జీవిత బీమా అనగా ఏమిటి?
దాని సారాంశాన్ని చూస్తే, ఒక జీవిత బీమా పాలసీ అనేది జీవిత బీమా ప్రదాత మరియు ఒక పాలసీదారు మధ్య కుదుర్చుకోబడిన ఒక ఒప్పందము.
ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్ అనేది, వైవిధ్యమైన అసెట్ తరగతుల వ్యాప్తంగా ఏవేని ఇన్వెస్ట్‌మెంట్ రిస్కులను విస్తరింపజేయడానికి గాను విభిన్న ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలను ఉపయోగించే ప్రక్రియ. ఈక్విటీ అసెట్ అలొకేషన్, డెట్ అసెట్ అలొకేషన్, లేదా ఫిక్సెడ్ ఇన్‌కం అలొకేషన్ మరియు డబ్బు లేదా నగదు అలొకేషన్ తో సహా మదుపు చేసిన ఆస్తులను ఆధారంగా చేసుకొని అసెట్ అలొకేషన్ వ్యూహాలను విభిన్న రకాలుగా విభాగీకరించవచ్చు.
మీరు ఒక అసెట్ అలొకేషన్ క్యాలికులేటరును ఉపయోగించి ఇన్వెస్ట్‌మెంట్ అలొకేషన్‌ని లెక్కించేటప్పుడు, మీరు కమోడిటీ ఇన్వెస్ట్‌మెంట్లు, ఆర్ట్ కొనుగోళ్ళు, మరియు స్థిరాస్థి వ్యాపారం వంటి ప్రత్యామ్నాయ ఆస్తులను కూడా పరిగణన లోనికి తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక అసెట్ అలొకేషన్ క్యాలికులేటరును ఉపయోగించి అసెట్ అలొకేషన్‌ని లెక్కించేటప్పుడు, ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్ నిర్వహణ చేయడానికి ఒక నిర్ధారిత మార్గం అంటూ లేదని జ్ఞాపకం ఉంచుకోవడం ముఖ్యము. మీ వయస్సు, లక్ష్యాలు మరియు రిస్క్ వాంఛతో సహా అనేకమైన అంశాలను ఆధారంగా చేసుకొని మీకు అత్యుత్తమమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికి ఆర్థిక సలహాదారులు మీకు సహాయపడవచ్చు.
ఈ వ్యూహములో మీ వయస్సుపై ఆధారపడి ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్ చేయబడుతుంది. ఈ వ్యూహముతో అసెట్ అలొకేషన్‌ని లెక్కించడం అనేది మదుపరి యొక్క జీవిత ఆయుర్దాయ ఆకాంక్షపై తీసుకునే ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాల ఆధారంగా ఉంటుంది. ఈ వ్యూహములో స్టాక్ అలొకేషన్ అనేది, ప్రాథమిక విలువ అయిన 100 నుండి మదుపరి యొక్క వయస్సును తీసివేయగా వచ్చిన సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అత్యధిక జీవిత ఆయుర్దాయ ఆకాంక్ష అనేది ముప్పుతో కూడిన స్వంతదారు ఈక్విటీ లెక్కింపుకు సమానము.
ఈ వ్యూహము, రాబడుల యొక్క లక్ష్యిత తేదీ ప్రాతిపదికన పని చేస్తుంది. ఈ వ్యూహముతో అసెట్ అలొకేషన్‌ని లెక్కించడం అనేది, మూడు అంశాలు - రిస్క్ వాంఛ, వయస్సు, మరియు ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను మనసులో ఉంచుకొని ఒక వ్యక్తి యొక్క ROI ని గరిష్టపరచడం ఇమిడి ఉంటుంది.
ఇతర ప్రముఖమైన ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్ వ్యూహాలలో ఇవి చేరి ఉంటాయి:
స్థిరమైన వెయిట్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్
ఉపాయముతో కూడిన ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్
బీమా చేయబడిన ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్
క్రియాశీలకమైన ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్
దాని సారాంశాన్ని చూస్తే, ఒక జీవిత బీమా పాలసీ అనేది జీవిత బీమా ప్రదాత మరియు ఒక పాలసీదారు మధ్య కుదుర్చుకోబడిన ఒక ఒప్పందము.
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క అసెట్ అలొకేషన్ క్యాలికులేటరును ఉపయోగించి అసెట్ అలొకేషన్‌ని లెక్కింపు చేయడమనేది అతి సులువైన పద్ధతి. ఉపయోగించడానికి-సులభమైన ఈ సాధనం, మొత్తం అసెట్‌లను లెక్కింపు చేయడానికి, మీ ఎంపిక యొక్క వ్యూహాన్ని వర్తింపజేయడానికి, మరియు మీకు అనుకూలమైన ఫండ్స్ అసెట్ అలొకేషన్ తో నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఒక మంచి అసెట్ అలొకేషన్ క్యాలికులేటర్ అనేది, లక్ష్యాలు, రిస్క్ తట్టుకునే శక్తి మరియు ఇన్వెస్ట్‌మెంట్ ఉత్పన్నమును అంశాలుగా తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్ నుండి ఊహాత్మకమైన పని చేస్తుంది.
