ఆర్. ఎం. విశాఖా - ఎం.డి & సిఇఓ

ఆర్. ఎం. విశాఖా

ఎం.డి & సిఇఓ

ఆర్. ఎం. విశాఖా, ఎం.డి & సిఇఓ, ఇండియాఫస్ట్ లైఫ్, అంకుర సంస్థలు, పునర్నిర్మాణము మరియు పునర్నిర్వహణతో సహా సవాలుతో కూడిన పనుల దిశగా ఆమె యొక్క ఫలితాల-ఆధారిత నాయకత్వ విధానముతో గుర్తింపు పొందారు, మరియు మునుపు కంపెనీతో ఛీఫ్ బిజినెస్ ఆఫీసరుగా అనుబంధం కలిగియున్నారు.

ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరక ముందు ఆమె కెనరా హెచ్.ఎస్.బి.సి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సేల్స్ మరియు మార్కెటింగ్ డైరెక్టరుగా పని చేశారు.

ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద, విశాఖా గారి నిరంతర కృషి విధి నిర్వహణ మరియు కంపెనీ ఉద్దేశ్యాల కీలక సమతుల్యతను నిర్వహించడం, మరియు ఉద్యోగి, మేనేజర్, పంపిణీదారు మరియు వాటాదారు ఆకాంక్షలను యాజమాన్యం చేయడంపై ఉంది. వనరులభరితమైన అమలు వెన్నుదన్నుగా వ్యూహాత్మక ఎదుగుదలను నడిపించే తన శక్తిసామర్థ్యాల ద్వారా, ఆమె ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు అదే విధంగా విదేశీ బ్యాంకుల లోపున మొట్టమొదటి రిటెయిల్ బ్యాంకష్యూరెన్స్ నమూనా తీసుకురావడం మరియు గ్రూపు బీమా బిజినెస్ ని రూపొందించి మరియు అభివృద్ధి చేయడంతో సహా బహుళ కెరీర్-నిర్వచిత మైలురాళ్ళను అధిగమించారు.

ఫార్చూన్ మేగజైన్, బిజినెస్ వరల్డ్, ఫోర్బ్స్, మరియు బిజినెస్ టుడే వంటి ప్రతిష్టాత్మక మేగజైన్లు పరిశ్రమల వ్యాప్తంగా విశాఖా గారిని తమ సమకాలీన లబ్దప్రతిష్టుల జాబితాలో చేర్చాయి. భారతీయ బీమా రంగములోని మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణము ద్వారా ఆమె యొక్క సాధనలను గుర్తిస్తూ, ఆర్.ఎం. విశాఖా గారిని - ఒక సుప్రసిద్ధ భారతీయ చట్టబద్ధ సంస్థ అయిన ఐసిఎఐ (భారత ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ) సిఎ బిజినెస్ లీడర్ - మహిళా అవార్డుతో సత్కరించింది.

బి.ఎఫ్.ఎస్.ఐ ఫ్రెటర్నిటీ యొక్క ప్రముఖ సభ్యురాలు మరియు ఆలోచనా పటిమ గల నాయకురాలైన విశాఖా గారు, ఐసిఎఐ యొక్క బెహ్రయిన్ మరియు దోహా విభాగాల వంటి ఆగస్ట్ సదస్సులలో పాల్గొనడం కొనసాగిస్తున్నారు మరియు జర్మనీలో జరిగిన ప్రపంచ బీమా వేదిక యందు పాల్గొన్నారు. కొత్త తరం ఆలోచనాపరులు మరియు నాయకులకు స్ఫూర్తి మరియు ప్రేరణ కలిగించే ఆమె ఆలోచనలు మరియు కార్పొరేట్ సిద్ధాంతాలు ఎంతో గొప్పగా ప్రజా మరియు సామాజిక మాధ్యమ ప్రశంసలను గడించాయి.

విశాఖా గారు ఒక కామర్స్ పట్టభద్రులు మరియు చార్టర్డ్ అకౌంటెంటు. ఆమె భారత బీమా సంస్థ యొక్క ఫెలో గా ఉన్నారు మరియు కంప్యూటర్ సిస్టమ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందియున్నారు.

