెక్టర్

శ్రీ నరేంద్ర ఓస్తవాల్

డైరెక్టర్

శ్రీ ఓస్తవాల్ గారు 2007 లో వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరారు మరియు అప్పటి నుండీ అతను సంస్థ యొక్క భారతీయ అనుబంధకర్తగా పని చేస్తున్నారు. అతను ఇండియాలో సంస్థ యొక్క పెట్టుబడి సలహాదారు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు మరియు ఇండియాలో ఆర్థిక సేవలు మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలోని అవకాశాలను మదింపు చేస్తున్నారు.

వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరక ముందు శ్రీ. ఓస్తవాల్ గారు 3i ఇండియా మరియు మికిన్‌సే & కంపెనీకి ఒక అసోసియేట్ గా ఉన్నారు.

అతను లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎ యు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, డి బి పవర్ & గ్రూప్ కంపెనీలు, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఒక డైరెక్టరుగా ఉన్నారు.

శ్రీ ఓస్తవాల్ గారు భారత చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ నుండి చార్టర్డ్ అకౌంటెన్సీ పట్టా మరియు బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎం.బి.ఏ పట్టా పొందియున్నారు.

శ్రీ. రాధాకాంత్ మాథుర్ - డైరెక్టర్

శ్రీ. రాధాకాంత్ మాథుర్

డైరెక్టర్

శ్రీ.రాధాకాంత్ మాథుర్ గారు ఇంజనీరింగ్ (వ్యవసాయ) లో వృత్తిపరమైన జెఎఐఐబి విద్యార్హతతో తన పట్టభద్ర పట్టాను పొందారు.

శ్రీ మాథుర్ గారు 1983 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో చేరారు. అతని ప్రదర్శనాత్మక ఉద్యోగ జీవితములో ఆయన క్షేత్ర స్థాయిలో వివిధ విభాగాల్లో పనిచేసి జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. అతను బ్యాంక్ ఆఫ్ బరోడా - యుకె వ్యవహారాలలో లండన్ ప్రధాన కార్యాలయానికి నాయకత్వం వహించారు. అతడు ఇంకా లండన్ గ్రూప్ కంట్రోల్ ఆఫీసు యొక్క డిప్యూటీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా గ్రామీణ మరియు వ్యవసాయ బ్యాంకింగ్ విభాగము, క్రమశిక్షణా చర్యల విభాగము మరియు డొమెస్టిక్ సబ్సిడియరీస్ విభాగము వంటి ప్రముఖ కార్యాలయాలకు కూడా ఆధిపత్యం వహిస్తూ పని చేశారు.

అతని 36 సంవత్సరాల ఉద్యోగ వ్యవధిలో, శ్రీ మాథుర్ గారు కార్య వ్యవహారాలు అదే విధంగా పరిపాలన రెండింటిలోనూ విశేషమైన అనుభవం గడించారు, అందులో పరపతి, క్రమశిక్షణా చర్యలు, వసూలు మరియు గ్రామీణ బ్యాంకింగ్ అంశాలలో విధాన నిర్ణయాల రూపకల్పన చేరి ఉన్నాయి.

శ్రీ. క్రిష్ణ అంగారా - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. క్రిష్ణ అంగారా

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ అంగారా గారు యాక్సెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యందు ఒక సలహాదారు (కమ్యూనికేషన్స్, మీడియా మరియు టెక్నాలజీ) గా పని చేస్తున్నారు. అతడు 16 అక్టోబర్ 2017 నుండి కెపిఎంజి, ముంబై యొక్క సలహాదారు విభాగమునకు ఒక సీనియర్ సలహాదారుగా కూడా నియమించబడి ఉన్నారు. అంతకు ముందు ఆయన వోడాఫోన్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వోడాఫోన్ ఎస్సార్ లిమిటెడ్ లో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా పని చేశారు. అక్కడ ఆయన మొత్తంగా బిజినెస్, ఉత్పాదన అభివృద్ధి, మార్కెటింగ్ చొరవలు, కస్టమర్ సంబంధాలు, నెట్‌వర్క్ అభివృద్ధి, మానవ వనరులు, ఫోర్‌క్యాస్టింగ్ మరియు ఆర్థిక లాభదాయకతతో సహా పలు విధులు నిర్వర్తించారు.

గతంలో ఆయన బిపిఎల్ మొబైల్ లిమిటెడ్ మరియు ఆర్.పి.జి రీకో లిమిటెడ్ కు ప్రెసిడెంట్ మరియు సి.ఇ.ఓ గా పని చేశారు. శ్రీ అంగారా గారు ఆర్థిక మరియు పని సంబంధిత వ్యవహారాల విజయం, ఉత్పాదన మరియు మార్కెటింగ్ నవ్యతలు, వ్యయ యాజమాన్యము మరియు కస్టమర్ సంతృప్తి వంటి అంశాలను ముందుకు నడపడంపై దృష్టి సారిస్తూ కొత్త వ్యాపారాలను ప్రారంభించడంలో విశేష నైపుణ్యం పొందియున్నారు.

శ్రీ. అలోక్ వాజపేయీ - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. అలోక్ వాజపేయీ

ఇండిపెండెంట్ డైరెక్టర్

ఎర్నెస్ట్ & విన్నే - లండన్ నుండి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీ వాజపేయీ గారు, ప్రస్తుతం ఫిన్‌టెక్ పై ఇండియాలో డి.ఐ.టి (యుకె ప్రభుత్వము) కి ఒక బాహ్య సలహాదారుగా పని చేస్తున్నారు. అతడు, ఎవి అడ్వైజరీకి ఛైర్మన్ గా మరియు ఇన్వెంట్ క్యాపిటల్ మరియు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మధ్య ఒక జాయింట్ వెంచర్ అయిన డిజిటల్ గోల్డ్ ఇండియాకు డైరెక్టరుగా కూడా ఉన్నారు.

2005 లో, శ్రీ వాజపేయీ గారు ఇండియాలో ఒక అగ్రస్థాయి విస్తృత శ్రేణి ఆర్థిక సేవల ప్రదాతగా డావ్నే డే ఎవి ని స్థాపించారు, మరియు ఆ కంపెనీకి వైస్ ఛైర్మన్ గా వ్యవహరించారు. అతడు 2009 లో విజయవంతంగా వ్యాపారాన్ని అమ్మివేశారు, కఠినమైన పోటీ-రహిత క్లాజులతో 2010 లో ప్రవేశించారు.

అతని సుదీర్ఘ కాలపు వృత్తి జీవితములో, శ్రీ వాజపేయీ గారు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో అత్యుత్తమ ఆచరణలను ప్రవేశపెట్టి అమలు చేసేందుకు నియంత్రణ అధికారులతో చాలా సన్నిహితంగా పని చేశారు మరియు సెక్యూరిటీస్ ఎక్స్-ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) లో సెక్యూరిటీస్ మార్కెట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీవరేజింగ్ ఎక్స్ పర్ట్ టాస్క్ ఫోర్స్ యొక్క సభ్యుడు మరియు ఎ.ఎం.ఎఫ్.ఐ బోర్డులో డైరెక్టరు వంటి బాధ్యతాయుతమైన హోదాలలో పని చేశారు. అతడు సెబి, స్టాక్ ఎక్స్-ఛేంజ్ లు, మరియు వివిధ క్యాపిటల్ ఇష్యూల వ్యాప్తంగా ఉన్న పరిశ్రమ మండళ్ళలో పని చేశారు.

2012 నుండీ, శ్రీ వాజపేయీ గారు ఒక సీరియల్ ఔత్సాహికవేత్తగా మరియు వైవిధ్యమైన కంపెనీల కూర్పు వ్యాప్తంగా ఒక ఇన్వెస్టర్, అడ్వైజర్ మరియు బోర్డు డైరెక్టర్ గా ప్రమేయం ఉన్న వెంచర్ ఇన్వెస్టర్ గా కొనసాగుతున్నారు.

శ్రీ. అరుణ్ ఛోగ్లే - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. అరుణ్ ఛోగ్లే

ఇండిపెండెంట్ డైరెక్టర్

బలమైన కస్టమర్ మరియు మార్కెటింగ్ అవగాహన కలిగియుండి ఒక ప్రముఖ ఎఫ్.ఎం.సి.జి వృత్తినిపుణుడైన శ్రీ ఛోగ్లే గారు, ఎస్.ఎం.ఇ లు, భారీ భారతీయ కంపెనీలు మరియు బహుళ జాతి కంపెనీల వ్యాప్తంగా క్లయింట్లను కలిగియుంటూ వినియోగదారు మరియు రిటెయిల్ రంగములో తన స్వంత బ్రాండ్ అడ్వైజరీ మరియు వ్యూహాత్మక సంప్రదింపు అభ్యాసము నడుపుతున్నారు.

