భద్రత & వారసత్వం
ఇండియాఫస్ట్ లైఫ్ బిజినెస్ లో దిగ్గజాలచే ప్రోత్సహించబడినది: బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది, దేశములో ఒక గొప్ప వారసత్వముగా గర్వంగా చెప్పుకునే కొన్ని బ్రాండ్లలో మమ్మల్ని ఒకటిగా చేస్తోంది. మేము, స్థిరత్వము, జవాబుదారీతనము మరియు కస్టమర్ కేంద్రిత విధానమును నిర్ధారించే సి.ఎ.జి ఆడిట్ విస్తృతి క్రింద ఒక బోర్డుచే నడుపబడుతున్న కంపెనీగా ఉన్నాము. ఇది, మా ఉద్యోగి ప్రయోజనాల ప్లానుల క్రింద రిటైర్మెంట్ నిధులను నిర్వహించుకొనుట కొరకు మమ్మల్ని ప్రాధాన్యత గల ఎంపికగా కూడా చేస్తుంది.
పారదర్శకత
మా క్లయింట్లతో ఒక సంపూర్ణమైన పారదర్శకతను నిర్వహించుకొనుటకు గాను, మేము క్రమం తప్పని అంతరములో మా పెట్టుబడి విభాగమును ప్రకటిస్తూ ఉంటాము.మేము రిటైర్మెంట్ నిధులపై యాజమాన్య చర్చలు మరియు ఒక సలహా మండలి ద్వారా ఒక గ్రాహ్యతా పూర్వక సమాచారమును కూడా అందిస్తుంటాము. వ్యవస్థలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడానికి గాను మా ప్రక్రియలు చక్కగా నిర్వచించబడి ఉంటాయి మరియు క్రమం తప్పకుండా తనిఖీ చేయబడుతుంటాయి.
పెట్టుబడి పనితీరు
ఇండియా ఫస్ట్ లైఫ్ ఒక మదుపరి కేంద్రిత విధానముతో ముందుకు నడుపబడుతోంది మరియు బోర్డుచే పరిపాలించబడే ఒక సంస్థాగత పాలసీని కలిగియుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ కమిటీచే కూడా పర్యవేక్షించబడుతుంది మరియు ఐ.ఆర్.డి.ఎ.ఐ చే నియంత్రించబడుతోంది. మా పెట్టుబడులు ప్రావీణ్యులైన ఫండ్ మేనేజర్లచే నిర్వహణ చేయబడుతున్నాయి, వారు పెట్టుబడులను జాగ్రత్తగా ఎంచుకుంటారు, పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు మరియు అవసరమైనప్పుడల్లా సరిపరచు చర్యలు తీసుకుంటారు. ఈ చట్రము కట్టుదిట్టంగా పర్యవేక్షించబడుతుంది మరియు సి.ఇ.ఓ, సి.ఎఫ్.ఓ, సి.ఐ.ఓ & నియమించబడిన బీమా గణికుడితో కూడిన మొత్తం బృందముచే అజమాయిషీ చేయబడుతుంది.
క్లయింట్ సరళి
భారతదేశములోని కొన్ని అతిపెద్ద సంస్థల కొరకు మేము భారీ నిధులను మరియు సంరక్షణ కార్యకలాపాలను నిర్వహణ చేస్తాము. ఆకర్షణీయమైన శ్లాబులతో జత కలిసిన మా సర్వశ్రేష్టమైన నిధి నిర్వహణ తీరు మా క్లయింట్లు మాతోనే పెట్టుబడి చేయడం కొనసాగించేలా చేస్తుంది.
ఘనతలు
మా అధిక సాల్వెన్సీ మార్జిన్, సర్వోన్నతమైన సాంకేతిక పరిజ్ఞాన సక్రియతలు మరియు తక్కువ ఖర్చు నిష్పత్తి మాకు ఒక విశిష్టమైన స్పర్ధాత్మక ప్రయోజనాన్నిచ్చాయి.