రుషభ్ గాంధీ - ఉప ముఖ్య కార్యనిర్వాహక అధికారి

రుషభ్ గాంధీ

ఉప ముఖ్య కార్యనిర్వాహక అధికారి

ప్రశ్నించే సదస్సులను ఆస్వాదించే ఒక సాంప్రదాయక వ్యక్తి అయిన రుషభ్ గాంధీ, భారతీయ బ్యాంకింగ్ మరియు బీమా రంగములో ఒక ప్రముఖ వ్యక్తి.

మూడు సంవత్సరాల పాటు కంపెనీ యొక్క సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగమునకు నాయకత్వము వహించిన తర్వాత, రుషభ్ గారు ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క డిప్యూటీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు.

ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరక ముందు, ఆయన కెనరా హెచ్.ఎస్.బి.సి ఒబిసి లైఫ్ ఇన్స్యూరెన్స్ లో డైరెక్టర్- సేల్స్ గా పని చేశారు.రుషభ్ అవీవా లైఫ్ ఇన్స్యూరెన్స్ మరియు బిర్లా సన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో కూడా పని చేశారు. బీమా రంగము మరియు దాని మార్కెట్ స్థితిగతులలో అతని అపారమైన అవగాహనతో, రుషభ్ అనేక సంస్థల వ్యాప్తంగా అత్యున్నత పనితీరును ప్రదర్శించారు. సేల్స్, బిజినెస్ అభివృద్ధి మరియు పంపిణీ వ్యూహములో అతని ప్రావీణ్యము, తాను అనుబంధముతో ఉన్నటువంటి బ్రాండులు అన్నింటికీ విజయవంతమైన విక్రయ నమూనాల వ్యవస్థాపనకు గణనీయంగా దోహదపడేందుకు దారితీసింది.

రుషభ్ గారు నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్.ఎం.ఐ.ఎం.ఎస్) నుండి యాజమాన్య అధ్యయనములో పోస్ట్-గ్రాడ్యుయేట్ పట్టా పొందిఉన్నారు.

ఎ.కె. శ్రీధర్ - డైరెక్టర్ & ముఖ్య పెట్టుబడి అధికారి

ఎ.కె. శ్రీధర్

డైరెక్టర్ & ముఖ్య పెట్టుబడి అధికారి

ఆర్థికరంగము, పెట్టుబడి యాజమాన్యము, మ్యూచువల్ ఫండ్స్ మరియు బీమా పరిశ్రమల్లో అనుభవము మరియు గ్రాహ్యత కలిగిన నిష్ణాతుడు, ప్రముఖుడైన ఎ.కె శ్రీధర్ గారు, ఇండియాఫస్ట్ లైఫ్ లో పెట్టుబడి యాజమాన్యము మరియు ఎ.ఎల్.ఎం కార్యవిధులకు అధిపతిగా ఉంటున్నారు.

కంపెనీలో చేరడానికి ముందు, శ్రీధర్ గారు, సింగపూర్ బయట గల ఒక ఇన్వెస్ట్‌మెంట్ మానేజ్‌మెంట్ కంపెనీ అయిన యుటిఐ ఇంటర్నేషనల్ (సింగపూర్) లిమిటెడ్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. శ్రీధర్ గారు, యుటిఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు మరియు ఛీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసరు(సి.ఐ.ఓ) గా కూడా 10 బిలియన్ యుఎస్ డాలర్ల ఎ.యు.ఎం ని నిర్వహణ చేస్తూ పని చేశారు.

భారతదేశము మరియు ఆగ్నేయాసియాలో వివిధ వృత్తి నైపుణ్య వేదికలు మరియు విద్యావిషయక వర్గాలలో ఆర్థిక విపణులపై చురుగ్గా తన అభిప్రాయాలను పంచుకుంటూ అతడు ఒక ఆలోచనాయుతమైన నాయకుడిగా భావి తరాల పెట్టుబడి నిపుణులకు దోహదపడుతున్నారు.