తన సలహా సంప్రదింపు అభ్యాసానికి ముందు, అతడు అంతర్జాతీయంగా మరియు ఇండియాలో 30 సంవత్సరాల పాటుగా వైవిధ్యమైన మరియు విజయవంతమైన మార్కెటింగ్ కెరీర్ కలిగియున్నారు. జంట గ్రూపులైన ప్రోక్టర్ అండ్ గ్యాంబల్ మరియు బ్రిటిష్ అమెరికన్ లలోని రెండు మంచి కంపెనీలలో అతడు సాధారణ యాజమాన్యము మరియు వినియోగదారు మార్కెటింగ్ లో సీనియర్ నాయకత్వ హోదాలలో పని చేశారు.

అతడు ప్రస్తుతము, నీల్సన్ మరియు ఇతర సంస్థలు వంటి క్లయింట్లతో రిటెయిల్ మరియు వినియోగదారు ఉత్పత్తుల పరిశ్రమలో ప్రావీణ్యతా అంశముతో సలహాదారు మరియు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ గా ఉన్నారు.

శ్రీ. నటరాజన్ శ్రీనివాసన్ - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. నటరాజన్ శ్రీనివాసన్

ఇండిపెండెంట్ డైరెక్టర్

61 సంవత్సరాల వయసు గల శ్రీ ఎన్. శ్రీనివాసన్ గారు, ఒక కామర్స్ పట్టభద్రులు మరియు భారత ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ సభ్యుడు మరియు భారత కంపెనీ సెక్రెటరీల సంస్థ సభ్యుడుగా ఉన్నారు. అతడు ఆర్థిక, న్యాయ, ప్రాజెక్టులు మరియు సాధారణ యాజమాన్య విధులు వంటి అంశాల వ్యాప్తంగా 35 సంవత్సరాలకు పైగా కార్పొరేట్ పని అనుభవము కలిగియున్నారు.

ఆయన తన ఉద్యోగ జీవితాన్ని బి.హెచ్.ఇ.ఎల్ తో ప్రారంభించగా, అతని గత 15 ఏళ్ళ సర్వీసు చెన్నై కేంద్రంగా ఉన్న పారిశ్రామిక కంపెనీల సమ్మేళనమైన మురుగప్ప గ్రూపుతో సాగింది. అక్కడ అతడు మురుగప్ప కార్పొరేట్ బోర్డు యొక్క సభ్యులు/డైరెక్టరు, మురుగప్ప గ్రూపు యొక్క గ్రూప్ ఫైనాన్స్ డైరెక్టర్, ఆర్థిక సేవల బిజినెస్ యొక్క లీడ్ డైరెక్టర్ (ఎన్.బి.ఎఫ్.సి మరియు సాధారణ బీమా వ్యాపారము), చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరు వంటి వివిధ సీనియర్ హోదాలలో విధులు నిర్వర్తించారు.

బోర్డ్స్ ఆఫ్ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, చోళమండలం ఎం.ఎస్ జనరల్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్, మరియు టిఐ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ లలో కూడా ఆయన పని చేశారు. అతను 2018 నవంబరులో సర్వీసు నుండి పదవీవిరమణ పొందారు.

భారత ప్రభుత్వము అతడిని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & లీజింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క బోర్డుకు సభ్యుడిగా నియమించింది మరియు అతడు ఈ క్రింది ఐ.ఎల్.ఎఫ్.ఎస్ కంపెనీల బోర్డులు అనగా., ఐ.ఎల్.ఎఫ్.ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐ.ఎల్.ఎఫ్.ఎస్ తమిళనాడు పవర్ కంపెనీ లిమిటెడ్, తమిళనాడు వాటర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, మరియు న్యూ త్రిపుర ఏరియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ల బోర్డులకు కూడా చేర్చుకోబడియున్నారు.

