ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్

మీరు నిజంగా శ్రద్ధ వహించేవారి కోసం సమీకృతమైన ఆరోగ్య సంరక్షణ!

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్ అనేది, అనుసంధానితం-కాని, భాగస్వామ్యం-లేని, గ్రూప్ నిర్ధారిత ప్రయోజన ఆరోగ్య బీమా ప్లాను, ఇది ఆసుపత్రి ఖర్చులు, ఎముకలు విరగడం, అంగవైకల్యము లేదా క్యాన్సర్ వ్యాధినిర్ధారణ మీద, వెక్టర్ జనిత వ్యాధులు, కోవిడ్-19 లేదా సార్స్-సిఓవి-2 యొక్క పాజిటివ్ వ్యాధినిర్ధారణ మీద (మరియు ఏదైనా ప్రభుత్వ అధీకృత ఆసుపత్రులు లేదా కేంద్రాలలో క్వారంటైన్ లో ఉన్న మీదట), మాస్టర్ పాలసీదారు/సభ్యులు ఎంపిక చేసుకున్న కవర్ ఆప్షన్ (ల) మేరకు ఏకమొత్తం చెల్లింపును అందజేస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్ కొనడానికి కారణాలు

  • కోవిడ్-19 (కరోనా వైరస్) యొక్క వ్యాధినిర్ధారణ మరియు ప్రభుత్వ అధీకృత ఆసుపత్రులు లేదా కేంద్రాలలో క్వారంటైన్ అవుతున్న విషయములో ఆర్థిక భద్రత

  • మాస్టర్ పాలసీదారు/సభ్యులు 6 వర్తింపు ఆప్షన్ల నుండి ఎంచుకునే సదుపాయం ఉంది.

  • సహేతుకమైన ప్రీమియముతో మీ గ్రూపుకు వర్తింపు ప్రయోజనం లభిస్తుంది.

  • మీ ఆరోగ్య ఆవశ్యకతలను బట్టి మీరు ఒక అనుకూలమైన ఆరోగ్య బీమా ప్లాన్ పొందుతారు.

  • పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులపై ఆర్థికపరమైన రక్షణ పొందండి.

  • ఎంపిక చేసుకున్న బీమా మొత్తము ఐచ్ఛికము ప్రకారం వాస్తవ ఖర్చులతో నిమిత్తం లేకుండా నిర్ధారిత ప్రయోజనము

  • వర్తించు పన్ను చట్టాల ప్రకారము అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాలు పొందండి

  • .

అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?

  • ప్రవేశమునకు కనీస వయస్సు (గత పుట్టినరోజు నాటికి) 18 సంవత్సరాలు.

  • ప్రవేశానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు నాటికి)

  • మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు

    a. క్యాన్సర్ కవర్ మరియు కరోనావైరస్ కవర్ ఆప్షన్ల కోసం - 66 సంవత్సరాలు (చివరి పుట్టినతేదీ నాటికి)

    b. ఇతర వర్తింపు ఆప్షన్ల కొరకు – 80 సంవత్సరాలు (చివరి పుట్టినతేదీ నాటికి)

  • వర్తింపు చేయగలిగిన కనీస గ్రూపు పరిమాణము 7 మంది సభ్యులు మరియు గ్రూపు యొక్క గరిష్ట పరిమాణముపై పరిమితి ఏదీ లేదు

  • ఈ క్రింది వాటికి లోబడి పిల్లలను కవర్ చేయవచ్చు(DHCB ఐచ్ఛికం విషయములో మాత్రమే):

    a. ప్రవేశము నాటికి కనీస వయస్సు 91 రోజులు

    b. ప్రవేశము నాటికి గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు (చివరి పుట్టినతేదీ నాటికి)

    c. మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు (చివరి పుట్టినతేదీ)

  • రోజువారీ ఆసుపత్రి ఖర్చుల కొరకు నగదు ప్రయోజనం (DHCB ఐచ్ఛికం విషయములో) కనీసం రూ. 1000 లు మరియు గరిష్టంగా రు. రోజుకు 10,000 లు

  • కోవిడ్-19 (కరోనా వైరస్) యొక్క వ్యాధినిర్ధారణ వర్తింపు కనీసం రూ. 25000 లు మరియు గరిష్టంగా రు. 2,00,000 లు.

  • పాలసీని 12 నెలల నిర్ధారిత కాలవ్యవధికి కొనుగోలు చేయవచ్చు

  • మాస్టర్ పాలసీదారు/సభ్యులు ప్రీమియములను నెలవారీగా, మూడు నెలల వారీగా, అర్ధ సంవత్సరం వారీగా లేదా సంవత్సరం వారీగా చెల్లించవచ్చు.

ఉత్పత్తుల బ్రోచర్

బ్రోచర్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి