ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాన్
దశల వారీ పొదుపు ప్రకాశవంతమైన రేపటి కోసం

ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ అనబడే అనుసంధానించబడని, భాగస్వామ్య, పరిమిత చెల్లింపు సూక్ష్మ జీవిత బీమా ప్లాను, మీరు కేవలం 5 సంవత్సరాల పాటు ప్రీమియములు చెల్లించగానే మీ భవిష్యత్ లక్ష్యాల కొరకు క్రమశిక్షణ గల పొదుపును మీకు అందించడానికి వీలు కలిగేలా రూపొందించబడింది.అనుకోని సంఘటనలు జరిగిన పక్షములో మీ ప్రియమైన వారు జీవిత వర్తింపుతో రక్షింపబడేలా కూడా ఈ ప్లాను చూసుకుంటుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ కొనడానికి కారణాలు
మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కేవలం ఐదు సంవత్సరాల పాటు మాత్రమే ప్రీమియములు చెల్లించండి
మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, ఒక్క సంవత్సరం పూర్తిగా జీవిత వర్తింపు ప్రయోజనాన్ని ఆనందించడం కొనసాగించండి (మీరు ఒక పూర్తి సంవత్సరం యొక్క ప్రీమియములు చెల్లించిన తర్వాత వర్తిస్తుంది)
వార్షిక బోనస్ (ఏవైనా ఉంటే) లతో మీ పొదుపును మరింత పటిష్టం చేసుకోండి
అవధి ఆఖరున, మీరు మెచ్యూరిటీ వద్ద హామీ ఇవ్వబడిన మొత్తము ప్లస్ కూడగట్టిన బోనస్ లు (ఏవైనా ఉంటే) పొందుతారు
ప్రమాదపూర్వక మరణ ప్రయోజనము కొరకు ఎంచుకోండి మరియు అటువంటి దురదృష్టకర సంఘటన యొక్క ప్రతికూల ప్రభావాల నుండి మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించండి
ఒక ఏక-సమయపు చెల్లింపుగా లేదా 5 సంవత్సరాల వ్యవధికి గాను కంతులలో మరణ ప్రయోజనం అందుకోవడానికి ఎంచుకోండి
ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు
ఉత్పత్తుల బ్రోచర్
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్
కొన్ని రకాల ఖర్చులు రాబోతున్నాయని మీకు తెలిసి ఉన్నప్పటికీ సైతమూ, వాటి కోసం పొదుపు చేసి ఉంచుకోవడమనేది మీ సంపాదనా సామర్థ్యముతో ముడిపడి ఉంటుంది. పరిమిత సంపాదనలతో, మీ కుటుంబము యొక్క భవిష్యత్తు కొరకు పొదుపు చేసుకునే మీ సామర్థ్యము కూడా పరిమితంగానే ఉన్నట్లు అనిపించవచ్చు—ఐతే అలా జరగకూడదు మరి. మీ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి మీకు సహాయం చేయడానికి ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ ఇక్కడ ఉంది. పేరు సూచిస్తున్నట్లుగానే, ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ అనేది, అంచెల వారీగా మిమ్మల్ని మీ పొదుపు లక్ష్యాలకు అతి సమీపంగా తీసుకువెళ్ళడానికి రూపొందించబడిన ఒక పొదుపు బీమా ప్లాను.
ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాన్ అంటే ఏమిటి?
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ అనేది, అనుసంధానితం కాని, పార్టిసిపేటింగ్, పరిమిత చెల్లింపు, సూక్ష్మ జీవిత బీమా ప్లాను. ఈ ప్లాను క్రింద, మీరు ఐదు సంవత్సరాల పరిమిత కాలవ్యవధి పాటుగా పద్ధతి ప్రకారం మరియు క్రమశిక్షణతో పొదుపు చేసుకుంటారు. ప్రీమియం చెల్లింపు వ్యవధి 5 సంవత్సరాల తక్కువ కాలవ్యవధి అయినప్పటికీ, పాలసీ అవధి 10 లేదా 15 సంవత్సరాల వరకూ పొడిగించబడుతుంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ తో మీ పొదుపు స్వప్నాలను సాకారం చేసుకోండి—ఒక బీమా ప్లానులో దీర్ఘావధి పొదుపు యొక్క ప్రయోజనాల్ని మీకు అందించడానికి ఈ బచత్ ప్లాన్ రూపొందించబడింది.
పొదుపు మరియు బీమా యొక్క కచ్చితమైన సమ్మేళనాన్ని అందిస్తూ, ఈ పాలసీ, మీరు పరిమిత ప్రీమియములు చెల్లిస్తూ మరియు అధిక పొదుపును ఆనందించేలా ఈ ప్లాను యొక్క కాలావధి పాటుగా మీ జీవితానికి రక్షణ ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే మనశ్శాంతిని మీకు కలిగిస్తుంది. ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ తో తక్కువ సమయపు చెల్లింపు నిబద్ధత, జీవిత రక్షణ మరియు పొదుపు సౌకర్యాలను ఉపయోగించుకోండి. అదనంగా, ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్, జీవిత వర్తింపు ప్రయోజనం యొక్క కొనసాగింపు, మరియు ఒకవేళ ప్రకటించబడి ఉంటే అదనంగా జోడించబడే బోనస్‌లు వంటి అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలను అందిస్తుంది.
ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాన్ మీకు ఎందుకు కావాలి?
ప్రతి ఒక్కరికీ ఒక భద్రతా రక్షకవల అవసరమవుతుంది—కొంత హాయిగా జారగిలి సేదదీరడానికి. కొంత స్వల్ప మొత్తం సొమ్మును ప్రక్కన పెట్టడం వల్ల మీరు కూడబెట్టుకున్న సొమ్ము కొంత ఉందనే విషయం మీ మనశ్శాంతి కోసం తప్పనిసరిగా అవసరం. చిన్న మొత్తాలను ప్రక్కన పెట్టడమనే విషయానికి వచ్చినప్పుడు, మీ కుటుంబం యొక్క స్వప్నాలను సాకారం చేసుకోవడానికి కావలసినంత భారీ సొమ్మును అది చేసుకోలేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీ తపనను వాస్తవం చేయడానికి, ఒకే సమయములో ఒక చిన్న చెల్లింపుతో ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ ఇక్కడ ఉంది.
జీవిత అనిశ్చితులు అనేవి, నిశ్చితంగా సంభవించే కొన్ని జీవిత ఘటనలు. అందువల్ల, వాటి కొరకు ప్రణాళిక చేసుకోవడం వివేకవంతమైన పని. ఈ పాలసీతో, పాలసీపై మీరు ఒక పూర్తి సంవత్సరపు ప్రీమియములను ఇదివరకే చెల్లించి ఉన్న పక్షములో, ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నప్పటికీ సైతమూ మీరు ఒక పూర్తి సంవత్సరం పాటు జీవిత వర్తింపు ప్రయోజనాన్ని ఆనందిస్తారు. అదనపు రైడర్ల యొక్క జోడింపుతో, మీకు నామ మాత్రపు ఖర్చుతో మీరు మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును నిర్ధారించుకోవచ్చు.
పైపెచ్చు, అవధి బీమా పాలసీల వలె కాకుండా, మీరు పాలసీ అవధిని దాటిపోయి జీవించియున్నప్పుడు మీరు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందుకుంటారు. ఈ పాలసీ ఒక పార్టిసిపేటింగ్ ప్లానుగా ఉంది, అంటే బీమా కంపెనీ ప్రకటించగల ఏవేని సింపుల్ రివర్షనరీ మరియు టెర్మినల్ బోనస్‌లకు మీరు అర్హత కలిగి ఉంటారు—అలా మీరు మీ పొదుపు బీమా ప్లాన్ నుండి కొంతవరకు అదనంగా పొందుతారు.
ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాన్ యొక్క ముఖ్యాంశాలు ఏవేవి?
ఒకే ఒక్క పాలసీలో పొదుపు మరియు జీవిత రక్షణ యొక్క ప్రయోజనాలతో ఐదు సంవత్సరాల స్వల్పకాలపు చెల్లింపు అవధి నిబద్ధతను అందజేసే ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు అవధి గల పార్టిసిపేటింగ్ ప్లానుగా, ఈ ప్లాను మీరు మీ కుటుంబము యొక్క భవిష్యత్తును పరిరక్షించుకుంటూ మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీకు సహాయపడే ఒక ధృఢమైన పొదుపు సాధనముగా ఉంది. ఈ అన్ని మంచి విషయాల ఆనందంతో పాటుగా, ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ ఈ క్రింది ఫీచర్లను కూడా అందిస్తుంది:
పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి
అనేక పొదుపు బీమా ప్లానులతో, పాలసీ అమలులో ఉన్నంత కాలమూ మీరు ప్రీమియముల చెల్లింపును కొనసాగిస్తూనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ, ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ పాలసీ ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు అవధిని ఆనందించే అవకాశాన్ని మీకు కలిగిస్తుంది. మీరు 10 సంవత్సరాల పాలసీ అవధిని ఎంచుకున్నారా లేదా 15 సంవత్సరాల పాలసీ అవధిని ఎంచుకున్నారా అనేదానితో సంబంధం లేకుండా, మీ ప్రీమియం చెల్లింపు అవధి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ పాలసీతో, మీ దీర్ఘ-కాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికై మార్గం ఏర్పరచుకోవడానికి క్రమశిక్షణతో కూడిన ఐదు సంవత్సరాల పొదుపు చాలు.
జీవిత వర్తింపు ప్రయోజనం యొక్క కొనసాగింపు
జీవిత పరిస్థితులపై ఆధారపడి, మీరు మీ వార్షిక ప్రీమియం చెల్లింపును చేయలేకపోవడమనేది సాధ్యం కావచ్చు. ఈ పాలసీతో, జీవిత వర్తింపు యొక్క కొనసాగుదల అనబడే ఒక ముఖ్యమైన ఫీచరును ఆనందిస్తారు, ఒకవేళ మీరు ఒక ప్రీమియమును చెల్లించడం తప్పినా, ఒక పూర్తి సంవత్సరం పాటు జీవిత వర్తింపు ప్రయోజనం పొందడానికి అది మీకు వీలు కలిగిస్తుంది. ఒక పూర్తి సంవత్సరం ప్రీమియములను చెల్లించిన తర్వాత మాత్రమే ఈ ఫీచరును వినియోగించుకోవచ్చు.
వార్షిక బోనస్‌లు
ఒక పార్టిసిపేటింగ్ పాలసీగా, ఒకవేళ బీమా కంపెనీచే ప్రకటించబడితే, బోనసులను అందుకోవడానికి ఈ ప్లాను అర్హత కలిగి ఉంటుంది. వీటిలో, మెచ్యూరిటీ సమయానికి హామీతో కూడిన భరోసా సొమ్ముపై లెక్కించబడే సింపుల్ రివర్షనరీ బోనస్ లేదా ఎస్.ఆర్.బి (ఒకవేళ ప్రకటించబడితే) మరియు ఒకవేళ బీమా కంపెనీ యొక్క పెట్టుబడి అనుభవము ఆధారంగా ప్రకటించబడిన టెర్మినల్ బోనస్ లేదా టిబి ఉంటాయి.
మెచ్యూరిటీ ప్రయోజనాలు
ఇది మెచ్యూరిటీ లేదా సర్వైవల్ ప్రయోజనాలతో పాటుగా జీవిత వర్తింపు ప్రయోజనాలను అందించే ఒక పొదుపు బీమా ప్లాను. మొత్తం పాలసీ అవధి యొక్క ఆఖరులో, మెచ్యూరిటీ వద్ద మీరు హామీతో కూడిన భరోసా మొత్తము, కూడగట్టిన సింపుల్ రివర్షనరీ బోనస్‌లు ఏవైనా ఉంటే, మరియు ఒకవేళ ప్రకటించి ఉంటే టెర్మినల్ బోనస్ అందుకునే అర్హత పొంది ఉంటారు.
అదనపు రైడర్లు
ఈ పాలసీతో, పాలసీకి రైడర్లను జోడించడం ద్వారా మీరు మీ కవరేజీని పెంపొందించుకునే ఐచ్ఛికం కలిగి ఉంటారు. ప్రమాదపూర్వక మరణ ప్రయోజనము కొరకు ఎంచుకోండి మరియు అటువంటి దురదృష్టకర సంఘటన యొక్క ప్రతికూల ప్రభావాల నుండి మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించండి. పాలసీదారు యొక్క అకాల మరణం, ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా పేర్కొనబడిన క్లిష్ట అస్వస్థతల్లో ఏదైనా సంభవించిన పక్షములో, ప్లాను యొక్క ప్రయోజనాలు కొనసాగుతూనే, భవిష్యత్తు ప్రీమియములను చెల్లించే భారం నుండి మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించడానికి గాను రైడర్ ప్రీమియం యొక్క చెల్లింపుపై ప్రీమియం రైడర్ యొక్క వైవర్‌ని జోడించే ఐచ్ఛికం కూడా కలిగి ఉంటారు.
మరణ ప్రయోజనాలు
పాలసీదారు పరిమిత ప్రీమియం చెల్లింపు అవధి పాటు ప్రీమియములను చెల్లించిన తర్వాత, ప్లాను యొక్క ప్రారంభములో ఎంచుకున్న ప్రకారము 10 లేదా 15 సంవత్సరాల పాలసీ అవధి ముగిసే వరకూ పాలసీ అమలులోనే కొనసాగుతుంది. అంటే దీణి అర్థం, ఐదు సంవత్సరాల తర్వాత ప్రీమియం చెల్లింపు ఆగిపోయినప్పటికీ, పాలసీ నుండి జీవిత వర్తింపు ప్రయోజనాలను పాలసీ యొక్క మొత్తం అవధి పాటు పొందుతూనే ఉండవచ్చు. పాలసీ అమలులో కొనసాగుతూ ఉండగా ఒకవేళ పాలసీదారు గనక మరణించడం వంటి దురదృష్టకర సంఘటన జరిగిన పక్షములో, ప్లాను యొక్క ప్రారంభములో ఎంచుకున్న భరోసా సొమ్ము రూపములో నామినీలు ఒక మరణ ప్రయోజనం అందుకుంటారు. మీ కుటుంబ సభ్యులు మరణ ప్రయోజనం సొమ్మును టోకు మొత్తంగా ఒకే సమయపు చెల్లింపుగా గానీ లేదా తర్వాతి ఐదు సంవత్సరాల పాటు కంతుల రూపములో చెల్లింపు చేయదగిన మొత్తంగా గానీ అందుకోవడానికి ఎంచుకోవచ్చు.
పన్ను ప్రయోజనాలు
ప్రస్తుతము అమలులో ఉన్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములు మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు.
ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాన్ కొనడం వల్ల ప్రయోజనాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్, పాలసీదారుకు మరియు మీకు ప్రియమైన వారికి అనేక ప్రయోజనాల్ని అందజేస్తుంది.
మైక్రో బచత్ పాలసీ మొదలుపెట్టిన మీదట
ప్లాను యొక్క మొట్టమొదటి ప్రారంభములో, ఐదు సంవత్సరాల పరిమిత చెల్లింపు అవధిని మీరు ఎంచుకునే అవకాశం పొందుతారు. ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ ప్రకారము, పాలసీదారు పాలసీ యొక్క మొదటి ఐదు సంవత్సరాల పాటు ప్రీమియములను నెలవారీగా, మూడు నెలల వారీగా, అర్ధ-సంవత్సరం లేదా సంవత్సరం వారీ అంతరాలలో చెల్లిస్తారు. ఈ వ్యవధి తర్వాత, మీ నుండి మరే అదనపు ప్రీమియం లేకుండానే పాలసీ అవధి పాటు కొనసాగే ప్లాను యొక్క మీరు ప్రయోజనాలను సమకూర్చుకోవచ్చు.
పాలసీ యొక్క మెచ్యూరిటీ మీదట
అమలులో కొనసాగిన ప్లాను యొక్క మెచ్యూరిటీ సమయములో, భరోసా ఇవ్వబడిన సొమ్మును మెచ్యూరిటీ ప్రయోజనముగా మీరు పొందుతారు. పాలసీ యొక్క ప్రారంభములో ఈ మొత్తము ఎంచుకోబడుతుంది మరియు ఇది మెచ్యూరిటీ మీద చెల్లించబడే కనీస మొత్తముగా ఉంటుంది.
మెచ్యూరిటీ మీదట ఇవ్వబడే భరోసా సొమ్ముకు అదనంగా, బీమా కంపెనీచే ప్రకటించబడిన అదనపు బోనసులను (సింపుల్ రివర్షనరీ బోనస్ మరియు టెర్మినల్ బోనస్) అందుకోవడానికి మీరు అర్హత కలిగి ఉంటారు. ప్లాన్ ప్రకారము, బోర్డుచే ఆమోదించబడిన అండర్ రైటింగ్ పాలసీల ప్రకారము పాలసీలో కనీస భరోసా ఇవ్వబడిన మొత్తము రు.10,000 లు కాగా గరిష్ట భరోసా ఇవ్వబడిన మొత్తము రు. 2,00,000 లుగా నిర్ణయించబడి ఉంటుంది.
పాలసీ లోని రిస్క్ కవర్ ఐచ్ఛికాలతో
మరణాన్ని కవర్ చేసే లైఫ్ ఆప్షనుతో, మీరు మరణం మీదట హామీతో కూడిన భరోసా సొమ్ముకు సమానమైన మొత్తాన్ని అందుకుంటారు (వార్షిక ప్రీమియముకు 10 రెట్లు) ఇంకా ఏదైనా ఉంటే కూడగట్టుకున్న బోనస్ మరియు ప్రకటించబడి ఉంటే టెర్మినల్ బోనస్ అందుకుంటారు. కనీస మరణ ప్రయోజనము, మరణించిన తేదీ నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియముల యొక్క 105% గా ఉంటుంది.
మరణం మరియు ప్రమాదపూర్వక మరణమును కవర్ చేసే ఎక్స్-ట్రా లైఫ్ ఆప్షనుతో, మీరు పైన కనబరచిన మరణ ప్రయోజనము మరియు ప్రమాదపూర్వక మరణము విషయములో ఒక అదనపు మరణ ప్రయోజనాన్ని పొందుతారు, అది మరణం మీదట హామీతో కూడిన భరోసా సొమ్ముకు సమానంగా ఉంటుంది.
ఒకవేళ పాలసీదారు యొక్క అకాలమరణము సంభవించిన పక్షములో
ఒకవేళ పాలసీదారు గనక పాలసీ యొక్క అవధి పాటు జీవించి ఉండకపోతే, నామినీకి ఒక టోకు మొత్తముగా గానీ లేదా తర్వాతి ఐదు సంవత్సరాల పాటు నెలసరి ఆదాయముగా గానీ మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది.
ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాన్ కొనడానికి అర్హతా ప్రాతిపదిక ఏది?
- 10 మరియు 15 సంవత్సరాల పాలసీ అవధుల కొరకు ప్రవేశం నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు.
- 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు ప్రవేశం నాటికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు, మరియు 15 సంవత్సరాల పాలసీ అవధి కొరకు ప్రవేశం నాటికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
- ప్లాన్ అవధి యొక్క ముగింపు నాటికి 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల పాలసీ అవధి కొరకు 65 సంవత్సరాలుగా ఉంటుంది
- మీరు 10 మరియు 15 సంవత్సరాల పాలసీ అవధికి గాను 5 సంవత్సరాల పాటు ప్రీమియములు చెల్లిస్తారు.
- బోర్డుచే ఆమోదించబడిన అండర్ రైటింగ్ పాలసీ ప్రకారము పాలసీలో కనీస భరోసా ఇవ్వబడిన మొత్తము రు.10,000 మరియు గరిష్ట భరోసా ఇవ్వబడిన మొత్తము రు. 2,00,000 లు.
- దరఖాస్తుదారుల కొరకు కనీస ప్రీమియం రు.1,000 (సంవత్సరం వారీ), రు.512 (అర్ధ-సంవత్సరం వారీ), రు. 259 (మూడు నెలలవారీ), మరియు రు. 87 (నెలవారీ) గా ఉంటుంది, కాగా చెల్లించదగిన గరిష్ట ప్రీమియముకు అధిక పరిమితి అంటూ లేదు, మరియు బోర్డుచే ఆమోదించబడిన అండర్ రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది.
FAQs
-
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ కొరకు నేను ఎందుకు ఎంచుకోవాలి?
నిర్ధారిత చెల్లింపు సామర్థ్యము ఉన్న వారి కొరకు, క్రమశిక్షణ కల పొదుపు యొక్క ప్రయోజనాలు, జీవిత వర్తింపు, పరిమిత ప్రీమియం చెల్లింపు అవధులు, మరియు అదనపు బోనసుల్ని ఆనందించాలనుకునే వారి కొరకు, ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ అనేది కచ్చితమైన పొదుపు బీమా ప్లాను. ఇండియాఫస్ట్ లైఫ్ వారి ఈ పాలసీతో, ప్లాన్ క్రింద అందజేయబడే ప్రాథమిక కవరేజీని పెంచుకోవడానికై మీరు రైడర్లను కూడా జోడించుకోవచ్చు.
-
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ క్రింద అందుబాటులో ఉండే రిస్క్ కవర్ ఐచ్ఛికాలు ఏవేవి?
ఎంచుకోవడానికి గాను రెండు రిస్క్ కవర్ ఐచ్ఛికాలు ఉన్నాయి—లైఫ్ మరియు ఎక్స్-ట్రా లైఫ్. లైఫ్ ఐచ్ఛికం క్రింద, మరణం కొరకు ప్రాథమిక రిస్క్ కవరేజ్‌ని మరణంపై హామీతో కూడిన భరోసా సొమ్ము (వార్షిక ప్రీమియమునకు 10 రెట్లు) మరియు కూడగట్టుకున్న బోనస్‌లు (ఏవైనా ఉంటే), మరియు ఏదైనా ఉంటే టెర్మినల్ బోనస్ వంటి ప్రయోజనాలతో పొందుతారు. కనీస మరణ ప్రయోజనము, మరణించిన తేదీ నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియముల యొక్క 105% గా ఉంటుంది.
ఎక్స్-ట్రా లైఫ్ ఐచ్ఛికం క్రింద, పైన కనబరచిన విధంగా మరణ ప్రయోజనముతో మరణం మరియు ప్రమాదపూర్వక మరణ కవరేజీని మరియు ప్రమాదపూర్వక మరణముపై ఒక అదనపు మరణ ప్రయోజనాన్ని పొందుతారు, అది మరణం మీదట ఇవ్వబడే హామీతో కూడిన భరోసా సొమ్ముకు సమానంగా ఉంటుంది.
-
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ లో ఏవైనా రైడర్లు అందుబాటులో ఉన్నాయా?
ఔను, ప్లాన్ క్రింద అందజేయబడే ప్రాథమిక జీవిత వర్తింపును పెంచుకోవడానికై మీరు రైడర్ల కొరకు ఎంపిక చేసుకోవచ్చు. మీరు మరణం మీదట ప్రీమియం వైవర్ (WOP), ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యముపై లేదా క్లిష్ట అస్వస్థత (యొక్క వ్యాధినిర్ధారణ) ప్రీమియం వైవర్, మరియు మరణం లేదా ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము లేదా క్లిష్ట అస్వస్థతపై ప్రీమియం వైవర్ రైడర్ల నుండి జోడించడానికి ఎంచుకోవచ్చు.
-
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ క్రింద నేను ఒక లోన్ తీసుకోవచ్చా?
ఔను, ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్ క్రింద మీరు ఒక లోన్ పొందవచ్చు. ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితుల్లో, మీరు మీ పాలసీని సరెండర్ చేయాల్సిన అవసరం గానీ లేదా క్లోజ్ చేయాల్సిన అవసరం గానీ లేదు. ప్లాన్ డాక్యుమెంటులో కనబరచియున్నట్లుగా మీరు లోన్ సౌకర్యమును ఉపయోగించుకోవచ్చు. ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము అప్పటి సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులోని సరెండర్ మొత్తంలో 90% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు. కనీస లోన్ మొత్తము రు.1,000 లుగా ఉండాలి.