ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యుఎల్ సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్
ఒక సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్, రిటైర్‌మెంట్ తర్వాత సైతమూ మీ ఉద్యోగులకు ఆర్థిక స్వేచ్ఛ ఉండేలా చూసుకుంటుంది. సంస్థ అంటే ఏమిటో మరియు అది ఎలా ఉంటుందో ఉద్యోగులు చేసి చూపిస్తారు— వారు ప్రతి సంస్థకూ గుండె మరియు ఆత్మలాంటి వారు. ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యుఎల్ సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ తో, యజమానులు ఉద్యోగుల పట్ల తమ బాధ్యతను నెరవేర్చుకోవచ్చు మరియు వారికి అర్హత ఉన్న అత్యుత్తమ శ్రేణి రిటైర్‌మెంట్ ప్రయోజనాలను అందించవచ్చు. ఈ గ్రూప్ యూనిట్ అనుసంధానిత పెన్షన్ ప్లాన్ అనేది, మీ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ అనంతరం సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలను చెల్లించడానికి గాను మీరు ఒక ఆపత్కాల నిధిని ఏర్పాటు చేసుకోవడానికి సహాయపడేందుకు రూపొందించబడింది.
యూనిట్ అనుసంధానిత పెన్షన్ ప్లానులు యజమాని అదేవిధంగా ఉద్యోగుల అవసరాలను తీరుస్తాయి. ఉద్యోగులు తమ పట్ల శ్రద్ధ తీసుకుంటున్న ఒక కంపెనీ కొరకు కష్టపడి పని చేస్తున్న సంతృపికరమైన శ్రామికులుగా నిశ్చింతగా ఉండవచ్చు. ఉద్యోగులు తమ సంస్థ పట్ల నిజాయితీగా ఉన్నందుకు ఒక ప్రోత్సాహధనము పొందవచ్చు, మరియు తమకు బాగా అవసరం కలిగినప్పుడు సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలను తీసుకోవచ్చు.
మీకోసం మరియు మీకు ప్రియమైన వారికోసం ఆర్థిక భద్రతను భరోసా ఇచ్చే స్థితిలో లేకుండానే రిటైర్‌మెంట్ వయస్సుకు చేరుకోవడమనేది ఒక భయంకరమైన ఆలోచన. ఇండియాఫస్ట్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ తో, ఈ ఉద్దేశ్యము కొరకు మీరు ఏర్పరచుకున్న నిధుల సముదాయము నుండి వారికి రిటైర్ సంబంధిత ప్రయోజనాల చెల్లింపుతో వారి అవసరాలకు ఆదుకోవడం ద్వారా మీరు మీ ఉద్యోగుల మనసుల్లో నుంచి ఈ భయాలన్నింటినీ పారద్రోలవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యుఎల్ సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్ అంటే ఏమిటి?
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ అనేది ప్రతి సంవత్సరమూ నవీకరించుకోదగిన, సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాల వంటి రిటైర్ సంబంధిత అవసరాలను తీర్చడానికి సహాయపడే గ్రూప్ యూనిట్-అనుసంధానిత పెన్షన్ ప్లాన్. ఈ గ్రూప్ యూనిట్ అనుసంధానిత పెన్షన్ ప్లాన్ క్రింద, యజమానులు వారి ఉద్యోగుల పెన్షన్ అవసరాలకు నిధులు అందించడానికై ఒక ఆపత్కాల నిధిని ఏర్పాటు చేసుకోవడానికి వారికి అనువైన మరియు చౌకైన మార్గం ఉంటుంది.
సూపర్ యాన్యుయేషన్ (వృద్ధాప్యదశ)
‘సూపర్ యాన్యుయేట్’ చేయడమనేది నిస్సహాయత (దౌర్బల్యం) లేదా ముందస్తు - నిర్ధారిత వయస్సుకు చేరుకున్న కారణంగా రిటైర్ కావడం. ఒక ఉద్యోగి తనకు తాను మదుపు చేసుకోవడానికి ఎంచుకునే ఒక పెన్షన్ ప్లాన్ వలె కాకుండా, ఒక సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ అనేది ఒక యజమాని తన ఉద్యోగులకు ఒక సర్వీస్ ప్రయోజనంగా లేదా రిటైర్‌మెంట్ ప్రయోజనంగా అందించే ఒక కంపెనీ పెన్షన్ ప్లాన్ గా ఉంటుంది. కంపెనీ యొక్క ఉద్యోగుల బాగు కొరకు యజమాని రూపొందించే ఒక సంస్థ పెన్షన్ ప్లాన్ ద్వారా సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలు అందించబడతాయి.
