ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్
ఇంద్రజాలం యొక్క చిన్న గీతను జోడించుట మీ జీవితానికి

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ అనేది, క్రమం తప్పని భరోసా ఆదాయము, ప్రీమియముల తిరిగిరాక మరియు జీవిత వర్తింపు యొక్క బహుళ ప్రయోజనాలతో క్రమం తప్పని పొదుపు యొక్క దోష రహిత కలయిక, తద్వారా అది మీకు మరియు మీ ప్రియమైన వారికి అతి చక్కని జీవితాన్ని ఇస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ కొనడానికి కారణాలు
స్వల్ప వ్యవధి పాటు చెల్లించండి మరియు దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఆస్వాదించండి
మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో మీకు మద్దతు ఇవ్వడానికి గాను హామీతో కూడిన ఆదాయము
కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికముతో మీ జీవనశైలి అవసరాలకు ఒక ఊపును ఇవ్వండి.నిర్ధారిత 20 సంవత్సరాల పాటు హామీతో కూడిన ఆదాయం పొందండి
సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికము - 99 సంవత్సరాల వయస్సు వరకూ హామీతో కూడిన ఆదాయం పొందండి
ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో చెల్లించబడిన ప్రీమియములన్నీ తిరిగి చెల్లింపు
మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, సంపూర్ణ జీవిత వర్తింపు ప్రయోజనాన్ని ఆనందించడం కొనసాగించండి (మీరు రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములు చెల్లించిన తర్వాత వర్తిస్తుంది)
పెంపొందిత ప్రయోజనాల కొరకు రైడర్లను జోడించే ఐచ్ఛికం
ప్రస్తుతమున్న పన్ను చట్టాల# ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు
ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?
కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రవేశ వయస్సు 8 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు మరియు సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికానికి 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు
నిర్ధారిత 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు 5/6/7 సంవత్సరాల పాటు ప్రీమియములు చెల్లించండి
కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కొరకు ఆదాయ ప్రయోజన వ్యవధి 20 సంవత్సరాలకు నిర్ధారించబడింది మరియు సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికానికి 99 సంవత్సరాల వరకూ.
హామీ ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము రు.2,40,000 లు మరియు గరిష్ట హామీ ఇవ్వబడే మొత్తముపై పరిమితి లేదు
కనీస ప్రీమియం రు.24,000 సంవత్సరానికి, రు.12,286 అర్ధ సంవత్సరానికి, రు.6,216 మూడు నెలలకు మరియు రు.2,088 మెచ్యూరిటీ అంతరముపై; గరిష్ట ప్రీమియముపై పరిమితి ఉండదు
హామీ ఇవ్వబడిన మొత్తము గుణక పట్టిక చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్పత్తుల బ్రోచర్
గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లానులు ఏవేవి?
ఒకానొక కాలములో, ఒకే ఒక్క వ్యక్తి ఆదాయము ఒక సగటు కుటుంబాన్ని నడుపుకోవడానికి సరిపోయేది, మరియు ఆర్థిక సుస్థిరత అనేది అంతగా పట్టించుకునే అంశం అయి ఉండేది కాదు. ఈ రోజున, ఆర్థిక సుస్థిరత కలిగి ఉండడమనేది ఆకాంక్షించే ఒక లక్ష్యంగా మారింది. ఆర్థిక భద్రతను ఏర్పరచడానికి సాధనాలను రూపొందించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకొని, బీమాదారులు హామీతో కూడిన పొదుపు ప్లానులను అందజేస్తున్నారు.
గ్యారంటీడ్ ఇన్కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్లు రిస్క్-విముఖత కల మదుపరుల కొరకు రూపొందించబడ్డాయి. సాంప్రదాయ బీమా ప్లానుల యొక్క ప్రయోజనాలతో పాటుగా, గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లానులు మెచ్యూరిటీ ప్రయోజనాలు మరియు మీకు భవిష్యత్తులో అవసరం అయినప్పుడు ఒక ఆదాయ ప్రవాహమును సృష్టించుకునే అవకాశాన్ని కూడా అందిస్తాయి.
ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ లో, మీ జీవితం పాలసీ అవధికి కవర్ చేయబడుతుంది. కొన్ని ప్లానులు మీరు పరిమితమైన కాల వ్యవధి పాటు ప్రీమియములు చెల్లించే వీలును కల్పిస్తాయి. మీ ప్రీమియం చెల్లింపు అవధి ముగిసిన తర్వాత, మీరు క్రమం-తప్పని ఆదాయ ప్రయోజనాలను అందుకోవడం ప్రారంభిస్తారు. ఇతర ప్లానులలో, మీరు పాలసీ యొక్క అవధి అంతటా ప్రీమియములు చెల్లించడం కొనసాగిస్తుంటారు మరియు మీ చెల్లింపులు అవధి ముగింపులో మెచ్యూరిటీ ప్రయోజనాలుగా ఒక అస్థిరమైన నెలవారీ/ మూడు నెలల వారీ/ సంవత్సరం వారీ కాలవ్యవధుల్లో చెల్లించబడుతూ ఉంటాయి.
