ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యుటీ ప్లాన్

: మీ రెండవ ఇన్నింగ్సును సాహసం కంటే తక్కువ కాకుండా చేయండి

GET A QUOTE

రిటైర్‌మెంట్ తదనంతరం మీకు ఇష్టం వచ్చిన విధంగా మీ జీవనశైలి నిర్వహించుకోవడంలో మీకు సహాయపడేందుకు ఇమ్మీడియేట్ యాన్యుటీ ప్లాన్ రూపొందించబడింది. ఇది మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను చూసుకుంటూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడంలో మీకు సహాయపడుతుంది.

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యుటీ ప్లాన్ ని కొనడానికి గల కారణాలు

  • 40 మరియు 80 సంవత్సరాల మధ్య మీ రిటైర్‌మెంట్ వయసును ఎంచుకోవడానికి మీకు అధికారమిస్తుంది.

  • మీ రిటైర్‌మెంట్ తదుపరి సంవత్సరాల పొడవునా ఒక ఖచ్చితమైన క్రమం తప్పని నెలవారీ/మూడు నెలల వారీ/అర్ధ-సంవత్సరం వారీ/ సంవత్సరం వారీ ఆదాయాన్ని అందుకోవడం ద్వారా సంపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యమును ఆస్వాదించండి.

  • మీరు ఎంచుకోవడానికి, లైఫ్ యాన్యుటీ, కొనుగోలు ధర తిరిగి చెల్లింపుతో లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ ఫర్ లైఫ్, మరియు 5 సంవత్సరాలు /10 సంవత్సరాలు/ 15 సంవత్సరాల కొరకు యాన్యుటీ నిశ్చితి అనే 4 విభిన్న రకాల యాన్యుటీ ఐచ్ఛికాలు ఉన్నాయి.

  • మీ పరోక్షములో సైతమూ మీ జీవిత భాగస్వామికి యాన్యుటీ రాబడి ద్వారా తోడ్పాటు అందించడానికి గాను జాయింట్ లైఫ్ ఐచ్ఛికం ఎంచుకోండి

  • మీ నామినీలు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందడానికి వీలయ్యేలా వారికి రక్షణ కల్పించడానికి కొనుగోలు ధర తిరిగి చెల్లింపు ఐచ్ఛికం ఎంచుకోండి

  • యాన్యుటీ నిశ్చితి ఐచ్ఛికం క్రింద ఒక నిర్ధారిత కాలానికి, వ్యవధికీ మరియు ఆతర్వాతి జీవితము లోనూ ఒక సౌకర్యవంతమైన రిటైర్‌మెంట్ ఆనందించండి

  • ప్రస్తుతమున్న వ్యక్తిగత, వాయిదాపడిన మరియు సమూహ వాయిదా యాన్యుటీ పాలసీదారు/ సభ్యులు/ లబ్దిదారులు 0 నుండి 99 సంవత్సరాల వరకూ ఏ సమయములోనైనా ప్లాను యొక్క ప్రయోజనాలను పొందవచ్చు

అర్హత ప్రామాణికత ఏమిటి?

  • కొత్త సభ్యులు దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు (మొదటి దరఖాస్తుదారు) 40 సంవత్సరాలు; ప్రస్తుతమున్న పెన్షన్ సభ్యులు/ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ యొక్క లబ్దిదారుల కొరకు 0 సంవత్సరాలు

  • దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు (రెండవ దరఖాస్తుదారు) 18 సంవత్సరాలు

  • దరఖాస్తు చేయడానికి గరిష్ట వయస్సు (మొదటి/రెండవ దరఖాస్తుదారు) 80 సంవత్సరాలు

  • కనీస ప్రీమియం రు.3,00,000, కాగా గరిష్ట ప్రీమియం పరిమితి లేనిది

  • నెలకు కనీస యాన్యుటీ కంతు రు. 1000 లు మరియు ఒక సంవత్సరానికి రు. 12,500 లు.

  • యాన్యుటీ కంతు అంతరము నెలవారీగా, మూడు నెలల వారీగా, అర్ధ-సంవత్సరం వారీగా, మరియు సంవత్సరం వారీగా.

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్


మీ జీవితమంతా మీ మనశ్శాంతి మరియు భద్రత కోసం కష్టపడి పనిచేసిన తర్వాత, ఉద్యోగం మరియు బాధ్యతల నుండి విశ్రాంతి తీసుకోవడమనేది ఒక కల లాగా ధ్వనిస్తుంది. ఈ కల ఒక పీడకల లాగా కాకుండా చూసుకోవడం ఆవశ్యకం. మీ వృద్ధాప్య వయస్సును బంగారు సంవత్సరాల లోనికి రూపాంతరం చేయడానికి రిటైర్‌మెంట్ ప్లానింగ్ మీకు సహాయపడగలుగుతుంది. ఇండియాలో సరియైన రిటైర్‌మెంట్ ప్లానులను ఎంచుకోవడం ద్వారా ద్రవ్యోల్బణమును అధిగమించి వెళ్ళడానికై మీ వంతు మీరు చేయవచ్చు, మీ ఆరోగ్య రక్షణ అవసరాల కొరకు ప్లాన్ చేసుకోండి మరియు ఎటువంటి రాజీ పడకుండా మీ జీవన ప్రమాణమును నిర్వహించుకోండి.

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ తో, మీరు మీ భవిష్యత్తుపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉంటారు, పెరుగుతున్న మీ వయస్సుతో సంబంధం లేకుండా. ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా, మీరు మనశ్శాంతిని, ఆర్థిక భద్రతను, మరియు ఒకవేళ మీరు వెళ్ళిపోయిన పక్షములో మీ కుటుంబ అవసరాలను పరిరక్షించుటకు జీవిత రక్షణను ఎంచుకుంటున్నారు.

మీ రిటైర్‌మెంట్ సందర్భంగా క్రమం తప్పని అంతరాలలో మీకు చెల్లించబడే హామీతో కూడిన ఆదాయాన్ని సంపాదించుకోండి — మీ అవసరాల కోసం ముందస్తుగా మీరు ప్లాన్ చేసుకున్న నిశ్చితితో మీ జీవితం యొక్క బంగారు రోజులను ప్రారంభించండి.