లింక్ చేయబడిన
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ అనేది, సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలను అందించే ఒక మార్కెట్ - అనుసంధానిత ప్లాను. ఒక యూనిట్-అనుసంధానిత ప్లాను, కూడగట్టుకున్న నిధులను క్యాపిటల్ మార్కెట్ లో పెట్టుబడి చేస్తుంది. ప్లానుపై ఆధారపడి, ఈ నిధులను ఈక్విటీ సాధనాలు, పరపతి, లేదా ఈ రెండింటి సమ్మేళనంలో మదుపు చేయవచ్చు.
గ్రూప్ పెన్షన్ ప్లాన్
ఒక గ్రూప్ ప్లానులో, యజమాని మాస్టర్ పాలసీదారుగా ఉంటారు, మరియు ఉద్యోగులు గ్రూపు సభ్యులుగా లేదా పాలసీ యొక్క లబ్దిదారులుగా ఉంటారు. గ్రూప్ ప్లానులు అన్నీ ఒక ఏకైక ఒప్పందం క్రింద వర్తింపజేయబడతాయి కాబట్టి, అవి బోర్డు వ్యాప్తంగా సభ్యులందరికీ ప్రామాణికం చేయబడిన ప్రయోజనాలను అందిస్తాయి. ఒక గ్రూప్ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ తో, యజమాని ఉద్యోగులందరికీ సంవత్సరం తర్వాత సంవత్సరం నవీకరించబడే ఒక ఏకైక ప్లాను ద్వారా సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలను అందిస్తారు. అవసరాన్ని బట్టి కొత్త ఉద్యోగులను కూడా గ్రూపుకు చేర్చుకోవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ అనేది, ఫండ్-ఆధారిత గ్రూప్ సూపర్ యాన్యుయేషన్ ఉత్పాదన. ఇది, యజమాని-ఉద్యోగుల గ్రూపులకు పథకం నియమ నిబంధనల ప్రకారము సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలను కవర్ చేస్తుంది. మాస్టర్ పాలసీదారుగా యజమాని లేదా యజమానిచే నెలకొల్పబడిన ట్రస్టు ఉంటుంది, అది పథకం నియమ నిబంధనల ప్రకారము సూపర్ యాన్యుయేషన్ ప్రయోజన ఆవశ్యకతలను తీర్చడానికి నిధుల నిర్వహణ చేస్తుంది. ఒక ట్రస్టీగా మీరు మీ మదుపు రాబడులను గరిష్టం చేసుకోవడానికి మరియు మీ ఉద్యోగుల పట్ల మీ కర్తవ్యబాధ్యతలను చౌకగా మరియు చక్కగా నెరవేర్చడానికి ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ మీకు వీలు కలిగిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ యొక్క కీలక ముఖ్యాంశాలు ఏవేవి?
మాస్టర్ పాలసీదారుగా, మీ కొరకు:
- మీరు మీ సభ్యులందరికీ రిటైర్‌మెంట్ ప్రయోజనం వర్తించేలా ఎంచుకోవచ్చు.
- మీరు మీ సభ్యుల తరఫున మొత్తం కాంట్రిబ్యూషన్ చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు, లేదా దానిని మీరు మరియు మీ సభ్యులు ఇద్దరూ చెల్లించవచ్చు
- విభిన్న అసెట్ శ్రేణుల వ్యాప్తంగా 3 నిధులను ఎంచుకోవడం ద్వారా లేదా 3 మదుపు వ్యూహాలలో దేనినైనా ఎంపిక చేసుకోవడం ద్వారా మీరు మీ మదుపు రాబడులను అనుకూలం చేసుకోవచ్చు
మీ సభ్యులు:
- వారి రిటైర్‌మెంట్ ని సురక్షితం చేయడానికి ఒక అవకాశం పొందండి
- పాలసీ క్రింద అందుబాటులో ఉన్న వివిధ రకాల ఫండ్స్/పెట్టుబడి వ్యూహాలలో మదుపు చేయబడేట్లుగా చూస్తూ వారి డబ్బు పెరిగేలా చూసుకోండి
- పాలసీలోని విడివిడి సభ్యుల స్థాయి ఖాతాల ఆప్షనుతో వారి మదుపులను ట్రాక్ చేయండి
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ కొరకు ఆవశ్యక అర్హతా ప్రాతిపదిక ఈ క్రింది విధంగా ఉంటుంది:
- ఈ గ్రూప్ యూనిట్ అనుసంధానిత పెన్షన్ ప్లాన్ క్రింద ప్రవేశించునాటికి కనీస వయస్సు మీ గత పుట్టినరోజు నాటికి 18 సంవత్సరాలు.
