పెన్షన్ ప్లాన్‌లు

ముందుకు చూడండి మరియు జీవితం జీవించండి

మీరు ఎల్లప్పుడూ ఎలా జీవించాలని ఆశించారో, అలాగే జీవించడం కొనసాగించండి, రిటైర్‌మెంట్ తర్వాత సైతమూ. కేవలం మూడు ప్రాథమిక సూత్రాలను పాటించండి - మీ లక్ష్యాలను ప్రణాళిక చేసుకోవడం, తెలివిగా పెట్టుబడి చేయడం మరియు మీ పెట్టుబడులను పర్యవేక్షించడం.

మా రిటైర్‌మెంట్ ప్లానులను ఒకసారి చూడండి. ఒత్తిడి లేని జీవనం గడపండి!

ఎందుకు ఎంచుకోవాలి ఇండియాఫస్ట్ చే అందించబడే రిటైర్‌మెంట్ ప్లానులను ?

  • మీ జీవితకాలమంతటా భరోసా

    మీ తొలి సంవత్సరాలలో మీరు చెల్లించే మొత్తం ప్రీమియంపై భరోసా గల రాబడులు సంపాదించండి మరియు మీ భవిష్యత్తును పదిలం చేసుకోండి.

  • ఎప్పుడు రిటైర్ అవుతారో ఎంచుకోండి

    ఒకవేళ జీవితములో పెట్టుబడి చేయడం త్వరగా మొదలుపెడితే, చిన్న వయసులోనే పెద్ద ఆపత్కాలనిధి మొత్తాన్ని మీరు వృద్ధి చేసుకోగలుగుతారు. ఇది మీరు రిటైర్‌మెంట్ వయస్సును ఎంచుకోవడానికి మరియు జీవిత అనిశ్చితులను అధిగమించేందుకు సహాయపడుతుంది.

  • చెల్లించే అనుకూలత

    మొత్తం పాలసీ వ్యవధి అంతటికీ ఒకే సారిగా, లేదా ఒక పరిమిత కాలవ్యవధికి ప్రీమియము చెల్లించండి. చెల్లింపులు సంవత్సరం వారీగా, అర్ధ సంవత్సరం వారీగా, మూడు నెలల వారీగా లేదా నెల వారీగా చేయాలా అనే ఐచ్చికాన్ని ఎంచుకునే అనుకూలత కూడా మీకు ఉంటుంది.

  • క్రమం తప్పని ఆదాయము

    మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల పొడవునా సంవత్సరం వారీగా, అర్ధ సంవత్సరం వారీగా, మూడు నెలల వారీగా లేదా నెల వారీగా ఒక ఖచ్చితమైన ఆదాయం అందుకోండి.

  • మీ రిటైర్‌మెంట్ వయసును ఎంచుకోండి

    మీ అవసరాల ప్రకారము మీరు రిటైర్‌మెంట్ వయస్సును ఎంచుకోవచ్చు మరియు 40 నుండి 80 సంవత్సరాల వయోగ్రూపు మధ్య క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడం మొదలుపెట్టవచ్చు.

  • అదనపు వర్తింపు

    మీ అవసరము మరియు ఆవశ్యకత ప్రకారము వివిధ యాన్యువిటీ ఐచ్ఛికాలను ఎంచుకునే అనుకూలత

కొన్ని అంశాలు పరిగణించవలసిన

  • త్వరగా ప్రారంభించుట

  • మీ పదవీ విరమణ ఆదాయాన్ని పని చేయండి

  • మీ జీవిత దశ ఆధారంగా ప్లాన్ చేయండి

  • ఆన్యువిటీ ప్లాన్‌లు

పెన్షన్ ప్లాన్‌లు


రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది, మీ వృత్తిపరమైన ఆదాయము నిలిచిపోవడం మొదలైనప్పుడు మీ జీవన ప్రమాణం మసకబారిపోకుండా చూసుకోవడానికి ఆవశ్యకమైన ఒక అడుగు. ఇండియాలో విశ్వసనీయమైన పెన్షన్ ప్లానులతో, మీ వృద్ధాప్యములో మీరు ఏమి కావాలనుకుంటారో దానిపై రాజీ పడనవసరం లేకుండా మీరు జీవించడం కొనసాగించవచ్చు. ఒకవేళ మీరు జీవనం యొక్క పెరుగుతూ ఉన్న ఖర్చులు అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని అంశంగా తీసుకుంటే, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇంతకు మునుపటి కంటే ఈరోజున చాలా కీలకమైనది.

ఉద్యోగం నుండి రిటైర్ కావడమనేది ఒక జీవితకాల సేవకు ఒక పరాకాష్ట. మీరు మీ సన్నిహితులు మరియు ప్రియమైన వారి పట్ల మీ బాధ్యతలను పూర్తి చేసుకున్నారు మరియు సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా జీవించే హక్కును సంపాదించుకున్నారు. ఆదర్శవంతంగా, మీ రిటైర్మెంట్ ఎటువంటి బాధ్యతలు లేకుండా, మీకు ఏది కావాల్సివస్తే దాన్ని పొందే స్వేచ్ఛ కలిగి ఉంటూ మరియు మనశ్శాంతి కలిగి ఒక వినోదాత్మక మరియు సంతోషకరమైన జీవితం ప్రారంభాన్ని సూచించాలి. కాబట్టి, రేపటిరోజున వినోదాలన్నింటినీ పొంది ఆనందించడానికై, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది రోజున వ్యవహరించాల్సియున్న తీవ్రమైన మరియు ఆవశ్యకమైన భాగం అవుతుంది.

మీరు ఎల్లప్పుడూ ఎలా జీవించాలని ఆశించారో, రిటైర్మెంట్ తర్వాత సైతమూ అలాగే జీవించడం కొనసాగించండి. మీ రిటైర్మెంట్ లక్ష్యాలను ఏర్పరచుకోండి, ఇండియాలోని అత్యుత్తమ రిటైర్మెంట్ ప్లానులలో మదుపు చేయండి, మరియు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ సరియైన దారిలోనే ఉందని నిర్ధారించుకోవడానికై మీ పెట్టుబడులను పర్యవేక్షించండి.

ఒక పెన్షన్ ప్లాన్ అంటే ఏమిటి?


జీవితములో దేనికైనా ప్రాముఖ్యత అనేది దానిలో మీరు ఎంత విలువ ఉంచుతున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ అంటే మీకు ఏమనిపిస్తోంది? అనేకమంది వ్యక్తులకు, రిటైర్మెంట్ అంటే 9 నుండి 5 వరకూ పనిచేసే జీవితం నుండి స్వేచ్ఛ పొందడం అని అర్థం. ఇది, మీరు ఇంతకు ముందు సమయం ఇవ్వలేకపోయిన, జీవితం అందించాల్సిన ప్రతీ విషయానికీ వెళ్ళి ఆనందించడమన్నమాట.

స్వేచ్ఛా సమయము యొక్క ప్రయోజనాలన్నింటినీ మీరు ఆనందించాలనుకుంటే, ఆచరణాత్మకమైన మరియు తార్కికమైన అంశాలను చేపట్టేలా చూసుకోవడమే తొలి అడుగు అవుతుంది. తగినంతగా రిటైర్మెంట్ ప్లానింగ్ తో, రిటైరయిన తర్వాత మీ వృత్తిపరమైన ఆదాయం గురించి గానీ లేదా ఏవైనా అనూహ్యమైన ఖర్చులను భరించగల మీ సామర్థ్యము గురించి మీరు చింతించనవసరం లేదు.

ద్రవ్యోల్బణం ఎంత నిలకడగా పెరుగుతూ ఉందో మీరు పరిగణించినప్పుడు, రిటైర్మెంట్ బీమా ఉత్పాదనల ప్రయోజనాలు స్పష్టంగా అర్థమవుతాయి.నమ్మకమైన రిటైర్మెంట్ ప్లానులతో మీ రిటైర్మెంట్ ఒత్తిడి-రహితంగా ఉండేట్లుగా చూసుకోండి.

ఒక రిటైర్మెంట్ ప్లాన్ లేదా పెన్షన్ ప్లాన్ అనేది, మీ వృత్తిపరమైన ఆదాయం తర్వాత మీ నిర్దిష్ట ఆర్థిక భద్రతా అవసరాలను తీర్చుకోవడానికి రూపొందించబడిన ఒక ఆర్థిక ఉత్పాదన. ఇండియాలో ఒక ప్రముఖమైన పెన్షన్ ప్లాన్, మీరు రోజు చేసుకుంటున్న డబ్బు నుండి కొంత మొత్తం చాలా కాలం పాటు ప్రక్కన తీసి ఉంచుకొనే వీలును మీకు కలిగిస్తుంది.కలగలుపుకున్న ప్రయోజనాలతో కూడగట్టుకున్న ఆపత్కాల నిధి పెంపొందించబడుతుంది మరియు మీరు వృత్తిపరంగా రిటైర్ అయిన తర్వాత మొత్తాన్ని నెలసరి ఆదాయముగా ఉపయోగించుకోవచ్చు

ఇండియాలో ఉన్న రిటైర్‌మెంట్ ప్లాన్‌‌ల రకాలు ఏవేవి?


ఇండియాలో అనేకమైన విభిన్న రకాల రిటైర్‌మెంట్ ప్లానులు ఉండగా, అవి ముఖ్యంగా లైఫ్/ఇమ్మీడియేట్/డిఫర్డ్ యాన్యువిటీ, జాతీయ పెన్షన్ పథకము, పెన్షన్ నిధులు మరియు యులిప్‌ల కేటగరీల క్రిందికి వస్తాయి.

లైఫ్ కవర్ తో /లైఫ్ కవర్ లేకుండా పెన్షన్ ప్లానులు

ఒక పెన్షన్ బీమా ప్లానులో, మీరు మీ భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటూ ఉండగానే మీ జీవితం కవర్ చేయబడిందని తెలుసుకొని మనశ్శాంతితో ఉంటారు. ఒక అనూహ్యమైన సంఘటన జరిగిన ఉదంతములో, మీ బీమా రిటైర్‌మెంట్ పాలసీలో కనబరచబడిన లబ్దిదారులు భరోసా ఇవ్వబడిన మొత్తముగా ఒక ఏకమొత్తం చెల్లింపును అందుకుంటారు.

ఇండియాలోని కొన్ని పెన్షన్ ప్లానులు జీవిత బీమా అంశమును కలిగి ఉండవు.మీ అకాల మరణము సంభవించిన పక్షములో, అటువంటి ప్లానులు, మీ ప్లాను అమలులో ఉండగానే మీరు నిర్మించుకొని ఉన్న మొత్తాన్ని ఏకమొత్తం చెల్లింపుగా మీ లబ్దిదారులకు అందజేస్తాయి. ఈ ఉదంతములో మీ నామినీలకు చెల్లింపు చేయదగిన బీమా మొత్తము లేదా జీవిత వర్తింపు ఏదీ ఉండదు.

యాన్యువిటీ ఇన్స్యూరెన్స్ పెన్షన్ ప్లాన్‌లు

ఒక యాన్యువిటీ ప్లాన్ అనేది, వడ్డీ మరియు బోనసులు (ఏవైనా ఉంటే) వాటిని కూడగట్టుకునే ఒక ఏకమొత్తాన్ని వృద్ధి చేసుకోవడానికి సింగిల్ లేదా కాలానుగత చెల్లింపులు చేయడానికి మీకు వీలు కల్పించే ఒక పాలసీ.ఆ తదుపరి ఈ ఆపత్కాల నిధి, ప్రీమియం చెల్లింపు అవధి పూర్తయిన వెంటనే గానీ లేదా భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయం నుండి గానీ క్రమం తప్పని ఆదాయాన్ని చెల్లించడానికి ఉపయోగించబడుతుంది.

ఒక ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ లో, ప్లాన్ యొక్క ప్రారంభములో మీరు ఏకమొత్తపు ప్రీమియం చెల్లిస్తారు, యాన్యువిటీ తక్షణమే అందుకుంటారు, మరియు మొత్తాలను అందుకోవడానికి ఒక చెల్లింపు అంతరమును ఎంచుకుంటారు.

