
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ అనేది, లిక్విడిటీ మరియు జీవిత వర్తింపుతో క్రమశిక్షణ కలిగిన పొదుపు యొక్క కచ్చితమైన మిశ్రమం, తద్వారా అది మీకు మరియు మీ కుటుంబానికి అత్యుత్తమాన్ని అందిస్తుంది.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్
మీకున్న సమయమునకు సరిపోయే ఐచ్ఛికాలతో తక్కువ వ్యవధికి చెల్లించండి మరియు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోండి
మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, జీవిత వర్తింపు ప్రయోజనాన్ని ఆనందించడం కొనసాగించండి (మీరు రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములు చెల్లించి ఉంటే వర్తిస్తుంది)
ఒక వార్షిక బోనస్ (ఏదైనా ఉంటే) సంపాదనల యొక్క హెచ్చు భాగాన్ని ఆనందించండి
జీవించియున్న ప్రయోజనముగా మీ ఒక్క వార్షిక ప్రీమియము యొక్క 103% ను తిరిగి పొందండి
అవధి ఆఖరున, మీరు మెచ్యూరిటీ వద్ద హామీ ఇవ్వబడిన మొత్తము ప్లస్ కూడగట్టిన బోనస్ లు (ఏవైనా ఉంటే) పొందుతారు
ని ఎంచుకోండి ప్రీమియం రైడర్ యొక్క మాఫీ మీ ప్రాథమిక ప్లాన్ ప్రయోజనాలు పెంపొందించుకోవడానికి
ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు
Click here to view the sample premium rates
ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?
దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 3 సంవత్సరాలు (15 సంవత్సరాల పాలసీ అవధి) మరియు 8 సంవత్సరాలు (10 సంవత్సరాల పాలసీ అవధి) మరియు దరఖాస్తు చేయడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
10 లేదా 15 సంవత్సరాల పాలసీ అవధికి ప్లాన్ కొనండి
10 సంవత్సరాల పాలసీకి 5 సంవత్సరాలు ప్రీమియములు చెల్లించండి లేదా 15 సంవత్సరాల పాలసీకి 5/6/7/8 సంవత్సరాలు చెల్లించండి
హామీ ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము రు.1,50,000 లు మరియు గరిష్ట హామీ ఇవ్వబడే మొత్తముపై పరిమితి లేదు
కనీస ప్రీమియం రు.18,000 సంవత్సరానికి, రు.9,215 అర్ధ సంవత్సరానికి, రు.4,662 మూడు నెలలకు మరియు రు.1,566 నెలసరి అంతరముపై; గరిష్ట ప్రీమియముపై పరిమితి ఉండదు
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ ఎలా పని చేస్తుంది?
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ అనేది ఒక మనీ బ్యాక్ ప్లాన్, మీరు మీ డబ్బును కాలానుగతమైన అంతరాలలో తిరిగి పొందేలా అది చూసుకుంటుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధిలోనే డబ్బును తిరిగి పొందడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాల నెరవేర్పును సులభతరం చేయడానికి ఈ ప్లాను రూపొందించబడింది. పాలసీ అవధి యొక్క ఆఖరులో, మెచ్యూరిటీ ప్రయోజనాలు ఒక ఏకమొత్తంగా చెల్లించబడతాయి. ఈ మొత్తములో మిగిలియున్న భరోసా మొత్తము మరియు అవధి సందర్భంగా కూడగట్టిన ఏవేని బోనసులు ఉంటాయి.
పాలసీ అమలులో ఉండగానే ఒకవేళ పాలసీదారు యొక్క మరణం సంభవించిన పక్షములో, పాలసీ కాలవ్యవధిలో చెల్లించిన చెల్లింపులతో సంబంధం లేకుండా లబ్దిదారులు పూర్తి భరోసా మొత్తమును అందుకుంటారు. మనీ బ్యాక్ పాలసీలు లాభముతో పాల్గొనేవి (పార్టిసిపేటింగ్) లేదా లాభాపేక్ష రహితంగా పాల్గొననివీ (నాన్-పార్టిసిపేటింగ్) అయి ఉండవచ్చు. ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వంటి ఒక పార్టిసిపేటింగ్ ప్లానులో, బీమాదారు పాలసీ అవధి కాలములో చేసుకున్న లాభాలను పాలసీదారుతో కూడగట్టిన బోనసుల (ఏవైనా ఉంటే) రూపములో పంచుకుంటారు.
మీ కవరేజీని పొడిగించుకోవడానికి గాను మీరు మీ పాలసీకి రైడర్లను జోడించాలని కూడా ఎంచుకోవచ్చు. అతిముఖ్యంగా, పాలసీ అవధి అంతటా క్రమం తప్పని వ్యవధి అంతరాలలో భరోసా మొత్తం యొక్క కొంత శాతము జీవించియున్న ప్రయోజనం రూపములో చెల్లించబడుతుంది. పాలసీ నిబంధనలపై ఆధారపడి, జీవించియున్న ప్రయోజనాలుగా వాస్తవంగా చెల్లించబడిన శాతము మరియు వ్యవధి అంతరము వ్యత్యాసంగా ఉంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, జీవించియున్న ప్రయోజనముగా మీరు వార్షికం చేయబడిన ఒక ప్రీమియం యొక్క 103% అందుకుంటారు.
ఇండియాలో ఇతర సాంప్రదాయక బీమా ప్లానుల నుండి ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ ఎలా భిన్నమైనది?
కుటుంబములో ప్రధాన సంపాదనాపరుడి అకాల మరణం సంభవించడం వంటి అతి కఠినమైన పరిస్థితుల్లో కుటుంబానికి ఒక రక్షణ వలయాన్ని నిర్మించే ఒక మార్గముగా బీమా అనేది ఎంతో కాలంగా చూడబడుతోంది. బీమా పొదుపు ప్లానులు కొనడం అనేది, ముప్పుకు తక్కువ గురి అయ్యే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, సాంప్రదాయక జీవిత వర్తింపుతో వచ్చే మనశ్శాంతితో మీ డబ్బును పొదుపు చేసి మరియు మదుపు చేయడానికి ఒక మంచి మార్గాన్ని చూపుతుంది. ఇండియాలోని అనేకమైన మదుపులు మరియు పొదుపుల ప్లానులతో, సరియైన సమాచారాన్ని పొందడం తద్వారా మీరు మీ కోసం మరియు మీ కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఒక అత్యుత్తమ ఎంపికను చేసుకోవడం మీకు ముఖ్యం అవుతుంది.
కొన్ని ప్రముఖమైన బీమా పొదుపు ప్లానులలో మనీ బ్యాక్ పాలసీలు, అవధి బీమా, ఎండోమెంట్ పాలసీలు, సంపూర్ణ జీవిత పొదుపు ప్లానులు, మరియు యులిప్స్ చేరి ఉన్నాయి. ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వాటిపై ఎలా పోలిక చేస్తుందో ఇదిగో ఇక్కడ:
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వర్సెస్ సాంప్రదాయక జీవిత బీమా అవధి ప్లాన్
ఒక అవధి బీమా పాలసీని కూడా ఒక సంపూర్ణ రక్షణ బీమా ప్లాను అని అంటారు.అటువంటి ప్లానులో, మీరు ఒక నిర్ధారిత పాలసీ అవధి కొరకు, సాంప్రదాయక వర్తింపుకు రాబడిగా బీమాదారుకు నెలవారీ/మూడు నెలలవారీ/ అర్ధ సంవత్సరం వారీ/ సంవత్సరం వారీ ప్రాతిపదికన ఒక నిర్ధారిత మరియు స్థోమతకు తగిన ప్రీమియమును చెల్లిస్తారు. పాలసీదారు యొక్క దురదృష్టకర మరణం సంభవించిన పక్షములో, ఒక అవధి బీమా పాలసీ, లబ్దిదారులకు ఒక ఏకమొత్తం రూపములో మరణ ప్రయోజనాలను అందిస్తుంది.
అవధి జీవితబీమా ప్లానుల యొక్క కీలకమైన తక్కువ ప్రీమియములకు అనుపాతంగా చూస్తే, భరోసా ఇవ్వబడిన మొత్తము గణనీయంగా చాలా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ, పాలసీ అవధి పాటు మీరు జీవించి ఉన్నట్లయితే, మీకు ఎటువంటి జీవించియున్న ప్రయోజనం లేదా మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ మనీబ్యాక్ పొదుపు ప్లానుతో, పాలసీ కాలవ్యవధి పాటు జీవిత వర్తింపును పొందుతూ ఉంటూనే తక్కువ కాలపు చెల్లింపు నిబద్ధతలు ఉండే అనుకూలతను కలిగి ఉంటారు. దానికి అదనంగా, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ పాలసీ అవధి ఆఖరులో, మెచ్యూరిటీ వద్ద మీరు హామీతో కూడిన భరోసా మొత్తము, కూడగట్టిన సింపుల్ రివర్షనరీ బోనస్ (ప్రకటించి ఉంటే), మరియు టెర్మినల్ బోనస్ అందుకునే అర్హత పొంది ఉంటారు.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, మీరు ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు అవధి ఆధారంగా 4/5/6/7వ పాలసీ సంవత్సరం ఆఖరులో, జీవించియున్న ప్రయోజనముగా మీరు ఒక వార్షిక ప్రీమియం యొక్క 103% మొత్తాన్ని తిరిగి అందుకుంటారు. ఒకవేళ పాలసీ అవధి చివరివరకూ జీవితబీమా చేయబడిన వ్యక్తి గనక జీవించి ఉండకపోతే, జీవించియున్న ప్రయోజనాలు చెల్లించివేయబడినా అదే విధంగా బోనసులు ఏవైనా చెల్లించబడినా సరే, నామినీలు మొత్తం బీమాచేయబడిన సొమ్మును అందుకోవడానికి అర్హులుగా ఉంటారు.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వర్సెస్ ఎండోమెంట్ ప్లాన్లు
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వంటి ఒక మనీ బ్యాక్ పొదుపు ప్లాను ఎండోమెంట్ పాలసీల గొడుగు క్రిందికి వస్తుంది. ఒక శుద్ధ ఎండోమెంట్ పాలసీలో, జీవిత వర్తింపుకు సంబంధించి మీరు సాంప్రదాయక బీమా ప్లానుల యొక్క ప్రయోజనాలన్నింటినీ పొందుతారు. దానికి అదనంగా, మీరు పాలసీ అవధి ఆఖరులో మెచ్యూరిటీ ప్రయోజనాలుగా చెల్లించబడే ఒక గణనీయమైన మొత్తమును అందుకుంటారు. పాలసీ అవధి కాలములో పాలసీదారు యొక్క అకాల మరణం సంభవించిన పక్షములో, ఎంచుకున్న పాలసీ యొక్క నిబంధనలపై ఆధారపడి, నామినీలు మరణ ప్రయోజనాలను ఒక ఏకమొత్తంగా గానీ లేదా విడతలుగా చెల్లించబడే నెలసరి చెల్లింపులుగా గానీ అందుకుంటారు.
పోలిక చేసి చూస్తే, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ మనీబ్యాక్ పొదుపు ప్లాను అనేది లిక్విడిటీ యొక్క ప్రయోజనాలను అందించే ఒక ఎండోమెంట్ ప్లానుగా ఉంటుంది. పాలసీ అవధి యొక్క ఆఖరులో ఒక ఏకవిడత చెల్లింపుగా ఏకమొత్తం అందుకోవడానికి బదులుగా, పాలసీ అవధిలోని ఒక నిర్దిష్ట దశలో జీవించియున్న ప్రయోజనముగా మీరు మీ డబ్బును వెనక్కి పొందుతారు. ఈ విధంగా, పాలసీ యొక్క ఆఖరులో మాత్రమే కాకుండా పాలసీ వ్యవధి అంతటా జీవించియున్న ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు. జీవిత బీమా మరియు లిక్విడిటీ కలగలిసి ఉన్న ఒక మనీ బ్యాక్ పాలసీతో మీ పొదుపు యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోండి.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వర్సెస్ మొత్తం జీవిత పొదుపు ప్లాన్లు
సాంప్రదాయక జీవిత బీమా అవధి ప్లానులు మరియు ఎండోమెంట్ పాలసీలు మీ జీవితాన్ని 60-70 సంవత్సరాల పాటు రక్షిస్తుండగా, ముఖ్యంగా ఒక సంపూర్ణ జీవిత బీమా ప్లాను మీరు జీవించి ఉన్నంత వరకూ లేదా ముందస్తుగా పేర్కొనబడిన 99/100 సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ, ఏది ముందు జరిగితే దాని ప్రకారము సాంప్రదాయక కవర్ అందిస్తుంది. ఒక సంపూర్ణ జీవిత పొదుపు ప్లానులో, మీరు మెచ్యూరిటీ వరకూ పాలసీ పొడిగింపును ఎంచుకోవచ్చు లేదా జీవించియున్న ప్రయోజనాలు, ఏవైనా ఉంటే బోనసులను క్లెయిం చేయవచ్చు.
అనుకూలమైన ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ మనీ బ్యాక్ సేవింగ్స్ ప్లాన్ వలె కాకుండా, ఒక సంపూర్ణ జీవిత పొదుపు ప్లాను కాలానుగత చెల్లింపులను అందించదు. ఒకవేళ మీకు లిక్విడిటీ మరియు క్రమం తప్పని డబ్బు రాబడి మీకు ముఖ్యమైన పక్షములో, అప్పుడు ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ మీ అవసరాలకు అత్యుత్తమంగా సరిపోతుంది. మీరు పాలసీ అవధి కాలములో ఒక్క వార్షిక ప్రీమియం మొత్తం యొక్క 103% ను జీవించియున్న ప్రయోజనముగా అందుకోవడమే కాకుండా, మొత్తం పాలసీ అవధి పాటు జీవిత వర్తింపుతో పాటుగా స్వల్పకాలిక చెల్లింపు నిబద్ధతలను (5-8 సంవత్సరాలు) కూడా ఆనందించవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వర్సెస్ యులిప్లు
ఒక సాంప్రదాయక బీమా-కమ్-పొదుపు ప్లానుగా, మనీ బ్యాక్ పాలసీలు మార్కెట్-అనుసంధానితం అయి ఉండవు. రిస్క్-విముఖత ఉన్న వారికి అవి కచ్చితమైన ఆర్థిక సాధనాలుగా ఉంటాయి. యులిప్స్ లేదా యూనిట్-అనుసంధానిత బీమా పాలసీలు కొద్దిగా అధిక రిస్క్-వాంఛ ఉన్నవారికి సరిపోతాయి. యులిప్స్ అనేవి మార్కెట్ లోని చలనాలపై ఆధారపడి ఉండే బీమా- కమ్- పెట్టుబడి ప్లానులుగా ఉంటాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, మెచ్యూరిటీలో భరోసా మొత్తం గ్యారంటీ ఇవ్వబడుతుంది మరియు మార్కెట్ రిస్కులకు లోబడి ఉండదు.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ యొక్క కీలక ముఖ్యాంశాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ అనేది, జీవిత వర్తింపు మరియు లిక్విడిటీ యొక్క ప్రయోజనంతో క్రమశిక్షణ కలిగిన పొదుపు యొక్క కచ్చితమైన మిశ్రమం. ఈ పరిమిత చెల్లింపు ప్లాను స్వల్పకాలిక చెల్లింపు నిబద్ధతలను కూడా అందిస్తుంది ప్రీమియం-చెల్లింపు వ్యవధి లోపున మీ నిధులకు ప్రాప్యతను ఇస్తుంది.
- ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో మీకున్న సమయమునకు సరిపోయే ఐచ్ఛికాలతో తక్కువ వ్యవధికి చెల్లించండి మరియు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోండి
- మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, జీవిత వర్తింపు ప్రయోజనాలను ఆనందించడం కొనసాగించండి (మీరు రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములు చెల్లించి ఉంటే వర్తిస్తుంది)
- ఒక వార్షిక బోనస్ (ఏదైనా ప్రకటించబడి ఉంటే) సంపాదనల యొక్క హెచ్చు భాగాన్ని ఆనందించండి
- ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ క్రింద జీవించియున్న ప్రయోజనముగా వార్షిక ప్రీమియం యొక్క 103% ను వెనక్కి పొందండి
- అవధి యొక్క ఆఖరున, మీరు మెచ్యూరిటీ వద్ద హామీ ఇవ్వబడిన మొత్తము ప్లస్ కూడగట్టిన బోనస్ లు (ప్రకటించబడి ఉంటే) పొందుతారు
- భవిష్యత్తు ప్రీమియములను చెల్లించే భారం నుండి మీ ప్రియమైన వారిని రక్షించడానికై ప్రీమియం రైడర్ యొక్క వైవర్ ని జోడించుకునే ఐచ్ఛికం
- సులభమైన మరియు సౌకర్యవంతమైన ఆన్‌లైన్ కొనుగోలు ఆప్షన్
- ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ నాకు ఎందుకు కావాలి?
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ అనేది ఒక మనీబ్యాక్ పొదుపు ప్లాను, బీమా పెట్టుబడుల నుండి క్రమం తప్పని ఆదాయంతో పాటుగా జీవిత రక్షణ కోరుకునే వారికి ఇది ఒక కచ్చితమైన ప్లానుగా ఉంటుంది. ఒకవేళ మీపై ఆధారపడినవారు ఉంటే, మీ పరోక్షములో వారి ఆర్థిక భద్రత గురించిన మీ ఆందోళన అర్థం చేసుకోదగినదే. ద్రవ్యోల్బణము మరియు పెరుగుతున్న జీవన వ్యయముతో, ఈ రోజున మంచిగా ఉండేది రాబోయే కొన్ని సంవత్సరాల్లో దానికి విరుద్ధంగా ఉండబోయే పరిస్థితి కావచ్చు. ఒక బీమా పొదుపు ప్లానుతో, మీ అకాల మరణం ఉదంతములో, పెరుగుతున్న ఖర్చులు అదేవిధంగా వేతనాల నష్టానికి అడ్డుగా మీరు ఒక కంచె ఏర్పాటు చేయవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ అనేది, తక్కువ రిస్క్ కు గురికావడం, హామీతో కూడిన రాబడులు, తక్కువ చెల్లింపు నిబద్ధతలు, మరియు లిక్విడిటీని కలిగి ఉండే ఒక మనీ బ్యాక్ పాలసీ.
సాంప్రదాయక వర్తింపు యొక్క మనశ్శాంతి కోసం
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో ఒక సాంప్రదాయక వర్తింపును పొందండి—ఇది పాలసీ యొక్క వ్యవధి కొరకు జీవిత వర్తింపుతో మనీ బ్యాక్ పొదుపు ప్లాన్. మీరు అకాలమరణం చెందిన పక్షములో, లెక్కకట్టబడే మరణ ప్రయోజనం ఒక ఏకమొత్తంగా ఉంటుంది, అది మీ పరోక్షములో మీ కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించడానికి సహాయపడగలుగుతుంది. ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, జీవిత వర్తింపు ప్రయోజనాన్ని ఆనందించడం కొనసాగిస్తారు (మీరు రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములు చెల్లించి ఉంటే వర్తిస్తుంది)
జీవించియున్న మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలను ప్రోగు చేసుకోవడం
మీరు సాంప్రదాయక జీవిత వర్తింపులో డబ్బు ఉంచడమే కాకుండా, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ మనీ బ్యాక్ పాలసీ క్రింద కూడా జీవించియున్న ప్రయోజనాల కోసం ఎదురు చూడవచ్చు. సంపూర్ణ రక్షణ అందించి జీవించియున్న ప్రయోజనాలను అందించని అవధి బీమా ప్లానుల వలె కాకుండా, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ ఎటువంటి అవాంఛనీయ ఘటనల్లోనైనా మీ ఆర్థిక భద్రతను చూసుకుంటుంది. పాలసీ యొక్క మెచ్యూరిటీ వరకు జీవించియున్నప్పుడు, మీరు మెచ్యూరిటీలో గ్యారంటీ ఇవ్వబడిన మొత్తాన్ని మరియు కూడగట్టిన బోనసులను (ప్రకటించి ఉంటే) అందుకుంటారు.
రిస్క్-లేని రాబడుల కొరకు
కొంతమందికి అధిక రిస్క్-వాంఛ ఉంటుంది కాగా మరికొంత మందికి ఉండదు.అధిక రిస్క్- వాంఛ గలవారు మార్కెట్-అనుసంధానిత ప్లానులు, స్టాకులు, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయగలుగుతారు. అయినప్పటికీ, మదుపు విషయానికి వచ్చినప్పుడు రిస్క్- విముఖత ఉన్నవారికి ఎటువంటి ఐచ్ఛికాలూ ఉండవని దీని అర్థము కాదు. ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, రిస్క్-లేని రాబడుల ప్రయోజనాలను మీరు ఆనందించవచ్చు.
లిక్విడిటీ యొక్క ప్రయోజనాలను పొందుటకు
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ ని ఇతర పొదుపు సాధనాల నుండి వేరుగా చేయడానికి ప్రధానమైన కారకాంశాలలో ఒకటి, ఈ ప్లాన్ అందించే లిక్విడిటీ యొక్క ప్రయోజనం.పాలసీ అవధి సందర్భంగా ముందుగా నిర్ధారించబడిన అంతరములో, మీరు ఒక సంవత్సరం యొక్క వార్షికం చేయబడిన ప్రీమియం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటారు. మీరు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని ఎంచుకోవచ్చు లేదా ప్రీమియం చెల్లింపుగా తిరిగి ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ లో మదుపు చేసుకోవచ్చు. ఈ జీవించియున్న ప్రయోజనం, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ ని విడగొట్టే లేదా సరెండర్ చేసే అవసరం లేకుండా మీ ప్రస్తుత ఖర్చులను నిర్వహించుకోవడానికి మీకు అవసరమైన లిక్విడిటీని మీకు అందిస్తుంది.
మీ కోసం, మీ నుండి
మీకు కొత్త ఖర్చులు ఉన్నప్పుడల్లా ఒకవేళ ఒక ఉదారమైన వ్యక్తి ప్రవేశించి మీ కోసం ఆ ఖర్చుల్ని భరిస్తే మీకు చాలా బాగుంటుంది కదా? ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, మీకోసం మీరు ఒక ఉదారమైన వ్యక్తి అవుతారు.ఈ ప్లాను మీ నుండి మీకు ఒక కానుక—పరిమిత సంవత్సరాల పాటు చెల్లించండి మరియు పాలసీ అవధి ఆఖరు వరకూ జీవిత వర్తింపును ఆస్వాదించండి, బోనసులతో సహా (ఏవైనా ఉంటే) జీవించియున్న మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందండి మరియు పాలసీ వ్యవధి కాలములో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగిన పక్షములో మరణ ప్రయోజనముతో మీకు ప్రియమైన వారు శ్రద్ధ తీసుకోబడతారు కాబట్టి మనశ్శాంతిని ఆనందించండి.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ యొక్క ప్రయోజనాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ అనేది, ప్రీమియం చెల్లింపుల కాలములోనే డబ్బు తిరిగి చెల్లింపు ద్వారా, మీరు ఒక ప్రీమియము చెల్లింపును తప్పినప్పటికీ కూడా మీ జీవిత వర్తింపు ప్రయోజనాన్ని కొనసాగిస్తూ, మెచ్యూరిటీలో బోనసులను (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) సంపాదించే సంభావ్యతతో, పాలసీదారు యొక్క దురదృష్టకర మరణం జరిగిన పక్షములో మీ ప్రియమైన వారికి ఒక జీవిత వర్తింపు సహాయముతో రక్షణ కల్పిస్తూనే, మీ ఆర్థిక లక్ష్యాల నెరవేర్పును సానుకూలపరచడానికి రూపొందించబడిన అనుసంధానితం కాని, పార్టిసిపేటింగ్, పరిమిత చెల్లింపు, మనీబ్యాక్ జీవిత బీమా ప్లాను.
భరోసాతో కూడిన రాబడులు
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, మీరు పొదుపు చేసిన డబ్బు కొంత అదనపు డబ్బుతో మీకు తిరిగి వస్తుందనే భరోసాతో మీరు నిశ్చింతగా ఉండవచ్చు. గడచిన సంవత్సరం యొక్క ప్రీమియం చెల్లింపుకు ముందుగా, పాలసీ క్రింద వార్షికం చేయబడిన మీ ప్రీమియం యొక్క 103% కి సమానంగా మీరు జీవించియున్న ప్రయోజనం అందుకుంటారు.
ఎటువంటి ముప్పు లేదు
అనుసంధానితం-కాని ఒక ప్లానుగా, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ మదుపుదారుకు అతిస్వల్ప ముప్పు లేదా అసలే ముప్పును కలిగించదు. మీ భరోసా సొమ్ము మరియు జీవించియున్న/మెచ్యూరిటీ/మరణ ప్రయోజనాలు ఒడిదుడుకులతో కూడిన మార్కెట్ నిధుల విలువలచే ప్రభావితం కావు. క్రమం తప్పకుండా చెల్లించే ప్రీమియములతో పాలసీని అమలులో ఉంచినంత కాలమూ, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ క్రింద జాబితా చేయబడిన ప్రయోజనాలను మీరు అందుకుంటూనే ఉంటారు.
పలు విధాల ప్రయోజనాలు
సాంప్రదాయక కవర్ + మనీ బ్యాక్ గా వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 103% + భాగస్వామ్యపు బోనసులు (ఏవైనా ఉంటే) + పన్ను పొదుపు— ఈ అనేకవిధాల ప్రయోజనాలను అందించేదే ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్.
జీవిత వర్తింపు కొనసాగింపు
మీ పాలసీ చెల్లించబడే-విలువను చేరుకోగానే, మీరు ఒక ప్రీఁఇయం చెల్లింపును తప్పించుకున్నప్పటికీ సైతమూ, సాంప్రదాయక జీవిత వర్తింపు ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించండి.చెల్లించబడని మొదటి ప్రీమియం తేదీ నుండి ఒక సంవత్సరం వ్యవధి పాటు పాలసీ అమలులో నిలిచి ఉండడం కొనసాగుతుంది.
అనుకూలత (ఫ్లెక్సిబిలిటీ)
ప్రీమియం చెల్లింపు వ్యవధి మరియు రూపం విషయానికి వచ్చినప్పుడు, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ మీకు సంపూర్ణ అనుకూలతను ఇస్తుంది. మీరు మీ విచక్షణను బట్టి 10 లేదా 15 సంవత్సరాల ప్లాన్ అవధిని మరియు 10 సంవత్సరాల పాలసీ కొరకు 5 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధిని, మరియు 15 సంవత్సరాల పాలసీ కొరకు 5/6/7/8 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చు. పాలసీ యొక్క అవధి సందర్భంగా జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి యొక్క దురదృష్టకర సంఘటనలో, నామినీకి చెల్లించబడే మరణ ప్రయోజనాలు ఒక ఏకమొత్తం రూపములోనైనా ఉండవచ్చు లేదా తదుపరి 5/10/15 సంవత్సరాల పాటు నెలసరి ఆదాయ చెల్లింపుగానైనా ఉండవచ్చు.
ఐచ్ఛిక ఆడ్-ఆన్ రైడర్లు
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, మీ పాలసీ మీ అవసరాలకు సరిపోయే విధంగా చూసుకోవడానికి గాను అధునాతన రైడర్లను చేర్చుకునే ఐచ్ఛికం మీకు ఉంటుంది. ఈ ప్లాన్ క్రింద, అందుబాటులో ఉండే రైడర్లలో, మరణం మీదట ప్రీమియం వైవర్, ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యముపై లేదా క్లిష్ట అస్వస్థత (యొక్క వ్యాధినిర్ధారణ) ప్రీమియం వైవర్, మరియు మరణం లేదా ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యముపై ప్రీమియం వైవర్ చేరి ఉంటాయి.
భాగస్వామ్య బోనసులు
ఒక పార్టిసిపేటింగ్ లేదా ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ వంటి లాభముతో కూడిన సేవింగ్స్ ప్లాన్ యొక్క ఒప్పందము క్రింద, బీమాదారు ఒక సింపుల్ రివర్షనరీ బోనస్ మరియు/ లేదా టెర్మినల్ బోనసును ప్రకటించవచ్చు. ఈ మొత్తాలు, మీరు పాలసీ యొక్క మెచ్యూరిటీ సమయములో అందుకునే అంతిమ చెల్లింపును తదుపరి పెంపుదల చేయు సంభావ్యత కలిగి ఉంటాయి.
లోన్ సౌకర్యము
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ పై మీరు ఒక లోన్ పొందవచ్చు.ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము ఆ సమయములోని సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది, మరియు అందుబాటులోని సరెండర్ విలువపై 90% వరకూ ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
- 10 సంవత్సరాల పాలసీ అవధికి ప్రవేశం వద్ద కనీస వయస్సు 8 సంవత్సరాలు, మరియు 15 సంవత్సరాల పాలసీ అవధికి 3 సంవత్సరాలు.
- మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.
- 10 - లేదా 15 - సంవత్సరాల పాలసీ అవధి కొరకు ప్లాన్ కొనండి, మరియు 10 సంవత్సరాల పాలసీకి 5 సంవత్సరాలకు పరిమిత ప్రీమియములు లేదా 15 సంవత్సరాల పాలసీకి 5/6/7/8 ప్రీమియములు చెల్లించండి.
- భరోసా ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము రు.1,50.000 లు.గరిష్ట భరోసా మొత్తము పరిమాణముపై ఎటువంటి పరిమితీ లేదు.
- కనీస ప్రీమియం రు.18,000 సంవత్సరానికి, రు.9,215 అర్ధ సంవత్సరానికి, రు.4,662 మూడు నెలలకు మరియు రు.1,566 మెచ్యూరిటీ అంతరముపై, గరిష్ట ప్రీమియముపై పరిమితి లేకుండా.
తరచుగా అడిగే ప్రశ్నలు
-
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ లో ఏవైనా రైడర్లు అందుబాటులో ఉన్నాయా?
ఔను, మీకు మద్దతు కోసం ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఒపి) రైడర్ కొరకు ఎంపిక చేసుకోవచ్చు, ఒకవేళ పాలసీదారు/ భరోసా ఇవ్వబడిన వ్యక్తి మరణము, ప్రమాదవశాత్తూ సంపూర్ణ అంగవైకల్యము లేదా క్లిష్టమైన అస్వస్థతను అనుభవించిన పక్షములో, మీ బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములను మాఫీ చేయడం ద్వారా.మీ పాలసీకి జోడించడానికి గాను మీరు ఎంచుకున్న రైడర్ ఆప్షన్ పై కచ్చితమైన అవధులు ఆధారపడి ఉంటాయి.
-
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ కొరకు ప్రీమియం చెల్లింపు రూపాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ తో, మీరు నెలవారీ, మూడు నెలలవారీ, అర్ధ సంవత్సరం వారీ, మరియు సంవత్సరం వారీ వంటి పలు ప్రీమియం చెల్లింపు రూపాల నుండి ఎంచుకోవచ్చు.
-
ఒకవేళ నేను నా ప్రీమియమును సకాలములో చెల్లించకుంటే ఏదైనా అపరాధ రుసుము ఉంటుందా?
పాలసీ అమలులో ఉన్నట్లుగా పరిగణించబడిన సమయములో తప్పిన ప్రీమియం గడువు తేదీ నుండి ప్రీమియం చెల్లించుటకు గాను కొంతవరకు కారుణ్య వ్యవధి ఉంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని అందిస్తుంది. ఒకవేళ పాలసీ చెల్లించబడే-విలువను పొందినట్లయితే మీరు జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనాన్ని ఆనందిస్తారు.
-
నేను కొత్తగా కొనుగోలు చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ యొక్క నిబంధనలతో ఒకవేళ నేను సంతోషంగా లేకుంటే నేను ఏమి చేయాలి?
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్ అనేది, ఫ్రీ లుక్ వ్యవధి లోపున మీకు మీరుగా నిర్ణయించుకోగలిగిన ఒక అనువైన పాలసీగా ఉంటుంది. ఒకవేళ మీరు పాలసీ షరతులు మరియు నిబంధనలలో దేనికైనా అంగీకరించని పక్షములో, పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున పాలసీని తిరిగి ఇచ్చే ఐచ్ఛికం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.
-
నేను ఈ పాలసీలో ఒక లోన్ పొందవచ్చునా?
ఔను, ఈ ప్లాన్ క్రింద మీరు ఒక లోన్ సౌకర్యము నుండి ప్రయోజనం పొందవచ్చు. ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము ఆ సమయములోని సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులోని సరెండర్ మొత్తంలో90% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు. కనీస లోన్ మొత్తము రు.1,000 లుగా ఉండాలి.
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
ఉత్పత్తుల బ్రోచర్