శ్రీధర్ గారు భౌతికశాస్త్రములో పట్టభద్రులుగా పట్టా పొందియున్నారు, అలాగే అర్హత పొందిన ఒక చార్టర్డ్ అకౌంటెంటుగా ఉంటున్నారు. అతను ఎన్.ఎస్.ఇ-ఐఐఎస్ఎల్ ఇండెక్స్ పాలసీ కమిటీ మరియు ఇండియన్ మర్చంట్ ఛాంబర్స్ (ఐ.ఎం.సి) యొక్క క్యాపిటల్ మార్కెట్ కమిటీలో ఒక సభ్యుడుగా ఉన్నారు.

మోహిత్ రోచ్‌లానీ - డైరెక్టర్ - ఐటి & ఆపరేషన్స్

మోహిత్ రోచ్‌లానీ

డైరెక్టర్ - ఐటి & ఆపరేషన్స్

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డైరెక్టర్ - ఐటి ఆపరేషన్స్ అయిన శ్రీ మోహిత్ రోచ్‌లానీ, కంపెనీలో బహుళ విధి నిర్వాహక కోణాలు మరియు డిజిటల్ అంతరాయాలకు చుక్కానిగా ఉన్నారు. కంపెనీ యొక్క వ్యవస్థాపక సభ్యుడుగా అతని ప్రావీణ్య ప్రయాణము రెండు దశాబ్దాలుగా కొన్ని అగ్రశ్రేణి ఆర్థిక సంస్థల వ్యాప్తంగా ముందుకుసాగింది.

మోహిత్ గారి క్రిందికి వచ్చే అంశాలలో, కంపెనీ యొక్క కస్టమర్ సేవ మరియు అదేవిధంగా ఆపరేషన్స్ యూనిట్లను నిర్వహించడంతో పాటుగా, బీమా వ్యాపారములో అత్యంత కీలకమైన విధులలో ఒకటైన అండర్‌రైటింగ్ చేరి ఉంటుంది. అతను ఉత్పన్నమైన వ్యాపారము యొక్క స్థిరీకరణ మరియు పట్టుకు బాధ్యుడుగా ఉంటూ సంపూర్ణంగా కస్టమర్ మరియు పంపిణీదారు ప్రయాణమునకు చుక్కానిగా ముందుకు సాగుతున్నారు.

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క ఆపరేషనల్ ప్రక్రియలు కూర్పు చేసిన వ్యక్తిగా మోహిత్ ఘనత పొందారు మరియు తదనంతరం బ్యాంకష్యూరెన్స్ మార్గము ద్వారా ఆదాయ ఉత్పన్నము మరియు సంబంధబాంధవ్యాల నిర్వహణ యొక్క బాధ్యతను స్వీకరించారు.

మోహిత్, ముంబై విశ్వ విద్యాలయము నుండి ఆర్థిక శాస్త్రములో మేనేజ్‌మెంట్ స్టడీస్ లో మాస్టర్స్(MMS)డిగ్రీ మరియు మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యందు బ్యాచెలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (బి.ఇ) పట్టా పొందియున్నారు.

కె.ఆర్ విశ్వనారాయణ్ - కంపెనీ సెక్రెటరీ & హెడ్ - గవర్నెన్స్

కె.ఆర్ విశ్వనారాయణ్

కంపెనీ సెక్రెటరీ & హెడ్ - గవర్నెన్స్

కె.ఆర్ విశ్వనారాయణ్, కంపెనీ సెక్రెటరీ మరియు హెడ్ – గవర్నెన్స్, ఇండియాఫస్ట్ లైఫ్, తనతోపాటుగా, కంపెనీ యొక్క వ్యూహాత్మక మార్గసూచీని తనకు తానుగా తీర్చిదిద్దిన ఆర్థిక వ్యవహారాలు, పన్ను విధానము, ఫండ్ అకౌంటింగ్ మరియు ఆపరేషన్స్, ఫండ్ రైజింగ్, విలీనాలు మరియు స్వాధీనతలు, మదుపరి సేవ, సెక్రెటేరియల్ మరియు సమ్మతి వహింపు అంశాలలో విస్తృత శ్రేణి ప్రావీణ్యమును వెంట తెచ్చుకున్నారు. కంపెనీ యొక్క లీగల్, సెక్రెటేరియల్, రిస్క్, ఆడిట్ మరియు కాంప్లియెన్స్ వ్యవహారాలు విశ్వనారాయణ్ యొక్క బాధ్యతల పరిధి క్రిందికి వస్తాయి.