- ఈ గ్రూప్ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ క్రింద ప్రవేశించునాటికి గరిష్ట వయస్సు మీ గత పుట్టినరోజు నాటికి 70 సంవత్సరాలు.
- ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ క్రింద నిష్క్రమణనాటికి గరిష్ట వయస్సు మీ గత పుట్టినరోజు నాటికి 71 సంవత్సరాలు.
- ఒకవేళ మాస్టర్ పాలసీదారుచే మాత్రమే చెల్లించబడుతున్నట్లయితే, ప్రీమియం చెల్లించే రూపం వార్షికం. అయినప్పటికీ, ఒకవేళ జీవిత వర్తింపు ప్రీమియం గనక మాస్టర్ పాలసీదారు మరియు సభ్యులచే విడివిడిగా చెల్లించబడుతున్నట్లయితే, దానిని వార్షికంగా, అర్ధ-సంవత్సరం వారీగా, మూడునెలల వారీగా లేదా నెలవారీగా చెల్లించవచ్చు.
- ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ క్రింద కనీస తొలి కాంట్రిబ్యూషన్ ఒక్కో పాలసీకి రు. 1,00,000 ఉంటుంది. గరిష్ట కాంట్రిబ్యూషన్ పై ఎటువంటి పరిమితీ లేదు.
- ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్, యజమాని-ఉద్యోగి గ్రూపులను మాత్రమే కవర్ చేస్తుంది. కనీస గ్రూపు సైజు 10 మంది సభ్యులు; గరిష్ట గ్రూపు సైజు పరిమితి ఏదీ లేదు.
- ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ క్రింద, డబ్బు చెల్లించే వ్యక్తి మాస్టర్ పాలసీదారు, సభ్యుడు లేదా ఉభయులూ.
- ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ క్రింద ప్లాన్ అవధి, మాస్టర్ పాలసీదారుచే వార్షికంగా నవీకరించబడే ప్రాతిపదికన 1 సంవత్సరంగా ఉంటుంది.
- ఒకవేళ ఎంచుకున్నట్లయితే, మరణం మీద భరోసా సొమ్ము రు. 5,000 లు, ఒక్కో సభ్యుడికి ఉంటుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ ను మీరు కొనవలసిన అవసరం ఎందుకు ఉంది?
మీ సభ్యుల ఉద్యోగకాలములో వారి పెన్షన్ ప్రయోజనం కోసం మీరు ప్రక్కన ఉంచిన నిధులను మార్కెట్-అనుసంధానిత మదుపుల లోనికి పెట్టుబడి చేయడానికి ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యుఎల్ సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్ మీకు సహాయపడుతుంది. ఈ ప్లానుతో, మీరు ఇప్పుడు, మీ సభ్యులు తమ మిగిలిన జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో ఆనందించేలా చూసుకోవచ్చు.
- ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్, మీ ఉద్యోగుల కొరకు విడిగా ఒక ఆపత్కాల నిధిని ఏర్పరచడానికి మీకు వీలు కలిగిస్తుంది.
- రిటైర్‌మెంట్ చెల్లింపుల పరిమాణముపై మీరు మీ వర్కింగ్ క్యాపిటల్ ని పరిరక్షించుకుంటారు.
- మీరు ఒక పారదర్శకమైన మరియు డబ్బుకు-తగిన విలువ గల ప్లాను ద్వారా సూపర్ యాన్యుయేషన్ వంటి ఉద్యోగి భవిష్య రిటైర్ సంబంధిత ప్రయోజనాలను నిర్వహణ చేసుకోవచ్చు.
- పాలసీ క్రింద అందుబాటులో ఉన్న వివిధ రకాల ఫండ్స్/పెట్టుబడి వ్యూహాలలో మదుపు చేయబడేట్లుగా చూస్తూ వాస్తవంగా డబ్బు పెరగడాన్ని మీ సభ్యులు చూడగలుగుతారు.
- విభిన్న అసెట్ శ్రేణుల వ్యాప్తంగా 3 నిధులను ఎంచుకోవడం ద్వారా లేదా 3 మదుపు వ్యూహాలలో దేనినైనా ఎంపిక చేసుకోవడం ద్వారా మీరు మీ మదుపు రాబడులను అనుకూలం చేసుకోగలుగుతారు.
- సభ్యులు పాలసీలోని విడివిడి సభ్యుల - స్థాయి ఖాతాల ఆప్షనుతో వారి మదుపులను ట్రాక్ చేసుకోవచ్చు.
- మీరు మీ సభ్యుల తరఫున మొత్తం కాంట్రిబ్యూషన్ చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు, లేదా దానిని మీరు మరియు మీ సభ్యులు ఇద్దరూ చెల్లించవచ్చు ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 36 (1) (IV) క్రింద మీ కాంట్రిబ్యూషన్ మినహాయించుకోదగిన వ్యాపార ఖర్చుగా ఉంటుంది. సూపర్‌యాన్యుయేషన్ కోసం మీ సభ్యుడు (ల) చే చేయబడిన ఏదైనా కాంట్రిబ్యూషన్ ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 80 (C) క్రింద మినహాయింపుకు అర్హత పొందుతుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ కొనడం యొక్క ప్రయోజనాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ క్రింద, యజమాని మరియు ఉద్యోగులు ఉభయులూ ప్రయోజనాలను అందుకునే అర్హత కలిగి ఉంటారు. యజమానులు తమ ఉద్యోగుల పట్ల, ఉద్యోగి యొక్క రిటైర్‌మెంట్ సమయములో కొన్ని నిర్దిష్ట బాధ్యతలకు బాధ్యులుగా ఉంటారు. ఈ గ్రూప్ యూనిట్-అనుసంధానిత పెన్షన్ ప్లాన్ క్రింద ఉద్యోగులకు సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలను అందించడం ద్వారా, కంపెనీ తన బాధ్యతలను నిర్వర్తించవచ్చు మరియు రిటైర్‌మెంట్ తర్వాత సైతమూ తన ఉద్యోగుల ఆర్థిక భద్రత దిశగా ఒక అడుగు ముందుకు వేయవచ్చు.
సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాల కొరకు పథకాలు
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ లో, సభ్యుడి యొక్క నిష్క్రమణ లేదా రిటైర్‌మెంట్ లేదా మరణం సమయములో కూడగట్టుకున్న నిధులను ఎలా ఉపయోగించుకోవాలో మాస్టర్ పాలసీదారు నిర్ణయిస్తారు. ఎంచుకోవడానికి గాను పథకపు ఐచ్ఛికాలు రెండు ఉన్నాయి. జారీ చేయబడే యూనిట్ అనుసంధానిత పెన్షన్ ప్లానులు ఒక్కో పథకానికీ వేర్వేరుగా ఉంటాయి.
పేర్కొనబడిన కాంట్రిబ్యూషన్ పథకం సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలు
పేర్కొనబడిన ఒక కాంట్రిబ్యూషన్ పథకంలో, సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ దిశగా చేయబడే కాంట్రిబ్యూషన్ నిర్ధారితం మరియు ముందస్తుగా పేర్కొనబడి ఉంటుంది. ఈ పథకం క్రింద అందుకోబడే సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలు నేరుగా మార్కెట్ షరతులు మరియు చేసిన కాంట్రిబ్యూషన్లతో సహ-సంబంధితమై ఉంటాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ యొక్క పేర్కొనబడిన కాంట్రిబ్యూషన్ (డిసి) పథకం క్రింద, సభ్యుల కొరకు వ్యక్తిగత ఖాతాలు నిర్వహించబడతాయి. మాస్టర్ పాలసీదారు, ఉద్యోగులు/సభ్యులు, లేదా ఉభయులూ, పథక నియమ నిబంధనల మేరకు ఆవశ్యకమైన కాంట్రిబ్యూషన్లు చేయవచ్చు. పథక నియమ నిబంధనలు సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాల చెల్లింపు మొత్తమును మరియు సభ్యుడికి ప్రయోజన చెల్లింపు సమయాన్నీ పేర్కొంటాయి. నిధుల లభ్యతకు లోబడి, సభ్యుడి/పాలసీదారు యొక్క సూపర్ యాన్యుయేషన్ నిధి యొక్క సంబంధిత యూనిట్ నిధిలో మదుపు చేయబడిన నిధుల నుండి ప్రయోజనాలు చెల్లించబడతాయి.
