ఇ-బీమా అనగా మనకు తెలిసినది ఏమిటి?


ఇ-బీమా అనేది, ఒక బీమా రిపోజిటరీతో ఒక డీమ్యాట్ ఖాతా ఉన్నదానితో సరిసమానమైన బీమా. అది మీ బీమా పాలసీలు అన్నింటినీ ఒక ఎలక్ట్రానిక్ / డీమెటీరియలైజ్డ్ రూపములో ఉంచే ఒక విశ్వసనీయమైన సౌకర్యాన్ని అందిస్తుంది. మీరు అత్యంత సౌకర్యముతో బీమా పాలసీలో మార్పులు చేసుకోవడానికి మీకు వీలు కల్పించే ఒక ఏకైక వేదిక.మీరు చేయవలసిందల్లా, ఒక ఇ-బీమా ఖాతాను తెరవడం మరియు మీ బీమా పాలసీలు అన్నింటినీ ఆ ఖాతాకు ట్యాగ్ చేయడం మాత్రమే.

ఒక ఇ-బీమా ఖాతా ఉచితం, తెరవడం మరియు నిర్వహణ చేయడం సులభం, అత్యంత భద్రత కలిగినది మరియు ఆన్‌లైన్ లో లభిస్తుంది. మీరు బీమాదారులందరి యొక్క మీ జీవిత బీమా పాలసీలు అన్నింటినీ ఒకే ఒక్క ఇ-బీమా ఖాతా క్రింద నిర్వహణ చేసుకోవచ్చు. ఇది, మీరు ఆ తదుపరి మీ బీమా విభాగమును వాస్తవ సమయములో ట్రాక్ చేసుకోవడానికి మరియు నిర్వహణ చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఒక ఇ-బీమా ఖాతాతో మీరు ప్రతి కొనుగోలుకూ కేవైసీ (చిరునామా మరియు గుర్తింపు ఋజువు వంటి) నియమాలకు అతీతంగా పనులు చేసుకోవచ్చు.

ఒక ఇ-బీమా ఖాతా యొక్క ప్రయోజనాలు ఏవేవి?


  • భద్రత:ఒక ఇ-బీమా ఖాతాతో ఎటువంటి ముప్పు లేదా నష్టము జరగదు కాబట్టి, పాలసీలు భద్రంగా నిక్షిప్తమయ్యేట్లుగా ఎలక్ట్రానిక్ రూపము నిర్ధారిస్తుంది.
  • సౌకర్యత:ఒక ఏకైక ఇ-బీమా ఖాతా క్రింద బీమా పాలసీలు అన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపములో ఫైల్ చేసుకోవచ్చు. పాలసీ యొక్క ఒక కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, బీమా రిపోజిటరీ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ లోనికి లాగిన్ కావడం ద్వారా ఏ సమయములోనైనా పాలసీలలో దేని వివరాలనైనా అందుబాటు చేసుకోవచ్చు.
  • ఏకైక సేవా కేంద్రము:విభిన్న బీమాదారుల వ్యాప్తంగా ఉన్న పాలసీలకు ఒకే ఒక్క అభ్యర్థన సరిపోతుంది. బీమా రిపోజిటరీ యొక్క సేవా పాయింట్లలో దేనియందైనా సేవా అభ్యర్థనలను సమర్పించవచ్చు. ఉదాహరణకు, బీమా రిపోజిటరీకి చేసుకోబడిన చిరునామా మార్పు యొక్క ఒకే ఒక్క అభ్యర్థన పలు బీమాదారులచే జారీ చేయబడిన పాలసీలను ఆధునీకరించగలుగుతుంది. సేవా అభ్యర్థన కొరకు విడి విడి బీమాదారుల యొక్క వివిధ కార్యాలయాల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు.
  • సమయం ఆదా చేసుకోండి హరితంగా వెళ్ళండి:ఒక కొత్త పాలసీ తీసుకున్న ప్రతిసారీ మీరు కేవైసీ వివరాలను సమర్పిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. మీ లావాదేవీలు అన్నీ కాగిత రహితం అయినందువల్ల, మీరు పర్యావరణానికి కూడా దోహదపడినవారవుతారు.
  • ఖాతా యొక్క స్టేట్‌మెంట్: కనీసం సంవత్సరానికి ఒకసారి, బీమా రిపోజిటరీ మీ పాలసీలన్నింటి వివరాలతో ఖాతా యొక్క ఒక స్టేట్‌మెంట్ పంపిస్తారు.
  • ఏకైక వీక్షణ:ఇ-బీమా ఖాతాదారు యొక్క మరణము సంభవించిన పక్షములో, ఒక అధీకృత వ్యక్తికి పాలసీలు అన్నింటి యొక్క ఏకైక వీక్షణ అందుబాటు చేయబడుతుంది.