ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్

శాశ్వత వారసత్వా న్ని నిర్మిద్దాం

GET A QUOTE

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ జీవిత బీమా వర్తింపును మరియు సంపదను కూడగట్టుకునే ఒక అవకాశం అందించడం ద్వారా దీర్ఘకాలిక వారసత్వాన్ని ఏర్పరచుకునేలా మీకు వీలు కలిగిస్తుంది. పలురకాల పెట్టుబడివ్యూహాలు మరియు అనువైన ఐచ్ఛికాల నుండి ఎంచుకొని ఒక వ్యవస్థీకృతమైన మరియు ప్రత్యేకితమైన జీవన విభాగమును పెంపొందించుకోండి.

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్

  • ఈ యులిప్ పెట్టుబడి ప్లాన్ ద్వారా, మీరు మార్కెట్ అనుసంధానిత నిధి ఐచ్ఛికాలలో పెట్టుబడి చేస్తూ మీ డబ్బును పెంచుకోండి

  • 5 సంవత్సరాల తర్వాత ఏ సమయములోనైనా వ్యవస్థీకృతమైన పాక్షిక ఉపసంహరణ ఐచ్ఛికాన్ని ఉపయోగించి ఒక ఏకైక ప్లాన్ ద్వారా బహుళ అవసరాలను తీర్చుకోండి

  • మీ డబ్బు నుండి గరిష్ట ప్రయోజనం పొందుటకు అపరిమితమైన ఉచిత మార్పిడులను అందుబాటు చేసుకోండి

  • ప్రత్యేకమైన చేర్పు ప్రయోజనాలు - లాయల్టీ ప్రయోజనాలు, లాభాల బూస్టర్, మరియు లాయల్టీ అడ్వాంటేజ్ తో మార్కెట్ తో ఎదగడానికి మరియు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికై దీర్ఘకాలంగా మదుపు చేస్తూనే ఉండండి

  • పెరుగుతున్న అవసరాలను నిర్వహించుకొనుటలో సహాయపడేందుకు టాప్-ప్రీమియముల చెల్లింపుకు అనుకూలత

  • మీరు చెల్లించే ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలను పొందండి మరియు ప్రస్తుత ఆదాయ పన్ను చట్టాల ప్రకారం మీకు లభించే ప్రయోజనాలు

అర్హత ప్రమాణాలు ఏమిటి?

  • 5 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి అయిన పక్షములో, ప్రవేశానికి కనీస వయస్సు 5 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు ఉండాలి. 10/15/20 సంవత్సరాల కొరకు సింగిల్, రెగ్యులర్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం అయిన పక్షములో 65 సంవత్సరాలు.

  • 5 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి అయిన పక్షములో, మెచ్యూరిటీ వద్ద కనీస వయస్సు 18 సంవత్సరాలు, కాగా మెచ్యూరిటీ వద్ద గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు ఉండాలి. 10/15/20 సంవత్సరాల కొరకు సింగిల్, రెగ్యులర్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు అయిన పక్షములో 90 సంవత్సరాలు.

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్


జీవితంలో కొంత ఎక్స్ట్రా కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ ద్వారా మీ కోసం మేము సరైన యూనిట్ లింక్డ్ బీమా ప్లాన్ రూపొందించాం- మీరు అడిగినవే కాదు, మరింత ఎక్కువ అందించే యూలిప్.

మీరు ప్రేమించే వ్యక్తుల కోసం శాశ్వతంగా నిలిచే వారసత్వాన్ని సృష్టించేందుకు సాయపడేలా ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ రూపొందించబడింది.యూలిప్ ఇన్సురెన్స్ పాలసీ రూపంలో ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ రెండు అత్యావశ్యకాలను పూర్తి చేస్తుంది – ఇది జీవిత బీమా కవర్ అందిస్తుంది, మార్కెట్ ఆధారిత ప్రగతిని అందిపుచ్చుకునేలా డబ్బును మీరు పొదుపు చేసుకొని పెట్టుబడి పెట్టే వెసులుబాటు కల్పిస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ అంటే ఏంటి?


ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ ఒక యూనిట్ లింక్డ్, పాల్గొనని పొదుపు యూలిప్. మీలాంటి గొప్ప విలువ కలిగిన వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. మీ పొదుపు మొత్తాలపై గరిష్ఠంగా రాబడి పొందేందుకు సాయపడటమే కాదు, దశాబ్దాల పాటు శాశ్వతంగా నిలిచి ఉండే సంపద వారసత్వాన్ని సృష్టిస్తుంది.

ఈ రోజు మీకు లభించే అవకాశాలు, మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్ను, మీరు ప్రేమించే వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. మీరు ఈ రోజు నుంచే సంపదను కూడబెట్టుకునేందుకు ఒక వేదికను సృష్టించేలా ఈ సంపద నిర్మాణ పాలసీ సహకరిస్తుంది. మార్కెట్ ఆదారిత రాబడి ద్వారా శాశ్వత వారసత్వాన్ని నిర్మించాలన్న మీ ఆర్థిక లక్ష్యానికి చేరువ అయ్యేలా ఈ సమగ్ర సంపద పాలసీ చూస్తుంది.

అత్యంత అనుకూలంగా మల్చుకోగల ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో మీ ఆర్థిక పోర్టుఫొలియాను పెంచేందుకు సాయపడే ఏడు విభిన్నమైన ఫండ్ ఆప్షన్లు, బహుళ పెట్టుబడి వ్యూహాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా రూపొందించిన ఈ సంపద నిర్మాణ ప్లాన్ మీరు పాలసీతో ఉండేలా చూసేందుకు తగిన రాయితీలు అందిస్తుంది. మార్కెట్ ఎదుగుతున్న కొద్ది మీ సంపద వృద్ధి చెందడాన్ని మీరు చూడవచ్చు.

ఈ సంపద పాలసీ తక్కువ ఖర్చుతో గరిష్ఠ రాబడి పొందేలా మీకు విభిన్న ఫండ్ ఆప్షన్స్ అందిస్తుంది. సమగ్ర బీమా- -పొదుపు పథకంగా ఈ ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో యూలిప్ వ్యవధి కొనసాగినంత కాలం అంతర్గతంగా లైఫ్ కవర్ ఉంటుంది కాబట్టి మీరు లేనప్పుడు మీ కుటుంబానికి సంపూర్ణ భద్రత అందిస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో ఉన్న ముఖ్యమైన అంశాలేంటి?


కుటుంబం కోసం, వారి భవిష్యత్ కోసం ఎంతో శ్రమించే మీకు భద్రత, లైఫ్ కవర్, వెసులుబాటు, ఆర్థిక పోర్టుఫొలియో వ్యూహాలు, విభిన్నమైన ఫండ్ ఆప్షన్స్ ఒకే పాలసీలో అందించే సృజనాత్మక పెట్టుబడి సాధనం కావాలి. ఇవన్నీ కలిగినదే ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్.

ఈ సంపద నిర్మాణ ప్లాన్లోని ముఖ్యమైన అంశాలు:

సమగ్ర జీవిత బీమా

కోసం నేడు, రేపు కూడా మీపైనే ఆధారపడతారు. ఈ బాధ్యతల కారణంగా మీ ఆర్థిక స్థితిగతుల్లో లైఫ్ కవర్ అన్నది ఒక విడదీయలేని భాగంగా ఉండాలి. దురదృష్టవశాత్తు మీ అకాల మరణం వంటి అనుకోని సంఘటన సంభవించింది అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో మీ బీమా పాలసీ ద్వారా వచ్చే చెల్లింపులు మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్ను పదిలపరచడమే కాదు మీరు ఏమైనా అప్పులు చేసి ఉంటే వాటిని చెల్లించడానికి ఉపయోగపడుతుంది.

యూలిప్లో రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి- బీమా కవర్, మార్కెట్ ఆధారిత రాబడి. మీరు చెల్లించే వార్షిక ప్రీమియానికి 7 రెట్లు (రెగ్యులర్, పరిమిత చెల్లింపు ఆప్షన్స్కు), సింగిల్ ప్రీమియం పాలసీలో కనీస మొత్తం హామీగా 125% లైఫ్ కవరేజ్గా ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ అందిస్తుంది.

పాలసీ, ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకునే వెసులుబాటు

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ ద్వారా మీరు చివరి అక్షరం వరకు మీరు మీ యూలిప్ను మీకు నచ్చినట్టుగా మల్చుకోవచ్చు. బహుళ పాలసీ వ్యవధులు, ప్రీమియం చెల్లింపు నిబంధనల (5/10/15/20 సంవత్సరాలు, సింగిల్ ప్రీమియం) నుంచి మీకు అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు. మీ ప్రీమియంను మీరు ఒకే దఫాలో, రెగ్యులర్, పరిమిత చెల్లింపు ఆప్షన్స్ ద్వారా చెల్ిలంచవచ్చు. అలాగే ప్రీమియం చెల్లింపులను - నెలవారీ, త్రైమాసికం, అర్థసంవత్సరం, వార్షిక వ్యవధుల్లో- మీకు అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు.

ఫండ్ ఆప్షన్స్ ఎంపిక

మరింత అవగాహనతో, ప్రభావవంతంగా ఉండేలా నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ మీకు అనేక వెసులుబాట్లు కల్పిస్తుంది. మీ అవసరాన్ని బట్టి ఎంచుకునేందుకు 7 విభిన్న ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫండ్ ఆప్షన్స్లో ఈక్విటీ1, డెట్1, బ్యాలెన్స్డ్1, వ్యాల్యూ, ఇండెక్స్ ట్రాకర్, డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్, ఈక్విటీ ఎలైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతీ ఫండ్కు రిస్క్-రాబడి నిష్పత్తి ఉంటుంది, దానిని బట్టి మీ డబ్బుకు తగిన విలువ లభిస్తుందని భావించే వాటికి మీ ప్రీమియం మొత్తాన్ని కేటాయించవచ్చు.

బహుళ పెట్టుబడి వ్యూహాలు

మీ రాబడిని పరిఫుష్ఠం చేసుకునేందుకు సరైన ఫండ్ను ఎంచుకోవడం, సరైన వ్యూహంతో పెట్టుబడి పెట్టడం అవసరం. చిరకాలం నిలిచే ఉండే వారసత్వాన్ని సృష్టించేందుకు ఇండియా ఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లోని వివిధ పెట్టుబడి వ్యూహాలు మీకు సాయపడతాయి. ఆటోమ్యాటిక్ ట్రిగ్గర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ (ఎటీబీఐఎస్), ఫండ్ ట్రాన్స్ఫర్ స్ట్రాటజీ, ఏజ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వంటి నిరూపితమైన పెట్టుబడి వ్యూహాల నుంచి ఎంపిక చేసుకోండి.

ప్రత్యేకమైన యాడ్-ఆన్స్

దీర్ఘకాలం పాటు మీరు ఈ వెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో కొనసాగేందుకు ఇండియా ఫస్ట్ లైఫ్ ప్రత్యేకమైన యాడ్-ఆన్ ప్రయోజనాలు అందిస్తోంది. మార్కెట్తో మీరు ఎదుగుతున్న కొద్ది లాయల్టీ ప్రయోజనాలు, లాయల్టీ అడ్వాంటేజ్, ప్రాఫిట్ బూస్టర్స్తో మరింత అర్జించండి.

గరిష్టంగా అందించే సదుపాయాలు

అపరిమిత ఫ్రీ స్విచ్చస్ ఉపయోగించుకోండి లేదా ఈ సంపద పాలసీ ద్వారా భారతదేశంలోని సంపద బీమాలో పెట్టుబడులు పెట్టేందుకు మీ ప్రీమియం మళ్లించి మీ పెట్టుబడికి గరిష్ట లబ్ది పొందండి.

ఆన్లైన్ కొనుగోలు

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ ఒక ఆన్లైన్ వెల్త్ ప్లాన్, దీన్ని మీరు కూర్చున్న దగ్గర నుంచే సౌకర్యవంతంగా పొందవచ్చు. మీకు నచ్చిన విధంగా ఈ ఆన్లైన్ సంపద ప్లాన్ రూపొందించుకోండి, ఒక ఫండ్ ఆప్షన్ లేదా ఒక పెట్టుబడి వ్యూహాన్ని ఎంచుకోండి. ఆన్లైన్లో చెల్లింపు జరపండి. మీ డబ్బు మీ కోసం ఎలా కష్టపడుతుందో చూడండి.

పన్ను ప్రయోజనాలు

ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము మీరు చెల్లించే ప్రీమియములు అదే విధంగా మీరు అందుకునే ప్రయోజనాలపై కూడా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ మీకు ఎలా పనిచేస్తుంది?


సంపద నిర్మాణం అన్నది ఒక గందరగోళ ప్రక్రియ కాకూడదు. ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ ముఖ్యమైనవి, సూటిగా ఉండే ఎంపికలను మీకు అందిస్తుంది. తద్వారా మీరు మీ కలలు సాకారం చేసుకునేందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేయవచ్చు.

#1 దశ: మీ ప్రీమియం ఎంచుకోండి

మీ ప్రాధాన్యతలకు తగినట్టుగా ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ను మీరు రూపొందించుకోవచ్చు. ఇందులో భాగంగా మీ వార్షిక ప్రీమియం, పాలసీ వ్యవధి, ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి. రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ పే ప్లాన్లో ప్రతీ నెలా కనీస ప్రీమియం మొత్తం రూ.20,833, త్రైమాసికం రూ.62,500, అర్థసంవత్సరం రూ.1,25,000, వార్షిక ప్రీమియం రూ.2,50,000. ఈ ప్లాన్ కింద కనీస సింగిల్ ప్రీమియం మొత్తం రూ.5,00,000. గరిష్ఠ ప్రీమియం మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు కాని అది బోర్డు ఆమోదిక అండర్ రైటింగ్ ప్రక్రియకు లోబడి ఉండాలి.

#2 దశ: పాలసీ వ్యవధి, ప్రీమియ చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి

మీ అవసరాలకు అనుగుణంగా సాధారణ పాలసీ వ్యవధిని, నిర్ధిష్ట ప్రీమియం చెల్లింపును (5/10/15/20 సంవత్సరాలు లేదా ఏక మొత్తం) ఎంచుకోవచ్చు. పాలసీ చివరి 5 సంవత్సరాల వరకు టాప్ అప్ ప్రీమియం చెల్లించే వెసులుబాటును ఈ సంపద నిర్మాణ ప్లాన్ అందిస్తుంది కాబట్టి మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ప్లానును సర్దుబాటు చేసుకోవచ్చు.

#3 దశ: మీ ఫండ్/పెట్టుబడి వ్యూహం ఎంచుకోండి

ఈ సంపద నిర్మాణ పాలసీలో అందుబాటులో ఉన్న 7 ఫండ్స్ ఆప్షన్స్ నుంచి మీరు పెట్టుబడి పెట్టేందుకు ఏదైన ఎంచుకోవచ్చు. లేదా ఏదైనా ఒక పెట్టుబడి వ్యూహాన్ని ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకునేందుకు ఉన్న ఫండ్ ఆప్షన్స్:

  • ఈక్విటీ1 (80-100% ఈక్విటీ, 0-20% మనీ మార్కెట్)- అధిక రిస్క్, అధిక రాబడి
  • డెట్1 (70-100% డెట్, 0-30% మనీ మార్కెట్) — మధ్యస్థాయి రిస్క్- రాబడి
  • బ్యాలెన్స్డ్1 (50-70% ఈక్విటీ, 30-50% మనీ మార్కెట్) - ఈక్విటీ1తో పోల్చితే తక్కువ రాబడి వచ్చే అవకాశం, కాని, మధ్యస్ధాయి నుంచి అధిక రిస్క్.
  • వ్యాల్యూ(70-100% ఈక్విటీ, 0-30% మనీ మార్కెట్) - అధిక రిస్క్తో అధిక రాబడి పొందే అవకాశం
  • ఇండెక్స్ ట్రాకర్ (90-100% ఈక్విటీ, 0-10% మనీ మార్కెట్) - అధిక రిస్క్తో అధిక రాబడి పొందే అవకాశం
  • డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్ (0-80% ఈక్విటీ, డెట్, 0-40% మనీ మార్కెట్)- అధిక రిస్క్తో అధిక రాబడి పొందే అవకాశం
  • ఈక్విటీ ఇలీట్ ఆపర్చునిటీస్ (60-100% ఈక్విటీ, 0-40% మనీ మార్కెట్)- అధిక రిస్క్, అధిక రాబడి

లేదా, మీ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో నిర్దేశించే పెట్టుబడి వ్యూహాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు.

  • మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు రక్షణ కల్పిస్తుంది ఎటీబీఐఎస్ (ఆటోమ్యాటిక్ ట్రిగ్గర్-బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ). స్థిరమైన అభివృద్ధి మార్గంలో సాగేందుకు మీ సంపాదన లేదా పాజిటివ్ రాబడిని మీరు సురక్షితమైన ఫండ్ ఆప్షన్స్లోకి బదిలీ చేసుకోవచ్చు.
  • వ్యవస్థీకృతమైన ఆర్థిక పోర్టుఫోలియోను మీరు నిర్మించుకునేందుకు, మీ ప్రీమియం మొత్తాన్ని ఈక్విటీ, డెట్ మార్కెట్లో క్రమపద్ధతిలో పెట్టేందుకు, రూపాయి ఖర్చును సమానంగా ఉంచుకొని ప్రయోజనం పొందేందుకు ్టీఎస్ (ఫండ్ ట్రాన్స్ఫర్ స్ట్రాటజీ) దోహదపడుతుంది.
  • మీ వయస్సుకు తగిన రిస్క్ సామర్ధ్యాన్ని, మీ పొదుపు మొత్తంతో చక్కని-సమతుల్యమైన పోర్టుఫోలియో నిర్వహించుకునేందుకు ఎబీఐఎస్ (ఏజ్- బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ) సాయపడుతుంది.

ఒకసారి ఒక వ్యూహం మాత్రమే అమలు చేయవచ్చనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సంపద బీమా పథకంలో మీరు పెట్టుబడి వ్యూహం లేదా ఫండ్ ఆప్షన్స్ నుంచి ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి.

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కొనేందుకు కారణాలేంటి?


మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు క్రమపద్ధతిలో మీ డబ్బు పొదుపు చేసి కూడబెట్టుకునేందుకు తగిన ప్లాన్ ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్. మార్కెట్ ఆధారిత ప్రగతి ద్వారా మీ రాబడిని పెంచుకోండి. అలాగే ప్రత్యేకంగా ఉన్న యాడ్-ఆన్-బూస్టర్లు మీరు లేననప్పుడు కూడా మీ కుటుంబ అవసరాలు తీర్చే విధంగా ఉంటాయి. ఈ సంపద నిర్మాణ పాలసీలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం:

గణనీయ మ్యాచురిటీ, డెత్ ప్రయోజనాలు

ఈ సంపద పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత మ్యాచురిటీలో ఏమైన టాప్ అప్ ఫండ్ విలువ వాటితో కలిపి ఫండ్ విలుపను పాలసీదారు అందుకుంటారు. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే, మరణించిన తేదీ నాటికి ఉన్న ఫండ్ విలువతో సమానమైన మరణ ప్రయోజనం లేదా ఏక మొత్తంలో బీమా చేసిన మొత్తం లేదా 5 ఏళ్ల పాటు కొనసాగేలా ప్రతీ నెలా వాయిదా రూపంలో చెల్లింపు(సెటిల్మెంట్ పీరియడ్ ఆప్షన్) వంటి ఉంటాయి.

అదనపు బూస్టర్లు

యూలిప్ బీమా పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఉద్దేశించినవి. అవి మార్కెట్తో ముడిపడి ఉంటాయి కాబట్టి, ఎక్కువ కాలం ఉంచితే పాలసీదారుకు మంచి రాబడి అందుతుంది. పాలసీ సంబంధిత ప్రయోజనాలతో పాటు ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ మీ నిధిని మరింత పెంచేందుకు అదనపు బూస్టర్లు కూడా అందిస్తోంది.

  • ఈ సంపద పాలసీని వ్యవధి మొత్తం మనుగడలో ఉంచినందుకు ప్రతిఫలంగా పాలసీ తీసుకున్న 6వ సంవత్సరం చివరి నుంచి ప్రతీ పాలసీ సంవత్సరం అది కృతజ్ఞతా ప్రయోజనాన్ని అర్జిస్తుంది. ఈ కృతజ్ఞతా ప్రయోజనమన్నది ఆ పాలసీ సంవత్సరపు సగటు ఫండ్ విలువలో శాతంగా (రోజువారీ, టాప్ అప్) ఉంటుంది.
  • రెగ్యులర్, పరిమిత చెల్లింపు ప్లాన్లకు ప్రతీ 10వ పాలసీ సంవత్సరం ముగింపు నాటి నుంచి ప్రతీ 5వ సంవత్సరానికి ప్రాఫిట్ బూస్టర్ వర్తిస్తుంది.
  • ప్రీమియంలు క్రమం తప్పకుండా చెల్లించేవారికి లాయల్టీ అడ్వాంటేజ్ అందజేయడం జరుగుతుంది. ఈ ప్రయోజనం ఆ పాలసీ సంవత్సరపు సగటు ఫండ్ విలువలో శాతంగా (రోజువారీ, టాప్ అప్) ఉంటుంది. ఇది పాలసీ 6వ సంవత్సరం ముగింపు నుంచి ప్రతీసంవత్సరం జమవుతుంది.
  •  

వెసులుబాటులో తిరుగులేనిది

మీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన సంపద పాలసీ అని చెప్పుకునేందుకు ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ గర్వపడుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు తగినట్టుగా మీ ప్లాన్ ఉండేలా చూసుకునేందుకు మీకు అనేక వెసులుబాటు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

  • ఫ్రీ స్విచ్చెస్: ఒక నెలలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ పెట్టుబడి కూర్పును మార్చుకోవచ్చు. అంతే కాదు, ఈ మార్పడికి పూర్తిగా ఉచితం.
  • పాక్షిక, క్రమానుగత పాక్షిక విత్డ్రాయల్: ఆర్థికపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు మీ జమైన నిధి నుంచి మీరు కొంత మొత్తాన్ని పాక్షికంగా తీసుకోవచ్చు. అయితే ఇది పాలసీ తీసుకొని 5 సంవత్సరాలు పూర్తైన తర్వాతే వర్తిస్తుంది. క్రమానుగత పాక్షిక విత్డ్రాయల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
  • టాప్ అప్ ప్రీమియం: మీ అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి కాబట్టి, మీ పాలసీపై మీరు చెల్లిస్తున్న ప్రీమియం మొత్తంపై అదనంగా కొంత మొత్తాన్ని చేర్చాలని భావిస్తారు. ఈ టాప్ అప్ వలన మీ పొదుపు మొత్తం పెరగడమే కాదు మీ యూలిప్ ప్లాన్లో బీమా మొత్తం కూడా పెరుగుతుంది.

తక్కువ-ఖర్చు స్వరూపం

ఇండియాఫస్ట్ లైఫ్లో పారదర్శకత విషయంలో రాజీ ఉండదు. ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ పై ఉండే అన్ని ఛార్జీలు జాబితాలో ఉంటాయి. అవి పాలసీదారుకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సంపద నిర్మాణ ప్లాన్సవ్యంగా సాగేలా చూసేందుకు, పాలసీదారుకు గరిష్ట రాబడి వచ్చేలా చూసేందుకు, ఈ యూలిప్ ప్లాన్ను తక్కువ ఖర్చు స్వరూపంతో రూపొందించడం జరిగింది. దీనిపై ఎటువంటి పాలసీ నిర్వహణ ఛార్జీలు, పాక్షిక విత్డ్రాయల్ ఛార్జీలు లేదా స్విచ్చింగ్ ఛార్జీలు లేవు.

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ పొందేందుకు అర్హత ప్రమాణాలేంటి?


  • ఈ పాలసీలో చేరేందుకు ప్రారంభ వయస్సు కనీసం 5 సంవత్సరాలు. 5-సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీకి ప్రవేశ వయస్సు గరిష్ఠంగా 55 సంవత్సరాలు. సింగిల్, రెగ్యులర్ ప్రీమియం, 10/15/20 సంవత్సరాల పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీలకు గరిష్ఠ వయస్సు 65 సంవత్సరాలు.
  • 5 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీలకు మ్యాచురిటీ సమయంలో కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 70 సంవత్సరాలు ఉండాలి. సింగిల్, రెగ్యులర్ ప్రీమియం, 10/15/20 సంవత్సరాల పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీలకు గరిష్ఠ వయస్సు 90 సంవత్సరాలు.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

ఉత్పత్తుల బ్రోచర్

బ్రోచర్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

  • ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మాగ్జిమైజర్ ప్లాన్ ప్రీమియంలు ఎలా చెల్లించాలి?

    ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కింద ప్రీమియంలు చెల్లించేందుకు మీరు సింగిల్, లిమిటెడ్, రెగ్యులర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. సింగిల్ ప్రీమియం వెల్త్ బిల్డర్ ప్లాన్కు ఒకసారి చెల్లింపు జరిపితే సరిపోతుంది. రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ల ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్థసంవత్సరం లేదా సంవత్సరం వారీగా చెల్లించవ్చు. మీ అవసరాలకు తగినట్టుగా మీరు వార్షిక ప్రీమియం, పాలసీ వ్యవధి, ప్రీమియం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు.

  • ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో అందుబాటులో ఉన్న పెట్టుబడి వ్యూహాలేంటి?

    ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కావాల్సిన మేరకు మార్చుకోవచ్చు. రిస్క్ తీసుకోగల మీ శక్తిని బట్టి ఎంచుకునేందుకు 7 వేర్వేరు ఫండ్ ఆప్షన్సే కాదు ఎంచుకునేందుకు మీకు బహుళ పెట్టుబడి వ్యూహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సంపద నిర్మాణ ప్లాన్లో ప్రస్తుతం మీరు ఎంచుకునేందుకు మూడు వేర్వేరు పెట్టుబడి వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి.

    మార్కెట్ పెరిగినప్పుడు రాబడి పెరిగేలా, పతనమైనప్పుడు నష్టాలు తక్కువుండేలా ఎటీబీఐఎస్-ఆటోమ్యాటిక్ ట్రిగ్గర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చూస్తుంది. మీరు ఎటీబీఐఎస్ను ఎంచుకున్నట్టు అయితే, మీ నిధులు ఈక్విటీ1 ఫండ్కు బదిలీ అవుతాయి, అలాగే మీ రాబడి ముందుగా సెట్ చేసుకున్న 10% ట్రిగ్గర్ ప్రకారం డెట్1ఫండ్కు వెళ్తాయి.

    ఎఫ్టీఎస్ (ఫండ్ ట్రాన్స్ఫర్ స్ట్రాటజీ) ద్వారా రూపాయి ఖర్చు సగటు ప్రయోజనం పొందేందుకు మీరెంచుకున్న డెట్ ఫండ్ నుంచి క్రమపద్ధతిలో ప్రతీ నెల మీరు ఎంచుకున్న ఈక్విటీ ఫండ్లోకి బదిలీ చేయబడుతుంది.

    ఎబీఐఎస్- ఏజ్- బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అన్నది మీ వయస్సు తగ్గట్టుగా మీ డబ్బు వ్యవహరించేలా చేస్తుంది. మినహాయింపుల తర్వాత మీ వయస్సును బట్టి ప్రీమియం మొత్తాన్ని ఈక్విటీ1 ఫండ్, డెట్1 ఫండ్, విలువ ఆధారిత ఫండ్ మధ్య పంపిణీ చేయబడుతుంది. మీ వయో శ్రేణి మారినప్పుడల్లా నిధుల కేటాయింపు మీ వయస్సు తగిన రిస్క్ను బట్టి మారుతూ ఉంటుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో మీరు ఏమైనా లాయల్టీ బెనిఫిట్స్ అందుకుంటారా?

    అవును. ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ వ్యవధి ముగిసేవరకు పాలసీ కలిగి ఉండే పాలసీదారులకు అనేక ప్రత్యేకమైన లాయల్టీ యాడిషన్స్ అందిస్తోంది. పాలసీ 6వ సంవత్సరం ముగిసిన నాటి నుంచి లాయవ్టీ బెనిఫిట్, లాయల్టీ అడ్వాంటేజ్ అందజేయబడతాయి. ఈ సంపద నిర్మాణ ప్లాన్ కింద మీరు 10వ పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత ప్రతీ 5 సంవత్సరాలకోసారి ప్రాఫిట్ బూస్టర్ అందుకుంటారు. పాలసీ వ్యవధి 15 సంవత్సరాలు అంత కంటే ఎక్కువ ఉంటే ఆ సమయాన్నిముందు రెండు సంవత్సరాల సగటు డైలీ ఫండ్ విలువ సహ టాప్ అప్ ఫండ్ విలువ ఏమైన ఉంటే అందులో కొంత శాతంగా ఈ మొత్తం ఉంటుంది.

  • స్విచ్చింగ్ అంటే ఏంటి, దానికి నేను ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా?

    ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో మీరు ఎంచుకునేందుకు 7 ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఫండ్ నుంచి యూనిట్లను మరో ఫండ్కు బదిలీ చేసే ప్రక్రియ స్విచ్చింగ్. బీమా చేయించుకున్న వ్యక్తి వయస్సు18 సంవత్సరాలు పైబడి ఉంటేనే దీనికి వెసులుబాటు ఉంటుంది. కనీస స్విచ్చింగ్ మొత్తం రూ.5000.

    ఈ సంపద బీమా పథకం ద్వారా ఒక నెలలో మీరు ఎన్నిసార్లైన మార్చుకోవచ్చు. ఈ మార్పులకు ఎటువంటి ఛార్జీ ఉండదు..

  • ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో క్రమానుగత పాక్షిక విత్డ్రాయల్ ఆప్షన్ ఏంటి?

    ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ అందిస్తున్న ఒక వెసులుబాటు ఆప్షన్- క్రమానుగత పాక్షిక ఉపసంహరణ ఆప్షన్. బీమా చేయించుకున్న వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలు దాటి ఉన్నట్టు అయితే ఈ ఆప్షన్ను మీరు 5 పాలసీ సంవత్సరాలు పూర్తైన తర్వాత ఎంచుకోవచ్చు.

    ఈ ఆప్షన్ కింద మీరు పే-ఔట్ శాతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అది ఈ రెండు షరతులకు లోబడి ఉండాలి:

    (1)క్రమానుగత పాక్షిక ఉపసంహరణ మొత్తం రూ.1000 కంటే తక్కువ ఉండకూడదు, అలాగే మొదటి 5 పాలసీ సంవత్సరాలు పూర్తైన తర్వాత ప్రతీ నెలా, త్రైమాసికం, అర్థసంవత్సరం, వార్షిక ఫండ్ విలువలో 25% కంటే ఎక్కువ ఉండరాదు.

    (2) క్రమానుగత పాక్షిక ఉపసంహరణ వ్యవధిలో రెగ్యులర్/పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీల ఒక సంవత్సరం ప్రీమియం కంటే ఫండ్ విలువ 110% కంటే తక్కువకు పడిపోకూడదు, సింగిల్ ప్రీమియం పాలసీలకైతే ఇది రూ.100,000కు తక్కువ ఉండకూడదు.

    క్రమానుగత పాక్షిక విత్డ్రాయల్ అమల్లోకి వచ్చిన తర్వాత, పాక్షిక ఉపసంహరణ విధానాన్ని బట్టి బీమా చేసిన మొత్తం తగ్గుతూ వస్తుంది.

  • పాక్షిక విత్డ్రాయల్/క్రమానుగత పాక్షిక విత్డ్రాయల్స్ ప్రభావం మరణ ప్రయోజనంపై ఎలా ఉంటుంది?

    బీమా తీసుకున్న వ్యక్తి అకాల మరణం చెందితే మరణ ప్రయోజనాన్ని నామినీ అందుకుంటారు. ఒకవేళ పాక్షిక/క్రమానుగత పాక్షిక విత్డ్రాయల్స్ గనక జరిగి ఉంటే అట్టి మొత్తాన్ని సమానమైన మొత్తాన్ని బేస్ ఫండ్ విలువ (టాప్ అప్ ఫండ్ విలువ నుంచి కాదు)నుంచి అది పాలసీదారు మరణించిన తేదీ నుంచి 24 నెలల్లోపు ఉన్నదాన్నుంచి మినహాయించుకొని చెల్లించడం జరుగుతుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్లో టాప్ అప్ ప్రీమియంల విషయంలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?

    పాలసీకి సంబంధించి మీరు చెల్లించే ప్రీమియంకు అదనంగా టాప్-అప్ ప్రీమియం చెల్లింపు అవకాశాన్ని ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కల్పిస్తుంది. ఈ మొత్తం ఈ ప్లాన్ కింద మీ పొదుపును, మీ టాప్ అప్ బీమా మొత్తాన్ని పెంచుతుంది. మీ పాలసీ గడువు ముగియడానికి 5 సంవత్సరాల ముందు వరకు మీరు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే ప్రీమియంలకు సంబంధించి ఎటువంటి బకాయి ఉండకూడదు. కనీసం టాప్-అప్ ప్రీమియం మొత్తం రూ.10,000, గరిష్ఠ మొత్తం టాప్ అప్ చెల్లింపు సమయంలో జరిపే రెగ్యులర్/పరిమిత/సింగిల్ ప్రీమియంతో ముడిపడి ఉంటుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కింద ఎలాంటి ఛార్జీలు ఉంటాయి?

    ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కింద పాలసీదారు నుంచి ప్రీమియం కేటాయింపు ఛార్జీ, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీ, మోర్టాలిటీ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. పాలసీ నిర్వహణ ఛార్జీలు, పాక్షిక విత్డ్రాయల్ ఛార్జీలు లేదా స్విచ్చింగ్ ఛార్జీల వంటివి లేవు. మీరు ఒకవేళ ఈ సంపద పాలసీని నిలిపివేయాలని భావించినట్టు అయితే పాలసీ సంవత్సరాన్ని బట్టి డిస్కంటిన్యూయన్స్ ఛార్జీ వసూలు చేయడం జరుగుతుంది.

  • ప్రీమియం చెల్లింపులను నేను ఆపేస్తే ఏం జరుగుతుంది?

    ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కింద త్రైమాసికం, అర్థసంవత్సం, వార్షిక ప్రీమియం చెల్లింపులకు ప్రీమియం చెల్లింపుల కోసం 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. నెలవారీ ప్రీమియంలకు ఇది 15 రోజులు మాత్రమే. ప్రతీ ప్రీమియం చెల్లింపు తుది తేదీ నుంచి ఈ సమయం ప్రారంభమవుతుంది. ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కింద మీకు అందే అన్ని ప్రయోజనాలు ఈ గ్రేస్ పీరియడ్లోనూ కొనసాగుతాయి.

    లాక్ ఇన్ పీరియడ్లో: గ్రేస్ పీరియడ్ ముగిసే సమయానికి బకాయిపడిన ప్రీమియంలు చెల్లించనట్టు అయితే ఈ సంపద నిర్మాణ పాలసీ నిలిపివేయబడుతుంది. వర్తించే నిలిపివేత ఛార్జీలు మినహాయించుకొని మిగిలిన ఫండ్ విలుపను నిలిపివేయబడిన పాలసీ ఫండ్లో జమ చేయడం జరుగుతుంది, రిస్క్ కవర్ కూడా ఆగిపోతుంది.

    లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత: గ్రేస్ పీరియడ్ ముగిసే సమయానికి బకాయిపడిన ప్రీమియంలు చెల్లించనట్టు అయితే ఈ సంపద పాలసీని తక్కువ పెయిడ్ అప్ మొత్తానికి పెయిడ్-అప్ పాలసీగా మార్చడం జరుగుతుంది. పునరుద్ధరణ సమయంలో ఉండే నియమ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపులు, ఛార్జీలు ఉంటాయి.

  • ముగిసిన నా వెల్త్ బిల్డర్ ప్లాన్ను నేను ఎలా పునురుద్ధరించుకోగలను?

    లాక్-ఇన్- సమయంలో లేదా అది ముగిసిన తర్వాత పాలసీని పునరుద్ధరించుకోదలిస్తే లిఖితపూర్వక విజ్ఞప్తి పంపించాల్సి ఉంటుంది. బోర్డు ఆమోదిత అండర్ రైటింగ్ విధానాలకు అనుగుణంగా అది లోబడి ఉంటే ఇండియాఫస్ట్ లైఫ్ విచక్షణపై పాలసీ పునరుద్ధరించడం జరుగుతుంది. వడ్డీ/లేటు ఫీజులు లేకుండా అన్న చెల్లించని ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్నానని డిక్లరేషన్తో పాటు వైద్య పరీక్ష (అవసరమైతే, మీ ఖర్చుతో) చేయించుకోవాల్సి ఉంటుంది.

  • ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని సమీక్షించుకునే హక్కు నాకు ఉంటుందా?

    ఉంటుంది. పాలసీ నిబంధనలు, షరతులు మీకు అంగీకారయోగ్యం కాకపోతే పాలసీని అందుకున్న 15 రోజుల్లో మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్రిటర్న్ చేయవచ్చు. డిస్టెన్స్ మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ విధానంలో ఫ్రీ-లుక్ సమయం 30 రోజులు ఉంటుంది.