శ్రీ నరేంద్ర ఓస్తవాల్ - డైరెక్టర్

శ్రీ నరేంద్ర ఓస్తవాల్

డైరెక్టర్

శ్రీ ఓస్తవాల్ గారు 2007 లో వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరారు మరియు అప్పటి నుండీ అతను సంస్థ యొక్క భారతీయ అనుబంధకర్తగా పని చేస్తున్నారు. అతను ఇండియాలో సంస్థ యొక్క పెట్టుబడి సలహాదారు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు మరియు ఇండియాలో ఆర్థిక సేవలు మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలోని అవకాశాలను మదింపు చేస్తున్నారు.

వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరక ముందు శ్రీ. ఓస్తవాల్ గారు 3i ఇండియా మరియు మికిన్‌సే & కంపెనీకి ఒక అసోసియేట్ గా ఉన్నారు.

అతను లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎ యు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, డి బి పవర్ & గ్రూప్ కంపెనీలు, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఒక డైరెక్టరుగా ఉన్నారు.

శ్రీ ఓస్తవాల్ గారు భారత చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ నుండి చార్టర్డ్ అకౌంటెన్సీ పట్టా మరియు బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎం.బి.ఏ పట్టా పొందియున్నారు.

Mr. NARENDRA OSTAWAL - Non-Executive Director

Mr. NARENDRA OSTAWAL

Non-Executive Director

Mr. Ostawal joined Warburg Pincus in 2007 and since then has been working with the firm's Indian affiliate. He is involved with the firm's Investment Advisory activities in India and evaluates opportunities in the Financial Services and Healthcare sectors in India. Prior to joining Warburg Pincus, Mr. Ostawal was an Associate with 3i India and McKinsey & Company. 

He is a Director of Laurus Labs Ltd., AU Small Finance Bank Ltd., DB Power & Group Companies, Computer Age Management Services Pvt. Ltd., Sterling Software Pvt. Ltd. and Fusion Microfinance Pvt. Ltd. Mr. Ostawal holds a Chartered Accountancy degree from The Institute of Chartered Accountants of India and an MBA. from IIM, Bangalore.

శ్రీ. అరుణ్ ఛోగ్లే - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. అరుణ్ ఛోగ్లే

ఇండిపెండెంట్ డైరెక్టర్

బలమైన కస్టమర్ మరియు మార్కెటింగ్ అవగాహన కలిగియుండి ఒక ప్రముఖ ఎఫ్.ఎం.సి.జి వృత్తినిపుణుడైన శ్రీ ఛోగ్లే గారు, ఎస్.ఎం.ఇ లు, భారీ భారతీయ కంపెనీలు మరియు బహుళ జాతి కంపెనీల వ్యాప్తంగా క్లయింట్లను కలిగియుంటూ వినియోగదారు మరియు రిటెయిల్ రంగములో తన స్వంత బ్రాండ్ అడ్వైజరీ మరియు వ్యూహాత్మక సంప్రదింపు అభ్యాసము నడుపుతున్నారు.

తన సలహా సంప్రదింపు అభ్యాసానికి ముందు, అతడు అంతర్జాతీయంగా మరియు ఇండియాలో 30 సంవత్సరాల పాటుగా వైవిధ్యమైన మరియు విజయవంతమైన మార్కెటింగ్ కెరీర్ కలిగియున్నారు. జంట గ్రూపులైన ప్రోక్టర్ అండ్ గ్యాంబల్ మరియు బ్రిటిష్ అమెరికన్ లలోని రెండు మంచి కంపెనీలలో అతడు సాధారణ యాజమాన్యము మరియు వినియోగదారు మార్కెటింగ్ లో సీనియర్ నాయకత్వ హోదాలలో పని చేశారు.

అతడు ప్రస్తుతము, నీల్సన్ మరియు ఇతర సంస్థలు వంటి క్లయింట్లతో రిటెయిల్ మరియు వినియోగదారు ఉత్పత్తుల పరిశ్రమలో ప్రావీణ్యతా అంశముతో సలహాదారు మరియు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ గా ఉన్నారు.

శ్రీ కె.ఎస్. గోపాలక్రిష్ణన్ - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ కె.ఎస్. గోపాలక్రిష్ణన్

ఇండిపెండెంట్ డైరెక్టర్

ఒక క్రియాశీలకమైన 35 సంవత్సరాల తన కెరీర్ లో శ్రీ కె.ఎస్. గోపాలక్రిష్ణన్ గారు జీవిత బీమా మరియు రీఇన్స్యూరెన్స్ లో సి.ఇ.ఓ /సి.ఎఫ్.ఓ/ యాక్చువరీ గా నాయకత్వ పాత్రలను పోషించారు.రు.

