నమన్ గుప్తా - హెడ్ - బ్రాంచ్ ఆపరేషన్స్, పర్సిస్టెన్సీ (స్థిరత్వం) మరియు ఆర్థిక వ్యవహారాలు

నమన్ గుప్తా

హెడ్ - బ్రాంచ్ ఆపరేషన్స్, పర్సిస్టెన్సీ (స్థిరత్వం) మరియు ఆర్థిక వ్యవహారాలు

ఇండియాఫస్ట్ లైఫ్ యందు నమన్ గుప్తా గారు ప్రస్తుతం హెడ్ - బ్రాంచ్ ఆపరేషన్స్, పర్సిస్టెన్సీ (స్థిరత్వం) మరియు ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటున్నారు.

అతను ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు మరియు కంపెనీలో ఆపరేషన్లు మరియు సేవా విభాగమును నెలకొల్పడంలో మరియు విధులను పేర్కొనడంలో ఒక గణనీయమైన పాత్రను పోషించారు. కస్టమర్ కు ఆనందాన్ని అందించడంలో పట్టుదల కలిగిన నమన్ గారు, కంపెనీ వ్యాప్తంగా ప్రతి కోణములోనూ #కస్టమర్ ఫస్ట్ సిద్ధాంతమును నెలకొల్పాలనే లక్ష్యం చేసుకున్నారు.

ఇండియాఫస్ట్ లైఫ్ లో నమన్ గారు ఒక బిజినెస్ ఎనలిస్టుగా తన ప్రయాణం ప్రారంభించారు, మరి ఆ తర్వాత న్యూ బిజినెస్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంటుకు అధిపతిగా వెళ్ళారు. అతను తన హోదాలో హెడ్-కస్టమర్ సర్వీస్ మరియు ఛానెల్ సర్వీసులకు అధిపతిగా పదోన్నతి పొందారు. ఈ కాలవ్యవధిలో కంపెనీ, ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ వేదికల నుండి గుర్తింపును పొందింది మరియు 2019 సంవత్సరానికి గాను కస్టమర్ సేవా ప్రదాతగా, మరియు ఇతర విషయాల పైకీ బీమా రంగములో కస్టమర్ శ్రేష్టత మరియు ఒక సంప్రదింపు కేంద్రములో టెక్నాలజీ యొక్క అత్యుత్తమ వాడకానికి గుర్తింపును పొందింది.

అతని శ్రేష్టత యొక్క విస్తృతిలో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా కంపెనీ, మరియు రిలయన్స్ రిటెయిల్ లిమిటెడ్ లో మునుపటి పూర్వానుభవాలు చేరి ఉన్నాయి. ఇక్కడ, అతను అనేక శాఖలను విజయవంతంగా ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్రను పోషించడం మాత్రమే కాకుండా, కాలక్రమేణా బ్రాంచ్ ఆపరేషన్లను శ్రద్ధగా నిర్వహించడంలో కూడా సఫలీకృతులయ్యారు.

సమగ్రమైన సిబ్బంది మరియు వృత్తిపరమైన ఎదుగుదలను చూసుకోవడానికై అతను తన జట్టు సభ్యులను సాధికారపరచి వారికి హితబోధ చేయడంలో విశ్వాసం ఉంచుతారు. నమన్ గారు కామర్స్ పట్టభద్రులు మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, హైదరాబాద్ నుండి ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ లో ప్రత్యేక నైపుణ్యతతో మేనేజ్‌మెంట్ స్టడీస్ లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాను పొంది ఉన్నారు.

అమేయ్ ప్రమోద్ పాటిల్ - కంట్రీ హెడ్ - క్రెడిట్ లైఫ్ మరియు ఏజెన్సీ

అమేయ్ ప్రమోద్ పాటిల్

కంట్రీ హెడ్ - క్రెడిట్ లైఫ్ మరియు ఏజెన్సీ

అమేయ్ ప్రమోద్ పాటిల్ గారు కంట్రీ హెడ్ - క్రెడిట్ లైఫ్ మరియు ఏజెన్సీగా పని చేస్తున్నారు. ఒక వ్యవస్థాపక సభ్యులుగా 2009 లో ఇండియాఫస్ట్ లైఫ్ యందు చేరిన నాటి నుండీ అమేయ్ గారు విభిన్న విక్రయ విభాగాల వ్యాప్తంగా ఒక ఘనమైన ఎదుగుదలను నిర్ధారించడంలో సాధనాస్త్రంగా ఉంటున్నారు. గడచిన మూడు సంవత్సరాలుగా, అతని నాయకత్వం క్రింద, జిసిఎల్ ఛానల్, ఇండియా వ్యాప్తంగా అదనపు మార్కెట్లను పెనవేసుకోవడంతో పాటుగా 300% పదునైన ఎదుగుదలను చవి చూసింది, అది కంపెనీ కొరకు ఈ ఛానల్ అత్యధిక విఎన్‌బి మార్జిన్ పొందగలిగేలా చేసింది. 2021 లో కంట్రీ హెడ్ కావడానికి ముందు, అమేయ్ గారు ఇండియాఫస్ట్ లైఫ్ యందు జిసిఎల్ ఛానల్ కు నేషనల్ హెడ్ గా ఉన్నారు, అంతకు పూర్వం వెస్ట్ జోన్ ఛానల్ బ్యాంకష్యూరెన్స్ యొక్క నేషనల్ హెడ్ గా పని చేశారు.