పెన్షన్ ప్లాన్ లు ఏవేవి?


రిటైర్‌మెంట్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవిత-ప్రణాళిక యొక్క ముఖ్యమైన భాగాంశము. ద్రవ్యోల్బణము పెరుగుతున్న రేటును మరియు వైద్యపరమైన ఆధునికతల కారణంగా సుదీర్ఘకాల జీవితాన్ని పరిగణించుకొని, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అనేది మీ ఆర్థిక భవిష్యత్తును పదిలపరచుకోవడానికి అతి ముఖ్యమైన చర్య అవుతుంది. దీనికి సంబంధించి, మీ రిటైర్‌మెంట్ అవసరాలను తీర్చుకోవడానికి రూపొందించబడిన ప్రతిష్టాత్మక పెన్షన్ ప్లానులు ఇండియాలో అనేకం ఉన్నాయి.

పెన్షన్ ప్లానులు అనేవి మీకు బీమా వర్తింపు మరియు మదుపు ప్రయోజనాలు రెండింటినీ అందించే రిటైర్‌మెంట్ ప్రయోజన ప్లానులు. కీలకమైన పెన్షన్ బీమా ప్లానులు, ఎంచుకున్న సంవత్సరాల సంఖ్యకు డబ్బును నిలకడగా పొదుపు చేయడం కూడి ఉంటాయి. ఈ ఆపత్కాల నిధి పెద్దది మరియు మెరుగైనదిగా చేయబడుతుంది, చక్రవడ్డీ యొక్క శక్తికి ధన్యవాదాలు. మీరు మీ రిటైర్‌మెంట్ వయస్సుకు చేరుకున్నప్పుడు, మరియు మీ వృత్తిపరమైన ఆదాయం రద్దయినప్పుడు, ఒక యాన్యువిటీ పెన్షన్ ప్లాన్ మీకు ఎక్కువగా అవసరమైనప్పుడు ఒక నిలకడ ధన ప్రవాహం ఉండేలా చూసుకుంటుంది.

ఇండియాలో ఒక రిటైర్‌మెంట్ పాలసీ రెండు దశలను కలిగి ఉంటుంది— కూడగట్టుకునే దశ మరియు వెస్టింగ్ దశ. కూడగట్టుకునే దశలో, పాలసీదారు తాను రిటైర్ అయ్యేవరకూ ఒక గణనీయమైన ఆపత్కాల నిధిని నిర్మించుకోవడానికి గాను కాలానుగత ప్రీమియములను చెల్లిస్తారు. రిటైర్‌మెంట్ మీదట, మీరు రెండవదశ అనగా వెస్టింగ్ మొదలుపెట్టడాన్ని ఎంచుకోవచ్చు. ఇది, మీరు ప్లాన్ యొక్క రిటైర్‌మెంట్ ప్రయోజనాలను అందుకోవడం మొదలయ్యే వయస్సును తెలియజేస్తుంది. బీమా చేయబడిన మీ రిటైర్‌మెంట్ ప్లాన్, వెస్టింగ్ సందర్భంగా మీరు ఇక ఏ మాత్రమూ నిర్ధారిత జీతం మొత్తాన్ని సంపాదించుకోనప్పుడు మీకు హామీతో కూడిన మొత్తాన్ని క్రమానుగతంగా మీ ఖాతాకు చేరేవిధంగా అందజేస్తుంది. ఒక పెన్షన్ బీమా పాలసీతో, ఒకవేళ మీ అకాలమరణం సంభవించిన పక్షములో, మీరు మీ కుటుంబం యొక్క ఆర్థికావసరాలను పరిరక్షించగల సాంప్రదాయక జీవిత వర్తింపును పొందడంతో వారిని గట్టెక్కించవచ్చు.

ఇండియాలో విభిన్న రకాల రిటైర్‌మెంట్ పెన్షన్ పథకాలు మరియు పెన్షన్ ప్లానులు ఉన్నాయి. మీ కోసం కచ్చితమైన రిటైర్‌మెంట్ పాలసీ, రిటైర్‌మెంట్ తర్వాత మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక సహాయమును అందజేసేది అయి ఉండాలి. కొన్ని సాధారణ రకాలలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:

  • వైవిధ్యమైన యాన్యువిటీ ప్లాన్‌లు: ప్రీమియం చెల్లింపు అవధి సందర్భంగా మీరు ఒక సింగిల్ ప్రీమియం గానీ లేదా కాలానుగత చెల్లింపులు గానీ చేయవచ్చు. ఈ అవధి ముగిసిన తర్వాత, మీరు ఎంచుకున్న సమయములో మీ వెస్టింగ్ వ్యవధి మొదలవుతుంది.
  • ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్‌లు: ఇది ఒక సింగిల్ ప్రీమియమ్ పాలసీ అయి ఉంది. ఇమ్మీడియేట్ పెన్షన్ ప్లానులలో, రిటైర్‌మెంట్ పాలసీని మొదలుపెట్టడానికి మీరు ఒక సింగిల్ ఏకమొత్తపు చెల్లింపు చేస్తారు, మరియు మీ రెగ్యులర్ పెన్షన్ చెల్లింపులు వెంటనే మొదలవుతాయి.

మీరు పెన్షన్ ప్లానులను ఎందుకు ఎంచుకోవాలి?


సుదీర్ఘంగా జీవించడమనేది సుదీర్ఘమైన మరియు సంతోషకరమైన జీవితం జీవించినంత ముఖ్యము కాదు. ఈ రోజున, మీకు ఒక అవసరం కలిగినప్పుడు, మీకు క్రమం తప్పని ఆదాయం ఉంది కాబట్టి ఆ అవసరాన్ని నెరవేర్చుకోవడానికి మీకు వనరులు కూడా ఉంటాయి. అయినప్పటికీ, రిటైర్‌మెంట్-అనంతరం, కొత్త అవసరాల్ని సంతృప్తిపరచడానికి మరియు అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవడానికి మీకు ఆర్థిక సామర్థ్యం ఉండకపోవచ్చు. ఇక్కడనే ఒక పెన్షన్ ప్లాన్ రంగం లోనికి వస్తుంది. రేపటి రోజున మీకు ఏది అవసరమవుతుందో దానికి ఈ రోజే ప్లాన్ చేసుకోవడం ద్వారా, మీకు వృత్తిపరమైన ఆదాయం లేనంత మాత్రాన మీ జీవన నాణ్యత క్షీణించకుండా మీరు చూసుకోవచ్చు. మీకు ఒక పెన్షన్ ప్లాన్ ఎందుకు కావాలో దానికి అనేక కారణాలు ఉన్నాయి

వైద్యపరమైన అత్యవసర స్థితులను తీర్చుకొనుట

మీరు ఆరోగ్యకరమైన జీవితం గడిపియున్నప్పటికీ, వృద్ధాప్యం తనతో పాటుగా తన స్వంత అనారోగ్యాలను వెంట తీసుకువస్తుంది. ఆరోగ్య సమస్యలతో పాటుగా, మీరు వైద్య ఖర్చులతో కూడా సతమతం కావాల్సి ఉంటుంది. మీరు రిటైర్ అయితే మరియు ఎటువంటి ఆదాయం లేకపోతే ఇది కష్టం కాగలదు. బ్యాంకును బద్దలు కొట్టకుండానే మీ వైద్యపరమైన సమస్యలను తీర్చుకొనేలా చూసుకోవడానికి మీకు కావలసిందల్లా ఒక మంచి రిటైర్‌మెంట్ పాలసీ మాత్రమే.

ద్రవ్యోల్బణంపై పోరాడుట

రెండు దశాబ్దాల క్రితం, రు.50 గణనీయమైన కొనుగోలు శక్తిని కలిగి ఉండేది. ఈ రోజున అదే మొత్తము తన విలువలో ఎంతగానో తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్త వాస్తవము, ఒకవేళ మీరు ప్రశాంతమైన రిటైర్‌మెంట్ అనంతర జీవితం ఆస్వాదించాలని అకుంటే దానిపై ముందస్తుగానే పోరాటం మొదలుపెట్టాల్సి ఉంటుంది. మీ బంగారు సంవత్సరాలలో మీరు ఏవేని పెద్ద ఖర్చుల కోసం ప్లాన్ చేసుకోకపోయినప్పటికీ, మీరు నిత్యావసర వస్తువులు, మందులు, ఇంటి వాడుక సరుకులు కొనాల్సి ఉంటుంది మరియు మీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక ధృఢమైన పెన్షన్ బీమా ప్లాను, మీకు భవిష్యత్తులో ఏది అవసరమవుతుందో ఊహించడానికి మరియు దానికోసం ఏర్పాట్లు చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

మీ పిల్లలపై భారాన్ని సులభతరం చేయుట

ఒకప్పుడు పెద్దవి మరియు ఉమ్మడి కుటుంబాలు ఉండటం పరిపాటిగా ఉండేది. వయోవృద్ధులు అనేక మంది కుటుంబ సభ్యుల నైతిక మరియు ఆర్థిక మద్దతుపై నిలిచి ఉండేవారు. ఈ రోజున, చిన్న కుటుంబాలు సర్వసాధారణమయ్యాయి, మరియు ఇక ఇంటిలో ముగ్గురి కంటే ఎక్కువ పిల్లల్ని చూడడం చాలా అరుదైపోయింది. కొన్ని దశాబ్దాలు ఇలాగే గడిస్తే, ఒక సీనియర్ సిటిజెన్ గా మీకు ఉండాల్సిన మద్దతు మీకు ఉండకపోవచ్చు

అనేకమంది కుటుంబ సభ్యులపై మీ ఖర్చుల భారాన్ని పంచడానికి బదులుగా, మీ సంరక్షణ మరియు శ్రద్దాసక్తుల భారం అంతా మీ పిల్లలపై పడుతుంది. ఇది, వారు తమ ఆర్థిక వనరుల్ని తమ కలలకు దూరంగా మరియు మీ ఖర్చుల వైపుగా మళ్ళించడానికి కారణం కావచ్చు. మీ అవసరాల కోసం మరెవ్వరిపైనా ఆధారపడకుండా మీ రిటైర్ తదనంతర సంవత్సరాలు మీరు కోరుకున్నట్లుగా జీవించడానికి ఒక యాన్యువిటీ పెన్షన్ ప్లాన్ మీకు సహాయపడగలుగుతుంది.

మీ బంగారు సంవత్సరాలలో స్వతంత్రంగా ఉండటం

ఒక సంపాదనాపరుడిగా మీరు, పరిస్థితుల్లో ఇతరులు జోక్యం చేసుకొని చక్కదిద్దనవసరం లేకుండా స్వతంత్ర నిర్ణయకర్తగా ఉంటూ వచ్చారు. మీరు వయసు మీరే కొద్దీ ఇది మారాలనేదానికి ఎటువంటి కారణమూ లేదు. మీరు మీ కోసం గానీ లేదా మీ జీవితభాగస్వామి కోసం గానీ మందులు కొనాలన్నా, లేదా కళ్ళజోడు కొనాలన్నా, ఒక రిటైర్‌మెంట్ పాలసీ మీరు ఎల్లప్పుడూ ఆస్వాదించిన స్వాతంత్రాన్ని మీకు కలుగజేస్తుంది. ఒక రిటైర్‌మెంట్ బెనిఫిట్ ప్లాను యొక్క మద్దతుతో మీ రిటైర్-అనంతర జీవితాన్ని గౌరవంగా మరియు హుందాగా జీవించండి.

రిటైర్‌మెంట్ ప్లానింగ్ కొరకు దశలు ఏవేవి?


రిటైర్‌మెంట్ ప్లానింగ్ అనేది మీరు ఒక టోపీ నుండి అంకెలను తీయడానికి ఒక ఆషామాషీ ప్రక్రియ ఏమీ కాదు. ఇది ఒక అనుభవాధారిత ప్రక్రియ, ఇందులో మీ స్వల్పకాలిక, మధ్యకాలిక, మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చే ఒక ప్లాన్ లెక్క కట్టుకోవడానికి మీరు ఆవశ్యక వేరియబుల్స్ లో పాల్గొంటారు. రిటైర్‌మెంట్ ప్లానింగ్ కొరకు ఇది ఒక శ్రేష్టమైన దశ-వారీ ప్రక్రియ.

దశ 1: ఆర్థికపరమైన లక్ష్యాలను ఏర్పరచుకొనుట

మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో మీరు సౌకర్యంగా ఉండేలా కోరుకుంటున్నారని చెప్పడంతో సరిపోదు. మీరు సంతృప్తిగా ఉండడానికి ఎంత మొత్తం అవసరమై ఉంటుంది? మీ రిటైర్‌మెంట్ కాలములో మీ అవసరాలను చూసుకోవడానికి గాను మీకు అవసరమై ఉన్న సొమ్ము యొక్క వాస్తవ మొత్తాన్ని తెలుసుకోవడానికి ద్రవ్యోల్బణాన్ని లెక్క కట్టుకోండి. ఈ దశ అంతా మీ ఆర్థికపరమైన అవసరాలు మరియు ఇబ్బందుల్ని గుర్తించడం మరియు మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను ఏర్పరచుకోవడం గురించే.

దశ 2: మీ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడం

మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకోండి. ప్రణాళిక చేసుకోవడానికి గాను, చెల్లించవలసిన అప్పులు, పాల్గొనవలసియున్న బాధ్యతలు, మరియు నిర్దిష్ట భవిష్యత్ ఖర్చులు ఏవైనా ఉన్నాయా? ఇండియాలో పెన్షన్ ప్లానులలో మదుపు చేయడానికి మీ వద్ద ఎంత మొత్తం మిగిలి ఉందో గ్రహించడానికి గాను ఆ చెల్లింపుల కొరకు ఏర్పాటు చేసుకోండి.

దశ 3: మీ ప్రమాద-వాంఛను పరీక్షించండి

పెట్టుబడి-అదేవిధంగా-బీమా పెన్షన్ ప్లానులు మీ కోసం మీ డబ్బును మదుపు చేస్తాయి. డబ్బు ఎక్కడ మదుపు చేయబడుతుందో అనేది పూర్తిగా మీ రిస్క్ ప్రొఫైల్ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని శ్రమలను తీసుకోవడానికి సౌకర్యమైన చోటులో మీరు ఉన్నట్లయితే, ఈక్విటీలో మదుపు చేసే పెన్షన్ ప్లానులను ఎంచుకోండి. అయినప్పటికీ, మీకు గనక రిస్క్-విముఖత ఉంటే, అప్పుడు ఋణ మదుపు పెన్షన్ ప్లానులు లేదా ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు బాండ్లలో మదుపు చేసేవి మీకు చాలా మంచి అవకాశము.

దశ 4: నిధుల కేటాయింపు

రిటైర్‌మెంట్ ప్లానింగ్ కొరకు ఒక నిర్దిష్ట మొత్తమును కేటాయించుకోండి. ఇండియాలో సింగిల్ ప్రీమియం ఇమ్మీడియేట్ యాన్యువిటీ పెన్షన్ ప్లానులతో, మీరు ఒకేసారి గణనీయమైన మొత్తాన్ని ప్రక్కన ఉంచవచ్చు మరియు దాని తర్వాత వెంటనే హామీతో కూడిన నెలవారీ పెన్షన్ ప్రయోజనాలను ఆనందించవచ్చు. కొన్ని కాలానుగత ప్రీమియం పెన్షన్ ప్లానులు వైవిధ్యమైన యాన్యువిటీ ఆప్షన్ అందిస్తాయి, కాబట్టి మీ అవసరాల ప్రకారము మీరు పెట్టుబడి చేసే వయస్సును నిర్ణయించుకోవచ్చు. పెన్షన్ ప్లానులతో పాటుగా, మీరు మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ లో భాగంగా ఇతర ఆర్థిక సాధనాలలో పెట్టుబడి చేయడానికి ఎంచుకోవచ్చు — తదనుగుణంగా నిధుల్ని కేటాయించుకోవచ్చు.

దశ 5: పర్యవేక్షణ మరియు పునర్విశ్లేషణ

ఏదీ శాశ్వతమైన ఏర్పాటు కాదు. అది మీ ఆర్థిక లక్ష్యాలు అయినా, లేదా వ్యక్తిగత ప్రాధాన్యతలైనా, మీరు ఎంచుకున్న పరిష్కారం యొక్క సమర్థత యొక్క పురోగతిని పర్యవేక్షించడానికి మరియు తిరిగి అంచనా వేయడానికి కాలానుగతంగా తిరిగి క్రింది స్థాయికి వెళ్ళడం ముఖ్యం.

రిటైర్‌మెంట్ కొరకు మీరు ప్లానింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలి?


రిటైర్ కావడానికి సరియైన సమయం అంటూ ఏదీ లేదు. మీరు బాగా ఉంటే 60 సంవత్సరాల వయసు వచ్చేవరకూ చక్కగా పని చేయవచ్చు లేదా 40 సంవత్సరాల వయసు రాగానే ఆపివేయవచ్చు. మీరు ఎప్పుడు రిటైర్ కావాలనుకునేది మీరే నిర్ణయించుకోవచ్చు. సరియైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ తో, మీ రిటైర్‌మెంట్ మీ ఆర్థిక నిలుకడను ప్రభావితం చేయనట్లుగా మీరు చూసుకోవచ్చు. ఇది చేయడానికి, మీరు మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ ని సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలి. సంపద యొక్క సృష్టి అనేది ఒక స్వల్ప-కాలిక ప్రక్రియ కాదు. సంపదను సృష్టించుకోవడం మీరు ఎంత త్వరితంగా మొదలుపెడితే, ఎక్కువ కాలం మీ పెట్టుబడులు గుణింతమవుతాయి మరియు మీకోసం ప్రయోజనాలను కూడగడతాయి.