తన కెరీర్ ప్రారంభములో భారతీయ జీవితబీమా సంస్థలో యాక్చువేరియల్ అప్రెంటిస్ గా మొదలుపెట్టి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారతి ఎఎక్స్ఎ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మరియు ఏజియన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వంటి బీమా కంపెనీలలో నాయకత్వ స్థానాలకు ఎదిగిన శ్రీ గోపాలక్రిష్ణన్ గారి కెరీర్ మార్గపథం ఆర్థిక, యాక్చ్వేరియల్, ప్రైసింగ్, ప్రోడక్ట్ రూపకల్పన, నియంత్రణా నిబంధనలు, అండర్ రైటింగ్, క్లెయిములు, అదే విధంగా పరిపాలన, మరియు బోర్డు మరియు వాటాదారుల సమస్యల రంగాలలో అతని ధృఢమైన గట్టి పట్టుదలను ప్రదర్శించింది. ఆర్.జి.ఎ రీఇన్స్యూరెన్స్ కంపెనీ యందు ఇండియా బిజినెస్ కొరకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా విజయవంతమైన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, శ్రీ గోపాలక్రిష్ణన్ గారు విస్తృతమైన బీమారంగ వ్యవస్థలో ఒక కన్సల్టెంటు మరియు సలహాదారుగా కొనసాగుతున్నారు. అతను బీమా రంగ ప్రముఖమైన యూనిట్ అనుసంధానిత ఉత్పత్తులు, ఆన్‌లైన్ అవధి బీమా ఉత్పత్తులు మరియు వివిధ కస్టమర్ ఆధారిత చొరవలలో ఒక ప్రధాన దోహదకారిగా ఉంటున్నారు.

శ్రీ గోపాలక్రిష్ణన్ గారు చెన్నై లోని వివేకానంద కాలేజ్ నుండి గణిత శాస్త్రములో పట్టభద్రులుగా పట్టా పుచ్చుకున్నారు మరియు ఇండియా, యుకె మరియు కెనడా యొక్క యాక్చువేరియల్ సంఘాలలో యాక్చువరీగా ఉంటున్నారు. అతను డ్యూక్ విశ్వవిద్యాలయము, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయము, ఎం.ఐ.టి మరియు ఇన్‌సీడ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నుండి వ్యూహము మరియు డిజిటల్ టెక్నాలజీలో కోర్సులను పూర్తి చేసుకున్నారు. అతను భారతీయ బీమా రంగము మరియు ఐ.ఆర్.డి.ఎ.ఐ లోని వివిధ కమిటీలలో సభ్యులుగా ఉంటున్నారు. అతను ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ యొక్క ఎన్నిక కాబడిన సభ్యులుగా ఉన్నారు.

శ్రీ హేమంత్ కౌల్ - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ హేమంత్ కౌల్

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ హేమంత్ కౌల్ గారు రాజస్థాన్ యూనివర్సిటీ నుండి ఎంబిఎ పట్టా పొందారు. అతను 1977 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ మరియు జైపూర్ యందు ప్రొబేషనరీ అధికారిగా తన కెరీర్ ని ప్రారంభించారు. అతను యుటిఐ/యాక్సిస్ బ్యాంక్ యందు అంకుర బృందంలో భాగంగా ఉంటూ, అక్కడ అతను రిటెయిల్ బ్యాంకింగ్ విభాగాన్ని నెలకొల్పి దానికి నాయకత్వం వహించారు. హేమంత్ గారు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్ యొక్క ఎం.డి మరియు సిఇఓ గా కూడా పని చేశారు. హేమంత్ ఫిన్‌టెక్ రంగం గురించి పట్టుదల కలిగిన వ్యక్తి, అందులో అతను ఒక మెంటార్ మరియు ఏంజెల్ పెట్టుబడిదారుగా నిమగ్నమయ్యారు.

హేమంత్ గారికి ప్రయాణాలు చేయడం మరియు పుస్తకపఠనం ఎంతో ఇష్టం. అతను మరియు అతని భార్య అన్ను జైపూర్ లో ఉంటున్నారు.

శ్రీమతి హరితా గుప్తా - ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీమతి హరితా గుప్తా

ఇండిపెండెంట్ డైరెక్టర్

హరిత గారు ఐఐటి-ఢిల్లీ నుండి ఒక మాస్టర్స్ డిగ్రీని పొందారు మరియు తన భర్తతో కలిసి గుర్‌గాంవ్, ఇండియాలో నివశిస్తున్నారు. హరిత గారు 2017 లో ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ యొక్క గ్లోబల్ హెడ్ గా సుదర్‌ల్యాండ్ లో చేరారు. ఆమె డిజిటల్ మరియు సేవల రంగములో 3 దశాబ్దాల విస్తృతమైన ప్రపంచ అనుభవాన్ని గడించారు. తన ప్రస్తుత విధులు మరియు బాధ్యతల్లో - కస్టమర్ల కొరకు సుదర్‌ల్యాండ్ ను ఒక నిజమైన డిజిటల్ పరివర్తన నవ్యతగా నెలకొల్పడం ఎపిఎసి పట్ల ఆమె యొక్క దృష్టి సారింపుగా ఉంది.