వాటితో పాటుగా, అతడు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ యొక్క బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టరుగా కూడా ఉంటున్నారు.

శ్రీమతి. ఆర్.ఎం. విశాఖా - ఎం.డి & సిఇఓ

శ్రీమతి. ఆర్.ఎం. విశాఖా

ఎం.డి & సిఇఓ

ఆర్. ఎం. విశాఖా, ఎం.డి & సిఇఓ, ఇండియాఫస్ట్ లైఫ్, అంకుర సంస్థలు, పునర్నిర్మాణము మరియు పునర్నిర్వహణతో సహా సవాలుతో కూడిన పనుల దిశగా ఆమె యొక్క ఫలితాల-ఆధారిత నాయకత్వ విధానముతో గుర్తింపు పొందారు, మరియు మునుపు కంపెనీతో ఛీఫ్ బిజినెస్ ఆఫీసరుగా అనుబంధం కలిగియున్నారు. ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరక ముందు ఆమె కెనరా హెచ్.ఎస్.బి.సి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సేల్స్ మరియు మార్కెటింగ్ డైరెక్టరుగా పని చేశారు.

విశాఖా గారి నిరంతర కృషి విధి నిర్వహణ మరియు కంపెనీ ఉద్దేశ్యాల కీలక సమతుల్యతను నిర్వహించడం, మరియు ఉద్యోగి, మేనేజర్, పంపిణీదారు మరియు వాటాదారు ఆకాంక్షలను యాజమాన్యం చేయడంపై ఉంది. వనరులభరితమైన అమలు వెన్నుదన్నుగా వ్యూహాత్మక ఎదుగుదలను నడిపించే తన శక్తిసామర్థ్యాల ద్వారా, ఆమె ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు అదే విధంగా విదేశీ బ్యాంకుల లోపున మొట్టమొదటి రిటెయిల్ బ్యాంకష్యూరెన్స్ నమూనా తీసుకురావడం మరియు గ్రూపు బీమా బిజినెస్ ని రూపొందించి మరియు అభివృద్ధి చేయడంతో సహా బహుళ కెరీర్-నిర్వచిత మైలురాళ్ళను అధిగమించారు.

ఫార్చూన్ మేగజైన్, ఫోర్బ్స్, బిజినెస్ వరల్డ్, మరియు బిజినెస్ టుడే వంటి ప్రతిష్టాత్మక మేగజైన్లు పరిశ్రమల వ్యాప్తంగా విశాఖా గారిని తమ సమకాలీన లబ్దప్రతిష్టుల జాబితాలో చేర్చాయి. భారతీయ బీమా రంగములోని మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణము ద్వారా ఆమె సాధనలకు గుర్తింపు పొందుతూ, ఆర్.ఎం. విశాఖా గారు - ఒక సుప్రసిద్ధ భారతీయ చట్టబద్ధ సంస్థ అయిన ఐసిఎఐ (భారత ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ) చే సిఎ బిజినెస్ లీడర్ - మహిళా అవార్డుతో సత్కరింపబడ్డారు.

బి.ఎఫ్.ఎస్.ఐ ఫ్రెటర్నిటీ యొక్క ప్రముఖ సభ్యురాలు మరియు ఆలోచనా పటిమ గల నాయకురాలైన విశాఖా గారు, ఐసిఎఐ యొక్క బెహ్రయిన్ మరియు దోహా విభాగాల వంటి ఆగస్ట్ సదస్సులలో పాల్గొనడం కొనసాగిస్తున్నారు మరియు జర్మనీలో జరిగిన ప్రపంచ బీమా వేదిక యందు పాల్గొన్నారు. కొత్త తరం ఆలోచనాపరులు మరియు నాయకులకు స్ఫూర్తి మరియు ప్రేరణ కలిగించే ఆమె ఆలోచనలు మరియు కార్పొరేట్ సిద్ధాంతాలు ఎంతో గొప్పగా ప్రజా మరియు సామాజిక మాధ్యమ ప్రశంసలను గడించాయి.

విశాఖా గారు ఒక కామర్స్ పట్టభద్రులు మరియు చార్టర్డ్ అకౌంటెంటు.ఆమె భారత బీమా సంస్థ యొక్క ఫెలో గా ఉన్నారు మరియు కంప్యూటర్ సిస్టమ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందియున్నారు.