ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్

మీరు మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా జీవించండి!

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయండి

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ అనేది మీ రెండవ ఇన్నింగుకు గ్యారంటీడ్ ఆర్థిక రక్షణ ప్లాన్. ప్లానులో ప్రారంభ సంవత్సరాలకు గ్యారంటీడ్ రాబడులు పొందే ఎంపికను మరియు బోనస్ ద్వారా మీ రిటైర్మెంట్ కార్పస్ని మరింతగా నిర్మించుకునే అవకాశాన్ని ఇది మీకు కల్పిస్తుంది.

కొనడానికి కారణాలు ఇండియాపస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ ని కొనడానికి గల కారణాలు

  • తరువాతి సంవత్సరాల్లో బోనస్‌లతో మీ స్థిరంగా పెరుగుతున్న రిటైర్మెంట్ కార్పస్ ద్వారా ద్రవ్యోల్బణం కంటే ముందు ఉండండి

  • ముందుగానే ప్రారంభించండి మరియు భవిష్యత్తు కోసం కార్పస్ నిర్మించండి

  • మీ పదవీ విరమణ పూల్‌ను 40 సంవత్సరాల కాలపరిమితి వరకు పెంచుకోండి

  • ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 (సిసిసి) ప్రకారం ఈ ప్రణాళిక కింద చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపులకు మీరు అర్హులు.

  • 40 సంవత్సరాల పాలసీ అవధి వరకూ పెట్టుబడి చేయడం ద్వారా, మీ రిటైర్‌మెంట్ రాబడిని గరిష్టం చేసుకోండి

  • చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు

అర్హత ప్రమాణాలు ఏమిటి?

  • రెగ్యులర్ ప్రీమియం కొరకు, దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.

  • లిమిటెడ్ ప్రీమియం కొరకు, దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.

  • సింగిల్ ప్రీమియం కొరకు, దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 0 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు

  • పాలసీ అవధి యొక్క ముగింపులో కనీస మరియు గరిష్ట వయస్సులు వరుసగా 40 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాలు

  • రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియం కొరకు, హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు.5,00,000 మరియు గరిష్ట పరిమితి పూచీకత్తును బట్టి ఉంటుంది

  • సింగిల్ ప్రీమియం కోసం, కనీస మొత్తం హామీ రూ. 1,00,000 మరియు గరిష్ట పరిమితి పూచీకత్తుకు లోబడి ఉంటుంది

ఇండియాఫస్ట్ హామీతో కూడిన రిటైర్మెంట్ ప్లాన్


ఇండియాలోని పెన్షన్ ప్లాన్లతో, మీ భవిష్యత్తును పదిలపరచుకోవడానికి గాను మీరు సంపాదిస్తూ ఉన్నప్పుడే పొదుపు చేసుకోవచ్చు. ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఒక పొడిగింపు కాలం పాటు క్రమం తప్పకుండా చిన్న మొత్తాలను స్థిరంగా పొదుపు చేసుకోవడానికి మీకు వీలు కలిగించే ఒక బీమా-పెట్టుబడి ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్, తద్వారా మీరు మీ తదుపరి జీవితములో హామీతో కూడిన ఆదాయాన్ని పొందగలుగుతారు.

ఒక వర్షపు రోజు కొరకు పొదుపు చేసుకోవాలనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. మరి మీ జీవితం యొక్క ఒక నిర్దిష్ట కాలవ్యవధి కోసం మరింత ధ్యాస అవసరమవుతుందని ముందుగానే తెలిసి ఉన్నప్పుడు; ముందుచూపుతో ఆలోచించడం మరియు దాని కోసం ప్లాన్ చేసుకోవడం సులభమై ఉండాలి. అయినప్పటికీ, మన రోజువారీ అవసరాలు మరియు ఖర్చులను తీర్చుకోవడానికి తరచుగా సతమతమై పోతుంటాము, తద్వారా తదుపరి సంవత్సరాలకు ప్రణాళిక చేసుకోవడం వెనక్కి పడిపోతుంటుంది. మీరు పనిచేయడం ఆపివేసిన తర్వాత సైతమూ మీరు ఆర్థిక భద్రతా ప్రయోజనాలను ఆనందించడం కొనసాగేలా చూసుకోవడం ద్వారా రిటైర్మెంట్ ప్లానింగ్ మీ భవిష్యత్తును సరియైన మార్గములో ఉంచుతుంది.

మీ రెండో ఇన్నింగ్స్ లో హామీతో కూడిన ఆర్థిక రక్షణతో మీరు నిశ్చింతగా ఉండవచ్చు, ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ తో మీరు ఏర్పరచుకున్న ఆర్థిక భద్రత కవచం మీకు మరియు మీ వృద్ధ్యాప్యములోని డబ్బు సమస్యలకూ మధ్య అండగా నిలబడుతుంది. రిటైర్మెంట్ అనేది, మీ ఉద్యోగ జీవితకాలమంతటా కష్టపడి పని చేసినందుకు గాను నిశ్చింతగా కూర్చొని ఫలితాన్ని ఆనందించే కాలముగా ఉండాలి. సరియైన రిటైర్మెంట్ పాలసీ మీ స్వప్న విహంగాలకు అవసరమైన రెక్కలను ఇస్తుంది.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్, రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఎలా సహాయపడుతుంది?


ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి రిటైర్మెంట్ బీమా ప్లానులు ఇతర ప్రాథమిక జీవిత బీమా ఉత్పాదనల నుండి భిన్నంగా ఉంటాయి. ఒక శుద్ధమైన రక్షణ అవధి ప్లానుతో, ఎంచుకున్న పాలసీ వ్యవధి సందర్భంగా మీరు జీవిత వర్తింపును ఆనందిస్తారు. మెచ్యూరిటీలో, మీకు జీవించియున్న ప్రయోజనాలు లేదా చెల్లింపులు ఏవీ ఉండవు. అయినప్పటికీ, పాలసీ వ్యవధి సందర్భంగా మీరు కాలధర్మం చెందిన పక్షములో, మీపై ఆధారపడినవారు మీ జీవితబీమా పాలసీ యొక్క భరోసా ఇవ్వబడిన చెల్లింపుగా ఒక ఏకమొత్తపు ధనం అందుకుంటారు.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనం కలిగించే ప్లానులు, నిరంతరం స్థిరంగా పొదుపు చేసుకుని, మీరు మరణించే వరకూ క్రమం తప్పని ఆదాయం రూపములో హామీతో కూడిన రాబడులను అందించే ఒక బీమా ఉత్పాదనలో పెట్టుబడి చేసుకునే ఒక అవకాశాన్ని మీకు అందిస్తాయి. అంతే కాకుండా ఇంకా, పాలసీ వ్యవధి సందర్భంగా మీ అకాల మరణం సంభవించిన పక్షములో, ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ క్రింద మీపై ఆధారపడి ఉన్నవారు ఏకమొత్తపు చెల్లింపులు లేదా క్రమం తప్పని నెలసరి ఆదాయం రూపములో మరణ ప్రయోజనాన్ని అందుకుంటారు.

రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది, మీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లక్ష్యాలు నెరవేరేలా మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహణ చేసుకునే ప్రక్రియ. మీ రిటైర్మెంట్ ని సరియైన మార్గములో ప్రణాళిక చేసుకోవడం వల్ల, మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు అదేవిధంగా మీ విశ్రాంత జీవితములో కూడా అది మీ ఆర్థిక నిలకడ సుస్థిరంగా ఉండేలా చూసుకుంటుంది. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని లెక్కలోనికి తీసుకుంటూ, మీ భవిష్యత్తు కొరకు మీ ఉద్దేశ్యాలు, మరియు మీ రిటైర్మెంట్ సందర్భంగా మీరు అందుకోవాలని ఆశించే నగదు రాబడి కోసం, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మీరు ఒక చక్కని మరియు స్పృహాత్మకమైన మార్గసూచీని ఏర్పాటు చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

ఇండియాలో, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది కేవలం ఒక స్వతంత్రమైన విశ్రాంత జీవనశైలిని ప్రణాళిక చేసుకోవడానికి సంబంధించినది మాత్రమే కాదు. మీకు క్రమం తప్పని నెలజీతము రానప్పుడు దీర్ఘ కాలంలో తలెత్తే అవకాశం ఉన్న ఆర్థిక బాధ్యతలకు తయారీలు చేసుకోవడం కూడా అందులో ఇమిడి ఉంటుంది.

ఇండియాలో ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి సరియైన పెన్షన్ బీమా ప్లానులతో, మీ బంగారు సంవత్సరాలలో మీ ఆర్థిక భద్రత కోసం మీరు ప్రణాళిక చేసుకోవచ్చు, ఆ సమయములో తలెత్తగల ముఖ్య జీవిత లక్ష్యాలకు డబ్బు ప్రక్కన పెట్టుకోవచ్చు, మరియు అనూహ్య పరిస్థితులు మరియు ఆరోగ్యరక్షణ సమస్యల కోసం ప్రణాళిక చేసుకోవచ్చు.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ ఎటువంటి ప్రయోజనావకాశాలను అందిస్తుంది?


అనేకమైన పెట్టుబడి సాధనాలు ఎన్నో ఉండగా, మీరు రిటైర్మెంట్ ప్రణాళిక చేసుకోవడం ఎందుకు ప్రారంభించాలి మరియు ఇండియాలోని పెన్షన్ ప్లాన్లలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని మీకు అనిపించవచ్చు. ప్రతి పెట్టుబడి ఉత్పాదన కూడా కొంత నిర్దిష్టతను అందిస్తుంది. ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి పెన్షన్ ప్లానులు మదుపు మరియు బీమా యొక్క రెండు రకాల ఉద్దేశ్యాలను నెరవేరుస్తాయి.

జీవితంలో తదుపరి దేనికోసమో మీరు వేచి చూడనవసరం లేకుండా చూసుకోవడానికి కంటింజెన్సీ ప్లానింగ్ చేయబడుతుంది. చింతలు లేని రిటైర్మెంట్ కాలాన్ని ఆనందించడానికి, మీరు ఈరోజే ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ తో రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది.

పెన్షన్ ప్లానులు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తాయి. హామీతో కూడిన నెలసరి ఆదాయము నుండి అధిక వెస్టింగ్ వయస్సు వరకూ, ప్రతీ పెన్షన్ ప్లాన్ మీరు సద్వినియోగం చేసుకోవడానికై విభిన్న ప్రయోజనాల్ని అందిస్తాయి.