ఒక డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్ లో, కూడగట్టుకోవడం మరియు ఆదాయంచే విభాగీకరించబడిన రెండు వైవిధ్యమైన దశలు ఉన్నాయి.అటువంటి ఒక పెన్షన్ ప్లాన్, పాలసీ అవధిలో ఒక ఆపత్కాల నిధిని నిర్మించుకోవడానికి మరియు ఆ తర్వాత కాలానుగతమైన యాన్యువిటీ చెల్లింపు రూపములో ఒక పెన్షన్ అందుకోవడానికి మీకు వీలు కలిగిస్తాయి, అది మీరు ఎంచుకున్న దానిని బట్టి భవిష్యత్తులో ఒక సమయములో మొదలవుతుంది.

ఒక జీవిత యాన్యువిటీ ప్లాన్ పాలసీదారుకు వారు మరణించేవరకూ ఒక పెన్షన్ మొత్తాన్ని చెల్లిస్తుంది.‘భాగస్వామితో’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ భాగస్వామి పెన్షన్ మొత్తమును అందుకునేలా మీరు చూసుకోవచ్చు.

సాంప్రదాయక పెన్షన్ నిధులు

ఇండియాలోని పెన్షన్ నిధుల పైకీ ఉద్యోగుల భవిష్య నిధి మరియు ప్రజా భవిష్య నిధి అనేవి రెండు ప్రముఖమైన ఉదాహరణలుగా ఉన్నాయి. ఒక ఇపిఎఫ్ తో, నెలజీతం అందుకునే ఉద్యోగులు అందరూ తమ జీతములో కొంత శాతమును తమ యజమాని నుండి పెన్షన్ నిధి చందాగా అందుకుంటారు.పిపిఎఫ్ అనేది సుదీర్ఘ లాక్ వ్యవధి, చక్రవడ్డీ ప్రయోజనాలు, మరియు మీ కూడగట్టబడిన పెట్టుబడి ధనమును పదిలపరచుకొనే ఒక అవకాశమును అందించే చాలా సుపరిచితమైన పొదుపు సాధనము.

జాతీయ పింఛను పథకము (NPS)

భారత ప్రభుత్వముచే అభివృద్ధిపరచబడిన జాతీయ పింఛను పథకము, ప్రత్యేకించి రిటైర్‌మెంట్ మొత్తాన్ని వృద్ధి చేసుకోవాలనుకునేవారికి బాగా దోహదపడుతుంది. ఆటో మరియు యాక్టివ్ మోడ్స్ మధ్య ఎంచుకోవడానికి ఈ పారదర్శకమైన సాధనము మీకు వీలు కలిగిస్తుంది. ఆటో మోడ్ లో, పెట్టుబడి చేసే మార్గాలుగా కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండులు, మరియు ఈక్విటీలు ఉంటాయి.పై రూపములో, పెట్టుబడి యొక్క 50% ఈక్విటీలో ఉంటుంది మరియు మిగతాది బాండ్లలో ఉంటుంది.

యులిప్ పెన్షన్ ప్లాన్‌లు

యూనిట్-అనుసంధానిత బీమా ప్లానులు అనేవి మార్కెట్-అనుసంధానిత ఉత్పాదనలు, అవి మీ జీవితాన్ని పరిరక్షించడం మరియు మీ డబ్బును చురుగ్గా మదుపు చేయడం అనే రెండు విధాలుగా పనిచేస్తాయి.మీరు చెల్లించే ప్రీమియములు మీ రిస్క్-వాంఛకు అనుగుణంగా బాండ్లు, సెక్యూరిటీలు, మరియు స్టాక్‌లు అనే వాటిలో మదుపు చేయబడతాయి.

ఒక రిటైర్‌మెంట్ ప్లాన్‌ కొనడం వల్ల ప్రయోజనాలు ఏవేవి?


ఆధునిక వైద్య విధానాలు మరియు నానాటికీ పెరుగుతున్న మెరుగైన ఆరోగ్య రక్షణ వసతులకు ప్రాప్యతతో, భారతీయులు సుదీర్ఘ జీవితం యొక్క ప్రయోజనాలను ఆనందిస్తున్నారు.మీరు మీ విశ్రాంత జీవితాన్ని గనక సౌకర్యవంతంగా గడపలేకపోతే, సుదీర్ఘ కాలం జీవించడమనేదానికి ఏ మాత్రమూ విలువ ఉండదు.ఆర్థికంగా సురక్షితమైన రిటైర్‌మెంట్ అనుభవాన్ని సృష్టించుకోవడమే దీని లక్ష్యం.ఇక్కడనే రిటైర్‌మెంట్ బెనిఫిట్ ప్లాన్ రంగం లోనికి ప్రవేశిస్తుంది.

డబ్బు నిరంతరంగా తన విలువను మార్చుకుంటూ ఉంది.ఈ రోజున ఏదో ఒకటి కొనడానికి మీకు అవసరమయ్యే డబ్బు తదుపరి కొన్ని దశాబ్దాల తర్వాత అదే వస్తువును కొనడానికి కచ్చితంగా సరిపోదు. ఇండియాలోని రిటైర్‌మెంట్ ప్లానులు ఈ రోజున ఉత్పన్నం చేయడానికి మీకు ఏమి ఉంది మరియు మీ రిటైర్‌మెంట్ లో మీకు ఏది అవసరం అవుతుందనే దానిపై పొదుపు చేసి మదుపు చేయడానికి సహాయపడతాయి.

రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేయడానికి మరియు ఒక పెన్షన్ ప్లాన్ కొనడానికి ఇవన్నీ ప్రోద్బలమైన కారణాలుగా ఉన్నాయి.

రాజీ పడవలసిన అవసరం లేదు

తగినంత రిటైర్‌మెంట్ ప్లానింగ్ తో, వచ్చే జీతం లేకపోయినప్పటికీ సైతమూ, మీ రిటైర్‌మెంట్ సందర్భంగా మీకు డబ్బు కొరత ఎప్పటికీ లేకుండా చూసుకోవచ్చు.ఇండియాలో రిటైర్‌మెంట్ ప్లానులలో పొదుపు చేయడం మరియు మదుపు చేయడం ద్వారా, భవిష్యత్తులో మీ జీవన ప్రమాణముతో మీరు ఎప్పటికీ రాజీ పడకుండా చూసుకోవడానికి గాను ఈ రోజున మీరు పద్ధతి ప్రకారం చిన్న మొత్తాలను ప్రక్కన పెట్టుకోవచ్చు.

ఒక పెద్ద లక్ష్యం దిశగా చిన్నగా అడుగులు

ఒక మిలియన్ మైళ్ళ ప్రయాణము కూడా కేవలం ఒక్క చిన్న అడుగుతో మొదలవుతుంది.పెన్షన్ ప్లానులు అనేవి దీర్ఘావది పెట్టుబడి సాధనాలు, దీర్ఘ కాలం పాటు మీరు చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా మదుపు చేసుకోవడానికి అవి సహాయపడతాయి. క్రమం తప్పని ఈ పొదుపులు ఒక గణనీయమైన ఆపత్కాల నిధిగా వృద్ధి చెందుతాయి, అవి చక్రవడ్డీ యొక్క ప్రభావాలు మరియు సంభావ్య బోనస్ మొత్తాల కూడిక ద్వారా తదుపరి పెంపొందించబడతాయి. ఆర్థికంగా సురక్షితమైన రేపటి కోసం నేడే మొదలుపెట్టండి.

క్రమం తప్పని ఆదాయం యొక్క ప్రవాహ సృష్టి

అనేక మంది వ్యక్తులు చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేయడంలో మరియు ఒక వర్షపు రోజు కోసం వాటిని ఎత్తి పెట్టుకోవడంలో బాగా ఉన్నారు. అయినప్పటికీ, సరైన పద్ధతిలో ఒక గణనీయమైన ఆపత్కాల నిధిని చేపట్టడం కూడా అవసరం.మీ రిటైర్‌మెంట్ కాలములో, మీ వృత్తిపరమైన జీతం స్థానమును ఆక్రమించే క్రమం తప్పని ఆదాయ ప్రవాహం మీకు అవసరమై ఉంటుంది.మీ రిటైర్‌మెంట్ కాలములో భరోసాతో కూడిన ఆదాయాన్ని సృష్టించుకోవడానికై పెన్షన్ ప్లానులు మీ ఆపత్కాల నిధిని మదుపు చేసి తిరిగి మదుపు చేయడానికి మీకు సహాయపడతాయి.ఇండియాలోని రిటైర్‌మెంట్ ప్లానులతో, మీ జీతం లేకపోవడం గురించి మీరు చింతించబోరు.

మీ ప్రియమైన వారికి భద్రతతో కూడిన ప్లాన్

సరియైన పెన్షన్ ప్లాన్ తో, మీ అకాల మరణము సంభవించిన పక్షములో మీ కుటుంబాన్ని రక్షించే జీవిత వర్తింపును మీరు అందుకోగలుగుతారు.మీరు వెళ్ళిపోయిన తర్వాత మీపై ఆధారపడినవారికి ఒక సురక్షిత రిటైర్‌మెంట్ ఆదాయాన్ని అందించే ఒక యాన్యువిటీ ప్లాన్ ని మీరు ఎంచుకోవచ్చు.

ప్రావిడెంట్ ఫండ్ పొదుపుకు చేదోడువాదోడు

ఒకవేళ ఎప్పుడైనా మీ రిటైర్‌మెంట్ కోసం ప్రాథమిక ప్రావిడెంట్ ఫండ్స్ మరియు గ్రాట్యుటీ పొదుపులు సరిపోతాయని మీరు అనుకొన్న రోజులు ఉంటే, ఇప్పుడవి చాలాదూరం వెళ్ళిపోయాయి.అటువంటి తప్పనిసరి రిటైర్‌మెంట్ పొదుపులు మీ జీవన ప్రమాణము మరియు రిటైర్‌మెంట్ తర్వాతి అవసరాలను తీర్చడానికి ఇక ఏ మాత్రమూ చాలవు.

అదనంగా, అత్యధిక ప్రావిడెంట్ ఫండ్స్, వివాహం లేదా ఒక శిశువు యొక్క జననం వంటి ముఖ్యమైన మైలురాళ్ళ కొరకు కొంత పాక్షిక మొత్తాలను తీసుకోవడానికి వీలు కలిగిస్తాయి. ఉపసంహరణలు తదుపరి ఆపత్కాల నిధిని క్షీణింపజేస్తాయి, వాటిని మరీ ఎక్కువ చాలనంతగా చేస్తూ.

పెన్షన్ ప్లానులు ప్రావిడెంట్ ఫండ్స్ కి అనుబంధం చేయవచ్చు లేదా పూర్తిగా అవసరాన్ని స్థానాంతరం చేయవచ్చు.ఒకవేళ మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ ని శ్రద్ధగా పట్టించుకుంటే, అప్పుడు ప్రావిడెంట్ ఫండ్స్ మరియు గ్రాట్యుటీ నుండి అందుకున్న చెల్లింపులను మీకు ఇష్టం వచ్చిన వాటికి ఉపయోగించుకోవచ్చు.

మీ పిల్లలపై భారాన్ని తొలగించి వేయుట

గతంలో, కుటుంబాలు పెద్దవిగా ఉండేవి, మరియు తల్లిదండ్రులు పట్టించుకోవడానికి పిల్లలు ఎక్కువగా ఉండేవారు.ఇది, రిటైరైన తమ తల్లిదండ్రులను చూసుకోవడంలో పిల్లల ఆర్థిక భారము వ్యాప్తి చెంది వారి పట్ల ఆదరణ తగ్గేలా కూడా చేస్తుంది. ఈరోజున, సూక్ష్మ కుటుంబాలు మామూలైపోయింది, మరియు కుటుంబాల సైజు కూడా ముఖ్యంగా చాలా చిన్నదైపోయింది.

సరియైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ లేనట్లయితే, మీ పిల్లలు మీ తదుపరి సంవత్సరాలలో మీకు సహాయతను అందించడానికి ఎంతో శ్రమను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది, నిధుల లేమి కారణంగా వారు తమ స్వప్నాలు మరియు ఆకాంక్షలను త్యాగం చేసే పరిస్థితికి దారి తీయవచ్చు. ఒక యాన్యువిటీ బీమా రిటైర్‌మెంట్ పాలసీ మీ ఆర్థిక స్వాతంత్ర్యము మరియు మీ పిల్లల మనశ్శాంతిని రక్షించుకోవడంలో ఎంతో దూరం ముందుకు వెళ్ళగలుగుతుంది.

పన్ను ప్రయోజనాలు ప్రోగు చేసుకోండి

ఇండియాలోని ఆదాయపు పన్ను చట్టాలకు లోబడి, రిటైర్‌మెంట్ పాలసీలో చెల్లించిన ప్రీమియములపై మీరు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. రిటైర్‌మెంట్ బీమా ప్రయోజనాలను ఆనందించండి మరియు మీరు చెల్లించిన ప్రీమియములపైన అదే విధంగా పెన్షన్ ప్లాన్ అవధి యొక్క ముగింపులో మీరు అందుకున్న మెచ్యూరిటీ మొత్తాలపై పన్ను తగ్గింపులను క్లెయిం చేయండి

నేను ఎప్పుడు రిటైర్‌మెంట్ ప్లానింగ్ మొదలుపెట్టాలి?


మీ జీవితం యొక్క ప్రతి సీజన్ తన స్వంత సవాళ్ళను కలిగి ఉంటుంది. అత్యధిక ఉదంతాలలో, మనం నేటి సవాళ్ళ గురించి మాత్రమే వ్యవహారం చేస్తుంటాము. రిటైర్‌మెంట్ ప్లానింగ్ అనేది యువ జనాభా చింతించాల్సిన విషయం కాదా, లేదా ఔనా? రిటైర్‌మెంట్ అనేది తమ పరిధికి చాలా దూరంగా ఉన్న సమస్య అని అనేకమంది యువ వృత్తినిపుణులు విశ్వసిస్తుంటారు. అయినప్పటికీ, ఈ రోజున రిటైర్‌మెంట్ ప్లానింగ్ యొక్క ప్రయోజనాలు విరివిగా ఉన్నాయి—మీరు ఎంత యుక్త వయస్కులైతే రిటైర్‌మెంట్ ప్లానింగ్ ప్రారంభించడం మీకు అంత మంచిది. ఎందుకో ఇదిగో ఇక్కడ:

అతికొద్ది నష్టబాధ్యతలు

మీరు ఎంత చిన్నవాళ్ళయితే, మీ బాధ్యతలు అంత తక్కువగా ఉంటాయి. పెద్ద జీతం వచ్చేవరకూ మదుపు చేయడానికి వేచి ఉండడమనేది చాలా స్పృహాత్మక అంశంగా ధ్వనించవచ్చు. అయినప్పటికీ, మీ జీతం పెరిగే కొద్దీ మీ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయనేది అక్షరసత్యం. ఇంటి ఋణాల నుండి పెళ్ళి ఖర్చుల వరకూ, ఆర్థికపరమైన బాధ్యతలు మీరు ఎదిగే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. జీవితం ఆఖరి దశలోకంటే చిన్న వయసులోనే రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవడం ఎంతో ఉత్తమంగా ఉంటుంది.

చిన్న మొత్తాలను పొదుపు చేయడం సులభం

ఒక పెన్షన్ ప్లాన్ మొదలుపెట్టడానికి మీరు పెద్ద మొత్తాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మొత్తాలను స్థిరంగా ప్రక్కన ఉంచుతూ పోతే అది ఎంతో వ్యత్యాసం చేస్తుంది. ఇండియాలోని రిటైర్‌మెంట్ ప్లానులలో మీరు పెట్టుబడి చేసే ముందుగా ఒక గణనీయమైన మొత్తాన్ని పొదుపు చేయడానికి వేచి ఉండే బదులుగా, మీ దగ్గర ఎంత ఉంటే దానితోనే ఈ రోజే మొదలుపెట్టండి.

కూడగట్టుకోవడం యొక్క శక్తిని గరిష్టం చేసుకోండి

మీరు చక్రవడ్డీ యొక్క శక్తిని వాడకానికి ఉంచుకోవడమనేది రిటైర్‌మెంట్ బీమా ప్లానుల యొక్క అత్యంత గణనీయమైన ప్రయోజనాలలో ఒకటి.సంవత్సరాల కొద్దీ స్థిరమైన నిలకడతో మదుపు చేసిన అతిచిన్న మొత్తాలు సైతమూ ఇండియా లోని పెన్షన్ ప్లానులతో చక్రవడ్డీని సంపాదిస్తాయి. చక్రవడ్డీ మీ సమయానికి మరియు మదుపు చేసిన డబ్బుకూ అత్యుత్తమ విలువను ఇస్తాయి.

సుదీర్ఘ జీవితం కోసం పొదుపు

ఒకప్పుడు మనిషి యొక్క ఆశించిన జీవితకాలం సుమారుగా 60-70 సంవత్సరాల వయస్సుగా ఉండేది. ఈరోజున, మీ పుట్టినరోజు శతవార్షికోత్సవం కూడా అసాధ్యమైన విషయమేమీ కాదు. ఒకవేళ మీరు రిటైర్‌మెంట్ యొక్క ముఖ్యమైన వయస్సు 60 సంవత్సరాలుగా పరిగణించుకొని, మీరు ఆ తర్వాత మూడు నుండి నాలుగు దశాబ్దాలు గనక జీవించినట్లయితే, సాధ్యమైనంత త్వరగా రిటైర్‌మెంట్ ప్లానులు మొదలుచేయడం మాత్రమే సరియైన కార్యాచరణ కాగలుగుతుంది.

పన్ను తగ్గించుకునే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోండి

ఇండియాలోని అత్యధిక పెన్షన్ ప్లానులు, చెల్లించిన ప్రీఁఇయములు మరియు మెచ్యూరిటీలో అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలను అందజేస్తాయి.

నేను ఒక పెన్షన్ ప్లాన్ ఎలా కొనాలి?


భవిష్యత్తులో మీ ఆర్థిక భద్రతను చూసుకునే పెన్షన్ ప్లానులను కొనడానికి ఇదిగో ఇక్కడ ఒక కరదీపిక ఉంది.

ఇప్పుడే మొదలుపెట్టండి

చిన్న వయస్సులో రిటైర్‌మెంట్ ప్లానింగ్ అత్యంత లాభదాయకంగా ఉంటుంది. భవిష్యత్తులో మీరు మరెప్పుడూ ఉండబోని అతి చిన్న వయస్సు అయిన ఈ రోజే మదుపు చేయడానికి రెండవ అత్యుత్తమ సమయము.

మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యమయం చేసుకోండి

మార్కెట్-అనుసంధానితం కాని సాంప్రదాయక ప్లానులు రిస్క్-విముఖత ఉన్న వారికి కచ్చితమైనవి. రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం, ఏదైనా అవాంఛనీయ సంఘటన పట్ల కంచెగా సాంప్రదాయక పొదుపు ప్లానులు, యులిప్‌లు, ఈక్విటీ ఫండ్స్, మరియు ఇతర సాధనాలను చేర్చుకొని మీ పోర్ట్ ఫోలియోను వైవిధ్యం చేసుకోవడాన్ని పరిగణించండి.

మీ రిటైర్‌మెంట్ వయసును ఎంచుకోండి

రిటైర్ కావడానికి కీలకమైన వయస్సు 60,సంవత్సరాలు కాగా, మీరు 45 సంవత్సరాల వయస్సులో లేదా అంతకు ముందే సైతమూ రిటైర్ కావాలని ఎంచుకోకూడదు అని కాదు. రాబడులు, రిస్క్-వాంఛ, కాలావధి, మరియు వెస్టింగ్ వయస్సు (మీరు యాన్యువిటీ ప్లాన్ నుండి పెన్షన్ అందుకోవడం మొదలుపెట్టినప్పుడు) విషయానికి వస్తే, ఇండియాలో మీ రిటైర్మెంట్లకు సరిపోయే పెన్షన్ ప్లానులను క్షుణ్ణంగా చూడండి.

కేవలం సాంప్రదాయక నిధులపైననే ఆధారపడవద్దు

ఇపిఎఫ్ మరియు పిపిఎఫ్ వంటి సాంప్రదాయక రిటైర్‌మెంట్ పథకాలు ప్రయత్నించబడి మరియు పరీక్షించబడిన ఆప్షన్లు. అయినప్పటికీ, ఈ సాంప్రదాయక నిధుల నుండి మీరు అందుకునే రిటైర్‌మెంట్ ఆదాయం మీ ఆర్థిక భద్రత అవసరాలకు ఏ మాత్రమూ సరిపోదు. ఈక్విటీ-ఆధారిత పెన్షన్ ప్లానులు మరియు యులిప్‌లను పరిశోధించండి, మరియు మీ డబ్బును మదుపు చేసే ముందుగా పెన్షన్ ప్లానులు కొనడానికి మీకు ఏమి అవసరమో తెలుసుకోండి.

ఇండియాఫస్ట్ లైఫ్ చే అందజేయబడే పెన్షన్ ప్లానుల రకాలు ఏవేవి?


మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన పెన్షన్ ప్లానుల యొక్క సంకలనాన్ని ఇండియాఫస్ట్ లైఫ్ కూర్పు చేసింది. మీ పరిధిలో మీరు ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానులతో ఒత్తిడి-లేని స్వేచ్ఛా జీవితాన్ని గడపండి. ఇండియాఫస్ట్ లైఫ్ చే అందజేయబడే పెన్షన్ బీమా ఐచ్ఛికాల రకాలు ఇవిగో ఇక్కడ:

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్

  • అనుసంధానం-చేయబడని, పార్టిసిపేటింగ్, ఎండోమెంట్ డిఫర్డ్ పెన్షన్ ప్లాన్
  • హామీతో కూడిన యాన్యువిటీ బీమా
  • మదుపు చేయడానికి ఐచ్ఛికాలు—రెగ్యులర్, పరిమిత, లేదా సింగిల్ ప్రీమియములు
  • పాలసీ అవధి 40 సంవత్సరాలు

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్

  • అనుసంధానం-చేయబడని, నాన్-పార్టిసిపేటింగ్, ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్
  • మదుపు చేయు వయస్సు యొక్క ఎంపిక 40-80 సంవత్సరాలు
  • మీ భాగస్వామికి రక్షణ ఇవ్వడానికి జాయింట్ లైఫ్ ఆప్షన్
  • కొనుగోలు ధర తిరిగిరాక ఆప్షన్

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

  • అనుసంధానం-చేయబడని, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత యాన్యువిటీ ప్లాన్
  • 12 యాన్యువిటీ ఆప్షన్లు, లైఫ్ యాన్యువిటీ, డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ, కొనుగోలు ధర తిరిగిరాక ఆప్షన్, యాన్యువిటీ సర్టెన్, మరియు ఎస్కలేటింగ్ లైఫ్ యాన్యువిటీ తో సహా.
  • జీవితకాలపు ఆదాయం యొక్క భరోసా
  • మీ భాగస్వామికి రక్షణ ఇవ్వడానికి జాయింట్ లైఫ్ ఆప్షన్

తరచుగా అడిగే ప్రశ్నలు

  • నాకు ఒక రిటైర్‌మెంట్ ప్లాన్ ఎందుకు కావాలి?

    ఒక రిటైర్‌మెంట్ ప్లాన్ అనేది మీ రిటైర్‌మెంట్ తర్వాత సైతమూ మీ ఆర్థిక భద్రతను చూసుకుంటుంది. అది మీరు చేసే పెట్టుబడిపై ఆధారపడి, దీర్ఘకాలములో నిలకడైన మరియు నిర్మాణాత్మకమైన ఆదాయాన్నిస్తుంది.

  • ఒక రిటైర్‌మెంట్ ప్లానులో పెట్టుబడి చేయడానికి సరియైన వయస్సు ఏది?

    ఎంత త్వరగా వీలైతే అంత మంచిది.దీర్ఘకాలపు పెట్టుబడి పుట్టుక పొందడానికి త్వరగా ఆరంభించండి. ఒక రిటైర్‌మెంట్ ప్లానులో మీరు పెట్టుబడి చేయగల అత్యంత చిన్న వయస్సు 18 సంవత్సరాలు.

  • రిటైర్‌మెంట్ ప్లానింగ్ ని నేను ఎలా ప్రారంభించాలి?

    మీ రిటైర్‌మెంట్ కోసం మీరు ప్లాన్ చేయడం మొదలుపెట్టే ముందుగా, మీ భవిష్యత్ అవసరాలు అదే విధంగా మీ ప్రస్తుత ఆదాయాన్ని అర్థం చేసుకున్నట్లుగా చూసుకోండి. పెట్టుబడి చేయడాన్ని సరసమైనది మరియు సులభమైనదిగా చేయగల వెల్తిఫై అనే సాధనమును ఉపయోగించి మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ ని ఒక్క ఉదుటున ప్రారంభించండి.

  • పన్ను ప్రయోజనాలు ఏవేవి?

    మీరు పెట్టుబడి చేసే ప్రీమియంపై అదే విధంగా వాటి మెచ్యూరిటీ పైన కూడా ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) క్రింద పన్ను ప్రయోజనాలు ఆనందం పొందండి.

  • ఒకవేళ నాకు ఒక పిఎఫ్ ఖాతా ఉన్నట్లయితే, నాకు అప్పటికీ రిటైర్‌మెంట్ పాలసీ అవసరం ఉంటుందా?

    అవును.మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు ద్రవ్యోల్బణం మరియు మెరుగైన ఆరోగ్య రక్షణ కారణంగా పెరిగే జీవితకాలం మున్నగు అంశాలను పరిగణనలోనికి తీసుకోండి. మీ పిఎఫ్ లోని ఆపత్కాల నిధి మీకు అవసరమైన దానికి మాత్రమూ దగ్గరలో ఉండదని మీరే గ్రహిస్తారు. రిటైర్మెంట్ అనంతరం మీ ఆర్థిక భద్రతను చూసుకోవడానికై మీ పొదుపు మరియు మదుపు పోర్ట్ ఫోలియోను వైవిధ్యమయం చేసుకోండి.

  • రిటైర్‌మెంట్ పాలసీలలో కనబరచియున్న వెస్టింగ్/ మదుపు చేసే వయస్సు ఏది?

    వెస్టింగ్ వయస్సు అంటే మీ పెన్షన్ రాబడులు మొదలయ్యే వయస్సు అన్నమాట. మీరు ఎంచుకున్న పెన్షన్ ప్లాన్ రకంపై ఆధారపడి, మీకు ఎక్కువ అవసరమైన తదుపరి తేదీన చెల్లింపులను మీరు వైవిధ్యపరచుకోవచ్చు.

  • నా రిటైర్‌మెంట్ ప్లానింగ్ లో ద్రవ్యోల్బణానికి ఎందుకు విలువనివ్వాలి?

    ధరలు పెరగడమనేది ప్రపంచవ్యాప్తంగా అనివార్యమైన ఒక అంశము. తక్కువ కాలవ్యవధిలో చూసినప్పుడు ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు స్వల్పంగా అనిపించినప్పటికీ, దశాబ్దాల మీదట చూస్తే అందులో భారీగా మార్పు ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ మీరు 5% ద్రవ్యోల్బణ రేటును తీసుకున్నా, అది రు. 100 వంటి చిన్నమొత్తం అవుతుందనుకున్నా, అప్పుడు మీవద్ద ఉన్న విలువ రు.95 అవుతుంది. ఇప్పుడు, ప్రతి సంవత్సరం 5% ద్రవ్యోల్బణం పెరుగుదల ఉంటుందని అనుకోండి. రెండు దశాబ్దాలలో, సుమారుగా రు. 20 లక్షల వంటి గణనీయమైన మొత్తము యొక్క కొనుగోలు శక్తి రు. 7 లక్షలు లేదా ఆపైన ఉంటుంది.

    పైపెచ్చు, ద్రవ్యోల్బణము చుట్టుముడుతూనే ఉంటుంది. మీ రిటైర్మెంట్ లో మీరు పెద్ద కొనుగోళ్ళను చేయాలని అనుకోనప్పటికీ, మీరు ఇంకా ఆహారం, మందులు, ఆరోగ్య రక్షణ సేవలు, ఇంటి వాడుక సరుకులు, వినియోగ బిల్లులు మొదలగు వంటి నిత్యావసరాలపై డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక చక్కని పెన్షన్ ప్లాన్ మీ ఆర్థిక భవిష్యత్తును పదిలపరచుకోవడానికి సహాయపడగలదు.

  • నా పొదుపులో ఎంత మొత్తం రిటైర్‌మెంట్ ప్లానింగ్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది?

    రిటైర్మెంట్ కొరకు మీరు ప్రక్కన ఉంచాల్సిన అవసరం ఉండే కచ్చితమైన మొత్తము, మీ నెలసరి ఆదాయము, భవిష్యత్తులో అంచనా వేయబడిన ఖర్చులు, ద్రవ్యోల్బణం-సర్దుబాటు, మరియు మీ నిర్దిష్ట అవసరాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, మీ నెలసరి ఆదాయములో కనీసం 15% మొత్తాన్ని రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ప్రక్కన ఉంచుకోవాలనేది ఒక మంచి నియమము.

  • ఇండియాలో ఉన్న పెన్షన్ ప్లాన్‌‌ల రకాలు ఏవేవి?

    మీరు ఇండియాలోని వివిధ రకాల పెన్షన్ ప్లానుల నుండి ఎంచుకోవచ్చు. ప్రాథమిక కేటగరీలలో ఇవి చేరి ఉంటాయి:

    డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్లుఇది ఒక దీర్ఘకాలిక మదుపు సాధనము, ఇందులో మీరు కొన్ని సంవత్సరాల పాటు ప్రీమియములను చెల్లించాల్సి ఉంటుంది, తద్వారా మీరు మీ రిటైర్మెంట్ తర్వాత కొంత పాక్షిక మొత్తాన్ని తీసుకోవచ్చు మరియు దాని తర్వాత నెలసరి చెల్లింపులు అందుకోవడం కొనసాగించవచ్చు. రిస్క్-విముఖత గల మదుపరులు ఋణాలు మరియు ప్రభుత్వ సెక్యూరిటీలలో మదుపు చేస్తారు కాబట్టి సాంప్రదాయక డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్లు వారికి సరిపోతాయి.యూనిట్ అనుసంధానిత బీమా ప్లానులు లేదా యులిప్ రిటైర్మెంట్ బీమా ప్లానులు మెరుగైన పన్ను ప్రయోజనాలను అందిస్తాయి, ఐతే మార్కెట్ లో మదుపు చేయాల్సి ఉంటుంది.

    ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ సాధనానికి మీరు సింగిల్ ఏకమొత్తం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి మీరు వెంటనే నెలసరి చెల్లింపును పొందడం ప్రారంభించవచ్చు.

    ఉద్యోగుల భవిష్య నిధి ఇపిఎఫ్ అనేది ఇపిఎఫ్ఓ ఏర్పరచిన నియమాలను అనుసరిస్తుంది మరియు వేతనం పొందే ఉద్యోగులు అందరికీ ఇది ఒక ఐచ్ఛికం.ఒక ఇపిఎఫ్ లో, యజమాని మరియు ఉద్యోగి ఇరువురూ జీతం యొక్క ఒక నిర్ధారిత శాతాన్ని ఉద్యోగి పేరిట ఒక రిటైర్మెంట్ నిధి కోసం విరాళమివ్వాల్సి ఉంటుంది.

    ప్రజా భవిష్య నిధి ప్రజా భవిష్య నిధి 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో సంవత్సరానికి రు. 1.5 లక్షల గరిష్ట మొత్తాన్ని మదుపు చేయుటకు మీకు వీలు కలిగిస్తుంది.

    జాతీయ పెన్షన్ పథకము జాతీయ పెన్షన్ పథకానికి 18 సంవత్సరాల తొలి వయస్సు నుండే విరాళాలివ్వడం మొదలుపెట్టవచ్చు. మీ రిస్క్-వాంఛపై ఆధారపడి మీరు యాక్టివ్ మోడ్ మరియు ఆటో మోడ్ క్రింద మదుపు చేయడాన్ని ఎంచుకోవచ్చు.

  • ఇండియాలో నేను రిటైర్‌మెంట్ కొరకు ఎలా ప్రణాళిక చేసుకోవచ్చు?

    ఒకవేళ మీరు సంతోషదాయకమైన మరియు ఒత్తిడి లేని విశ్రాంత జీవనం ఆశిస్తే, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది తప్పనిసరి. నేటి మీ నెలసరి ఆదాయం, ప్రతిపాదిత రిటైర్మెంట్ వయస్సు, పెన్షన్ మొత్తముగా మీరు ఎంత ఆశిస్తున్నారు, మరియు ద్రవ్యోల్బణం వంటి వివిధ అంశాలను లెక్కలోనికి తీసుకోండి.

    పెన్షన్ ప్లానులు అనేవి మీకు బీమా వర్తింపు మరియు మదుపు ప్రయోజనాలు రెండింటినీ అందించే రిటైర్మెంట్ ప్రయోజన ప్లానులు. కీలకమైన పెన్షన్ బీమా ప్లానులు, ఎంచుకున్న సంవత్సరాల సంఖ్యకు డబ్బును నిలకడగా పొదుపు చేయడం కూడి ఉంటాయి. ఆపత్కాల నిధి పెద్దది మరియు మెరుగైనదిగా చేయబడుతుంది, చక్రవడ్డీ యొక్క శక్తికి ధన్యవాదాలు. మీరు మీ రిటైర్మెంట్ వయస్సుకు చేరుకున్నప్పుడు, మరియు మీ వృత్తిపరమైన ఆదాయం రద్దయినప్పుడు, ఒక యాన్యువిటీ పెన్షన్ ప్లాన్ మీకు ఎక్కువగా అవసరమైనప్పుడు ఒక నిలకడ ధన ప్రవాహం ఉండేలా చూసుకుంటుంది.

  • మీకు రెండు పెన్షనులు ఉండవచ్చునా?

    ఎన్పిఎస్(జాతీయ పెన్షన్ పథకము) మరియు ఎపివై (అటల్ పెన్షన్ యోజన) వంటి ప్రభుత్వ పెన్షన్ పథకాలకు అదనంగా, ప్రైవేటు కంపెనీళు మరియు బీమా ప్రదాలచే అందించబడే బహుళ పెన్షన్ బీమా ప్లానులను కూడా మీరు పొందవచ్చు. అయినప్పటికీ, రెండు ఎన్పిఎస్ ఖాతాలు ఒక వ్యక్తికి లాగా ఒక వ్యక్తి ఒకే విధమైన రెండు ప్రభుత్వ పెన్షన్ ఖాతాలు కలిగి ఉండలేరు. అంతే కాకుండా, మీరు మదుపు చేసిన డబ్బు కొరకు పన్ను తగ్గింపులను అందుకోవాలనుకుంటే, పెన్షన్ పథకాలకు మీరు మదుపు చేసే మొత్తం డబ్బుపై ఒక పరిమితి ఉంటుంది.

  • సూపర్‌యాన్యువేషన్ మరియు రిటైర్‌మెంట్ మధ్య వ్యత్యాసము ఏమిటి?

    సూపర్యాన్యువేషన్ అనేది ఒక రకమైన రిటైర్మెంట్. రిటైర్మెంట్ అనగా, వయస్సులోనైనా ఉద్యోగం నుండి వృత్తిపరమైన ఆదాయం రద్దు కావడమని తెలియజేస్తుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిటైర్ కావడానికి ఎంచుకోవచ్చు. సూపర్యాన్యువేషన్ ప్రత్యేకించి రిటైరింగ్ ని తెలియజేస్తుంది, ఎందుకంటే మీరు ప్రభుత్వముచే ఏర్పరచబడిన రిటైర్మెంట్ వయస్సుకు చేరుకున్నారు కాబట్టి. ఇండియాలో, 60 మరియు 65 సంవత్సరాల మధ్య సూపర్యాన్యువేషన్ ఏర్పడుతుంది. సూపర్యాన్యువేషన్ ప్రయోజనం అనేది ఒక సంస్థాగత రిటైర్మెంట్ కార్యక్రమం లేదా కంపెనీ పెన్షన్ పాలసీ రూపములో యజమానులచే తమ పనివారికి అందించబడే ఒక రకమైన రిటైర్మెంట్ ప్రయోజనము.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

No Data Available