సుదర్‌ల్యాండ్ కు మునుపు, ఆమె మైక్రోసాఫ్ట్ ఇండియా కొరకు పని చేశారు. అక్కడ ఆమె ఇండియా మరియు గ్రేటర్ చైనా దేశాల వ్యాప్తంగా ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కొరకు కస్టమర్ సర్వీస్ మరియు మద్దతు సంస్థల ఎదుగుదలకు నాయకత్వం వహించారు. ఆమె ఎన్.ఐ.ఐ.టి లో తన వృత్తి జీవితం ప్రారంభించారు మరియు వివిధ విభాగాలు మరియు శ్రేష్టత యొక్క టెక్నాలజీ కేంద్రాలను నిర్వహించారు. మహమ్మారి తదనంతరం ఆమె కొత్త బిజినెస్ మరియు పని నమూనాలను అన్వేషించడానికై తన బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు.

హరిత గారు ఐఐటి-ఢిల్లీ నుండి ఒక మాస్టర్స్ డిగ్రీ పొందారు మరియు తన భర్తతో కలిసి గుర్‌గాంవ్, ఇండియాలో నివశిస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల చాలా పట్టుదల కలిగియున్న హరిత గారు తన ప్రస్తుత పాత్రలో సృజనాత్మక పథకాలను ముందుకు నడిపిస్తున్నారు మరియు 2 స్వచ్ఛంద సంస్థలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు.

శ్రీమతి. ఆర్.ఎం. విశాఖా - ఎం.డి & సిఇఓ

శ్రీమతి. ఆర్.ఎం. విశాఖా

ఎం.డి & సిఇఓ

ఆర్.ఎం. విశాఖా గారు 2015 మార్చి నుండి మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఇండియాఫస్ట్ లైఫ్ కు సారధ్యం వహిస్తున్నారు. ఆమె ధృఢమైన నాయకత్వం క్రింద, కంపెనీ గణనీయమైన ఎదుగుదల రేటును నమోదు చేసుకొంటూ బీమారంగము ర్యాంకింగులలో నిలకడగా వృద్ధి చెందుతూ ఉంది. అగ్రభాగాన నాయకత్వం వహిస్తూ, విశాఖా గారు వార్‌బర్గ్ పి‌న్‌కస్ కు మునుపటి భాగస్వామి, లీగల్ మరియు జనరల్ నుండి వాటాభాగస్వామ్య పరివర్తనకు నిరాటంకంగా దారి చూపారు.

విశాఖా గారు, వ్యాపారవ్యవహారాలలో వరుసగా మూడు సార్లు (2017, 2018 మరియు 2019) ఫార్చ్యూన్ ఇండియా యొక్క మొదటి 50 మంది ‘అత్యంత శక్తివంతమైన మహిళ’ లలో స్థానం సంపాదించుకున్నారు. ఆమె, బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ చే ‘అత్యంత ప్రభావశీలి మహిళ’ గా కూడా గుర్తింపు పొందారు. ఆమె సాధనలను గుర్తిస్తూ, ఐ.సి.ఎ.ఐ, విశాఖా గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన సి.ఎ బిజినెస్ లీడర్ – మహిళ (2017) అవార్డును ప్రదానం చేసింది. విశాఖా గారు పరిశ్రమల వ్యాప్తంగా సమకాలీన వ్యక్తుల పైకీ ప్రయోగాత్మక ప్రముఖురాలిగా ప్రతిష్టాత్మక ప్రచురణలైన ఫోర్బ్స్ ఇండియా మరియు బిజినెస్ టుడే వారిచే జాబితా చేయబడ్డారు.

యోచనాకర్త అయిన విశాఖా గారు సి.ఐ.ఐ యొక్క పింఛను మరియు బీమా కమిటీకి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె జాతీయ బీమా మండలి (అస్సోచామ్) యొక్క అత్యంత గౌరవప్రదమైన సభ్యులుగా, ఎఫ్.ఐ.సి.సి.ఐ యొక్క కమిటీ సభ్యులుగా మరియు ఎ.ఐ.డబ్ల్యు.ఎం.ఐ చే ఎక్స్-క్వాలిఫై యొక్క చార్టర్ సభ్యులుగా కూడా ఉన్నారు. ఆమె ఎన్.ఆర్.బి బేరింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా ఉన్నారు. ఆమె జీవిత బీమా మండలి యొక్క కార్యనిర్వాహక కమిటీలో కూడా సభ్యులుగా ఉంటున్నారు.

విశాఖాగారు రాబోతున్న తరం యోచనాకర్తలు మరియు నాయకులకు మార్గదర్శిగా మరియు హితబోధకులుగా తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఆమె యొక్క ప్రతిష్టాత్మక సలహాదారు హోదా సంస్థలలో, ఇంటర్నేషనల్ ఇన్స్యూరెన్స్ సొసైటీ (IIS ) మెంటర్ ప్రోగ్రామ్, WWB లీడర్‌షిప్ అండ్ డైవర్సిటీ ఫర్ ఇన్నొవేషన్ ప్రోగ్రామ్, ఆర్.జి.ఎ లీడర్స్ ఫర్ టుమారో మరియు WILL Forum ఉన్నాయి.

కంప్యూటర్ సిస్టమ్స్ లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో సమృద్ధి పొందిన ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన విశాఖా గారు భారత బీమా సంస్థ యొక్క ఒక ఫెలో గా ఉన్నారు.