అత్యంత అధికంగా అమ్ముడవుతున్న ప్లానులు

ఎందుకు మమ్మల్ని ఎంచుకోవాలి

ఇండియాఫస్ట్ లైఫ్ ఘనత

  • బిజినెస్ లో దిగ్గజాలచే ప్రోత్సహించబడినది: బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
  • మా ఉత్పత్తులు ప్రత్యేకంగా మీ ప్రస్తుత మరియు భవిష్యత్ లక్ష్యాలను సాకారం చేసుకోవడంలో మీకు సహాయపడేందుకు రూపొందించబడ్డాయి.
ABOUT US INDIAFIRST LIFE INSURANCE

గురించి
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్

కస్టమర్లకు సేవ చేయాలనే ఆశయముతో, నిశ్చితులు అనిశ్చితి కంటే ఎక్కువ భారంగా ఉంటాయని మేము నమ్ముతాము మరియు ఆ క్షణాల కొరకు సిద్ధపడేలా మేము మిమ్మల్ని తయారు చేయాలనుకుంటున్నాము. మా గురించి మరింత మెరుగ్గా తెలుసుకోవాలని మీరు నిర్ణయించుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.

ముంబైలో ప్రధాన కార్యాలయము కలిగి, రు. 663 కోట్ల చెల్లించిన వాటా మూలధనముతో ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఇండియాఫస్ట్ లైఫ్), దేశం యొక్క అత్యంత తాజా బీమా కంపెనీలలో ఒకటిగా ఉంది.

Know More

అవార్డులు మరియు గుర్తింపు

IndiaFirst Life Insurance Company Limited

2022

GREAT PLACE TO WORK CERTIFIED

For successfully completing the assessment conducted by GPTW Institute.

Best Customer Centric Company

2023

16th Best Customer Centric Company

16th Customer Fest Leadership Awards 2023

Leader in Customer Engagement Initiative award

2023

Leader in Customer Engagement Initiative award

Elets BFSI Tech Innovation Awards

top

LET'S HELP YOU FIND THE

BEST INSURANCE PLAN!

Protect Your Loved Ones. Save Tax Under 80 C.

top

విజ్ఞాన కేంద్రము

మాతో కనెక్ట్ అవండ
మీ సౌకర్యం మేరక

  • ప్రీమియం చెల్లించండ
  • నిధుల పనితీరును ట్రాక్ చేయండ
  • పాలసీ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేయండి
మరి ఇంకా మరెన్నో…
HTML

 

జీవిత బీమా 

జీవిత బీమా అనేది ఒక పాలసీదారు మరియు ఒక బీమా కంపెనీ మధ్య ఒక ఒప్పందము, అది పాలసీదారు గనక మరణించిన పక్షములో వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. పాలసీదారు "భరోసా సొమ్ము" అని కూడా పిలువబడే "జీవిత వర్తింపు" కొరకు బీమాదారుకు "ప్రీమియములు" చెల్లిస్తారు. ఈ మొత్తము, చెల్లించవలసియున్న ప్రీమియముల ఆధారంగా పాలసీ కొనుగోలు చేయు సందర్భంగా ముందస్తుగా నిర్ధారణ చేయబడుతుంది. రెండు సంవత్సరాల నుండి కొన్ని దశాబ్దాల పాటు ఎంతకాలానికైనా ఉండగల "పాలసీ అవధి" అనబడే కాలవ్యవధి పాటు ప్రీమియములు చెల్లించబడతాయి. ఆకస్మికంగా మీ మరణం సంభవించిన పక్షములో, మరీ తక్కువ జీవిత వర్తింపును కొనుగోలు చేసి ఉంటే మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను దెబ్బతీయగలదు కాబట్టి ధర మరియు కవరేజీ మధ్య మంచి సమతుల్యం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. 

మీ మరణం తర్వాత, మీపై ఆధారపడి ఉన్నవారు సౌకర్యవంతంగా జీవించేలా జీవిత బీమా చూసుకుంటుంది. అవధి తర్వాత కూడా మీరు జీవించి ఉన్నట్లయితే,కొన్ని జీవిత బీమా ప్లానులు మీకు భరోసా మొత్తము మరియు "మెచ్యూరిటీ ప్రయోజనము"ను చెల్లిస్తాయి. ఇది జీవిత బీమాను ఒక మంచి పొదుపు ప్లానుగా కూడా చేస్తుంది. 