త్వరగా మొదలుపెట్టడం వల్ల, మీరు అన్ని రకాలుగా అత్యుత్తమతను పొందుతారు —దీర్ఘకాల శ్రమ సులభంగా నిర్వహించబడుతుంది, చక్రవడ్డీ డివిడెండ్లను పొందే వీలు కలిగిస్తుంది, మరియు దూకుడు పెట్టుబడి సాధ్యమవుతుంది.

త్వరితంగా మొదలుచేయడం వల్ల ప్రయోజనావకాశాలు ఉన్నా కూడా, ఒకవేళ మీరు ఆ విండోను తప్పిపోయి ఉంటే ఏమిటి సంగతి? అప్పటికీ మీరు రిటైర్‌మెంట్ కొరకు ప్లాన్ చేసుకోవచ్చునా? ఔను. ఆలస్యంగా మొదలుపెట్టడం వల్ల, ప్రక్రియను మరింత కష్టతరం చేయవచ్చు, మరియు మీరు పొందే లాభాలు ఎక్కువగా ఉండకపోవచ్చు, ఐతే అది అప్పటికీ ఒక విలువైన ప్రక్రియగా ఉంటుంది. ఇమ్మీడియేట్ యాన్యువిటీ పెన్షన్ ప్లానులతో, మీరు ఒక సింగిల్ చెల్లింపును చేయవచ్చు మరియు వెంటనే పెన్షన్ ఆదాయం అందుకోవడం ఆనందించవచ్చు. ఒకవేళ మీరు ఆలస్యంగా మొదలుపెడుతున్నట్లయితే, అధిక రాబడులను అందించే మదుపు ఆప్షన్లను ఎంచుకోండి, మీ ఖర్చులను తగ్గించుకోండి, ఒకవేళ మీరు మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయముతో మీ ఆదాయాన్ని కూడకలుపుకుంటారేమో చూడండి, ఇతర ఆదాయ ఉత్పన్న వనరుల కోసం చూడండి, మరియు ఇప్పుడే మొదలుపెట్టండి.

పెన్షన్ ప్లానులను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాలు ఏవేవి?


కాలం గడిచే కొద్దీ, వ్యక్తుల జీవితకాల ఆకాంక్ష నిరంతరంగా పెరుగుతూనే ఉంది. ఇండియాలో, 90-100 సంవత్సరాల పండు ముదుసలి వయస్సు వరకూ వ్యక్తులు జీవించి ఉండడం సామాన్యమైపోయింది. అయినప్పటికీ, జీవితకాల ఆకాంక్ష పెరిగే కొద్దీ, భవిష్యత్తుకు ప్రణాళిక చేసుకోవడం మరియు ఇండియాలో వయో వృద్ధుల కొరకు సరియైన బీమా ప్లానులను ఎంచుకోవడం తప్పనిసరి అయింది. మీ వృద్ధాప్య వయస్సుకు రిటైర్‌మెంట్ ప్లానింగ్ నేడే మొదలవుతుంది. మీరు ఎంత ఎక్కువకాలం జీవిస్తారనేదానితో సంబంధం లేకుండా మిమ్మల్ని మంచి నిలకడలో నిలిపే ఒక భారీ ఆపత్కాల నిధిని మీరు సృష్టించుకునేలా చూసుకోవడానికి అత్యుత్తమ రిటైర్‌మెంట్ యాన్యువిటీ ప్లానులలో మదుపు చేయండి. పెన్షన్ జీవిత బీమా ఆప్షన్ల మధ్య ఎంచుకునేటప్పుడు అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.

మీరు ఎప్పుడు రిటైర్ కావాలనుకుంటున్నారు?

ఇండియాలో రిటైర్‌మెంట్ యొక్క సాధారణ వయస్సు 60 సంవత్సరాలు కాగా, అంతకు ముందే మీరు ఎందుకు రిటైర్ కాలేరు అనేందుకు కారణం లేదు. మీ రిటైర్‌మెంట్ కొరకు ఒక ప్రత్యామ్నాయ ఆదాయ ప్రవాహం కొరకు మీరు ఏర్పాట్లు చేసుకున్నంత కాలమూ, ఒకవేళ మీ కోరిక 45 వ ఏట రిటైర్ కావడమే ఐతే, దానిని మీరు ఎంపిక చేసుకోవచ్చు.

పెన్షన్ ప్లానులు మీ కొరకు సహాయకరంగా ఉంటాయా?

మీరు గనక ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే, మీరు మీ రిటైర్‌మెంట్ తర్వాత ఒక నిర్ధారిత నెలవారీ పెన్షన్ అందుకుంటారు. ప్రైవేటుగా ఉపాధి పొందిన వ్యక్తులు తమ శెలవులను నగదుగా చేసుకోవచ్చు మరియు తమ గ్రాట్యుటీ చెల్లింపులు తీసుకోవచ్చు, ఐతే నెలవారీ పెన్షన్ కొరకు ఎటువంటి ఏర్పాటూ లేదు. మీరు మీ యజమాని నుండి పెన్షన్ అందుకోబోతున్నా లేకున్నా, ఒక అదనపు ఆదాయ సరళి మాత్రమే సహాయకారిగా ఉండగలదు.

రిటైర్‌మెంట్ మీదట మీరు ఎంత ఆదాయం అందుకోవాలనుకుంటున్నారు?

మీరు ఎంచుకునే పెన్షన్ ప్లానుల యొక్క సమర్థత, మీ రిటైర్‌మెంట్ తర్వాత వారు ఎంత మొత్తం ఇవ్వగలరు అనేదానిచే నిర్ణయించబడుతుంది. ఒకవేళ మీ రిటైర్‌మెంట్ పాలసీ గనక ఒక నెలవారీ ఆదాయ రూపములో మీకు తగినంతగా లభించకపోతే, మీరు దానిని ఇతర రిటైర్‌మెంట్ బీమా పాలసీలతో అనుబంధం చేయాల్సి ఉంటుంది. మీ ఆర్థిక వ్యవహారాలను విశ్లేషించుకోండి, రిటైర్‌మెంట్ అనంతరం మీరు తీసుకోవాలనుకుంటున్న నెలవారీ ఆదాయాన్ని గురి చూసుకోండి, మరియు ద్రవ్యోల్బణాన్ని ఒక అంశంగా తీసుకోండి. మీరు లెక్కకట్టే మొత్తము, భవిష్యత్తులో మీ పెన్షన్ ప్లానులు మీకు దేనిని అందిస్తాయో దానిని బట్టి ఉండాలి.

మీకు ఎటువంటి రకాల పెన్షన్ బీమా సరియైనదిగా ఉంటుంది?

పెన్షన్ బీమా రకాల విషయానికి వచ్చినప్పుడు, ఆప్షన్లకు కొరత ఏమీ ఉండదు. పెన్షన్ బీమా యొక్క రెండు ప్రాథమిక రకాలు, ఒకటి డిఫర్డ్ యాన్యువిటీ మరియు ఇమ్మీడియేట్ యాన్యువిటీ. ఒక డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్ అనేది ఒక ముఖ్యమైన పెన్షన్ ప్లాన్. పాలసీదారు రిటైర్ కావడానికి ముందు ఇందులో కొన్ని సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుల ద్వారా ఒక ఆపత్కాల నిధి కూడగట్టబడుతుంది మరియు నెలవారీ చెల్లింపులు మొదలు అవుతాయి. ఇండియాఫస్ట్ లైఫ్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ వంటి ఒక ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్, సింగిల్ ప్రీమియం రిటైర్‌మెంట్ పాలసీ వలె ఉంటుంది. పెన్షన్ ప్లాన్ నుండి తక్షణ చెల్లింపులను ఒక్క ఉదుటున ప్రారంభించడానికి ఒక సింగిల్ ఏకమొత్తపు ప్రీమియం చెల్లింపు అవసరమై ఉంటుంది.

మీ రిటైర్‌మెంట్ నిధిని బలోపేతం చేయడానికి మీరు ఇంకా ఏమేమి చేయవచ్చు?

సరియైన పెన్షన్ ప్లానులు మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ కొరకు పునాదులు. మీ రిటైర్‌మెంట్ నిధిని ఇంకా ఎక్కువ పెంపొందించుకోవడానికి, మీ రిస్క్ వాంఛపై ఆధారపడి ఒక పిపిఎఫ్ ఖాతా, ఫిక్సెడ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్రాలు లేదా ఇతర ప్రభుత్వ పథకాలు, మరియు యులిప్ లను చేర్చుకొని మీ పోర్ట్ ఫోలియోను వైవిధ్యపరచుకోవడానికి పరిగణించండి.

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ యొక్క ముఖ్యాంశాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ అనేది ఒక నాన్- పార్టిసిపేటింగ్, అనుసంధానితం కాని, ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్, ఒక ఏకమొత్తం డబ్బును చెల్లించడం ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. జీవితం కోసం మీరు ఎంపిక చేసుకున్నట్లుగా మీ రిటైర్‌మెంట్ వయస్సును ఎంపిక చేసుకొని, నెలవారీ/త్రైమాసికం వారీ/ అర్ధ-సంవత్సరం వారీ ప్రాతిపదికన ఒక ఫిక్సెడ్ యాన్యువిటీ పొందే అవకాశం మీకు ఉంటుంది.

ఒక నాన్-పార్టిసిపేటింగ్ పెన్షన్ ప్లానుగా, ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్, అస్థిర మార్కెట్ - సంబంధిత విలువలచే ప్రభావితం కాదు. ఈ రిస్క్-విముఖత రిటైర్‌మెంట్ బీమా పాలసీ, సంవత్సరాల తర్వాత కాకుండా, అప్పటికప్పుడే మీకు రిటైర్‌మెంట్ యాన్యువిటీని అందించే ఒక ఇమ్మీడియేట్ పెన్షన్ ప్లానుగా ఉంటుంది.

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ యొక్క ముఖ్యమైన విశేషాంశాలు

  • మీ అవసరాన్ని బట్టి మీరు మీ రిటైర్‌మెంట్ వయస్సును ఎంచుకోవచ్చు; 40 మరియు 80 సంవత్సరాల మధ్య ఏ సమయములోనైనా మొదలయ్యే రాబడులను మీరు పొందవచ్చు.
  • మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల పొడవునా మీరు ఒక ఖచ్చితమైన క్రమం తప్పని నెలవారీ/మూడు నెలల వారీ/అర్ధ-సంవత్సరం వారీ/ సంవత్సరం వారీ ఆదాయాన్ని అందుకుంటారు.
  • మీ పరోక్షములో సైతమూ మీ జీవిత భాగస్వామికి యాన్యువిటీ రాబడి ద్వారా తోడ్పాటు అందించడానికి గాను జాయింట్ లైఫ్ ఐచ్ఛికం ఎంచుకోండి
  • మీరు చుట్టూ లేనప్పుడు సైతమూ మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించాలనుకుంటున్నారా? మీ నామినీలు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందడానికి వీలయ్యేలా కొనుగోలు ధర ఐచ్ఛికం యొక్క రాబడిని పొందండి మరియు వారికి రక్షణ కల్పించండి.
  • యాన్యువిటీ నిశ్చితి ఐచ్ఛికం క్రింద మరియు ఆ తర్వాతి జీవిత కాలములో ఒక నిర్ధారిత కాలానికి సౌకర్యవంతమైన రిటైర్‌మెంట్ పొందండి.
  • ప్రస్తుతమున్న వ్యక్తిగత వైవిధ్య మరియు సమూహ వైవిధ్య యాన్యువిటీ పాలసీదారులు/ సభ్యులు/ లబ్దిదారులు 0 నుండి 99 సంవత్సరాల వరకూ ఏ సమయములోనైనా ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాను నుండి ప్రయోజనాన్ని పొందవచ్చు

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ క్రింద పెన్షన్ యాన్యువిటీ ఆప్షన్లు

ఈ సింగిల్ ప్రీమియం రిటైర్‌మెంట్ పాలసీ క్రింద, మీరు ఎంచుకోవడానికి నాలుగు విభిన్నమైన పెన్షన్ యాన్యువిటీ ఆప్షన్లు ఉన్నాయి:

  • లైఫ్ యాన్యువిటీ
  • కొనుగోలు ధర తిరిగి రాకతో లైఫ్ యాన్యువిటీ
  • లైఫ్ కొరకు ఉమ్మడి జీవితములో జీవించియున్న ఆఖరి వ్యక్తి యాన్యువిటీ
  • 5/10/15 సంవత్సరాలు మరియు తదనంతర జీవితం కొరకు యాన్యువిటీ నిశ్చితి

ఒక సింగిల్ లైఫ్ యాన్యువిటీ విషయములో, మీరు జీవించి ఉన్నంత కాలమూ పెన్షన్ యాన్యువిటీ చెల్లించబడుతుంది. ఒక ఉమ్మడి లైఫ్ యాన్యువిటీ విషయములో, యాన్యువిటెంట్లలో ఎవరైనా ఒకరు జీవించి ఉన్నంత కాలమూ పెన్షన్ యాన్యువిటీ చెల్లించబడుతుంది, అనగా., మీ మరణం మీదట, జాయింట్ లైఫ్ క్రింద మీ పేరు ఇవ్వబడిన జీవితభాగస్వామి అతను/ఆమె జీవించి ఉన్నంతకాలమూ యాన్యువిటీ అందుకుంటారు.

ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?


  • ఈ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ బీమా క్రింద, కొత్త సభ్యులు దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు (మొదటి యాన్యుటెంట్) 40 సంవత్సరాలు; ప్రస్తుతమున్న పెన్షన్ సభ్యులు/ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ యొక్క లబ్దిదారుల కొరకు 0 సంవత్సరాలు
  • ఈ ఇండియాఫస్ట్ పెన్షన్ ప్లానులో దరఖాస్తు కొరకు కనీస వయస్సు (రెండో యాన్యువిటెంట్) 18 సంవత్సరాలు.
  • ఈ ఇండియాఫస్ట్ పెన్షన్ ప్లానులో దరఖాస్తు కొరకు గరిష్ట వయస్సు (మొదటి/రెండో యాన్యువిటెంట్) 80 సంవత్సరాలు.
  • ఈ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లానులో చెల్లించాల్సిన కనీస మొత్తం రు. 3,00,000, కాగా గరిష్ట ప్రీమియం అపరిమితమైనది.
  • ఈ ఇండియాఫస్ట్ జీవిత బీమా పెన్షన్ ప్లాను క్రింద నెలకు కనీస యాన్యువిటీ కంతు రు.1000 లు మరియు సంవత్సరానికి రు. 12,500 లు.
  • ఈ రిటైర్‌మెంట్ యాన్యువిటీ ప్లాన్ క్రింద యాన్యువిటీ కంతు అంతరము నెలవారీ, మూడునెలల వారీ మరియు అర్ధ-సంవత్సరం వారీగా ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • ఒక పెన్షన్ ప్లాన్ అంటే ఏమిటి?

    పెన్షన్ ప్లానులు జీవిత వర్తింపు మరియు మదుపు అనే ద్వివిధ రిటైర్‌మెంట్ బీమా ప్రయోజనాలను అందిస్తాయి. ఇది మీ రిటైర్‌మెంట్ సందర్భంగా మీకు ఆర్థికంగా మద్దతునిచ్చే ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి మీకు వీలు కలిగిస్తుంది. అతిముఖ్యంగా, రిటైర్‌మెంట్ మీదట పాక్షిక మొత్తాన్ని ఒక ఏకమొత్తంగా తీసుకోవచ్చు. మిగతా మొత్తము రెగ్యులర్ నెలవారీ ఆదాయము లేదా యాన్యువిటీగా చెల్లించబడుతుంది.

    మీ పాలసీ ఆప్షన్లు మరియు స్వీయ ప్రాధాన్యతలపై ఆధారపడి మీరు చెల్లింపు అంతరమును ఎంచుకోవచ్చు—నెలవారీగా, మూడునెలల వారీగా, అర్ధ-సంవత్సరం వారీగా లేదా వార్షికంగా.

    రిటైర్‌మెంట్ పాలసీలో కవర్ చేయబడే కాలావధి సందర్భంగా పాలసీదారు యొక్క దురదృష్టకర మరణం సంభవించిన పక్షములో, మీరు ఒక పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేయడానికి ఎంచుకున్నప్పుడు మీరు పేర్కొన్న లబ్దిదారులు భరోసా సొమ్మును అందుకుంటారు. పెన్షన్ ప్లానులు మీ ఆర్థిక భవిష్యత్తును సుస్థిరం చేస్తాయి మరియు మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల్లో క్రమం తప్పని ఆదాయం తీసుకోవడానికి వీలు కలిగిస్తాయి. మీ సువర్ణ సంవత్సరాలలో మీ ఆర్థిక స్వాతంత్ర్యమును చూసుకోవడానికి అవి గొప్ప సాధనంగా ఉంటాయి.

  • నేను ఎంచుకోదగిన పెన్షన్ బీమా యొక్క రకాలు ఏవేవి?

    పెట్టుబడి యొక్క స్వభావం ఆధారంగా, పెన్షన్ బీమా యొక్క రకాలలో శుద్ధంగా పొదుపు ప్లానులు అయినట్టివీ మరియు పెట్టుబడి సాధనాలు అయినట్టివీ ఉంటాయి.

    యాన్యువిటీ ప్లానుల ఆధారంగా కూడా మీరు ఎంచుకోవచ్చు. ఒక ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ అనేది, ఒక సింగిల్ ప్రీమియం చెల్లించడానికి మరియు మీ మిగతా జీవిత కాలానికి తక్షణ చెల్లింపులను పొందడానికి మీకు వీలు కలిగిస్తుంది. దీర్ఘకాలం పాటు ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఎంచుకోబడిన తేదీన చెల్లింపులు మొదలు కావడానికీ ఒక డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్ మీకు వీలు కలిగిస్తుంది.

    పెన్షన్ బీమా ప్లానుల రకాలలో జాయింట్ లైఫ్ యాన్యువిటీ ప్లాన్ ఒకటి, ప్రాథమిక యాన్యువిటెంట్ యొక్క మరణం తర్వాత మీ జీవిత భాగస్వామి/ భాగస్వామికి వారి సంపూర్ణ జీవిత కాలానికి గాను అది పెన్షన్ మొత్తాన్ని చెల్లించడం కొనసాగిస్తుంది.

  • పెన్షన్ ప్లాను కొనడానికి సరియైన వయస్సు ఏది?

    రిటైర్‌మెంట్ అనంతరం సురక్షిత ఆర్థిక భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరూ ముందస్తుగానే సరియైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఒక క్రమం తప్పని ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నప్పుడు, రిటైర్‌మెంట్ గురించి అంతగా చింతించాల్సిన పని లేదని మీకు అనిపించవచ్చు. అయినప్పటికీ, రిటైర్‌మెంట్ ప్లానింగ్ మీ ప్రస్తుత స్థితిని, పెరుగుతున్న ఆరోగ్యరక్షణ వ్యయాలు, ద్రవ్యోల్బణం, మరియు పెరుగుతున్న జీవితకాలం ఆధారంగా భవిష్యత్తులో సౌకర్యవంతంగా జీవించడానికి మీకు ఎంత అవసరమై ఉంటుంది అనే అంచనాలను ఒక అంశంగా చేస్తుంది.

    ఒక పెన్షన్ ప్లాన్ కొనడానికి అత్యుత్తమ సమయం మీరు యుక్తవయసులో ఉన్నప్పుడే. చిన్న వయస్సులో మొదలుపెట్టడం వల్ల అనేక రిటైర్‌మెంట్ బీమా ప్రయోజనాలు అందుతాయి, మరియు మీరు చక్రవడ్డీ యొక్క శక్తితో మీరు ఎంతో ఎక్కువ సొమ్ము చేసుకోవచ్చు. మీ దగ్గర ఉపయోగించడానికి అతి తక్కువ ఉన్నా సరే, త్వరగా మొదలుపెట్టడం చాలా మంచిది. దానికి అర్థం, ఒకవేళ ఆ వయస్సు తప్పితే మీరు ఇక మొదలుపెట్టనేకూడదు అని కాదు. మీరు ఉన్న చోటి నుండి మీకు ఉన్నదానితో మొదలుపెట్టండి. పెన్షన్ ప్లాను కొనుగోలు చేయడానికి రెండవ-అత్యుత్తమ సమయం ఇదే.

  • ఒక రిటైర్‌మెంట్ పాలసీ యొక్క ప్రయోజనాలు ఏవేవి?

    మీరు ఎంచుకున్న యాన్యువిటీ బీమా పెన్షన్ ప్లానులపై ఆధారపడి, మీరు అనేక ప్రయోజనాలకు అర్హత కలిగి ఉంటారు:

    • రిటైర్‌మెంట్ తర్వాత మీ ఆర్థిక స్వాతంత్ర్యం చూసుకోవడానికి గాను హామీతో కూడిన ఆదాయం
    • ఒకవేళ మీ మరణం సంభవించిన పక్షములో మీ జీవితభాగస్వామి పెన్షన్ అందుకునేలా చూసుకునే అవకాశం
    • మీ కుటుంబం కోసం మరణ ప్రయోజనం లేదా భరోసా సొమ్ము
    • ప్రీమియం చెల్లింపు యొక్క అనుకూల షరతులు
    • రైడర్ల యొక్క సంభావ్య జోడింపు
    • ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను చట్టాల క్రింద పన్ను మినహాయింపులు మరియు ప్రయోజనాలు

  • ఇమ్మీడియేట్ మరియు డిఫర్డ్ యాన్యువిటీ పెన్షన్ ప్లానుల మధ్య ఉన్న భేదము ఏది?

    ఒక ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ అనేది ఒక సింగిల్ ప్రీమియం బీమా ప్లాను వంటిది. రిటైర్‌మెంట్ పెన్షన్ ప్లాన్ ని ఒక్క ఉదుటున ప్రారంభించడానికి మరియు వెంటనే నెలసరి చెల్లింపులను అందుకోవడానికీ మీరు ఒక సింగిల్ ప్రీమియం చెల్లింపు చేయాల్సి ఉంటుంది. డిఫర్డ్ యాన్యువిటీ పెన్షన్ ప్లానులకు మీరు ఒక ప్రీమియం చెల్లింపు అవధిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది, ఆ అవధిలో మీరు హామీతో కూడిన పెన్షన్ ప్లాన్ దిశగా దోహదచెల్లింపులు చేస్తారు. అటువంటి పెన్షన్ హామీతో కూడిన ప్లాన్ క్రింద, మీరు సమయాలను, చెల్లింపులు అందుకోవాలనుకుంటున్న ప్రారంభ తేదీ నుండి భవిష్యత్తులో ఒక సమయం వరకూ వైవిధ్యపరచవలసి ఉంటుంది.

  • నేను ఒకటికి మించి పెన్షన్ ప్లానులు కలిగి ఉండవచ్చునా?

    ఔను, మీ అవసరాల మేరకు మీరు ప్రైవేటు బీమాదారుల నుండి రిటైర్‌మెంట్ ప్లానులను కొనుగోలు చేసుకోవచ్చు. అయినప్పటికీ, జాతీయ పింఛను పథకము వంటి ప్రభుత్వం-అందించే పెన్షన్ ప్లానులను ఒకటికి మించి కొనుగోలు చేయలేరు.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ఉత్పత్తుల బ్రోచర్

Download Brochure File

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

మీకు ఆసక్తి కలిగించే ఇతర ఉత్పత్తులు