Financially Speaking ft R M Vishakha and Monika Halan
Episode #1

ఘట్టము 1 | ఫైనాన్సిషియల్లీ స్పీకింగ్ ఎఫ్.టి ఆర్.ఎం. విశాఖా , మరియు మోనికా హాలన్

ఆర్ ఎం విశాఖా మరియు మోనికా హలన్ చే

|

10 - 04 - 2021

31:26

The Podcast link has been copied successfully !!

పురుషులు కుటుంబ భారం మోయువారు అనే భావన మన మనస్సుల్లో బాగా లోతుగా పాతుకుపోయి ఉంది, మనలో చాలామంది ఆర్థిక వ్యవహారాలలో పురుషుల వైపు మొగ్గు చూపుతారు మరియు మహిళలకు అంతగా ప్రాధాన్యత నివ్వరు. మహిళలు తరచూ ఆధారపడతారని చెబుతారు మరియు మహిళలు ఎప్పుడైతే వారి సాధారణీకరణ నుండి బయిటికి రావడానికి ప్రయత్నించినప్పుడు అలాగే ఆర్థిక ప్రపంచంలో తమ విలువను నిరూపించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా, వారి ఆర్థిక నైపుణ్యతపై సవాలు చేయబడ్డారు. సాధారణ సంభాషణలలో కూడా, ఆర్ధిక వ్యవహారాల సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి మహిళలను అనుభవం లేనివారుగా విశ్వసిస్తారు. ఒక స్త్రీ తన ఆర్థిక స్వాతంత్ర్యం పట్ల ఆసక్తి చూపడం అనేది ఒక అభిరుచిగాను లేదా స్వావలంభన పొందాలనుకొంటుంది అని కొందరు నమ్ముతారు. ప్రతి వ్యక్తి ఎదురయ్యే అత్యవసరాల సమయంలో ఆర్థికంగా స్వతంత్రంగా ఎలా ఉండాలి అనే వాస్తవాన్ని వారు గుర్తించరు - అది మగ లేదా ఆడది కావచ్చు.

జీవితంలో సురక్షితమైన స్థానానికి చేరుకోవడం కోసం చేసే రోజువారీ పోరాటాలు తరచుగా గుర్తించబడవు మరియు ఆర్టిక వ్యవహారాలలో పురుషులకన్నా తాము సమర్థులం అని ప్రపంచానికి నిరూపించడానికి మహిళలు ప్రతిరోజూ పోరాడుతారు. మహిళలు మితిమీరిన భావోద్వేగానికి లోనయ్యే సాధారణీకరణ భావనలకు సవాలు చేస్తూనే ఉంటారు మరియు ముఖ్యంగా ఆర్ధిక విషయాలలోకి వస్తే వారి మనస్సు హేతుబద్ధoగా ఉంటుందని సమాజానికి మళ్ళీ మళ్లీ నిరూపించబడ్డారు.

మరోసారి గాజు పైకప్పు వంటి అడ్డంకులను పగులగోట్టడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను ఆర్థిక ప్రపంచంలో తమదైన రీతిలో నడిపించేలా ప్రేరేపించడానికి – Let's Talk Money in a free-wheeling discussion about the world of finance (లెటజ్ టాక్ మనీ ఇన్ ఎ ఫ్రీ-వీలింగ్ డిస్కషన్ అబౌట్ ది వరల్డ్ ఆఫ్ ఫైనాన్స్) యొక్క రచయిత మోనికా హాలన్‌ను మా ఎమ్.డి మరియు సి.ఇ.ఓ, ఆర్.ఎమ్ ఆహ్వానించారు. ఈ పోడ్‌క్యాస్ట్ ద్వారా, అసమానతలకు వ్యతిరేకంగా పైకి లేచే మహిళల ఉద్రేక జ్వాలలను వెలిగించడం మరియు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని వారి జీవితాల్లో చోదక శక్తిగా మార్చడం ఆమె లక్ష్యం. ఈ మహిళలు తమ జీవిత ప్రయాణ గాథలను తెలియజేస్తూ, పురుషులు ఆధిపత్యం వహించే రంగంలో తమ స్థానాన్ని సంపాదించుకునే మహిళలగురించి కొన్ని ఆసక్తికరమైన ప్రావీణ్యతలను వెల్లడించే ఈ పోడ్‌క్యాస్ట్‌కు ట్యూన్ చేయండి.

పోడ్‌క్యా స్ట్ జాబితాకు తిరిగి చేరుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.