ఇండియాఫస్ట్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన

భారతదేశాన్ని తర్వాతి స్థాయికి తీసుకువెళ్ళుట, ప్రజలు సంతోషంగా ఉండేలా చేయుట!

సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది.ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.

కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన

 • సరసమైన ప్రామాణిక ధరతో జీవిత బీమా వర్తింపును అందజేస్తుంది.

 • అనూహ్య సంఘటనలు జరిగిన పక్షములో మీ కుటుంబాన్ని రు, 2,00,000 ల జీవిత వర్తింపుతో రక్షిస్తుంది.

 • కనీసమైన డాక్యుమెంటేషన్ తో ఈ సులువైన ప్రక్రియ ద్వారా మీ సమయాన్ని ఆదా చేసుకోండి.

 • “కౌంటర్ వద్దనే" జారీ చేసే పద్ధతితో మీ వర్తింపును ఒక్క ఉదుటున మొదలుపెట్టండి

 • మీ బ్యాంక్ నుండి ప్రీమియం దానంతట అదే జమ అయ్యేలా నవీకరణ ప్రక్రియను సులభతరం చేసుకోండి

 • మెచ్యూరిటీ ప్రయోజనము ఉండదు

 • ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము సెక్షన్ 80 సి మరియు సెక్షన్ 10 (10డి) క్రింద పన్ను ప్రయోజనాలు పొందండి

ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?

 • ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు

 • మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ?


138 కోట్ల మందికి పైగా జనాభాతో, ఇండియా భారీ సైజు మరియు సంభావ్యత గల దేశముగా ఉంది. ఈ జనాభాలో దాదాపుగా 72% మంది గ్రామీణ భారతంలోనే నివశిస్తున్నారు. ఆర్థిక చేకూర్పు లేకపోవడమనేది నేడు దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటిగా ఉంది. ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ప్రభుత్వ సామాజిక భద్రతా పథకము మరియు ఈ దిశగా ఒక ముందడుగు.

ఆర్థిక చేకూర్పు అంటే సమాజములోని ప్రతి వ్యక్తీ తమ వయస్సు, లింగము లేదా ఆర్థిక పరిస్థితితో నిమిత్తము లేకుండా బ్యాంకింగ్ సేవలు మరియు ఆర్థిక పరిష్కారాలకు ప్రాప్యత కలిగి ఉండటం అని అర్థం. భారతదేశ పురోగతి యొక్క ఫలాలను ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తికీ అందజేయాలనేది దీని లక్ష్యము. అనేక భారతీయ కుటుంబాలకు ఒక పొదుపు ఖాతా గానీ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలకు గానీ ప్రాప్యత లేదు.  ఆర్థిక చేకూర్పు అనేది, వ్యక్తి యొక్క ఆర్థికపరమైన హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం మరియు ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన  సేవల పరిష్కారాలను పొందేలా చేయడాన్ని లక్ష్యం చేసుకునే ఒక ప్రక్రియ.

మీరు ఒక పొదుపు ఖాతా తెరవడానికి లేదా ఇతర బ్యాంకింగ్ సేవలను పొందడానికి అనుమతించబడే ముందుగా మీరు నిర్దిష్ట ప్రాతిపదికను తీర్చుకోవాల్సి ఉంటుందని అనేక బ్యాంకులు కోరతాయి. ఈ అడ్డంకులను నిర్మూలించడానికి పరిష్కారాలను సృష్టించడం ద్వారా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి ఆర్థిక చేకూర్పు చొరవలు సమాజములోని అన్ని వర్గాల వారికీ సామాజిక భద్రతను అందించే ఆశాకిరణాలుగా ఉంటాయి.

2015 బడ్జెట్ లో ప్రకటించబడిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, లేదా PMJJBY పాలసీ, భారత ప్రభుత్వముచే మద్దతు ఇవ్వబడిన భారతీయ జీవిత బీమా పథకము. ఏటేటా నవీకరణ సౌకర్యాన్ని అందిస్తూ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మీకు సంవత్సరం వారీ జీవిత కవరేజీని మరియు PMJJBY బీమా వర్తింపు యొక్క కాలావధిలో పాలసీదారు యొక్క మరణం సంభవించిన పక్షములో నిర్ధారిత మరణ ప్రయోజన మొత్తము రు.  2,00,000 లను అందజేస్తుంది.