అతని మునుపటి పారిశ్రామిక అనుభవములో రిలయన్స్ నిప్పాన్ జీవిత బీమా మరియు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ తో అనుభవాలు ఇమిడి ఉన్నాయి.

ఒక సమర్థవంతమైన నాయకుడైన అమేయ్ గారు, తన జట్టులో ప్రతి వ్యక్తినీ సాధికారపరచడంలో విశ్వాసం ఉంచుతారు. వారు హృదయపూర్వకంగా చేసే పనిలో వారే అత్యుత్తమ నిర్ణేతలు అని అతను భావిస్తారు.

అమేయ్ గారు ఆర్థిక సేవలలో మాస్టర్స్ డిగ్రీ, ఎల్.ఎల్.బి మరియు గోవా యూనివర్సిటీ నుండి బ్యాచెలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పొంది యున్నారు. అతను కల్చరల్ ఛాంపియన్ అవార్డు యొక్క స్వీకర్త కూడా.

మునీష్ భరద్వాజ్ - కంట్రీ హెడ్ – రూరల్ ఛానల్స్ మరియు డైరెక్ట్

మునీష్ భరద్వాజ్

కంట్రీ హెడ్ – రూరల్ ఛానల్స్ మరియు డైరెక్ట్

మునీష్ భరద్వాజ్ గారు ఇండియాఫస్ట్ లైఫ్ లో కంట్రీ హెడ్ – రూరల్ ఛానల్స్ మరియు డైరెక్ట్ గా ఉంటున్నారు. అతను ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క ఆర్.ఆర్.బి, వ్యూహాత్మక కూటములు, మైక్రో మరియు డైరెక్ట్ లను అజమాయిషీ చేస్తారు మరియు ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క ఉత్పాదన అందజేతలను భారతదేశ వ్యాప్తంగా అన్ని భౌగోళిక ప్రాంతాల్లోనూ విజయవంతంగా పెనవేసుకుపోయేలా చేశారు.

కంపెనీ అడుగుజాడలను బహుళ-ఛానల్స్ వ్యాప్తంగా పెంపొందించే పని అతనికి అప్పగించబడింది మరియు తక్కువ పనితీరు కనబరుస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలలో వ్యాపార పనితీరు యొక్క విజయవంతమైన వ్యవస్థాపన మరియు ఎదుగుదల యొక్క ఘనత ఇవ్వబడింది. దీనికి అదనంగా, బ్యాంకష్యూరెన్స్ ఛానల్ కు అధిపతిగా పనిచేసి ఉన్న అతని పూర్వానుభవము దేశములోని ప్రతి చోటా కస్టమర్లను చేరుకోవడానికి అతనికి వీలు కలిగించింది. జీవిత బీమాను చివరి మైలురాయి వరకూ తీసుకురావాలనే ఉదేశ్యమును నెరవేర్చడానికి మునీష్ నిరంతరమూ కృషి చేస్తున్నారు.

విజయవంతమైన బీమారంగ నిపుణుడిగా అతను పూర్వాశ్రమములో ఫార్మా పరిశ్రమతో పాటుగా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మరియు బజాజ్ అలియాంజ్ వంటి కంపెనీలలో పనిచేశారు.

ఎంబిఏ పట్టా కలిగియుండటంతో పాటుగా మునీష్ గారు రాజస్థాన్ యూనివర్సిటీ నుండి గణితశాస్త్రములో బ్యాచెలర్ పట్టా మరియు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసర్చ్ నుండి కంప్యూటర్ సైన్సులో ఒక డిప్లొమాను కూడా పొందియున్నారు. అనేక సంవత్సరాలుగా అతను వివిధ యాజమాన్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.

సమీర్ గుప్తా - ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్

సమీర్ గుప్తా

ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్

ఇండియాఫస్ట్ లైఫ్ లో సమీర్ గుప్తా గారు ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. వ్యాపారానికి విలువ సృష్టించడం మరియు లాభదాయకమైన ఎదుగుదలను ముందుకు నడిపే అమ్మకాలు మరియు ఉత్పాదన వ్యూహము చుట్టూ అతని విధులు మరియు బాధ్యతలు పరిభ్రమిస్తుంటాయి.

దీనికి అదనంగా, బ్యాంకష్యూరెన్స్ మరియు ప్రత్యామ్నాయ మార్గాల వ్యాప్తంగా వ్యాపార ఊహాత్మకతను చూసుకోవడానికై ముఖ్యమైన వ్యాపార భాగస్వామ్యాల నిర్వహణకు మరియు ఘనమైన విక్రయ నమూనాలను వృద్ధి చేయడానికీ అతను బాధ్యులుగా ఉంటున్నారు.

వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగా ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరినప్పటి నుండీ, అతను లాభదాయకమైన భాగస్వామ్యాలను సమకూర్చుకొని మరియు అమలులో ఉంచడంతో పాటుగా సమర్థవంతమైన విక్రయ యాజమాన్య సాధనాలను అభివృద్ధి చేయడంలో గణనీయంగా దోహదపడ్డారు.

బీమా రంగములో అతని వృత్తిపరమైన ప్రయాణము దాదాపు 23 సంవత్సరాలకు పైగా సాగింది. ఇండియాఫస్ట్ లైఫ్ లో చేరడానికి ముందు, అతను హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మరియు కెనరా హెచ్ఎస్‌బిసి ఓబిసి లైఫ్ ఇన్స్యూరెన్స్ వంటి కంపెనీలలో పని చేశారు, అక్కడ అతను ఏజెన్సీ మరియు బన్‌కా మార్గాల వ్యాప్తంగా అమ్మకాలలో గొప్ప అనుభవాన్ని పొందారు.

సమీర్ గారు, సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్, మోదీనగర్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందియున్నారు.

ఆశిష్ వాలియా - ముఖ్య మార్కెటింగ్ అధికారి

ఆశిష్ వాలియా

ముఖ్య మార్కెటింగ్ అధికారి

ఇండియాఫస్ట్ లైఫ్ లో ఆశిష్ వాలియా గారు ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అతను ప్రస్తుతం కంపెనీ యొక్క మార్కెటింగ్, ప్రజా సంబంధాలు, సోషల్ మీడియా, వెబ్‌సైట్, కస్టమర్ అనుభవం, ఛానెల్ మార్కెటింగ్ మరియు డిజిటల్ సేల్స్ విధుల కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు.

2021 లో సిఎంఓ గా నియమించబడటానికి ముందు, ఆశిష్ గారు ఇండియాఫస్ట్ లైఫ్ లో మార్కెటింగ్ మరియు ప్రజా సంబంధాల విభాగానికి అధిపతిగా ఉంటూ, అనేక మాధ్యమాల వ్యాప్తంగా బ్రాండు ఉనికిని వ్యూహాత్మకం చేసి మరియు అమలు చేయడంలో ఒక కీలకమైన పాత్రను పోషించారు. అతని సమర్థవంతమైన ప్రావీణ్యము వల్ల ఇండియాఫస్ట్ లైఫ్, ఐఎఎంఎఐ, ఎసిఇఎఫ్, బజ్జిన్ కాంటెస్ట్, సోషల్ సమోసా వంటి అనేక వేదికల వ్యాప్తంగా తన నవ్యత మరియు ప్రభావవంతమైన బ్రాండు మరియు మార్కెటింగ్ ప్రచారోద్యమాల కొరకు గుర్తింపును పొందడానికి దారి తీసింది. ఎన్.డి.టి.వి ప్రైమ్ ప్రాఫిట్ పై 2019-20 ఇండియా యొక్క అత్యంత ఆరాధ్యమైన బ్రాండులలో ఒకటిగా కూడా కంపెనీ గుర్తింపు పొందుతూ ఉంది.

రెండు దశాబ్దాలకు పైగా ఉన్న అతని ఉద్యోగ జీవితకాలములో, ఆశిష్ గారు ఐఎఎంఎఐ, ఐకాంటాక్ట్, టాటా టెలీసర్వీసెస్, అవివా లైఫ్ ఇన్స్యూరెన్స్, మరియు బిర్లా సన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వంటి కంపెనీలకు మార్కెటింగ్ వ్యూహాలు, లాయల్టీ కార్యక్రమాలు మరియు పంపిణీ వ్యూహాలను వృద్ధి చేయడంలో సాధనంగా ఉంటున్నారు.

ఒక ప్రతిభావంతుడైన బీమారంగ నిపుణుడిగా, ఆయన వివిధ పారిశ్రామిక వేదికలలో భాగంగా ఉండేందుకు ఆహ్వానించబడ్డారు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ మరియు మేనేజ్‌మెంట్, న్యూ ఢిల్లీ నుండి మార్కెటింగ్ మరియు సిస్టమ్స్ లో ఒక ఎంబిఏ పట్టా పొందియున్నారు మరియు ఎస్.ఐ.ఇ.ఎస్-ముంబై నుండి బ్యాచెలర్ ఆఫ్ కామర్స్ పట్టా కలిగియున్నారు.