
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్, మీ చిన్నారి స్వప్నం సాకారం కావడానికి ఆర్థిక తోడ్పాటుకై క్రమం తప్పని హామీతో కూడిన చెల్లింపులను మీకు అందిస్తుంది. మీ గైర్హాజరులో సైతమూ సమగ్రమైన ఆర్థిక రక్షణతో మీ చిన్నారి భవిష్యత్తును కూడా పదిలపరచండి.
కొనడానికి కారణాలు ఇండియా ఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ప్లాన్
అంతర్నిర్మిత ప్రీమియముల మాఫీ (డబ్ల్యుఒపి) ద్వారా ప్రియమైనవారి స్వప్నాల పరిరక్షణ
ఒక టోకు మొత్తం చెల్లింపు లేదా క్రమం తప్పని ఆదాయముగా మరణ ప్రయోజనాన్ని ఎంచుకునే అవకాశం పొందండి.
మీ అవసరాలకు సరిపోయే విధంగా పాలసీ అవధులు / ప్రీమియం చెల్లింపు అవధులు మరియు చెల్లింపు రూపాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ.
అవసరాలపై ఆధారపడి, పాలసీ అవధి సందర్భంగా హామీ ఇవ్వబడే మొత్తము యొక్క 101% - 125% నుండి హామీతో కూడిన చెల్లింపులు అందజేసే 8 చెల్లింపు ఐచ్ఛికాల శ్రేణి నుండి ఎంచుకోండి.
బోనస్ కూడగట్టబడటం ద్వారా మీ పెట్టుబడుల యొక్క సురక్షిత ఎదుగుదల.
చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు
ఏమిటి అర్హత ప్రమాణం?
ప్రవేశానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు అవధి 7 నుండి 14 సంవత్సరాలు. ఎంచుకోబడిన ప్రీమియం చెల్లింపు అవధిపై కనీస మరియు గరిష్ట పాలసీ అవధి ఆధారపడి ఉంటుంది
7 నుండి 9 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి కొరకు కనీసం హామీ ఇవ్వబడే మొత్తం రు. 150,000 మరియు 10 నుండి 14 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి కొరకు రు. 2,00,000 లు. పూచీకత్తుకు లోబడి, హామీ ఇవ్వబడే గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితీ లేదు.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనేది మీ పిల్లల భవిష్యత్తును సౌకర్యవంతంగా మరియు ఆర్థికంగా సురక్షితంగా చేసే ఒక పాలసీ. కాలానుగతంగా చెల్లించబడే ఐచ్ఛికంతో, ఛైల్డ్ పాలసీ యొక్క మెచ్యూరిటీ సమయములో భరోసా ఇవ్వబడే మొత్తములో ఒక శాతము, ఇంకా కూడగట్టబడిన బోనసులు (ఏవైనా ఉంటే) అందుకుంటూనే మీరు స్కూల్ సంబంధిత మైలురాళ్ళ కొరకు చెల్లించడానికి ఈ ఎండోమెంట్ ఛైల్డ్ పాలసీని ఉపయోగించుకోవచ్చు.
మీ చిన్నారి యొక్క కలలు వాస్తవమయ్యేలా చూసుకోవడానికై ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ మిమ్మల్ని ఒక అడుగు దగ్గరగా తీసుకువెళుతుంది. నేడు మీ చిన్నారి యొక్క పరిమిత అవసరాలను తీర్చడానికి మీ ఆదాయం సరిపోవచ్చు, ఐతే భవిష్యత్తు విభిన్నమైన కథ. కేవలం చదువు ఖర్చులు మాత్రమే రాబోయే సంవత్సరాలలో పది రెట్లు పెరుగుతాయని అంచనా వేయబడుతోంది.అదనంగా, ఒకవేళ మీ బిడ్డ విదేశాల్లో ఉన్నత డిగ్రీని సంపాదించుకోవాలని అనుకుంటే, లేదా ఒక పైలట్, ఇంజినీర్, లేదా డాక్టరుగా ఒక వృత్తిపరమైన సర్టిఫికెట్ పొందాలనుకుంటే, ఆమె అవసరాలను తీర్చడానికి మీ ఆదాయం ఎంత మాత్రమూ సరిపోదు.మీ చిన్నారి యొక్క స్వప్నాలకు మద్దతు ఇవ్వడానికై ఒక ఛైల్డ్ బీమా ప్లానుతో, ఆమె కోరినవి అందజేయడం గురించి మీరు ఏ మాత్రమూ చింతించనవసరం లేదు.
Aఒక మదుపు-అదేవిధంగా-బీమా ఛైల్డ్ పాలసీగా, ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనేది, మీరు ద్రవ్యోల్బణము మరియు పెరుగుతున్న ఖర్చులపై యుద్ధం చేయడానికి ఏ మాత్రమూ స్వేదం చిందించకుండానే లేదా మీ బిడ్డను వెనుకడుగు వేయనీయకుండానే ఆదుకునే ఒక స్నేహితుడు. ఒక ఛైల్డ్ ప్లాన్ పొందడమనేది ఒక ఐచ్ఛికమైన ఆర్థిక ఎంపిక కాదు; అది మీ బిడ్డ యొక్క భవిష్యత్ అవసరాలను మీరు తీర్చితీరవలసిన దిశగా ఒక కర్తవ్య బాధ్యత అవుతుంది.మీ చిన్నారి గాలిలో కోటలు కట్టుకుంటూ ఉంటే, వారి కలల కోటలకు గట్టి పునాది వేయగల ఇటుకలను కొని ఇవ్వడం అనే బాధ్యత మీకు ఉంటుంది.మీ చిన్నారి భవిష్యత్తును పదిలపరచుకోవడానికి ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ఒక ముఖ్యమైన పునాదిరాయి వంటిది.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ మీకు అందించి సహాయపడగల ముఖ్యమైన మైలురాళ్ళు ఏవి?
మీ జీవితకాల క్రమములో, మీ జీవితంలోనూ మరియు మీ చిన్నారి జీవితంలోనూ అనేక మైలురాళ్ళు ఉండబోతున్నాయి.మీ పొదుపులు మరియు మదుపుల రాబడులు ఈ మైలురాయి ఘట్టాలకు నిధులు సమకూర్చగలిగి ఉండాలి.మీరు సౌకర్యవంతంగా రిటైర్ కావడానికి గాను, మీకు అవసరమయ్యే ఆపత్కాల నిధి కోసం చేసుకునే మీ ఆర్థిక ప్రణాళిక ఏకంగా మీ మొదటి ఇంటి దిశగా అవసరమైన డౌన్పేమెంట్ చేయడాన్ని ఒక అంశంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీ చిన్నారి జీవితం విభిన్న మైలురాళ్ళను కలిగి ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ఈ మైలురాళ్ళను సులభంగా అధిగమించేలా మిమ్మల్ని పరిపుష్టి చేస్తుంది.
స్కూల్ ఫీజులు మరియు చదువు ఖర్చులు
పాలసీ అవధిలో 8 చెల్లింపు ఆప్షన్ల ద్వారా ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ హామీతో కూడిన చెల్లింపులను అందజేస్తుంది. వార్షిక ఫీజులు వంటి సంవత్సరంవారీ చెల్లింపులతో గనక మీకు సహాయం అవసరమైతే, పాలసీ అవధి యొక్క చివరి 7 సంవత్సరాలలో ప్రతి సంవత్సరమూ 5 నుండి 11% మనీ బ్యాక్ అందించే ఒక చెల్లించబడే ఆప్షన్ ని మీరు ఎంపిక చేసుకోవచ్చు, మరియు మిగిలిన మొత్తాన్ని పాలసీ యొక్క ముగింపులో మెచ్యూరిటీ ప్రయోజనము మరియు కూడగట్టుకున్న బోనసులు (ఏవైనా ఉంటే) గా తీసుకోవచ్చు.
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అస్సోచామ్) వారిచే జరపబడిన ఒక అధ్యయనం ప్రకారము, ఒక చిన్నారి కోసం ప్రైవేటు స్కూల్ ఖర్చులు 2005-2015 దశాబ్దములో 150% పెరిగాయి.ఒక పేరెంట్ గా, మీరు ఇక ఉన్నత విద్య యొక్క పెరుగుతున్న ఖర్చుల వైపు చూసుకుంటూ ఉండడం మాత్రమే కాదు, పాఠశాల విద్య యొక్క పెరుగుతున్న ఖర్చును కూడా చూసుకోవాల్సి ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ నుండి సంవత్సరం వారీగా వచ్చే డబ్బు రాబడి ఈ ఖర్చులను భరించేందుకు మీకు సహాయపడుతుంది.
ఉన్నత విద్య
ఒకప్పుడు తమ పిల్లల్ని విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపాలని అనుకునే వాళ్ళు మాత్రమే ఉన్నత చదువుల ఆర్థిక ప్రణాళిక చేసుకునే వారు, ఐతే ఇక అది ఎంతమాత్రమూ వర్తించబోదు. ఇండియాలో ఉన్నత చదువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి, అది ఒక చిన్నారి ఉన్నత విద్యా ప్రణాళిక యొక్క ప్రముఖమైన అంశానికి దారి తీసింది.ఇండియాలో నైపుణ్యమైన మరియు వృత్తిప్రావీణ్యతనిచ్చే కోర్సులకు అత్యధిక ఫీజులు ఉంటున్నాయి.ఒక పేరెంట్ గా, మీ చిన్నారి యొక్క అభిరుచులు ఏవైనా సరే, వాటికి ఆర్థికపరంగా మద్దతు ఇవ్వగల సామర్థ్యం మీకు ఉండేలా చూసుకోవడానికి మీకు అవసరమైనదంతా ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ చేస్తుంది.
పెళ్ళి ఖర్చులు
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ఛైల్డ్ ప్లాన్ తో, కాలానుగత మనీ-బ్యాక్ లేకుండా చెల్లించబడే ఒక ఆప్షన్ ఎంచుకొని మీరు ఒక గణనీయమైన ఆపత్కాల నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ మీద మీరు భరోసా ఇవ్వబడిన మొత్తము యొక్క 125% కు సమానమైన మొత్తానికి హామీతో కూడిన చెల్లింపు మరియు బోనసులను (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) అందుకుంటారు.
సాంప్రదాయంగా, తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్ళి ఖర్చులను పూర్తిగా కాకపోయినా ఒక వంతు భరిస్తూ ఉన్నారు.ఒకవేళ మీ బిడ్డ జీవితంలో త్వరగా పెళ్ళి చేసుకోవాలనుకుంటే, మీ ఆర్థిక సహాయము అనివార్యమైనది కావచ్చు.ఒకవేళ మీ బిడ్డ తన స్వంత కాళ్ళ మీద నిలబడి తన పెళ్ళి ఖర్చులను తానే భరించగల స్థితిలో ఉన్నప్పటికీ సైతమూ, మీరు సాధ్యమైన ప్రతి మార్గములోనూ మద్దతును కొనసాగించాలనుకోవచ్చు.ఒకవేళ మీ బిడ్డకు తన పెళ్ళి కోసం డబ్బు అవసరం లేకుంటే, మీరు ఏకంగా ఒక మొత్తాన్ని నవదంపతుల కోసం కానుకగా ఒక ఇంటి కొనుగోలుకు గానీ లేదా ప్రపంచ పర్యటనకు గానీ ఇవ్వవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ఛైల్డ్ ప్లాన్ మీకు ఎందుకు కావాలి?
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనేది మీ చిన్నారి యొక్క ఆర్థిక భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవడానికి మరియు కొన్ని నిర్దిష్ట మైలురాళ్ళను సులువుగా అధిగమించడానికి సహాయపడే మదుపు-అదేవిధంగా-బీమా సాధనము.ఈ ఛైల్డ్ ప్లానుతో, కొంత కాలానికి మీరు ఒక ఆపత్కాల నిధిని ఏర్పరచుకుంటారు.ఈ ఆపత్కాల నిధిని మెచ్యూరిటీ ప్రయోజనముతో ఇవ్వబడే కాలానుగత చెల్లింపుల రూపములో గానీ లేదా ఛైల్డ్ ప్లాన్ కాలావధి యొక్క ఆఖరులో ఒక ఏకమొత్తపు మెచ్యూరిటీ ప్రయోజనముగా గానీ తీసుకోవచ్చు.ఇది ఒక చిన్నారి బీమా పాలసీగా కూడా అయి ఉంది కాబట్టి, పాలసీదారు యొక్క అకాల మరణం ఉదంతములో మరణ ప్రయోజనముగా చిన్నారికి చెల్లించబడేట్లుగా బీమా భాగాంశము చూసుకుంటుంది.
ఇక్కడ ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ని మీ విభాగములో ఉంచుకోవాలని తప్పనిసరి చేసే ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఉన్నాయి:
ప్రీమియములను మాఫీ చేసుకునే సమర్థత
వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఓపి) ప్రయోజనం అనేది ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ యొక్క ఒక అంతర్నిర్మిత అంశము.మరేదైనా మదుపు ఆప్షన్ తో ఒకవేళ చెల్లింపులు రావడం ఆగిపోయినట్లైతే ప్లాన్ కూడా ఆగిపోతుంది. ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ తో, పాలసీదారు మరణము సంభవించిన పక్షములో, బీమాదారు ప్రీమియం చెల్లింపులు చేయడం కొనసాగించేలా డబ్ల్యుఓపి ప్రయోజనం చూసుకుంటుంది.చిన్నారి మరణ ప్రయోజనాన్ని అందుకుంటారు, ఐతే భవిష్యత్ ప్రీమియం చెల్లింపులు మాఫీ చేయబడతాయి, మరియు చిన్నారి అప్పటికీ మెచ్యూరిటీ మొత్తము మరియు బోనసులు (ఏవైనా ఉంటే) అందుకుంటారు.ఒకసారి మీరు ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ని చలనములో ఉంచారంటే, మీ పరోక్షములో సైతమూ అది ఇక పట్టాలు తప్పదు.
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికై అధిక రాబడులు
అనేక సాంప్రదాయక బీమా మరియు పొదుపు సాధనాలతో పోల్చి చూస్తే, ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలను అధిగమించడానికి సహాయపడే అధిక రాబడులను అందించడానికి ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ మెరుగైన స్థానములో ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ప్రతి మూడు మాసాలకూ ఒకసారి మారే మరియు సుదీర్ఘమైన లాక్-ఇన్ వ్యవధి ఉండే వడ్డీ రేటును అందిస్తాయి.ఒకవేళ మీరు వడ్డీ మరియు లిక్విడిటీ యొక్క నష్టాన్ని భరించలేకపోతే, ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనేది ఎంతో మెరుగైన పందెం అవుతుంది.
పన్ను తగ్గించుకునే ప్రయోజనాలు
ఒక ఛైల్డ్ పాలసీగా, ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్, ఆదాయపు పన్ను చట్టము 1961 క్రింద మినహాయింపు యొక్క ఆద్య భాగములో పడుతుంది.అంటే దీని అర్థం, మీరు చెల్లించిన ప్రీమియముల పైన అదేవిధంగా పాలసీ కాలావధి ఆఖరులో అందుకునే మెచ్యూరిటీ ప్రయోజనాల పైన కూడా, ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టల ప్రకారము పన్ను తగ్గింపును పొందవచ్చు.
తక్షణమే రక్షణ మొదలవుతుంది
తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోవడం అనేది ఒక చిన్నారి జీవితాన్ని దారుణంగా బాధపెట్టే విధాలుగా ప్రభావితం చేస్తుంది.ముందస్తుగా గనక తగిన ఏర్పాట్లు చేయకుండా ఉండి ఉంటే, చిన్నారి కూడా ఆర్థిక భద్రత కొరతతో వ్యవహరించవలసి వస్తుంది.ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ తో, ఒకవేళ ప్రీమియం చెల్లించే వ్యక్తి గనక మరణించిన పక్షములో తక్షణ మరణ ప్రయోజనాన్ని ఏకమొత్తముగా చిన్నారి అందుకుంటారు. ఈ మొత్తము ఆ క్షణంలో అత్యవసర ఖర్చులు తీర్చుకోవడానికి సహాయకారిగా ఉంటుంది.పాలసీదారు యొక్క అకాల మరణం తర్వాత కూడా ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ కొనసాగుతుంది కాబట్టి, ఏదైనా అనూహ్యపరిణామం జరిగినా కూడా చిన్నారి భవిష్యత్తు రక్షింపబడుతుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ యొక్క అనుకూలత
మీ చిన్నారికి చాలా ఎక్కువగా అవసరమైనప్పుడు వారు డబ్బు రాబడిని పొందేలా చూసుకోవడానికి గాను మీరు ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ లో ఒక సముచితమైన ప్రీఁఇయం చెల్లింపు అవధిని ఎంచుకోవచ్చు.చెల్లించవలసిన ప్రీమియం మొత్తము, ప్రీమియం చెల్లింపు యొక్క కాలవ్యవధి, మరియు మెచ్యూరిటీలో చెల్లించబడే రూపములో కూడా ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనుకూలతను అందిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ కు రైడర్ల యొక్క జోడింపు
ప్రమాదకారణంగా మరణం, శాశ్వత అంగవైకల్యము, మరియు క్లిష్టమైన అస్వస్థతల విషయములో ప్రయోజనకారిగా ఉండే ఆప్షనల్ రైడర్లు లేదా రిస్క్ కవర్ల నుండి మీరు ఎంచుకోవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ఛైల్డ్ ప్లాన్ ను నేను ఎందుకు కొనాలి?
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనేది, మీ కంటిపాప కొరకు మీ ఆర్థిక ప్రణాళిక లక్ష్యాలను నెరవేర్చుకునేలా సహాయపడేందుకు రూపొందించబడిన అనుసంధానితం కాని, ఒక పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ పాలసీ అయి ఉంది.క్రమం తప్పని అంతరాలలో చెల్లించబడటం ద్వారా మీ చిన్నారి చదువు మరియు ఇతర అవసరాల కొరకు ఆర్థిక ప్రణాళిక చేసుకోవడానికి అది మీకు సహాయపడుతుంది మరియు మీ మరణం లేదా ఎపిటిడి జరిగిన పక్షములో సైతమూ చిన్నారి భవిష్యత్తును పదిలపరుస్తుంది.హామీతో కూడిన చెల్లింపులు, బోనస్ కూడగట్టుకోవడం (ఒకవేళ ప్రకటించి ఉంటే), మరియు జీవిత బీమా ప్రయోజనం యొక్క తన విశిష్ట లిక్విడిటీ అంశము మార్గములో, ఈ ఉత్పాదన మీ చిన్నారి యొక్క ఆర్థిక అవసరాల పట్ల శ్రద్ధ వహించడానికి ఒక కచ్చితమైన మిశ్రమాన్ని అందిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ఛైల్డ్ ప్లాన్ యొక్క ముఖ్యాంశాలు
- అంతర్నిర్మిత ప్రీమియముల మాఫీ (డబ్ల్యుఒపి) ద్వారా మీ చిన్నారి స్వప్నాలను పరిరక్షించండిజీవిత బీమా చేయించిన వ్యక్తి యొక్క మరణం సంభవించిన పక్షములో, లేదా జీవితబీమా పొందిన వ్యక్తి ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము (ఎటిపిడి) తో బాధపడుతున్నట్లయితే, ఒకవేళ ఎంచుకొని ఉంటే, ఇక ఏ మాత్రమూ భవిష్యత్ ప్రీమియములను చెల్లించనవసరం లేదు.
- ఒక ఏకమొత్తం చెల్లింపు లేదా క్రమం తప్పని ఆదాయముగా మరణ ప్రయోజనాన్ని ఎంచుకునే అవకాశం పొందండి
- కావలసిన వర్తింపు యొక్క రకమును ఎంచుకోవడంలో అనుకూలత – విభిన్న ప్రీమియం మొత్తాల కొరకు ప్రమాదకారణంగా మరణముతో మరణము లేదా ప్రమాదకారణంగా సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము (ఎటిపిడి) లేదా ఈ ప్రయోజనాల ఒక సమ్మేళనము.
- మీ అవసరాలకు సరిపోయే విధంగా పాలసీ అవధులు / ప్రీమియం చెల్లింపు అవధులు మరియు చెల్లింపు రూపాలను ఎంపిక చేసుకునే అవకాశం.
- అవసరాలపై ఆధారపడి, పాలసీ అవధి సందర్భంగా భరోసా ఇవ్వబడే మొత్తము యొక్క 101% - 125% నుండి హామీతో కూడిన చెల్లింపులు అందజేసే 8 చెల్లింపు ఐచ్ఛికాల శ్రేణి నుండి ఎంచుకోండి.
- బోనస్ కూడగట్టబడటం ద్వారా మీ పెట్టుబడుల యొక్క సురక్షిత ఎదుగుదల
- ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు.మీ సులువైన బోనసులు, ఒకవేళ ప్రకటించబడి ఉంటే, కూడగట్టిన ఆ అన్నింటినీ మెచ్యూరిటీలో చివరి కంతు చెల్లింపుతో పాటుగా అందుకోండి.
- ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ని మీ సౌకర్యం మేరకు ఆన్లైన్ కొనుగోలు చేసుకోవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ఛైల్డ్ ప్లాన్ కొనడానికి అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
- ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ఛైల్డ్ ప్లాన్ లో ప్రవేశానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు.
- ప్రీమియం చెల్లింపు అవధి 7 నుండి 14 సంవత్సరాలు, మరియు ఈ ఛైల్డ్ ప్లానులో కనీస మరియు గరిష్ట పాలసీ అవధి ఎంపిక చేసుకున్న ప్రీమియం చెల్లింపు అవధిపై ఆధారపడి ఉంటుంది.
- ఈ ఛైల్డ్ ప్లానులో కనీస పాలసీ అవధి 15 సంవత్సరాలు మరియు గరిష్ట పాలసీ అవధి 25 సంవత్సరాలు ఉంటుంది.ఉదాహరణకు, 7 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి కనీసం 15 సంవత్సరాల పాలసీ అవధిని మరియు గరిష్టంగా 20 సంవత్సరాల పాలసీ అవధిని అందిస్తుంది.
- 7 నుండి 9 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి కొరకు కనీసం భరోసా ఇవ్వబడే మొత్తం రు.150,000 మరియు 10 నుండి 14 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి కొరకు రు.2,00,000.భరోసా ఇవ్వబడే గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితీ లేదు, పూచీకత్తుకు లోబడి.
ఉత్పత్తుల బ్రోచర్
తరచుగా అడిగే ప్రశ్నలు
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ఇంకా ఏమేమి ఏర్పరుస్తుంది?
మీ చిన్నారి కొరకు సరియైన వయస్సులో డివిడెండ్లను, రిస్క్-లేని మదుపు సాధనము, మరియు వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఓపి) ప్రయోజనం వంటి అదనపు ప్రయోజనాలు మరియు 8 అనుకూలమైన చెల్లింపు ఆప్షన్ల ద్వారా చెల్లించబడే ఒక పాలసీ అవధిని ఎంచుకోవడానికి ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ మీకు వీలు కలిగిస్తుంది.
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ క్రింద మీరు చేయగలిగిన కనీస చెల్లింపు ఎంత?
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ తో, పాలసీదారుకు తన ప్రాధాన్యతల ఆధారంగా నెలవారీ/మూడు నెలల వారీ, అర్ధ సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ ప్రీమియం చెల్లింపులు చేసే అనుకూలత ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ కొనుగోలు చేయడానికి చెల్లించదగిన కనీస ప్రీమియం మొత్తము రు.1,349 లు నెలకు, రు.4,015 లు మూడు నెలలకు, రు.7,934 లు అర్ధ సంవత్సరానికి, లేదా రు.15,500 లు సంవత్సరానికి.
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ లో చైల్డ్ లైఫ్ కవరేజ్ అంటే అర్థం ఏమిటి?
చైల్డ్ లైఫ్ కవరేజ్ అంటే, ఈ పాలసీలో చిన్నారి జీవితం కవర్ చేయబడిందని కాదు.అది ప్రధానంగా చిన్నారి యొక్క తల్లి/తండ్రి అయినట్టి పాలసీదారుకు అందజేయబడే కవరేజీని తెలియజేస్తుంది. ప్రీమియం చెల్లించే పారెంట్ యొక్క జీవితం కవర్ చేయబడి ఉండడం వల్ల, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పటికీ మీ బిడ్డ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడం కొనసాగుతుంది కావున మీరు ఇక నిశ్చింతగా ఉండవచ్చు.
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ప్లాన్ ఎప్పుడు కొనాలి?
మీ బిడ్డ జన్మించిన వెంటనే మీరు ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ కొనవచ్చు.కొనడానికి అత్యుత్తమమైన సమయము సాధ్యమైనంత త్వరగా.ఛైల్డ్ ప్లాన్ ని మీరు ఎంత త్వరగా కొంటే, అంత తక్కువ మీరు మదుపు చేస్తారు, మరియు అంత ఎక్కువ వడ్డీని మీరు సంపాదించుకుంటారు.ఒకవేళ మీ బిడ్డ పెద్దవాడయి ఉన్నప్పటికీ సైతమూ, ఖర్చులు వస్తూనే ఉంటాయి, కాబట్టి ఏ సమయములోనైనా సరే ఛైల్డ్ ప్లాన్ కొనడమనేది ఒక మంచి ఆలోచన అవుతుంది.ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ఛైల్డ్ ప్లాన్ కోసం, పాలసీదారు 21 మరియు 45 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి అయి ఉండవచ్చు.
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ఛైల్డ్ ప్లాన్ యొక్క అవధి ఎంత?
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనేది 15-25 సంవత్సరాల పాలసీ అవధిని ఎంచుకునే ఆప్షనుతో ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీగా ఉంది.మొత్తం పాలసీ అవధి 15-20 సంవత్సరాలతో కనీస ప్రీమియం చెల్లింపు అవధి 7 సంవత్సరాలు.మీరు మొత్తం పాలసీ అవధి 22-25 సంవత్సరాలతో సుమారు 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ప్రీమియములు చెల్లించడానికి కూడా ఎంచుకోవచ్చు.
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ లో అందుబాటులో ఉండే రిస్క్ కవర్ ఆప్షన్లు ఏవేవి?
జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి యొక్క మరణం, ప్రమాదపూర్వక మరణం మరియు ఎటిపిడి అయిన పక్షములో ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ కవరేజీని అందిస్తుంది.ఈ ప్లాన్ క్రింద ఈ క్రింది రిస్క్ కవర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి, ఆ ఆప్షన్ల ఎంపికను బట్టి ప్రీమియం మొత్తములో వ్యత్యాసాలు ఉంటాయి, అవి —మరణం వర్తింపు, మరణం ప్లస్ ప్రమాదకారణ మరణం కవర్ (ఎడిబి), మరణం ప్లస్ ప్రమాదకారణ సంపూర్ణ శాశ్వత అంగవైకల్యం కవర్ (ఎటిపిడి), మరియు మరణం ప్లస్ ఎటిపిడి ప్లస్ ఎడిబి (సమగ్రమైన వర్తింపు).
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అధిక భరోసా మొత్తము రాయితీ/ డిస్కౌంట్ అందిస్తుందా?
ఔను, ఒక్కో పాలసీకి భరోసా ఇవ్వబడే మొత్తం ఆధారంగా, ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ఒక రాయితీ/ డిస్కౌంట్ అందిస్తుంది. ఒక పాలసీ కొరకు భరోసా ఇవ్వబడే మొత్తము రు.3-5 లక్షలు, ప్రీమియం రేట్లపై ప్లాను 2.5% తగ్గింపును అందిస్తుంది.ఒక పాలసీ కొరకు భరోసా ఇవ్వబడే మొత్తము రు.1 కోటి మరియు ఇంకా ఎక్కువ, ప్రీమియం రేట్లపై ప్లాను గణనీయమైన 8.40% తగ్గింపును అందిస్తుంది.
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ప్లాన్ ను నేను సరెండర్ చేయవచ్చునా?
అవును.పాలసీని సరెండర్ చేయడం సిఫార్సు చేయబడలేదు కావున, ఒక అత్యవసర పరిస్థితి సందర్భములో తక్షణ నగదు ఆవశ్యకత కోసం దానిని మీరు సరెండర్ చేయడానికి ఎంపిక చేసుకోవచ్చు.చెల్లించదగిన విలువను పొందిన తర్వాత ఏ సమయములోనైనా ఒక తక్షణ నగదు చెల్లింపు కొరకు పాలసీని సరెండర్ చేయవచ్చు.ఒకవేళ పాలసీదారు గనక 2 పూర్తి సంవత్సరాలు చెల్లించిన మీదట పాలసీ అవధి సందర్భంగా ఏ సమయములోనైనా పాలసీని సరెండర్ చేసినట్లయితే, ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ ఒక సరెండర్ విలువను చెల్లిస్తుంది. సరెండర్ మీద చెల్లించబడే మొత్తము హామీ ఇవ్వబడిన సరెండర్ విలువ (GSV) మరియు ప్రత్యేక సరెండర్ విలువ (SSV) కంటే అధికంగా ఉంటుంది.
-
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్ లో ఒక ఫ్రీ-లుక్ వ్యవధి ఆప్షన్ ఉందా?
ఔను, మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు.ఒకవేళ మీరు పాలసీ షరతులు మరియు నిబంధనలో దేనికైనా అంగీకరించని పక్షములో, పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున అందుకు కారణమును పేర్కొంటూ పాలసీని తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.