overview

మేనేజ్మెంట్ టీమ్

ఆర్.ఎం. విశాఖ

మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ

స్టార్ట్ అప్స్, పునర్నిర్మాణం మరియు గుర్తింపుతో సహా సవాళ్ళతో కూడిన ఎసైన్మెంటులను సమీపించేందుకు ఫలితాలతో కూడిన నాయకత్వం కలిగివున్నట్లుగా ఆర్ఎం విశాఖ గుర్తింపు పొందారు. గతంలో ఈమె ఇండియాఫస్ట్ లైఫ్ లో చీఫ్ బిజినెస్ ఆఫీసరుగా పనిచేశారు. బ్యాంకుఅష్యూరెన్స్ పై ప్రత్యేక ద్రుష్టితో రెండు దశాబ్దాలకు పైగా వైవిధ్యమైన కెరీర్ విశాఖకు ఉంది. ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరడానికి ముందు, ఈమె కెనరా హెచ్ ఎస్ బి సి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టరుగా పనిచేసారు.

ఫంక్షనల్ మరియు కంపెనీ లక్ష్యాలు క్రిటికల్ బ్యాలెన్స్ నిర్వహించడం మరియు నిర్మాణాత్మకంగా ఉద్యోగి, మేనేజర్, డిస్ట్రిబ్యూటర్ మరియు వాటాదారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి విశాఖ నిరంతరం క్రుషిచేస్తున్నారు. ప్రభావవంతంగా అమలుచేయడం ద్వారా వ్యూహాత్మక వ్రుద్ధిని నడిపించగల ఆమె సమర్థత వల్ల ఆమె అనేక ఘన విజయాలు సాధించారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో మరియు విదేశీ బ్యాంకుల్లో బ్యాంక్అష్యూరెన్స్ మోడల్స్ ని ఆమె విజయవంతంగా అభివ్రుద్ధి చేశారు మరియు మొట్టమొదటి బ్యాంక్అష్యూరెన్స్ మోడల్ ని తీసుకొచ్చారు. గ్రూప్ ఇన్సూరెన్స్ బిజినెస్ని నిర్మించడం మరియు అభివ్రుద్ధి చేయడం కూడా ఆమె యొక్క విస్త్రుత శ్రేణి అనుభవాల్లో ఉన్నాయి.

ఇండియన్ ఇన్సూరెన్స్ రంగంలో ఆర్ ఎం విశాఖకు గల మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో సాధించిన విజయాలను గుర్తిస్తూ, అసోచామ్ (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) ఆమెను వ్యక్తిగత సాధన అవార్డుతో సత్కరించింది. ఈమె సిఎ బిజినెస్ అవార్డు కూడా గెలుచుకున్నారు. భారతదేశంలోని ప్రఖ్యాత చట్టబద్ధ సంస్థ అయిన ఐసిఎఐ (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా) నుంచి మహిళా అవార్డు ఇది. ఇటీవల జరిగిన 15వ ఆసియా బిజినెస్ లీడర్స్ అవార్డు 2016 మరియు ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డు 2017 12వ ఎడిషన్ కి ఫైనలిస్టుల్లో ఈమె ఒకరు. ఆసియా మరియు ఇండియా లోని చెప్పుకోదగిన వ్యాపార లీడర్లలో ఈమె ఒకరిగా గుర్తింపు పొందారు. ఇటీవల, వ్యాపారంలో విశాఖ 38వ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ గుర్తింపును ప్రఖ్యాత ఫార్చ్యూన్ మేగజైన్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు-పవర్ ట్రెయిల్ బజార్ జాబితా 2018లో స్థానం సంపాదించారు. విభిన్న రంగాల్లో ఘన విజయాలు సాధించిన మహిళా పారిశ్రామికవేత్తలను మరియు బిజినెస్ ప్రొఫెషనల్స్ ని ఇది గౌరవిస్తుంది.

విశాక కామర్స్ గ్రాడ్యుయేట్ మరియు చార్టర్డ్ అకౌంటెంట్. ఈమె ఇన్సూరెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫెలోగా ఉన్నారు మరియు కంప్యూటర్ సిస్టమ్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగివున్నారు.

