జీవిత బీమా
ప్లానులు మరియు పాలసీ

మీ ప్రియమైన వారికి నిశ్చితి మరియు భద్రతతో కూడిన భవిష్యత్తు ఉండేలా చూసుకోండి

జీవిత బీమా పాలసీ

ఇండియాలో ఒక అగ్రగామి జీవిత బీమా కంపెనీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్, మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారి రక్షణ మరియు ఆర్థికపరమైన ఆరోగ్యాన్ని చూసుకోవడానికి గాను వివిధ రకాల జీవిత బీమా ప్లానులు మరియు పాలసీలను అందిస్తుంది. ఒక జీవిత బీమా పాలసీని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద, సరళమైన, స్థోమతకు తగిన, మరియు సమర్థవంతమైన జీవిత బీమా పరిష్కారాలను సృష్టించడాన్ని మేము గర్వంగా భావిస్తాము.

మీ జీవిత బీమా అవసరాలకు సరిపోయేలా రూపకల్పన చేయబడిన వివిధ రకాల జీవిత బీమా పాలసీ ఆప్షన్ల నుండి ఎంపిక చేసుకోండి. ఇండియా యొక్క జీవిత బీమా క్షేత్రం ఘనమైనది, మరియు ఇండియాఫస్ట్ లైఫ్ జీవిత బీమా మీ జీవితం యొక్క ప్రతి దశలోనూ మీ అవసరాలకు సరిపోయే ఒక జీవిత బీమా పాలసీని అందజేస్తుంది.

జీవిత బీమా అనగా ఏమిటి?

దానియొక్క సారాంశం మేరకు, ఒక జీవిత బీమా పాలసీ అనేది జీవిత బీమా ప్రదాత మరియు ఒక పాలసీదారు మధ్య కుదుర్చుకోబడే ఒక ఒప్పందము. జీవిత బీమా ప్లానులు అనేవి, ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి గనక జీవిత పాలసీ అవధి కాలములో మరణించినట్లయితే, జీవిత బీమా పాలసీలో జాబితా చేయబడిన నామినీలు/ లబ్దిదారులకు బీమాదారు ఒక భరోసా ఇవ్వబడే మొత్తము రూపములో చెల్లించే ఒక గణనీయమైన జీవిత వర్తింపును అందిస్తాయి. హామీకి బదులుగా, పాలసీదారు తమ జీవిత కాలములో క్రమం తప్పని సమయ అంతరాలలో ఒక నిర్దిష్ట ప్రీమియం మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరిస్తారు.

ఒక జీవిత వర్తింపు ఒప్పందము యొక్క చట్టబద్ధంగా-కట్టుబడి ఉండే స్వభావాన్ని పరిరక్షించడానికి గాను, పాలసీదారు తమ గత మరియు ప్రస్తుత ఆరోగ్య స్థితుల గురించిన వివరాలన్నింటినీ కచ్చితంగా వెల్లడించడం ఆవశ్యకమై ఉంటుంది. వైద్యపరమైన జీవిత బీమా ప్లానులు కూడా వైద్యపరమైన పరీక్షలు లేనిదే మీరు జీవిత బీమా ప్రారంభించడానికి మిమ్మల్ని అనుమతించవు. అయినప్పటికీ, సంబంధిత వివరాలను కచ్చితంగా వాస్తవ రూపములో వెల్లడించడం తప్పనిసరి.

ఒక అవధి జీవిత బీమా పాలసీ ఒక నిర్దిష్ట అవధి పాటు జీవిత వర్తింపును అందజేయగా, శాశ్వత జీవిత బీమా పాలసీలు పాలసీదారు వయస్సులో ఐనా సరే మరణించేవరకూ, జీవిత బీమా ప్రీమియముల చెల్లింపును ఆపేవరకూ, లేదా జీవిత బీమా మదుపును సరెండర్ చేసే వరకూ అమలులో ప్రభావవంతంగా నిలిచి ఉండేలా కొనసాగుతాయి.

మీకు జీవిత బీమా ఎందుకు కావాలి?

జీవిత బీమా అనేది మీరు మరణించిన తర్వాత మీ ప్రియమైన వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు జీవితంలో దశలో ఉన్నారు అనేదానిని బట్టి, జీవిత బీమా కొనడానికి అనేక కారణాలు ఉన్నాయి. వివిధ రకాల జీవిత బీమా పాలసీలు వివిధ రకాల అవసరాలను తీరుస్తాయి. అయినప్పటికీ, జీవిత బీమా యొక్క ప్రధాన ప్రయోజనాలలో, మీపై ఆధారపడి జీవించియున్నట్టి వారు తమకు భవిష్యత్తులో అవసరమైన ఆర్థిక మద్దతును గ్యారంటీగా కలిగి ఉంటారనేది ఒకటి.

ప్రతి ఒక్క వ్యక్తీ ఒకే విధమైన రెండు రకాల భయాలను ఎదుర్కొంటూ ఉంటారు త్వరగా చనిపోతామోనన్న భయం మరియు మరీ ఎక్కువ కాలం జీవిస్తామోనన్న భయం. ఒకవేళ మీరు త్వరగా చనిపోతే, స్వయంగా తమను తాము రక్షించుకునే ఆర్థిక భద్రత లేకుండా మీపై ఆధారపడి ఉన్నవారిని మీరు వదిలివెళతారు. ఒకవేళ మీరు మరీ ఎక్కువ కాలం జీవించి ఉంటే, మీ వద్ద ఉన్న డబ్బు అయిపోయే అవకాశం ఉంటుంది మరియు మీరు మరొకరిపై ఆధారపడేవారు అవుతారు. జీవిత బీమా ప్లానులు రెండు భయాలనూ సులభతరం చేయడానికి సహాయపడతాయి.

 • మీపై ఆధారపడియున్న వారి కోసం మీకు ఒక జీవిత వర్తింపు బీమా పాలసీ కావాల్సి ఉంటుంది.

  జీవిత బీమా కొనడానికి ప్రాథమికమైన కారణాలలో, ఒకవేళ మీ మరణము సంభవించిన పక్షములో మీ నామినీలు లేదా తక్షణ కుటుంబ సభ్యులు ఆర్థిక మద్దతును కలిగి ఉండేలా చూసుకోవడమనేది ఒకటి. తరచుగా, మీరు వెళ్ళిపోయిన తర్వాత సైతమూ బాధ్యతలనేవి ముగిసిపోవు. వివిధ రకాల జీవిత బీమా పాలసీ ఆప్షన్లు మీ కుటుంబం కోల్పోయిన ఆదాయాన్ని మీరు భర్తీ చేసేలా, మీ పిల్లల చదువులకు మీరు చెల్లించేలా, మరియు మీ మరణం తర్వాత సైతమూ మీ జీవిత భాగస్వామికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేలా చూసుకోవడానికి తోడ్పడతాయి.

 • అప్పులతో వ్యవహరించడానికి మీకు ఒక జీవిత బీమా పాలసీ కావాల్సి ఉంటుంది.

  పెద్దవాళ్ళలో అత్యధికులకు చెల్లించడానికి కనీసం ఒకటి లేదా రెండు అప్పు బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ మీరు ఇంటి లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డు బాకీలు లేదా పర్సనల్ లోన్ చెల్లింపులు బాకీపడి ఉంటే, మీరు అప్పుల్లో ఉన్నట్లు అవుతుంది. ఒకవేళ మీరు అకాల మరణం చెందిన పక్షములో, మీ కుటుంబం ఆర్థికపరమైన చెల్లింపు బాధ్యతలతో భారం అనుభవిస్తుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత అప్పు చెల్లింపులు జరిగేలా చూసుకోవడానికి జీవిత బీమా పాలసీ ప్లానులు ఏకమొత్తం మరణ ప్రయోజనాలు మరియు జీవిత వర్తింపును అందిస్తాయి.

 • ఇండియాలో మీ భవిష్యత్తు కోసం మీకు శాశ్వత జీవిత బీమా లేదా సంపూర్ణ జీవిత బీమా కావాల్సి ఉంటుంది.

  జీవిత వర్తింపు పాలసీ అనేది మీరు చనిపోయిన తర్వాత మాత్రమే సహాయపడుతుందనేది ఒక దురభిప్రాయం మాత్రమే. మీరు మరీ ఎక్కువ కాలం జీవించినట్లయితే ఏమి జరుగుతుంది? వైద్యపరమైన పురోగతులు మరియు వైద్య వసతులకు ప్రాప్యత మెరుగు కావడం వల్ల, అనేకమంది 80 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారు. ఒకవేళ మీరు 60 సంవత్సరాల వయసులో రిటైర్ అయితే, రిటైర్మెంట్ తర్వాత 3-4 దశాబ్దాల పాటు మీ జీవన ప్రమాణాన్ని నిర్వహణ చేసుకొని ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి తగినంతగా మీకు పొదుపు ఉందా?ఒక శాశ్వత జీవిత బీమా పాలసీ అనేది మీరు జీవించి ఉన్నంత కాలమూ మరియు జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు కొనసాగించినంత కాలమూ, లేదా శాశ్వత జీవిత బీమా మదుపు పాలసీ సరెండర్ చేసే వరకూ అమలులో నిలిచి ఉంటుంది. ఒక సంపూర్ణ జీవిత భరోసా పాలసీ అనేది ఒక రకమైన శాశ్వత జీవిత బీమా, అది సంవత్సరాల పాటు నగదు విలువను కూడగట్టుతుంది. ఇది వయసులోనైనా బీమా సంపూర్ణ జీవిత పాలసీని ఆకర్షణీయమైన జీవిత వర్తింపు ఐచ్ఛికముగా చేస్తుంది. రిటైర్మెంట్ జీవిత బీమా ప్లానులు మీ వృద్ధాప్య సువర్ణ సంవత్సరాలలో మీకు రక్షణ ఇవ్వడానికి నెలవారీ గ్యారంటీ చెల్లింపులను అందిస్తాయి.

 • మీ దీర్ఘ-కాలిక లక్ష్యాలను సాధించుకోవడానికి మీకు జీవిత బీమా మదుపు ఆప్షన్లు కావాల్సి ఉంటుంది.

  ఒక జీవిత బీమా మదుపు పాలసీ అనేది ఒక పొడిగింపు కాలం వరకూ మీరు పద్ధతి ప్రకారం మదుపు చేస్తూ ఉండడానికి రూపొందించబడి ఉంటుంది. వివిధ రకాల జీవిత బీమా ప్లానులు వివిధ రకాల మదుపు సాధనాలకు అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని జీవిత బీమా ప్లానులు మార్కెట్-అనుసంధానితమై ఉంటాయి, కాగా ఇతర రకాల జీవిత బీమా పాలసీ ఆప్షన్లు లాభ-భాగస్వామ్యం మరియు బోనసులను అందిస్తాయి. ఒకవేళ మీరు క్యాష్బ్యాక్ తో జీవిత బీమా కొరకు ఎంపిక చేసుకున్నట్లయితే, మీరు జీవిత బీమా వర్తింపు మరియు మీ ఖర్చులను తీర్చుకోవడానికై కాలానుగతమైన క్యాష్బ్యాక్ అనే రెండు ప్రయోజనాలనూ అందుకుంటారు.

 • మీ రిటైర్మెంట్ అవసరాలను తీర్చుకోవడానికి మీకు ఒక జీవిత బీమా సంపూర్ణ జీవిత పాలసీ ఆప్షన్లు కావాల్సి ఉంటుంది.

  రిటైర్మెంట్ కోసం పొదుపు చేసేటప్పుడు, మీరు పొదుపు చేస్తున్నంత కాలమూ మీ పొదుపు ఉంటుందని మీరు ఆశిస్తారు. అయినప్పటికీ, మీరు పెరుగుతున్న ఆరోగ్య-సంబంధిత ఖర్చులు మరియు ద్రవ్యోల్బణానికి గురి అయినప్పుడు, మీ పొదుపు మాత్రమే మీ అవసరాలను తీర్చలేకపోయే అవకాశం ఉంటుంది. ఇండియాలో సంపూర్ణ జీవిత బీమా లోటును తీర్చడానికి మరియు మీ రిటైర్మెంట్ ఆపత్కాల నిధికి తోడు కావడానికీ పనిచేస్తుంది. జీవిత బీమా ప్లానుల యొక్క సరియైన రకాలతో, రిటైర్మెంట్ తర్వాత మీ వృత్తిపరమైన ఆదాయమును భర్తీ చేయడానికి ఆదాయం యొక్క రెండవ మార్గము ఏర్పాటు చేయబడేట్లుగా మీరు చూసుకోవచ్చు.

 • ఆర్థికపరమైన యాధాలాప ఖర్చుల కోసం మీకు క్యాష్ బ్యాక్ తో జీవిత బీమా కావాల్సి ఉంటుంది.

  జీవితం యొక్క అనిశ్చితులే జీవితములోని ఏకైక నిశ్చితిగా ఉంటాయి. క్యాష్ బ్యాక్ తో జీవిత బీమాను అందించే ప్లానులు మీకు భరోసా ఇవ్వబడిన సొమ్ములో కొంత శాతము యొక్క కాలానుగతమైన చెల్లింపులను ఇస్తాయి, దానితో మీరు అడపాదడపా వచ్చే ఖర్చులకు మరియు ఇతర ఖర్చులను సులువుగా తీర్చుకోవచ్చు. ఇండియాలో ఎంపిక చేసుకోబడిన జీవిత బీమా ప్లానులను బట్టి, మీరు మీ నిర్దిష్ట ఆవశ్యకతలను తీర్చుకోవడానికి జీవిత బీమా యొక్క అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

 • మీ పిల్లల కోసం డబ్బు అందించడానికై మీకు ఒక జీవిత బీమా ప్లానులు కావాల్సి ఉంటుంది.

  వయస్సుతో నిమిత్తం లేకుండా, మీ పిల్లలు ఎల్లప్పుడూ మీ బాధ్యత అయి ఉంటారు. మీ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు, వారి చదువుల ఖర్చులు మరియు ఇతరత్రా జీవనశైలి అవసరాలకు డబ్బును అందించడానికి జీవిత బీమా మదుపు ప్లానులు మరియు క్యాష్ బ్యాక్ తో జీవిత బీమా మీకు సహాయపడతాయి. మీ డబ్బు గ్యారంటీతో కూడిన వడి అడుగుతో పెరిగేలా చూసుకోవడానికి జీవిత బీమా మదుపు పాలసీలలో కూడగట్టుకోవడం (చక్రవడ్డీ) యొక్క శక్తి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విషయములో, వారి వయస్సు అనేది అసంబద్ధమైన అంశమువారికి జీవితాంతమూ శారీరక మరియు ఆర్థిక సహాయం అవసరమై ఉంటుంది. వారి ప్రాథమిక సంరక్షకులు/ తల్లిదండ్రుల మరణం తర్వాత వారి అవసరాల పట్ల శ్రద్ధ తీసుకోవడం కొనసాగేలా జీవిత బీమా వర్తింపు అనేది చూసుకోగలుగుతుంది.

 • మీ పిల్లలకు భారం కలగకుండా ఉండడానికై మీకు సంపూర్ణ జీవిత బీమా యొక్క ప్రయోజనము కావాల్సి ఉంటుంది.

  మీ వృద్ధాప్యములో, జీవితం నిండు వలయానికి వస్తుంది. మీరు పెంచిన పిల్లలు ఇప్పుడు మీ ఆలనా పాలనా చూసుకునే బాధ్యత కలిగి ఉన్నారు. అయినప్పటికీ, తల్లిదండ్రులుగా, మీ పిల్లలు వృద్ధిలోనికి రావడానికి సహాయపడటం, వారి జీవితాన్ని కొనసాగించడం భారం కాకూడదనేది లక్ష్యం. వివిధ రకాల సంపూర్ణ జీవిత పాలసీ ఆప్షన్లు మీ జీవిత బీమా ప్రీమియం యొక్క ఒక వంతును సంపాదించే నగదు విలువకు మళ్ళిస్తాయి మరియు వడ్డీని మీరు ఉపసంహరించుకోవచ్చు లేదా దానిపై ఒక లోన్ తీసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ మరియు రిటైర్మెంట్ జీవిత వర్తింపుతో జీవిత బీమా మీకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించే ఆదాయ ప్రవాహం ఉండేలా చూసుకుంటుంది.

మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జీవిత బీమా పదాలు (పదజాలము) ఏవేవి?

జీవిత బీమా పాలసీ వివరాలను అర్థం చేసుకోవడానికి మరియు జీవిత బీమా కొనడానికి గాను, మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ప్రాథమిక జీవిత బీమా పదాలు కొన్ని ఉన్నాయి:

 • పాలసీదారు – మీరు జీవిత బీమా కొని మరియు కాలానుగతంగా జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు చేస్తున్నప్పుడు, మీరు ఒక జీవిత బీమా పాలసీదారు అవుతారు. మీరు పాలసీని స్వంతంగా కలిగి ఉన్నప్పుడు, జీవిత బీమా వర్తింపు లోపున జీవిత హామీ ఇవ్వబడిన వ్యక్తి మరొకరుగా ఉంటారు.
 • జీవిత హామీ ఇవ్వబడిన వ్యక్తి – జీవిత బీమా పాలసీ వివరాలలో కనబరచియున్న జీవిత వర్తింపును కలిగియున్న బీమా పొందిన వ్యక్తి.
 • జీవిత బీమా ప్రీమియం – ఒక జీవిత బీమా కొనడానికి మరియు పాలసీని క్రియాశీలకంగా ఉంచడానికి మీరు చెల్లించే మొత్తము.
 • భరోసా ఇవ్వబడిన సొమ్ము – జీవిత బీమా పాలసీదారు గనక మరణించిన పక్షములో మీ నామినీలు/లబ్దిదారులు గ్యారంటీగా అందుకునే సొమ్ము మొత్తము.
 • మరణ ప్రయోజనము – ఇది, పాలసీదారు గనక పాలసీ అవధి కాలములో మరణించిన పక్షములో నామినీకి చెల్లించబడే మొత్తము. మరణ ప్రయోజనము మరియు భరోసా ఇవ్వబడిన సొమ్ము రెండూ ఒకటే కాదు—మరణ ప్రయోజనములో రైడర్ ప్రయోజనాలు మరియు బోనసులు (ఏవైనా ఉంటే) చేరి ఉంటాయి కాబట్టి అది భరోసా ఇవ్వబడిన సొమ్ము కంటే ఎక్కువ ఉంటుంది.
 • జీవించియున్న/మెచ్యూరిటీ ప్రయోజనము – జీవిత పాలసీ కాలవ్యవధి పూర్తి అయిన మీదట ముందస్తు-నిర్ధారిత సొమ్ముగా పాలసీదారుకు జీవించియున్న ప్రయోజనం చెల్లించబడుతుంది. అందుకు విరుద్ధంగా, బీమా చేయబడిన వ్యక్తి జీవిత బీమా పాలసీ అవధిని పూర్తి చేసుకున్న తర్వాత ఒక మెచ్యూరిటీ ప్రయోజనం చెల్లించబడుతుంది. ప్యూర్ ప్రొటెక్షన్ లేదా అవధి జీవిత బీమా ప్లానులు రెండు ప్రయోజనాలనూ అందించవు.
 • రైడర్లు – రైడర్లు అనేవి అదనపు ఫీచర్లు, ప్రాథమిక జీవిత వర్తింపు పాలసీ యొక్క అవకాశాన్ని పొడిగించుకోవడానికి వాటిని జీవిత బీమా ప్లానులకు జోడించుకోవచ్చు. ముఖ్యమైన జీవిత బీమా రైడర్ ఆప్షన్లలో, ప్రమాదవశాత్తూ మరణ ప్రయోజన రైడర్, ప్రమాదవశాత్తు సంపూర్ణ మరియు శాశ్వత అంగవైకల్య ప్రయోజనం, క్లిష్ట అస్వస్థత వర్తింపు, మరియు జీవిత బీమా ప్రీమియం రైడర్ యొక్క వైవర్ చేరి ఉంటాయి.

జీవిత బీమా ప్లానుల యొక్క పన్ను ప్రయోజనాలు ఏవేవి?

జీవిత బీమా ప్లానులు అనేవి పన్ను-సమర్థవంతమైన సాధనాలు.

 • జీవిత బీమా ప్రీమియం మొత్తాలపై పన్ను ప్రయోజనాలు

  ఆదాయపు పన్ను చట్టము – సెక్షన్ 80C నిబంధనల క్రింద, మీరు ఇండియా యొక్క జీవిత బీమా కొరకు చెల్లించిన ప్రీమియములపై రు. 1.5 లక్షల వరకూ పన్ను తగ్గింపు కొరకు క్లెయిం చేసుకోవచ్చు. పెన్షన్ జీవిత బీమా వర్తింపు ప్రీమియములు సెక్షన్ 80CCC క్రింద తగ్గింపుకు అర్హత కలిగి ఉంటాయి. ఆరోగ్య బీమా ప్లానుల కొరకు సెక్షన్ 80 డి క్రింద గరిష్టంగా రు. 25,000 ల తగ్గింపు అనుమతించబడుతుంది.

 • జీవిత బీమావర్తింపు క్లెయిములపై పన్ను ప్రయోజనాలు

  జీవిత బీమా ప్లానుల యొక్క అత్యుత్తమ ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, అందుకోబడిన క్లెయిములు సెక్షన్ 10(10D) క్రింద పన్ను-రహితంగా ఉంటాయి.

 • గణించబడిన పెన్షన్ పన్ను ప్రయోజనాలు

  ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 10(10A) క్రింద, డిఫర్డ్ యాన్యువిటీ జీవిత బీమా పాలసీ ప్లానుల క్రింద నగదుగా ఉపసంహరించుకున్న మొత్తములో 1/3 వంతు మొత్తాన్ని గణించబడిన పెన్షన్ అంటారు మరియు అది పన్ను-రహితమైనది.

జీవిత బీమా పాలసీల యొక్క రకాలు ఏవేవి?

ఇండియాలో అనేక రకాల జీవిత బీమా ప్లానులు ఉన్నాయి, వాటిలో నుండి మీ అవసరాలను బట్టి తగినదానిని మీరు ఎంచుకోవచ్చు..

 • అవధి జీవిత బీమా ప్లానులను ప్యూర్ ప్రొటెక్షన్ ప్లానులు అని కూడా అంటారు. అవి నిర్ధారిత ప్రీమియము వద్ద జీవిత వర్తింపును అందిస్తాయి. అవధి జీవిత వర్తింపు ప్లానులలో జీవించియున్న ప్రయోజనం కానీ లేదా మెచ్యూరిటీ ప్రయోజనాలు గానీ ఉండవు.
 • యులిప్ లేదా యూనిట్-అనుసంధానిత బీమా ప్లానులుమార్కెట్ లో పెట్టుబడి చేస్తాయి మరియు మరణం లేదా మెచ్యూరిటీ మీదట జీవిత బీమా మదుపు పోర్ట్‌ ఫోలియో విలువను చెల్లిస్తాయి.
 • ఎండోమెంట్ జీవిత బీమా ప్లానులు మెచ్యూరిటీ మరియు మరణ ప్రయోజనాలను అందిస్తాయి. జీవిత బీమా మదుపుల నుండి కాలానుగతమైన ఎండోమెంట్లు అందుకోవడానికి గాను క్యాష్ బ్యాక్ ప్లానులతో అనేకమైన ఎండోమెంట్ జీవిత బీమా ప్లానులు ఉన్నాయి.
 • శాశ్వత జీవిత బీమా మరియు సంపూర్ణ జీవిత పాలసీ వర్తింపు రకాలు బీమా పొందిన వ్యక్తి తమ జీవితమంతటా పొందవచ్చు మరియు నగదు విలువ భాగమును పొందవచ్చు.
 • రిటైర్‌మెంట్ ప్లానులు అనేవి మీ భవిష్యత్తు కోసం మీరు ఒక ఆపత్కాల నిధిని ఏర్పరచుకోవడానికి మీకు సహాయపడే జీవిత బీమా మదుపు ఉత్పాదనలు.
 • చిన్నారి జీవిత బీమా మదుపు ప్లానులు మీ చిన్నారి భవిష్యత్తును ఆర్థికంగా సుస్థిరపరచడానికి సహాయపడతాయి మరియు ముఖ్యంగా కొంత అంతరాలలో క్రమం తప్పని చెల్లింపులను అందజేస్తాయి.

సరియైన జీవిత బీమా ప్లానును ఎంచుకోవడం ఎలా?

జీవిత బీమా ప్లానులు అనేవి పన్ను-సమర్థవంతమైన సాధనాలు.

 • మీ అవసరాలను విశ్లేషణ (అంచనా) చేసుకోండి>

  అత్యుత్తమ జీవిత బీమా ప్లానులను ఎంచుకోవడానికి మొదటి చర్య ఏమిటంటే, మీ అవసరాలను పరిగణించుకోవడం. మీ బడ్జెట్, మీకు నచ్చిన పాలసీ అవధి, భవిష్యత్ లక్ష్యాలు, అప్పు బాధ్యతలు, మరియు ఆధారపడి ఉన్నవారిని పరిగణనలోనికి తీసుకోండి.

 • ద్రవ్యోల్బణములోని కారకాంశము

  నేటి మీ జీవనశైలిని రాబోయే కొద్ది దశాబ్దాల తర్వాత ఇలాగే నిర్వహణ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు ఒక మొత్తం భరోసా సొమ్మును నిర్ణయించుకోవడానికి ముందు ద్రవ్యోల్బణం రేటును పరిగణించండి.

 • ఆన్‌లైన్ జీవిత బీమా కొనండి

  మధ్యంతర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా, మీరు అత్యుత్తమ జీవిత పాలసీ డీల్స్ పొందేలా మీరు చూసుకోవచ్చు. ఒక ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీ అనేది ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసుకునే ఆఫ్‌లైన్ ప్లానుల కంటే కొంత చౌకైనదిగా ఉంటుంది.

 • జీవిత బీమా పాలసీ వివరాలను అర్థం చేసుకోండి

  జీవిత బీమా ప్లానులను కొనడానికి ముందు మీరు జీవిత బీమా పాలసీ వివరాలు, ఆఫరుపై జీవిత బీమా పాలసీ ఆప్షన్ల యొక్క రకాలు, మరియు జీవిత బీమా యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకునేలా చూసుకోవడానికి గాను మీరు శ్రద్ధగా ధ్యాస వహించండి.

మీకు ఎంతమాత్రం జీవిత బీమా వర్తింపు కావాల్సి ఉంటుంది?

మీరు జీవిత బీమాను కొనే ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషణ చేసుకోండి—ఆదాయము, అప్పులు, మరియు భవిష్యత్తు బాధ్యతలు.  మీ ప్రస్తుత ఆదాయము, మీ జీతం విషయంగా భవిష్యత్తులో ఎదుగుదల సంభావ్యత, ప్రస్తుత జీవన ప్రమాణాలు మరియు ఖర్చులు, భవిష్యత్తులో అంచనా వేయబడిన జీవన ఖర్చులు, ద్రవ్యోల్బణము, అప్పులు వంటి ఆర్థికపరమైన బాధ్యతలు మరియు పిల్లల చదువు మరియు వివాహం వంటి బాధ్యతల ఆధారంగా మీకు కావలసియున్న జీవిత బీమా వర్తింపును లెక్కించుకోండి.

జీవిత బీమా ప్రీమియమును దెబ్బతీసే కారకాంశములు ఏవేవి?

మీరు చెల్లించే జీవిత బీమా ప్రీమియం ఈ క్రింది విధమైనటువంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది:

 • వయస్సు – మీరు ఎంత త్వరగా జీవిత బీమాను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో కొనుగోలు చేస్తే, అంత తక్కువ జీవిత బీమా ప్రీమియం ఉంటుంది.
 • జెండర్ – పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు మరి అందువల్ల వారికి ముఖ్యంగా తక్కువ జీవిత బీమా ప్రీమియం ధరలు అందించబడతాయి.
 • వైద్య చరిత్ర – వైద్యపరమైన జీవిత బీమా పాలసీలు లేనప్పటికీ, మీ గత వైద్య చరిత్ర మరియు అస్వస్థతల యొక్క మీ కుటుంబ వైద్య చరిత్ర జీవిత బీమా ప్రీమియముపై ప్రభావము చూపుతాయి కాబట్టి వాటిని మీరు వెల్లడి చేయాల్సి ఉంటుంది.
 • పొగత్రాగే అలవాటు – పొగత్రాగేవారు అధికమైన మరణ రేటును కలిగి ఉంటారు మరియు పొగత్రాగని వారి కంటే ఎక్కువ జబ్బులకు గురయ్యే అవకాశం ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం మొత్తాలు శ్రమతో కూడి ఉంటాయి, కాబట్టి పొగత్రాగేవారు అధికమైన జీవిత బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
 • బీమాదారు – మీరు అత్యంత సరసమైన ధరలను పొందేలా చూసుకోవడానికి ఇండియాలో జీవిత బీమా ప్లానులను అందించే పారదర్శకమైన మరియు విశ్వసనీయమైన కంపెనీని ఎంచుకోండి

ఒక జీవిత బీమా ప్లాన్ ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్ కొనడం వల్ల ప్రయోజనాలు ఏవేవి?

ఆన్‌లైన్ జీవిత బీమా కొనడం అనేది అనేక ప్రయోజనావకాశాలను అందిస్తుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్ జీవిత బీమా కొన్నట్లయితే, మధ్యవర్తులకు కమీషన్ చెల్లించకుండా మీరు నేరుగా కొనుగోలు చేస్తున్నారన్న మాట. మీరు ఆన్లైన్ జీవిత బీమా పాలసీలను సమీక్షలను సరిచూసుకోవడం, జీవిత బీమా పాలసీ ఐచ్ఛికాల రకాలను, మరియు జీవిత బీమా ప్లానుల ప్రయోజనాలను పోల్చి చూసుకోవడం ద్వారా మీకు తెలియజేయబడిన ఎంపికను చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ జీవిత బీమా పాలసీ ప్లానులను కొనేటప్పుడు మీరు ఆన్లైన్ సేవలు మరియు 24x7 కస్టమర్ మద్దతుకు ప్రాప్యతను పొందుతారు. ఆఫ్లైన్ కొనుగోలుతో పోల్చి చూసుకుంటే, మీరు ఆన్లైన్ జీవిత బీమాను త్వరగా, సులభంగా మరియు కాగిత రహితమైన తీరులో కొనగలుగుతారు.

జీవిత బీమా ప్లానుల కొరకు ఇండియాఫస్ట్ లోఅందుబాటులో ఉండే ఆప్షన్లు ఏవేవి?

ఇండియాఫస్ట్ జీవిత బీమా, సంపూర్ణ జీవిత భరోసా పాలసీ, శాశ్వత జీవిత బీమా ప్లానులు, ప్యూర్ ప్రొటెక్షన్ లైఫ్ కవర్, మరియు జీవిత బీమా ఇన్వెస్ట్మెంట్ ప్లానులతో సహా వివిధ రకాల జీవిత బీమా ఆప్షన్లను అందిస్తుంది. ఇండియాఫస్ట్ లైఫ్ చే అందించబడే జీవిత బీమా ప్లానుల యొక్క ప్రాథమిక కేటగరీలు లేదా రకాలలో ఇవి ఉన్నాయి:

 • అవధి ప్లానులు లేదా ప్యూర్ ప్రొటెక్షన్ జీవిత బీమా పాలసీ ప్లానులు – ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్
 • జీవిత బీమా మదుపు ప్లానులు లేదా యులిప్స్ – ఇండియాఫస్ట్ వెల్త్ మాగ్జిమైజర్ ప్లాన్ మరియు ఇండియాఫస్ట్ మనీ బ్యాలన్స్ ప్లాన్
 • సేవింగ్స్ ప్లానులు – ఇండియాఫస్ట్ మహా జీవన్ ప్లాను, ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాను, ఇండియాఫస్ట్ సింపుల్ బెనిఫిట్ ప్లాన్
 • బీమా సంపూర్ణ జీవిత పాలసీ ప్లానులు – ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాను
 • పెన్షన్ లేదా రిటైర్‌మెంట్ ప్లానులు – ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాను, ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్, మరియు ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్
 • ఛైల్డ్ ప్లానులు - ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్
 • సూక్ష్మ - బీమా ప్లానులు – ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాను మరియు ఇండియాఫస్ట్ లైఫ్ బీమా ఖాతా ప్లాను
 • కామన్ సర్వీస్ సెంటర్ ప్లానులు (CSC) – ఇండియాఫస్ట్ CSC శుభ్‌లాభ్ ప్లాన్
 • మెడికల్ జీవిత బీమా ప్లాన్‌లు ఏవీ లేవు
 • ఆన్‌లైన్ జీవిత బీమా – ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్, ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లాన్, ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ మరియు , ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్
 • క్యాష్‌బ్యాక్ ప్లానులతో జీవిత బీమా – ఇండియాఫస్ట్ లైఫ్ క్యాష్ బ్యాక్ ప్లాన్

అన్ని జీవిత బీమా ప్లాన్‌లు

ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్

ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయండి
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లాన్

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లాన్

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయండి
ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

తిరిగి ఒక కాల్ పొందండి
ఛైల్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌లు

ఛైల్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌లు

తిరిగి ఒక కాల్ పొందండి
రిటైర్‌మెంట్ ప్లానులు

రిటైర్‌మెంట్ ప్లానులు

తిరిగి ఒక కాల్ పొందండి
పెట్టుబడి ప్లానులు - యులిప్స్

పెట్టుబడి ప్లానులు - యులిప్స్

తిరిగి ఒక కాల్ పొందండి

తరచుగా అడిగే ప్రశ్నలు

 • ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ని నేను ఎలా సంప్రదించగలను?

  • మాకు customer.first@indiafirstlife.comపై ఇమెయిల్ చేయండి
  • మాకు కాల్ చేయండి: 1800-209-8700
  • మమ్మల్ని సందర్శించండి: మా ఇండియాఫస్ట్ లైఫ్ శాఖలలో దేనికైనా విచ్చేయండి

 • ఏదైనా అభ్యర్థన కొరకు పత్రాలను పంపించుటకు అందుబాటులో ఉండే వివిధ రూపాలు ఏవి?

  • మాకు customer.first@indiafirstlife.comపై ఇమెయిల్ చేయండి
  • కొరియర్: మీ పత్రాలను మా ప్రధాన కార్యాలయానికి గానీ లేదా ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క శాఖ చిరునామాకైనా గానీ పంపించండి
   • క్లెయిము-సంబంధిత అభ్యర్థన కొరకు దానిని క్లెయిము విభాగము నకు పంపించండి
   • ఏవేని ఇతర అభ్యర్థనలు లేదా సమస్యల కొరకు వాటిని కస్టమర్ సర్వీస్ కు వ్రాయండి
  • ఫ్యాక్స్: 022 33259600 పై
  • మమ్మల్ని సందర్శించండి: మా ఇండియాఫస్ట్ లైఫ్ శాఖలలో దేనికైనా విచ్చేయండి

 • ఒకవేళ నా అభ్యర్థనకు నేను నిర్ధారణ లేఖ పొందకపోతే నేను ఏమి చేయాలి?

  అభ్యర్థన ప్రక్రియ జరిపిన తేదీ నుండి 7-10 పనిదినముల లోపున నిర్ధారణ లేఖ మీరు రిజిస్టర్ చేసుకున్న చిరునామాకు పంపించబడుతుంది. ఒకవేళ ఇవ్వబడిన కాలవ్యవధి లోపున మీరు నిర్ధారణ లేఖను ఇంకనూ అందుకోని పక్షములో, నిర్ధారణ లేఖను మళ్ళీ పంపించాల్సిందిగా కోరుతూ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

 • నా యులిప్ ప్లాన్ పై వర్తించే రుసుములు ఏవేవి మరియు ఎప్పుడు/ఎలా అవి తగ్గించుకోబడతాయి?

  మీ యులిప్ ప్లాన్ పై వర్తించే రుసుములు ఈ క్రిందివి:

  • ప్రీమియం కేటాయింపు రుసుము: మేము ఏవైనా పెట్టుబడులు చేసే ముందుగా లేదా మరేదేని ఇతర రుసుమును వర్తింపజేసే ముందుగా మేము ప్రీమియం కేటాయింపు రుసుమును మినహాయించుకుంటాము.
  • నిధి నిర్వహణ రుసుము (ఎఫ్.ఎం.సి): నిధి నిర్వహణ రుసుము మరియు వర్తించే సేవా పన్ను ఈ రెండూ రోజువారీ ప్రాతిపదికన ఫండ్ విలువ నుండి నవ్ (నిఖర ఆస్తి విలువ) ను లెక్కించడానికి ముందుగా మినహాయించుకోబడతాయి.
  • పాలసీ పరిపాలనా రుసుము: ప్రతి ప్లాన్ నెల యొక్క మొదటి వ్యాపార రోజు నాడు ముందస్తుగా యూనిట్లను రద్దు చేయడం ద్వారా మేము నెలవారీ పాలసీ పరిపాలనా రుసుము మరియు వర్తించు సేవా పన్నును మినహాయించుకుంటాము. ప్లాన్ యొక్క ప్రతి నెల రోజు యొక్క ప్రారంభము నాడు మేము ఈ పని చేస్తాము.
  • మోర్టాలిటీ రుసుములు: ప్రతి ప్లాన్ నెల యొక్క మొదటి వ్యాపార రోజు నాడు యూనిట్లను రద్దు చేయడం ద్వారా మేము ఈ రుసుము మరియు వర్తించు సేవా పన్ను మినహాయించుకుంటాము.
  • మార్పిడి రుసుము: మీరు ఒక క్యాలెండర్ నెలలో రెండు మార్పిడులను మాత్రమే చేయవచ్చు. మేము ప్రస్తుతము ఎటువంటి మార్పిడి రుసుమునూ విధించడం లేదు. అయినప్పటికీ మేము ముందస్తుగా తెలియజేసిన తర్వాత రుసుములను ప్రవేశపెట్టే హక్కు కలిగి ఉంటాము.

  వర్తించు రుసుముల యొక్క వివరాల కొరకు మీరు పాలసీ డాక్యుమెంటును చదవవచ్చు..

 • నా పాలసీ కొరకు ఫండ్ విలువను నేను ఎలా కనుక్కోవచ్చు?

  • ఆన్ లైన్: ఆన్ లైన్: మీరు కస్టమర్ పోర్టల్ లోనికి లాగిన్ అయిన తర్వాత మీ పాలసీ యొక్క ఫండ్ విలువను డ్యాష్బోర్డ్ పై మరియు పాలసీ వివరాల పేజీపై చూడవచ్చు.
  • మాకు ఇమెయిల్ చేయండి: మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామా నుండి మాకు customer.first@indiafirstlife.com పై ఫండ్ విలువను చూడడానికై మాకు అభ్యర్థన పంపించేటప్పుడు మీ పాలసీ నంబరును కనబరచండి
  • మాకు కాల్ చేయండి:
   • మా టోల్ ఫ్రీ నంబరు 1800-209-8700 పై కాల్ చేసి, ఐవిఆర్ పై ఆప్షన్ 1 నొక్కండి.
   • మా టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడండి.
  • SMS: ఫండ్ పాలసీ నంబరును 92444 92444 నంబరుకు SMS చేయండి

 • ఏదైనా అభ్యర్థన కొరకు పత్రాలను పంపించుటకు అందుబాటులో ఉండే వివిధ రూపాలు ఏవి?

  • మాకు customer.first@indiafirstlife.comపై ఇమెయిల్ చేయండి
  • కొరియర్: మీ పత్రాలను మా ప్రధాన కార్యాలయానికి గానీ లేదా ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క శాఖ చిరునామాకైనా గానీ పంపించండి
   • క్లెయిము-సంబంధిత అభ్యర్థన కొరకు దానిని క్లెయిము విభాగము నకు పంపించండి
   • ఏవేని ఇతర అభ్యర్థనలు లేదా సమస్యల కొరకు వాటిని కస్టమర్ సర్వీస్ కు వ్రాయండి
  • ఫ్యాక్స్: 022 33259600 పై
  • మమ్మల్ని సందర్శించండి: మా ఇండియాఫస్ట్ లైఫ్ శాఖలలో దేనికైనా విచ్చేయండి

 • జీవిత బీమా యొక్క ఉపయోగము ఏమిటి?

  ఒక జీవిత బీమా పాలసీని కలిగి ఉండడం వల్ల కలిగే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, పాలసీ అమలులో ఉన్న కాలములో ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి గనక మరణించిన పక్షములో భరోసా ఇవ్వబడే సొమ్ము రూపములో ఆర్థిక భద్రత మీపై ఆధారపడియున్న వారికి చెల్లించబడుతుంది. ప్రయోజనాల యొక్క ఒక శ్రేణిని అందించే అనేకమైన వివిధ రకాల జీవిత బీమా ప్లానులు ఉన్నాయి.

  ఉదాహరణకు, అవధి జీవిత బీమా ప్లానులు జీవిత వర్తింపును స్థోమతకు తగిన ధరలలో అందిస్తాయి, కాబట్టి మీ పరోక్షములో సైతమూ మీ కుటుంబము యొక్క ఆర్థిక భద్రత సురక్షితంగా ఉంటుందని మీరు నిశ్చింతగా ఉండవచ్చుఒక ఎండోమెంట్ ప్లాన్ అనేది ఒక జీవిత బీమా భాగాంశముతో సాంప్రదాయకమైన ముప్పు-రహిత పొదుపు ప్లాను, కాబట్టి అది పొదుపు మరియు బీమా అవసరాలు రెండింటికీ ఒక సాధనముగా రెండు విధాలుగా పని చేస్తుంది. సంపూర్ణ జీవిత బీమా ప్లానులు ముఖ్యంగా మీ శేష జీవితం పాటు మీకు వర్తింపును ఇస్తాయి.

  ఇండియాఫస్ట్ లైఫ్ బీమా ప్లానులను మీ నిర్దిష్ట అవసరాలకు సరిపోయేలా అనుకూలీకృతం చేసుకొని మలచుకోవచ్చు, తద్వారా మీరు మీ జీవిత బీమా పాలసీ నుండి మీరు కోరుకునే ప్రయోజనాలను పొందుతారు.

 • నేను 30 ఏళ్ళ వయసులో జీవిత బీమా పొందాలా?

  విభిన్న రకాల జీవిత బీమా ప్లానులను కూలంకషంగా పరిశీలిస్తూ 30 సంవత్సరాల వయసులో జీవిత వర్తింపును పొందడం ఒక చక్కని మరియు ఆచరణాత్మకమైన ఆలోచన అవుతుంది. దాదాపుగా చిన్న వయసులోనే జీవిత బీమా కొనడం యొక్క ప్రయోజనాలను పొందుతారు, కాబట్టి ప్రస్తుతం, మీ ప్రీమియములు అన్నింటికంటే తక్కువగా ఉంటాయి.

  వయస్సులో, మీరు చేయవలసినదానికంటే ఎక్కువగా డబ్బు చేసుకుంటున్నారు, మరియు మీకు ఒక కుటుంబం ఉంది లేదా చేసుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాక, మీరు ఎంత మొత్తం ప్రీమియమును చెల్లించాల్సి ఉంటుందనే విషయములో మీ ఆరోగ్యం గణనీయమైన పాత్రను పోషిస్తుంది. యవ్వనస్థులు, ఆరోగ్యవంతులైన వ్యక్తులు బీమాదారుకు తక్కువ ముప్పును కలిగిస్తారు కావున, వారికి తక్కువ ధరలు సైతమూ అందజూపబడతాయి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరియు ఒక మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పుడే ఒక సహేతుకమైన ధరలో తాళం వేసుకోవడం అనేది చేయదగిన చక్కని పని అవుతుంది.

 • నేను పొందగలిగిన జీవిత బీమా యొక్క గరిష్ట మొత్తము ఎంత ఉంటుంది?

  అనేక రకాలైన జీవిత బీమా ప్లానుల కొరకు, మీరు పొందగలిగినటువంటి జీవిత బీమా మొత్తముపై గరిష్ట పరిమితి అంటూ ఏదీ పేర్కొనబడలేదు. గరిష్టమైన భరోసా సొమ్ము అనేది ముఖ్యంగా అండర్రైటింగ్ కు లోబడి ఉంటుంది. మీరు మీ అవసరాలను తీర్చుకునేలా మరియు ఆర్థికపరంగా నిర్వహణ చేసుకునేలా జీవిత వర్తింపును పొందునట్లు చూసుకోవడం లక్ష్యంగా ఉంటుంది. సాధారణంగా, మీ వార్షిక ఆదాయానికి 10-20 రెట్లుగా ఒక బాల్పార్క్ పరిమితి సిఫార్సు చేయబడుతుంది.

 • మీ జీవిత బీమా ప్రీమియములను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయి?

  మీరు ఒక ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ జీవిత బీమా పాలసీ దేనిని కొనడానికి ఆసక్తిగా ఉన్నా, జీవిత బీమా ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడానికి కొన్ని అంశాలు సహాయపడతాయి. వయస్సు అనేది ప్రాథమికమైన అంశము, ఎందుకంటే మీరు ఎంత చిన్నవాళ్ళయితే అంత తక్కువ ముప్పును బీమాదారుకు కలిగిస్తారు. పురుషుల కంటే మహిళలు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారు కాబట్టి, తద్వారా వారు ప్రీమియముల కొరకు తక్కువ చెల్లిస్తారు కాబట్టి జెండర్ అనేది మరొక ప్రాముఖ్యమైన జీవిత బీమా అంశము అవుతుంది.                 

  ప్రభావపరచే ఇతర అంశాలలో వ్యక్తిగత వైద్య చరిత్ర, వ్యాధుల యొక్క కుటుంబ చరిత్ర, పొగత్రాగే అలవాటు, ముప్పు కలిగించే అభిరుచులు లేదా వృత్తులు, మరియు మీరు ఎంచుకోగలిగిన వివిధ రకాల జీవిత బీమా చేరి ఉంటాయి. అంశాలు అన్నీ మీ జీవిత బీమా ప్లానును ఎలా ప్రభావితం చేస్తాయో మరియు సరియైన సమయములో సరియైన జీవిత బీమా పాలసీ పొందడానికి మీరు ఏమి చేయవచ్చునో అర్థం చేసుకోవడానికి ఒక ఆన్లైన్ జీవిత బీమా ప్రీమియం క్యాలికులేటర్ మీకు సహాయపడుతుంది.

   

విజ్ఞాన కేంద్రము