ప్రజలకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు సంబంధిత వేరియంట్లను అందించడానికి గాను, భారతీయ జీవిత బీమా కంపెనీలు బ్యాంకింగ్ సంస్థలతో సమన్వయం చేసుకున్నాయి, కావున ప్రతి ఒక్కరూ అదే అవధులలో  PMJJBY కవరేజీని ప్రాప్యత చేసుకోవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగియున్న మీ బ్యాంకింగ్ కస్టమర్లు అందరికీ బీమాను అందజేయడం లక్ష్యంగా చేసుకొంది.  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్రింద మాస్టర్ పాలసీదారుగా బ్యాంక్ పని చేస్తూ ఉండటంతో, ఈ గ్రూపు బీమా ప్లాను, ప్రస్తుతమున్న మరియు కొత్త కస్టమర్లకు సహేతుకమైన నిర్ధారిత ధరతో జీవిత వర్తింపును అందజేయాలనుకునే బ్యాంకులకు కచ్చితమైనదిగా ఉంటుంది. 

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యొక్క ముఖ్యాంశాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగియున్న బ్యాంక్ కస్టమర్ల గ్రూపుకు అందించబడే అనుసంధానితం కాని, భాగస్వామ్యం లేని, సంవత్సరం వారీగా నవీకరణ చేసుకోదగిన గ్రూపు సంరక్షణ ప్లానుగా ఉంటుంది. 

మీరు మరియు మీకు ప్రియమైనవారు అనేక అనిశ్చితులను ఎదుర్కొంటూ ఉంటారనేది జీవితం గురించి నిశ్చితి కలిగిన ఒక విషయముగా ఉంటుంది, కావున మీరు మీ సంక్షేమము మరియు సంతోషం కోసం తగువిధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.  తమకు ప్రియమైన వారి ఆర్థిక భద్రతను చూసుకోవడం ఎవరైనా సరే ఒక పెద్ద వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత, ప్రత్యేకించి మీరు కుటుంబానికి సంపాదనాపరుడై ఉంటే.  ఒక దురదృష్టకరమైన సందర్భములో, మిమ్మల్ని కోల్పోయిన కుటుంబము, బరువు బాధ్యతల్ని ఎలా తీర్చుకోవాలా మరియు తమ స్వప్నాలను సజీవంగా ఎలా ఉంచుకోవాలా అని సతమతం అయ్యే స్థితిలో ఉండకూడదు. తనకు సరిపోయే కవరేజీతో ఒక జీవిత బీమా పాలసీ పొందడం మీ కుటుంబ ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవడానికి గాను అత్యంత సాధారణ మార్గాల్లో ఒకటి.

ఇండియాఫస్ట్ లైఫ్ చే అందించబడే PMJJBY బీమా ప్లాను ఒక గ్రూపు బీమా ప్లానుగా పనిచేస్తుంది మరియు మాస్టర్ పాలసీదారు యొక్క గ్రూపు సభ్యులందరికీ సంపూర్ణ రక్షణ ప్రయోజనాలను అందిస్తుంది. ఒక వ్యక్తిగతమైన సమగ్ర సంరక్షణ ప్లానులో, వ్యక్తి పాలసీదారు మరియు జీవిత బీమా పొందినవారుగా ఉంటారు. పాలసీ కాలావధిలో పాలసీదారు యొక్క అకాల మరణము సంభవించిన పక్షములో, పాలసీ పత్రాలలో కనబరచియున్న లబ్దిదారులు మరణ ప్రయోజనముగా భరోసా ఇవ్వబడిన సొమ్మును అందుకుంటారు.