1. జీవిత బీమా యొక్క ప్రయోజనాలు

ఒక జీవిత బీమా పాలసీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి అది అత్యుత్తమ ఆర్థిక రక్షణగా ఉంటుంది.

ఆర్థిక భద్రత: మీరు తగినంత పరిమాణములో జీవిత వర్తింపును కొనుగోలు చేస్తే, మీ ఆకస్మిక మరణం జరిగిన పక్షములో అది మీపై ఆధారపడి ఉన్నవారికి టోకుగా పెద్ద మొత్తపు మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది వారికి సౌకర్యవంతంగా సహాయపడగలుగుతుంది, ప్రత్యేకించి వారికి ఆదాయ వనరు లేకుంటే, మరియు చిన్నపిల్లలు లేదా వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే.

సంపదను సృష్టించుట: అది మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఆర్థిక భద్రత కోసమైనా, సంపాదనాకర్త మరణం తదనంతరం నిలకడైన ఒక ఆదాయ వనరుగా అయినా, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అయినా లేదా కేవలం దీర్ఘకాలిక పొదుపు అయినా ప్రతి అవసరానికీ ఒక జీవిత బీమా పాలసీ ఉంది. .

ప్రతి జీవిత దశకూ రక్షణ:  అది మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఆర్థిక భద్రత కోసమైనా, సంపాదనాకర్త మరణం తదనంతరం నిలకడైన ఒక ఆదాయ వనరుగా అయినా, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అయినా లేదా కేవలం దీర్ఘకాలిక పొదుపు అయినా ప్రతి అవసరానికీ ఒక జీవిత బీమా పాలసీ ఉంది.

పన్ను ఆదాలు: ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 80C ప్రీమియం చెల్లింపులను పన్ను-రహితం చేస్తుంది, అది పన్ను వేయదగిన మీ ఆదాయాన్ని తగ్గిస్తుంది. పైపెచ్చుగా, చెల్లింపులు కూడా పన్ను-రహితంగానే ఉండేలా సెక్షన్ 10(10D) చూసుకుంటుంది. ఈ పన్ను చట్టాలు జీవిత బీమాను ఒక విలువైన పెట్టుబడిగా చేస్తాయి.

రిటైర్‌మెంట్ ప్లానింగ్: మీ ఉద్యోగ జీవితం ముగిసిపోవచ్చు, అయితే మీ జీవన ఖర్చులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. రిటైర్‌మెంట్ జీవిత బీమా పాలసీ అనేది కవరేజీని మరియు నిలకడైన ఆదాయ వనరును అందజేస్తుంది, అది రోజువారి ఖర్చులకు, చిన్న వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి లేదా ఇతర ఆర్థిక సాధనాల్లో తిరిగి పెట్టుబడి చేయడానికి తోడ్పడుతుంది.

సురక్షితమైన పెట్టుబడి: మార్కెట్ అనుసంధానిత రాబడులను అందించే ఆర్థిక ఉత్పాదనలు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి, అవి వాటిని ముప్పుకు గురి చేయవచ్చు. అయినప్పటికీ జీవిత బీమా, మీకు ప్రీమియం చెల్లింపులకు మార్పిడిగా భరోసాతో కూడిన ప్రయోజనాలను అందిస్తుంది.

లోన్ ఐచ్ఛికాలు: ఒకవేళ ఊహించని ఆర్థిక సంక్షోభం సంభవించిన పక్షములో, పాలసీ షరతులు మరియు నిబంధనలపై ఆధారపడి భరోసా మొత్తము నుండి కొన్ని నిధులను అప్పుగా తీసుకోవడానికి జీవిత బీమా మీకు వీలు కలిగిస్తుంది.

రైడర్లు:  రైడర్లు అనేవి, మీ జీవిత బీమా పాలసీని బలమైనదిగా చేసుకోవడానికి మీరు కొనుగోలు చేయగల అదనపు ప్రయోజనాలు. క్లిష్టమైన అస్వస్థత, ఆకస్మిక మరణము, లేదా సంపూర్ణ/పాక్షిక వైకల్యము వంటి ఆదాయాన్ని కోల్పోగల అనిశ్చితుల నుండి రైడర్లు మిమ్మల్ని కాపాడతాయి.

2. జీవిత బీమా యొక్క రకాలు

ఇండియాలో ఒక జీవిత బీమా కంపెనీ అనేక ఐచ్ఛికాలను అందిస్తుంది మరియు మీ అవసరాలకు అత్యుత్తమంగా సరిపోయే ఒక జీవిత బీమా ప్లానును మీరు కనుగొంటారు.

  1. 1) అవధి బీమా:అవధి బీమాఅనేది స్థోఁఅతకు తగిన శుద్ధమైన ముప్పు కవరేజీ జీవిత బీమా ప్లానుగా ఉంది, అది మీ భవిష్యత్ సంపాదనా శక్తిని కాపాడుతుంది మరియు ఒక ప్రమాద సంఘటన, అస్వస్థత లేదా సహజ కారణాల వల్ల మరణం సంభవించిన పక్షములో మీ కుటుంబ ఆర్థిక భద్రతను పరిరక్షిస్తుంది. పాలసీ అవధి ముగియక ముందే మీరు మరణించినట్లయితే, మరణ ప్రయోజనంగా మీ లబ్దిదారులు భరోసా మొత్తమును అందుకుంటారు.
  2. 2) ఎండోమెంట్ ప్లాన్:  ఎండోమెంట్ ప్లాన్ కొంతవరకూ హామీతో కూడిన రాబడులతో సహా జీవిత బీమా మరియు పొదుపు యొక్క రెండింటి ప్రయోజనాలను అందిస్తుంది. భవిష్యత్ అవసరాల కొరకు ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి ఇది ఉత్తమంగా ఉంటుంది. ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి పాలసీ అవధి వరకూ జీవించి ఉంటే, మెచ్యూరిటీ మొత్తం చెల్లించబడుతుంది. ఒకవేళ లేకుంటే, లబ్దిదారు మరణ ప్రయోజనముగా భరోసా మొత్తమును అందుకుంటారు. .
  3. 3) యులిప్: యులిప్ (యూనిట్ అనుసంధానిత బీమా ప్లాన్) అనేది ఒక రకమైన జీవిత బీమా, అది మార్కెట్-అనుసంధానిత పెట్టుబడుల ద్వారా మీ సంపదను పెంచుతూనే జీవిత వర్తింపును అందిస్తుంది. యులిప్ మీ అవసరాలకు తగ్గట్టుగా అనుకూలమైన ఐచ్ఛికాలను అందజేస్తుంది.
  4. 4) రిటైర్‌మెంట్ ప్లాన్: ఇది జీవిత వర్తింపును ఇస్తుంది, మరియు మీ రిటైర్‌మెంట్ ఖర్చులకు గాను ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది, అది వయో వృద్ధులకు మంచి జీవిత బీమా ఉండేలా చేస్తుంది.
  5. 5) ఆన్యువిటీ ప్లాన్: ఇది ఒక రకమైనరిటైర్‌మెంట్ ప్లాన్ , ఇందులో బీమాదారు ఏకమొత్తంగా ప్రీమియం తీసుకుంటారు, దాన్ని పెట్టుబడి చేస్తారు, మరియు క్రమం తప్పని ఆదాయముగా అధిక రాబడులను మీకు తిరిగి చెల్లిస్తారు. .
  6. 6) ఛైల్డ్ ప్లాన్: ఈ జీవిత బీమా కమ్ పెట్టుబడి ప్లాను మీ చిన్నారి యొక్క భవిష్యత్ ఆవశ్యకతల కోసం ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ మరణం సంభవించిన పక్షములో, మీ చిన్నారి టోకుగా గానీ లేదా కంతులుగా గానీ భరోసా మొత్తమును అందుకుంటారు.

3. జీవిత బీమా కొనుగోలు చేయడానికి ముందు మీరు పరిగణించవలసిన అంశాలు

జీవిత బీమా అనేది మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను పరిరక్షించుకోవడానికి తప్పనిసరియైనది అయి ఉండగా, ఒక పాలసీని కొనుగోలు చేయునప్పుడు ఈ అంశాలను పరిగణించుకోవడం ముఖ్యం.

  1. 1) మీకు స్థోమత ఉన్న వర్తింపును తీసుకోండ: జీవిత బీమా వర్తింపు చెల్లించిన ప్రీమియముకు అనుపాతములో ఉంటుంది - ఎంత ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే అంత ఎక్కువ వర్తింపు. ఈ లెక్కకు రావడానికి ముందు, ఇతర ఇంటి ఖర్చులను మరియు అప్పులను లెక్కలోనికి తీసుకోండి. మొత్తం పాలసీ వ్యవధికీ మీరు ప్రీమియం చెల్లించే స్థోమతను సరి చూసుకోండి, ఎందుకంటే తప్పిన ఒక ప్రీమియం చెల్లింపు మీ జీవిత వర్తింపును దెబ్బతీయగలదు.
  2. 2) పాలసీ కాలావధి:  భరోసా సొమ్ము, పిల్లల చదువు, వయోవృద్ధులైన తల్లిదండ్రులకు ఆరోగ్య సంరక్షణ వంటి మీ కుటుంబం యొక్క భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా తగినంతగా ఉండాలి అదేవిధంగా రోజువారీ అవసరాల కోసం నిలకడైన ఆదాయవనరును ఇవ్వగలిగి ఉండాలి. గరిష్ట కాలావధితో జీవిత బీమాను ఎంచుకోవడం వల్ల దీర్ఘ కాలిక భద్రతను నిర్ధారిస్తుంది.
  3. 3) పప్లానులను పోల్చి చూసుకోండి: విభిన్న బీమా కంపెనీలు విభిన్న జీవిత బీమా ఉత్పత్తులను అందిస్తాయి. ప్లానులను వాటి అందజేతలు, ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, జీవిత బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ మరియు కొనుగోలు మరియు రిన్యూవల్ సౌలభ్యతపై ఆధారపడి పోల్చి చూసుకోండి. ప్రతిష్టాత్మక కంపెనీని ఎంచుకోండి మరియు ఆన్‌లైన్ మోసపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి.
  4. 4) మీ వాస్తవాలతో నిజాయితీగా ఉండండి:  మీరు ముందస్తుగా ఉన్న ఏదైనా వైద్య స్థితితో బాధపడుతూ ఉంటే, లేదా ప్రాణహాని కలిగించే జీవనశైలి అలవాట్లు కలిగి ఉంటే, పాలసీ కొనుగోళు సందర్భంగా వాటిని వెల్లడించండి ఎందుకంటే ఇండియాలో ప్రతి బీమా కంపెనీ మోసపూరితమైన జీవిత బీమా క్లెయిమును తిరస్కరిస్తుంది.
  5. 5) క్లెయిము పరిష్కారమ:జీవిత బీమా క్లెయిము సందర్భంగా మీ కుటుంబం యొక్క భావోద్వేగ మరియు ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి క్లెయిముల చెల్లింపు ప్రక్రియ మరియు సెటిల్మెంట్ రేషియోను చెక్ చేసుకోండి. నిలకడైన మంచి రేషియో, చెల్లింపు చేయుటలో జీవిత బీమా కంపెనీ యొక్క సుముఖతకు ఒక సూచికగా ఉంటుంది.

4. జీవిత బీమా ప్రీమియములను ప్రభావితం చేసే అంశాలు

జీవిత బీమా ప్రీమియము ఈ క్రింది అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది:

  1. 1) వయస్స: మీరు చిన్నవయసులో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటూ, దీర్ఘ కాలం జీవిస్తారని ఆశించబడేటప్పుడు అత్యుత్తమ జీవిత బీమాను తీసుకోవాలి. ఇది బీమాదారుకు మీరు తక్కువ నష్టబాధ్యత కలిగి ఉండేలా చేస్తుంది మరియు తక్కువ ప్రీమియం చెల్లింపు నుండి మీరు ప్రయోజనం పొందుతారు.
  2. 2) లింగము: పురుషుల కంటే స్త్రీలు సుమారుగా 5 సంవత్సరాలు ఎక్కువగా జీవీస్తారని శాస్త్రీయ మరియు గణాంక సంబంధిత డేటా ఋజువు చేస్తోంది. ఇది, తక్కువ ప్రీమియముల ప్రయోజనాన్ని అందిస్తూ వారి జీవిత బీమా పాలసీ కాలావధిని పెంచుతుంది.
  3. 3) వైద్య చరిత: ఏదైనా ముందస్తు వ్యాధి లేదా కొన్నిరకాల జన్యుసంబంధిత వైద్య స్థితుల వైద్య చరిత్ర అధిక ప్రీమియం చెల్లింపును కోరగలదు. అత్యుత్తమ జీవిత బీమా పాలసీ పొందడానికి గాను, బీమాదారు మిమ్మల్ని ఒక వైద్య పరీక్షకు పంపించవచ్చు.
  4. 4) జీవనశైలి ఎంపికలు: మద్యసేవనము మరియు పొగాకు వాడకం చేరి ఉన్న ఒత్తిడితో కూడిన జీవన శైలి జీవిత బీమా ప్రీమియమును ప్రభావితం చేయగలదు.

తరచుగా అడిగే ప్రశ్నలు

1. జీవిత బీమాను ఎవరు కొనాలి?

వయస్సు, వృత్తి లేడా వైవాహిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా జీవిత బీమా కొనాలి. జీవిత బీమా ఆర్థికపరమైన భద్రతను అందిస్తుంది. భవిష్యత్ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఇది మీ పొదుపులను కూడా పెంచగలుగుతుంది.

  1. 1) తక్కువ ప్రీమియంల నుండి ప్రయోజనం పొందడానికి చిన్నవయస్సులో ఉద్యోగం చేస్తున్న నిపుణులు జీవిత బీమాను తొలి దశలోనే కొనుగోలు చేయవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే బాధ్యతల్ని నెరవేర్చడానికి ఇది వారికి సహాయపడుతుంది. .
  2. 2) కొత్తగా పళ్ళయిన దంపతులకు తదనంతరం పిల్లలు కలుగుతారు మరియు ఇతర ఆర్థిక కర్తవ్యబాధ్యతలు ఉంటాయి. వారు గనక మొదట్లోనే జీవిత బీమా కొనుగోలు చేస్తే, వారి బాధ్యతల్ని సులువుగా తీర్చుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. .
  3. 3) పిల్లలు ఒక పెట్టుబడి అని యువ తల్లిదండ్రులకు తెలుసు. వారి ఉన్నత చదువులు, పెళ్ళి మరియు ఇతరత్రా భవిష్యత్ ఖర్చులతో నిలదొక్కుకోవడానికి జీవిత బీమా వారికి సహాయపడగలుగుతుంది. .
  4. 4) పిల్లలు ఒక పెట్టుబడి అని యువ తల్లిదండ్రులకు తెలుసు. వారి ఉన్నత చదువులు, పెళ్ళి మరియు ఇతరత్రా భవిష్యత్ ఖర్చులతో నిలదొక్కుకోవడానికి జీవిత బీమా వారికి సహాయపడగలుగుతుంది. .
  5. 5) ఋణాలు తీసుకొని అప్పులతో ఉన్న వ్యక్తులు తిరిగి చెల్లింపుల భారము నుండి తమ కుటుంబాన్ని జీవిత బీమాతో రక్షించుకోవచ్చు.
  6. 6) రిటైర్‌మెంట్ కు దగ్గరపడుతున్న వారు తమ రిటైర్‌మెంట్ అనంతర ఖర్చులను జీవిత బీమా నుండి వచ్చే ఆదాయముతో తీర్చుకోవచ్చు.

2. మీకు ఎంత జీవిత బీమా కావాల్సి ఉంటుంది?

ఒకవేళ మీరు 55 సంవత్సరాల వయస్సు లోపు వారైతే, మీ ప్రస్తుత వార్షిక ఆదాయమును 10-15 రెట్లతో గుణించడం మీరు తీసుకోదగిన కనీస జీవిత వర్తింపును లెక్క కట్టుకోవడానికి అత్యంత సులువైన మార్గము. ఉదాహరణకు, మీ ప్రస్తుత వార్షిక జీతము ₹ 10 లక్షలైతే, మీరు కనీసం ₹ 1-1.5 కోట్ల జీవిత వర్తింపుతో జీవిత బీమాను కొనాలి. వయస్సు, ఆధారపడి ఉన్నవారి సంఖ్య, మీకు ఉన్న అప్పులు, మరియు మీ ఆర్థిక లక్ష్యాలు వంటి అనేక అంశాలపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది, కాబట్టి మీరు జీవిత బీమా కొనేటప్పుడు వీటిని మనసులో ఉంచుకోండి. .

3. జీవిత బీమా ఎలా పనిచేస్తుంది?

విభిన్న జీవిత బీమా ఉత్పత్తులు విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి. జీవిత బీమా యొక్క అతి సులువైన మరియు అత్యంత సామాన్యమైన రూపము అయిన అవధి బీమా, స్థోమతకు తగిన ప్రీమియం చెల్లింపులతో అధిక జీవిత వర్తింపును అందజేస్తుంది. ప్రీమియములను నెల వారీగా లేదా సంవత్సరం వారీగా చెల్లించవచ్చు. పాలసీదారు మరణం తర్వాత వారిపై ఆధారపడి ఉన్నవారికి అవధి బీమా, జీవిత వర్తింపును ఒక మరణ ప్రయోజనముగా చెల్లిస్తుంది. ఒకవేళ పాలసీదారు గనక పాలసీ పూర్తయ్యేవరకూ జీవించి ఉంటే, ఎటువంటి తిరిగి చెల్లింపు లేదా చెల్లింపు ఉండదు. పాలసీదారు గనక ప్లాన్ అవధి పూర్తయ్యేవరకూ జీవించి ఉంటే, సంపూర్ణ జీవిత ప్లానులు వంటి కొన్ని జీవిత బీమా ఉత్పత్తులు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందిస్తాయి. .

4. జీవిత బీమా ఎందుకు ముఖ్యము?

మీరు ఆకస్మికంగా మరణించిన పక్షములో మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది కాబట్టి జీవిత బీమా చాలా ముఖ్యము. పన్ను చట్టాలు చెల్లింపులు మరియు ప్రీమియములను మినహాయిస్తాయి కాబట్టి మీకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది, అది పన్ను చెల్లించదగిన మీ ఆదాయాన్ని తగ్గిస్తుంది. విభిన్న ప్రయోజనాలను అందించే అనేకమైన వివిధ రకాల జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. యులిప్ వంటి కొన్ని ప్లానులు మీ పొదుపు పెరగడానికి సహాయపడతాయి. .

5. నా జీవిత బీమా పాలసీ యొక్క సర్వైవర్ ప్రయోజనాలు నాకు వర్తిస్తాయా?

పాలసీదారు గనక పాలసీ అవధికి మించి జీవించి ఉన్నట్లయితే, అతడు/ ఆమె సర్వైవర్ ప్రయోజనాలను క్లెయిము చేసుకోవడానికి కొన్ని ఇండియా జీవిత బీమా పాలసీలు వీలు కలిగిస్తాయి. ఉదాహరణకు, ప్రీమియం తిరిగి చెల్లింపు ఆప్షనుతో అవధి బీమా, పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత, చెల్లించిన ప్రీమియములన్నింటినీ జీవించియున్న ప్రయోజనాలుగా తిరిగి చెల్లిస్తుంది. అయినప్పటికీ, ఒక శుద్ధమైనఅవధి ప్లాన్అటువంటి ప్రయోజనాలను కలిగి ఉండదు.

6. ఒకవేళ జీవిత బీమా ప్రీమియమును సకాలములో చెల్లించకపోతే, ఏమి జరుగుతుంది?

చెల్లించే ప్రీమియములు, ప్రత్యేకించి అవధి బీమా కోసం, గడువు తేదీ లోపున చెల్లించబడేలా చూసుకోవడం ముఖ్యము. దాని తర్వాత 30 రోజుల వరకూ కొన్ని జీవిత బీమా కంపెనీలు కారుణ్య వ్యవధిని అందిస్తాయి. ఒకవేళ ఈ వ్యవధి లోపున ప్రీమియం చెల్లించకపోతే, పాలసీ రద్దు అవుతుంది. మీరు మీ మదుపుతో సహా అన్ని ప్రయోజనాలనూ కోల్పోవాల్సి ఉంటుంది.

7. జీవిత బీమా క్రింద సరియైన భరోసా మొత్తమును ఎలా లెక్క కట్టుకోవాలి?

మీరు గనక అకస్మాత్తుగా చనిపోయిన పక్షములో, భరోసా మొత్తము మీ కుటుంబం యొక్క భవిష్యత్ ఖర్చులను తీర్చగలిగేలా ఉండాలి. సరియైన మొత్తమును లెక్క కట్టుకోవడానికి, ఈ క్రింది అంశాలను పరిగణించండి:

  • ఆశించబడిన పని సంవత్సరాలు
  • ప్రస్తుతమున్న క్రమం తప్పని వార్షిక ఖర్చులు
  • భవిష్యత్ జీవిత లక్ష్యాలు మరియు ఆకాంక్షలు
  • ప్రస్తుత చెల్లింపు బాధ్యతలు వర్సెస్ పొదుపు మరియు మదుపులు

యులిప్ అనేది ఒక మంచి జీవిత బీమా ప్లాన్, ఎందుకంటే ఇది బీమా మరియు పెట్టుబడి యొక్క రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుంది. .

8. మీరు జీవిత బీమా కొనుగోలు చేసినప్పుడు ఏమి జరుగుతుంది?

మీరు గనక అకస్మాత్తుగా చనిపోయిన పక్షములో, మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రత ఏ విధంగానూ రాజీపడబోదనే మనశ్శాంతిని జీవిత బీమా మీకు ఇస్తుంది. యులిప్ లేదా ఎండోమెంట్ ప్లాన్ అనేది బీమా మరియు పెట్టుబడిని ఇస్తుంది కాబట్టి అది అత్యుత్తమమైన జీవిత బీమా పాలసీ, అది సంపదను వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది.

9. జీవిత బీమాను ఎవరు ఎక్కువ కొనుగోలు చేయాల్సి ఉంటుంది?

జీవిత బీమా అనేది ఎవరికైనా మరియు ప్రతి ఒక్కరికీ, వారి వయసు, వృత్తి లేదా వైవాహిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఆవశ్యకం. అది ఆర్థిక భద్రతను అందిస్తుంది, అదేవిధంగా మీరు మీ దీర్ఘ-కాలిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడగల మార్గాలలో డబ్బును పెట్టుబడి చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఒక రిటైర్‌మెంట్ ప్లాన్ సైతమూ, మీరు ఉద్యోగానంతర రోజుల్లో మీ జీవన ప్రమాణాన్ని నిర్వహించుకోగలిగేలా మీకు తగినంత ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది, అది వయో వృద్ధుల పట్ల జీవిత బీమాను చాలా ముఖ్యమైనదిగా చేస్తుంది.

10. ఇండియాఫస్ట్ లైఫ్ కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి?

ఇండియాఫస్ట్ లైఫ్ ఇండియాలోని అత్యుత్తమ బీమా ప్రదాతలలో ఒకటి, ఎందుకంటే వారి జీవిత బీమా ఉత్పత్తులు ప్రతి వ్యక్తి యొక్క అవసరాన్ని మరియు జీవిత లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. టెక్నాలజీచే నడపబడే కంపెనీగా ఉంటూ, వారు ఆన్‌లైన్ జీవిత బీమా కొనుగోలును అంతరాయం లేనిదిగా మరియు సులువైనదిగా చేస్తున్నారు. ఇండియాఫస్ట్ లైఫ్ రెండు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల వెన్నుదన్ను కలిగి ఉంది - బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అవి వారిని ఒక ప్రతిష్టాత్మక కంపెనీగా చేస్తున్నాయి.

11. ఒక జీవిత బీమా క్లెయిమును నేను ఎలా దాఖలు చేయాలి?

ఒక జీవిత బీమా క్లెయిమును బీమా కంపెనీ శాఖ యందు దాఖలు చేయవచ్చు, వారి వెబ్‌సైట్ పైన అప్‌లోడ్ చేయవచ్చు, లేదా వారికి ఇమెయిల్ చేయవచ్చు. అయినప్పటికీ, ప్రస్తావించదలచిన క్లెయిము కొరకు ఈ క్రింది పత్రాలను అందించాల్సి ఉంటుంది.

  • క్లెయిము ఫారము
  • మరణ ధృవపత్రము
  • ఒరిజినల్ పాలసీ పత్రము
  • క్లెయిముదారు యొక్క ఐడి మరియు చిరునామా ఋజువు

ఒకవేళ అవసరమైతే, ఇది కాకుండా మరింతగా నిరూపణను కోరడానికి బీమాదారుకు హక్కు ఉంటుంది.