ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్

సహీ బచత్ జహాన్, సఫల్ జీవన్ వహాన్

GET A QUOTE

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ అనేది, మీరు మీ పాలసీ అవధి కంటే తక్కువ కాలవ్యవధి పాటు చెల్లించగా, జీవిత బీమా కవరేజీ ద్వారా, హామీతో కూడిన ప్రయోజనాలతో పాటుగా, మీ ప్రియమైన వారి కోసం దీర్ఘకాలిక భద్రతా వలయం ఉండేలా చూసుకోవడానికి రూపొందించబడిన అనుసంధానితం కాని, నాన్ - పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత, పరిమిత ప్రీమియం, పొదుపు పాలసీ.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ కొనడానికి కారణాలు

  • 12 లేదా 15 సంవత్సరాల వరకూ జీవిత బీమా కవరేజీ ద్వారా మీ ప్రియమైనవారి రక్షణ కొరకు ఒక దీర్ఘ-కాలిక సంరక్షణను ఏర్పాటు చేసుకోండి.

  • మొత్తం ఒక పాలసీ అవధి అంతటా మీ పాలసీ నుండి ప్రయోజనం పొందుతూనే కేవలం 5 లేదా 7 సంవత్సరాల కాలవ్యవధి కొరకు మాత్రమే చెల్లించండి

  • వార్షికంగా హామీతో కూడిన అదనపు చెల్లింపులతో మీ పొదుపును వృద్ధి చేసుకోండి

  • ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక మరణించిన పక్షములో, మీ ప్రియమైన వారికి ఒక ఏకమొత్తపు ప్రయోజనాన్ని గానీ లేదా 5 సంవత్సరాల పాటు ఆదాయాన్ని గానీ అందించండి

  • పాలసీ యొక్క మొదటి సంవత్సరం సందర్భంగా మాత్రమే ప్రమాద కారణంగా మరణం సంభవించిన పక్షములో అదనపు భరోసా సొమ్మును పొందండి

  • మరణం మీదట, మరణించినట్లుగా తెలియజేసినప్పుడు భరోసా సొమ్ముపై 10% (హెచ్చించినది మరియు అదనపు ప్రయోజనం కాదు) లేదా రు. 25,000 (ఏది తక్కువైతే అది) ముందస్తు చెల్లింపుగా పొందండి

  • హెచ్చింపు ప్రయోజనాల కోసం ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ ని జోడించండి

  • వైద్య పరీక్షల యొక్క విసుగు లేదు - కేవలం ఆరోగ్య ప్రకటనను నిర్ధారణ చేస్తే చాలు.

అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?

  • పాలసీ అవధి మరియు మరణ ప్రయోజనంపై ఆధారపడి దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 3,6 మరియు 46 సంవత్సరాలు. మరణ ప్రయోజనంపై ఆధారపడి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 45 మరియు 50 సంవత్సరాలు.

  • ప్లాన్ యొక్క ముగింపు సమయానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు మరణ ప్రయోజనంపై ఆధారపడి గరిష్ట వయస్సు 60 మరియు 65 సంవత్సరాలు.

  • కనీస హామీ ఇవ్వబడే మొత్తం: రు. 84,000 గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తం: రు. 5,00,000.

  • కనీస ప్రీమియం సంవత్సరానికి రు. 12,000 లు. గరిష్ట ప్రీమియం రు. 50,000 లు.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్


మీ కుటుంబం యొక్క రక్షణ మరియు భద్రత కొరకు ఒక సులువైన మరియు సమర్థవంతమైన సాధనం — ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ సమర్పిస్తున్నాము. జీవితములో, అనేక అనిశ్చితులు ఉంటాయి, ఐతే అవి జరుగుతూనే ఉంటాయి. ఐతే, ఒక తెలివైన సరల్ బచత్ బీమా ప్లాన్ తో, మీరు జీవిత వర్తింపు యొక్క మనశ్శాంతిని, పరిమిత ప్రీమియం చెల్లింపులు, మరియు హామీతో కూడిన ప్రయోజనాలను పొందుతారు. ఒక దురదృష్టకర సంఘటన జరిగిన పక్షములో మీ కుటుంబాన్ని రక్షించడానికి రూపొందించబడిన ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్, ఆర్థిక అనిశ్చిత కాలాలలో మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది.

ఇతర సరల్ ప్లానుల లాగానే, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా యోజన అనేది అర్థం చేసుకోవడానికి సూటి అయిన ప్లాన్. మీరు త్వరితంగా ప్రాసెసింగ్, వైద్య పరీక్షలు లేకపోవడం, మరియు సులువైన నమోదు ప్రక్రియ యొక్క ప్రయోజనాలు పొందుతారు. మీరు తక్కువ కాలానికి ప్రీమియములు చెల్లిస్తూ మీ ప్రియమైన వారి కోసం దీర్ఘ కాలిక రక్షణ వలయాన్ని కల్పించండి.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ అంటే ఏమిటి?


ఒకవేళ మీరు ఇండియాలో పొదుపు బీమా ప్లాను కొరకు చూస్తున్నట్లయితే, మీకు ఇది సరియైన ఎంపిక అవుతుంది. మీరు భేషజాలు లేని ఆప్షన్లు అదేవిధంగా అన్ని విధాల మేలు మరియు లాభాల్ని అందించే సమగ్రమైన ప్లానులను ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకునే బీమా సేవా ప్రదాతపై ఆధారపడి, మీరు అనేక ఫీచర్లు, ప్రయోజనాలు, సౌకర్యాలు, మరియు మెచ్యూరిటీ చెల్లింపు ఆప్షన్లను అందుబాటు చేసుకోవచ్చు. అయినప్పటికీ, వాస్తవంగా మీ అవసరాల్ని తీర్చగల పాలసీ మీకు ఉండేలా చూసుకోవడానికి గాను, పాలసీతో వచ్చే అన్ని వివరాలు, షరతులు మరియు నిబంధనలు, మరియు చేర్పులు ఇంకా మినహాయింపులు అన్నింటినీ చూసుకోవాల్సి ఉంటుంది. అనేకమైన ఎంపికలు మరియు చిన్న అక్షరాల ముద్రణతో వచ్చే వాటితో బీమా పొందగోరే వ్యక్తులు అర్థం చేసుకోవడంలో అయోమయానికి లోనవుతుంటారు.

2021 జనవరి మొదలుకొని, భారతీయ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ) మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది మరియు సరల్ లేదా సూటియైన ప్లానుల రూపములో ప్రజలకు మద్దతును పొడిగించింది. ఈ సరల్ పాలసీలు, తమ పరోక్షములో తమ కుటుంబ సభ్యులకు వెన్నుదన్నుగా ఒక రక్షణ వలయము ఉండేలా చూసుకోవాలని కోరుకునే వారికి కచ్చితమైనవిగా ఉంటాయి.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ అనేది, అనుసంధానితం కాని, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగతమైన, పరిమిత ప్రీమియం పొదుపు గల జీవిత బీమా పాలసీ. సరల్ బచత్ యోజన క్రింద, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ మీకు జీవిత వర్తింపు మరియు ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు అవధి యొక్క ప్రయోజనాలను అందిస్తుంది. ఎటువంటి మెచ్యూరిటీ లేదా జీవించియున్న ప్రయోజనాలను ఇవ్వని ఒక ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీ లాగా కాకుండా, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ అనేది హామీతో కూడిన అదనపు చెల్లింపులను సాధ్యమైనంతగా ఆనందించడానికి మీకు వీలు కల్పించే ఒక పొదుపు బీమా ప్లానుగా ఉంటుంది.

మీరు పరిమిత సంవత్సరాల పాటుగా మాత్రమే ప్రీమియములను చెల్లించగా, పాలసీ యొక్క కాలావధి పొడవునా జీవిత వర్తింపును ఆనందించడానికి ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ మీకు వీలు కలిగిస్తుంది. ఉదాహరణకు, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా యోజన క్రింద, మీరు 5 నుండి 7 సంవత్సరాల తక్కువ కాలపు ప్రీమియం చెల్లింపు అవధి కొరకు ఎంపిక చేసుకోవచ్చు, కాగా 12 నుండి 15 సంవత్సరాల దీర్ఘావధి జీవిత వర్తింపును ఆనందించవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు ఏవేవి?


‘సరల్’ అనే పదానికి సరళమైనది మరియు నేరుగా అని అర్థం. అట్టి బీమా ప్లానులు జీవిత బీమా యొక్క ప్రయోజనాలు భారతదేశములో ప్రతి ఒక్కరికీ చేరేలా చూసుకోవడానికి రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా యోజనతో, జీవిత వర్తింపు మరియు క్రమపద్ధతిలో పొదుపు చేసుకోవడం యొక్క ప్రయోజనాలు ఉండే ఒక బీమా ఉత్పాదనను ప్రాప్యత చేసుకోగలుగుతారు.

అనుసంధానం-చేయబడని ఒక సరల్ బచత్ బీమా యోజన ప్లాన్ గా ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్, పెట్టుబడి మార్కెట్ యొక్క ఎగుడు దిగుళ్ళతో అనుసంధానం అయి ఉండదు. అంటే దీని అర్థం, మార్కెట్ పరిస్థితితో ఎటువంటి సంబంధం లేకుండా, పాలసీ యొక్క మెచ్యూరిటీ సమయములో మీరు హామీతో కూడిన భరోసా సొమ్మును అందుకుంటారు. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు ఇదిగో ఇక్కడ ఉన్నాయి:

  • పాలసీ యొక్క అవధి అంతటా కొనసాగే జీవిత బీమా వర్తింపుతో మీ కుటుంబ సభ్యుల కొరకు ఒక దీర్ఘ-కాలిక రక్షణ వలయము — మీరు 12 నుండి 15 సంవత్సరాల పాలసీ అవధిని ఎంచుకోవచ్చు
  • పాలసీ వ్యవధి అంతటా ప్రయోజనం పొందుతూనే 5 లేదా 7 సంవత్సరాల పరిమిత కాలం పాటు చెల్లించండి
  • వార్షికంగా హామీతో కూడిన చేర్పుల యొక్క హెచ్చుదలను ఆస్వాదించండి
  • గణనీయమైన మరణ ప్రయోజనంతో, జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో ఒక టోకు మొత్తముగా లేదా భాగాలలో ఆదాయముగా 5 సంవత్సరాల పాటు మీరు మీ ప్రియమైన వారికి ప్రయోజనాల్ని అందించవచ్చు
  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ యొక్క మొదటి సంవత్సరంలో ప్రమాద కారణంగా మరణం సంభవించిన పక్షములో, మీ ప్రియమైనవారు మరణంపై అదనపు భరోసా సొమ్మును పొందగలిగి ఉంటారు.
  • వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ ని ఎంచుకోవడం ద్వారా, ఒకవేళ పాలసీదారు / బీమా పొందిన వ్యక్తి గనక ఎంచుకున్న రైడర్ ఐచ్ఛికం క్రింద పేర్కొనబడినట్లుగా మరణం, ప్రమాద కారణంగా సంపూర్ణ శాశ్వత అంగ వైకల్యం లేదా క్లిష్ట అస్వస్థతను అనుభవించిన పక్షములో మీకు బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములు మాఫీ చేయబడతాయి.
  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ తో, మీరు వైద్య పరీక్షల గురించి చింతించనవసరం లేదు, ఎందుకంటే మీ నుంచి కావలసిందల్లా ఒక ఆరోగ్య ప్రకటన నిర్ధారణ మాత్రమే.
  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద, బీమా చేయబడిన వ్యక్తి యొక్క మరణము గురించిన సమాచారం ఇచ్చిన మీదట ముందస్తు సహాయంగా మరణముపై మీ నామినీలు బీమా చేయబడిన మొత్తంపై 10% ను అంత్యక్రియల వర్తింపుగా (హెచ్చించినది మరియు అదనపు ప్రయోజనం కాదు) లేదా రు. 25,000 (ఏది తక్కువైతే అది) పొందుతారు.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?


ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ ను సులువైనది మరియు సూటియైనదిగా ఉంచడానికి గాను, మీరు సరల్ బచత్ యోజన ప్లాన్ కొనే ముందుగా స్పష్టంగా పేర్కొనబడిన ప్రాతిపదిక జాబితాను నెరవేర్చుకోవాల్సి ఉంటుంది.

  • 10 రెట్ల మరణ ప్రయోజనముతో ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద 12 సంవత్సరాల పాలసీ వ్యవధి కొరకు ప్రవేశానికి కనీస వయస్సు 6 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల పాలసీ వ్యవధి కొరకు ప్రవేశానికి కనీస వయస్సు 3 సంవత్సరాలు.
  • 7 రెట్ల మరణ ప్రయోజనముతో ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద, 12 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధి కొరకు ప్రవేశానికి కనీస వయస్సు 46 సంవత్సరాలు.
  • 10 రెట్ల మరణ ప్రయోజనముతో ఈ సరల్ బచత్ యోజన కొరకు గరిష్ట ప్రవేశ వయస్సు 45 సంవత్సరాలు, మరియు 7 రెట్ల మరణ ప్రయోజనముతో 50 సంవత్సరాలు.
  • మెచ్యూరిటీ వద్ద కనీస వయస్సు 18 సంవత్సరాలు, కాగా మెచ్యూరిటీ వద్ద గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు (మరణ ప్రయోజనానికి 10 రెట్లు) ఉండాలి లేదా 65 సంవత్సరాలు (మరణ ప్రయోజనానికి 7 రెట్లు) ఉండాలి.
  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద, మరణంపై కనీస భరోసా సొమ్ము రు. 84,000,000 గా నిర్ధారించబడింది, కాగా గరిష్ట భరోసా సొమ్ము రు. 5,00,000 గా ఉంటుంది.
  • మీ ప్రీమియం చెల్లింపు అంతరముపై ఆధారపడి, సంవత్సరానికి చెల్లించవలసిన కనీస ప్రీమియం రు. 12,000 గానూ, అర్ధ సంవత్సరానికి రు.6,000 గానూ మూడు నెలలకు రు. 3,000 లేదా నెలకు రు.1,000 గానూ ఉంటుంది.
  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద చెల్లించబడే గరిష్ట ప్రీమియం రు. 50,000 గా ఉంటుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ యొక్క ప్రయోజనాలు ఏవేవి?


ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ అనేది ఒక సూటియైన ప్లాను, అది పాలసీదారుకు మరియు వారికి ప్రీతిపాత్రమైన వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సరల్ బచత్ బీమా ప్లాన్ కొన్న తర్వాత మీరు పొందగల ప్రయోజనాలపై ఒక త్వరిత వీక్షణ ఇదిగో ఇక్కడ ఉంది:

మీ ప్రియమైన వారి కొరకు ఆర్థిక భద్రత

మీరు చిన్న వ్యాపారం నడుపుతున్నా లేదా ఇంటివద్దనే పనిచేస్తున్నా, మీ జీవితం మీ కుటుంబ సభ్యులు మరియు మీకు ప్రియమైన వారికి విలువైనదిగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఒడిదుడుకుల కాలములో, ఏది జరిగినా సరే, మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రత వాస్తవమైనదిగా ఉండేలా చూసుకోవడం మీ లక్ష్యముగా ఉండాలి. పెరుగుతున్న ఆర్థిక బాధ్యతలు మరియు అపసవ్యమైన ఆదాయముతో, మీ కుటుంబ భవిష్యత్తు యొక్క సుస్థిరమైన రక్షణకు ప్లాన్ చేసుకోవడం ఆవశ్యకం. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ తో, మీరు తక్కువ వ్యవధి పాటు చెల్లిస్తారు మరియు దీర్ఘ-కాలిక ప్రయోజనాలను ఆనందిస్తారు మరియు మొత్తం పాలసీ వ్యవధికి గాను మీ కుటుంబం యొక్క భవిష్యత్తు కొరకు నిరంతరాయ రక్షణ ఉంటుంది.

అనుకూలమైన మరణ ప్రయోజనం

పాలసీ అమలులో ఉన్నంత కాలమూ, లేదా జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించు సమయం నాటికి అది పూర్తిగా చెల్లించబడి ఉన్నంత వరకూ, పేర్కొనబడిన మరణ ప్రయోజనం పాలసీదారు యొక్క నామినీలకు చెల్లించబడుతుంది. దాని ఫలితంగా, మీ కుటుంబం మరణంపై భరోసా ఇవ్వబడిన సొమ్ము (ఎస్.ఎ.డి) యొక్క అత్యధిక మొత్తము ప్లస్ కూడగట్టుకున్న హామీ చేర్పులు (మరణం తేదీ వరకూ ఏవైనా ఉంటే) లేదా మరణం వరకూ చెల్లించబడిన మొత్తం ప్రీమియముల 105% మొత్తాన్ని అందుకుంటుంది. పాలసీ యొక్క అవధి సందర్భంగా జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణం సంభవించిన సంఘటనలో, మీ నామినీకి చెల్లించబడే మరణ ప్రయోజనం ఒక ఏకమొత్తం రూపములోనైనా ఉండవచ్చు లేదా తదుపరి 5 సంవత్సరాల పాటు నెలసరి ఆదాయముగానైనా ఉండవచ్చు.

అంత్యక్రియల కవర్

మరణముపై భరోసా సొమ్ములో 10% లేదా రు. 25,000 (ఏది తక్కువైతే అది) హెచ్చుగా చెల్లించబడుతుంది, అదనము కాదు మరియు బీమా పొందబడిన వ్యక్తి యొక్క మరణాన్ని తెలియజేయగానే ముందస్తుగా చెల్లించబడుతుంది.

మెచ్యూరిటీ ప్రయోజనాలు

పాలసీ అవధి యొక్క ముగింపు వరకూ మీరు జీవించి ఉంటే, మరియు పాలసీ అమలులో ఉండి మరియు పూర్తిగా చెల్లించబడి ఉంటే, పాలసీ అవధి యొక్క ముగింపులో మెచ్యూరిటీ ప్రయోజనముగా మెచ్యూరిటీపై భరోసా సొమ్ము (ఎస్.ఎ.ఎం) ప్లస్ కూడగట్టుకున్న హామీతో కూడిన చేర్పులు అందజేయబడతాయి. దాని తర్వాత, మెచ్యూరిటీ ప్రయోజనము యొక్క చెల్లింపుతో పాలసీ రద్దు అవుతుంది మరియు ఆ తర్వాత ఇక ఏ ప్రయోజనాలూ చెల్లించబడవు. మెచ్యూరిటీపై భరోసా సొమ్ము (ఎస్.ఎ.ఎం) పాలసీ యొక్క మెచ్యూరిటీ మీద చెల్లించదగిన హామీతో కూడిన మొత్తముగా పేర్కొనబడుతుంది.

రైడర్ ప్రయోజనాలు

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద ఇండియాఫస్ట్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడరు కొరకు ఎంచుకున్నారనుకోండి. ఆ పరిస్థితిలో, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగిన పక్షములో మీ కుటుంబం నిరంతర మద్దతును అందుకుంటుంది, ఎందుకంటే పాలసీదారు/ బీమా చేయబడిన వ్యక్తికి మరణము, ప్రమాదకారణంగా సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము లేదా క్లిష్టమైన అస్వస్థత సంభవించిన పక్షములో భవిష్యత్ ప్రీమియం చెల్లింపులు ఏవైనా ఉంటే అవి మాఫీ చేయబడతాయి.

లోన్ ప్రయోజనాలు

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన పక్షములో మీరు పొందగలిగినట్టి ఒక లోన్ సౌకర్యం ఉంది.

పన్ను ప్రయోజనాలు

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా యోజనతో, చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు మరియు ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము అందుకోదగిన ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు.

 

ఉత్పత్తుల బ్రోచర్

DOWNLOAD BROCHURE FILE

FAQs

  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ ను నేను ఎందుకు కొనాలి?

    ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ అనేది ఒక సరళమైన మరియు సూటి అయిన పొదుపు బీమా ప్లానుగా ఉంది. మీ అకాల మరణం సంభవించిన పక్షములో, మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను పరిరక్షించడానికి ఈ సరల్ ప్లాన్ రూపొందించబడింది. మెచ్యూరిటీ లేదా సర్వైవల్ మీదట, ఈ సరల్ బచత్ బీమా ప్లాన్ మీకు హామీతో కూడిన పొదుపును అందిస్తుంది, మీరు మీ ప్రియమైన వారి కొరకు భవిష్యత్తును రూపొందించుకోవడానికి అది సహాయపడుతుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద నేను ఎంత మొత్తం లోన్ పొందగలుగుతాను?

    కష్ట సమయాలలో మీకు అండగా ఉండి సహాయపడేందుకు గాను అత్యవసర పరిస్థితి సందర్భంగా డబ్బు రాబడిని కలిగియుండడం ఆవశ్యకం. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ తో, మీకు మీరుగా మద్దతు కల్పించుకోవడానికి మీరు ఒక లోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము ఆ సమయములోని సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న సరెండర్ విలువ మొత్తం ఏదైనా ఉంటే, దానిలో 70% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు. పొందగలిగినట్టి కనీస లోన్ మొత్తము రు.1000 గా ఉంటుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ రిన్యూవల్ ప్రీమియములను నేను ముందస్తుగా చెల్లించినట్లయితే వాటిపై నేను ఒక డిస్కౌంట్ పొందగలుగుతానా?

    ఔను, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్ క్రింద, ప్రీమియం గడువు తేదీకి కనీసం ఒకటి నుండి 12 నెలల ముందస్తుగా రిన్యూవల్ ప్రీమియములను మీరు చెల్లించినట్లయితే రిన్యూవల్ ప్రీమియములపై మీరు ఒక డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ వ్యవధి ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ యోజన యొక్క ప్రీమియం గడువు తేదీ ఉన్న అదే ఆర్థిక సంవత్సరం లోపున పడినట్లయితే ఇది ఇవ్వబడుతుంది.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY