ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

రిటైర్‌మెంట్ తర్వాత సైతమూ, సౌకర్యానికి మించి ఉండండి

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది, మీ జీవిత-కాలమంతటా మీకు క్రమం తప్పని ఆదాయాన్ని భరోసా ఇవ్వడానికి రూపొందించబడింది.మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను చూసుకుంటూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడంలో ఇది మీకు సహాయపడుతుంది.

కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

 • మీ అవసరానికి అనుగుణంగా 12 వేర్వేరు యాన్యుటీ ఎంపికల నుండి మీరు ఎంచుకున్నప్పుడు సాధారణ జీవితకాల ఆదాయానికి భరోసా పొందండి

 • లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ, డిఫెర్డ్ లైఫ్ యాన్యుటీ, ఎస్కలేటింగ్ లైఫ్ యాన్యుటీ వంటి ఎంపికలతో రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ సదుపాయాన్ని పొందండి మరియు మీ ప్రియమైనవారు ప్రీమియం మొత్తాన్ని తిరిగి పొందడంతో మీ నామినీ (ల) ను రక్షించండి.

 • యాన్యుటీ కొన్ని ఎంపిక ద్వారా హామీ పొందండి! దురదృష్టకర సంఘటన మరియు ఆ తరువాత జీవితంతో సంబంధం లేకుండా ముందుగా నిర్ణయించిన కాలానికి మీ యాన్యుటీ మొత్తాన్ని స్వీకరించండి

 • మీరు వాయిదాపడిన లైఫ్ యాన్యుటీ ఎంపికను ఎంచుకున్నప్పుడు మీ అవసరాలకు అనుగుణంగా మీ యాన్యుటీ వాయిదాలను ఆలస్యం చేయండి

 • ఉమ్మడి జీవితం లేదా కుటుంబ ఆదాయం వంటి ఎంపికలతో మీరు లేనప్పుడు కూడా మీ ప్రియమైనవారికి మద్దతు ఇవ్వండి

 • ఎస్కలేటింగ్ లైఫ్ యాన్యుటీ ఎంపికను ఎంచుకోండి మరియు స్థిరమైన రేటుతో పెరుగుతున్న యాన్యుటీ మొత్తాన్ని పొందండి

 • మీరు కొనుగోలు ధర రూపంలో మొత్తాన్ని పొందినందున మరియు మీ చికిత్స కోసం ఉపయోగించుకోవడంతో క్లిష్టమైన అనారోగ్యాల నుండి రక్షణగా ఉండండి

 • మీ పదవీ విరమణ సంవత్సరాల ద్వారా సాధారణ నెలవారీ / త్రైమాసిక / అర్ధ-వార్షిక / వార్షిక ఆదాయాన్ని పొందండి

 • నమూనా యాన్యువిటీ మొత్తాలను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?

 • ఈ ప్లానులో కనీస ప్రవేశ వయస్సు 40 సంవత్సరాలు* మరియు గరిష్ట ప్రవేశ వయస్సు 80 సంవత్సరాలు

 • ప్లానులోని కనీస ప్రీమియం (కొనుగోలు ధర) రు. 1,00,000 గరిష్ట ప్రీమియముపై ఎటువంటి పరిమితీ లేదు

 • కనీస యాన్యువిటీ మొత్తము నెలకు రు. 1,000 మరియు సంవత్సరానికి రు. 12,500లు, గరిష్ట యాన్యువిటీ మొత్తముపై ఎటువంటి పరిమితీ లేదు

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్


బీమా మరియు పెట్టుబడి అవసరాలను కలగలిపి తీర్చుకోవడానికి రూపొందించబడిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్, మీ జీవిత కాలమంతటా మీరు క్రమం తప్పని ఆదాయాన్ని సంపాదించుకునేలా మీకు భరోసా ఇస్తుంది.రిటైర్‌మెంట్ ప్లానింగ్ అనగా మీరు ముసలివాళ్ళయినప్పటి అవసరాలకు డబ్బును ప్రక్కన వేసుకొని ఉండడం కంటే ఎక్కువ అని తెలియజెబుతుంది.అనేకమంది తమ రిటైర్‌మెంట్ కోసం పొదుపు చేసుకుంటూ ఉన్నా, వారిలో అందరికీ తాము ప్రక్కన ఉంచిన వనరుల్ని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవడమెలాగో తెలియదు. సముచితమైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ లో, మీకు ఫీచర్లు మరియు అనుకూలతలను అందించే ఒకదాన్ని కనుక్కోవడం కోసం ఇండియాలోని పెన్షన్ ప్లానులపై పరిశోధన చేయడం చేరి ఉంటుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది మీ రిటైర్‌మెంట్ పాలసీని మీ నిర్దిష్ట అవసరాల కోసం అనుకూలీకృతం చేసుకోవడానికి సహాయపడే అనేక ఐచ్ఛికాలను అందించే ఒక యాన్యువిటీ పెన్షన్ ప్లాను. మీకు ఎటువంటి రకం యాన్యువిటీ కావాలో, మీ రిటైర్‌మెంట్ ఆదాయాన్ని అందుకోవడం ఎప్పుడు మొదలుకావాలనుకుంటున్నారో, మరియు క్లిష్ట అస్వస్థతలపై మీకు మీరుగా రక్షణ సైతమూ కల్పించుకోవాలని అనుకుంటున్నారో ఎంచుకోండి.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ తో జీవితకాలపు ఆదాయం యొక్క భరోసాను ఆనందించండి.

మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం మీరు ఎందుకు ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ ఉపయోగించుకోవాలి?


మీ రిటైర్‌మెంట్ రోజులలో క్రమం తప్పని ధన ప్రవాహమును పొందడమే ఇండియాలో పెన్షన్ ప్లానులను కొనడం వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశ్యము.మీరు రిటైర్‌మెంట్ ప్లానింగ్ ని త్వరితంగా మొదలుపెట్టినప్పుడు, రాబోయే సంవత్సరాలలో మీ జీవితం ఎలాఉంటుందో అనేదానిపై మెరుగైన నియంత్రణ సంపాదించుకుంటారు.మీ నిర్దిష్ట రిటైర్‌మెంట్ ప్లానింగ్ లక్ష్యాలు మీ ప్రస్తుత ఆదాయం, ఆశిస్తున్న జీవన ప్రమాణం మరియు రిస్క్ వాంఛపై ఆధారపడి మారుతుంటాయి.అయినప్పటికీ, ప్రధాన నిర్దేశము అలాగే నిలిచి ఉంటుంది—ఆర్థిక స్వాతంత్ర్యము, మీకు వృత్తిపరమైన ఆదాయము లేనప్పుడు సైతమూ.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ తో మీ రిటైర్‌మెంట్ ని ప్లానింగ్ చేసుకోవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి:

తక్షణ పెన్షన్ చెల్లింపులు

ఇండియాలోని అనేక పెన్షన్ ప్లానులతో, మీరు కాలానుగతమైన చెల్లింపులు అనేక సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది తక్షణ యాన్యువిటీ చెల్లిపులతో ఒక్క-సమయపు చెల్లింపు పాలసీ అయినందున (డిఫర్డ్ యాన్యువిటీ ఆప్షన్లను ఎంచుకొని ఉంటే తప్ప), మీరు భారీ ఆపత్కాల నిధిని మీ తదుపరి సంవత్సరాలలో మదుపు చేయవచ్చు మరియు ఆ తర్వాత వెంటనే పెన్షన్ చెల్లింపులు అందుకోవడం మొదలుపెట్టవచ్చు.

మనశ్శాంతి

మనుషులు సహజంగా ప్రణాళిక రచనాకర్తలు.మనం జాబితాలు చేస్తాము, సమావేశాలను ప్లాన్ చేసుకుంటాము, మరియు లక్ష్యాల చెక్ లిస్టులను ఏర్పాటు చేసుకుంటాము.చక్కగా-రూపొందించుకోబడిన ప్లాన్ అనేది మనకు ఇస్తూనే ఉండే ఒక వరం.సంభావ్య ఎగుడుదిగుడులు ఏవో చూసుకోవడంలో అది ముందస్తుగా మీకు సహాయం చేయడమే కాకుండా, మీ రేపటి రోజు పట్ల శ్రద్ధ తీసుకోబడి ఉంది కాబట్టి నేడు మీరు మనశ్శాంతిని ఆనందించడానికి కూడా అది మీకు వీలు కలుగజేస్తుంది.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ మీకు మనశ్శాంతి ఉండేలా చూసుకోవడానికై 12 విభిన్న యాన్యువిటీ ఆప్షన్లను అందజేస్తుంది.డిఫర్డ్ యాన్యువిటీ వంటి యాన్యువిటీ ఆప్షన్లతో పాటుగా, లైఫ్ యాన్యువిటీ, మరియు యాన్యువిటీ నిశ్చితిని పైపైకి పెంచుకుంటూ, మీరు క్లిష్టమైన అస్వస్థతతో ఏర్పడే ఆర్థికపరమైన చిక్కుల నుండి కూడా రక్షణ పొందవచ్చు.

మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించుట

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది, ఒక మదుపు సాధనముగా ఉంటూ మరియు మీకు జీవిత వర్తింపును అందించేదిగా రెండు విధాలుగా పనిచేసే ఒక పెన్షన్ బీమా ప్లాను.మీ అకాల మరణము సంభవించిన పక్షములో, మీపై ఆధారపడి ఉన్నవారు మీ రిటైర్‌మెంట్ బీమా ప్లానులో భరోసా కల్పించబడిన మొత్తము రూపంలో (యాన్యువిటీ ఆప్షన్ పై ఆధారపడి) ఒక ఏకమొత్తం చెల్లింపును అందుకుంటారు.మీ పరోక్షములో మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును ప్రతి అనూహ్య సంఘటనకూ వర్తించే బీమా చేయబడిన ఒక రిటైర్‌మెంట్ ప్లానుతో పదిలపరచుకోండి.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ క్రింద యాన్యువిటీ ఆప్షన్లు ఏవేవి?


భారతదేశములో, ముఖ్య ఉద్యోగవిరమణ వయస్సు ఇంచుమించు 60 సంవత్సరాలు.అయినప్పటికీ, రిటైర్‌మెంట్ ప్లానింగ్ ని చాలా ముందస్తుగా చేయాల్సి ఉంటుంది, తద్వారా మీ జీవితం యొక్క ఈ కాలం అంతకు ముందు మాదిరిగానే సజావుగా సాగిపోతుంది.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీకు సహాయపడగలిగిన ఒక పెన్షన్ బీమా ప్లాను.

ఇండియాలో మీరు, ప్రయోజనాలు, మినహాయింపులు, ఫీచర్లు లేదా రిటైర్‌మెంట్ ప్లానింగ్ సందర్భంగా ప్రీమియం చెల్లింపు షరతుల ఆధారంగా వైవిధ్యంగా ఉండే అనేక పెన్షన్ ప్లానులను కనుగొంటారు.ఇండియాలో సరియైన రిటైర్‌మెంట్ పాలసీని కనుక్కోవడం అనేది ఒక అతి ముఖ్యమైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ అడుగుగా ఉంటుంది.ఒక పెన్షన్ ప్లాన్ లేదా రిటైర్‌మెంట్ పాలసీగా, ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ కోసం, మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో రక్షణ కల్పించే ఒక ఆపత్కాల నిధిని ఏర్పరచుకోవడానికి దోహదపడే ఒక ఏకైక చెల్లింపును మీరు చేయవలసి ఉంటుంది.మీరు ఎంపిక చేసుకోవడానికి ఇవి అన్నీ యాన్యువిటీ ఆప్షన్లుగా ఉన్నాయి:

లైఫ్ యాన్యువిటీ

ఈ ఆప్షన్ లో, యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు యాన్యువిటీ మొత్తము అరియర్స్ గా చెల్లించబడుతుంది మరియు యాన్యువిటెంట్ యొక్క మరణం తర్వాత రద్దు అవుతుంది.

100% కొనుగోలు ధర తిరిగి రాబడితో లైఫ్ యాన్యువిటీ

యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు యాన్యువిటీ మొత్తము అరియర్స్ గా చెల్లించబడుతుంది మరియు యాన్యువిటెంట్ యొక్క మరణం తర్వాత రద్దు అవుతుంది.ఈ సమయములో, కొనుగోలు ధర యొక్క 100% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లించబడుతుంది.

లైఫ్ కొరకు ఉమ్మడి జీవితములో జీవించియున్న ఆఖరి వ్యక్తి యాన్యువిటీ

ఈ ఆప్షన్ లో, ప్రాథమిక యాన్యువిటెంట్ మరణం తర్వాత సైతమూ మీ జీవిత భాగస్వామి లేదా ఎంచుకోబడిన ఉమ్మడి యాన్యువిటెంట్ చెల్లింపులు అందుకోవడం కొనసాగుతుంది.ఇద్దరు యాన్యువిటెంట్లు కూడా మరణించిన మీదట మాత్రమే యాన్యువిటీ చెల్లింపులు రద్దు అవుతాయి.

100% కొనుగోలు ధర తిరిగి చెల్లింపుతో లైఫ్ కొరకు ఉమ్మడి జీవితములో జీవించియున్న ఆఖరి వ్యక్తి యాన్యువిటీ

ఈ ఆప్షన్ లో, ప్రాథమిక యాన్యువిటెంట్ మరణం తర్వాత సైతమూ మీ జీవిత భాగస్వామి లేదా ఎంచుకోబడిన ఉమ్మడి యాన్యువిటెంట్ చెల్లింపులు అందుకోవడం కొనసాగుతుంది.ఇద్దరు యాన్యువిటెంట్లు కూడా మరణించిన మీదట మాత్రమే యాన్యువిటీ చెల్లింపులు రద్దు అవుతాయి.ఈ సమయములో, కొనుగోలు ధర యొక్క 100% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లించబడుతుంది.

5,10,15 సంవత్సరాలు మరియు తదనంతర జీవితం కొరకు యాన్యువిటీ నిశ్చితి

యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు యాన్యువిటీ మొత్తము అరియర్స్ గా లేదా ఒక నిర్దిష్ట వ్యవధి యొక్క ముగింపు వరకూ, ఏది తర్వాత వస్తే దాని మేరకు చెల్లించబడుతుంది.యాన్యువిటెంట్ యొక్క మరణము లేదా ఒక నిర్దిష్ట వ్యవధి యొక్క ముగింపు, ఏది తర్వాత వస్తే అది జరిగిన మీదట, యాన్యువిటీ చెల్లింపులు రద్దు అవుతాయి మరియు ఆ తర్వాత ఇక ఏ మొత్తమూ చెల్లించబడదు.యాన్యువిటెంట్ ఒక నిర్దిష్ట వ్యవధి 5, 10, లేదా 15 సంవత్సరాల వ్యవధిని ఎంచుకునే ఆప్షన్ కలిగి ఉంటారు.

డిఫర్డ్ (వైవిధ్య) లైఫ్ యాన్యువిటీ

మీరు ఒక నిర్ధారిత యాన్యువిటీ రేటుతో 5-10 సంవత్సరాల వాయిదా వ్యవధిని ఎంచుకోవచ్చు.యాన్యువిటీ చెల్లింపులు యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు వాయిదా వ్యవధి యొక్క ముగింపు తర్వాత చేయబడతాయి.వాయిదా సమయములో ఒకవేళ యాన్యువిటెంట్ యొక్క మరణం సంభవించిన పక్షములో, కొనుగోలు ధర యొక్క 110% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లించబడుతుంది.

కొనుగోలు ధర తిరిగి రాబడితో డిఫర్డ్ (వైవిధ్య) లైఫ్ యాన్యువిటీ

డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ ఆప్షన్ యొక్క అన్ని ప్రయోజనాలతో పాటుగా అదనంగా, ఈ వేరియంట్ కూడా, వాయిదా వ్యవధి తర్వాత యాన్యువిటెంట్ యొక్క మరణం సంభవించిన పక్షములో, కొనుగోలు ధర యొక్క 100% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లిస్తుంది.

క్లిష్ట అస్వస్థత యొక్క వ్యాధినిర్ధారణ లేదా మరణంపై కొనుగోలు ధర తిరిగి రాబడితో లైఫ్ యాన్యువిటీ

యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు యాన్యువిటీ మొత్తము, ఎంచుకోబడిన యాన్యువిటీ చెల్లింపు అంతరమును బట్టి అరియర్స్ గా చెల్లించబడుతుంది.యాన్యువిటెంట్ ఏదేని కవర్ చేయబడే క్లిష్ట అస్వస్థత (అనుబంధం I లో పేర్కొనబడినది) తో వైద్యనిర్ధారణ చేయబడిన మీదట లేదా మరణం తర్వాత, యాన్యువిటీ చెల్లింపులు రద్దు అవుతాయి మరియు 100% కొనుగోలు ధర యాన్యువిటెంట్ కు చెల్లించబడుతుంది లేదా యాన్యువిటెంట్ యొక్క మరణం సంభవించిన పక్షములో నామినీలకు చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.

కొనుగోలు ధర భాగాలుగా తిరిగి రాబడితో లైఫ్ యాన్యువిటీ

యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు యాన్యువిటీ మొత్తము, అరియర్స్ గా చెల్లించబడుతుంది.10 వ సంవత్సరం ఆఖరు నాటికి, యాన్యువిటెంట్ జీవించియుండగా అతనికి కొనుగోలు ధర యొక్క 30% చెల్లించబడుతుంది.10 సంవత్సరాల మీదట యాన్యువిటెంట్ యొక్క మరణం తర్వాత, యాన్యువిటీ చెల్లింపులు రద్దు అవుతాయి మరియు కొనుగోలు ధర యొక్క 70% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లించబడుతుంది.10 సంవత్సరాల లోపున యాన్యువిటెంట్ యొక్క మరణం మీదట, యాన్యువిటీ చెల్లింపు రద్దు అవుతుంది మరియు కొనుగోలు ధర యొక్క 100% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లించబడుతుంది.

లైఫ్ యాన్యువిటీ ఎస్కలేట్ చేయుట

యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు అరియర్స్ గా చెల్లించబడుతుంది, ప్రతి 3 సంవత్సరాలకూ తొలి యాన్యువిటీ పై 5% సామాన్య వడ్డీ రేటుతో యాన్యువిటీ పెరుగుతుంది.

కొనుగోలు ధర తిరిగి రాబడితో లైఫ్ యాన్యువిటీ ఎస్కలేట్ చేయుట

యాన్యువిటెంట్ యొక్క జీవితం కొరకు అరియర్స్ గా చెల్లించబడుతుంది, ప్రతి 3 సంవత్సరాలకూ తొలి యాన్యువిటీ పై 5% సామాన్య వడ్డీ రేటుతో యాన్యువిటీ పెరుగుతుంది.యాన్యువిటెంట్ యొక్క మరణం మీదట, యాన్యువిటీ చెల్లింపులు రద్దు అవుతాయి మరియు కొనుగోలు ధర యొక్క 100% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లించబడుతుంది.

NPS – కుటుంబ ఆదాయము

ఈ ఆప్షన్ క్రింద, యాన్యువిటీ ప్రయోజనం పెన్షన్ నిధి రెగ్యులేటరీ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (PFRDA)చే పేర్కొనబడిన నిబంధనలకు అనుగుణంగా చెల్లించబడుతుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్, ప్రధాన రిటైర్‌మెంట్ పెన్షన్ పథకాలకంటే మీకు ఎక్కువ చేస్తుంది.మీ వృద్ధాప్యములో అది మీకు ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యాన్ని అందించడమే కాకుండా, అది మీకు 12 విభిన్న యాన్యువిటీ ఎంపికలు మరియు పన్ను తగ్గింపులను కూడా ఇస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది మీ కోసం సరియైన పెన్షన్ ప్లాన్ గా ఉంటుందా?


రిటైర్‌మెంట్ ప్లానింగ్ పటిష్టమైన గణాంకాలతో వ్యవహరిస్తుంది.అది ఊహాజనిత పని లేదా కళ కాదు, ఐతే మీ దీర్ఘ-కాలిక రిటైర్‌మెంట్ లక్ష్యాలను ప్రస్తావించడానికి వివిధ వేరియబుల్స్ ని అందించే ఒక శాస్త్రం.మీ ప్రస్తుత ఆదాయం, అంచనా వేయబడిన ఖర్చులు, ద్రవ్యోల్బణం మరియు రిస్క్ వాంఛను పరిగణించుకోండి.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ మీ స్వల్ప - మరియు దీర్ఘకాలిక అవసరాలను తీర్చగలుగుతుందా అని ఒక అంచనాకు రావడానికి ఇది మీకు సహాయపడుతుంది.మీ పెన్షన్ ప్లాన్ ని మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ చెక్ లిస్టుతో సరి తూచుకోండి.

హామీతో కూడిన ఆదాయము

ఇండియాలో అత్యధిక పెన్షన్ ప్లానులు మీ నెలసరి జీతము రావడం ఆగిపోయిన తర్వాత ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి రూపొందించబడి ఉన్నాయి. ఒక యాన్యువిటీ బీమా పెన్షన్ ప్లాన్ ఎంచుకోవడం అంటే, రిటైర్‌మెంట్ పాలసీ అమలులో ఉన్నంతవరకూ మీరు జీవిత వర్తింపు యొక్క ప్రయోజనాలు పొందుతూ ఉంటారన్నమాట.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది, మీకు విభిన్నమైన 12 యాన్యువిటీ ఆప్షన్లను అందించే ఒక సింగిల్ ప్రీమియం వ్యక్తిగత యాన్యువిటీ పాలసీ.ఈ ఆప్షన్లలో డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ, కొనుగోలు ధర తిరిగిరాకతో డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ, యాన్యువిటీ సర్టెన్, మరియు జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యువిటీ ఫర్ లైఫ్.హామీ ఇవ్వబడే ప్రతీ రకం ఆదాయ ప్రవాహం యొక్క సాధక బాధకాలను తూనిక చేసుకోండి.

వెస్టింగ్ ఏజ్ (మొదలయ్యే వయసు)

ఒక పెన్షన్ ప్లానులో వెస్టింగ్ వయస్సు అనేది, పాలసీదారు క్రమం తప్పని ఒక పెన్షన్ అందుకోవడం మొదలయ్యే సమయం.ఒక సింగిల్- ప్రీమియం రిటైర్‌మెంట్ పాలసీగా, ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్, చివరి పుట్టినరోజు నాటికి 40 సంవత్సరాల కనీస వయస్సును లేదా కొనుగోలు ధర తిరిగి చెల్లింపుతో డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ మరియు డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ ఆప్షన్లకు 45 సంవత్సరాల కనీస వయస్సును ఆమోదిస్తుంది. పాలసీ కొనుగోలు సమయానికి గరిష్ట వయస్సు 80 సంవత్సరాలు.

ప్లాన్ సరెండర్ విలువ

మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగా పెన్షన్ ప్లానులను సరెండర్ చేయవద్దని సిఫార్సు చేయబడుతుంది, ఎందుకంటే మీరు రిటైర్‌మెంట్ పాలసీతో ముడిపడి ఉన్న ప్రయోజనాలన్నింటినీ గత్యంతరం లేకుండా కోల్పోతారు.అయినప్పటికీ, మీరు ఒక పెన్షన్ ప్లాన్ కొనే ముందుగా అన్ని సాధ్యతలనూ పరిగణించవలసిన అవసరం ఉంటుంది.ఒకవేళ ఏదైనా కారణముచే మీరు పెన్షన్ ప్లానులను సరెండర్ చేయాల్సివస్తే, మీరు పాలసీ యొక్క సరెండర్ విలువనే అందుకుంటారు (అది చెల్లించబడి ఉన్నంత కాలమూ).ఈ ఫీచర్, ఇండియాలోని పెన్షన్ బీమా పాలసీలచే అందించబడే ఒక ప్రయోజనం.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ ని సరెండర్ చేయడం, పాలసీ డాక్యుమెంటులో పేర్కొనబడి ఉన్నట్లుగా మీకు హామీతో కూడిన సరెండర్ విలువ (GSV) ని ఇస్తుంది.

పన్ను ప్రయోజనాలు

ఇండియాలోని అత్యధిక రకాల పెన్షన్ ప్లానులు పన్ను-సమర్థతా మదుపు సాధనాలుగా ఉండేలా రూపొందించబడ్డాయి.ఆదాయపు పన్ను చట్టము 1961 క్రింద అనేకమైన సెక్షన్లు ఉన్నాయి, అవి మీకు పన్ను తగ్గింపులను క్లెయిము చేసుకునే వీలును కల్పిస్తాయి.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ తో, పన్ను ప్రయోజనాలు (ఏవైనా ఉంటే), చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము అందుబాటులో ఉండవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ చే అందించబడే ప్రయోజనావకాశాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది, అన్ని రంగాల ప్రజల యొక్క వివిధ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఒక విశిష్టమైన ప్లాను.మీ పెన్షన్ ప్లానులు మీ కోసం ఏమి చేయాలో అనేదానిపై ఆధారపడి 12 విభిన్నమైన యాన్యువిటీ ఆప్షన్ల నుండి ఎంచుకోండి.మీరు పరిగణించాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి, తద్వారా మీరు ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ యొక్క సరియైన వేరియంటును ఎంచుకోవచ్చు:

ప్రీమియం/కొనుగోలు ధర

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది కనీస కొనుగోలు ధర రు. 1,00,000 తో ఒక ఏక-సమయపు చెల్లింపు పాలసీ అయి ఉంది.ఇండియాలో పెన్షన్ ప్లానులు కనీస పెట్టుబడి నిర్బంధ పరిమితి అదేవిధంగా గరిష్ట మదుపు మొత్తముతో వస్తాయి.

మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను ప్రణాళిక చేసుకోవడం మీరు రిటైర్‌మెంట్ బీమా ప్రయోజనాలను ఆనందించడానికై రిటైర్‌మెంట్ కొరకు జీవిత బీమాలో ఎంత మదుపు చేయాల్సి ఉంటుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ పెన్షన్ ప్లానుల నుండి మీరు అందుకోవాలనుకుంటున్న మొత్తము నుండి వెనక్కి లెక్క కట్టడం ద్వారా మీరు ఎంత మొత్తం మదుపు చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.

ముప్పులు మరియు రాబడులు

మీ రిస్క్ వాంఛ మీరు ఎంచుకునే మదుపు సాధనాలను నిర్దేశిస్తుంది.ఒకవేళ మీకు అధిక రిస్క్-వాంఛ ఉన్నట్లయితే, అధిక రాబడుల్ని అందించే ఈక్విటీ ఫండ్స్ మరియు ఇతర మార్కెట్ - సంబంధిత సాధనాలలో మీరు మదుపు చేసుకోవచ్చు.ఒకవేళ మీరు రిస్క్-విముఖత ఉన్నవారై మరియు హామీతో కూడిన రాబడుల్లో మదుపు చేసేవారైతే, అనుసంధానం చేయబడని ఇండియాఫస్ట్ లైఫ్ బీమా హామీ ఇవ్వబడిన రిటైర్‌మెంట్ ప్లాన్ ఎంచుకోండి.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ నుండి మీకు ఒక ఆదాయం భరోసా ఇవ్వబడటమే కాకుండా, మీరు దానిని సంవత్సరం వారీ, అర్ధ సంవత్సరం వారీ, త్రైమాసికం వారీ లేదా నెలవారీ అంతరాలలో కూడా అందుకోవడానికి ఎంపిక చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనావకాశాలు

ఎంచుకోబడిన మీ పెన్షన్ ప్లానులు రిటైర్‌మెంట్ తర్వాత మీ ఆదాయం కోసం ప్రాథమిక అవసరాలను తీరుస్తాయని మీరు తెలుసుకోగానే, ఈ రిటైర్‌మెంట్ పాలసీ అందిస్తున్న అదనపు ప్రయోజనాలను చూడండి.రిటైర్‌మెంట్ కొరకు జీవిత బీమా నుండి మరియు ప్రాధాన్యత చేసుకున్న యాన్యువిటీ ఆప్షన్లకు పన్ను తగ్గింపుల వరకూ, పెన్షన్ ప్లాను వేరియంట్ల యొక్క అనుకూల ప్రతికూలతలను బేరీజు వేసుకోండి.

మీ రిటైర్‌మెంట్ ప్లాన్ కు ప్రోత్సాహంగా ఒక పాలసీ

పరస్పరం ప్రోత్సహించుకునే పెట్టుబడి సాధనాల సమాహారమును సృష్టించుకోవడమే మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ యొక్క లక్ష్యము.మీరు చేసే పెట్టుబడిలో మీరు మరీ సాంప్రదాయకంగా లేదా దూకుడుగా ఉంటున్నట్లుగా మీరు అనుకుంటే, ప్రస్తుతమున్న మీ పెట్టుబడులకు ప్రోత్సాహమివ్వడానికి పెన్షన్ ప్లానులను ఎంచుకోండి.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్, కొనుగోలు ధర తిరిగి చెల్లింపు ఆప్షన్ అదేవిధంగా జాయింట్ లైఫ్ ఆప్షన్ అందిస్తుంది కాబట్టి మీరు వెళ్ళిపోయిన తర్వాత సైతమూ మీ జీవితభాగస్వామి యాన్యువిటీ చెల్లింపులు అందుకోవడం కొనసాగుతుంది.

యాన్యువిటీ మొత్తాలను పెంచుకునే ఆప్షన్

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్, మీ అవసరాలపై ఆధారపడి, మీ యాన్యువిటీ చెల్లింపులను పెంచుకునే ఆప్షన్ అందిస్తుంది.కొనుగోలు సమయములో ఎంచుకున్న అదే యాన్యువిటీ ఆప్షన్ తో ఒక టాప్-అప్ ఆప్షన్ ద్వారా దీనిని చేసుకోవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ యొక్క ముఖ్యాంశాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది అనుసంధానితం కాని, నాన్-పార్టిసిపేటింగ్ యాన్యువిటీ ప్లాన్.రిటైర్‌మెంట్ ప్లానింగ్ యొక్క ప్రాథమిక లక్ష్యము మరియు ఎందుకు ప్రజలు ఒక పెన్షన్ ప్లాన్ కొంటారు అనేది, తాము రిటైర్ అవగానే తమకు ఒక ఆదాయ ప్రవాహం ఉండేలా చూసుకోవడం అయి ఉంటుంది. తత్ఫలితంగా మీ వృత్తిపరమైన ఆదాయము రద్దు అవుతుంది, ఐతే రోజువారీ ఖర్చులు మాత్రం మాయమై పోవు.మీరు మీ ఇంటివాడుక సరుకులు మరియు మందుల్ని కొనాల్సి ఉంటుంది, ఇంకా బిల్లుల్నీ చెల్లించాల్సి ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ మీ జీవిత-కాలమంతటా మీకు క్రమం తప్పని ఆదాయం యొక్క భరోసాను అందిస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ యొక్క ముఖ్యమైన విశేషాంశాలు

 • మీ అవసరానికి తగినట్లుగా 12 విభిన్నమైన యాన్యువిటీ ఐచ్ఛికాల నుండి ఎంచుకొని క్రమం తప్పని జీవితకాల ఆదాయ భరోసా పొందండి
 • మీకు ప్రియమైనవారు ప్రీమియం మొత్తాన్ని తిరిగి పొందుతూనే లైఫ్ యాన్యువిటీ, జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యువిటీ, డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ, ఎస్కలేటింగ్ లైఫ్ యాన్యువిటీ మరియు ప్రొటెక్ట్ యువర్ నామినీ (స్) వంటి ఐచ్ఛికాలతో కొనుగోలు ధర సౌకర్యము యొక్క తిరిగి రాబడిని పొందండి.
 • యాన్యువిటీ సర్టన్ ఐచ్ఛికం ద్వారా భరోసా పొందండి.ఒక దురదృష్టకర సంఘటన మరియు తదనంతర జీవితముతో నిమిత్తము లేకుండా ముందస్తు-నిర్ధారిత కాలవ్యవధి కొరకు మీ యాన్యువిటీ మొత్తాన్ని అందుకోండి.
 • మీరు గనక డిఫర్డ్ లైఫ్ యాన్యువిటీ ఐచ్ఛికాన్ని ఎంచుకున్నట్లయితే మీ అవసరాలకు తగ్గట్టుగా మీ యాన్యువిటీ కంతులను ఆలస్యంగా చెల్లించండి.
 • జాయింట్ లైఫ్ లేదా ఫ్యామిలీ ఇన్‌కమ్ వంటి ఐచ్ఛికాలతో మీరు భౌతికంగా లేనప్పుడు సైతమూ మీకు ప్రియమైనవారికి తోడ్పాటునివ్వండి.
 • ఎస్కలేటింగ్ లైఫ్ యాన్యువిటీ ఐచ్చికాన్ని ఎంచుకోండి మరియు ఒక స్థిరమైన రేటుతో ఎదిగే ఒక యాన్యువిటీ మొత్తాన్ని అందుకోండి.
 • మీరు కొనుగోలు ధర రూపములో డబ్బు అందుకుంటారు మరియు దానిని మీ చికిత్సకు వినియోగించుకుంటారు కాబట్టి క్లిష్టమైన అస్వస్థతల నుండి రక్షణతో నిలవండి.
 • మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో ఒక క్రమం తప్పని నెలవారీ/ త్రైమాసిక/ అర్ధ-సంవత్సర/ వార్షిక ఆదాయాన్ని అందుకోండి.
 • టాప్-అప్ ఆప్షన్ ద్వారా మీ యాన్యువిటీ మొత్తాన్ని పెంచుకోండి.
 • చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?


 • ఈ ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లానులో ప్రవేశానికి మీ కనీస వయస్సు, చివరి పుట్టినరోజు నాటికి 40 సంవత్సరాలుగా మరియు గరిష్ట ప్రవేశ వయస్సు 80 సంవత్సరాలుగా ఉండాలి.
 • ప్లానులో కనీస ప్రీమియం (కొనుగోలు ధర) రు. 1,00,000 లు, ఈ ఇండియాఫస్ట్ పెన్షన్ ప్లానులో గరిష్ట ప్రీమియంపై ఎటువంటి పరిమితీ లేదు.
 • కనీస యాన్యువిటీ మొత్తము రు.1,000 నెలవారీగా మరియు సంవత్సరానికి రు.12,500 లు, ఈ పెన్షన్ బీమా కవరేజ్ ప్లానులో గరిష్ట యాన్యువిటీ మొత్తముపై ఎటువంటి పరిమితీ లేదు.

తరచుగా అడిగే ప్రశ్నలు

 • ఒక పెన్షన్ ప్లాన్ అంటే ఏమిటి?

  పెన్షన్ ప్లానులు జీవిత వర్తింపు మరియు మదుపు అనే ద్వివిధ రిటైర్‌మెంట్ బీమా ప్రయోజనాలను అందిస్తాయి. ఇది మీ రిటైర్‌మెంట్ సందర్భంగా మీకు ఆర్థికంగా మద్దతునిచ్చే ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి మీకు వీలు కలిగిస్తుంది. అతిముఖ్యంగా, రిటైర్‌మెంట్ మీదట పాక్షిక మొత్తాన్ని ఒక ఏకమొత్తంగా తీసుకోవచ్చు. మిగతా మొత్తము రెగ్యులర్ నెలవారీ ఆదాయము లేదా యాన్యువిటీగా చెల్లించబడుతుంది.

  మీ పాలసీ ఆప్షన్లు మరియు స్వీయ ప్రాధాన్యతలపై ఆధారపడి మీరు చెల్లింపు అంతరమును ఎంచుకోవచ్చు—నెలవారీగా, మూడునెలల వారీగా, అర్ధ-సంవత్సరం వారీగా లేదా వార్షికంగా.

  రిటైర్‌మెంట్ పాలసీలో కవర్ చేయబడే కాలావధి సందర్భంగా పాలసీదారు యొక్క దురదృష్టకర మరణం సంభవించిన పక్షములో, మీరు ఒక పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేయడానికి ఎంచుకున్నప్పుడు మీరు పేర్కొన్న లబ్దిదారులు భరోసా సొమ్మును అందుకుంటారు. పెన్షన్ ప్లానులు మీ ఆర్థిక భవిష్యత్తును సుస్థిరం చేస్తాయి మరియు మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల్లో క్రమం తప్పని ఆదాయం తీసుకోవడానికి వీలు కలిగిస్తాయి. మీ సువర్ణ సంవత్సరాలలో మీ ఆర్థిక స్వాతంత్ర్యమును చూసుకోవడానికి అవి గొప్ప సాధనంగా ఉంటాయి.

 • నేను ఎంచుకోదగిన పెన్షన్ బీమా యొక్క రకాలు ఏవేవి?

  పెట్టుబడి యొక్క స్వభావం ఆధారంగా, పెన్షన్ బీమా యొక్క రకాలలో శుద్ధంగా పొదుపు ప్లానులు అయినట్టివీ మరియు పెట్టుబడి సాధనాలు అయినట్టివీ ఉంటాయి.

  యాన్యువిటీ ప్లానుల ఆధారంగా కూడా మీరు ఎంచుకోవచ్చు. ఒక ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ అనేది, ఒక సింగిల్ ప్రీమియం చెల్లించడానికి మరియు మీ మిగతా జీవిత కాలానికి తక్షణ చెల్లింపులను పొందడానికి మీకు వీలు కలిగిస్తుంది. దీర్ఘకాలం పాటు ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఎంచుకోబడిన తేదీన చెల్లింపులు మొదలు కావడానికీ ఒక డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్ మీకు వీలు కలిగిస్తుంది.

  పెన్షన్ బీమా ప్లానుల రకాలలో జాయింట్ లైఫ్ యాన్యువిటీ ప్లాన్ ఒకటి, ప్రాథమిక యాన్యువిటెంట్ యొక్క మరణం తర్వాత మీ జీవిత భాగస్వామి/ భాగస్వామికి వారి సంపూర్ణ జీవిత కాలానికి గాను అది పెన్షన్ మొత్తాన్ని చెల్లించడం కొనసాగిస్తుంది.

 • పెన్షన్ ప్లాను కొనడానికి సరియైన వయస్సు ఏది?

  రిటైర్‌మెంట్ అనంతరం సురక్షిత ఆర్థిక భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరూ ముందస్తుగానే సరియైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఒక క్రమం తప్పని ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నప్పుడు, రిటైర్‌మెంట్ గురించి అంతగా చింతించాల్సిన పని లేదని మీకు అనిపించవచ్చు. అయినప్పటికీ, రిటైర్‌మెంట్ ప్లానింగ్ మీ ప్రస్తుత స్థితిని, పెరుగుతున్న ఆరోగ్యరక్షణ వ్యయాలు, ద్రవ్యోల్బణం, మరియు పెరుగుతున్న జీవితకాలం ఆధారంగా భవిష్యత్తులో సౌకర్యవంతంగా జీవించడానికి మీకు ఎంత అవసరమై ఉంటుంది అనే అంచనాలను ఒక అంశంగా చేస్తుంది.

  ఒక పెన్షన్ ప్లాన్ కొనడానికి అత్యుత్తమ సమయం మీరు యుక్తవయసులో ఉన్నప్పుడే. చిన్న వయస్సులో మొదలుపెట్టడం వల్ల అనేక రిటైర్‌మెంట్ బీమా ప్రయోజనాలు అందుతాయి, మరియు మీరు చక్రవడ్డీ యొక్క శక్తితో మీరు ఎంతో ఎక్కువ సొమ్ము చేసుకోవచ్చు. మీ దగ్గర ఉపయోగించడానికి అతి తక్కువ ఉన్నా సరే, త్వరగా మొదలుపెట్టడం చాలా మంచిది. దానికి అర్థం, ఒకవేళ ఆ వయస్సు తప్పితే మీరు ఇక మొదలుపెట్టనేకూడదు అని కాదు. మీరు ఉన్న చోటి నుండి మీకు ఉన్నదానితో మొదలుపెట్టండి. పెన్షన్ ప్లాను కొనుగోలు చేయడానికి రెండవ-అత్యుత్తమ సమయం ఇదే.

 • ఒక రిటైర్‌మెంట్ పాలసీ యొక్క ప్రయోజనాలు ఏవేవి?

  మీరు ఎంచుకున్న యాన్యువిటీ బీమా పెన్షన్ ప్లానులపై ఆధారపడి, మీరు అనేక ప్రయోజనాలకు అర్హత కలిగి ఉంటారు:

  • రిటైర్‌మెంట్ తర్వాత మీ ఆర్థిక స్వాతంత్ర్యం చూసుకోవడానికి గాను హామీతో కూడిన ఆదాయం
  • ఒకవేళ మీ మరణం సంభవించిన పక్షములో మీ జీవితభాగస్వామి పెన్షన్ అందుకునేలా చూసుకునే అవకాశం
  • మీ కుటుంబం కోసం మరణ ప్రయోజనం లేదా భరోసా సొమ్ము
  • ప్రీమియం చెల్లింపు యొక్క అనుకూల షరతులు
  • రైడర్ల యొక్క సంభావ్య జోడింపు
  • ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను చట్టాల క్రింద పన్ను మినహాయింపులు మరియు ప్రయోజనాలు

 • ఇమ్మీడియేట్ మరియు డిఫర్డ్ యాన్యువిటీ పెన్షన్ ప్లానుల మధ్య ఉన్న భేదము ఏది?

  ఒక ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ అనేది ఒక సింగిల్ ప్రీమియం బీమా ప్లాను వంటిది. రిటైర్‌మెంట్ పెన్షన్ ప్లాన్ ని ఒక్క ఉదుటున ప్రారంభించడానికి మరియు వెంటనే నెలసరి చెల్లింపులను అందుకోవడానికీ మీరు ఒక సింగిల్ ప్రీమియం చెల్లింపు చేయాల్సి ఉంటుంది. డిఫర్డ్ యాన్యువిటీ పెన్షన్ ప్లానులకు మీరు ఒక ప్రీమియం చెల్లింపు అవధిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది, ఆ అవధిలో మీరు హామీతో కూడిన పెన్షన్ ప్లాన్ దిశగా దోహదచెల్లింపులు చేస్తారు. అటువంటి పెన్షన్ హామీతో కూడిన ప్లాన్ క్రింద, మీరు సమయాలను, చెల్లింపులు అందుకోవాలనుకుంటున్న ప్రారంభ తేదీ నుండి భవిష్యత్తులో ఒక సమయం వరకూ వైవిధ్యపరచవలసి ఉంటుంది.

 • నేను ఒకటికి మించి పెన్షన్ ప్లానులు కలిగి ఉండవచ్చునా?

  ఔను, మీ అవసరాల మేరకు మీరు ప్రైవేటు బీమాదారుల నుండి రిటైర్‌మెంట్ ప్లానులను కొనుగోలు చేసుకోవచ్చు. అయినప్పటికీ, జాతీయ పింఛను పథకము వంటి ప్రభుత్వం-అందించే పెన్షన్ ప్లానులను ఒకటికి మించి కొనుగోలు చేయలేరు.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ఉత్పత్తుల బ్రోచర్

Download Brochure File

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

మీకు ఆసక్తి కలిగించే ఇతర ఉత్పత్తులు