ఇండియాఫస్ట్ లైఫ్  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన విషయములోనైతే, అందించబడే PMJJBY కవరేజీ అనేది గ్రూప్ బీమా కవరేజీగా ఉంటుంది. ఒక గ్రూప్ అవధి బీమా ప్లానులో, ఎంచుకోబడిన జీవిత బీమా పథకము, ఒక ఏకైక పాలసీ ఒప్పందము క్రింద వ్యక్తుల యొక్క మొత్తం గ్రూపును కవర్ చేస్తుంది.  ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతో, తమ కస్టమర్ల జీవితాలను రక్షించాలని ఎంచుకునే బ్యాంకు లేదా ఆర్థికసహాయ సంస్థ మాస్టర్ పాలసీదారు అవుతారు. అదే సమయములో, సభ్యులు, పాల్గొంటున్న ఆర్థికసహాయ సంస్థతో ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగియున్న వ్యక్తులు అయి ఉంటారు.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యొక్క కీలక ముఖ్యాంశాలు

పాలసీదారు కొరకు, అనగా., బ్యాంకు లేదా ఆర్థికసహాయ సంస్థ:

 • మీరు ఇప్పుడు ప్రధానమంత్రి బీమా ప్లాను క్రింద మీ కస్టమర్లు అందరికీ ఒక సమంజసమైన నిర్ధారిత ధరతో జీవిత వర్తింపును అందించవచ్చు.
 • ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY ప్లాను సంవత్సరములో మీకు కొత్త సభ్యులను చేర్చుకునే అనుకూలతను ఇస్తుంది.

సభ్యుల కొరకు, అనగా., పాల్గొంటున్న బ్యాంక్ యొక్క సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదా

 • ఇండియాఫస్ట్ లైఫ్  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్రింద అత్యంత సహేతుకమైన ధరతో మీరు జీవిత వర్తింపును పొందుతారు కాబట్టి మీకు ప్రియమైనవారికి రక్షణ కల్పించే అవకాశం మీకు ఉంటుంది.
 • సభ్యుడి యొక్క/జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి యొక్క దురదృష్టకరమైన మరణ ఉదంతములో, రు. 2 లక్షలకు సమానమైన భరోసా సొమ్ము నామినీ/అపాయింటీ/ చట్టబద్ధమైన వారసులకు PMJJBY క్రింద చెల్లించబడుతుంది.
 • ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 80 సి క్రింద మీరు చెల్లించిన ప్రీమియములపై మీరు పన్ను ప్రయోజనాలను ఆనందించవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎలా పని చేస్తుంది?


ఒక గ్రూపు సంరక్షణ ప్లానుగా, ఇండియాఫస్ట్ లైఫ్  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన రు.  2 లక్షల నిర్ధారితమైన వర్తింపు ఐచ్ఛికాన్ని అందిస్తుంది. ఇండియాఫస్ట్ లైఫ్ PMJJBY ప్లాన్ క్రింద నమోదు చేసుకున్న సభ్యులు అందరూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్రింద అదే మొత్తము యొక్క రిస్క్ వర్తింపును అందుకుంటారు. ప్రతి సంవత్సరమూ నవీకరణ చేసుకునే ఒక ప్లానుగా, ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, గ్రూపు సభ్యులందరికీ PMJJBY ప్లానును జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు PMJJBY కవరేజీని అందజేస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యొక్క భాగంగా ఎవరు ఉండవచ్చు?


 • ఇండియాఫస్ట్ లైఫ్ చే అందజేయబడే ప్రధానమంత్రి బీమా ప్లానులో ఒక మాస్టర్ పాలసీదారు మరియు గ్రూపు సభ్యులు ఉంటారు.
 • జీవిత అనిశ్చితిలపై సభ్యుల కుటుంబాలకు రక్షణ కల్పించడానికై తమ కస్టమర్లు లేదా సభ్యులకు PMJJBY జీవిత వర్తింపును అందించాలనుకునే మాస్టర్ పాలసీదారు బ్యాంకు లేదా ఆర్థికసహాయ సంస్థ అయి ఉంటుంది. మాస్టర్ పాలసీదారు, PMJJBY ప్లానును కలిగియుండి మరియు దాని పని నిర్వహణ చేసే వారుగా ఉంటారు.
 • ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్రింద కవర్ చేయబడే జీవితాలు ఆ గ్రూపుల యొక్క సభ్యులుగా ఉంటారు. PMJJBY కవరేజీచే హామీ ఇవ్వబడే మరణ ప్రయోజనము, పాల్గొంటున్న సభ్యుడి మరణం మీదట చెల్లించబడుతుంది. మొట్టమొదటిసారిగా వర్తింపు కోసం దరఖాస్తు చేయునప్పుడు, సభ్యుడికి తప్పనిసరిగా ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి మరియు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరేని వ్యక్తిగా ఉండవచ్చు.
 • ఒకవేళ ఒక వ్యక్తి ఒకటి లేదా అనేక బ్యాంకులలో బహుళ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను కలిగియున్న పక్షములో, వాళ్ళు కేవలం ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే PMJJBY లో చేరే అర్హత కలిగి ఉంటారు.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద ప్రీమియం ఐచ్చికాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక సింగిల్ ప్రీమియం చెల్లింపు ప్లాను, అంటే, ప్లాను యొక్క ప్రయోజనాలను ఆనందించడానికి మీరు PMJJBY బీమా వర్తింపు కోసం నవీకరణ వరకూ అవధి కాలం పాటుగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