ఇంతకు మునుపు, విశ్వనారాయణ్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియా, డిఎస్‌పి మెరిల్ లింఛ్ మ్యూచువల్ ఫండ్ మరియు బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ లలో నాయకత్వ హోదాలు నిర్వర్తించారు. అతను, జెపిమోర్గాన్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎల్ఐసి హెచ్.ఎఫ్.ఎల్ తో సహా పలు సంస్థలలో రంగ-నిర్దిష్ట వెంచర్ ఫండ్స్ లో కూడా పని చేశారు.

ముంబై విశ్వవిద్యాలయము నుండి కామర్స్ పట్టభద్రులైన విశ్వనారాయణ్ గారు, అర్హత పొందియున్న ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ మరియు కంపెనీ సెక్రెటరీ. అతని కెరీర్ తొలిదశల్లో అతడు, ఆర్థికరంగములో అభివృద్ధికి అనుగుణంగా అందజేయడానికి కీలకమైన ప్రావీణ్యతలను వృద్ధి చేయడానికి గాను యుఎస్ఎ లోని న్యూయార్క్ లో మెరిల్ లింఛ్, ప్రిన్స్‌టన్, మరియు జెప్మోర్గాన్ వద్ద శిక్షణ పొందిన నిపుణుల్లో ఒకరుగా ఉన్నారు.

కేదార్ పట్కీ - ముఖ్య ఆర్థిక అధికారి (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)

కేదార్ పట్కీ

ముఖ్య ఆర్థిక అధికారి (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)

రెండు దశాబ్దాలుగా విస్తృతమైన ఉద్యోగానుభవము గడించిన కేదార్ పట్కీ గారు, బీమా పరిశ్రమలో పనిచేసిన ప్రత్యేకితమైన ప్రదర్శనాత్మక చరిత్రతో వచ్చారు. అతడు తన వృత్తినైపుణ్యతా ప్రయాణములో అధిక భాగాన్ని, ప్లానింగ్ & బడ్జెటింగ్, స్ట్రాటజీ, అకౌంటింగ్, ట్యాక్స్, మేనేజ్‌మెంట్, ఆఫ్‌షోరింగ్ మరియు బీమా రంగాలలోని తన ప్రావీణ్యతతో ఇండియా మరియు విదేశీ మార్కెట్లలోని ఆర్థికరంగము మరియు పని వ్యవహారాల రంగములో గడిపారు.

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో చేరకముందు, కేదార్ గారు ఐడిబిఐ ఫెడరల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో సి.ఎఫ్.ఓ గా ఉన్నారు మరియు టాటా ఎఐజి జనరల్ ఇన్స్యూరెన్స్ , ఎస్.బి.ఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఎ.ఎక్స్.ఎ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్, మరియు ఆకో నోబెల్ ఇండియా వంటి అనేక కంపెనీలలో పని చేశారు, అక్కడ ఆయన ముఖ్య ఆర్థిక వ్యవహారాల బాధ్యతలకు అదనంగా రెగ్యులేటరీ రిపోర్టింగ్, మదుపరి సంబంధాలు మరియు పరిశ్రమ సంఘాలు మరియు వేదికలతో సంబంధ బాంధవ్యాలను నిర్వహించారు.

ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద, కేదార్ గారు, సంస్థ యొక్క ఎండ్-టు-ఎండ్ ఫైనాన్స్, ప్లానింగ్ & బడ్జెటింగ్, ట్యాక్సేషన్ మరియు పెట్టుబడి వ్యవహారాలకు బాధ్యులుగా ఉంటున్నారు.

అతను పుణే విశ్వవిద్యాలయము నుండి కామర్స్ పట్టబద్రుడు మరియు భారత ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ఐ.సి.ఎ.ఐ) నుండి అర్హత పొందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నారు.

