ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్
మీకు మీరుగా ఒక ప్రాధాన్యత చేసుకోండి. మీ స్వప్నాలపై ఒక జల్లు విరజిమ్మండి.
GET A QUOTE
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది బీమా రక్షణ మరియు సంపద స్రుష్టి యొక్క ప్రయోజనాలను సమ్మిళితం చేస్తుంది. మీరు తీసుకునే రిస్కును బట్టి, విభిన్న ఆస్తి తరగతుల్లో 4 ఫండ్స్ లో పెట్టుబడిపెట్టవచ్చు. పాక్షిక ఉపసంహరణల ద్వారా మీరు మీ డబ్బు సులభంగా పొందుతూనే మార్కెట్-లింక్డ్ పెట్టుబడుల ద్వారా మీ సంపద పోర్టుఫోలియోను నిర్మించడానికి ఈ యులిప్ పాలసీ మీకు సహాయపడుతుంది.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనడానికి కారణాలు
వివిధ నిధుల్లో పెట్టుబడులు చేయడం ద్వారా మీ పొదుపును పద్ధతి ప్రకారం వృద్ధి చేసుకోండి.
జీవితబీమా చేయబడిన వ్యక్తి యొక్క అకాల మరణము విషయములో జీవిత వర్తింపు
మీ ప్రీమియమును ఒక నిధి నుండి మరో నిధికి 'మార్చడం’ లేదా 'పంపించడం’ ద్వారా పెట్టుబడులను అనుకూలీకృతం చేసుకోండి.
ప్లాన్ యొక్క చివరి 3 సంవత్సరాలలో మీ పెట్టుబడులను ఒక లిక్విడ్ నిధి లోనికి బదిలీ చేయడం ద్వారా మీ పొదుపును సంరక్షించుకోండి.
చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు
అర్హత ప్రమాణాలు ఏమిటి?
ప్రవేశానికి కనీస వయస్సు 5 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు
పాలసీ అవధి యొక్క ఆఖరునాటికి గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు.
ప్రీమియములను నెలవారీగా, మూడునెలల వారీగా, అర్ధ సంవత్సరం మరియు సంవత్సరం వారీగా చెల్లించవచ్చు
రెగ్యులర్ ప్రీమియం క్రింద మీ పాలసీ అవధిని 10 నుండి 70 సంవత్సరాల వరకూ ఎంచుకునే అనుకూలత
సింగిల్ ప్రీమియం క్రింద మీ పాలసీ అవధిని 5 నుండి 20 సంవత్సరాల వరకూ ఎంచుకునే అనుకూలత
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్
1971 సంవత్సరంలో భారతీయ మార్కెట్ కు పరిచయం చేయబడిన యులిప్ లేదా యూనిట్-అనుసంధానిత బీమా ప్లాను, జీవిత వర్తింపును కూడా అందించే ఒక మనీ సేవింగ్స్ ప్లాన్ గా ఉంది. ప్రతి యులిప్ ఈ రెండింటినీ అందిస్తుండగా, అన్ని యులిప్ లూ ఒకే దానిని ఏర్పరచలేదు. ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అనేది, మీ జీవితానికి బీమా కల్పించబడిందనే మనశ్శాంతిని ఆస్వాదిస్తూనే, మార్కెట్ అనుసంధానిత రాబడులతో మీ ఆపత్కాల నిధిని పెంచుకోవడానికై మీకు సహాయపడేలా యులిప్ రూపకల్పన చేయబడినది.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ తో, మొదటి రోజు నుండీ పద్ధతి ప్రకారం పొదుపు చేయండి, మీ ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ వాంఛను ప్రతిబింబించే ఫండ్ ఆప్షన్లను ఎంచుకోండి, మరియు రాబోవు సంవత్సరాలలో మీ తెలివైన ఆర్థిక ప్రణాళిక యొక్క రాబడులను ప్రోగు చేసుకోండి.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అంటే ఏమిటి?
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అనేది యూనిట్-అనుసంధానిత, పాల్గొనడం లేని ఒక జీవిత బీమా ఎండోమెంట్ మనీ సేవింగ్స్ ప్లాన్ గా ఉంది. జీవిత బీమా వర్తింపు యొక్క ప్రయోజనాన్ని ఆనందించడంతో పాటుగా, ఈ మనీ సేవింగ్స్ ప్లాన్, మీ రిస్క్-వాంఛకు తగ్గట్టుగా రూపొందించబడిన నాలుగు విశిష్ట ఫండ్ ఆప్షన్ల ద్వారా మార్కెట్-అనుసంధానిత రాబడులను అందిస్తుంది.
మీరు ఏ ఫండ్ ఐచ్చికంలో మదుపు చేయాలనేది ఎంచుకోగలగడం మాత్రమే కాకుండా, రిస్కును వ్యాప్తి చేయడానికై ఈ నిధులలో ప్రతి దానికీ మీ ప్రీమియముల యొక్క ఒక శాతమును కూడా మీరు కేటాయించవచ్చు. మీకు సౌకర్యంగా ఉండే విధంగా ఫండ్స్ మధ్యన మార్పిడి మరియు మళ్ళింపు చేయడం ద్వారా మీ పొదుపును సాధ్యమైనంత ఎక్కువ చేసుకోండి.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ యొక్క ముఖ్యాంశాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ వంటి యూనిట్-అనుసంధానిత బీమా ప్లాను ఒక ప్రత్యేకమైన ఆర్థిక సాధనముగా ఉంటుంది, అది మీ మదుపు అవకాశాలను గరిష్టం చేసుకోవడానికి మరియు జీవిత వర్తింపు ఆనందించడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఒకే ఉత్పాదనలో, ఈ యులిప్ మీకు అన్ని లోకాల అత్యుత్తమతను అందిస్తుంది.
ద్వివిధ ప్రయోజనావకాశము
మీరు ఈ మనీ సేవింగ్స్ ప్లాన్ లో మదుపు చేసేటప్పుడు, ప్రీమియం యొక్క ఒక భాగము జీవిత బీమా వర్తింపును చెల్లించు దిశగా మళ్ళించబడుతుంది. మిగిలిన ప్రీమియము విభిన్న ఫండ్ ఐచ్చికాలలో మదుపు చేయబడుతుంది, కాబట్టి మీరు ఆర్థిక లాభాలను ప్రోగు చేసుకోవచ్చు. ఈ విధంగా, ఏదైనా దురదృష్టకర సంఘటనలో మీ జీవితం ఎంత వర్తింపుకు ఉన్నదో తెలుసుకొని మనశ్శాంతిని ఆనందిస్తూనే, మీరు పద్ధతి ప్రకారంగా భవిష్యత్తు కొరకు ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవచ్చు.
ఫండ్ ఆప్షన్లు
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ తో, మీకు అందుబాటులో ఉండే బహుళమైన ఫండ్ ఆప్షన్లను ఉపయోగించి మీరు పద్ధతి ప్రకారం మీ పొదుపును వృద్ధి చేసుకోవచ్చు. ఈ మనీ సేవింగ్స్ ప్లాన్ క్రింద, పాలసీదారు మదుపు చేయడానికి గాను నాలుగు యూనిట్-అనుసంధానిత నిధుల మధ్య ఎంపిక చేసుకోవచ్చు. ప్రతీ ఫండ్ ఐచ్ఛికం విభిన్న స్థాయిల రిస్కులు మరియు రాబడులను కలిగి ఉంటుంది.
దీర్ఘకాలానికి మదుపు చేసినప్పుడు మీ నిధులను ఈక్విటీ సాధనాలలో ఉంచడం ద్వారా ఈక్విటీ1 ఫండ్ రాబడి యొక్క అధిక వాస్తవ రేటును అందిస్తుంది. ప్రత్యేకించి స్వల్ప కాల వ్యవధిలో, ప్రతికూల రాబడుల యొక్క అధిక సంభావ్యత ఉంటుంది. ఈ ఫండ్ లో, మీ మదుపు యొక్క 80-100% ఈక్విటీ ఫండ్స్ వైపుకు మళ్ళించబడుతుంది కాగా మిగిలిన 0-20% మనీ మార్కెట్ లో ఉంచబడుతుంది.
డెట్1 ఫండ్ దీర్ఘకాలములో ద్రవ్యోల్బణం రేటును అధిగమించేలా ఆశించబడుతున్న రాబడులను అందిస్తుంది. స్వల్ప కాల వ్యవధిలో, ఈ మధ్యస్థ-రిస్క్ ప్రొఫైల్ ఫండ్ ఆప్షన్ ప్రతికూల రాబడుల యొక్క తక్కువ సంభావ్యతను ప్రదర్శిస్తుంది. ఈ ఫండ్ లో మీ మదుపు యొక్క 70-100% డెట్ ఆస్తులలో ఉంచబడుతుంది, కాగా 0-30% మనీ మార్కెట్ కు కేటాయించబడుతుంది.
బ్యాలన్స్డ్1 ఫండ్ ఒక మధ్యస్థ రిస్క్ ప్రొఫైలును అందిస్తుంది, అందులో 50-70% నిధులు ఈక్విటీ ఫండ్స్ లో, 30-50% డెట్ లో, మరియు 0-20% మనీ మార్కెట్ లో ఉంచబడతాయి. దీర్ఘ కాలములో మీ ఆపత్కాల నిధి ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రూపకల్పన చేయబడిన ఈ ఫండ్, స్వల్ప కాలావధిలో ఒక మోస్తరు ప్రతికూల రాబడుల సంభావ్యతను ప్రదర్శిస్తుంది.
ఈక్విటీ వాటాలలో అధిక భాగమును మదుపు చేయడం ద్వారా వాల్యూ ఫండ్ దీర్ఘకాలములో మధ్యస్థం నుండి అధిక స్థాయి వాస్తవ రాబడుల రేటును అందిస్తుంది, అవి దీర్ఘ-కాలిక క్యాపిటల్ ప్రశంసను అందించేలా ఆశించబడుతుంది. ఈ ఫండ్ లో 70-100% ఆస్తులు ఈక్విటీ ఫండ్స్ కు కేటాయించబడతాయి, కాగా మిగిలిన 0-30% మనీ మార్కెట్ కు మళ్ళించబడుతుంది. స్వల్ప కాల వ్యవధిలో, వాల్యూ ఫండ్ ప్రతికూల రాబడుల యొక్క అధిక సంభావ్యతను ప్రదర్శిస్తుంది.
మీ ఫండ్ విలువను రక్షించుకోండి
ఈ డబ్బు పొదుపు ప్లాన్ యొక్క ఆఖరి మూడు సంవత్సరాలలో, పాలసీదారు తన నిధులను ఒక లిక్విడ్1 ఫండ్ కు బదిలీ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా, మీరు మార్కెట్ సంబంధిత హెచ్చు తగ్గుల నుండి మీ ప్రస్తుత ఫండ్ విలువను రక్షించుకోవచ్చు. ఒకవేళ దాని కొరకు ఎంచుకుంటే, పాలసీ అవధి ముగియడానికి ముందు ఆఖరి ముప్ఫై-ఆరు నెలసరి దినాలు ప్రతి దాంట్లోనూ ప్రతి పాలసీ ఫండ్ లో మీ ఫండ్ విలువ యొక్క 3% ఆటోమేటిక్ గా లిక్విడ్1 ఫండ్ కు మార్పిడి చేయబడుతుంది.
అనుకూలమైన ప్రీమియం చెల్లింపు రూపములు
రెగ్యులర్ ప్రీమియములు, పరిమిత ప్రీమియములు, లేదా ఒక సింగిల్, ఏక-సమయపు చెల్లింపును చెల్లించడానికి ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ మీకు వీలు కలిగిస్తుంది. రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం రూపములో, మీరు నెలవారీగా, అర్ధ-సంవత్సరం వారీగా, మరియు సంవత్సరం వారీగా చెల్లింపులు చేయవచ్చు. సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఒకే ఒక్క-సమయం చెల్లింపును మాత్రమే అనుమతిస్తుంది.
ఈ మనీ సేవింగ్స్ ప్లాన్ కొరకు, రెగ్యులర్ మోడ్ లో కనీస ప్రీమియం నెలకు రు.1,000 లు, అర్ధ-సంవత్సరానికి రు.6,000 లేదా సంవత్సరానికి రు. 12,000 లుగా ఉంటుంది. పరిమిత ప్రీమియం మోడ్ లో, కనీస ప్రీమియం నెలకు రు.1,250 లు, అర్ధ-సంవత్సరానికి రు.7,500 లేదా సంవత్సరానికి రు. 15,000 లుగా ఉంటుంది. సింగిల్ ప్రీమియం మోడ్ కనీసం రు.45,000 ల ఒక్క-సమయం చెల్లింపును అనుమతిస్తుంది. పూచీకత్తుకు లోబడి ఎటువంటి గరిష్ట పరిమితీ లేదు.
పాక్షిక విత్‌డ్రాయల్ నిబంధన
ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉన్న పక్షములో, లాక్-ఇన్ వ్యవధి పూర్తయిన తర్వాత పాక్షిక ఉపసంహరణల ద్వారా మీ డబ్బును ప్రాప్యత చేసుకోండి. పాక్షిక ఉపసంహరణ ఛార్జీలు ఏవీ వర్తించవు.
ఆన్‌లైన్ కొనుగోలు
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ తో, బ్రాంచ్ ని సందర్శించడానికి గానీ లేదా ఒక ఏజెంటును కలుసుకోవడానికి గానీ మీరు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు పొదుపు ప్లాన్ యొక్క కొనుగోలు మరియు ప్రారంభ ప్రక్రియను మీ సౌకర్యం మేరకు మీ ఇంటిలో నుండే ఆన్‌లైన్ రూపము గుండా పూర్తి చేయవచ్చు.
పన్ను ప్రయోజనాలు
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ లో మీరు మదుపు చేసినప్పుడు వర్తించు చట్టాల క్రింద పన్ను ప్రయోజనాలు మరియు మినహాయింపులను ప్రోగు చేసుకోండి. పాలసీదారులు తాము చెల్లించిన ప్రీమియములపై మరియు ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద అందుకున్న మెచ్యూరిటీ/ మరణ ప్రయోజనాలపై సెక్షన్ 80 సి క్రింద పన్ను ప్రయోజనాలు మరియు మినహాయింపులను క్లెయిము చేసుకోవచ్చు.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ కొనడం వల్ల ప్రయోజనాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అనేది ఎవ్వరి ఆర్థిక విభాగానికైనా ఒక విలువైన జోడింపు. ఒక యూనిట్-అనుసంధానిత పాలసీగా, ఈ మనీ సేవింగ్స్ ప్లాన్, బీమా మరియు మదుపు యొక్క రెండు ప్రయోజనాలనూ అందిస్తుంది. ఒక గణనీయమైన ఆపత్కాల నిధిని నిర్మించుకోవాలని మీరు ఆశించడం మాత్రమే కాకుండా, ఈ మనీ సేవింగ్స్ ప్లాన్ క్రింద లభించే వివిధ ఫండ్ ఐచ్ఛికాలను ఉపయోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ రిస్కును కూడా తొలగించుకోవచ్చు.
సంపూర్ణ సమత్వం
ఇతర ఇండియాఫస్ట్ లైఫ్ పాలసీల లాగానే, ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ కూడా సంపూర్ణ పారదర్శకతతో మీకు సమర్పించబడుతోంది. మీ ఆర్థికపరమైన ఆరోగ్యానికి మీరు అత్యంత తెలియజేయబడే ఎంపికలు చేసుకునేలా చూసుకోవడానికై, మీకు ప్లాన్ ఎలా పని చేస్తుంది, ఛార్జీల యొక్క నిర్మాణము, ఫండ్ మదుపు చేయు పద్ధతులు, ఆశించబడిన రాబడుల రేటు, మరియు నవ్ ట్రాకర్ అనే ప్రతీ ముఖ్యమైన వివరాలు తెలియజేయబడతాయి. వివేచన గల మదుపరులకు ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ ఒక తెలివైన పాలసీ.
మీ రిస్క్ ప్రొఫైల్ కు అనుకూలంగా తీర్చిదిద్దబడింది
క్యాపిటల్ మార్కెట్ లో మదుపు చేయడమనేది ఏ ఒక్కరి రొట్టె ముక్క కాకపోవచ్చు. అయినప్పటికీ, దీర్ఘకాలములో ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికై తగినంతగా పొదుపు మరియు మదుపు చేయాలని మీరు ఆశిస్తే, మార్కెట్ నుండి పొందగల సహాయం అంతా మీకు అవసరము.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ తో, మార్కెట్ యొక్క ఒడిదుడుకులు మరియు హెచ్చుతగ్గులపై రక్షణ పొందుతూనే పెట్టుబడి మార్కెట్ యొక్క సంపద సృష్టి ప్రయోజనాలను మీరు ఆనందిస్తారు. విభిన్న ఫండ్ ఐచ్ఛికాల మధ్యన ఫండ్ స్విచ్చింగ్ ఎంచుకోవడం ద్వారా మీ రిస్కును విస్తరింపజేయండి. ఒక నెలలో రెండు ఉచిత మార్పిడులు మరియు ప్రీమియం మళ్ళింపు సౌకర్యాలతో, మీకు ఏ మాత్రమూ అదనపు ఖర్చు లేకుండా మీరు మదుపు చేస్తున్న చోటునుండి మదుపు చేయడాన్ని వేరే చోటుకు మార్చుకోవచ్చు.
జీవిత వర్తింపు మరియు మరణ ప్రయోజనం
జీవితబీమా చేయబడిన వ్యక్తి అకాలమరణము పొందిన పక్షములో, ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాను జీవిత వర్తింపును అందిస్తుంది. రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం ప్లానుల కొరకు, కనీస భరోసా సొమ్ము వార్షికం చేయబడిన ప్రీమియముకు ఏడు రెట్లుగా ఉంటుంది. సింగిల్ ప్రీమియం పాలసీల కొరకు, కనీస భరోసా సొమ్ము సింగిల్ ప్రీఁఇయం యొక్క 125% గా ఉంటుంది.
అయినప్పటికీ, ఏ సమయములోనైనా సరే, చెల్లించిన మొత్తం ప్రీమియముల యొక్క 105% కు తక్కువగా మరణ ప్రయోజనము ఉండబోదు. ప్రీమియం చెల్లింపు రూపము మరియు పాలసీదారు యొక్క వయస్సుపై గరిష్ట భరోసా సొమ్ము ఆధారపడి ఉంటుంది.
మెచ్యూరిటీ ప్రయోజనాలు
పాలసీ అవధి యొక్క ముగింపులో, ఆ క్షణానికి ఉన్న ఫండ్ విలువను మీరు అందుకుంటారు. పాలసీదారు పూర్తి మొత్తాన్నీ ఒక ఏకమొత్తం చెల్లింపుగా స్వీకరించడానికి ఎంచుకోవచ్చు లేదా సెటిల్మెంట్ ఐచ్ఛికం ఎంచుకోవచ్చు. ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద, 5 సంవత్సరాల కాలవ్యవధి వరకూ మీరు నెలసరి వాయిదాల రూపములో మీ చెల్లింపు అందుకోవడానికి సెటిల్‌మెంట్ ఐచ్ఛికం మీకు వీలు కలిగిస్తుంది.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ మీకు ఎందుకు కావాలి?
ప్రపంచం పూర్తిగా అనిశ్చితులతో కూడినది. మీ సేవింగ్స్ ప్లాన్ ఈ రోజును సంరక్షించుకుంటూనే రేపటి కొరకు మీరు పొదుపు చేసుకోవడానికి మీకు సహాయపడాలి. ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ తో, మీరు ఈ స్వప్నాన్ని సాకారం చేసుకోగలిగిన స్థితిలో ఉంటారు.
జీవిత వర్తింపు + మదుపు
మీరు కుటుంబం యొక్క సంపాదనాపరుడైన సభ్యుడిగా మారినప్పుడు, మీరు నెరవేర్చవలసిన హక్కులు మరియు బాధ్యతలకు మీరు బాద్యులుగా ఉంటారు. మీ పరోక్షములో సైతమూ మీ కుటుంబాన్ని చూసుకునేలా చేసుకోవడం ఈ బాధ్యతలలో ఒకటి.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ కేవలం ఒక పెట్టుబడి సాధనం మాత్రమే కాదు; ఇది ఒక జీవిత బీమా ఉత్పాదన కూడా. మార్కెట్ ఒడిదుడుకుల నుండి మీ పెట్టుబడిని మరియు ఏదైనా అనూహ్య సంఘటన నుండి మీ కుటుంబ సభ్యులను రక్షించుకుంటూనే పెట్టుబడి మార్కెట్ లో మదుపు చేయడం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించండి.
ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పద్ధతి ప్రకారం పొదుపు
భారతీయులు ఒక వర్షపు రోజుకు డబ్బును కూడబెట్టుకునే అలవాటు కలిగి ఉంటారు. అయినప్పటికీ, డబ్బును ఫిక్సెడ్ డిపాజిట్ల లోనికి తోసివేయడం లేదా మీ బ్యాంక్ ఖాతాలో అలాగే ఉండేలా వదిలేయడం అనేది మీరు ఈ లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడవు. 21 వ శతాబ్దములో, కేవలం ఒక వర్షపు రోజు కొరకు పొదుపు చేసుకోవడానికి మించి మీరు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది; మీరు భవిష్యత్తు కోసం మదుపు చేయాల్సి ఉంది. ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ తో, మీరు డబ్బును పద్ధతి ప్రకారం పొదుపు చేయడం మరియు అది మీ కోసం పనిచేసేలా ఉంచుకునే అలవాటును వృద్ధి చేసుకోగలుగుతారు.
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ కొనడానికి అర్హతా ప్రాతిపదిక ఏది?
- ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద ప్రవేశానికి కనీస వయస్సు 5 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలుగా నిర్ధారించబడింది.
- మెచ్యూరిటీలో కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు 75 సంవత్సరాలుగా నిర్ధారించబడింది.
- రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికం కొరకు ఒక సమానమైన ప్రీమియం చెల్లింపు అవధితో పాలసీ అవధి 10 నుండి 70 సంవత్సరాల వరకూ పొడిగించబడుతుంది.
- ఈ మనీ సేవింగ్స్ ప్లాన్ లో పాలసీ అవధి, పరిమిత ప్రీమియం చెల్లింపుల కొరకు 5/7 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధితో 10 నుండి 25 సంవత్సరాలకు పొడిగించబడుతుంది.
- ఒక సింగిల్ ప్రీమియం ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ లో, ఒక్క సమయపు చెల్లింపు ఆప్షనుతో పాలసీ కాలావధి 5 నుండి 20 సంవత్సరాల వరకూ పొడిగించబడుతుంది.
- ప్రీమియములను నెలవారీగా, అర్ధ-సంవత్సరం వారీగా, సంవత్సరం వారీగా, లేదా ఒకే ఒక్క సింగిల్ చెల్లింపుగా చెల్లించవచ్చు.
ఉత్పత్తుల బ్రోచర్
తరచుగా అడిగే ప్రశ్నలు
-
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అంటే ఏమిటి?
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అనేది ఒక యూనిట్-అనుసంధానిత, పాల్గొనడం లేని, జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్. అది జీవిత వర్తింపు యొక్క రక్షణతో పాటుగా మార్కెట్-అనుసంధానిత రాబడులను అందజేస్తుంది. పాలసీ అవధి యొక్క ముగింపు దిశగా, మీ నిధులను తక్కువ రిస్కును అందించే లిక్విడ్1 ఫండ్ కు తరలించే ఎంపిక చేసుకోవడం ద్వారా మదుపు చేసుకుంటూనే మీరు మార్కెట్ ఒడిదుడుకులకు వ్యతిరేకంగా మీ డబ్బును సంరక్షించుకునే ఐచ్ఛికం కలిగి ఉంటారు. ఈ మనీ సేవింగ్స్ ప్లాన్ తో, మీరు పద్ధతి ప్రకారం చేసే పొదుపు, మార్కెట్- అనుసంధానిత మదుపు విలువ, మరియు ఆవశ్యక జీవిత వర్తింపును పొందుతారు.
-
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద ఫండ్ ఆప్షన్లు ఏవేవి?
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద, మీరు ఎంచుకోవడానికి నాలుగు ఫండ్ ఆప్షన్లు ఉన్నాయి. మీరు ప్రతినెలా రెండు సార్లు ఉచితంగా ఒక ఫండ్ నుండి మరోదానికి మార్పిడి చేయగలుగుతారు. మీకు కుదురుబాటు అనిపించిన విధంగా మీ ప్రీమియములను మళ్ళించండి.
- ఈక్విటీ1 ఫండ్: 80-100% ఈక్విటీ, 0-20% మనీ మార్కెట్ మదుపు—అధిక రిస్క్ ప్రొఫైల్
- బ్యాలన్స్డ్1 ఫండ్: 50-70% ఈక్విటీ, 30-50% డెట్, 0-20% మనీ మార్కెట్ మదుపు—మధ్యస్థ రిస్క్ ప్రొఫైల్
- డెట్1 ఫండ్: 70-100% డెట్, 0-30% మనీ మార్కెట్ మదుపు—మధ్యస్థ రిస్క్ ప్రొఫైల్
- వాల్యూ ఫండ్: 70-100% ఈక్విటీ, 0-30% మనీ మార్కెట్ మదుపు—అధిక రిస్క్ ప్రొఫైల్
- లిక్విడ్1 ఫండ్: 0-20% డెట్, 80-100% మనీ మార్కెట్— తక్కువ రిస్క్ ప్రొఫైల్. మీ ఫండ్ విలువను మార్కెట్ ఒడిదుడుకుల నుండి రక్షించుకోవడానికి గాను మీ పాలసీ యొక్క ఆఖరి మూడు సంవత్సరాలలో మీ డబ్బును లిక్విడ్1 ఫండ్ కు బదిలీ చేయండి.
-
నేను లిక్విడ్1 ఫండ్ ను ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు?
లిక్విడ్1 ఫండ్ ఆప్షన్ అనేది ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ యొక్క విశిష్టమైన అందజేత. ఈ ప్రత్యామ్నాయము క్రింద, పాలసీ అవధి యొక్క ఆఖరి మూడు సంవత్సరాలలో దానిని లిక్విడ్1 ఫండ్ కి తరలించడం ద్వారా మీరు మీ ఫండ్ విలువను మార్కెట్ ఒడిదుడుకుల నుండి రక్షించుకోవచ్చు. మీ పాలసీ అవధి యొక్క ముగింపుకు మూడు సంవత్సరాల ముందు ఈ ఐచ్ఛికం గురించి తదుపరి వివరాలతో మీకు జ్ఞాపకం చేయబడుతుంది.
పాలసీ అవధి ముగియడానికి ముందు ఆఖరి ముప్ఫై-ఆరు నెలసరి దినాలు ప్రతి దాంట్లోనూ ప్రతి పాలసీ ఫండ్ లో మీ ఫండ్ విలువ యొక్క 3% ఆటోమేటిక్ గా లిక్విడ్1 ఫండ్ కు మార్పిడి చేయబడుతుంది. నిధులు లిక్విడ్1 ఫండ్ కు బదిలీ చేయబడినప్పుడు, మీ మిగిలియున్న నిధులు కేటాయించబడిన నిధిలోని నిష్పత్తి ప్రభావితం కాదు.
-
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడతాయా?
ఔను, ఏదైనా ఆర్థిక అత్యవసర స్థితి ఉన్న సందర్భములో మీరు మీ నిధులను పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు. రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం పాలసీల విషయములో, మొదటి ఐదు సంవత్సరాల పాటు మీ ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ ప్రీమియములను చెల్లించియున్నంత వరకూ మీరు ఐదవ పాలసీ సంవత్సరం తర్వాత మీ డబ్బును పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు.
సింగిల్ ప్రీమియం ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ యొక్క ఉదంతములో, మీరు ఐదవ పాలసీ సంవత్సరం పూర్తయిన తర్వాత డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఒక మైనర్ పాలసీదారు విషయములో జీవిత భరోసా పొందిన వ్యక్తికి 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత పాక్షిక ఉపసంహరణ మొత్తం అనుమతించబడుతుంది.
కనీస ఉపసంహరణ పరిమితి రు.5000 లుగా ఉంటుంది. పాక్షిక ఉపసంహరణ అనంతరం మీ ఫండ్ యొక్క కనీస నిల్వ మీ వార్షిక ప్రీమియం యొక్క 110% కి సమానంగా ఉంటే మాత్రమే రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం పాలసీల కొరకు గరిష్ట ఉపసంహరణ మొత్తము ఫండ్ విలువలో 25% గా ఉంటుంది. సింగిల్ ప్రీమియం పాలసీల కొరకు గరిష్ట ఉపసంహరణ పరిమితి అనేది, రు. 45,000 కంటే తక్కువగా ఉపసంహరించుకున్న తర్వాత ఫండ్ విలువను తగ్గించని మొత్తం అయి ఉంటుంది. పాక్షిక ఉపసంహరణ ఛార్జీలు ఏవీ వర్తించవు.
-
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద ఏవైనా పన్ను ప్రయోజనాలు ఉన్నాయా?
పన్ను పొదుపు చేసుకునే మంచి సాధనాలుగా యులిప్ పాలసీలు ప్రసిధ్ధి చెందాయి. ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద, చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి.
-
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద విధించబడే ఛార్జీలు ఏవేవి?
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ అనేది జీవిత వర్తింపు, డబ్బూ పొదుపు చేసే ప్లాన్ మరియు సంపద సృష్టి యొక్క మీ అవసరాలను తీర్చడానికై రూపొందించబడిన ఒక పారదర్శకమైన యులిప్ పాలసీ. ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ తో సహ-సంబంధించిన కొన్ని నిర్ధారిత ఛార్జీలలో ఈ క్రిందివి ఉంటాయి:
- ప్రీమియం కేటాయింపు ఛార్జీ (మదుపు చేయక ముందు తగ్గించుకోబడుతుంది)
- ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీ (నవ్ లెక్కింపుకు ముందు ప్రతిరోజూ తగ్గించుకోబడుతుంది)
- ఒక పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీ (నెలవారీగా తగ్గించుకోబడుతుంది)
- మోర్టాలిటీ ఛార్జీలు (ప్రతి పాలసీ నెల యొక్క మొదటి పనిదినము నాడు యూనిట్లను రద్దు చేయడం ద్వారా మినహాయించుకోబడేవి)
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద మీరు ఉపయోగించుకునే సేవలపై ఆధారపడి వర్తించగల ఇతర ఛార్జీలలో ఇవి ఉంటాయి:
- కొనసాగడం ఆపుదల ఛార్జీ (5 వ పాలసీ సంవత్సరం నుండి ఇక ముందుకు వర్తించదు)
ఈ పాలసీ క్రింద ఎటువంటి స్విచ్చింగ్ లేదా పాక్షిక ఉపసంహరణ ఛార్జీలు ఉండవు. ఒకవేళ ఆ తర్వాత ఒక స్విచ్చింగ్ ఛార్జీని గనక ప్రవేశపెట్టినట్లయితే, అది ఐఆర్‌డిఎఐ నుండి ముందస్తు ఆమోదానికి లోబడి ఉంటుంది.
-
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ ప్రీమియములను ఒకవేళ నేను తప్పించుకుంటే ఏమి జరుగుతుంది?
అర్ధ-సంవత్సర మరియు సంవత్సరం వారీ ప్రీమియం చెల్లింపు రూపాల క్రింద అన్ని ప్రీమియములనూ చెల్లించడానికి 30 రోజుల కారుణ్య వ్యవధి ఉంటుంది మరియు ఈ మనీ సేవింగ్స్ ప్లాన్ లో నెలవారీ రూపం క్రింద 15 రోజులుగా ఉంటుంది. ఈ కాలవ్యవధి ప్రతి ప్రీమియం చెల్లింపు యొక్క గడువు తేదీ నుండి మొదలవుతుంది. ఈ కారుణ్య వ్యవధిలో మీ ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు అన్నీ కొనసాగుతాయి.
-
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ క్రింద ఒక ఫ్రీ-లుక్ వ్యవధి ఉంటుందా?
ఔను, ఒకవేళ ప్లాను యొక్క షరతులు మరియు నిబంధనలతో మీరు అంగీకరించకపోతే ఫ్రీ-లుక్ వ్యవధి లోపున మీరు బీమాదారుకు ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ ను తిరిగి ఇచ్చివేయవచ్చు. పాలసీ అందుకున్న తేదీ నుండి 15 రోజుల వరకు ఈ ఫ్రీ - లుక్ వ్యవధి నిర్ధారించబడి ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.