మీరు భారీగా ఈక్విటీ అలొకేషన్ లేదా డెట్ ఫండ్స్ అసెట్ క్యాలికులేషన్ లో పెట్టుబడి చేసే ముందుగా, అసెట్ అలొకేషన్ కోసం ఈ సాధారణ సూత్రాన్ని మనసులో ఉంచుకోండి—మీ వయస్సు పెరిగే కొద్దీ మీ రిస్క్ ఎక్స్-పోజర్ తగ్గవలసి ఉంటుంది. మీరు వయస్సు పెరిగే కొద్దీ మీ ఈక్విటీ కేటాయింపు తగ్గుకుంటూ రావాల్సి ఉంటుంది. ఈక్విటీ కేటాయింపు అనేది ప్రజాదరణ గల వ్యూహము, ఎందుకంటే, అధిక రాబడులను అందించే ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు చేయడానికి అది మీకు వీలు కలిగిస్తుంది. అయినప్పటికీ, అది కూడా అధిక ముప్పును కలుగజేస్తుంది. అసెట్ అలొకేషన్ కొరకు సాధారణ నియమం ఏమిటంటే, మీ ప్రస్తుత వయస్సును 100 నుండి తీసివేయడం. ఉదాహరణకు, ఒక 25 ఏళ్ళ మదుపరి ఈక్విటీలో 75% నిధుల్ని మదుపు చేయవచ్చు, కాగా 35 ఏళ్ళ వ్యక్తి అధిక ముప్పు గల ఈక్విటీలలో 65% కంటే ఎక్కువ మదుపు చేయకూడదు.
అత్యుత్తమమైనదిగా పరిగణించగలిగిన అసెట్ అలొకేషన్ వ్యూహము ఏదియునూ లేదు. అనేక అంశాలను మనసులో ఉంచుకొని అసెట్ అలొకేషన్ వ్యూహాలు రూపొందించబడ్డాయి. మీ వయస్సు, రిస్క్ వాంఛ, ఆదాయము, రాబడి, మరియు ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి మీకు అత్యుత్తమైన అసెట్ అలొకేషన్ వ్యూహము ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. మీ అవసరాల కొరకు అత్యుత్తమ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అలొకేషన్ కనుక్కోవడానికి ఒక అసెట్ అలొకేషన్ క్యాలికులేటర్ ఉపయోగించండి.
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీరు మదుపు చేసినప్పుడు, ప్రతీ ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయంతోనూ ఎంతో కొంత మొత్తం ముప్పు ముడిపడి ఉంటుంది. రాబడులతో ముప్పును సమతుల్యం చేసుకోవడానికి అసెట్ అలొకేషన్ అనేది ముఖ్యము. మీ అవసరాలకు అనుకూలమైనట్టి సమతుల్యమైన ఆర్థికపరమైన పోర్ట్‌ఫోలియో ఏర్పరచుకోవడానికై ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క అసెట్ అలొకేషన్ క్యాలికులేటరును ఉపయోగించి ఇన్వెస్ట్‌మెంట్ అలొకేషన్‌ని లెక్కించండి.
మీరు మీ అసెట్‌లను ఎలా కేటాయింపు చేయవలసి ఉంటుందో కచ్చితంగా అర్థం చేసుకోవడానికి గాను వయస్సు, రిస్క్ తట్టుకునే శక్తి, లక్ష్యాలు మరియు సమయ ఉత్పన్నమును అంశాలుగా తీసుకొని టోటల్ అసెట్‌లను లెక్కించండి. అసెట్ రకాల వ్యాప్తంగా మీ పెట్టుబడులను విస్తృతపరచడానికి మరియు సాధ్యమైనంత వరకూ మార్కెట్ మార్పులపై మీ డబ్బును సురక్షితపరచుకోవడానికి అసెట్ అలొకేషన్ క్యాలికులేటర్ లేదా అసెట్ అలొకేషన్ సాధనాన్ని వాడండి.
అసెట్ అలొకేషన్ విషయానికి వచ్చినప్పుడు, మీరు ఉపయోగించుకోగలిగిన వ్యూహాలు అనేకం ఉన్నాయి. ఇందులో స్టాక్ కేటాయింపు, ఈక్విటీ కేటాయింపు, డెట్ ఫండ్స్ అసెట్ కేటాయింపు, ఉపాయముతో కూడిన కేటాయింపు, ఇంకా ఎన్నో చేరి ఉంటాయి. ఒక అసెట్ అలొకేషన్ వ్యూహమును రూపొందించుకోవడానికి మీకు మీ వయస్సును అంశంగా చేసుకోవడం, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు, సమయ ఉత్పన్నం మరియు ముప్పును భరించగలగడం అవసరమై ఉంటాయి. సాధ్యమైనంత చక్కని రీతిలో ఈ నిర్ణయాలు చేయడానికి ఒక అసెట్ అలొకేషన్ క్యాలికులేటర్ మీకు సహాయపడగలుగుతుంది.
ఒక కీలకమైన అసెట్ అలొకేషన్ వ్యూహము ఏమిటంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్లను విభజించి, సాధ్యమైనంత వరకూ మార్కెట్-అనుసంధానిత ముప్పులను తగ్గించుకోగలిగేలా వాటిని వైవిధ్యమయమైన అసెట్ తరగతుల వ్యాప్తంగా విస్తరింపజేయడానికి మీకు వీలు కలిగించే ఒక వ్యూహము. కీలకమైన ఇన్వెస్ట్‌మెంట్ ముప్పుల నుండి మిమ్మల్ని రక్షించగల ఒక సమతుల్యమైన మిశ్రమాన్ని పొందడానికి ఒక ఇన్వెస్ట్‌మెంట్ అలొకేషన్ క్యాలికులేటర్ మీకు సహాయపడగలుగుతుంది.