మరణ ప్రయోజనం
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ యొక్క డిసి పథకం క్రింద మరణ ప్రయోజనం, వ్యక్తిగత సభ్యుడి యొక్క పాలసీ యూనిట్ నిధి విలువ (సంబంధిత సభ్యుడి యొక్క సూపర్ యాన్యుయేషన్ నిధి యొక్క సంబంధిత యూనిట్ నిధిలోని నిధుల లభ్యతకు లోబడి) కు సమానము. ఒకవేళ ఎంచుకొని ఉంటే, ఒక్కో సభ్యుడికి రు. 5,000 ల అదనపు ప్రయోజనం చెల్లించబడుతుంది. ఒకసారి మరణ ప్రయోజనం చెల్లించబడిందంటే, సభ్యుడి యొక్క అన్ని ప్రయోజనాలూ రద్దవుతాయి.
హక్కునిచ్చే (వెస్టింగ్) ప్రయోజనం
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ యొక్క డిసి పథకం క్రింద వెస్టింగ్ ప్రయోజనం, వ్యక్తిగత సభ్యుడి యొక్క పాలసీ యూనిట్ నిధి విలువ (సంబంధిత సభ్యుడి యొక్క సూపర్ యాన్యుయేషన్ నిధి యొక్క సంబంధిత యూనిట్ నిధిలోని నిధుల లభ్యతకు లోబడి) కు సమానము. ఒకసారి వెస్టింగ్ ప్రయోజనం చెల్లించబడిందంటే, సభ్యుడి యొక్క అన్ని ప్రయోజనాలూ రద్దవుతాయి.
నిష్క్రమణ ప్రయోజనం
నిష్క్రమణ మీదట (ఉద్యోగము నుండి తీసివేయడం/ముందస్తుగా రిటైర్‌మెంట్ / రాజీనామా మొ.) సభ్యుడు వ్యక్తిగత సభ్యుడి యొక్క పాలసీ యూనిట్ నిధి విలువకు సమానమైన మొత్తమును అందుకునే అర్హత కలిగి ఉంటారు (సంబంధిత సభ్యుడి యొక్క సూపర్ యాన్యుయేషన్ నిధి యొక్క సంబంధిత యూనిట్ నిధిలోని నిధుల లభ్యతకు లోబడి). ఈ ప్రయోజనం చెల్లించబడిన మీదట, సభ్యుడి యొక్క అన్ని ప్రయోజనాలూ రద్దవుతాయి. పథక నియమాల ప్రకారము కాకుండా ఇతరత్రా నిష్క్రమణలకు, ఉపసంహరణలు అనుమతించబడవు. నిష్క్రమణ ఉదంతములో, అదనపు మరణ వర్తింపు, ఒకవేళ ఎంచుకొని ఉంటే, తక్షణమే రద్దు చేయబడుతుంది.
లాయల్టీ ప్రయోజనము
ప్రతి పాలసీ సంవత్సరం యొక్క ఆఖరులో, ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్, పాలసీ సంవత్సరములో రోజువారీ సగటు నిధి విలువ ప్రకారము సంవత్సరానికి ఒక శాతముగా వార్షిక లాయల్టీ ప్రయోజనమును (ఎల్‌బి) అందిస్తుంది. ఈ లాయల్టీ ప్రయోజనము, మదుపు చేయబడిన నిధుల సైజు మరియు రకముపై ఆధారపడి ఉంటుంది. పేర్కొనబడిన కాంట్రిబ్యూషన్ పథకాల కొరకు, మాస్టర్ పాలసీ స్థాయిలో రోజువారీ సగటు నిధి విలువ పరిగణించబడుతుంది. అదనపు యూనిట్లు ప్రో-రాటా ప్రాతిపదికన సభ్యుడి యూనిట్ నిధులకు జమ చేయబడతాయి.