సోనియా నోటానీ - ముఖ్య మార్కెటింగ్ అధికారి

సోనియా నోటానీ

ముఖ్య మార్కెటింగ్ అధికారి

ఇండియాఫస్ట్ లైఫ్ యందు ముఖ్య మార్కెటింగ్ అధికారిగా ఉన్న సోనియా నోటానీ గారు బి.ఎఫ్.ఎస్.ఐ రంగములో విస్తృత శ్రేణి ప్రావీణ్యముతో దానియొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఇండియాఫస్ట్ లైఫ్ యందు దశాబ్ద కాలపు సుదీర్ఘ సహవాసములో, ఆమె అన్ని కార్యవిధులు మరియు రంగాల వ్యాప్తంగా బహుముఖ విధులను నిర్వర్తించారు. ప్రస్తుతం, ఆమె కంపెనీ యొక్క మార్కెటింగ్, ఉత్పాదనలు, కస్టమర్ అనుభవము, ప్రజాసంబంధాలు, వ్యూహాత్మక కూటములు, ప్రత్యక్ష మరియు డిజిటల్ సేల్స్ విధులకు చుక్కానిగా ఉన్నారు.

ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరకముందు ఆమె ఉద్యోగజీవితం ఆదిత్య బిర్లా గ్రూపుతో ప్రారంభమైంది, దాని తర్వాత సోనియా సిటీబ్యాంక్, రిలయన్స్ మరియు కెపిఎంజి వంటి బహుళజాతి కంపెనీలలో పని చేస్తూ వెళ్ళారు. ఛీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆమె యొక్క మునుపటి విధుల్లో, ఆమె ఉత్పాదనలు, వ్యూహము, గణాంక విశ్లేషణ , వ్యూహాత్మక కూటములు మరియు ప్రజా సంబంధాల విభాగాలను చేపట్టారు.

ఇటీవలనే, సోనియా నోటానీ గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫార్చూన్ మేగజైన్ యొక్క “40 క్రింద 40” 2019 జాబితాలో చోటు సంపాదించుకున్నారు, అది బిజినెస్ లోని అత్యంత ప్రభావిత యువతను తెలియజేస్తుంది. అపెక్స్ ట్రేడ్ బాడీ, అసోచామ్ కూడా భారతీయ జీవిత బీమా రంగానికి ఆమె చేసిన విశేష దోహదాలను గుర్తించి “బీమాలో మహిళా నాయకురాలు – సిఎస్ఓ” అవార్డును ప్రదానం చేసింది.యోచనాపరురాలైన ఒక నాయకురాలిగా, సోనియా గారు ముప్పు నుండి ఒక ముఖ్యమైన రక్షణ సాధనంగా జీవిత బీమా పట్ల అవగాహన కల్పిస్తూ చర్చల-ఆధారిత వాతావరణ వ్యవస్థలో భాగంగా ప్యానల్ చర్చలు మరియు రచనా వ్యాసంగాలలో ఉత్సాహపూరితంగా పాల్గొనడం ద్వారా “నిర్మొహమాటమైన పదార్థము” దర్పముతో ముందుకు కొనసాగుతున్నారు.

ముంబై సెయింట్ జేవియర్ కాలేజ్ మరియు నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ యొక్క పూర్వ విద్యార్థిని అయిన సోనియా, ఎకనామిక్స్ పట్టభద్రురాలు మరియు ఎంబిఏ డిగ్రీ కూడా పూర్తి చేశారు.

పియూలీ దాస్ - ఛీఫ్ మరియు నియమించబడిన గణికులు

పియూలీ దాస్

ఛీఫ్ మరియు నియమించబడిన గణికులు

పియూలీ గారు ఇండియాఫస్ట్ లైఫ్ యందు నియమించబడిన గణికులుగా ఉన్నారు. గణిక విధులు, ఆర్థికపరమైన ముప్పు విశ్లేషణ మరియు రిపోర్టింగ్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, కాంప్లెయెన్స్ ఆవశ్యకతలు మరియు ఆర్థిక ప్రక్రియలు మరియు విధులలో ఆమె యొక్క లోతైన అవగాహన ఆమె ఇండియా మరియు విదేశాల్లో బ్యాంకింగ్ మరియు బీమా రంగాలలో ఇన్వెస్ట్‌మెంట్ మరియు గణిక విధుల్లో పని చేస్తూ తనవెంట తెచ్చుకున్న ప్రావీణ్యతను ప్రదర్శిస్తోంది.

ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరక ముందు, ఆమె రిలయన్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యందు నియమించబడిన గణికులుగా పని చేశారు. ఆమె ఎక్సైడ్ లైఫ్ యందు మదింపు, గణికసంబంధిత మరియు ఇన్వెస్ట్‌మెంట్ యూనిట్లకు మార్గదర్శకత్వం వహించారు, మరియు యు.ఎస్.ఎ లో తన విధుల్లో భాగంగా డ్యూట్షే బ్యాంక్ అదేవిధంగా న్యూయార్క్ లైఫ్ ఇంటర్నేషనల్ లోనూ పనిచేశారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్, ఇండియా నుండి పలు గౌరవాల స్వీకర్త అయిన పియూలీ గారు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్, ఇండియా యొక్క ఫెలోగా కూడా ఉన్నారు మరియు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుండి క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లో ఒక మాస్టర్స్ డిగ్రీ కూడా పొందియున్నారు.

ప్రవీణ్ మీనన్ - ముఖ్య ప్రజా అధికారి

ప్రవీణ్ మీనన్

ముఖ్య ప్రజా అధికారి

ఇండియాఫస్ట్ లైఫ్ ముఖ్య ప్రజా అధికారిగా ప్రవీణ్ మీనన్, టాలెంట్ మేనేజ్‌మెంట్, సక్సెషన్ ప్లానింగ్, మార్పు మరియు పనితీరు యాజమాన్యము, శిక్షణ మరియు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మరియు ప్రొక్యూర్‌మెంట్ బాధ్యులుగా ఉంటున్నారు.

అతడు ఈ సంస్థలో చేరిన 2015 నాటి నుండీ, ప్రవీణ్ యొక్క వ్యూహాత్మక దోహదాలు మునుపెన్నడూ జరగని ప్రజా అభ్యాసాలను కలగలుపుకుంటూ కేంద్రీకృతమై కొనసాగుతూనే ఉన్నాయి. దీని ద్వారా, నైపుణ్యాలను పెంచుకోవడం మరియు సమగ్రాభివృద్ధి స్వీకారము కొరకు ఒక సాధికార మరియు పనితీరు-ద్వారా నడుపబడే వాతావరణమును కల్పించాలనేది అతని ప్రయత్నము.

ప్రవీణ్ గారు గతంలో ఆక్సిస్ బ్యాంక్, ఎసి నీల్సన్, ఐడిబిఐ ఫెడరల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, సిటి బ్యాంక్ మరియు హెచ్.ఎస్.బి.సి వంటి సంస్థలలో పని చేశారు. ఈ సంస్థలలో, వ్యాపార లక్ష్యాలను ప్రశంసిస్తూ వ్యతిరేక అత్యుత్తమ ఆచరణల ద్వారా ఉద్యోగి యొక్క పరిణామక్రమ ప్రయాణానికి ఇంధనం వేసిన గౌరవం అతనికి దక్కింది.

ఒక యోచనాకర్తగా, ప్రవీణ్, భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ వేదికలలో మరియు విద్యావేత్తల మధ్య ప్రజా యాజమాన్యంపై చురుగ్గా తన దృష్టికోణాలను వెల్లడించడం కొనసాగిస్తున్నారు మరియు ఆశాదాయకమైన కోరికల ఉద్భవానికి అలవాటు పడుతున్నారు.

వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ మరియు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యొక్క పూర్వ విద్యార్థి అయిన ప్రవీణ్ గారు, బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ, ఆర్థికవ్యవహారాలలో ఎంబిఏ, మరియు అధునాతన మానవ వనరులలో ఒక డిగ్రీ పొందారు.

సునందా రాయ్ - కంట్రీ హెడ్ - బ్యాంక్ ఆఫ్ బరోడా

సునందా రాయ్

కంట్రీ హెడ్ - బ్యాంక్ ఆఫ్ బరోడా

సునందా రాయ్ ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క బ్యాంకష్యూరెన్స్ సేల్స్ కు ఆధిపత్యం వహిస్తున్నారు, తద్వారా ఒక ధృఢమైన మరియు మంచి అనుకూలీకృతమైన బ్యాంకష్యూరెన్స్ మార్గాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ హోదాలో, అతడు ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క భాగస్వామి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఆంధ్రా బ్యాంక్) శాఖల గుండా భారతదేశ వ్యాప్తంగా బీమా పంపిణీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారు.

విస్తృతమైన వ్యూహాత్మక మరియు పని వ్యవహార చతురతతో ఒక యాజమాన్య నిపుణులైన సునందా గారు, మోదీ టెల్‌స్ట్రా-ఎయిర్‌టెల్, మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్, హెచ్.ఎస్.బి.సి బ్యాంక్ మరియు కెనరా హెచ్.ఎస్.బి.సి ఓబిసి లైఫ్ లలో తన మునుపటి విధుల సందర్భంగా తదేక దృష్టి సారింపు అమలుతో దార్శనికతను ప్రదర్శించారు. అతడు అంకుర దశ నుండి మొదలై రాబడి, లాభదాయకత, మరియు మార్కెట్ వాటాలో ఒక గణనీయమైన ఎదుగుదలకు చేరుకున్న సంస్థలకు నాయకత్వం వహించారు.

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క కృషితో అత్యుత్తమ శ్రేణి అందజేతలు మరియు డిజిటలైజ్డ్ సేవా అనుభవమును కలగలుపుకుంటూ సునందా గారు విక్రయాలు మరియు పంపిణీ, వ్యాపార అభివృద్ధి, రాబడి ఎదుగుదల, మరియు ఛానల్ సంబంధాలకు నాయకత్వం వహిస్తున్నారు.

సునందా గారు తాను బ్యాచెలర్ డిగ్రీ పొందిన కలకత్తా విశ్వవిద్యాలయము యొక్క పూర్వవిద్యార్థిగా ఉంటూనే జనరల్ మేనేజ్‌మెంట్ లో అతని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను సింగపూర్ యొక్క ఎమిరిటస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి పూర్తి చేసుకున్నారు. అతను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, సింగపూర్ నుండి ఒక ఛార్టర్డ్ వెల్త్ మేనేజర్ సర్టిఫికెట్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదు నుండి జనరల్ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్ పొందియున్నారు.

అంజనా రావు - ఛీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్

అంజనా రావు

ఛీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్

ఇండియాఫస్ట్ లైఫ్ యందు అంజనా రావు, ఛీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అధిపతిగా ఉంటూ, వ్యూహాత్మక చొరవలకు మార్గదర్శనం చేస్తున్నారు మరియు కంపెనీ లోపున ఒక శ్రేష్టతా కేంద్రమును నడిపే పని అప్పగించబడ్డారు. మొదట్లో, సంస్థ లోపున ఆమె మార్పు యాజమాన్య విభాగానికి పెద్దగా వ్యవహరించారు, కంపెనీ తన విలువ గొలుసు యొక్క డిజిటలైజేషన్ చుట్టూ తనయొక్క ఉద్దేశ్యాలను నెరవేర్చుకొనేలా దానిని ముందుకు నడిపారు, ఎండ్-టు-ఎండ్ సేల్స్ ప్రక్రియ మరియు ఆటోమేషన్ యొక్క పూర్ణ పరివర్తన మరియు కొత్త వ్యాపారాల రూపకల్పన మరియు అండర్‌రైటింగ్ ప్రక్రియలు ఆమె చేసిన దోహదాలలో ఉన్నాయి.

రెండు దశాబ్దాలకు దగ్గరగా సాగిన ఆమె యొక్క ఉద్యోగ నిర్వహణలో, అంజనా గారు తన కార్పొరేట్ జీవితములో అధిక భాగాన్ని భారతీయ బీమా (జీవిత మరియు సాధారణ) రంగములో పనిచేస్తూ గడిపారు. ఆమె విస్తృతంగా ప్రావీణ్యత పొందిన రంగాలలో ప్రాజెక్టు యాజమాన్యము, మార్పు యాజమాన్యము, మరియు ఐటి మరియు ప్రక్రియపై పరపతి కేంద్రీకృతంగా వ్యాపార రూపాంతరము ఉన్నాయి.

ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరకముందు, అంజనా గారు ఎర్నెస్ట్ అండ్ యంగ్, ఒరాకిల్ ఇండియా, యూనివర్సల్ సోంపో, ఎస్.బి.ఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ మరియు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో పని చేశారు, అక్కడ ఆమె సి.ఎం.ఎం.ఐ అమలు పథకాలను ముందుకు నడపడంతో పాటుగా ఐటి రూపాంతర పథకాలకు ఆతిథ్య నాయకత్వం వహించారు.

