ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

మీ కుటుంబానికి ఆర్థికపరమైన సురక్షిత భవిష్యత్తును కానుకగా ఇవ్వండి

GET A QUOTE

ఒకవేళ మీరు అకాల మరణం చెందితే మీ కుటుంబానికి ఏక మొత్తం బెనిఫిట్ ఇస్తామన ఇండియాఫస్ట్ లైప్ ప్లాన్ హామీ ఇస్తోంది.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ ని కొనండానికి కారణాలు

  • 40 సంవత్సరాల కాలవ్యవధి వరకూ జీవిత వర్తింపును ఆస్వాదించండి

  • జీవితబీమా చేయబడిన వ్యక్తి యొక్క అకాల మరణము విషయములో భరోసా గల ప్రయోజనం

  • సెక్షన్ 80 సి కింద, మీరు పెట్టుబడి పెట్టిన ప్రీమియంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు

అర్హత ప్రామాణికత ఏమిటి?

  • దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు.

  • ప్లాన్ యొక్క ఆఖరునాటికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.

  • కనీస హామీ ఇవ్వబడే మొత్తం:రు.1,00.000 లు, గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తం:రు.5,00,00,000 లు

నాకు అవధి బీమా ఎందుకు కావాలి?


మీరు ఒక అవధి ప్లాన్ ని ఎందుకు కొనాలని ఆలోచించే ముందుగా, ఇప్పుడు కొన్ని ఆత్మ శోధన ప్రశ్నల గురించి చూద్దాం:

  • మీరు లేనప్పుడు మీ కుటుంబము యొక్క ఆర్థిక భద్రతను నిధారించుకున్నట్లుగా మీరు అనుకుంటున్నారా?
  • మీ కుటుంబం మీ నెలసరి ఆదాయముపై ఆధారపడలేని పరిస్థితుల్లో వారికి మద్దతు ఇవ్వడానికి మీ పెట్టుబడులు మరియు/లేదా పొదుపులు సరిపోతాయా?
  • మీరు మరణించిన పక్షములో, మీ కుటుంబ సభ్యులు మీ కర్తవ్యబాధ్యతలు మరియు ఋణ చెల్లింపుల భారము నుండి స్వేచ్ఛను పొంది ఉంటారా?

ఒకవేళ ఈ జవాబులన్నింటికీ మీరు లేదు అని జవాబు చెబితే, ఒక అవధి ప్లాన్ కొనడం అనేది మీ కోసం తప్పనిసరి అవసరము. ఎందుకో ఇదిగో ఇక్కడ:

మీరు కుటుంబ పెద్ద అయినా, ఒక సింగిల్ పారెంట్, ఒక బిజినెస్ స్వంతదారు, లేదా జీతం పొందుతున్న ఉద్యోగి అయినా, మీ అవసరాలకు సరిపోయే ఒక అవధి ప్లాన్ కొనడం మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును చూసుకోవడానికి అత్యంత చక్కని మార్గము.

మీ కుటుంబము యొక్క ఆర్థిక సుస్థిరతకు రక్షణ కల్పించుట

కుటుంబములో సంపాదిస్తున్న వ్యక్తిని కోల్పోవడం వల్ల కలిగే ఆర్థిక ప్రభావము, ఆధారపడిన వారి జీవన ప్రమాణమును తీవ్రంగా తగ్గించవచ్చు, మరియు భవిష్యత్తు పట్ల వారి కలలకు ఒక ముగింపు పలకవచ్చు.మీరు లేనప్పుడు సైతమూ, మీకు ప్రియమైనవారి ఆర్థిక సుస్థిరతను చూసుకోవడం ద్వారా వారి రెక్కల అడుగున గాలిగా ఉండటం కొనసాగించండి.

సిద్ధపడి ఉండడానికి

విఫలంకాకుండా ఉండడానికి ప్రణాళిక చేసుకోండి. ప్రణాళిక చేసుకోవడంలో విఫలం కావద్దు. జీవితములో నిశ్చితమైన ఒకే విషయం ఏమిటంటే, ప్రతీదీ అనిశ్చితం. అన్ని అనిశ్చిత ఘటనల కొరకు సిద్ధపడి ఉండడమే జీవితం యొక్క అనిశ్చితులతో వ్యవహరించే అత్యుత్తమ మార్గము. 1 కోటి అవధి బీమా వంటి ఒక గణనీయమైన జీవిత వర్తింపు జీవితం యొక్క వ్యత్యాసాలపై మీ కుటుంబాన్ని రక్షించగలుగుతుంది.

మీ ఆస్తులను పరిరక్షించుట

ఒకవేళ మీకు చెల్లించాల్సియున్న కారు లేదా ఇంటి లోన్ ఉంటే, మీ అకాల మరణము సంభవించిన పక్షములో ఆ కర్తవ్య బాధ్యతలు మీ కుటుంబ సభ్యులకు బదిలీ అవుతాయి. ఒక అవధి బీమా పాలసీ మీ కుటుంబము యొక్క భవిష్యత్తును స్థిరపరచుటలో సహాయపడుతుంది. మరణ ప్రయోజనపు టోకు మొత్తమును ఏవైనా కర్తవ్య బాధ్యతలు మరియు అప్పులను చెల్లించివేయడానికి ఉపయోగించుకోవచ్చు, మరియు మీ కుటుంబానికి ఎటువంటి ఒత్తిడి కలిగించకుండా మీ ఆస్తులను రక్షించుకోవచ్చు.

జీవనశైలి మార్పులను కనీస స్థాయికి ఉంచుట

మీ కుటుంబము ఒక నిర్దిష్ట జీవనశైలికి అలవాటు పడి ఉంటుంది.మీపై ఆధారపడియున్నవారు ఒక ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటుంటారు — ఉన్నత చదువు, వివాహం, మరియు ప్రశాంత జీవనం కొరకు ప్రణాళికలు.ఒక సంపాదనాపరుణ్ణి కోల్పోవడమనేది విషయాలు త్వరగా క్షీణించిపోయేలా చేస్తాయి మరియు మీ ప్రియమైనవారు ఇంతకు మునుపు జీవించినట్లుగా జీవించడానికి కష్టతరం చేస్తాయి. ఒక అవధి వర్తింపు వారి ఆర్థికపరమైన భవిష్యత్తును సులువు మరియు సురక్షితం చేసే ప్రయోజనాలను ఇవ్వగలుగుతుంది.

 

నేను ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాను ఎందుకు కొనాలి?


40 సంవత్సరాల కాలవ్యవధి వరకూ జీవిత వర్తింపు ప్రయోజనాలను ఆస్వాదించండి

అవధి బీమాను కొనుగోలు చేసే అత్యుత్తమ సమయం ఇదే. ఇప్పుడు ఒక అవధి పాలసీ కొనుగోలును ఎంచుకోవడం మీ కోసం అది అత్యంత తక్కువ ప్రీమియం ధరకు మరియు మీరు కావాలనుకునే అవధికి వచ్చేలా చూసుకుంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్, ప్లాన్ అవధి ముగింపున గరిష్ట వయస్సు 70 సంవత్సరాల పరిమితిలో మీకు 5 నుండి 40 సంవత్సరాలకు అవధి వర్తింపును అందజేస్తుంది.

స్థోమతకు తగిన ధరలతో మీ ప్రియమైనవారికి అధిక అవధి వర్తింపుతో ఆర్థిక రక్షణను అందించండి

మీ వినియోగ బిల్లులు, అద్దె, మరియు ఇతర నెలవారీ ఖర్చులను మీరు ఒకసారి చెల్లించివేశారంటే, అధిక బీమా ప్రీమియం చెల్లించడం కష్టతరం కావచ్చు.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీ జేబుకు చిల్లు పడకుండా స్థోమతకు తగిన ప్రీమియంలతో మీకు జీవిత వర్తింపును అందజేస్తుంది.ఈ చక్కని అవధి ప్లాన్ మీ మనస్సుకు మరియు మీ వ్యాలెట్ కు ప్రశాంతతను ఇస్తుంది.ప్రీమియం మొత్తము జీవిత బీమా చేయబడిన వ్యక్తి యొక్క వయస్సు, ప్లాన్ అవధి, మరియు బీమా మొత్తముపై ఆధారపడి ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ ప్రీమియములు అతి తక్కువగా నెలకు రు.100 ల మొత్తముతో మొదలవుతాయి.

మీరు లేనప్పుడు సైతమూ, మీ కుటుంబం యొక్క ఆర్థిక సుస్థిరత్వాన్ని నిర్ధారించుకోండి.

ఒక జీవితానికి ప్రణాళిక చేసుకోవాలంటే అనేక మందికి ఇంటి లోన్‌లు లేదా పిల్లల చదువులు ఉంటున్నాయి.కుటుంబంలో ప్రధాన సంపాదనాపరుడు/సంపాదించు సభ్యుడి మరణము ఈ ప్రణాళికలన్నింటినీ అగాధం లోనికి తోసేస్తుంది.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ ముందస్తుగా ప్రణాళిక చేసుకోవడం ద్వారా మీ కుటుంబం యొక్క కలల్ని ముందువరుసలో ఉంచడానికి మీకు వీలు కలిగిస్తుంది.

మీ కుటుంబం యొక్క జీవన విధానాన్ని ఒక గణనీయమైన మరణ ప్రయోజనముతో నిర్వహణ చేసుకోండి

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ రు.1,00,000 నుండి రూ.50 కోట్ల వరకూ జీవిత వర్తింపు ఆప్షన్లను అందజేస్తుంది.వర్తింపు వ్యవధి లోపున జీవిత బీమా చేయబడిన వ్యక్తి అకాల మరణము యొక్క దురదృష్టకరమైన సంఘటనలో, నామినీలు ఏకమొత్తంగా అవధి వర్తింపులో హామీ ఇవ్వబడిన మొత్తానికి సమానమొత్తాన్ని అందుకుంటారు.నామినీలకు చెల్లించబడే మరణ ప్రయోజనము ఏ సమయంలో అయినా చెల్లించిన ప్రీమియములన్నింటి యొక్క 105% కంటే ఎక్కువగా ఉంటుంది.

చెల్లించిన ప్రీమియములు మరియు అందుకున్న ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలను పొందండి.

ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల క్రింద మీరు, చెల్లించిన ప్రీమియములు మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు అందుకునే స్థితిలో ఉంటారు.

15 రోజులపాటు ఉచిత గమనం

ఇండియాఫస్ట్ లైఫ్ మీకు 15 రోజుల ఉచిత గమన వ్యవధిని ఇస్తుంది, కాబట్టి షరతులు మరియు నిబంధనలతో మీరు సమ్మతించని పక్షములో మీరు ప్లాన్ ని తిరిగి ఇవ్వవచ్చు.ఇది అవధి ప్లాన్ ని మీ సౌకర్యం మేరకు ప్రయత్నించేందుకు మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది.మీరు ముందస్తుగానే పాలసీ పత్రము యొక్క నమూనా కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అవధి బీమాను ఎవరు కొనాలి?


ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్, కొరతలు లేని ఒక అవధి ప్లాన్, అది కచ్చితంగా ఏది చెబుతుందో దానినే చేస్తుంది.అన్ని రంగాల ప్రజలు మరియు విభిన్న వయో సమూహాల వ్యక్తులకు ప్రయోజనం కలిగించే ఈ అవధి బీమా పాలసీ, మీరు వెళ్ళిపోయిన తర్వాత సైతమూ మీ కుటుంబ భద్రతకు మీకు ఏది కావాలో అదే చేస్తుంది.

ఒంటరివారు మరియు అవివాహితులు

మీరు ఒంటరివారు మరియు అవివాహితులు, మీపై ఆధారపడియున్న తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నా కూడా, ప్రత్యేకించి రిటైర్‌మెంట్ తదనంతరం.మీ పరోక్షములో మీపై ఆధారపడినవారికి మద్దతు ఇవ్వడానికై అవధి బీమాను కొనండి.

పిల్లలు లేని వివాహితులు

మీ జీవిత భాగస్వామికి మీరు తోడ్పాటు మరియు రక్షణ ఇవ్వాల్సి ఉంది.ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ప్రియమైనవారి భవిష్యత్తును సుస్థిరం చేయడానికి మీ వెనుక ఒక గట్టి ప్రణాళిక ఉండేలా నిర్ధారించుకుంటూ మీ జీవిత భాగస్వామి పట్ల మీ బాధ్యతలు పూర్తి చేసేట్లుగా చూసుకోండి.

పిల్లలతో వివాహితులు

మీ జీవిత భాగస్వామికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడంతో పాటుగా, మీ పిల్లలపట్ల శ్రద్ధ తీసుకోవడం, వారి చదువులకు చెల్లించడం, మరియు వారికి పెళ్ళిళ్ళు చేయడం వంటి అదనపు బాధ్యతలు మీకు ఉంటాయి.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అవధి వర్తింపు మీపై ఆధారపడిన వారికి మద్దతు ఇస్తుంది మరియు మీరు వెళ్ళిపోయిన తర్వాత సైతమూ వారి జీవనశైలి నిర్వహణకు సహాయపడుతుంది.

 

నాకు ఎంతమొత్తం టర్మ్ కవరేజ్ కావలసి ఉంటుంది?


హామీ ఇవ్వబడే ఒక మొత్తము రు.50,00,000 సరిపోతుందా లేదా మీరు రు.1 కోటి అవధి ప్లాను కొరకు ఎంచుకోవాల్సి ఉంటుందా?మీ అవధి ప్లానులో హామీ ఇవ్వబడే మొత్తము, మీ ప్రస్తుత వార్షిక ఆదాయములో మీకు ఉన్న అప్పులు మరియు బకాయీ మొత్తాలు మరియు చెల్లించాల్సిన బాధ్యతలను పరిగణనలోనికి తీసుకున్న తర్వాత మిగిలే మొత్తానికి కనీసం 10-20x ఉండాలనేది ఒక ప్రధాన నియమంగా ఉండాలి.

కాబట్టి, మీ వార్షిక ఆదాయము సుమారుగా రు.10 లక్షలుగా ఉంటే, మీరు తప్పనిసరిగా రు.1 కోటి లేదా అంతకు మించిన అవధి ప్లాన్ కొనాలి.తరచుగా, వ్యక్తులు ప్రక్రియను వెనక్కి జరుపుతుంటారు మరియు స్థోమతకు తగిన ప్రీమియం ఉండే బీమా మొత్తముతో వెళతారు.అయినప్పటికీ, మీకు ఎంత అవధి వర్తింపు అవసరము అని లెక్కించడానికి ఇది సరియైన పద్ధతి కాదు.ఒక సమంజసమైన మనస్సుతో, మీ భవిష్యత్ ఖర్చులు, ద్రవ్యోల్బణం, మరియు ఆధారపడిన వారి గురించి ఆలోచించండి.

మీ పరిగణనలు అన్నీ వీటిని కూడి ఉండాలి:

  • మీ కుటుంబం కోసం జీవన ప్రమాణమును నిర్వహించుకొనుట
  • లోన్‌లు మరియు అప్పుల తిరిగి చెల్లింపు
  • భవిష్యత్తులో ఖర్చులు—పిల్లల చదువు, వివాహం మొ.
  • భవిష్యత్తులో చేయాల్సియున్న పెట్టుబడులు
  • ద్రవ్యోల్బణం

 

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అవధి బీమా కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?


ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అవధి బీమా పాలసీలలో ఏ భారతీయ పౌరుడైనా తాను ఈ క్రింది ప్రాథమిక అర్హతా ప్రాతిపదికలను నెరవేర్చినంత వరకూ బీమా చేయించుకోవచ్చు:

  • దరఖాస్తుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు
  • దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు
  • ప్లాన్ యొక్క ఆఖరునాటికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
  • హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు.1,00,000; మరియు గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తము రు.50,00,00,000

 

అవధి బీమా ధరలను ప్రభావితం చేసే అంశాలు ఏవేవి?


మీరు చెల్లించే ప్రీమియం మొత్తము దీనిపై ఆధారపడి ఉంటుంది:

వయస్సు

జీవితంలో సాధ్యమైనంత త్వరగా ఒక అవధి ప్లాన్ కొనుగోలు చేయండి.జీవన్మరణ పరిస్థితులతో అనారోగ్యం బారిన పడే అవకాశం చిన్నవాళ్ళకు తక్కువగా ఉంటుంది.పైపెచ్చు, చిన్నవాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళ కంటే ఎక్కువ ప్రీమియములు చెల్లిస్తారు.అంటే దీని అర్థం, అవధి పాలసీని కొన్నప్పుడు మీరు ఎంత చిన్నవాళ్ళయితే మీ ప్రీమియం మొత్తము అంత తక్కువగా ఉంటుంది.

జెండర్

పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధన అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, పురుషులతో పోలిస్తే దీర్ఘకాలములో మహిళలు ఎక్కువ ప్రీమియములు చెల్లించే సాధ్యత ఎక్కువగా ఉంది, మరి అందువల్ల పోల్చి చూస్తే మహిళలు తక్కువ ప్రీమియములు చెల్లిస్తారు.

వ్యక్తిగత మరియు కుటుంబ వైద్య చరిత్ర

మీ అవధి బీమా ప్రీమియం ధరలను లెక్క కట్టడంలో మీ వైద్య చరిత్ర నిస్సందేహంగా ఒక పెద్ద పాత్రను పోషిస్తుంది.కుటుంబములో క్యాన్సర్ లేదా గుండె సంబంధిత వ్యాధుల యొక్క చరిత్ర మీ బీమా ధరలను పెంచే అవకాశం ఉంటుంది.అదేవిధంగా, ఒకవేళ మీకు ముందస్తుగా ఉన్న అధిక- ముప్పు ఆరోగ్య పరిస్థితులు ఉంటే, అది మీ ప్రీమియం ధరలపై భారం వేస్తుంది.

పొగత్రాగే అలవాట్లు

ప్రాథమిక పరిగణనల్లో మీరు పొగత్రాగేవారా కాదా అనేది ఒకటి.గడచిన సంవత్సరంలో మీరు అస్సలు పొగత్రాగకుండా ఉంటే, పొగత్రాగని వ్యక్తిగా మిమ్మల్ని మీరు ప్రకటించుకోవచ్చు.పొగత్రాగని వారికి ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అవధి వర్తింపు ఎలా పని చేస్తుంది?

    ఒక అవధి జీవిత వర్తింపు అనేది, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అతి సులువైన మరియు అత్యంత నేరుగా ఉండే జీవిత బీమా ఉత్పాదన. ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అనేది, అనుసంధానించబడని మరియు పాల్గొనని ఒక సంపూర్ణమైన అవధి బీమా ప్లాన్.అటువంటి ఒక సంపూర్ణ రక్షణ ప్లాన్ లో, అవది పాలసీచే వర్తింపు చేయబడే వ్యవధిలో పాలసీదారు గనక మరణించిన పక్షములో ఒక ఏకమొత్తపు చెల్లింపు చేయబడుతుంది.పాలసీ అవధి సందర్భంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క అకాలమరణం సంభవించిన పక్షంలో, నామినీలు ఏకమొత్తంగా మరణ ప్రయోజనాన్ని పొందుతారు.

  • అవధి ప్లాన్—ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ యొక్క 3 అత్యంత ఉన్నత ప్రయోజనాలు ఏవేవి?

    ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ 3 ప్రయోజనావకాశాలను అందిస్తుంది:

    • ఒక సంపూర్ణ రక్షణ ప్లాన్ స్థోమతకు తగ్గట్టుగా ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీకు స్థోమతకు తగిన ధరలతో ఒక అధిక బీమా వర్తింపును అందజేస్తుంది.ఉదాహరణకు, ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ తో మీరు కేవలం నెలకు రు. ___* చెల్లింపుతో రు. 1 కోటి జీవిత బీమా అవది వర్తింపును పొందగలుగుతారు.
    • చెల్లించిన ప్రీమియములపై మీరు ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 80 సి క్రింద మీరు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
    • • అవధి బీమా పాలసీల నుండి వచ్చే రాబడులు/ మరణ ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 10 (10 డి) క్రింద పన్ను మినహాయింపు పొందుతాయి.

  • టర్మ్ కవర్ ని కొనడం ఎందుకు ముఖ్యము?

    మీ పరోక్షములో సైతమూ మీ కుటుంబం/ ఆధారపడిన వారి ఆర్థిక భద్రతను రక్షించి మరియు నిర్ధారించుకోవడానికి అవధి బీమాను కొనండి. నేడు, వారి ఆర్థిక భద్రత మీచే హామీ ఇవ్వబడుతుంది— మీరు వారి జీవన ప్రమాణం పట్ల శ్రద్ధ వహిస్తారు, వారి చదువు మరియు పెళ్ళికి ఆర్థికతోడ్పాటు ఇస్తారు, మరియు వారికి రక్షణ కల్పించినట్లు తెలుసుకోవడంతో కలిగే మనశ్శాంతిని వారికి అందిస్తారు.

    ఒకవేళ మీరు ఒక అవధి వర్తింపును కొంటే, కవరేజీ వ్యవధిలో అకాల మరణము మీ కుటుంబం యొక్క జీవన ప్రమాణాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు, ఎందుకంటే వారు మరణ ప్రయోజనముగా ఒక గణనీయమైన బీమా చేయబడిన మొత్తం అందుకుంటారు.ఈ ఏకమొత్తమును బాధ్యతలను తీర్చుకోవడానికై చెల్లింపులకు మరియు మీ పరోక్షంలో జీవన ఖర్చులను చేపట్టడానికి ఉపయోగించుకోవచ్చు.

  • ఒకవేళ మీకు 30 సంవత్సరాల వయసు ఉండి మీ వార్షిక ఆదాయం రు. 5 లక్షలు అయితే, మీరు ఎంత అవధి వర్తింపును కొనాల్సి ఉంటుంది?

    మీరు ఎంచుకునే బీమా చేయబడు అవధి వర్తింపు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.ముఖ్యంగా, రిటైర్‌మెంట్ యొక్క వయస్సు సుమారు 60 సంవత్సరాలు.30 సంవత్సరాల వయస్సులో, మీకు సుమారుగా 30 సంవత్సరాల సంపాదన జీవితం మిగిలి ఉంటుంది.అనేక ఉద్యోగాలలో, మీరు ప్రతి రెండు సంవత్సరాలకూ జీవన ప్రమాణములో ఒక పెరుగుదల మరియు తత్ఫలితమైన మార్పును ఆశించవచ్చు.అదనపు కర్తవ్య బాధ్యతలు మరియు ద్రవ్యోల్బణాన్ని పరిగణించుకొని మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-20x అవధి వర్తింపును కొనాల్సిందిగా సిఫార్సు చేయబడుతుంది.ఈ ఉదంతములో కారణమయ్యే అంశాలకు గాను, రు.1 కోటి అవధి బీమా పాలసీ మీ అవసరాలకు తగినంతగా సరిపోతుంది.

  • మా కంపెనీ ఇదివరకే నాకు వర్తింపును ఇచ్చింది, నేను విడిగా ఒక అవధి ప్లాన్ ఎందుకు కొనాలి?

    ఒక కంపెనీ కవర్ చేయడమనేది గొప్పగా అనిపించవచ్చు, అది నిజంగా తగినంత మంచిదేనా?అనేకమంది యజమానులు సుమారుగా ఉద్యోగి యొక్క వార్షిక ఆదాయానికి సమానమైన కవరేజ్ అందిస్తున్నారని పరిశోధన తెలియజేస్తోంది.జీవితబీమా పొందబడిన వ్యక్తి యొక్క అకాలమరణం సంభవించిన పక్షములో మీ కుటుంబము/ఆధారపడిన వారి అవసరాలను తీర్చడానికి అది సరిపోదు.కంపెనీలో మీరు ఉద్యోగిగా నిలిచి ఉన్నంత వరకు మాత్రమే చెల్లుబాటులో ఉండడమనేది కంపెనీ వర్తింపు యొక్క మరో పరిమితి.

    ఒకవేళ మీరు వదిలేసినా, తొలగించబడినా, లేదా స్వేచ్ఛగా ఉండాలని నిర్ణయించుకున్నా, లేదా కంపెనీ తనకు తాను మూతపడినా, మీకు చివరికి ఎటువంటి బీమా వర్తింపు ఉండనే ఉండదు.అదే సమయములో, సంవత్సరాలు గడచిపోతాయి మరియు అవది ప్లానుల యొక్క ఖరీదు మీ వయస్సు కారణంగా చాలా ఎక్కువ అయిపోతుంది.మీకు కంపెనీ కవర్ ఉన్నా లేకపోయినా మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును సుస్థిరం చేసుకోండి.

  • కవర్ చేయబడే అవధి పూర్తయ్యేవరకూ పాలసీదారు గనక జీవించి ఉంటే ఏమి జరుగుతుంది?

    ఒక సంపూర్ణ రక్షణ ప్లాను ఒక నిర్దిష్ట అవధి కొరకు మీచే చెల్లించబడే ఒక నిర్ధారిత ప్రీమియం స్థానములో మీకు బీమా చేస్తుంది. ఈ అవధిలో బీమా చేయబడిన వ్యక్తి యొక్క మరణం సంభవించిన పక్షంలో, నామినీలచే మరణ ప్రయోజనాలు అందుకోబడతాయి.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ యొక్క పాలసీ అవధి పూర్తయ్యే వరకూ బీమా చేయబడిన వ్యక్తి జీవించియున్న పక్షంలో, బీమా చేయబడిన వ్యక్తికి లేదా నామినీలకు ఎటువంటి చెల్లింపులూ అందవు.

  • ఒకవేళ నేను అప్పుడప్పుడూ పొగత్రాగుతూ ఉంటే, నేను పొగాకు వాడుకదారుగా ప్రకటించుకోవాల్సి ఉంటుందా?

    అవును.ఒకవేళ మీరు గత 12 నెలల్లో నికొటిన్ వాడి ఉంటే, మీకు మీరుగా ఒక పొగాకు వాడుకదారుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది.ఈ సమాచారమును నిలిపి ఉంచుకోవడం అనేది, తర్వాతి దశలో క్లెయిం పరిష్కారానికి ఇబ్బందికరం కావచ్చు.

  • అవధి జీవిత బీమా ప్రీమియం మొత్తాలను నిర్ణయించడంలో పొగత్రాగే అలవాటు ఒక అంశముగా ఎందుకు అవుతుంది?

    ప్రపంచవ్యాప్తంగా పొగ త్రాగే వారికంటే పొగ త్రాగనివారు ఎక్కువ జీవితకాలమును కలిగి ఉంటారని పరిశోధన తెలియజేస్తోంది కాబట్టి అవధి ప్లాన్ ప్రీమియం మొత్తాలను నిర్ణయించడంలో నికొటిన్ వాడకము అనేది ఒక సంబంధిత అంశము అవుతుంది.పొగత్రాగే ఒక వ్యక్తిని కవర్ చేసేటప్పుడు, బీమాదారు ఎక్కువ శ్రమ తీసుకుంటారు, మరి అందువల్ల, పొగ త్రాగేవారు చెల్లించే ప్రీమియములు పొగత్రాగని వారు చెల్లించే వాటికంటే ఎక్కువగా ఉంటాయి.

  • నేను అవధి బీమాను ఎప్పుడు కొనాలి?

    సాధ్యమైనంత త్వరగా.అవధి బీమాను కొనుగోలు చేసే అత్యుత్తమ సమయం ఇదే.ఒక అవధి ప్లాన్ కొనేటప్పుడు మీరు ఎంత చిన్నవారైతే, అంత చిన్న ప్రీమియం ధర మీకు ఉండే అవకాశముంటుంది.

  • ప్రీమియం మొత్తము కాలముతో మారుతుందా?

    అది మీరు కొనే అవధి ప్లాన్ యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ విషయంలో, ప్రాథమ్య వ్యయాలు, అవసరాలు, ప్రీమియం ధరలు, భరోసా ఇవ్వబడే మొత్తం, మరియు కవరేజ్ పరిమితులు అవధి పాలసీ యొక్క కాలవ్యవధి వరకూ మారకుండా ఉంటాయి.

  • ఒకవేళ ఒక ప్రీమియం చెల్లించకపోతే ఏమి జరుగుతుంది?

    ఒకవేళ మీరు మీ ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ పై ఒక ప్రీమియం తప్పినట్లయితే, అర్ధ సంవత్సర మరియు సంవత్సర ప్రీమియం రూపాలపై మీకు 30 రోజులు మరియు నెలవారీ ప్రీమియం రూపాలపై 15 రోజుల కరుణా వ్యవధి ఉంటుంది; కరుణావ్యవధి, ప్రీమియం చెల్లింపు యొక్క గడువుతేదీ నుండి ప్రారంభమవుతుంది.కరుణావ్యవధి సందర్భంగా మీ ప్లాన్ ప్రయోజనాలు కొనసాగుతాయి కాబట్టి, ఆ వ్యవధికి ముందుగానే మీరు ప్రీమియం చెల్లించకపోతే జీవిత వర్తింపు రద్దు అవుతుంది.దీని తదనంతరం, ప్లాన్ ముగిసిపోయినట్లుగా(ల్యాప్స్) పరిగణించబడుతుంది.

  • ఒక అవధి ప్లాన్ ల్యాప్స్ అయినప్పుడు ఏమి జరుగుతుంది?

    ఒక ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ కొరకు, ల్యాప్స్ అయిన అవధి పాలసీని పునరుద్ధరించుకోవడానికి మీకు ఐదు సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది.చెల్లించకుండా మిగిలిపోయి ఉన్న ప్రీమియముల మొత్తాన్ని వడ్డీ లేకుండా చెల్లించడం మరియు అక్కడి నుండి క్రమం తప్పకుండా ప్రీమియముల చెల్లింపు ద్వారా ప్లాన్ ని పునరుద్ధరించుకోవచ్చు.మీరు కొన్ని వైద్య మరియు ఆర్థిక ఆవశ్యకతలను తీర్చడంపై పునరుద్ధరణ ఆధారపడి ఉంటుంది.

  • నేను రెండు టర్మ్ బీమా ప్లానులను కలిగి ఉండవచ్చునా?

    మీ బీమా అవసరాలు తీర్చడానికి మరియు మీరు లేనప్పుడు మీ కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రతను చూసుకోవడానికి అవధి ప్లానులు రూపొందించబడ్డాయి.మీకు ఇష్టమైతే మీరు అవధి ప్లానులను గుణకాలలో కొనుగోలు చేయవచ్చు.వేర్వేరు పాలసీలకు వేర్వేరు లబ్దిదారులు/నామినీలను జోడించడానికి కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు.

  • ఒక అవధి బీమా ఎలా ప్రక్రియ జరుపబడుతుంది?

    పాలసీదారు లేదా జీవితబీమా చేయబడిన వ్యక్తి గనక పాలసీ కాల వ్యవధిలో మరణించినప్పుడు ఒక అవధి జీవిత బీమా క్లెయిము చేయబడుతుంది.ఈ సమయములో, బీమాదారుకు తెలియజేయాల్సి ఉంటుంది, తద్వారా మరణ ప్రయోజన చెల్లింపు యొక్క ప్రక్రియ త్వరగా మొదలుపెట్టబడుతుంది.

  • ఒక అవధి జీవిత క్లెయిము తిరస్కరించబడటానికి ఏది కారణం కావచ్చు?

    ఒకవేళ మీరు మోసము, వాస్తవ సమాచారమును తప్పుగా ఇవ్వడం, లేదా సరైన సమాచారము ఇవ్వడంలో విఫలం కావడం వంటి వాటికి పాల్పడినట్లయితే, మీ క్లెయిము తిరస్కరించబడవచ్చు.

  • ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అవధి వర్తింపులో ఏయే చెల్లింపు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?

    వర్తింపు అవధి సందర్భంగా జీవిత బీమా చేయబడిన వ్యక్తి అకాల మరణము యొక్క దురదృష్టకరమైన సంఘటనలో, నామినీ ఏకమొత్తంగా హామీ ఇవ్వబడిన మొత్తానికి సమాన మొత్తాన్ని అందుకుంటారు.నామినీ (ల) కు చెల్లించబడే మరణ ప్రయోజనము ఏ సమయంలో అయినా చెల్లించిన ప్రీమియములన్నింటి యొక్క 105% కంటే ఎక్కువగా ఉంటుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ పన్ను ప్రయోజనాలను అందించగలుగుతుందా?

    చెల్లించిన ప్రీమియములు మరియు అందుకున్న ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము మీరు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి.

  • ఆత్మహత్య వల్ల మరణము ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ లో చేర్చబడి ఉంటుందా?

    ఆత్మహత్యచే మరణం విషయములో అనేక అవధి ప్లానులు కవరేజీని పూర్తిగా రద్దు చేస్తాయి.ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ యొక్క పాలసీ షరతుల క్రింద, పాలసీ అమలో ఉన్నంత కాలమూ, ఆత్మహత్య కారణంగా మరణం సంభవించినప్పటికీ చెల్లింపు బాకీపడే ఉంటుంది.పాలసీ ప్రారంభము/పునరుద్ధరణ జరిగిన 12 నెలలలోగా మరణం సంభవించినట్లయితే, మరణం నాటివరకూ చెల్లించబడిన మొత్తం ప్రీమియములలో కనీసం 80% లేదా మరణం తేదీ నాటికి అందుబాటులో ఉండే సరెండర్ విలువ ఏది ఎక్కువ ఉంటే అది, పాలసీ అమలులో ఉంటే మాత్రం, లబ్దిదారుకు అర్హత కల్పించబడుతుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ ని నేను ఏ వయస్సులో ప్రారంభించవచ్చు?

    మీరు ఈ ప్లాన్ ను 18 సంవత్సరాల వయస్సులో మొదలు పెట్టవచ్చు.అయినప్పటికీ, మీరు అవధి ప్లాన్ కొనే నాటికి మీ వయస్సు మీ గత పుట్టినరోజు నాటికి 60 సంవత్సరాలు దాటి ఉండకూడదు.

  • జీవితబీమా చేయబడిన వ్యక్తి యొక్క మరణం జరిగిన ఉదంతములో కుటుంబానికి ఎంత డబ్బు వస్తుంది?

    జీవితబీమా చేయబడిన వ్యక్తి యొక్క మరణం జరిగిన పక్షములో, పాలసీదారు యొక్క కుటుంబము పాలసీ పత్రాలలో పేర్కొనబడిన ఒక ఏకమొత్తాన్ని అందుకుంటుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ ఒక సింగిల్ ప్రీమియం ఆప్షన్ కలిగి ఉంటుందా?

    ఔను, ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ రెండు విధాల ప్రీమియం చెల్లింపు రూపాలను ఇస్తుంది.మీరు క్రమం తప్పని ప్రీమియముల చెల్లింపును (నెలవారీ, అర్ధ-సంవత్సర, సంవత్సరం వారీ) లేదా ఏకైక ప్రీమియం చెల్లింపు (ఒకసారి చెల్లింపు మాత్రమే)ను, మీకు ఏది సౌకర్యమో దానిని బట్టి ఎంచుకోవచ్చు.

  • ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ క్రింద నేను ఒక లోన్ తీసుకోవచ్చా?

    ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ అనేది అంకితమైన ఉద్దేశ్యముతో ఒక సంపూర్ణ రక్షణ కల్పించే ప్లాన్—పాలసీదారు యొక్క అకాల మరణం సంభవించిన పక్షములో మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను చూసుకోవడానికి.ఈ ప్లాన్ క్రింద లోన్ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.

  • అవధి బీమా ఒక పెట్టుబడియా లేదా ఖర్చుగా ఉంటుందా?

    మీ కుటుంబము యొక్క ఆర్థిక భవిష్యత్తు కోసం ఒక అవధి వర్తింపు కొనండి. ఒక ఘనమైన అవధి ప్లాను మీపై ఆధారపడియున్న వారికి ఒక భద్రతా వలయము, మరియు మీకు సంబంధించి ఒక తెలివైన నిర్ణయము.పాలసీదారు గనక పాలసీ యొక్క అవధి కాలములో ఏ సమయములోనైనా అకాల మరణం చెందిన పక్షములో, పాలసీని అమలులో ఉంచినంత కాలమూ ఒక అవధి ప్లాను భరోసా ఇవ్వబడిన ఒక చెల్లింపును వాగ్దానం చేస్తుంది.

ఉత్పత్తుల బ్రోచర్

Download Brochure File

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ఈ ఉత్పత్తి మీకు ఎలా సహాయపడుతుందనే దానిపై మరిన్ని వివరాలు కావాలి

మా ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ కాల్ బ్యాక్

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK