ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ఒక బీమా పాలసీ కొరకు దరఖాస్తు చేసుకోదలచిన కొత్త కస్టమర్లు ఒక eIA (ఇ-బీమా ఖాతా) ఖాతాను తెరవడాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఈ క్రింది విధంగా ఉంటుంది:
ఆఫ్‌లైన్ (సహాయత ఇవ్వబడే అమ్మకాలు):
పాలసీ కొనుగోలు చేసే సమయములో, బీమా ప్రతిపాదన ఫారమును నింపేటప్పుడు, ఒక eIA ఖాతా తెరిచే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మీరు ఈ క్రింది రిపోజిటరీలలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది:
ఆన్ లైన్
ఆన్‌లైన్ లో పాలసీ కొనుగోలు చేసే సమయములో, ఇండియాఫస్ట్ లైఫ్ వెబ్‌సైట్ పై బీమా ప్రతిపాదన ఫారమును నింపేటప్పుడు, ఒక eIA ఖాతా తెరిచే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మీరు ఈ క్రింది రిపోజిటరీలలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
- ఎన్.ఎస్.డి.ఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్.
- సి.ఐ.ఆర్.ఎల్ సెంట్రల్ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
- కార్వీ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
- సి.ఎ.ఎం.ఎస్ రిపోజిటరీ & సర్వీసెస్ లిమిటెడ్.
ఒక eIA తెరవడానికి, మీ పాన్ నంబరు లేదా ఆధార్ కార్డు నంబరు, చెల్లుబాటయ్యే ఒక ఇమెయిల్ ఐడి మరియు సంప్రదింపు నంబరును ఇవ్వడం తప్పనిసరి.
ఇండియాఫస్ట్ లైఫ్ సంబంధిత రిపోజిటరీతో మీ వివరాలు మరియు పత్రాలను పంచుకుంటుంది. ఆ తదుపరి, రిపోజిటరీ ఒక eIA తెరుస్తారు మరియు మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబరుపై మీ eIA నంబరు, లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ ని మీకు ఇమెయిల్ మరియు SMS ద్వారా పంపిస్తారు. మా రికార్డులలో దానిని అప్‌డేట్ చేసుకోవడానికి గాను రిపోజిటరీ మీ eIA నంబరును ఇండియాఫస్ట్ లైఫ్ కు కూడా పంపిస్తారు. మీ eIA జారీ చేయబడిన అనంతరం మీ పాలసీ eIA కి ఇ-జమ చేయబడుతుంది.
ఒకవేళ మీకు ఇదివరకే ఒక eIA ఖాతా ఉన్నట్లయితే, ప్రతిపాదన ఫారము నింపేటప్పుడు దయచేసి eIA ఖాతా నంబరు మరియు రిపోజిటరీ పేరును కనబరచండి. రిపోజిటరీ నుండి మదింపు చేయబడి నిర్ధారించబడిన తర్వాత, మీ పాలసీ eIA ఖాతాకు అనుసంధానం చేయబడుతుంది.
ఒకవేళ మీరు ఇదివరకే ఒక ప్రస్తుత పాలసీదారుగా ఉండి, ఒక eIA ఖాతా తెరవాలని ఆసక్తితో ఉంటే, ఈ క్రింది దశలను పాటించడం ద్వారా మీరు అలా చేయవచ్చు:
మెయిల్/కొరియర్
- నుండి eIA ప్రారంభ ఫారమ్‌ను డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ -> ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ విభాగం. కింది రిపోజిటరీలలో దేనినైనా ఎంచుకోండి.
- భౌతిక eIA దరఖాస్తు ఫారమును నింపి, సంతకం చేయండి.
- మీ పాన్/ఆధార్ కార్డు యొక్క కాపీ, చిరునామా ఋజువు (చెల్లుబాటు అయ్యే చిరునామా ఋజువుల కొరకు అనుబంధం చూడండి) మరియు ఒక పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటుగా దానిని సమర్పించండి. ఫోటో యొక్క సైజు:35 x 45 మి.మీ (3.5 x 4.5 సెం.మీ).
- దయచేసి పత్రాలను మా కార్పొరేట్ కార్యాలయానికి పంపించండి:
సి.ఎఫ్.ఆర్ సపోర్ట్ టీము,
12వ మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్,
టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్),
ముంబై – 400063
ఇండియాఫస్ట్ లైఫ్ సంబంధిత రిపోజిటరీతో మీ వివరాలు మరియు పత్రాలను పంచుకుంటుంది. ఆ తదుపరి, రిపోజిటరీ ఒక eIA తెరుస్తారు. మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబరుపై మీ eIA నంబరు, లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ ని మీకు పంపిస్తారు. మా రికార్డులలో దానిని అప్‌డేట్ చేసుకోవడానికి గాను రిపోజిటరీ మీ eIA నంబరును ఇండియాఫస్ట్ లైఫ్ కు కూడా పంపిస్తారు. మీ eIA జారీ చేయబడిన అనంతరం మీ పాలసీ eIA కి ఇ-జమ చేయబడుతుంది.
విచ్చేయండి
- లో నడవండి ఇండియా ఫస్ట్ లైఫ్ బ్రాంచ్ మీకు దగ్గరగా లేదా eIA ఖాతాను తెరవడానికి ఈ క్రింది ఏదైనా బీమా రిపోజిటరీ బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించండి:
- ఎన్.ఎస్.డి.ఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్.
- సి.ఐ.ఆర్.ఎల్ సెంట్రల్ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
- కార్వీ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
- సి.ఎ.ఎం.ఎస్ రిపోజిటరీ & సర్వీసెస్ లిమిటెడ్.
- ఒక eIA దరఖాస్తు ఫారము కొరకు అభ్యర్థన
- eIA దరఖాస్తు ఫారమును నింపి, సంతకం చేయండి.
- మీ పాన్/ఆధార్ కార్డు యొక్క కాపీ, చిరునామా ఋజువు (చెల్లుబాటు అయ్యే చిరునామా ఋజువుల కొరకు అనుబంధం చూడండి) మరియు ఒక పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటుగా దానిని సమర్పించండి. ఫోటో యొక్క సైజు:35 x 45 మి.మీ (3.5 x 4.5 సెం.మీ).
- దయచేసి పత్రాలను మా కార్పొరేట్ కార్యాలయానికి పంపించండి:
సి.ఎఫ్.ఆర్ సపోర్ట్ టీము,
12వ మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్,
టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్),
ముంబై – 400063
ఆన్‌లైన్ – రిపోజిటరీల ద్వారా
ఒక eIA ఖాతా కొరకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఈ క్రింది బీమా రిపోజిటరీల వెబ్సైట్లలో దేనినైనా సందర్శించవచ్చు:
ఒక EIA ఖాతా తెరవడానికై స్వీకరించదగిన చిరునామా ఋజువుల కొరకు అనుబంధము.
మీరు ఈ క్రిందివాటిలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించవచ్చు:
- రేషన్ కార్డు
- పాస్ పోర్ట్
- ఆధార్ కార్డు
- వోటరు గుర్తింపు కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- జాతీయం చేయబడిన బ్యాంక్ పాస్‌బుక్ స్టేట్‌మెంట్ (6 నెలలకు మించిన పాతది కాదు)
- విద్యుత్తు బిల్లు యొక్క
- సరిచూసుకోబడిన కాపీలు (6 నెలలకు మించిన పాతవి కాదు)
- నివాస టెలిఫోన్ బిల్లులు (6 నెలలకు మించిన పాతవి కాదు)
- రిజిస్టర్ చేయబడిన అద్దె మరియు లైసెన్స్ ఒప్పందపత్రము