అంజనా గారు రాయపూర్ విశ్వవిద్యాలయము నుండి గణిత ప్రాథమ్యంగా విజ్ఞాన శాస్త్రములో పట్టభద్రులుగా పట్టా పొందారు.ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు (పిఎంపి) అయిన ఈమె, పండిట్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ, రాయపూర్ నుండి మార్కెటింగ్ మరియు హెచ్.ఆర్ లో తన ఎంబిఎ పూర్తి చేసుకొని, సంస్థ యొక్క పూర్వ విద్యార్థినిగా కూడా ఉంటున్నారు.

శుభంకర్ సేన్ గుప్తా - కంట్రీ హెడ్ - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏజెన్సీ మరియు బిజినెస్ భాగస్వామ్యాలు

శుభంకర్ సేన్ గుప్తా

కంట్రీ హెడ్ - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏజెన్సీ మరియు బిజినెస్ భాగస్వామ్యాలు

శుభంకర్ సేన్ గుప్తా, ప్రత్యామ్నాయ మార్గాల కంట్రీ హెడ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, బ్రోకింగ్ మరియు కార్పొరేట్ ఏజెన్సీ, ఏజెన్సీతో అనుబంధితం అయిన గ్రామీణ మరియు సూక్ష్మ మార్గాలు మరియు ప్రత్యక్ష విక్రయ మార్గాలతో కూడిన ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క భాగస్వామ్య వ్యాపారాలను అజమాయిషీ చేస్తుంటారు. అలా అతని బాధ్యతలు, కంపెనీ యొక్క మాతృ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఆంధ్రా బ్యాంక్ లను అధిగమించి బీమా పెనవేత మార్గాలు కేంద్రంగా చేసుకొని పరిభ్రమిస్తుంటాయి.

23 సంవత్సరాలుగా సాగిన వృత్తి నైపుణ్యతా ప్రయాణములో తల పండిన ఈ కార్యనిర్వాహకుడు, తన 12 సంవత్సరాల సుదీర్ఘ సేవలను భారతీయ జీవిత బీమా రంగానికి అంకితం చేసియున్నారు. శుభాంకర్ గారి అనుభవము మరియు బహుముఖ వ్యాపారాల వ్యాప్తంగా సందర్భోచిత ప్రావీణ్యము, క్యాడ్‌బరీస్, హెచ్.ఎస్.బి.సి, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ మరియు టాటా ఎఐఎ సంస్థలతో అతని సహవాసము నుండి వచ్చింది.

పంపిణీ యొక్క కొత్త వ్యాపార మార్గాలు మరియు సోర్సింగ్ అనుబంధకులు మరియు భాగస్వాములకు నాయకత్వం వహిస్తూ, శుభాంకర్ గారు వైవిధ్యమైన నైసర్గిక ప్రదేశాల వ్యాప్తంగా సముచితమైన మార్గాల యొక్క మదింపు మరియు ఎంపికలో ప్రావీణ్యతను పొందియున్నారు. అతను మూడో పక్షపు పంపిణీ, అంతర్గత జట్లు, బ్రోకింగ్, కార్పొరేట్ ఏజెన్సీలు, ప్రత్యక్ష విక్రయ బృందాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు ఏజెన్సీతో సహా బహుళ మార్గాల వ్యాప్తంగా ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క అడుగుజాడను పెంపొందింపజేసే పని అప్పగించబడ్డారు. జీవిత బీమాను ఆఖరి మైలు వరకూ తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని నెరవేర్చే దిశగా, అతను అనుకూలీకృత పంపిణీ ఐచ్ఛికాలను సక్రియపరచడంలో గ్రామీణ విపణులలో అవగాహనను తీసుకువస్తున్నారు.

శుభాంకర్ గారు కలకత్తా విశ్వవిద్యాలయము నుండి కామర్స్ లో తన బ్యాచెలర్స్ డిగ్రీని పూర్తి చేసుకున్న మీదట పశ్చిమ బెంగాల్ యందలి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ వెల్ఫేర్ & బిజినెస్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు.