ఇండియాఫస్ట్ లైఫ్ "ఇన్స్యూరెన్స్ ఖాతా” ప్లాన్ (సూక్ష్మ బీమా ఉత్పాదన) - iflwebportal
ఇండియాఫస్ట్ లైఫ్ "ఇన్స్యూరెన్స్ ఖాతా” ప్లాన్ (సూక్ష్మ బీమా ఉత్పాదన)
మీరు విలువిచ్చేదాన్ని పొదుపు చేయండి, మీరు ప్రేమించేవారి రక్షణ కోసం

ఇండియాఫస్ట్ లైఫ్ "ఇన్స్యూరెన్స్ ఖాతా” ప్లాన్ (సూక్ష్మ బీమా ఉత్పాదన) అనేది ఒక సూక్ష్మ జీవిత బీమా, ఎండోమెంట్ ప్లాన్.ఒకవేళ మీ అకాల మరణము సంభవించిన పక్షములో, అది మీ కుటుంబ అవసరాలను చూసుకుంటుంది మరియు అనూహ్య సంఘటన ఏదీ జరగని పక్షములో మీ డబ్బు కంటే ఎక్కువగా తిరిగి ఇస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ "ఇన్స్యూరెన్స్ ఖాతా" ప్లాన్ కొనడానికి కారణాలు
అర్థం చేసుకోవడం సులువు మరియు పాలసీ కొనుగోలు చేయడం సులభం
మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడానికి రూపొందించినట్టిది.
అవధి యొక్క ముగింపులో మీరు మెచ్యూరిటీపై హామీతో కూడిన భరోసా గల ప్రయోజనం పొందుతారు
ఇక భరోసాగా ఉండండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎంత మొత్తం వస్తుందో మొదట్లోనే తెలుస్తుంది.
సింగిల్ ప్రీమియం ద్వారా చెల్లించండి మరియు మీ ఇష్టం మేరకు 5/7/10 సంవత్సరాలకు కవరేజీ పొందండి.
మీ సామర్థ్యము ప్రకారము మీ వర్తింపు పెంచుకోవడానికి సింగిల్ ప్రీమియమును ఒక్కసారిగా గానీ లేదా అనేకసార్లుగా గానీ చెల్లించండి.
అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల పాలసీ అవధి కొరకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు, 7 సంవత్సరాల పాలసీ అవధి కొరకు 43 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు 40 సంవత్సరాలు.
మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
కనీస ప్రీమియం రు.200 లు 5 సంవత్సరాల పాలసీ అవధి కొరకు, రు.143 లు 7 సంవత్సరాల పాలసీ అవధి కొరకు, రు.100 లు 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు
గరిష్ట ప్రీమియం రు.40,000 లు 5 సంవత్సరాల పాలసీ అవధి కొరకు, రు.28,570 లు 7 సంవత్సరాల పాలసీ అవధి కొరకు, రు.20,000 లు 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు
కనీస హామీ ఇవ్వబడే మొత్తం:రు.1000 మరియు గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తము: రు.రు.2, 00,000.
మీరు ఈ ప్లాన్ ని 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల అవధికి కొనుగోలు చేయవచ్చు.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
ఉత్పత్తుల బ్రోచర్