మదుపు ఐచ్ఛికాలు

ఇండియాలో పెన్షన్ ప్లానులను ఎంచుకునేటప్పుడు, వ్యక్తి యొక్క రిస్క్ వాంఛను అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఒకవేళ మీకు రిస్క్-హితమైన ప్రొఫైల్ ఉన్నట్లయితే, ఈక్విటీలో పెట్టుబడి చేసే పెన్షన్ ప్లానులను మీరు ఎంచుకోవచ్చు. మరొక వైపున, ఒక రిస్క్-విముఖత ఉండే పెన్షన్, సురక్షిత ప్రభుత్వ బాండ్లు మరియు సెక్యూరిటీలలో మదుపు చేసే అనుసంధానం- చేయబడని ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి రిటైర్మెంట్ బీమా ప్లానులతో చక్కగా పనిచేస్తుంది. మీ రిస్క్ వాంఛను మనసులో ఉంచుకొని మీ మదుపు ఆప్షన్లను ఎంచుకోండి.

స్థిరమైన పొదుపు (సేవింగ్స్)

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి రిటైర్మెంట్ పాలసీలు తదుపరి మీరు పెట్టుబడి చేయడానికి ఎంచుకోగల యాన్యువిటీలను సృష్టిస్తాయి. ఒక పొదుపు సాధనముగా, పెన్షన్ ప్లానులు కొంత కాలం పాటు కొంత మొత్తం డబ్బును పద్ధతి ప్రకారం ప్రక్కన ఉంచుకునే అవసరాన్ని మీకు కల్పిస్తాయి. ఒకవేళ, దీర్ఘకాల వ్యవధిలో చక్రవడ్డీని సంపాదించి పెట్టే ఆపత్కాల నిధిని ఏర్పరచుకోవడం మీకు అవసరమైతే, అందుకు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ ఒక మంచి పందెం అవుతుంది.

లైఫ్ కవర్ పొందండి

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ మీకు పొదుపు చేసుకొని వడ్డీ సంపాదించుకునే, మీ డబ్బును మదుపు చేసుకొనే, మరియు పాలసీ అవధిలో జీవిత రక్షణను ఆనందించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ విధంగా, మీ రిటైర్మెంట్ రక్షణ పొందినట్లుగా మీరు భరోసాతో ఉండవచ్చు, మరియు మీ అకాల మరణం సంభవించిన పక్షములో మీపై ఆధారపడి ఉన్నవారు ధన ప్రవాహాన్నే అందుకుంటారు.

ద్రవ్యోల్బణాన్ని తటస్థీకరించండి

మీరు ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలను తిరస్కరించే లేదా తొలగించుకునే అవకాశం లేనందువల్ల, పెన్షన్ ప్లానులు అనేవి సాధ్యమైనంత ఎక్కువగా ద్రవ్యోల్బణ ప్రభావాలను తటస్థీకరించే రిటైర్మెంట్ ప్రయోజన ప్లానులుగా ఉంటాయి. ఈ ఇండియాఫస్ట్ పెన్షన్ పాలసీతో, మీరు పాలసీ నిబంధనల క్రింద మొదటి 2/4/6 పాలసీ సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియముల యొక్క 9% మొత్తం నిర్ధారిత ప్రయోజనాన్ని హామీ ఇవ్వబడే అదనపు ప్రయోజనముగా అదేవిధంగా ఏవైనా ఉంటే బోనస్ లతో సహా సంపాదించుకుంటారు.

తేదీని ఎంచుకోండి

పెన్షన్ ప్లాన్లతో, మీరు ఒక డిఫర్డ్ యాన్యువిటీ మరియు ఇమ్మీడియేట్ యాన్యువిటీ మధ్య ఎంపిక చేసుకోవచ్చు. ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి ఒక డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్ లో, మీరు ఆపత్కాల నిధిని బీమాదారుతో వదిలేస్తారు, తద్వారా మీరు నెలసరి ఆదాయాన్ని అందుకోవడానికి సిద్ధం అయ్యే వరకూ అది వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు రిటైర్ కావాలనుకుంటున్నారో మరియు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ నుండి పెన్షన్ అందుకోవడం ఎప్పుడు మొదలు పెడతారో ఎంచుకోండి.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ మీ అవసరాలను తీరుస్తుందా?


మీ అవసరాలు ఏమిటో మీకు కచ్చితంగా తెలిసి ఉన్నట్లయితే, ఇండియాలో పెన్షన్ ప్లానులను కొనడం కష్టమేమీ కాదు.  మీకు మీరు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడగడం మరియు వాటికి మీరు పొందిన సమాధానాల చుట్టూ మీ జీవితాన్ని ప్రణాళిక చేసుకోవడం ద్వారా రిటైర్‌మెంట్ ప్లానింగ్ మొదలవుతుంది.  ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ ని మదింపు చేసుకోవడానికి మీకు సహాయపడే ప్రశ్నల చెక్‌లిస్టు ఇదిగో!.

మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలు ఏవి?

