ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్
మీ చిరునవ్వు సంతోషంగా మారడాన్ని వీక్షించండి
GET A QUOTE
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ అనేది, మీ ప్రీమియం చెల్లింపు అవధి మరియు విరామ సంవత్సరం (ఒకవేళ ఎంచుకుంటే) పూర్తయిన తదనంతరం నెలవారీ హామీతో కూడిన చెల్లింపులను అందించే ఒక అనుసంధానితం కాని, పాల్గొనే, పరిమిత ప్రీమియం, జీవిత బీమా ప్లాన్.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్
ప్రతి నెలా మీకు హామీతో కూడిన ఆదాయం వచ్చేలా మేము మీకు భరోసా ఇస్తాము
మీరు చెల్లించినదానికంటే ఎక్కువ పొందండి! చెల్లింపుల ద్వారా నెలవారీ క్రమం తప్పని మద్దతును మేము మీకు భరోసా ఇస్తుండగా మీ ప్రీమియములను వార్షికంగా 105% నుండి 125% వరకూ అందుకుంటూ ఉండండి.
ఈ పాలసీ లోని సకాలపు భరోసా గల చెల్లింపుల సహాయముతో పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకొని సాధించండి
మీ ఆదాయాన్ని మెరుగైన విధంగా ప్లాన్ చేసుకోండి. చెల్లింపు సంవత్సరాలు పూర్తయిన వెంటనే మీరు హామీతో కూడిన నెలసరి మొత్తమును అందుకోవాలనుకుంటారా లేదా మీరు కొన్ని సంవత్సరాలు వేచి చూసేందుకు ప్రాధాన్యమిస్తారా అనేది ఎంచుకోండి.
ఆఫరుపై గల వివిధ అనుకూలతలతో, మీరు ఒక వైవిధ్యమైన ప్రీమియం చెల్లింపు, పాలసీ అవధి ఐచ్ఛికాలు మరియు ప్రీమియం చెల్లింపు రూపాల నుండి ఎంచుకుంటారు కాబట్టి మీరు ప్లాన్ ని మీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు
ఒకవేళ ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగిన పక్షములో, ఒక జీవిత వర్తింపు ద్వారా మీ ప్రియమైనవారిని రక్షిస్తూనే మెచ్యూరిటీ వద్ద వచ్చే బోనస్ సహాయముతో మీ పొదుపును పెంపొందిస్తూ ఉండండి.
మీరు చెల్లించే ప్రీమియంలు మరియు వర్తించే పన్ను చట్టాల ప్రకారం మీరు పొందే ప్రయోజనాల కోసం పన్ను ప్రయోజనాలను పొందటానికి కూడా మీరు నిలబడవచ్చు
ఏమిటి అర్హతా ప్రాతిపదికలు
ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు అవధి 8 నుండి 11 సంవత్సరాలుపాలసీ అవధి అనేది ప్రీమియం చెల్లింపు అవధి, విరామ సంవత్సరం మరియు హామీతో కూడిన క్రమం తప్పని ఆదాయ అవధి యొక్క మొత్తంగా ఉంటుంది.
భరోసా ఇవ్వబడే ప్రాథమిక మొత్తం మీ (జీవిత బీమా చేయబడిన వ్యక్తి) వయస్సు, లింగము, వార్షిక ప్రీమియం, ప్రీమియం చెల్లింపు అవధి లేదా పాలసీ అవధి మరియు ఎంపిక చేసుకున్న విరామ సంవత్సరం ఆధారంగా లెక్కించబడుతుంది.
గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అంటే ఏమిటి?
‘గ్యారంటీ’ అనే పదం శక్తివంతమైనది—అది భద్రత, రక్షణ మరియు నిశ్చితి అనే భావనలను రేకెత్తిస్తుంది.వడివడిగా అడుగులు వేస్తున్న నేటి జీవితంలో, గ్యారంటీలు అనేవి జీవితంలో మీరు చేయదగిన కొన్ని పనులు ఉంటాయని నిలకడగా గుర్తు చేసేవిగా ఉంటాయి. ఖర్చులను తీర్చుకొని మరియు రోజూ జీవిత సమస్యలతో వ్యవహరించే ప్రయత్నం చేసేటప్పుడు, చిన్న చిన్న క్షణాలను ఆనందించడం కష్టం అవుతుంది, ఎందుకంటే వాటికి ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుందో అని చింతిస్తూ మీరు బిజీగా ఉంటారు.అయినప్పటికీ, ఈ చిన్న క్షణాలలో ఎంతో ఎక్కువ ఆనందం ఉంటుంది.దేనినైతే మీరు చిన్నదిగా భావించారో అది చిన్నది కానే కాదని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది.
