గ్రూప్ రిటైర్‌మెంట్ మరియు ఫండ్ ఆధారిత ప్లాన్‌లు

ఎందుకంటే సంతోషంగా ఉన్న వ్యక్తులు సంతోషంగా ఉండే చోటును ఏర్పరుస్తారు

మీ ఉద్యోగుల కొరకు గ్రాట్యుటీ, సూపర్‌యాన్యువేషన్, మరియు శెలవును నగదుగా మార్చుకోవడం వంటి రిటైర్‌మెంట్ పరిష్కారాలను తీర్చుకోవడానికి మీకు సహాయపడే ఒక ప్లాను. అంతేకాకుండా, వారికి జీవిత వర్తింపు యొక్క అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

ఈ విభాగము క్రిందికి వచ్చే ఉత్పత్తులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఇండియాఫస్ట్ చే అందించబడే గ్రూప్ రిటైర్‌మెంట్ మరియు ఫండ్ ప్లానులను ఎందుకు ఎంచుకోవాలి?

 • చట్టబద్ధమైన మరియు రిటైర్‌మెంట్ ఆవశ్యకతలను తీరుస్తాయి

  ఈ ప్లానులో పెట్టుబడి చేయడం ద్వారా మీ ఉద్యోగుల పట్ల మీ కర్తవ్యాలను తీర్చుకోవడానికి నిధులు లభ్యతలో ఉండేలా చూసుకుంటుంది

 • పనివ్యవహారాలు మరియు నిధుల నిర్వహణ యొక్క సౌలభ్యత

  ఇండియాఫస్ట్ లైఫ్ మీ నిధులను అత్యంత సరళమైన మరియు పారదర్శకమైన తీరులో నిర్వహణ చేస్తుంది

 • ఉద్యోగులు/ గ్రూపు సభ్యులకు ఆర్థిక సుస్థిరత

  మీ ఉద్యోగులకు ఆర్థిక సుస్థిరత కల్పించడం ద్వారా వారు మెరుగైన పనితీరు కనబరచేలా ప్రేరణ కలిగించండి

 • మీ అవసరాల మేరకు పెట్టుబడి ఉత్పత్తులను ఎంచుకోండి

  మీ సంస్థాగత లక్ష్యాలపై ఆధారపడి, యూనిట్- అనుసంధానిత లేదా సాంప్రదాయక ప్లానుల మధ్య ఎంచుకోండి

 • పన్ను ప్రయోజనము

  ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము మీరు చెల్లించే ప్రీమియములు అదే విధంగా మీరు అందుకునే ప్రయోజనాలపై కూడా పన్ను ప్రయోజనాలు పొందండి.

పరిగణించవలసినకొన్ని అంశాలు పరిగణించవలసిన

 • యజమాని - ఉద్యోగి ప్రయోజనము

 • సమతుల్యతా చర్య

 • బీమా కంపెనీ యొక్క ట్రాక్ రికార్డును పరిశోధించండి

Know More

యజమాని - ఉద్యోగి ప్రయోజనము

గ్రాట్యుటీ, సూపర్‌యాన్యుయేషన్ మరియు శెలవును నగదుగా మార్చుకోవడం అనేవి మీ ఉద్యోగుల యొక్క మొత్తం పరిహారధనములో సింహభాగాన్ని ఆక్రమించుకుంటాయి మరియు దానికి క్రమం తప్పకుండా అందజేస్తూ ఉండటం ద్వారా, మీ సభ్యులను మీరు శ్రద్ధగా చూసుకునేట్లుగా నిర్ధారించుకుంటారు.

సమతుల్యతా చర్య

మీరు పన్ను రాయితీలను సంపాదించుకోవచ్చు మరియు మీ కంపెనీలో మంచి ఉద్యోగులను నిలిపి ఉంచుకోవచ్చు. మీ ఉద్యోగులు వారి సంపాదనలను పెంపొందించుకోవచ్చు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ఉభయ పక్షాలకూ గెలుపు-గెలుపు సందర్భముగా పనిచేస్తుంది.

బీమా కంపెనీ యొక్క ట్రాక్ రికార్డును పరిశోధించండి

ఒక గ్రూప్ ఉత్పత్తిలో పెట్టుబడి చేసే ముందుగా, పాలసీ యొక్క ప్రయోజనాలను మరియు ఈ అంశాలతో మార్కెట్ లో కంపెనీ యొక్క పనితీరును పరిశీలించి మరియు పోల్చి చూసుకోవడం ముఖ్యము.

FAQs