మొదటి అడుగు, మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను గుర్తించడం. మీరు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించాలనుకుంటున్నారా లేదా మీ ప్రియమైన వారితో ఇంటిలోనే ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నారా? జీవితం తదుపరి కాలములో గణనీయమైన ఖర్చుల కోసం మీకు నిధులు అవసరమా? మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను వ్రాసి ఉంచుకోండి, మరియు స్వల్ప- మధ్యకాలిక- మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల లోనికి జాబితాను వేరు చేయండి. ఈ అవసరాలను తీర్చుకోవడానికి ఎటువంటి రకం ఆర్థిక వనరులు మీకు అవసరమో నిర్ణయించుకోండి.

మీయొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

ఈ అడుగు పొదుపు లేకపోవడం/అతితక్కువ పొదుపు కలిగి ఉండడం గురించి మీకు మీరుగా సానుభూతి ఇచ్చుకోవడానికి కాదు. మీరు ఎంత సంపాదిస్తారు, మీ జీవన ప్రమాణము ఏమిటి, రిటైర్‌మెంట్ పొదుపు కోసం మీరు ఎంత మొత్తం ప్రక్కన ఉంచుకోగలుగుతారు, మరియు మీ అప్పు బాధ్యతలు ఏవి అనే విషయాలకు సంబంధించి మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకోండి. మీరు ఎక్కువగా పొదుపు చేసుకోనప్పటికీ సైతమూ, మీ లక్ష్యాల దిశగా పని చేయడం మొదలుపెట్టడానికీ మరియు మీ ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ ని ఒక్క ఉదుటున ప్రారంభించడానికీ ఇప్పటికంటే మంచి సమయం మరొకటి లేదు.

రిటైర్ అయ్యేటప్పటికి మీకు ఎంత మొత్తం అవసరమవుతుంది?

మీ ప్రస్తుత జీవన ప్రమాణము మరియు మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో మీరు నిర్వహించాలనుకునే ప్రమాణముపై ఆధారపడి, మీరు ఆర్థికంగా సురక్షితమైన విశ్రాంత జీవితాన్ని ఆస్వాదించడానికి మీకు అవసరమైన నిర్దిష్ట మొత్తాన్ని మీరు లెక్కించుకోగలుగుతారు. ఈ మొత్తాన్ని ఒకసారి మీరు లెక్కించుకున్నారంటే, మీరు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ వంటి పెన్షన్ ప్లానులలో ఎంత మొత్తం మదుపు చేయాల్సి ఉంటుందో ఈరోజు వెనక్కి లెక్కింపు చేసుకోగలుగుతారు.

మీరు మీ పెన్షన్ ఎలా అందుకోవాలనుకుంటున్నారు?

జీతం పొందుతున్న నిపుణులుగా, అనేకమంది నెలసరి ఆదాయం పొందుతూ ఉంటారు. సముచితమైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ మరియు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ వంటి చక్కని ఆప్షన్లతో, మీచే ఎంపిక చేయబడే కాలానుగత వ్యవధుల్లో హామీతో కూడిన ఆదాయాన్ని అందించే డిఫర్డ్ లేదా ఇమ్మీడియేట్ యాన్యువిటీ పెన్షన్ ప్లానులను మీరు ఎంచుకోవచ్చు.

 

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ తో రిటైర్మెంట్ ప్లానింగ్ ని ఎప్పుడు మొదలుపెట్టాలి?


ఏ ప్లానింగ్ యొక్క పరిమళమైనా దానిని ముందస్తుగా చేయడం పైనే ఉంటుంది. ఈ విషయములో రిటైర్మెంట్ ప్లానింగ్ భిన్నమైనదేమీ కాదు. దానిని చాలా ముందుగానే చేసుకోవలసి ఉంటుంది, తద్వారా సరియైన పెంషన్ ప్లానులలో పెట్టుబడి చేయడానికి, చక్రవడ్డీ ద్వారా వడ్డీ సంపాదనకు, మరియు మీ డబ్బు పెరిగేలా చూసుకోవడానికీ తగినంత సమయం ఉంటుంది. ఒక పొడిగింపు కాలం వరకూ మదుపు చేస్తూ ఉండేలా పరిగణించడం అనేది రిటైర్మెంట్ ప్లానింగ్ ధృఢంగా ఉండేందుకు అవసరం, మొదలుపెట్టడానికి అత్యుత్తమ సమయం మీ 20 వయసు సంవత్సరాలలో.

భారతదేశములో, ముఖ్యంగా ఉద్యోగవిరమణ వయస్సు 60 సంవత్సరాలు. అంటే దీని అర్థం మీరు సగటున 30-40 సంవత్సరాల మధ్యన ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ తో ఒక సౌకర్యవంతమైన భవిష్యత్తును మొదలుపెట్టడానికి ఈ వ్యవధి మీకు ఒక విండో వ్యవధిగా ఉంటుంది. మీరు మొదలుపెట్టే వయస్సు, దీర్ఘకాలములో మీరు సృష్టించగలిగిన ఆపత్కాల నిధికి ఒక గణనీయమైన వ్యత్యాసాన్ని చేస్తుంది. కొద్ది సంవత్సరాల పాటు ఒక స్వల్ప ఆలస్యము సైతమూ మీ రిటైర్మెంట్ పాలసీ ఆపత్కాల నిధిని గణనీయంగా తగ్గించివేసే అవకాశం ఉంది.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ తో రిటైర్మెంట్ ప్లానింగ్ ని మూడు దశలుగా విభజించవచ్చు:

పెన్షన్ ప్లానులు మరియు రిటైర్మెంట్ పెన్షన్ పథకాలలో మీరు మీ డబ్బును చురుగ్గా మదుపు చేయడం ప్రారంభించే మదుపుచేయు దశ. ఈ దశ, సామాన్యంగా మీరు మొదలుపెట్టిన సమయం నుండి మీ 50 ల వయసు వరకూ పొడిగించబడి ఉంటుంది. ఈ వ్యవధి యొక్క ప్రారంభములో, మీకు కొద్దిపాటి నష్టబాధ్యతలు మరియు జవాబుదారీలు ఉంటాయి, అంటే మీరు పొదుపుకు మరియు మదుపుల వైపు ఎక్కువ డబ్బును మళ్ళించాల్సి ఉంటుందని అర్థం.

మీరు పెద్దవాళ్ళయ్యే కొద్దీ, మీ జీతం పెరుగుతూ ఉంటుంది, అదేవిధంగా ఖర్చులూ పెరుగుతాయి. మీరు ఇంటి ఋణాలు, పిల్లల చదువుల ఖర్చులు మొదలగు వంటి ఇతర గణనీయమైన వ్యయ అంశాలలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ దశలో ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ కు దోహదం చేసేందుకు సరియైన వ్యవధి మరియు మొత్తాన్ని ఎంచుకోండి.

కూడగట్టే దశ అనేది, మీ పెట్టుబడులు రాబడులను చూపిస్తూ మీ ఆపత్కాల నిధి పెంపొందడం మొదలు చేసే దశ. రిటైర్మెంట్ ప్లానింగ్ క్రింద కవర్ చేయబడే చివరి దశ ఉపసంహరణ (విత్డ్రాయల్) లేదా పంపిణీ దశ. ఈ వ్యవధి మీరు మీ రిటైర్మెంట్ వయస్సుకు చేరినప్పుడు మరియు ఆదా చేసుకున్న ఆపత్కాల నిధి నుండి నెలవారీ ఆదాయం అందుకోవాలని అనుకుంటున్న సమయం అయి ఉంటుంది.

మీరు రిటైర్ కావడానికి సమయం దగ్గరపడే కొద్దీ, మీ ఆపత్కాల నిధిని ముప్పుతో కూడిన పెట్టుబడుల నుండి సురక్షిత పందేల వైపుకు మళ్ళించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ మీదట, మీరు ఒక గణనీయమైన ఏకమొత్తం చెల్లింపును, అనేక విత్డ్రాయల్స్, లేదా నెలవారీ ఆదాయం యొక్క ఒక వనరును అందుకోవాలనుకుంటున్నారా అనేది ఎంచుకోండి.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి హామీతో కూడిన పెన్షన్ ప్లానులతో, మీరు ఎప్పుడు మీ పెన్షన్ యాన్యువిటీని అందుకోవాలని అనుకుంటారో మీరే నిర్దేశిస్తారు.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ కొనేటప్పుడు పరిగణించాల్సిన అంశాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఒక పెన్షన్ జీవిత వర్తింపు, అది మీకు జీవితబీమా వర్తింపు మరియు మదుపు యొక్క రెండు విధాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ లో ఎంత మదుపు చేయాలో మీరు ఎంచుకునే ముందు, మీరు పరిగణించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి:

నెలసరి ఖర్చులు

రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, మీ నెలసరి ఆదాయం మరియు ఖర్చులు అనేవి రెండు ప్రాథమిక నిర్ణయాత్మక అంశాలుగా ఉండి మీరు పెన్షన్ ప్లానులు మరియు రిటైర్మెంట్ బీమాలో ఎంత మదుపు చేయాల్సి ఉంటుందో నిర్ణయిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత సైతమూ, మీకు ఇప్పుడు ఉన్న నెలవారీ ఖర్చులలో సుమారుగా 60-80% వరకూ ఆదాయంగా రావాల్సిన అవసరం ఉంటుందని సాధారణ నియమం పేర్కొంటుంది. మీ వృత్తిపరమైన జీతము రావడం ఆగిపోయిందంటే, మరి ఈ నెలవారీ ఖర్చులకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఒకవేళ సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే, ఈ డబ్బు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ రిటైర్మెంట్ యాన్యువిటీ ప్లాన్ నుండి వస్తుంది.

ధరలు పెరగడం/ద్రవ్యోల్బణం

ధరలు పెరగడమనేది విశ్వవ్యాప్తంగా ఉన్న నిశ్చితి. ద్రవ్యోల్బణం యొక్క రేటు నిరంతరంగా పెరుగుతూ ఉంది, అంటే దాని అర్థం, నేటి రు. 1 లక్ష యొక్క కొనుగోలు శక్తి రాబోయే కొన్ని దశాబ్దాలలో చాలా వరకూ తగ్గిపోతుంది. మీరు ఒక పెన్షన్ ప్లాన్ కొనే ముందుగా ద్రవ్యోల్బణాన్ని ఒక అంశంగా లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ గనక ద్రవ్యోల్బణానికి చోటు కల్పిస్తే, మీరు రిటైర్ అయినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉండరు. ఈ లెక్క చేసుకోవడానికి ఒక ఆన్లైన్ రిటైర్మెంట్ ప్లానర్ ఉపయోగించండి, అలా మీరు మీ ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ నుండి అత్యుత్తమ విలువను పొందగలుగుతారు.