ఈ ఖర్చుల గురించి చింతించడం ఆపివేయడానికి మీకు ఎంత అవుతుంది?మీరు సమకూర్చుకోగలిగిన ఒక అదనపు ఆదాయ మార్గం ఈ వ్యత్యాసం అంతటినీ చేయగలుగుతుంది.నేడు చేసే ఒక చక్కని బీమా నిర్ణయము భవిష్యత్తులో మీ జీవితాన్ని ఒత్తిడి లేనిదిగా చేయగలుగుతుంది.గ్యారంటీతో కూడిన ఆదాయ పొదుపు ప్లాను భవిష్యత్తులో మీరు కృతజ్ఞతగా ఉండదగిన బీమా ఎంపిక అవుతుంది.ఒత్తిడిని వదిలించుకోండి, మరియు మీ యొక్క మరియు మీ కుటుంబము యొక్క లక్ష్యాలను తీర్చుకొని అంతులేని ఆనందం పొందండి.
గ్యారంటీడ్ ప్లాన్ అనేది మీకు భరోసాతో కూడిన ప్రయోజనాన్నిఅందించగలిగే ప్లాన్.మీరు గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ కొనేటప్పుడే మీరు అందుకోబోయే మొత్తము హామీ కలిగినది, నిర్ధారితంగా, మరియు మీకు తెలియజేయబడి ఉంటుంది.ఈ రకం సాంప్రదాయక బీమా పొదుపు ప్లాను మీకు జీవిత వర్తింపును అదేవిధంగా గ్యారంటీతో కూడిన ఒక ఏకమొత్తం చెల్లింపును మరియు బోనసు (ఒకవేళ వర్తిస్తే) లను అందిస్తుంది.
భరోసాతో కూడిన చెల్లింపులను అందించడం ద్వారా, ఒక గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ మీకు ఏది కావాలో కచ్చితంగా దానిని అందజేస్తుంది—ఆర్థిక భద్రత.
ఈ క్రింది విధంగా ఉంటే మీరు తప్పనిసరిగా ఒక గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ కొనాలి:
- మీకు గ్యారంటీతో కూడిన ప్రయోజనాలు—ఆశ్చర్యాలు లేకుండా, రిస్క్ లేకుండా కావాలంటే.
- మీకు నెలసరి/కాలానుగత చెల్లింపులు చేయబడాలంటే, తద్వారా మీరు ఒక నిలకడైన అనుబంధ ఆదాయ ప్రవాహముతో నిశ్చింతగా ఉండాలంటే.
- మీకు మీ జీవిత వర్తింపు కావాలంటే, మరియు మీ అకాల మరణం సంభవించిన పక్షములో మీ కుటుంబ భవిష్యత్తు పదిలం చేసుకోవడానికి ఒక మరణ ప్రయోజనం కావాలంటే.
- మీకు పన్ను ప్రయోజనాలు కావాలంటే. తద్వారా పాలసీ నుండి మీ కూడగట్టిన సంపాదనలు ఎక్కువగా ఉండాలంటే.
- మీకు మీ ప్రీమియం చెల్లింపు షరతులు మరియు పాలసీ కాలవ్యవధిని ఎంచుకునే స్వేచ్ఛ కావాలంటే.
ఒక ఎండోమెంట్ ప్లాన్ ఇతర పొదుపు బీమా ప్లానుల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది?
ఒక ఎండోమెంట్ పాలసీ యులిప్ కంటే మెరుగైనదిగా ఉంటుందా?మీకు ఒక మనీ బ్యాక్ ప్లాన్ కావాలా లేదా ఒక ఎండోమెంట్ జీవిత బీమా పాలసీ కావాలా?మీ అవసరాలకు ఒక శుద్ధమైన రక్షణ అవధి బీమా ప్లాను బాగా సరిపోతుందా?ఒక బీమా ఆప్షన్ మీద మరొకదానిని ఎంచుకునే ముందుగా, ఈ ఆర్థిక సాధనాలు ఏ సూత్రాలపై పని చేస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము.
సాంప్రదాయక బీమా ప్లానులలో, ఎండోమెంట్ పాలసీలు, మనీ-బ్యాక్ ప్లానులు, అవధి బీమా, మరియు సంపూర్ణ జీవిత పాలసీల వంటివి ఉంటాయి.ఈ సాంప్రదాయక పొదుపు బీమా ప్లానులు ముఖ్యంగా రిస్క్-లేనివిగా పరిగణించబడతాయి. అదనంగా, అవి ఒకే ప్లానులో పలురకాల ప్రయోజనాలను అందిస్తాయి.సాంప్రదాయక వర్తింపుతో పాటుగా, ఈ ప్లానులు కూడా ఒక నిర్దిష్ట హామీ ఇవ్వబడిన డబ్బు మొత్తాన్ని మరణ లేదా మెచ్యూరిటీ ప్రయోజనముగా అందిస్తాయి.
పైపెచ్చుగా, ప్లానులు పార్టిసిపేటింగ్ ప్లానులుగా, వీటిలో పాలసీదారు బీమాదారు సంపాదించుకున్న లాభాలలో వాటా పొందుతారు, మరియు నాన్ - పార్టిసిపేటింగ్ ప్లానులుగా, వీటిలో పాలసీదారు భరోసా సొమ్ముగా కొంత ముందస్తు-నిర్ధారిత మొత్తాన్ని ఎటువంటి లాభ సంబంధిత అదనపు బోనసులు లేకుండా అందునేలా వర్గీకరించబడ్డాయి.
ఎండోమెంట్ ప్లానులు వర్సెస్ మనీ బ్యాక్ పాలసీలు
ఎండోమెంట్ మరియు మనీ బ్యాక్ పాలసీలు కొన్ని కీలకమైన వ్యత్యాసాలతో అనేక విధాలుగా ఒకే లాగానే ఉంటాయి.రెండు రకాల సాంప్రదాయక పొదుపు బీమా ప్లానులు కూడా, ఒకవేళ జీవితబీమా పొందిన వ్యక్తి యొక్క అకాల మరణం సంభవించిన పక్షములో భరోసా ఇవ్వబడిన సొమ్ము రూపములో ఒక మరణ ప్రయోజనాన్ని అదే విధంగా ఏవేని వర్తించే బోనసులను చెల్లిస్తాయి.
ఒక మనీ-బ్యాక్ పాలసీలో, భరోసా సొమ్ము యొక్క ముందస్తు నిర్ధారిత శాతమును మీరు కాలానుగత అంతరాలలో అందుకుంటారు.భరోసా సొమ్ము యొక్క మిగిలిన భాగము, అదేవిధంగా పాలసీ అవధి లోపున కూడగట్టుకున్న బోనసులు ఏవైనా ఉంటే ఆ మొత్తము పాలసీలో కవర్ చేయబడిన కాలవ్యవధి ముగింపులో మెచ్యూరిటీ ప్రయోజనాలుగా మీకు విడుదల చేయబడతాయి.
ఒక ఎండోమెంట్ ప్లాన్ లో, మీకు చెల్లించబడే కాలానుగత చెల్లింపులు ఏవీ ఉండవు.మీరు ఒక నిర్ధారిత కాలవ్యవధికి గాను ప్రీమియం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది, మరియు పాలసీ యొక్క మెచ్యూరిటీ సమయములో, మీరు గ్యారంటీతో కూడిన భరోసా మొత్తము అదే విధంగా బీమాదారుచే ప్రకటించబడిన ఏవేని వర్తించే బోనసులను ఏకమొత్తంగా అందుకుంటారు.
ఎండోమెంట్ బీమా ప్లాన్ యొక్క రకంపై ఆధారపడి, మీరు మీ ప్రీమియములను పరిమిత కాలవ్యవధి కొరకు చెల్లించవచ్చు, దాని తర్వాత మీ సాంప్రదాయక కవర్ కొనసాగుతుంది, మరియు ఒకేసారి ఏకమొత్తానికి బదులుగా గ్యారంటీ ఇవ్వబడిన నెలసరి ఆదాయం మీకు విడుదల చేయబడుతుంది.
మీకు క్రమం తప్పని అంతరాలలో వచ్చే డబ్బును పొదుపు చేసుకోవడం మీ లక్ష్యం ఐతే, మీరు స్వల్పకాలిక ఖర్చులను నిర్వహించుకోగలిగితే, ఒక మనీ-బ్యాక్ పాలసీ మీకు మంచి ఎంపిక అవుతుంది.ఒకవేళ మీరు డబ్బు పొదుపు చేయడం, అది పెరిగేలా చూడడం మరియు దీర్ఘ కాలములో ఒక గణనీయమైన మొత్తాన్ని అందుకోవడంపై దృష్టి సారిస్తే, ఒక ఎండోమెంట్ పాలసీ మీకు అత్యుత్తమంగా ఉంటుంది.
ఎండోమెంట్ పాలసీ వర్సెస్ యులిప్స్
యులిప్ లేదా యూనిట్-అనుసంధానిత బీమా పాలసీలు అనేవి బీమా-కమ్- పెట్టుబడి ప్లానులు, అవి నిధుల యొక్క పనితీరు మరియు వాటి మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటాయి.ఎండోమెంట్ ప్లానులు ప్రాథమికంగా అనుసంధానం చేయబడని బీమా- అదేవిధంగా - పొదుపు పాలసీలు అయి ఉంటాయి.
ఒక యులిప్ అనేది ముఖ్యంగా మీ డబ్బును 5 సంవత్సరాల పాటు లేదా అంతకు మించి లాక్ చేస్తుంది.మీ పాలసీలో కొనుగోళు చేయబడిన యూనిట్ల యొక్క విలువ, నిధుల యొక్క మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉన్నందువల్ల, మీకు సాంప్రదాయక అనుసంధానితం-కాని ప్లానుల కంటే అధిక రిస్క్- సుముఖత ఉండాల్సిన అవసరం ఉంటుంది.
ఒక ఎండోమెంట్ ప్లాన్ మీ డబ్బుకు 2-3 సంవత్సరాల పాటు తాళం వేస్తుంది, తద్వారా మీ పాలసీ, చెల్లించబడే విలువకు చేరుకుంటుంది.పాలసీ యొక్క మెచ్యూరిటీ సమయములో, లేదా జీవితబీమా పొందిన వ్యక్తి యొక్క మరణం సంభవించిన పక్షములో, ఒక ఎండోమెంట్ ప్లాన్ వరుసగా, జీవించియున్న పాలసీదారుకు లేదా లబ్దిదారుకు మొత్తం భరోసా ఇవ్వబడిన మొత్తాన్ని మరియు ప్రకటించబడిన ఏవేని బోనస్ లను ఒక ఏకమొత్తంగా అందిస్తుంది.ఒక ఎండోమెంట్ ప్లాన్ జీరో-రిస్క్ మరియు గ్యారంటీ రాబడులను కలిగి ఉంటుంది.
ఎండోమెంట్ బీమా పాలసీ వర్సెస్ అవధి ప్లానులు
అవధి బీమా ప్లానులు అనేవి ఎటువంటి ఫ్రిల్స్-లేని సాంప్రదాయక వర్తింపును అందించే శుద్ధమైన రక్షణ బీమా సాధనాలు.ఒక ఎండోమెంట్ ప్లాన్ మీ జీవితాన్ని కవర్ చేయడం మరియు భవిష్యత్తు కొరకు పొదుపు చేసుకునేందుకు మీకు సహాయపడడం అనే రెండు ఉద్దేశ్యాలను నెరవేరుస్తుంది.
శుద్ధమైన లైఫ్ కవర్ అని కూడా పిలువబడే అవధి బీమా ప్లానులు ఒక నిర్దిష్ట కాలవ్యవధి పాటు మీ జీవితాన్ని కవర్ చేస్తాయి, ఆ సమయములో మీరు మీ ప్రీమియం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.ఈ రకం బీమా ప్లాను కేవలం మరణ ప్రయోజనం మాత్రమే అందిస్తూ ఉండడం వల్ల, చెల్లించాల్సియున్న ప్రీమియములు సాధారణంగా తక్కువ ఖరీదైనవిగా మరియు ఇతర బీమా పాలసీల కంటే చౌకగా ఉంటాయి.ఒకవేళ మీరు మీ పాలసీ అవధి యొక్క కాలమంతటా జీవించియున్న పక్షములో, భరోసా సొమ్ము యొక్క ఏ చెల్లింపు గానీ దాని శాతము గానీ మీకు చెల్లించబడదు.
ఒక ఎండోమెంట్ పాలసీ, ప్లాన్ అవధిలో మీ జీవితాన్ని కవర్ చేస్తుంది.ఒకవేళ మీ అకాల మరణము సంభవించిన పక్షములో, బీమాదారు భరోసా మొత్తమును మరియు ప్రకటించబడిన ఏవేని బోనసులను నామినీలకు చెల్లిస్తారు.అయినప్పటికీ, మీరు ఈ పాలసీలో కవర్ చేయబడిన కాలవ్యవధి తర్వాత జీవించి ఉంటే, మీరు మెచ్యూరిటీ ప్రయోజనానికి అర్హత కలిగి ఉంటారు, అందులో భరోసా ఇవ్వబడిన మొత్తము మరియు ఏవైనా ఉంటే కూడగట్టిన బోనసులు ఉంటాయి.
ఎండోమెంట్ బీమా ప్లాను వర్సెస్ ఫిక్సెడ్ డిపాజిట్లు
ఒక ఫిక్సెడ్ డిపాజిట్ వంటి సాంప్రదాయక నిలకడ పొదుపు ప్లానులకు వెళ్ళడం కంటే ఒక గ్యారంటీడ్ ఎండోమెంట్ బీమా ప్లానును ఎంచుకోవడం అనేది ఒక మంచి ఆలోచన.
ఒక ఫిక్సెడ్ డిపాజిట్ తో, మీరు ఎంతకాలం డబ్బును అందులో ఉంచుతారో దాని ఆధారంగా మీరు నిర్దిష్ట వడ్డీ మొత్తాన్ని సంపాదిస్తారు. మీరు అందుకునే మెచ్యూరిటీ విలువను ముందుగానే పేర్కొన్నప్పటికీ, ఫిక్సెడ్ డిపాజిట్లు మీకు ఎటువంటి జీవిత వర్తింపును అందించవు మరియు మీరు అందుకునే లాభాలు పన్ను శ్లాబ్స్ ప్రకారము పన్ను విధింపుకు లోబడి ఉంటాయి.
ఒక గ్యారంటీడ్ ఎండోమెంట్ బీమా పాలసీతో, మీరు అప్పటికప్పుడే గ్యారంటీ ఇవ్వబడే భరోసా ఆదాయాన్ని, చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాల్ని మరియు పన్ను రహిత మెచ్యూరిటీ/మరణ ప్రయోజనాలను (ప్రస్తుతమున్న పన్ను చట్టాల మేరకు) పొందుతారు.
గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ఎండోమెంట్ ప్లాన్ మీకు పని చేస్తుందా?
మీరు ఒక సాంప్రదాయక బీమా పొదుపు ప్లానును కొనేటప్పుడు, మీ లక్ష్యం సాంప్రదాయక వర్తింపును మరియు కొన్ని పొదుపు అవకాశాలను పొందడం అయి ఉంటుంది.ఎండోమెంట్ ప్లానులు మీరు కాలానుగత చెల్లింపులు చేసే వీలు కల్పిస్తాయి మరియు చక్రవడ్డీ యొక్క శక్తితో మీ డబ్బు పెరగడం మీరు గమనిస్తారు, అంతేకాక దురదృష్టకర పరిస్థితులు సంభవించిన పక్షములో మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తు కూడా పరిరక్షించబడుతుంది.
ఒక ఎండోమెంట్ ప్లాన్ అనేది ప్రముఖమైన సాంప్రదాయక పొదుపు బీమా సాధనము, ఎందుకంటే పాలసీ అవధి ముగింపులో మీకు ఏమి వస్తుందో మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది.గ్యారంటీ ఇవ్వబడిన మీ రాబడులను అందుకునే విషయానికి వస్తే, మీరు ఎంచుకోగల చెల్లించబడే ఆప్షన్లు రెండు ఉన్నాయి. మీరు గణనీయమైన భరోసా సొమ్మును ఒక ఏకమొత్తం చెల్లింపు రూపంగా అందుకోవాలని ఎంపిక చేసుకోవచ్చు లేదా మీకు ఒక నిర్ధారిత కాలవ్యవధి పాటు భరోసాతో కూడిన నెలసరి చెల్లింపులను అందించే ఒక అస్థిర నమూనాను ఎంచుకోవచ్చు.
అలా కాకుండా పాలసీ అవధి యొక్క ముగింపులో మీకు చెల్లించబడే ఒక ఏకమొత్తం సొమ్ము (ప్లస్ బోనసులు, ఏవైనా ఉంటే) ను మీరు కావాలనుకుంటున్నారా? పెద్ద ఖర్చుల కొరకు చెల్లించడానికి ఈ ఆపత్కాల నిధిని ఉపయోగించుకోవచ్చు లేదా మీ రిటైర్‌మెంట్ కొరకు ప్లాన్ చేసుకోవచ్చు.
లేదా, ఒక రెండవ జీతం లాగా గ్యారంటీతో కూడిన నెలసరి ఆదాయాన్ని అందుకోవడం అనే ఆలోచన మీకు మరింత భద్రతనిస్తుందా?ఒక గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ఎండోమెంట్ ప్లాన్ అనేది అదనపు వెన్నుదన్నుగా పనిచేసేదిగా రూపొందించబడింది, తద్వారా మీరు క్రమం తప్పని నెలవారీ ఆదాయంతో మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేఱ్చుకోవచ్చు.
మీరు గనక జీవిత వర్తింపు, పాలసీ షరతులలో అనుకూలత, మరియు భరోసా గల నెలవారీ ఆదాయం కోసం ఎదురుచూస్తున్నట్లయితే, ఒక గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ఎండోమెంట్ ప్లాన్ మీకోసం అత్యుత్తమంగా పనిచేస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ ఎలా పని చేస్తుంది?
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ అనేది, మీ ప్రీమియం చెల్లింపు అవధి మరియు విరామ సంవత్సరం (ఒకవేళ ఎంచుకుంటే) పూర్తయిన తదనంతరం నెలవారీ హామీతో కూడిన చెల్లింపులను అందించే ఒక అనుసంధానితం కాని, పాల్గొనే, పరిమిత ప్రీమియం, ఎండోమెంట్ జీవిత బీమా ప్లాన్.మీ కోసం ఇది ఏ అర్థాన్ని తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం:
‘అనుసంధానం-చేయబడని' (నాన్-లింక్డ్) అంటే ఏమిటి?
అనుసంధానం-చేయబడని' (నాన్-లింక్డ్) ప్లాన్ అనేది యూనిట్లు లేదా నిధుల యొక్క మార్కెట్ విలువపై ఆధారపడి ఉండదు.స్టాక్ మార్కెట్ యొక్క ఒడిదుడుకులు మీ పాలసీ యొక్క విలువపై ఎటువంటి భరింపునూ కలిగి ఉండవు కాబట్టి, మీకు గ్యారంటీతో కూడిన ప్రయోజనాలను అందించడం సాధ్యమవుతుంది.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ తో, మీరు మీ ప్రీమియం చెల్లింపు అవధిని ఎంచుకోవచ్చు, పరిమితమైన ప్రీమియములు చెల్లించవచ్చు, మరి ఆ తర్వాత, పాలసీ యొక్క మిగిలిన కాలవ్యవధి కొరకు లైఫ్ కవర్ మరియు భరోసాతో కూడిన నెలవారీ ఆదాయం ఆనందించవచ్చు.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ వంటి అనుసంధానితం కాని పాలసీలు రిస్క్-విముఖత గల వారికి ప్రాధాన్యత ఇవ్వబడే ఐచ్ఛికాలు.
‘పాల్గొనే’ (పార్టిసిపేటింగ్) అనే పదం యొక్క అర్థం ఏమిటి?
ఎండోమెంట్ పాలసీలు లాభముతో పాల్గొనేవి (పార్టిసిపేటింగ్) లేదా లాభాపేక్ష రహితంగా పాల్గొననివీ (నాన్-పార్టిసిపేటింగ్) అయి ఉంటాయి.మీరు ఎంచుకున్న ప్లాను నుండి మీరు సంపాదించుకోవాలనుకునే బోనసులపై ఇది ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంటుంది.ఒక నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్ ఎటువంటి బోనసులనూ కలిగి ఉండదు, ఎందుకంటే బీమాదారు చేసుకున్న లాభాలను తన పాలసీదారులతో పంచుకోరు.
పార్టిసిపేటింగ్ ప్లానులలో, బీమాదారు, పెట్టుబడుల నుండి ఉత్పన్నమైన ఏవేని లాభాలను తన పాలసీదారులతో పంచుకుంటారు.ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ వంటి ఒక పార్టిసిపేటింగ్ ప్లాన్ భరోసాతో కూడిన నెలసరి ఆదాయము అదేవిధంగా సులువైన రివర్షనరీ మరియు టెర్మినల్ బోనస్ (ప్రకటించబడి ఉంటే) లను అందిస్తుంది.?
‘పరిమిత ప్రీమియం’ అంటే మీ దృష్టిలో అర్థము ఏమిటి?
ఒక పరిమిత ప్రీమియం పొదుపు బీమా ప్లాను, పాలసీ అంతటా మీకు పూర్తి సాంప్రదాయక జీవిత వర్తింపును అందజేస్తూనే ఒక పరిమిత కాలవ్యవధికి గాను ప్రీమియములు చెల్లించుటకు మీకు వీలు కలిగిస్తుంది. ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ యొక్క విషయములో, పాలసీ అవధి అంతటా మీరు సాంప్రదాయక కవర్ ఆనందించడం మాత్రమే కాకుండా, మెచ్యూరిటీ ప్రయోజనాలను అందుకోవడానికి పాలసీ ముగింపు వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదు.మీ పరిమిత ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి అయిపోయిన తర్వాత ఒక గ్యారంటీ కలిగిన నెలసరి ఆదాయం మీకు విడుదల చేయబడుతుంది.పాలసీ యొక్క మెచ్యూరిటీలో, మీరు చివరి గ్యారంటీడ్ నెలసరి ఆదాయము మరియు ఏవైనా బోనస్ లు ప్రకటించబడి ఉంటే వాటినీ పొందుతారు.
ఇది ఎలా పని చేస్తుంది?
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ తో, మీరు 16 నుండి 27 సంవత్సరాల మధ్య ఒక పాలసీ అవధిని ఎంచుకోవచ్చు.పాలసీ అవధి పరిమిత ప్రీమియం చెల్లింపు అవధి, విరామ సంవత్సరం/లు, మరియు హామీతో కూడిన క్రమం తప్పని ఆదాయ అవధిని కూడి ఉంటుంది.
ప్రీమియం చెల్లింపు సంవత్సరాలు, మీరు భరోసా కల ఆదాయాన్ని అందుకునే సంవత్సరాల సంఖ్యకు సమానంగా ఉంటాయి. 0, 3, లేదా 5 సంవత్సరాల విరామ వ్యవధి, ప్రీమియం చెల్లింపు వ్యవధిని పూర్తి చేయడం మరియు మొదటి ఆదాయము చెల్లింపు యొక్క ప్రారంభం సంవత్సరాల మధ్యకాలముగా ఉంటుంది.విరామ వ్యవధి సందర్భంగా, అమలులో ఉన్న ఒక పాలసీ కొరకు, మరణ ప్రయోజనం కొనసాగినప్పటికీ మరియు బోనసులు కూడగట్టబడినా, హామీతో కూడిన క్రమం తప్పని ఆదాయం ఎటువంటిదీ చెల్లించబడదు.
ప్రవేశ సమయానికి మీ వయస్సు గనక 18 మరియు 35 సంవత్సరాల మధ్య ఉంటే, మీ ప్రీమియం చెల్లింపు అవధి 8-11 సంవత్సరాలు.ప్రవేశ సమయానికి 36 మరియు 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి, ప్రీమియం చెల్లింపు అవధి 9-11 సంవత్సరాలుగా ఉంటుంది మరియు ప్రవేశ సమయానికి 46 మరియు 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి, ప్రీమియం చెల్లింపు అవధి 9-10 సంవత్సరాలుగా ఉంటుంది.
గ్యారంటీతో కూడిన నెలవారీ ఆదాయం చెల్లింపులు వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 105% నుండి 125% వ్యాప్తిలో ఉంటాయి.ఈ జీవించియున్న ప్రయోజనం యొక్క చెల్లింపు, పాలసీ లోని మీ ప్రీమియం చెల్లింపు అవధి పూర్తయిన తర్వాత మొదలవుతుంది.పాలసీ యొక్క చివరి నెల లేదా మరణం యొక్క తేదీ ఏది ముందు వస్తే అంతవరకూ మీరు జీవించియున్న ప్రయోజనం అందుకుంటూ ఉంటారు.
అదనంగా, ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్, సులువైన రివర్షనరీ బోనస్ మరియు ఏదైనా ఉంటే టెర్మినల్ బోనస్ కు అర్హత కలిగి ఉంటుంది.
ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు ఏవేవి?
- మీకు ప్రతి నెలా క్రమం తప్పకుండా దానంతట అదే వచ్చే భరోసా ఆదాయం పొందుతారు - గ్యారంటీగా.
- ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ తో, మీరు చెల్లించినదానికంటే మీకు ఎక్కువగా వస్తుంది.మీరు నెలసరి చెల్లింపుల ద్వారా మద్దతును ఆనందిస్తూనే, వార్షికంగా మీ ప్రీమియముల యొక్క 105-125% మధ్య అందుకుంటూనే ఉంటారు.
- ఈ పాలసీ లోని సకాలపు భరోసా గల చెల్లింపుల సహాయముతో పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించుకోండి.
- మీ ఆదాయం మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకోండి.ప్రీమియం చెల్లింపు సంవత్సరాలు పూర్తయిన వెంటనే మీరు హామీతో కూడిన నెలసరి మొత్తమును అందుకోవాలనుకుంటారా లేదా మీరు కొన్ని సంవత్సరాలు వేచి చూసేందుకు ప్రాధాన్యమిస్తారా అనేది ఎంచుకోండి.
- ఆఫరుపై గల వివిధ అనుకూలతలతో, మీరు ఒక వైవిధ్యమైన ప్రీమియం చెల్లింపు, పాలసీ అవధి ఐచ్ఛికాలు, మరియు ప్రీమియం చెల్లింపు రూపాల నుండి ఎంచుకుంటారు కాబట్టి మీరు ప్లాన్ ని మీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.
- ప్రతి నెలా ఒక భరోసా మొత్తము మరియు వార్షిక బోనసులు (ఏవైనా ఉంటే) రూపములో రిస్క్-లేని రాబడులు పొందండి.
- మీ అకాల మరణము సంభవించిన పక్షములో మీ కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకోబడుతుందనే భరోసాను మీరు పొందుతారు.
- వర్తించు పన్ను చట్టాల ప్రకారము మీరు చెల్లించే ప్రీమియములు అదే విధంగా మీరు అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు పొందండి
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ అవధి యొక్క ఆఖరులో మీకు ఏమి వస్తుంది?
ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగింపు మరియు విరామ సంవత్సరం (ఒకవేళ ఎంచుకొని ఉంటే) తర్వాత, మీరు ప్రీమియములు చెల్లించిన సంవత్సరాల సంఖ్యకు సమానమైన సంవత్సరాల పాటు మీరు గ్యారంటీతో కూడిన నెలసరి ఆదాయాన్ని అందుకుంటారు.పాలసీ అవధి యొక్క ముగింపులో మీరు, మీకు గ్యారంటీ ఇవ్వబడిన నెలసరి ఆదాయము యొక్క చివరి కంతుతో పాటుగా కూడగట్టిన సులువైన రివర్షనరీ మరియు టెర్మినల్ బోనసులు ఏవైనా ఉంటే, వాటినీ అందుకుంటారు.
పాలసీ యొక్క అవధి సందర్భంగా పాలసీదారు యొక్క అకాల మరణం సంభవించిన పక్షములో, లబ్దిదారులు మరణంపై భరోసా ఇవ్వబడిన సొమ్ము మరియు ప్రకటించబడిన ఏవైనా బోనసులు లేదా చెల్లించిన మొత్తం ప్రీమియముల యొక్క 105% (పన్నులు మరియు అండర్ రైటింగ్ అదనపు ఖర్చులు, ఏవైనా ఉంటే వాటిని మినహాయించి) ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని అందుకుంటారు.
నామినీ(లు) మరణ ప్రయోజనాన్ని ఒక్క సమయపు ఏకమొత్తంగా లేదా ప్లాను యొక్క మొదట్లో ఎంచుకోబడిన విధంగా 5, 10, లేదా 15 సంవత్సరాల పాటు నెలసరి కంతులుగా అందుకునే ఐచ్ఛికం కలిగి ఉంటారు.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ కొనడానికి అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
- ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
- మెచ్యూరిటీలో కనీస వయస్సు 34 సంవత్సరాలు మరియు మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు
- ప్రీమియం చెల్లింపు అవధి 8 నుండి 11 సంవత్సరాలు ఉంటుంది.పాలసీ అవధి అనేది ప్రీమియం చెల్లింపు అవధి, విరామ సంవత్సరం మరియు హామీతో కూడిన క్రమం తప్పని ఆదాయ అవధి యొక్క మొత్తంగా ఉంటుంది.
- హామీ ఇవ్వబడే కనీస ప్రాథమిక భరోసా మొత్తము రు.75,000 లు మరియు బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ పాలసీకి లోబడి గరిష్ట పరిమితి ఏదీ లేదు.భరోసా ఇవ్వబడే ప్రాథమిక మొత్తం మీ (జీవిత బీమా చేయబడిన వ్యక్తి) వయస్సు, లింగము, వార్షిక ప్రీమియం, ప్రీమియం చెల్లింపు అవధి, లేదా పాలసీ అవధి మరియు ఎంపిక చేసుకున్న విరామ సంవత్సరం ఆధారంగా లెక్కించబడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
-
ఒక ఎండోమెంట్ పాలసీ అంటే ఏమిటి?
తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?
ఒక ఎండోమెంట్ ప్లాన్ అనేది, జీవిత వర్తింపు, జీవించియున్న/మెచ్యూరిటీ ప్రయోజనాలు, పాలసీదారు మరణించిన పక్షములో మరణ ప్రయోజనం, మరియు బీమాదారుచే ప్రకటించబడిన ఏవేని బోనస్ లను అందించే ఒక రకమైన సాంప్రదాయక బీమా ప్లాన్.
-
ఏది గ్యారంటీడ్ మరియు ఏది కాదు?
nullఒక గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఎండోమెంట్ ప్లాన్ లో, గ్యారంటీ ఇవ్వబడిన పాలసీ అవధి అనంతరం ఇంకా మీరు జీవించి ఉంటే, మీరు అందుకునే భరోసా ఇవ్వబడిన మొత్తం/ నెలసరి ఆదాయము మీకు అందుతూ ఉంటుంది. పాలసీదారు యొక్క మరణం సంభవించిన పక్షములో, ఏకమొత్తం సొమ్ము లబ్దిదారులకు గ్యారంటీ ఇవ్వబడుతుంది.
బోనస్ లు ప్రకటించబడవచ్చు లేదా ప్రకటించబడకపోవచ్చు.ఒకవేళ అవి ఉంటే, అప్పుడు మీ పాలసీ అమలులో ఉండే మొత్తం సంవత్సరాల సంఖ్య మీ బోనస్ మొత్తమును లెక్క కట్టడానికి తీసుకోబడుతుంది.ఆ విధంగా, బోనసులు పాలసీ యొక్క గ్యారంటీ ఇవ్వబడిన భాగం కాదు.
-
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ లో లభించే బోనస్ లు ఏవేవి?
nullఈ ప్లానులో రెండు రకాల బోనసులు అందుబాటులో ఉన్నాయి—సింపుల్ రివర్షనరీ బోనస్ (ఎస్ఆర్బి) మరియు టెర్మినల్ బోనస్ (టిబి) ఒకవేళ ఏవైనా ఉంటే.
-
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ కొరకు ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు ఏవేవి?
nullఈ పాలసీలో, జీవిత బీమా చేయబడిన వ్యక్తి నెలవారీ, మూడు నెలల వారీ, అర్ధ సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ ప్రీమియం చెల్లింపులు చేసే ఐచ్ఛికం ఉంటుంది.
-
ఈ పాలసీలో చెల్లించదగిన కనీస/గరిష్ట ప్రీమియం ఎంత ఉంటుంది?
nullగరిష్ట ప్రీమియం పరిమితి అంటూ ఏదీ లేదు కానీ, కనీస ప్రీమియం మొత్తాలు (ఏవైనా ఉంటే అదనపు ప్రీమియములు కాకుండా, మరియు వర్తించు పన్నులు మినహాయించుకొని) ఇలా ఉంటాయి. రు.2,088 నెలవారీగా, రు.6,216 మూడు నెలలకు, రు.12,286 అర్ధ సంవత్సరానికి, రు.24,000 సంవత్సరానికి.
-
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ తో మీరు పొందే అదనపు ప్రయోజనాలు ఏవేవి?
nullఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ లో మీరు అధిక ప్రీమియమును పెట్టుబడి చేయడానికి ఎంచుకోవచ్చు.ఒకవేళ మీరు అలా చేస్తే, పెంపొందిత భరోసా సొమ్మును అందుకోవడానికి మీరు అర్హత కలిగి ఉంటారు, పెంపొందిత భరోసా మొత్తముపై సంవత్సరం వారీగా ప్రకటించబడిన బోనస్ వర్తిస్తుంది కాబట్టి అది మీరు అధికమొత్తం బోనస్ పొందడానికి సహాయపడుతుంది.
-
ఈ పాలసీపై నేను ఒక లోన్ పొందగలనా?
nullఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ లో ప్రాథమిక భరోసా మొత్తము అనేది ఒక నోషనల్ భరోసా మొత్తము, అది బోనస్ మొత్తాలను లెక్కించడానికి ఉపయోగించబడుతుంది మరియు మెచ్యూరిటీలో చెల్లించబడదు.ఇంతవరకూ, ఈ పాలసీపై ఒక లోన్ తీసుకునే ఐచ్ఛికం వంటిది ఏదీ లేదు.
-
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ లో నేను పన్ను ప్రయోజనాలు పొందగలుగుతానా?
nullఔను, చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు.
-
తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?
ఈ పాలసీ, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని కలిగి ఉంటుంది.
-
నేను ఈ పాలసీని సరెండర్ చేయవచ్చునా?
nullఅవును.మీ పాలసీని సరెండర్ చేయడాన్ని సిఫార్సు చేయనందువల్ల, రెండు సంవత్సరాల పూర్తి ప్రీమియములను చెల్లించిన తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్న పక్షములో దానిని సరెండర్ చేయాలని మీరు ఎంచుకోవచ్చు.
ఉత్పత్తుల బ్రోచర్