అనుసంధానితం-కాని గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ అనేది, ఒడిదుడుకులతో కూడిన మార్కెట్ విలువలను అనుసరించదు. జాగ్రత్తగా చేసే మీ మదుపు ఈక్విటీ మార్కెట్ యొక్క ఒడిదుడుకుల కారణంగా ఎప్పటికీ ప్రమాదములో పడదని తెలుసుకోవడంతో వచ్చే మనశ్శాంతిని మీరు ఈ విధంగా పొందవచ్చు.
ఈ రోజున మీరు ఎంత సంపాదిస్తున్నారనేదానితో సంబంధం లేకుండా, ఒక రెండో ఆదాయ మార్గం మాత్రమే సహాయకారిగా ఉంటుంది. అంతిమంగా ఖర్చుల్ని తీర్చుకోవడం మరియు ఆకస్మిక ఖర్చులకు చెల్లించడంపై దృష్టి సారించడానికి బదులుగా, ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్, రాబోవు సంవత్సరాల కోసం మీ ఇంటిల్లిపాదికీ ఆర్థిక సుస్థిరత కల్పించడానికి మీరు ఏర్పాట్లు చేశారని తెలుసుకొని హాయిగా సేదదీరడానికి మీకు వీలు కలిగిస్తుంది. ఒక మంచి గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ యొక్క దివ్యమైన ప్రయోజనాలలో ఓలలాడండి — క్రమం తప్పని భరోసా ఆదాయం, ప్రీమియముల తిరిగి రాక, పాలసీ వ్యవధి అంతటా జీవిత వర్తింపు, మరియు అడుగడుగునా అనుకూలత.
గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్లను ఎవరు ఎంచుకోవాలి?
మీరు ‘'గ్యారంటీ’ అనే పదాన్ని విన్నప్పుడు అది విశ్వాసాన్ని స్ఫురింపజేస్తుంది. మీకు ఎంత వస్తుంది, ఎప్పుడు మరియు ఏ వ్యవధికి అని మీకు కచ్చితంగా తెలుస్తుంది. మీ వృద్ధాప్యములో మీ ఆర్థిక భద్రత మరియు స్వేచ్ఛ గురించి చింతించకుండా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఇది కచ్చితంగా వీలు కలిగిస్తుంది.
మీకు అవసరమైనప్పుడు ఆదాయ మార్గం రావడాన్ని వద్దనుకునే వారు ఎవరైనా ఉంటారా? ఒక ఆపత్కాలనిధిని వృద్ధి చేసుకోవాలని, సమర్థవంతంగా పొదుపు చేసుకోవాలని, తర్వాతి సంవత్సరాల్లో నిలకడైన చెల్లింపు అందుకోవాలనుకునే వారు ఎవరైనా, ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ని ఎంచుకోవాలి.
ఒకవేళ మీకు ఈ క్రిందివి అవసరమైతే, మీ ఆర్థిక పోర్ట్ ఫోలియోకు ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ జోడించడానికి పరిగణించండి:
- జీవితం యొక్క హెచ్చుతగ్గుల ముఖచిత్రంలో నిశ్చితికి మీరు విలువనివ్వడం. ఎటువంటి ఆశ్చర్యాలు లేకుండా మరియు మీ మదుపుకు ఎటువంటి రిస్కు లేకుండా హామీతో కూడిన ప్రయోజనాల్ని మీరు ఆనందించాలనుకుంటే.
- మీకు బాగా ఎక్కువ అవసరమైనప్పుడు మీ జీతానికి తోడయ్యేది లేదా జీతం స్థానంలో వచ్చే నిలకడైన ఆదాయ మార్గాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే.
- ఒకవేళ మీ మరణం సంభవించిన పక్షములో మీ కుటుంబం యొక్క ఆర్థిక అవసరాల్ని తీర్చడానికి మీకు ఒక సాంప్రదాయక వర్తింపు కావాలనుకుంటే.
- అధునాతన మదుపు ప్రయోజనావకాశాల ఆరోగ్యకరమైన ప్రవాహముతో సాంప్రదాయక బీమా ప్లానులను మీరు ఆనందించాలనుకుంటే — జీవిత వర్తింపు + పాలసీ అవధి ముగింపులో సర్వైవల్/ మెచ్యూరిటీ ప్రయోజనాలు.
- మీరు పెట్టుబడి చేసిన ఆపత్కాల నిధిపై పన్ను ప్రయోజనాలు పొందాలనుకుంటే.
- అనుకూలతకు మీరు విలువనిచ్చి మరియు మీ పొదుపు ప్లానులు మీ కొరకు ఎలా పని చేస్తాయో అనుకూలీకరణ చేసుకోవాలనుకుంటే.
- పైకెగసి క్రిందికి పడే మార్కెట్ ఫండ్ విలువలకు అనుసంధానించబడని ఒక హెచ్చరికతో కూడిన మదుపు సాధనం కావాలని మీరు అనుకుంటూ ఉంటే.
ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ ఒక ఉత్తమ పొదుపు సాధనం ఎందుకు అవుతుంది?
అనేకమంది వ్యక్తులు దీర్ఘ-కాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. అయినప్పటికీ, తమ జీవితములోని తదుపరి సంవత్సరాలలో వారిని మంచి నిలకడ స్థితిలో ఉంచే ఒక ఆపత్కాల నిధిని నిర్మించడానికి బదులుగా, గత్యంతరం లేక దృష్టి ఆర్థిక ఆశయాల వైపుకు మళ్ళుతుంది. మీరు ఒక ఇల్లు కొనాలని, మీ పిల్లల చదువుకు చెల్లించాలని, మీ పిల్లలకు పెళ్ళి చేయాలని, లేదా అత్యవసరాలకు డబ్బును ప్రక్కన పెట్టాలని అనుకోవచ్చు. ఈ ఆకాంక్షలన్నీ మీ జేబు నుండి డబ్బు వదిలివెళ్ళడంతో ముడిపడి ఉంటాయి. ఈ రోజున మదుపు చేసి, తద్వారా మీకు బాగా ఎక్కువ అవసరం అయినప్పుడు మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు తిరిగి వస్తే ఎలా ఉంటుంది? ఇక్కడనే ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ రంగం లోనికి ప్రవేశిస్తుంది.
సాంప్రదాయక వర్తింపుతో పాటుగా, మెచ్యూరిటీ ప్రయోజనాలు, మరియు మరణ ప్రయోజనాలు (పాలసీదారు గనక అకాల మరణం చెందిన పక్షములో), ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్, మీరు ఎంచుకున్నదాన్ని బట్టి కాలానుగత చెల్లింపులు చేసే హామీతో కూడిన ప్రయోజనాలను అందిస్తుంది.
ఇండియాలోని అనేక పొదుపు ప్లానులు, ఒక ఏకమొత్తం సొమ్ము రూపములో పెంపొందించబడి మీకు తిరిగి వచ్చే ఒక ఆపత్కాల నిధిని ఏర్పాటు చేసుకోవడానికి మీకు సహాయపడతాయి. కొంతమందికి ఇది మంచి ఆలోచనలాగా అనిపించినా, మీ పొదుపు ప్లాను నుండి మీకు వాస్తవంగా ఏమి కావాలో ఆలోచించడం ముఖ్యము. మీరు ఒక ఏకమొత్తం సొమ్ము అందుకున్నప్పుడు, ఆ డబ్బు మీ వద్ద చాలా కాలం ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ డబ్బును నిర్వహణ చేయడం ప్రాధాన్యత అంశం అవుతుంది. ఇండియాలోని గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లానులు మీ కోసం దాని నుండి ప్లానింగ్ తీసుకుంటాయి — పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత హామీతో కూడిన చెల్లింపులను మీకు అందజేయడం ద్వారా.
కాబట్టి, మీరు గనక ఒక హామీతో కూడిన ఆదాయం వచ్చే ప్లాన్ కొన్నట్లయితే, మీరు కాలానుగతమైన తీరులో హామీతో కూడిన చెల్లింపులు, జీవిత వర్తింపు, మరియు ఆర్థిక సుస్థిరత పొందుతారు — మీ ఉత్తమమైన, రిస్కు-లేని పొదుపు బీమా ప్లాను నుండి మీరు ప్రతిదానినీ ఆశించవచ్చు.
ఇండియాఫస్ట్ ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ పొదుపు ప్లాన్లను కొనేటప్పుడు పరిగణించాల్సిన అంశాలు ఏవేవి?
హామీతో కూడిన ఆదాయం వచ్చే పొదుపు ప్లాన్ అనేది అనుసంధానం-చేయబడని సాంప్రదాయక బీమా పాలసీ, అది మార్కెట్ ఒడిదుడుకులకు అనుసంధానం అయి ఉండదు కాబట్టి ఎటువంటి రిస్కు ఉండదు. అటువంటి ప్లాను, కాలానుగతమైన తీరులో హామీతో కూడిన చెల్లింపుల రూపములో రాబడులను అందిస్తుంది. మీరు ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ కొనే ముందుగా, పరిగణించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి:
రిస్క్-రాబడుల యొక్క ఏ అనుపాతముతో మీరు సౌకర్యంగా ఉంటారు?
మరీ ముఖ్యంగా, అధిక రిస్కును మరియు అధిక రాబడులను అందజూపే మదుపు సాధనాలు. అయినప్పటికీ, అనేకమందికి రిస్క్ అంశము అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. దూకుడు గల మదుపరులు అత్యధిక రాబడులను ఆశిస్తూ తమ డబ్బును స్టాకులు మరియు మార్కెట్ ఫండ్లలో ఉంచుతారు. ఐతే క్షీణించే స్టాక్ ధరలతో మొదటి అడుగు బాగానే ఉంటుంది కానీ మీరు మీ మదుపును కోల్పోతారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే, మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు పోయినా పరవాలేదని అనుకున్నప్పుడు మాత్రమే రిస్కుతో కూడిన మదుపు సాధనాల్లో మీరు పెట్టుబడి చేయాలి.
ఒకవేళ మీకు ఎక్కువ రిస్క్ వాంఛ లేకపోతే, మీ గేజును తక్కువ-రిస్కు మరియు హామీతో కూడిన రాబడులను ఇచ్చే సాంప్రదాయక బీమా ప్లానుల వైపుకు త్రిప్పండి.
మీరు మీ పాలసీ అవధి ఎంత కాలం ఉండాలనుకుంటున్నారు?
హామీతో కూడిన ఆదాయం వచ్చే ప్లాన్ అవధులను పరిగణించడానికి రెండు అంశాలు ఉన్నాయి—మీరు ఎంత కాలంపాటు ప్రీమియం చెల్లింపులు చేయాలనుకుంటున్నారు, మరియు మీ పాలసీ నుండి మీరు ఎంత కాలం కాలానుగత చెల్లింపులు అందుకోవాలనుకుంటున్నారు? గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లానులు మీకు పరిమిత-ప్రీమియం చెల్లింపు అవధిని మరియు మీరు కాలానుగత చెల్లింపులను అందుకోగల నిర్ధారిత అవధిని ఎంచుకునే అనుకూలతను అందిస్తాయి.
మీరు మీ చిన్నారి కొరకు హామీతో కూడిన ఆదాయం వచ్చే ప్లాన్ తో మొదలు పెట్టవచ్చు మరియు వాళ్ళు కాలేజీకి వెళ్ళే నాటికి నిలకడైన నెలసరి ఆదాయ ప్రవాహాన్ని అందుకోగలుగుతారు. ఒక హామీతో కూడిన ఆదాయం వచ్చే ప్లాన్ అనేది మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అమ్ముల గుత్తికి జోడించడానికి ఒక గొప్ప ఆయుధం, తద్వారా మీరు రిటైర్ అయిన తర్వాత మీరు హామీతో కూడిన కాలానుగత చెల్లింపులను అందుకుంటారు.
మీరు ఎటువంటి రకం చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు?
ఒక నెలవారీ చెల్లింపు కంటే ఒక ఏకమొత్తం సొమ్ము మీ అవసరాలకు సరిపోతుందా? భవిష్యత్తులోని మీ ఆర్థిక అవసరాలను పరిగణించండి, ఒక ఆపత్కాల నిధిని నిర్మించడానికి మరియు మెచ్యూరిటీలో గణనీయమైన మొత్తాన్ని అందించేందుకు సహాయపడే ఒక ఎండోమెంట్ పాలసీ మీ అవసరాలకు బాగా సరిపోతుందేమో నిర్ణయించుకోండి. ప్రత్యామ్నాయంగా, కాలానుగతమైన తీరులో జీవితాంతమూ చెల్లింపుల హామీతో కూడిన ఆదాయాన్నిచ్చే ఎండోమెంట్ పాలసీ మిమ్మల్ని ఆకట్టుకోవచ్చు. ఒక హామీతో కూడిన ఆదాయాన్నిచ్చే ప్లాన్ కొనాలని ఎంచుకోవడానికి ముందుగా మీరు ఎటువంటి రకం ఆదాయ ఉత్పన్నాన్ని కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి.
మీ మదుపు నిర్ణయాలను ఏది ప్రభావితం చేస్తుంది?
ప్రతి మదుపరి యొక్క నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి, హామీతో కూడిన ఆదాయాన్నిచ్చే ప్లాన్ కొనడానికి ముందు వీటిని పరిగణన లోనికి తీసుకోవాలి.
మీ ప్రస్తుత జీవనశైలికి మీకు ఎంత వ్యయం అవుతోంది?
భవిష్యత్తులో ఈ జీవనశైలినే నిర్వహించుకోవాలని మీరు ఆశిస్తున్నారా?
మీ ఆదాయం ఎంత, మరియు అందులో ఖర్చుల కోసం ఎంత వెళుతోంది?
పన్ను పొదుపులు మీకు ముఖ్యమా?
మీకు సాంప్రదాయక జీవిత వర్తింపు యొక్క మనశ్శాంతి కావాలా?
రాబోవు సంవత్సరాలలో మీ ఆర్థిక సుస్థిరతను ద్రవ్యోల్బణము ఎలా ప్రభావితం చేస్తుంది?
మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న ప్రశ్నలు లేకుండా చూసుకోండి, వాటికి జవాబులు పొందండి, మరి ఆ తర్వాత, మీ అవసరాలకు ఏ రకం సాంప్రదాయక బీమా ప్లానులు బాగా సరిపోతాయో కనుక్కోండి.
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ ఎలా పని చేస్తుంది?
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ అనేది, అనుసంధానం కాని, భాగస్వామ్యం లేని, పరిమిత ప్రీమియం, ఎండోమెంట్ జీవిత బీమా ప్లాన్, ఇది మీకు మరియు మీ కుటుంబానికి అన్ని జీవిత దశల్లోనూ మీ పాలసీ అవధి అంతటా జీవిత వర్తింపును అదే విధంగా ఒక భరోసా గల ఆదాయ ప్రయోజనాన్ని అందిస్తూ తోడ్పడుతుంది.
మీ కోసం ఇది ఏ అర్థం చెబుతుందో ఒకసారి చూద్దాం:
అనుసంధానితం-కానిది
అనుసంధానితం కాని ఒక పాలసీగా, ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ మార్కెట్ ఫండ్ విలువలపై ఆధారపడి ఉండదు. మార్కెట్ యొక్క హెచ్చె తగ్గులు మీ పాలసీ అందజేతలపై ప్రభావం చూపవు కాబట్టి, అనాహ్లాదకరమైన ఆశ్చర్యాల గురించి భయపడకుండా హామీతో కూడిన రాబడులను పొందడం మీకు సాధ్యమవుతుంది.
భాగస్వామ్యం లేని (నాన్-పార్టిసిపేటింగ్)
భాగస్వామ్యం లేని పాలసీ అనేది కంపెనీల లాభాల్లో పాలు పంచుకోదు కాబట్టి ఇది ఎటువంటి డివిడెండులనూ అందజేయని పాలసీ. భాగస్వామ్యంతో ఉన్న పాలసీలతో పోలిస్తే, భాగస్వామ్యం లేని పాలసీలు మరింత సురక్షితం, హామీతో కూడిన రాబడులను అందిస్తాయి మరియు తక్కువ ప్రీమియం ధరలు ఉంటాయి.
పరిమిత ప్రీమియం
ఒక పరిమిత ప్రీమియం పాలసీగా, ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్, ఒక పరిమిత కాల వ్యవధి పాటు ప్రీమియములు చెల్లించేలా, మరి దాని తర్వాత ఒక నిర్ధారిత వ్యవధి పాటు చెల్లింపులు అందుకునేలా మీకు వీలు కలిగిస్తుంది. ఈ ప్లానుతో, పాలసీ యొక్క అవధి అంతటా మీరు సాంప్రదాయక బీమా యొక్క ప్రయోజనాలను అందుకుంటారు, మరియు డబ్బు రూపములో చెల్లింపులు మరియు ప్రయోజనాలను అందుకోవడం మొదలుపెట్టడానికి మీరు పాలసీ యొక్క ముగింపు వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదు.
ఇది ఎలా పని చేస్తుంది?
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ తో, మీకు 10 సంవత్సరాల పాలసీ అవధి ఉంటుంది. మీరు 5, 6, లేదా 7 సంవత్సరాల పరిమిత ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. ప్రవేష సమయములో జీవిత భరోసా పొందే వ్యక్తి యొక్క వయస్సుపై ఆధారపడి, మీరు 20 సంవత్సరాల నిర్ధారిత ఆదాయ వ్యవధితో కచ్చితమైన ఆదాయం ఐచ్ఛికాన్ని అయినా ఎంచుకోవచ్చు లేదా మీరు 99 సంవత్సరాల వయస్సుకు చేరే వరకూ సంపూర్ణ జీవితకాల ఆదాయ ఐచ్ఛికాన్ని అయినా ఎంచుకోవచ్చు. మీరు ప్రీమియములను నెలవారీ, మూడు నెలలవారీ, అర్ధ-సంవత్సరం వారీ, లేదా సంవత్సరం వారీ అంతరములో చెల్లించడానికి ఎంచుకోవచ్చు. మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ మరియు ఇండియాఫస్ట్ టర్మ్ రైడరును కూడా ఈ పాలసీకి జోడించుకోవడానికి ఎంచుకోవచ్చు.
పాలసీని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది:
40 సంవత్సరాల వయస్సులో శర్మ గారు ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ కొన్నారు. అతను ప్రవేశములో అతని వయస్సు ఆధారంగా సంపూర్ణ జీవితకాల ఆదాయ ఐచ్ఛికాన్ని అందుకున్నారు. ప్రీమియం చెల్లింపు అవధి 5 సంవత్సరాలు మరియు పాలసీ అవధి 10 సంవత్సరాలకు అతను వార్షిక ప్రీమియం రు. 1,00,000 (పన్నులు కాకుండా) చెల్లించారు.
అతను పాలసీ అవధి ముగింపు నుండి మొదలై ఆదాయ ప్రయోజన వ్యవధి సందర్భంగా 99 సంవత్సరాల వయస్సు వరకూ వార్షిక ఆదాయ ప్రయోజనం రు. 40,000 (వార్షికం చేయబడిన ప్రీమియములో 40%) అందుకోవడానికి ఎంచుకున్నారు. అతడు ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో ఒక ఏక మొత్తంగా రు. 5,00,000 (చెల్లించిన మొత్తం ప్రీమియముల వాపసు, రైడర్ ప్రీమియం కాకుండా, మోడల్ లోడింగ్ అంశము, వర్తించు పన్ను మరియు పూచీకత్తు, అదనపు ప్రీమియం, ఏదైనా ఉంటే) కూడా అందుకుంటారు.
పాలసీ అవధి సందర్భంగా అతని మరణం సంభవించిన పక్షములో, ఈ ఉదతములో అతనికి ప్రియమైనవారు భరోసా మొత్తము అయిన రు. 11,69,000 లు అందుకుంటారు. అతను/ అతని నామినీ, ఈ మరణ ప్రయోజనమును ఒక ఏకమొత్తముగా లేదా 5/10/ 15 సంవత్సరాల పాటు కంతులలో తీసుకునేలా ఎంపిక చేసుకోవచ్చు.
ఆదాయ ప్రయోజన వ్యవధి కాలములో అతని మరణం సంభవించిన పక్షములో, అతని నామినీ ఆదాయ ప్రయోజన వ్యవధి యొక్క ముగింపు వరకూ భవిష్యత్ ఆదాయ ప్రయోజనాన్ని అందుకుంటూనే ఉంటారు. ఆదాయ ప్రయోజన వ్యవధి యొక్క ముగింపులో, పాలసీ క్రింద చెల్లించబడిన మొత్తం ప్రీమియములు (పైన పేర్కొనబడిన మినహాయింపులతో) నామినీకి చెల్లించబడతాయి. భవిష్యత్ ప్రయోజనాన్ని ఒక ఏకమొత్తం సొమ్ముగా అందుకోవడానికి నామినీకి ఐచ్ఛికం ఉంటుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు ఏవేవి?
- ఒక 10-సంవత్సరాల పాలసీ కొరకు 5/6/7 సంవత్సరాల వ్యవధిని ఎంచుకోవడం ద్వారా పరిమిత ప్రీమియం ఐచ్ఛికాన్ని ఆనందించండి. ఈ విధంగా మీరు స్వల్ప వ్యవధి పాటు చెల్లించండి మరియు దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఆస్వాదించండి.
- మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో మీకు మద్దతు ఇవ్వడానికి గాను హామీతో కూడిన ఆదాయము పొందండి.
- కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికముతో మీ జీవనశైలి అవసరాలకు ఒక ఊపునివ్వండి, అందులో మీరు 20 సంవత్సరాల నిర్ధారిత వ్యవధి పాటు హామీతో కూడిన ఆదాయం అందుకుంటారు లేదా సంపూర్ణ జీవితకాల ఐచ్ఛికమును ఎంచుకుంటే అందులో 99 సంవత్సరాల వయస్సు వరకూ హామీతో కూడిన ఆదాయచెల్లింపులు అందుకుంటారు.
- ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో చెల్లించబడిన ప్రీమియములన్నీ (పైన కనబరచిన మినహాయింపులతో) తిరిగి పొంది ఆనందించండి.
- మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, ఈ ప్లానులో సంపూర్ణ జీవిత వర్తింపు కొనసాగే ప్రయోజనాన్ని ఆనందించడం కొనసాగించండి (మీరు మొదటి రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములు చెల్లించిన తర్వాత వర్తిస్తుంది)
- మరణ ప్రయోజనాన్ని ఒక ఏకమొత్తంగా గానీ లేదా 5, 10, లేదా 15 సంవత్సరాల పాటు క్రమం తప్పని ఆదాయ చెల్లింపులుగా గానీ పొందండి.
- పెంపొందిత ప్రయోజనాల కోసం ఆప్షనల్ ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ మరియు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ తో మీ ప్లాన్ పొడిగించుకోండి.
- ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై అందుబాటులో ఉండే పన్ను ప్రయోజనాలు పొందండి.
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ క్రింద ఆదాయ ప్రయోజనం ఆప్షన్లు ఏవేవి?
పాలసీని కొనుగోలు చేసే సమయములో వయస్సును బట్టి, ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తికి రెండు వేర్వేరు ఆదాయ ప్రయోజన ఐచ్ఛికాలు ఉన్నాయి:
కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం
ప్రవేశించునాటికి జీవిత భరోసా పొందిన వ్యక్తి వయస్సు గనక 8 నుండి 29 సంవత్సరాలు అయి ఉంటే, మీ పాలసీకి డెఫినిట్ ఇన్కమ్ ఆప్షన్ వర్తింపజేయబడుతుంది. ఈ ఐచ్ఛికం క్రింద, పాలసీ అవధి ముగింపు నుండి మొదలై 20 సంవత్సరాల నిర్ధారిత ఆదాయ కాలవ్యవధి పాటు వార్షికం చేయబడిన ప్రీమియములో కొంత శాతము క్రమం తప్పని ఆదాయముగా చెల్లించబడుతుంది.
పొందవలసియున్న ఆదాయ ప్రయోజనం, ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు అవధిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆదాయ ప్రయోజనం, వార్షికం చేయబడిన చెల్లించదగిన ప్రీమియం యొక్క ఒక శాతం అయి ఉంటుంది. 5-సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి విషయములో, ఆదాయ ప్రయోజనం 45% ఉంటుంది. 6 సంవత్సరాలు మరియు ఏడు సంవత్సరాలకు వరుసగా ఆదాయ ప్రయోజనం 50% మరియు 60% ఉంటుంది.
సంపూర్ణ జీవితానికి ఆదాయ ఐచ్ఛికం
ప్రవేశించునాటికి జీవిత భరోసా పొందిన వ్యక్తి వయస్సు గనక 30 నుండి 60 సంవత్సరాలు అయి ఉంటే, మీ పాలసీకి సంపూర్ణ జీవితకాల ఇన్కమ్ ఆప్షన్ వర్తింపజేయబడుతుంది. ఈ ఐచ్ఛికం క్రింద, పాలసీ అవధి ముగింపు నుండి మొదలై 99 సంవత్సరాల వయస్సు వరకూ వార్షికం చేయబడిన ప్రీమియములో కొంత శాతము క్రమం తప్పని ఆదాయ చెల్లింపుగా చెల్లించబడుతుంది.
ఈ ఉదంతములో, వార్షికం చేయబడిన ప్రీమియములో చెల్లించదగిన కొంత శాతం అయిన ఆదాయ ప్రయోజనం, ప్రవేశములో జీవితభరోసా పొందిన వ్యక్తి యొక్క వయస్సు మరియు ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు అవధిపై ఆధారపడి ఉంటుంది.
ప్రవేశము సమయములో 30-45 సంవత్సరాల వయసు ఉన్నవారికి, 5-ఏళ్ళ ప్రీమియం చెల్లింపు అవధికి గాను ఆదాయ ప్రయోజనం 40% ఉంటుంది, 6-ఏళ్ళ ప్రీమియం చెల్లింపు అవధికి 45%, మరియు 7-ఏళ్ళ ప్రీమియం చెల్లింపు అవధికి 55% ఉంటుంది.
ప్రవేశము సమయములో 46-60 సంవత్సరాల వయసు ఉన్నవారికి, 5-ఏళ్ళ ప్రీమియం చెల్లింపు అవధికి గాను ఆదాయ ప్రయోజనం 35% ఉంటుంది, 6-ఏళ్ళ ప్రీమియం చెల్లింపు అవధికి 40%, మరియు 7-ఏళ్ళ ప్రీమియం చెల్లింపు అవధికి 50% ఉంటుంది.
అన్ని ఉదంతాలలోనూ, ఆదాయకాలవ్యవధి ముగింపులో, పాలసీ క్రింద చెల్లించబడే మొత్తం ప్రీమియములు (పైన పేర్కొనబడిన మినహాయింపులతో) మీకు లేదా మీ నామినీకి తిరిగి ఇవ్వబడతాయి మరియు పాలసీ క్రింద అన్ని ప్రయోజనాలూ రద్దు అవుతాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ కొనడానికి అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
హామీ ఇవ్వబడిన మొత్తము గుణక పట్టికను ఇక్కడ చూడండి.
- కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రవేశ వయస్సు 8 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు మరియు సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికానికి 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు
- నిర్ధారిత 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు ప్రీమియం చెల్లింపు అవధులు 5, 6, లేదా 7 సంవత్సరాలు.
- కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కొరకు ఆదాయ ప్రయోజన వ్యవధి 20 సంవత్సరాలకు నిర్ధారించబడింది మరియు సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికానికి 99 సంవత్సరాల వరకూ.
- భరోసా ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము రు. 2,40,000 లు మరియు గరిష్ట భరోసా మొత్తముపై ఎటువంటి పరిమితి లేదు
- కనీస ప్రీమియం రు. 24,000 సంవత్సరానికి, రు. 12,286 అర్ధ సంవత్సరానికి, రు. 6,216 మూడు నెలలకు మరియు రు. 2,088 నెలవారీ అంతరముపై, గరిష్ట ప్రీమియము మొత్తముపై ఎటువంటి పరిమితి లేకుండా.
భరోసా ఇవ్వబడే మొత్తము గుణక పట్టికను ఇక్కడ చూడండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
- ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ క్రింద నేను పొందగల గ్యారంటీడ్ మెచ్యూరిటీ ప్రయోజనం ఏది?
పాలసీ అమలులో ఉన్నట్లయితే పాలసీ అవధి యొక్క ముగింపు వరకూ జీవిత భరోసా పొందిన వ్యక్తి జీవించియున్న మీదట మెచ్యూరిటీ ప్రయోజనం చెల్లించబడుతుంది. ఈ ప్రయోజనములో పాలసీ అవధి ముగింపు నుండి మొదలై హామీతో కూడిన ఆదాయ ప్రయోజనం చేరి ఉంటుంది, మరియు కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం లేదా సంపూర్ణ జీవిత కాల ఆదాయ ఐచ్ఛికం క్రింద ఆదాయ ప్రయోజన వ్యవధి పాటు చెల్లించబడుతుంది.
ఆదాయ ప్రయోజన అవధి ముగింపులో, పాలసీ క్రింద చెల్లించబడిన మొత్తం ప్రీమియములు (పైన పేర్కొనబడిన మినహాయింపులతో) మీకు తిరిగి ఇవ్వబడతాయి, ఆ తదుపరి పాలసీ క్రింద అన్ని ప్రయోజనాలూ రద్దు అవుతాయి.
- ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ క్రింద మెచ్యూరిటీ ప్రయోజనాలు ఎలా చెల్లించబడతాయో దానిని నేను మార్చుకోవచ్చునా?
ఔను. మెచ్యూరిటీ తేదీన, కాలానుగత చెల్లింపులకు బదులుగా ఒక ఏకమొత్తం సొమ్ముగా మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందుకునే ఒక ఐచ్ఛికం మీకు ఉంటుంది. ఆదాయ ప్రయోజన కాలవ్యవధిలో మీరు ఎప్పుడైనా సరే, ఒక ఏకమొత్తం చెల్లింపుకు మార్పిడి చేసుకోవచ్చు.
- ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ పాలసీ అవధి సందర్భంగా జీవిత భరోసా పొందబడిన వ్యక్తి అకాల మరణం సంభవించిన పక్షములో ఏమి జరుగుతుంది?
పాలసీ అవధి కాలములో లేదా పాలసీని పూర్తిగా చెల్లించిన తర్వాత, జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణము సంభవించిన ఉదంతములో, పాలసీదారు/నామినీ (లు) ఎంచుకున్న ప్రకారము నామినీకి ఒక ఏకమొత్తం సొమ్ముగా గానీ లేదా తదుపరి 5, 10 లేదా 15 సంవత్సరాల పాటు నెలసరి ఆదాయముగా గానీ మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. మరణం మీదట మరణ ప్రయోజనం, భరోసా మొత్తం కంటే అధికంగా ఉంటుంది లేదా మరణించిన నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియములకు 105% గా ఉంటుంది.
- ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ పాలసీలో ఏవైనా రైడర్లు అందుబాటులో ఉన్నాయా?
ఔను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ తో (మరణం మీదట ప్రీమియం వైవర్, ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యముపై లేదా క్లిష్ట అస్వస్థత యొక్క వ్యాధినిర్ధారణపై ప్రీమియం వైవర్, మరియు మరణం లేదా ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము లేదా క్లిష్ట అస్వస్థతపై ప్రీమియం వైవర్ తో) మరియు పూర్తిగా అవధి బీమా రైడర్ అయిన ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ తో మీ పాలసీ పెంపుదలను ఎంచుకోవచ్చు.
- ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ కొరకు నేను ముందస్తుగానే రిన్యూవల్ ప్రీమియములను చెల్లిస్తే ఏదైనా రాయితీ ఉందా?
ఔను. ఒకవేళ మీరు ప్రీమియం గడువు తేదీకి కనీసం ఒక నెల ముందస్తుగానే రిన్యూవల్ ప్రీమియములను చెల్లిస్తే మరియు అలా 12 నెలల వరకూ ప్రీమియం గడువు తేదీకి ముందే ప్రీమియములను చెల్లిస్తే, ఆ కాలవ్యవధి, ప్రీమియం గడువు తేదీగా అదే ఆర్థిక సంవత్సరం లోపున అయి ఉంటే, మీరు రిన్యూవల్ ప్రీమియంపై రాయితీ పొందవచ్చు.
- ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్ పై నేను ఒక లోన్ పొందవచ్చా?
ఔను, ఈ ప్లాన్ క్రింద, ఒక లోన్ సౌకర్యం ఉంది. ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము ఆ సమయములోని సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది, మరియు అందుబాటులోని సరెండర్ విలువపై 90% వరకూ ఉండవచ్చు. కనీస లోన్ మొత్తము రు.1,000 లుగా ఉండాలి.