మీ పరిశోధన మీరు చేయండి

వయోవృద్ధులు (సీనియర్ సిటిజెన్లు) ఎంచుకోవడానికై వారికోసం అనేకమైన బీమా ప్లానులు మరియు రిటైర్మెంట్ యాన్యువిటీ ప్లానులు ఉండగా, ఎంపిక కోసం మీరు మనసు పాడు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ విషయానికి వచ్చినప్పుడు, మీ అవసరాలు, ఆదాయం మరియు ఖర్చులు మీ ఇతర కుటుంబ సభ్యుల కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి, వారు ఏది చేసినా దానిని మీరు గ్రుడ్డిగా అనుసరించలేరు. ఆన్లైన్ ద్వారా ఒక రిటైర్మెంట్ ప్లాన్ కొనే ముందుగా, పెన్షన్ బీఁఆ ఆప్షన్ల రకాల గురించి చదవడం మరియు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ సమీక్షలను చూడడం ద్వారా మీరు చూపాల్సిన శ్రద్ధను మీరు చూపించండి. మీ భవిష్యత్ అవసరాల కొరకు తెలియజేయబడిన ఎంపిక చేసుకోవడంలో ఈ పరిశోధన మీకు సహాయపడుతుంది.

రిస్క్ ప్రొఫైల్

>

పెట్టుబడి చేసేటప్పుడు శ్రమ తీసుకోవడానికి గాను మీ రిస్క్ ప్రొఫైల్ మీ వాంఛను సూచిస్తుంది. ఒకవేళ మీరు రిస్క్-విముఖత కలవారైతే, మీ రిటైర్మెంట్ లో హామీతో కూడిన ఆదాయాన్ని అందించే అనుసంధానం-కాని ఇండియాఫస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోండి. మార్కెట్-అనుసంధానిత ఆర్థిక సాధనాలు యువ పెట్టుబడిదారులు మరియు పెద్దదైన రిస్క్ వాంఛ గలవారి కొరకు ఒక మంచి ఆలోచన. హామీతో కూడిన పెన్షన్ ప్లానులు, పెన్షన్ లైఫ్ కవర్, మరియు ఎక్కువ రిస్కుతో కూడిన ఇతర వెంచర్లను చేర్చుకోవడానికై మీ పోర్ట్ ఫోలియోను వైవిధ్యీకరించడమనేది ఒక స్పృహాత్మక ఆలోచన.

విశ్రాంత జీవితం యొక్క దీర్ఘవ్యవధి

రిటైర్మెంట్ అనంతరం ఆనందించడానికి అనేక సంవత్సరాలు ఉండబోవు అనేది ఒక తప్పుడు అభిప్రాయము. నేటి రోజులు మరియు యుగములో, వైద్యానికి ప్రాప్యత మరియు ఆరోగ్య సంరక్షణ ఆధునీకరణలు వ్యక్తి జీవితకాలాన్ని గణనీయంగా పెంచాయి. మీరు 60 వ సంవత్సరములో రిటైర్ అయినప్పటికీ సైతమూ, మీ ముందు ఇంకా మూడు నుండి నాలుగు దశాబ్దాల కాలం ఉందని పరిగణించండి. ఈ దశాబ్దాలు సజావుగా జరిగిపోయేలా చూసుకోవడానికి అవసరమైన మొత్తమును ఇండియాలో ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వంటి వివిధ రకాల పెన్షన్ ప్లానుల సహాయముతో ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ అనేది, అనుసంధానితం కాని, పాల్గొనే, ఎండోమెంట్ డిఫర్డ్ పెన్షన్ ప్లాన్ అయి ఉంది. హామీతో కూడిన ఈ పెన్షన్ ప్లాన్, మీరు ద్రవ్యోల్బణము నుండి దూరంగా ఉండేందుకు, అధికమైన ఆరోగ్య రక్షణ ఖర్చులను ఏర్పాటు చేసుకోవడానికి, క్రమం తప్పకుండా వచ్చే జీతం యొక్క పరోక్షములో నిలదొక్కుకోవడానికి, మరియు రిటైర్మెంట్ తర్వాత సైతమూ మీ ప్రస్తుత జీవనశైలి నిర్వహణకు మీకు సహాయం చేయడానికి రూపొందించబడింది.

అనుసంధానితం కాని ఒక ప్లాన్ గా, ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ అస్థిర మార్కెట్ పరిస్థితుల ప్రభావానికి లోను కాదు. ఇది పెన్షన్ హామీతో కూడిన ఈ ప్లానుని రిస్క్-విముఖత గల వారికి ఒక అద్భుతమైన ఆప్షన్ గా చేస్తుంది. పైపెచ్చు, ఒక పార్టిసిపేటింగ్ ప్లాన్ గా, ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్, బీమాదారుచే సంపాదించుకోబడిన లాభం నుండి ప్రకటించబడిన ఏవేని బోనస్ లను ఆనందించడానికి పాలసీదారుకు వీలు కలిగిస్తుంది.

  • ప్రీమియం చెల్లింపు అవధిపై ఆధారపడి రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం ఆప్షన్ క్రింద మొదటి 2/4/6 పాలసీ సంవత్సరాల కొరకు హామీతో కూడిన చేర్పులుగా, చెల్లించబడిన మొత్తం ప్రీమియములపై 9% నిర్ధారిత ప్రయోజనం సంపాదించుకోండి
  • కనీస భరోసా ఏర్పరచియున్నట్లుగా చూసుకునేలా పేర్కొనబడిన భరోసా ప్రయోజనాన్ని పొందండి.
  •  
  • తర్వాతి సంవత్సరాలలో బోనస్లతో స్థిరంగా ఎదుగుతున్న మీ రిటైర్మెంట్ ఆపత్కాల నిధితో ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడుట
  • మీ స్వంత తీరులో పెట్టుబడి చేయడానికి బహుళ ఐచ్ఛికాల నుండి ఎంచుకోండి – రెగ్యులర్, లిమిటెడ్ లేదా సింగిల్ ప్రీమియములు
  • 40 సంవత్సరాల పాలసీ అవధి వరకూ పెట్టుబడి చేయడం ద్వారా, మీ రిటైర్మెంట్ తర్వాతి రాబడిని గరిష్టం చేసుకోండి
  • మీ వయసుతో సంబంధం లేకుండా మీ రిటైర్మెంట్ ని ప్రణాళిక చేసుకోవడాన్ని మొదలుపెట్టే అవకాశాన్ని ఉపయోగించుకోండి.
  • ఈ రిటైర్మెంట్ పాలసీని మీ సౌకర్యం మేరకు ఒక ఆన్లైన్ ప్లాన్ గా కొనుగోలు చేయవచ్చు.
  • చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు ఏవేవి?


  • ఈ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ లో రెగ్యులర్ ప్రీమియం కొరకు, దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
  • ఈ పెన్షన్ బీమా ప్లాన్ లో లిమిటెడ్ ప్రీమియం కొరకు, దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
  • ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్ పెన్షన్ బీమా స్కీములో సింగిల్ ప్రీమియం కొరకు, దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 0 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు.
  • పాలసీ అవధి యొక్క ముగింపులో, ఈ పెన్షన్ హామీ గల ప్లాను యందు, కనీస మరియు గరిష్ట వయస్సు వరుసగా 40 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాలు ఉండాలి.
  • రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియం కొరకు, హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు. 5,00,000 మరియు గరిష్ట పరిమితి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లానులోని అండర్ రైటింగ్ (పూచీకత్తు)ను బట్టి ఉంటుంది.
  • సింగిల్ ప్రీమియం కొరకు, హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు. 1,00,000 మరియు గరిష్ట పరిమితి ఈ రిటైర్మెంట్ యాన్యువిటీ ప్లానులోని అండర్ రైటింగ్ (పూచీకత్తు)ను బట్టి ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • నేను ప్రభుత్వ పెన్షన్ ప్లానులు మరియు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ ను ఒకేసారి కలిగి ఉండవచ్చునా?

    అవును. ఇండియాలో, ప్రైవేటు బీమాదారులు, వాణిజ్యపరంగా పెన్షన్ ప్లానుల ప్రదాతలు, ప్రైవేట్ బ్యాంకులు మరియు ప్రభుత్వ సంస్థలచే అందించబడే రిటైర్‌మెంట్ పెన్షన్ పథకాలు మరియు పెన్షన్ ప్లానులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన బీమాదారుల నుండి ఆన్‌లైన్ పెన్షన్ ప్లానులను కొనడానికి కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. ప్రైవేటు బీమాదారుల నుండి మీరు కొనుగోలు చేయగల పెన్షన్ బీమా ప్లానుల సంఖ్య లేదా రకాలపై ఎటువంటి నిర్బంధం లేనప్పటికీ, మీరు భారత ప్రభుత్వము నుండి జాతీయ పింఛను పథకము వంటి ఒకటి కంటే ఎక్కువ పెన్షన్ పథకాలను కలిగి ఉండలేరు.

  • ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ లో పెన్షన్ యాన్యువిటీ ఎంత?

    ఒక యాన్యువిటీ అనేది ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ వంటి పెన్షన్ ప్లానుల యొక్క అత్యంత సముచితమైన అంశము. అది పెన్షన్ ప్లానులలో మీ పెట్టుబడి నుండి మీరు అందుకునే కాలానుగత చెల్లింపులను తెలియజేస్తుంది. మీరు ఒక రిటైర్‌మెంట్ ప్లాన్ కొన్నప్పుడు, మీరు రిటైర్‌మెంట్ పాలసీ లోనికి సింగిల్ లేదా రికరింగ్ ప్రీమియములను చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటైర్ అయ్యారంటే, ఒక యాన్యువిటీ అనేది పెన్షన్ ప్లానుల నుండి మీరు అందుకునే క్రమం తప్పని చెల్లింపుగా ఉంటుంది. ఈ ప్లానులో, మీరు సింగిల్ ప్రీమియం, పరిమిత ప్రీమియములు (5/10 సంవత్సరాలు), లేదా రెగ్యులర్ ప్రీమియములు చెల్లించడానికి ఎంపిక చేసుకోవచ్చు, మరియు డిఫర్డ్ యాన్యువిటీ బోనసులు (ఏవైనా ఉంటే) అందుకోవచ్చు.

  • ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ క్రింద వెస్టింగ్ వయస్సు ఎంత?

    ఇండియాలో ఉద్యోగుల రిటైర్‌మెంట్ యొక్క ముఖ్య వయస్సు సుమారు 60 సంవత్సరాలు. అయినప్పటికీ, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిటైర్ కావడానికి ఎంచుకోవచ్చు. పెన్షన్ ప్లానులలో, మదుపు చేసే వయస్సు, మీ పెన్షన్ ప్లానుల నుండి చెల్లింపులు అందుకోవడం మొదలుపెట్టేందుకు ముందుగా నిర్ధారించబడిన వయస్సును తెలియజేస్తుంది. ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ రిటైర్‌మెంట్ బీమా పాలసీ క్రింద, మదుపు చేసే వయస్సు 40 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సులో ఏ సమయములోనైనా ఉండవచ్చు.

  • ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ అనేది ఒక పార్టిసిపేటింగ్ పెన్షన్ ప్లాను—ఇది నాకు ఇచ్చే అర్థం ఏమిటి?

    ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ అనేది, ఇండియాలోని పార్టిసిపేటింగ్ పెన్షన్ ప్లానులలో ఒకటి. ఒక పార్టిసిపేటింగ్ ప్లానులో పాలసీదారు, బీమాదారు చేసుకున్న లాభాల నుండి బోనసులు (ఏవైనా ఉంటే) లేదా డివిడెండ్ల రూపములో వాటా అందుకుంటారు. ఒక నాన్-పార్టిసిపేటింగ్ ప్లానులో, పాలసీదారుకు చెల్లించబడే బోనసులు లేదా డివిడెండ్లు ఏవీ ఉండవు. అయినప్పటికీ, రెండు రకాల పెన్షన్ బీమా ప్లానులు, మీరు పెన్షన్ ప్లాన్ కొన్నప్పుడు హామీ ఇవ్వబడిన నిర్దిష్ట రాబడులను అందిస్తాయి.

  • ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ ఆన్‌లైన్ లో కొనడం సరియైన ఆలోచనయేనా?

    మీరు ఎంచుకున్న పెన్షన్ ప్లానులు ప్రసిద్ధి చెందిన పెన్షన్ ప్లానుల సేవా ప్రదాతలు మరియు బీమాదారుల నుండి అయి ఉన్నంతవరకూ, మీరు పెన్షన్ ప్లాన్ ఆన్‌లైన్ లో కొన్నప్పటికీ ఎటువంటి సమస్య ఉండదు. నేటి ఇంటర్నెట్-హిత ప్రపంచములో, అది సౌకర్యవంతం మరియు త్వరితమైన ఐచ్ఛికం. ఆన్‌లైన్ ద్వారా పెన్షన్ ప్లానులను ఎటువంటి విసుగు లేదా ఆలస్యాలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ ని ఆన్‌లైన్ రూపము ద్వారా మీ సౌకర్యం మేరకు కొనుగోలు చేసుకోవచ్చు.

  • ఒకవేళ నాకు ఒక పిఎఫ్ ఖాతా ఉన్నట్లయితే, నాకు అప్పటికీ ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్ రిటైర్‌మెంట్ పాలసీ అవసరం ఉంటుందా?

    పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన ఖర్చులు, అదేవిధంగా ఆరోగ్య రక్షణ మరియు వైద్య సహాయత వ్యయాలను మీరు పరిగణించినప్పుడు, మీ పిఎఫ్ ఖాతాచే ఏర్పరచుకోబడిన ఆపత్కాల నిధి మీ రిటైర్‌మెంట్-అనంతర ఖర్చులను తీర్చుకోవడానికి తగినంతగా ఉండకపోవచ్చు. మీరు రిటైర్ అయిన తర్వాత మీకు అవసరమయ్యే రిటైర్‌మెంట్ కవర్ మరియు ద్రవ్యోల్బణ సర్దుబాటు చేయబడిన ఆపత్కాల నిధి గురించి అర్థం చేసుకోవడానికి ఒక ఆన్‌లైన్ రిటైర్‌మెంట్ ప్లానర్ ఉపయోగించుకోండి. మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో సహాయపడడానికి ఈ ఇండియాఫస్ట్ పెన్షన్ ప్లాన్ ఉపయోగించుకోండి.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ఉత్పత్తుల బ్రోచర్

Download Brochure File

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

మీరు ఎల్లప్పుడూ ఎలా జీవించాలని ఆశించారో, అలాగే జీవించడం కొనసాగించండి, రిటైర్‌మెంట్ తర్వాత సైతమూ. కేవలం మూడు ప్రాథమిక సూత్రాలను పాటించండి - మీ లక్ష్యాలను ప్రణాళిక చేసుకోవడం, తెలివిగా పెట్టుబడి చేయడం మరియు మీ పెట్టుబడులను పర్యవేక్షించడం.

మా రిటైర్‌మెంట్ ప్లానులను ఒకసారి చూడండి. ఒత్తిడి లేని జీవనం గడపండి!