పేర్కొనబడిన ప్రయోజన పథకం సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలు
పేర్కొనబడిన ఒక ప్రయోజన పథకంలో, ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ కు చేయబడిన కాంట్రిబ్యూషన్లతో సంబంధం లేకుండా సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలు ముందస్తుగా-నిర్ణయించబడి మరియు నిర్ధారితం అయి ఉంటాయి. ఈ ప్రయోజన మొత్తము, సంస్థలో ఉద్యోగి గడిపిన సంవత్సరాలు, గ్రూప్ యూనిట్ అనుసంధానిత పెన్షన్ ప్లాన్ లోనికి ఉద్యోగి చేర్చుకోబడిన నాటికి వయస్సు, జీతము, మొదలగు వంటి అసంఖ్యాక అంశాలను పరిగణించే మునుపు ఉన్న ఒక సూత్రము ద్వారా లెక్క చేయబడుతుంది. రిటైర్‌మెంట్ సమయములో, సభ్యుడు ఈ సూత్రము నుండి గ్రహించబడిన నిర్ధారిత మొత్తమును అందుకుంటారు.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ యొక్క పేర్కొనబడిన ప్రయోజన (డిబి) పథకం క్రింద, కేవలం ఒక సూపర్ యాన్యుయేషన్ నిధి మాత్రమే నిర్వహణ చేయబడుతుంది, మరియు వ్యక్తిగత సభ్యుల ఖాతాలు మద్దతు చేయబడవు. పథకం నియమ నిబంధనల ప్రకారము మాస్టర్ పాలసీదారు సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ కు కట్టుకుంటారు (కాంట్రిబ్యూట్ చేస్తారు). పథక నియమ నిబంధనలు ప్రయోజన చెల్లింపు మొత్తమును మరియు సభ్యుడికి ప్రయోజన చెల్లింపు సమయాన్నీ పేర్కొంటాయి. నిధుల లభ్యతకు లోబడి సంబంధిత గ్రూప్ పాలసీదారు యొక్క సూపర్ యాన్యుయేషన్ నిధి యొక్క సంబంధిత యూనిట్ నిధిలో మదుపు చేయబడిన నిధుల నుండి ప్రయోజనాలు చెల్లించబడతాయి.
మరణ ప్రయోజనం
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ యొక్క డిబి పథకం క్రింద మరణ ప్రయోజనం మాస్టర్ పాలసీదారు యొక్క పథక నియమాల ప్రకారము చెల్లించదగినదిగా ఉంటుంది. ఒకవేళ ఎంచుకొని ఉంటే, ఒక్కో సభ్యుడికి రు. 5,000 వంతున నామినీకి అప్పగించబడుతుంది.
హక్కునిచ్చే (వెస్టింగ్) ప్రయోజనం
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ యొక్క డిసి పథకం క్రింద వెస్టింగ్ ప్రయోజనం, మాస్టర్ పాలసీదారు యొక్క పథక నియమాల మేరకు చెల్లించదగినదిగా ఉంటుంది (సంబంధిత గ్రూపు పాలసీదారు యొక్క సూపర్ యాన్యుయేషన్ నిధి యొక్క సంబంధిత యూనిట్ నిధిలోని నిధుల లభ్యతకు లోబడి).
నిష్క్రమణ ప్రయోజనం
నిష్క్రమణ మీదట (ఉద్యోగము నుండి తీసివేయడం/ముందస్తుగా రిటైర్‌మెంట్ / రాజీనామా మొ.) సభ్యుడు, మాస్టర్ పాలసీదారు యొక్క పథక నియమాల మేరకు పాలసీ యూనిట్ నిధి నుండి ఒక ఏకమొత్తం సొమ్ము ప్రయోజనాన్ని అందుకునే అర్హత కలిగి ఉంటారు (సంబంధిత గ్రూపు పాలసీదారు యొక్క సూపర్ యాన్యుయేషన్ నిధి యొక్క సంబంధిత యూనిట్ నిధిలోని నిధుల లభ్యతకు లోబడి). పథక నియమాల ప్రకారము కాకుండా ఇతరత్రా నిష్క్రమణలకు, ఉపసంహరణలు అనుమతించబడవు.
లాయల్టీ ప్రయోజనము
ప్రతి పాలసీ సంవత్సరం యొక్క ఆఖరులో, ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్, సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ సంవత్సరములో రోజువారీ సగటు నిధి విలువ యొక్క ఒక శాతముగా సంవత్సరానికి వార్షిక లాయల్టీ ప్రయోజనమును (ఎల్‌బి) అందిస్తుంది. ఈ లాయల్టీ ప్రయోజనము, మదుపు చేయబడిన నిధుల సైజు మరియు రకముపై ఆధారపడి ఉంటుంది.
ఫండ్ ఆప్షన్లు
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ తో, మీ అవసరాలకు తగ్గట్టుగా అనుకూలం చేయబడిన పాలసీ నుండి వచ్చే సూపర్ యాన్యుయేషన్ ప్రయోజనాలను మీరు ఆనందిస్తారు. ఒక యూనిట్-అనుసంధానిత పాలసీలో, మీ రాబడుల ఆకాంక్షలు మరియు రిస్క్ ప్రొఫైల్ పై ఆధారపడి, మీ డబ్బును ఏ ఫండ్స్ లో మదుపు చేయాలనుకుంటారో ఎంచుకుంటారు.
- గ్రూపు ఎదుగుదల ప్రయోజనావకాశ నిధి, ఆస్తులలో 80-100% ఈక్విటీకి మరియు 0-20% మనీ మార్కెట్ కీ కేటాయిస్తుంది. ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ ఫండ్, మధ్యస్థం నుండి దీర్ఘావధి ప్రాతిపదికన మధ్యస్థం నుండి అధిక మదుపు రిస్క్ తో అధిక రాబడులను అందజేస్తుంది.
- గ్రూపు క్యాపిటల్ నిధి, ఆస్తులలో 70-100% డెబిట్ సెక్యూరిటీలు మరియు బాండ్లకు మరియు 0-30% మనీ మార్కెట్ కీ కేటాయిస్తుంది. ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ ఫండ్, మధ్యస్థం నుండి దీర్ఘావధి ప్రాతిపదికన మధ్యస్థ మదుపు రిస్క్ తో ఒక మోస్తరు రాబడులను అందజేస్తుంది.
- గ్రూపు మనీ మార్కెట్ ఫండ్, ఆస్తులలో 0-20% డెబిట్ సెక్యూరిటీలు మరియు బాండ్లకు మరియు 80-100% మనీ మార్కెట్ కీ కేటాయిస్తుంది. ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్ ఫండ్, చాలా తక్కువ పెట్టుబడి-రిస్కు మరియు అధిక లిక్విడిటీతో స్వల్పావధి ప్రాతిపదికన వడ్డీ ఆదాయమును అందజేస్తుంది.
మదుపు వ్యూహము ఐచ్ఛికాలు
మీ కాంట్రిబ్యూషన్ల నుండి సాధ్యమయ్యే అత్యుత్తమ రాబడులను ఇవ్వడానికి, ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ బహుళ మదుపు వ్యూహము ఆప్షన్లను అందజేస్తుంది.
- వ్యవస్థీకృతమైన బదిలీ
- వయస్సు-ఆధారిత ఆస్తి కేటాయింపు వ్యూహము (డిసి పథకాలకు మాత్రమే వర్తిస్తుంది)
- ఆటోమేటిక్ - ట్రిగ్గర్ - ఆధారిత మదుపు వ్యూహము
మార్పిడి చేసుకునే ఐచ్ఛికము
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ క్రింద, మారుతున్న మదుపు అవసరాలను తీర్చుకోవడానికై, మీరు ఒక యూనిట్- అనుసంధానిత ఫండ్ నుండి మరొకదానికి కొన్ని లేదా అన్ని యూనిట్లను తరలించవచ్చు. ఈ ప్రక్రియను స్విచ్చింగ్ అంటారు. మాస్టర్ పాలసీదారు దరఖాస్తు చేసుకోగల మార్పిడుల సంఖ్యకు ఎటువంటి పరిమితీ లేదు.
ప్రీమియం తిరిగి మళ్ళించు ఐచ్ఛికం
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యూనిట్ అనుసంధానిత సూపర్ యాన్యుయేషన్ ప్లాన్ క్రింద, మాస్టర్ పాలసీదారు భవిష్య పెట్టుబడులను ఒక విభిన్న ఫండ్ లేదా ఫండ్స్ యొక్క కూర్పుకు మళ్ళించడానికి ఎంచుకోవచ్చు. అయినప్పటికీ, ప్రీమియం మళ్ళింపు ఐచ్ఛికం క్రింద, మీ కాంట్రిబ్యూషన్ యొక్క మునుపటి కేటాయింపు మారదు.
పన్ను ప్రయోజనాలు
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు (ఏవైనా ఉంటే) అందుబాటులో ఉండవచ్చు. ఆదాయపు పన్ను చట్టము, 1961 ప్రకారము పన్ను ప్రయోజనాలు సమయానుగుణంగా చేయబడే మార్పులకు లోబడి ఉంటాయి.