గ్రూపు సభ్యులు లేదా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు PMJJBY బీమా వర్తింపును వార్షికం చేయబడిన కనీస ప్రీమియం రు.  330 లు, ప్లస్ వర్తించు పన్ను, సెస్సులు మరియు లెవీలు చెల్లించి పొందవచ్చు. మాస్టర్ పాలసీదారు లేదా బ్యాంకు బీమాదారుకు ప్రీమియమును చెల్లిస్తారు, మరియు ఈ PMJJBY ప్లాన్ ప్రీమియం బ్యాంకుచే సభ్యుడి యొక్క బ్యాంక్ ఖాతా నుండి ఒక వాయిదాలో తనంతట తానుగా జమ చేసుకోబడుతుంది. 

ఒక ప్లాను సంవత్సరములో ఒక నిర్దిష్ట కాలవ్యవధి సందర్భంగా మాత్రమే సభ్యులు ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు చేరగలుగుతారు. PMJJBY పాలసీచే అందజేయబడే వర్తింపు నిర్ధారిత వ్యవధి, నిర్ధారిత ప్రీమియం ధరతో ముందస్తుగా నిర్ణయించబడిన ప్రారంభ మరియు ముగింపు తేదీలతో ఒక సంవత్సరానికి ఉంటుంది.

ఒకవేళ సభ్యుడు ప్లాన్ సంవత్సరము కాలములో ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరాలని కోరుకుంటే, PMJJBY కవరేజీ యొక్క ప్రారంభతేదీ నుండి మూడు నెలల వరకూ రాబోవు సంవత్సరానికి ఆలస్యపు నమోదు రుసుము సాధ్యమవుతుంది. తదనంతరం చేరుతున్నవారు ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్రింద భవిష్య వర్తింపు కోసం మంచి ఆరోగ్యముతో ఉన్నట్లుగా స్వీయ ధృవీకరణను సమర్పిస్తూ పూర్తి వార్షిక ప్రీమియమును చెల్లించాల్సి ఉంటుంది

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద ఏ రకం క్లెయిములు కవర్ చేయబడతాయి?


ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద ఎటువంటి మినహాయింపులూ లేవు. ఇప్పటివరకూ, ఏ కారణం చేతనైనా గ్రూపు సభ్యుడి యొక్క మరణము, రిస్క్ కవర్ మొదలైన తర్వాత జరిగినంతవరకూ, అది క్లెయిము కొరకు చెల్లుబాటు అవుతుంది. ఏ కారణము చేతనైనా బీమా చేయబడిన వ్యక్తి మరణించిన పక్షములో, PMJJBY బీమా వర్తింపు ఒక మరణ ప్రయోజనం రు. 2,00,000 లను నామినీ/పాలసీ యొక్క లబ్దిదారుకు అందిస్తుంది.

జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక అకాల మరణం చెందిన పక్షములో PMJJBY ప్లాను సభ్యుడికి సంవత్సరం వారీ జీవిత వర్తింపును మరియు నామినీకి ఒక మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. నామినీకి అందించబడే PMJJBY కవరేజీ మొత్తము పన్ను-రహితంగా ఉంటుంది. ఆర్థిక చేకూర్పు యొక్క లక్ష్యానికి నిబద్ధతగా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒత్తిడి-రహితమైన మరియు ముక్కుసూటి క్లెయిముల ప్రక్రియను అందజేస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యొక్క ప్రయోజనాలు ఏవేవి?


 • ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక్క- సంవత్సరపు శుద్ధమైన సంరక్షణ జీవిత బీమా పాలసీ, దానిని సంవత్సరం తర్వాత సంవత్సరం నవీకరణ చేసుకోవచ్చు. PMJJBY ప్లాన్ క్రింద అందజేయబడే ప్రాథమిక ప్రయోజనం, పాలసీదారు యొక్క అకాల మరణము సంభవించిన పక్షములో నామినీకి అందించబడే మరణ కవరేజీగా ఉంటుంది.
 • ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మరణ ప్రయోజనాలతో ఉండే ఒక శుద్ధమైన అవధి బీమా ప్లాను. PMJJBY ప్లానుకు జతచేయబడిన మదుపు భాగాంశము ఏదీ లేదు. ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు నిరంతర కవరేజ్ ఐచ్ఛికాన్ని అందించే ఒక సరళమైన మరియు ముక్కుసూటి స్వభావం గల ప్లానుగా ఉంటుంది. 

బ్యాంకులు తమ కస్టమర్ల కొరకు ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కొనుగోలును ఎందుకు పరిగణించాలి?


ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, మీకు ప్రస్తుతమున్న మరియు సంభావ్య కస్టమర్లకు ఒక విలువ-ఆధారిత సేవను అందించే ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. PMJJBY పాలసీ, బ్యాంక్ ఖాతా సేవల నుండి జీవిత రిస్క్ కవరేజీ వరకూ మీ కస్టమర్ల ఆర్థిక ఆరోగ్యము పట్ల శ్రద్ధ చూపే ఒక అవకాశం మీకు ఇస్తుంది. కేవలం ఒకే ఒక్క ఒప్పందముతో, మీ సేవింగ్స్ ఖాతాదారులు అందరికీ సులభంగా స్థోమతకు తగిన ఆర్థిక సంరక్షణను అందించగలుగుతారు.

వినియోగదారు-నడిపే నేటి ప్రపంచములో, కస్టమర్లను ఆకర్షించడం మాత్రమే సరిపోదు; వారిని నిలిపి ఉంచుకోవడానికి కూడా మీరు పని చేయాల్సి ఉంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, కస్టమర్లను నిలుపుకునే సాధనంగా పనిచేస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, సభ్యులకు ఎలా ప్రయోజనం కల్పిస్తుంది?


 • ఇండియాఫస్ట్ లైఫ్  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్లానులో నమోదు చేసుకోబడిన ప్రతి సభ్యుడికీ తక్కువ ఖర్చుతో ప్రామాణికమైన రిస్క్ కవరేజీని అందిస్తుంది.
 • ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు ఆత్మహత్యతో సహా ఎటువంటి రకమైన మినహాయింపు ఉండదు. ఏ కారణము చేతనైనా మరణము PMJJBY పాలసీ క్రింద కవర్ చేయబడుతుంది.
 • మరేదేని శుద్ధ సంరక్షణ అవధి ప్లానుతో, మీ ప్రీమియం ధరను నిర్ణయించడంలో మీ వయస్సు ఒక ఆవశ్యకమైన అంశం అవుతుంది. PMJJBY బీమా వర్తింపు క్రింద, ప్రీమియం మొత్తముపై మీ వయస్సుకు ఎటువంటి భారమూ ఉండదు. వర్తించే ఏకైక వయస్సు ప్రాతిపదిక ఏమిటంటే, నమోదు చేసుకునే సమయములో ఖాతాదారు 18 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్కులు అయి ఉండాలి. ఇండియాఫస్ట్ లైఫ్  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, నామినీకి మరణ ప్రయోజనముగా రు.  2,00,000 ల నిర్ధారిత కవరేజీ కొరకు ఒక నిర్ధారిత ప్రీమియమును అందిస్తుంది.
 • ఒకవేళ మీరు ఇండియాఫస్ట్ లైఫ్  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యొక్క సంవత్సరం వారీ మొదలయ్యే తేదీని తప్పినప్పటికీ సైతమూ, మీరు చేరే తేదీచే నిర్ధారించబడే ఒక ప్రో-రేటెడ్ ప్రీమియమును చెల్లించడం ద్వారా మీరు నమోదు చేసుకోవచ్చు.
 • ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ప్లానులో పాల్గొనడమనేది సంపూర్ణంగా స్వచ్ఛందము.
 • మాస్టర్ పాలసీదారు/బ్యాంకు బీమాదారుకు సమీకృత గ్రూపు బీమా ప్రీమియమును చెల్లించినప్పటికీ, మొత్తాలు సభ్యుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి తగ్గించుకోబడతాయి. ఇప్పటికి, మాస్టర్ పాలసీదారుకు ఎటువంటి పన్ను తగ్గింపులూ వర్తించబడవు. అయినప్పటికీ, గ్రూపు సభ్యులు ఆదాయపు పన్ను చట్టము 1961 యొక్క సెక్షన్ 80సి క్రింద పన్ను తగ్గింపులను కోరవచ్చు. నామినీచే అందుకోబడిన మరణ ప్రయోజనం రు.  2,00,000 లు కూడా ఆదాయపు పన్ను చట్టము 1961 యొక్క సెక్షన్ 10 (10 డి) క్రింద పన్ను-రహితంగా ఉంటుంది. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనను మీరు ఎందుకు ఎంచుకోవాలి?


 • సరసమైన ప్రామాణిక ధరతో ఒక జీవిత బీమా వర్తింపును పొందడానికి అవకాశము.
 • అనూహ్యమైన సంఘటనలు జరిగిన పక్షములో రు.  2,00,000 ల లైఫ్ కవర్ తో మీ కుటుంబానికి రక్షణ కల్పించండి
 • కనీసమైన డాక్యుమెంటేషన్ తో ఈ సులువైన ప్రక్రియ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోండి.
 • “కౌంటర్ వద్దనే" జారీతో మీ వర్తింపును ఒక్క ఉదుటున మొదలుపెట్టండి
 • మీ బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం దానంతట అదే జమ అయ్యేలా సులువైన నవీకరణ ప్రక్రియ
 • ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము సెక్షన్ 80 సి మరియు సెక్షన్ 10 (10డి) క్రింద పన్ను ప్రయోజనాలు పొందండి

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?


 • సభ్యుడికి PMJJBY ప్లాను క్రింద జీవిత భరోసా కల్పించబడుతుంది. ప్రవేశమునకు కనీస వయస్సు గత పుట్టినరోజు నాటికి 18 సంవత్సరాలు.
 • PMJJBY బీమా ప్లాను క్రింద ప్రవేశమునకు గరిష్ట వయస్సు సమీప పుట్టినరోజు నాటికి 50 సంవత్సరాలు.
 • ప్రధాన మంత్రి బీమా క్రింద మెచ్యూరిటీ నాటికి గరిష్ట వయస్సు సమీప పుట్టినరోజు నాటికి 55 సంవత్సరాలు.
 • PMJJBY వర్తింపును అందజేయగలిగేందుకు దానిని కోరే గ్రూపు యొక్క కనీస సైజు 50 మంది సభ్యులు. ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద గరిష్ట గ్రూపు సైజు అంటూ లేదు.
 • PMJJBY బీమా వర్తింపు రు.  2,00,000 ల నిర్ధారిత రిస్క్ కవర్ కలిగి ఉంది. ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద సభ్యులు అందరికీ ఒకే విధమైన అవధులు అందజేయబడతాయి.
 • ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద మెచ్యూరిటీ లేదా జీవించియున్న ప్రయోజనం చెల్లించబడదు.
 • PMJJBY ప్లాన్ కొరకు ప్రీమియం మొత్తము, పాల్గొంటున్న బ్యాంకులో ఉన్న ఖాతాదారు యొక్క సేవింగ్స్ ఖాతా నుండి నేరుగా తనంతట తానుగా జమ చేసుకోబడుతుంది.
 • PMJJBY కవరేజీ పొందడానికి గాను, సభ్యుడి యొక్క ఆధార్ కార్డును పాల్గొంటున్న బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
 • లియెన్ వ్యవధి (తత్కాల నిలుపుదల వ్యవధి) (పాలసీ మొదలయ్యే ముందు సమయం) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో నమోదైన తేదీ నుండి 45 రోజులు ఉంటుంది.

ఉత్పత్తుల బ్రోచర్

Download Brochure File

తరచుగా అడిగే ప్రశ్నలు

 • ప్రధానమంత్రి బీమా పథకము లేదా PMJJBY పాలసీ అంటే ఏమిటి?

  PMJJBY పాలసీ అంటే పూర్తి వివరణ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. PMJJBY ప్లాను, ప్రభుత్వముచే-చొరవ తీసుకోబడిన అవధి బీమా ప్లాను, అది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది మరియు దాని తర్వాత నవీకరణ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్థోమతకు తగిన ధర అయిన సంవత్సరానికి రు.330 తో  రు.2,00,000 ల భరోసా సొమ్ముతో జీవిత కవరేజీని  అందిస్తుంది.

  ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక గ్రూపు బీమా మరియు శుద్ధమైన సంరక్షణ ప్లాను, ఇందులో PMJJBY పాలసీ యొక్క ప్రయోజనాలు పాల్గొంటున్న బ్యాంకు/ఆర్థికసహాయ సంస్థ యొక్క ఖాతా కలిగియున్నవారికి అందించబడతాయి.

 • PMSBY మరియు PMJJBY మధ్యగల వ్యత్యాసము ఏమిటి?

  2015 బడ్జెట్ లో, భారత ప్రభుత్వము, దేశవ్యాప్తంగా ఆర్థిక చేకూర్పును నిర్ధారించుకోవడానికి గాను మూడు సామాజిక భద్రతా పథకాలను ప్రకటించింది. PMSBY లేదా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అనేది ప్రతి-సంవత్సరమూ నవీకరణ చేసుకోదగిన పథకము, అది ప్రమాదపూర్వక మరణము మరియు అంగవైకల్య కవరేజీని అందిస్తుంది. జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క ప్రమాద మరణము లేదా శాశ్వత సంపూర్ణ అంగ వైకల్యము కలిగిన పక్షములో PMSBY ఒక జీవిత వర్తింపు రు. 2,00,000 లు అందిస్తుంది మరియు శాశ్వత పాక్షిక అంగ వైకల్యము కలిగిన పక్షములో రు.  1,00,000 లు అందిస్తుంది. 18 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పాల్గొంటున్న బ్యాంక్ యొక్క సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

  PMJJBY పాలసీ లేదా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది శుద్ధ సంరక్షణ సామాజిక భద్రతా పథకము, దానిని ఏటేటా నవీకరణ చేసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో, PMJJBY పాలసీ క్రింద, మీరు రు. 2,00,000 ల జీవిత వర్తింపును పొందుతారు. 18 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్సుతో (కవరేజీ 55 సంవత్సరాల వరకు) పాల్గొంటున్న బ్యాంక్ యొక్క సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగియున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

 • నేను PMJJBY ప్లాన్ మరియు PMSBY రెండింటినీ తీసుకోగలుగుతానా?

  ఔను, మీరు ఒకే సమయములో PMJJBY ప్లాన్ మరియు PMSBY ప్లాన్ రెండింటినీ పొందవచ్చు. PMJJBY ప్లాన్ అనేది జీవిత బీమా అవధి ప్లాను, కాగా PMSBY అనేది ఒక వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాను. రెండు ప్లానులు కూడా జీవిత వర్తింపు రు. 2,00,000 లు ఇస్తాయి, ఐతే PMJJBY పాలసీ మాత్రం ఏ కారణం చేతనైనా జరిగిన మరణాన్ని కవర్ చేస్తుంది, PMSBY పాలసీ ప్రమాదపూర్వక మరణాలను, PTD లేదా శాశ్వత సంపూర్ణ అంగవైకల్యము, మరియు PPD లేదా శాశ్వత పాక్షిక అంగవైకల్యమును కవర్ చేస్తుంది. ఒక్కో ప్లాను యొక్క వయస్సు మరియు ఇతర ప్రాతిపదికలను నెరవేర్చే భారతీయ పౌరులు అందరికీ ఈ రెండు ప్లానులూ అందుబాటులో ఉన్నాయి.

 • సెక్షన్ 80సి తగ్గింపు కొరకు PMJJBY అర్హత కలిగి ఉంటుందా?

  ఔను, మీరు ఆదాయపు పన్ను చట్టము 1961 యొక్క సెక్షన్ 80సి క్రింద పన్ను తగ్గింపులను కోరవచ్చు. చెల్లించబడిన ప్రీమియములపై సంవత్సరానికి ఒకమారు ఒక పన్ను తగ్గింపును పొందవచ్చు. మాస్టర్ పాలసీదారు లేదా బ్యాంకు బీమాదారుకు ప్రీమియమును చెల్లిస్తారు; అయినప్పటికీ ఈ మొత్తం, తనంతట తాను జమ చేసుకునే పద్ధతి ద్వారా బ్యాంక్ ఖాతా కలిగియున్న వారి నుండి వసూలు చేసుకోబడుతుంది. చెల్లించిన ప్రీమియములపై బ్యాంక్ ఎటువంటి పన్ను ప్రయోజనమునూ పొందజాలదు, ఐతే వ్యక్తిగత బ్యాంక్ ఖాతా కలిగియున్న వ్యక్తి పొందవచ్చు.

 • PMJJBY ప్లాను కొరకు వయోపరిమితి ఎంత?

  PMJJBY ప్లాన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి గాను, ప్రవేశించు నాటికి గ్రూపు సభ్యుడి లేదా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారు వయస్సు తన గత పుట్టినరోజు నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రవేశమునకు గరిష్ట వయస్సు సమీప పుట్టినరోజు నాటికి 50 సంవత్సరాలు ఉండవచ్చు. PMJJBY పాలసీ క్రింద మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు సమీప పుట్టినరోజు నాటికి 55 సంవత్సరాలు.

 • ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కొరకు ప్రీమియం మొత్తము ఎంత?

  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్రింద, రు.  2,00,000 జీవిత కవరేజీ రు.  330 ల వార్షిక ప్రీమియముతో అందించబడుతుంది, అది సభ్యుడి యొక్క బ్యాంక్ ఖాతా నుండి తనంతట తానుగా జమ చేసుకోబడుతుంది. PMJJBY కవరేజీని ప్రతి సంవత్సరమూ నవీకరించుకోవాల్సి ఉంటుంది. వార్షిక ప్రీమియము మూడు భాగాంశాలను చేరి ఉంటుంది:

  • బీమాదారుకు చెల్లించబడే ప్రీమియం సంవత్సరానికి ఒక్కో సభ్యుడికి రు. 289 ల వంతున ఉంటుంది.
  • బ్యాంకుకు లేదా ఏజెంటుకు ఇవ్వబడే ప్రతిఫలం సంవత్సరానికి ఒక్కో సభ్యుడికి రు.  30 ల వంతున ఉంటుంది.
  • పాల్గొంటున్న బ్యాంకు తన పరిపాలనా ఖర్చులను భరించడానికి గాను తిరిగిచెల్లింపు ఒక్కో సభ్యుడికి సంవత్సరానికి రు.  11 ల వంతున ఉంటుంది
  • PMJJBY బీమా వర్తింపు కొరకు సంవత్సరానికి చెల్లించవలసిన  ఆధార ప్రీమియం రు. 330 లుగా ఉంటుంది. అదనంగా, వర్తించే పన్నులు, సెస్సులు, మరియు లెవీలు వర్తించవచ్చు.

 • PMJJBY కవరేజీ యొక్క ప్రయోజనము ఏమిటి?

  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది కేవలం ఒక రక్షణ అవధి బీమా ప్లానుగా ఉంటుంది, జీవిత భరోసా పొందిన వ్యక్తి/బ్యాంక్ ఖాతాదారు యొక్క  దురదృష్టకర మరణము సంభవించిన పక్షములో అది రు. 2,00,000 ల మరణ ప్రయోజనమును నామినీకి అందజేస్తుంది. PMJJBY పాలసీ, మెచ్యూరిటీ లేదా ప్లాను సరెండర్ మీదట ఎటువంటి ప్రయోజనమునూ అందజేయదు.

  PMJJBY ప్లాను, స్థోమతకు తగిన చౌక ధర రు.330 తో ఒక సంవత్సరం పాటు ప్రామాణికమైన రిస్క్ కవరేజీని  అందిస్తుంది. పాలసీని అమలులో ఉంచడానికి చెల్లించబడే ప్రీమియం, ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 80సి క్రింద పన్ను తగ్గింపులకు అర్హత కలిగి ఉంటుంది. ప్రస్తుత పన్నువిధింపు చట్టము సెక్షన్ 10(10D) క్రింద మరణ ప్రయోజనం మొత్తము పన్ను-రహితంగా ఉంటుంది.

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK