టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ (అవధి బీమా పాలసీ)

ప్రజలకు నిబద్ధత ఎవరు చాలా ముఖ్యమైనవి

జీవితములో జరిగే ప్రతీ విషయం పైనా మీరు నియంత్రణ కలిగి ఉండలేకపోవచ్చు కానీ, మీరు అదుపు చేసుకోగలిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. కేవలం అది చేయడానికే ఒక టర్మ్ ప్లాన్ (అవధి ప్లాన్) మీకు సహాయపడుతుంది.

ఈ విభాగము క్రిందికి వచ్చే ఉత్పత్తులు ఈ క్రింది విధంగా ఉన్నాయి: ఇది అదుపులోనికి తీసుకోవాల్సిన సమయం!

ఎందుకు ఎంచుకోవాలి ఇండియాఫస్ట్ చే అందించబడే టర్మ్ ప్లానులను?

 • కంప్లీట్ కంఫర్ట్ (సంపూర్ణ సౌఖ్యత)

  మీ నగదు రాకపోకలకు ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాలతో జతకలవడానికి గాను, అందుకు సరిపోయే ఒక చెల్లింపు ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.

 • త్వరిత క్లెయిముల సేవ

  మీ సమయము మరియు సౌకర్యత కోసం అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

 • పీస్ ఆఫ్ మైండ్ (మనశ్శాంతి)

  మీరు మీ కుటుంబము ఆర్థికంగా సురక్షితంగా ఉన్నదనే భావనతో మరియు మీరు చుట్టూ ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో అదే జీవన ప్రమాణముతో ఉంటారనే సంపూర్ణ మనశ్శాంతిని కలిగి ఉంటారు.

 • మీ అవసరాలకు సరిపోయే రక్షణ

  ప్రతి కుటుంబమూ విశిష్టమైనది, కాబట్టి వారి ఆర్థిక అవసరాలు కూడా అంతే!మా ప్లానులు మీకు చక్కగా సరిపోయే విధంగా రూపొందించబడ్డాయి.

 • పన్ను ప్రయోజనాలు

  మీరు పెట్టుబడి చేసే ప్రీమియంపై అదే విధంగా వాటి మెచ్యూరిటీ పైన కూడా ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) క్రింద పన్ను ప్రయోజనాలు ఆనందం పొందండి.

కొన్ని కారకాలు పరిగణలోకి

 • కవరేజ్ అవసరం

 • మీ జీవిత దశను పరిగణనలోనికి తీసుకొనుట

 • పాలసీ ప్రయోజనాలను అర్థం చేసుకోండి

 • క్లెయిముల పరిష్కారము

 • కస్టమర్ (గ్రాహకుల) సేవ

Know More

కవరేజ్ అవసరం

మీకు కావలసిన కవరేజ్ మొత్తాన్ని లెక్కించడం అవధి బీమాను కొనుగోలు చేయడంలోని అత్యంత కీలకమైన దశ. ఒక అవధి ప్లానులో పెట్టుబడి చేయాలనే ఆలోచనను నెరవేర్చదు కాబట్టి మీకు మీరుగా తక్కువ బీమా చేసుకోవాలనే పొరపాటు యోచనను మీరు నివారించుకోవాలి. మీ వయసు పెరిగే కొద్దీ మరియు మీ జీవనశైలి అవసరాలు ఉద్భవిస్తుంటాయి, తగినంత జీవిత వర్తింపును పొందడం ద్వారా మీ కుటుంబాన్ని రక్షించుకొని మరియు క్షేమంగా ఉంచడం తెలివైన నిర్ణయం అవుతుంది. ఎంత జీవిత వర్తింపును ఎంచుకోవాలో కనుక్కోవడానికి మా టర్మ్ ప్లాన్ క్యాలికులేటరును ఉపయోగించండి.

మీ జీవిత దశను పరిగణనలోనికి తీసుకొనుట

మీ జీవిత బీమా ఆవశ్యకతలు మరియు ప్రాధాన్యతలు జీవితం యొక్క ప్రతి దశలోనూ మారుతూ వస్తుంటాయి, కాబట్టి, ఒక అవధి ప్లాను కొనే ముందుగా, మీరు ఏ జీవిత దశలో ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ కుటుంబములోని ఆధారపడిన సభ్యులను పరిగణన లోనికి తీసుకోండి, ఎందుకంటే, ఇది మీరు పెట్టుబడి చేయాల్సిన డబ్బు యొక్క మొత్తాన్ని అంచనా వేస్తుంది. ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తితో పోలిస్తే వివాహమైన వ్యక్తి యొక్క ఆర్థికపరమైన బాధ్యతలు సహజంగానే వ్యత్యాసంగా ఉంటాయి. అదేవిధంగా, మీకు గనక పిల్లలు ఉంటే, లేదా మీపై ఆధారపడియున్న తల్లిదండ్రులు ఉంటే మీపై ఆర్థికపరమైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది.

పాలసీ ప్రయోజనాలను అర్థం చేసుకోండి

మీ అవసరాల ఆధారంగా మరియు కంపెనీ యొక్క రికార్డు ఆధారంగా మీరు పాలసీపై ఒక నిర్ణయానికి వస్తే, పాలసీ యొక్క అంశాలను అర్థం చేసుకోవడానికి తగిన సమయం తీసుకోండి. పాలసీ అవధి, ప్రీమియం చెల్లింపు అవధి, హామీ ఇవ్వబడే మొత్తం, మరియు ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి మరియు మదింపు చేసుకోండి. పాలసీ బ్రోచర్లు/ ఆఫర్ పత్రాలను కేవలం బ్రౌజ్ చేసి చూసుకుంటూ వెళితే సరిపోదు, వాటిని వాస్తవంగా క్షుణ్ణంగా చదవాలి.

క్లెయిముల పరిష్కారము

ఒక అవధి ప్లాను కొనే ముందుగా, బీమా కంపెనీ యొక్క క్లెయిముల పరిష్కార నిష్పత్తిని సంపూర్ణంగా సూచికలతో సహా పరిశీలించి చూసుకోండి. ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వద్ద మేము, చక్కనైన మరియు విసుగు-రహితమైన ఒక సమర్థవంతమైన క్లెయిముల పరిష్కార ప్రక్రియను కలిగి ఉన్నాము.

కస్టమర్ (గ్రాహకుల) సేవ

స్పృశించజాలని ఒక ఉత్పాదనతో వ్యవహరించే ఏ వ్యాపారములోనైనా కస్టమర్ సేవ అనేది ఒక కీలకమైన అంశము. ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వద్ద మేము, కస్టమర్ కేంద్రితంగా ఉండేందుకే పాటుపడుతున్నాము. ప్రతి కస్టమర్ కు ఒక సానుకూలమైన అనుభవాన్ని అందించేందుకు గాను కస్టమర్ సేవ విషయములో మేము సులువైన మరియు విసుగు- రహితమైన ప్రక్రియలను కలిగియున్నాము.

మా కస్టమర్లు ఏమి చెబుతున్నారు

FAQs

 • ఎంత జీవితం కవర్ నేను టర్మ్ ప్లాన్‌లో కొనాలా?

  మీ జీవిత వర్తింపు ఋణాలతో సహా మీ అప్పులన్నింటినీ చెల్లించదగినట్లుగా ఉండాలి మరియు మీ ఆదాయాన్ని స్థానాంతరము చేసేదిగా ఉండాలి, ప్రత్యేకించి మీరే కుటుంబం యొక్క ఏకైక సంపాదనాపరులు అయి ఉంటే. మీ వార్షిక ఆదాయమును మీ పాలసీకి జోడించడం అనేది ద్రవ్యోల్బణంపై సమర్థవంతమైన రక్షణగా పని చేయవచ్చు. మీ భవిష్యత్ కర్తవ్యాలను మనసులో ఉంచుకోండి – మీ బిడ్డ యొక్క చదువు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం వంటివి.

 • ఏ వయస్సులో నేను టర్మ్ ఇన్సూరెన్స్ కొనాలా?

  అవధి బీమాను కొనుగోలు చేయడానికి “సరియైన వయస్సు” అంటూ ఏదీ లేనప్పటికీ, మీకు కనీసమైతే 18 సంవత్సరాల వయసు ఉండాలి. త్వరగా మొదలుపెట్టడమనేది తెలివైన నిర్ణయము. ఒకవేళ మీకు ప్రీమియములను సకాలములో చెల్లించగల నిలకడైన ఆదాయము ఉంటే, మీ కుటుంబ భవిష్యత్తుకు పెట్టుబడి చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఒకవేళ మీకు వివాహమై ఉంటే, పిల్లలు ఉంటే, లేదా మీపై ఆధారపడియున్న తల్లిదండ్రులు ఉంటే, మీరు ఖచ్చితంగా ఒక అవధి బీమా పాలసీని తీసుకోవాల్సిందే. మీ వయసు పెరిగే కొద్దీ, మీరు చెల్లించాల్సిన ప్రీమియముల సంఖ్య పెరుగుతుంది.

 • ఏమి ఉండాలి నా టర్మ్ ప్లాన్ పదవీకాలం?

  మీకు ప్రియమైనవారి ఆర్థిక భద్రతను చూసుకోవడానికి గాను ప్లాను క్రింద అందుబాటులో ఉండే గరిష్ట అవధి ప్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది.

 • నాకు మెచ్యూరిటీ వస్తుందా? టర్మ్ ప్లాన్ పదవీకాలం నుండి నేను బయటపడితే ప్రయోజనం?

  మీరు లేనప్పుడు మీకు ప్రియమైనవారి యొక్క భద్రతను నిర్ధారించడం అవధి ప్లాను యొక్క ప్రధాన అంశముగా ఉంటుంది. అయినప్పటికీ, పాలసీదారు జీవించియున్నప్పుడు ఏక- మొత్తపు చెల్లింపు అంటూ ఉండదు.

 • నా ప్రీమియం మొత్తం పాలసీ పదవీకాలంలో మార్పు?

  ప్లాను యొక్క కాలవ్యవధి అంతటా మీ ప్రీమియం మొత్తము ఒకే విధంగానే ఉంటుంది. ఒకే ఒక్క మార్పు ఏమిటంటే, భారత ప్రభుత్వముచే ప్రకటించబడిన విధంగా సేవా పన్ను నిబంధనలలో మార్పును బట్టి మీ ప్రీమియములో మార్పు ఉంటుంది.

 • నేను అప్పుడప్పుడు ధూమపానం చేస్తున్నాను. నేను ఇంకా పొగాకు వినియోగదారునిగా ప్రకటించాల్సిన అవసరం ఉందా?

  ఔను, మీరు అప్పుడప్పుడూ పొగ త్రాగేవారైనా, మీకు మీరుగా ఒక పొగాకు వాడుకదారుగా స్వయంగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. పాలసీ కొరకు సరియైన ప్రీమియమును నిర్ణయించుటలో మొత్తం వైద్య చరిత్ర అంతా అగత్యము కాబట్టి ఇది ముఖ్యం అవుతుంది.