ఈమెయిల్: :ceo@indiafirstlife.com

రుషభ్ గాంధీ

సేల్స్ అండ్ మార్కెటింగ్

ఆర్థిక సేవల పరిశ్రమలో రుషభ్ కి రెండు దశాబ్దాల అనుభవం ఉండగా, 16 సంవత్సరాలు జీవిత బీమాలోనే ఉంది. బీమా పరిశ్రమ మరియు మార్కెట్ గతుల పట్ల అపారమైన అవగాహన కారణంగా, ఆయా సంస్థల్లో అత్యధిక పనితీరుతో కూడిన ఫలితాలు అందించారు. సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ మరియు పంపిణీ వ్యూహంలో ఉన్న సామర్థ్యం కారణంగా, వివిధ పాత్రల్లో విజయవంతంగా సేల్స్ మోడల్సుని నెలకొల్పే మరియు నడిపే బాధ్యతలు తీసుకున్నారు.

సేల్స్ మరియు వ్యూహం అంటే రుషభ్ కి మక్కువ ఎక్కువ. ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరడానికి ముందు, కెనరా హెచ్ ఎస్ బి సి లైఫ్ ఇన్సూరెన్స్ లో రుషభ్ సేల్స్ డైరెక్టరుగా పనిచేసారు. గతంలో అతను అవీవా లైఫ్ ఇన్సూరెన్స్, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా పనిచేసారు. అవీవాలో ఉండగా, ఇండినేసియాలో ఆ కంపెనీ యొక్క జీవిత బీమా ఫ్రాంచైసీని నెకొల్పడంలో కీలక పాత్ర పోషించారు.

రుషభ్ ప్రస్తుతం ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్సులో సేల్స్ అండ్ మార్కెటింగు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతను 10,000+ బ్యాంకు బ్రాంచిలను మరయు 1000కి పైగా ఉద్యోగుల బ్రుందానికి నాయకత్వం వహిస్తున్నారు.

రుషభ్ నర్సీమోంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ ఎం ఐ ఎం ఎస్) నుంచి మేనేజ్మెంటు స్టడీస్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసారు. ఫ్రాన్స్ లోని ఐ ఎన్ ఎస్ ఇ ఎ డిలో గ్రూప్ డెవలప్మెంట్ ప్రోగ్రాముకు కూడా హాజరయ్యారు.

ఎ.కె. శ్రీధర్

డైరెక్టర్ మరియు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్

విశాక కామర్స్ గ్రాడ్యుయేట్ మరియు చార్టర్డ్ అకౌంటెంట్. ఈమె ఇన్సూరెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫెలోగా ఉన్నారు మరియు కంప్యూటర్ సిస్టమ్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగివున్నారు. శ్రీధర్ అత్యంత అనుభవజ్ఞుడైన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్. మార్కెట్ పట్ల లోతు పరిజ్ఞానం మరియు మారుతున్న వ్యాపార గతులను ఊహించగల సమర్థతతో పెట్టుబడిపెట్టడంలో విశ్లేషణాత్మక వైఖరి అవలంబిస్తారు. కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ స్ట్రాటజీ మరియు రీస్ట్రక్చరింగ్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల్లో అతనికి 30 సంవత్సరాల అనుభవం ఉంది. మేక్రోఎకనామిక్ ఇండికేటర్లను మరియు ఆస్తి కేటాయింపు మార్పులను శ్రీధర్ చురుకుగా కనిపెట్టివుంటారు మరియు ఫైనాన్షియల్ మార్కెట్లలోపై భారతదేశంలోని మరియు ఆగ్నేయాసియాలోని వివిధ ప్రొఫెషనల్ వేదికలపై మరియు విద్యా సర్కిల్సులో తన అభిప్రాయాలను చురుకుగా వెల్లడించారు.

శ్రీధర్ ఎన్ ఎస్ ఇ- ఐఐఎస్ఎల్ ఇండెక్స్ పాలసీ కమిటిలో మరియు క్యాపిటల్ మార్కెట్ కమిటి ఆఫ్ ద ఇండియన్ మర్చంట్ చాంబర్సులో (ఐఎంసి) సభ్యునిగా ఉన్నారు. అదనంగా, 3 సంవత్సరాలకు పైగా బోర్డు ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్ఐ)లో డైరెక్టరుగా ఉన్నారు.

ఇంతకుముందు శ్రీధర్ యుటిఐ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ లో డైరెక్టర్ మరియు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసరుగా (సిఐఒ) ఉన్నారు. ఈ సంస్థ ఎయుఎం యు ఎస్ డి 10 బిలియన్లుగా ఉంది. తరువాత, అతను సింగపూరులో యుటిఐ ఇంటర్నేషనల్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా పదోన్నతి పొంది, మల్టీ- క్లాస్, మల్టీ- కంట్రీ ఎసెట్స్ ని అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం, అతను ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్సులో ఎఎల్ఎం ఫంక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అధిపతిగా ఉన్నారు.

శ్రీధర్ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు ఫిజిక్స్ లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఉంది.

మోహిత్ రొచ్ లాని

డైరెక్టర్- ఆపరషన్స్ అండ్ ఐటి

కొన్ని ప్రఖ్యాత ఆర్థిక సంస్థల్లో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం మోహిత్ కి ఉంది. ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అతను సీనియర్ గా ఉన్నారు మరియు ఇప్పటి వరకు వివిధ సమయాల్లో వివిధ శాఖలను నెలకొల్పి నాయకత్వం వహించారు.

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కంపెనీ యొక్క ఆపరేషనల్ ప్రక్రియలన్నిటినీ నెలకొల్పడం ద్వారా మోహిత్ తన ప్రయాణం ప్రారంభించారు. అనంతరం అతను ఆదాయం ఉత్పత్తి మరియు బ్యాంక్అష్యూరెన్స్ చానల్ కొరకు రిలేషన్ షిప్ బాధ్యతలు చేపట్టారు. తరువాత, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసరుగా కంపెనీ యొక్క మార్కెటింగ్, డిజిటల్ మరియు ఆల్టర్నేట్ చానల్స్ టీమ్స్ కి నాయకత్వం వహించారు.

ప్రస్తుతం, మోహిత్ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్సులో ఆపరేషన్స్ అండ్ ఐటి డైరెక్టరుగా ఉన్నారు.

సతీష్ వార్ బాలక్రిష్ణన్

చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్

సతీష్ వార్ బాలక్రిష్ణన్ రావు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరుగా ఉన్నారు. ఇతనికి పైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు స్టార్ట్ అప్స్ లో మరియు ప్రముఖ జీవిత బీమా కంపెనీల్లో దాదాపుగా రెండు దశాబ్దాల అపార అనుభవం ఉంది. వ్రుద్ధిని సాధించేందుకు, సామర్థ్యం పెంచేందుకు మరియు బాటమ్- లైన్ లాభాలు పెంపొందించేందుకు వ్యాపార కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడటంలో ఇతనికి ప్రత్యేకత ఉంది.

సతీశ్వర్ ఇండియాఫస్ట్ లైఫ్ లో వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు మరియు ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు నియంత్రణ, బిజినెస్ ప్లానింగ్ మరియు బడ్జెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ తో పాటు పరిశ్రమ విశ్లేషణ మరియు కార్పొరేట్ కార్యక్రమాలకు ఇంటిలిజెన్స్ సపోర్టింగ్ నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి ముందు, ఇతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రాసెస్, మరియు ఆపరేషన్స్ టీమ్స్ కి నాయకత్వం వహించారు. సంస్థ యొక్క లక్ష్యాల సాధనకు తోడ్పడటానికి అత్యధిక వ్యూహాత్మక, ఐటి-తో నడిచే రూపాంతక వ్యాపార కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

బిజినెస్ కంట్రోలర్ గా రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సతీష్వర్ గతంలో పనిచేసారు. ఇతను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వ్యవస్థాపక సభ్యునిగా కూడా ఉన్నారు. ఇతను తన కెరీర్ ని ఎస్.బి. బిల్ మోరియా అండ్ కొ (చార్టర్డ్ అకౌంటెంట్స్)తో ప్రారంభించారు.

యూనివర్సిటీ ఆఫ్ ముంబయి నుంచి కామర్సులో సతీశ్వర్ కి బ్యాచులర్ డిగ్రీ ఉంది మరియు చార్టెర్డ్ అకౌంటెంట్ కూడా.

పెయిలి దాస్

అపాయింటెడ్ యాక్చురీ

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ నుంచి క్వాంటిటేటివ్ ఎకనామిక్సులో ఎంఎస్ చేసిన మరియు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ (ఇండియా) ఫెలో అయిన పెయిలి దాస్ కి 12 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో, భారతదేశం మరియు యుఎస్ఎ లో ఐ ఎన్ జి లైఫ్ ఇన్సూరెన్స్, న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు డచ్ బ్యాంకు లాంటి వివిధ ఫైనాన్షియల్ సంస్థలతో దాస్ కి సహసంబంధం ఉంది.

తన ఆఖరి ఎసైన్మెంటులో ఈమె రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అపాయింటెడ్ యాక్చురీ. ఈమె రిలయన్స్ లైఫ్ లో రిపోర్టింగ్- యాక్చురియల్ కి నాయకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం దాస్ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అపాయింటెడ్ యాక్చురీ.

కె ఆర్ విశ్వనారాయణ్

కంపెనీ సెక్రటరి మరియు హెడ్ - గవర్నెన్స్

విశ్వనారాయణ్ మూడు దశాబ్దాలుగా గల విభిన్న పని అనుభవం తీసుకొచ్చారు. ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఫండ్ అకౌంటింగ్ మరియు ఆపరేషన్స్, నిధుల సమీకరణ, విలీనాలు మరియు ఎక్విజిషన్ల రంగాల్లో విస్త్రుత పరిజ్ఞానం ఉంది. ఇది ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క వ్యూహాత్మక రోడ్ మ్యాప్ ని మార్చేసింది.

విశ్వనారాయణ్ మూడు దశాబ్దాలుగా గల విభిన్న పని అనుభవం తీసుకొచ్చారు. ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఫండ్ అకౌంటింగ్ మరియు ఆపరేషన్స్, నిధుల సమీకరణ, విలీనాలు మరియు ఎక్విజిషన్ల రంగాల్లో విస్త్రుత పరిజ్ఞానం ఉంది. ఇది ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క వ్యూహాత్మక రోడ్ మ్యాప్ ని మార్చేసింది.

గతంలో విశ్వనారాయణ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, డి ఎస్ పి మెర్రిల్ లించ్ మ్యూచువల్ ఫండ్ మరియు బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. జెపి మోర్గాన్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎల్ఐసి హెచ్ ఎఫ్ ఎల్ లాంటి సంస్థల్లో సెక్టార్ నిర్దిష్ట వెంచర్ ఫండ్స్ లో కూడా పనిచేసారు.

యూనివర్సిటీ ఆఫ్ ముంబయి నుంచి కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన విశ్వనారాయణ్ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు కంపెనీ సెక్రటరిగా పనిచేస్తున్నారు. తన కెరీర్ ప్రారంభ దశల్లో, యుఎస్ఎ లోని న్యూయార్కులో మెర్రిల్ లంచ్, ప్రిన్స్ టన్, మరియు జెపి మోర్గాన్ లలో శిక్షణ పొందిన కొద్దిమంది ప్రొఫెషనల్స్ లో ఒకరు. ఆర్థిక వ్యవస్థలోని పరిణామాలకు అనుగుణంగా అందించడంలో కీలకమైన సామర్థ్యాలను అభివ్రుద్ధి చేసారు.

సోనియా నోటాని

చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్

సోనియా నోటాని ఇండియాఫస్ట్ లైఫ్ వ్యవస్థాపక సభ్యురాలు. బిఎఫ్ఎస్ఐ రంగంలో ఈమెకు అపారమైన నైపుణ్యం ఉంది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్, వ్యూహాత్మక కార్యకలాపాలు, వ్యాపార వ్యూహం, శిక్షణ, సామాజిక వాణిజ్యం, బ్రాంచి కార్యకలాపాలు, చానల్ సేల్స్, మరియు వ్యాపార ఎక్విజిషన్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ లాంటి విభాగాల్లో ఆమెకు అనుభవం ఉంది.

ఆమె ప్రయాణం ఆదిత్యా బిర్లా గ్రూపుతో ప్రారంభమైంది. ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరడానికి ముందు, సిటి బ్యాంక్, రిలయన్స్ మరియు కెపిఎంజి లాంటి బహుళ జాతి కంపెనీల్లో ఈమె పనిచేసారు.

ఇండియాఫస్ట్ లైఫ్ లో, ప్రముఖ కార్యనిర్వాహక ప్రొఫైల్స్ తో పాటు, అనేక నిర్దిష్ట ప్రాజెక్టులు సోనియా చేపట్టారు. ప్రస్తుతం, ఈమె ప్రస్తుతం ప్రొడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటజీ మరియు అనలిటిక్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మరియు పిఆర్, మరియు స్ట్రాటజిక్ అలయన్స్ లకు నాయకత్వం వహిస్తున్నారు.

సెయింట్ జేవియర్స్ కాలేజ్ మరియు నార్సీమోంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ముంబయి విద్యార్థిని అయిన సోనియా ఎంబిఎ డిగ్రీ కూడా కలిగివున్న ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్.

ప్రవీణ్ మీనన్

చీఫ్ పీపుల్ ఆఫీసర్

టాలెంట్ మేనేజ్మెంట్, సక్సెషన్ ప్లానింగ్, మార్పు మరియు పనితీరు మేనేజ్మెంట్, శిక్షణ మరియు అభివ్రుద్ధి రంగాల్లో ఫెసిలిలేటివ్ లీడరుగా ప్రవీణ్ రెండు దశాబ్దాలకు పైగా గల తన అనుభవాన్ని తీసుకొచ్చారు.

కంపెనీకి అత్యంత ముఖ్యమైన ఆస్తి అయిన తన ఉద్యోగుల యొక్క వ్రుద్ధికి మరియు కెరీర్ ఆకాంక్షలను నెరవేర్చడానికి అనుకూలమైన వాతావరణం కల్పించే దిశగా పనిచేసే బాధ్యత అతనిది. 2015లో ఇండియాఫస్ట్ లైఫ్ లో పనిచేసిన ప్రవీణ్ ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెంపొందించేందుకు, నియంత్రించేందుకు మరియు నిబద్ధత గల జట్టులను నిర్మించడాన్ని కేంద్రీకరించిన కార్యకలాపాలు ద్వారా మంచి పటిష్టమైన మానవ వనరుల అభివ్రుద్ధి కార్యక్రమాలను చేపట్టారు.

తన కెరీరులో, ప్రవీణ్ యాక్సిస్ బ్యాంక్, ఎ సి నీల్సన్, ఐడిబిఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, సిటిబ్యాంక్ మరియు హెచ్ ఎస్ బి సి లాంటి అనేక సంస్థల్లో పనిచేసారు. బెనిఫిట్ పరిహారం, రివార్డులు, హెచ్ ఆర్ సర్వీసు డెలివరి, మరియు ప్రజలకు ప్రమేయం ఉన్న కార్యక్రమాలను రూపొందించడంలో సత్తా చాటారు.

ఆలోచన కలిగిన నాయకునిగా, ప్రవీణ్ ప్రజల నిర్వహణపై తన దృష్టికోణాలను క్రియాశీలంగా ఇస్తూనే ఉన్నారు మరియు కోరుకున్న యజమానులు అయ్యేందుకు మారుతున్న ఆస్పిరంట్ డిమాండ్లను భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ వేదికల్లో మరియు అకడమిక్స్లో స్వీకరిస్తున్నారు.

వెల్లింగ్ కర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నార్సీమోంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ మరియు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో చెందిన ప్రవీణ్, ఫైనాన్స్ లో బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ, ఫైనాన్స్ లో ఎంబిఎ మరియు అడ్వాన్స్ హ్యూమర్ రిసోర్సుల్లో డిగ్రీ ఉంది.