సంవత్సరాలు
ప్రస్తుత వార్షిక కుటుంబ ఖర్చులు (EMI లతో సహా)
50 సంవత్సరాలు 70 సంవత్సరాలు
సంవత్సరాలు

Time to Retirement
సంవత్సరాలు

దీర్ఘకాలిక వడ్డీ రేటు

%
4% 14%

దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం రేటు

% %
4% 14%

RRR (రాబడి యొక్క వాస్తవ రేటు = ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడిన రాబడి)

%
పెన్షన్ ఆవశ్యకత
60 సంవత్సరాలు 90 సంవత్సరాలు
సంవత్సరాలు

రిటైర్‌మెంట్ వ్యవధి

సంవత్సరాలు
రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధి
నేటికి మొత్తం పిఎఫ్ విలువ
ఈ నాటికి మొత్తం పొదుపు
పిఎఫ్ యొక్క భవిష్యత్ విలువ + పొదుపు (రిటైర్‌మెంట్ వయస్సు వరకూ వెనక్కి తీసుకోకుంటే)
రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిలో నిఖర గ్యాప్
ఆవశ్యకత కొరకు కావలసియున్న వార్షిక పొదుపు
ఆవశ్యకత కొరకు కావలసియున్న నెలవారీ పొదుపు

కాల్, ఇమెయిల్, SMS లేదా వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించడానికి నేను ఇండియాఫస్ట్ లైఫ్ బీమా కంపెనీ లిమిటెడ్ మరియు వారి ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC / NDNC (అంటే, ఒకవేళ మీరు ఏదైనా డూ నాట్ డిస్టర్బ్ క్రింద రిజిస్టర్ చేసుకున్నప్పటికీ సైతమూ మేము మిమ్మల్ని సంప్రదిస్తాము అని అర్థము) క్రింద నా రిజిస్ట్రేషన్ ని తిరగవ్రాస్తుంది.

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ అంటే ఏమిటి?

రిటైర్‌మెంట్ ప్లానింగ్ అనేది, మీరు ప్రశాంతంగా రిటైర్ కావడానికి మీకు అవసరం కాగల ఆపత్కాల నిధి యొక్క అంచనాను లెక్కకట్టుకోవడానికి గాను ఒక పెన్షన్ లెక్కింపు సూత్రమును ఉపయోగించుకునే ఒక శాస్త్రము. ఆఖరి నిముషములో ప్రాకులాడటానికి బదులుగా, ఒక పెన్షన్ ప్లానర్ ఉపయోగించుకోండి మరియు ఒక గణనీయమైన రిటైర్‌మెంట్ నిధిని సమకూర్చుకోవడానికి నేడే తగు చర్యలు తీసుకోండి. మీ తదుపరి సంవత్సరాల కొరకు ప్లాన్ చేసుకోవడానికి మీరు ఎప్పటికీ మరీ చిన్నవారిగా ఉండలేరు.

జీవితములో ముందుగానే మీ రిటైర్‌మెంట్ కోసం పొదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలను మీకు చూపడానికి ఒక రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఒక పెన్షన్ లెక్కింపు సూత్రమును ఉపయోగిస్తుంది. కూడగట్టుకునే చక్రవడ్డీ యొక్క శక్తి మీ భవిష్యత్తు కోసం మీరు దాచుకున్న సొమ్మును ఇబ్బడి ముబ్బడిగా చేస్తుంది. కాబట్టి, మీరు స్వల్ప మొత్తాల డబ్బుతో మొదట్లో మొదలుపెట్టినా, మీరు మదుపు చేసిన మొత్తం మీ రిటైర్‌మెంట్ అవసరాలను తీర్చుకోవడానికి తగినంత భారీ మొత్తము అవుతుంది.

ఒక రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ లేదా పెన్షన్ క్యాలికులేటర్ అనేది, నేడు మీరు ఎక్కడ నిలుచొని ఉన్నారు మరియు రిటైర్‌మెంట్ అనంతరం నాణ్యమైన జీవనశైలిని ఆనందించడానికి మీకు ఎంత మొత్తం అవసరమవుతుంది అనేదాన్ని మీకు చూపించే ఒక పెన్షన్ ప్లానర్ వినియోగ సాధనము. ఒక రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ ప్లాన్ అనేది, మీ రిటైర్‌మెంట్ సమయములో మీరు ఆశించిన పెన్షన్ నిధిని లెక్క కట్టుకోవడానికి గాను సరియైన మదుపులను చేసుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది.

మీ వృత్తిపరమైన ఆదాయము రిటైర్‌మెంట్ వద్ద ఇక ఆగిపోతుండగా, జీవితం కొనసాగుతూనే ఉంటుంది మరియు ఖర్చులను ఇంకా చెల్లించాల్సి ఉంటుంది. ఒక పెన్షన్ ప్లాన్ క్యాలికులేటర్ మీ భవిష్యత్ ఖర్చులు మరియు ఆర్థికపరమైన అవసరాలను అంచనా వేస్తుంది. ఒక రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి క్యాలికులేటర్ ఉపయోగించి, మీ మదుపులను వెనక్కి తిరిగి రూపొందించుకోగల సంఖ్యను మీరు లెక్క కట్టుకోగలుగుతారు.

ఒక రిటైర్‌మెంట్ ప్లానర్ ఉపయోగించి ఆన్‌లైన్ లెక్కింపులు

ఒక రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ ఉపయోగించుకుంటే తప్ప ఆర్థికపరమైన ప్రణాళిక సులభతరం కాదు—మీ ప్రస్తుత మరియు భవిష్యత్ ఆర్థిక వ్యవహారాల ప్రాథమిక వివరాలను ఉంచండి మరియు మీ నిర్దిష్ట సందర్భం కోసం పెన్షన్ క్యాలికులేటర్, పెన్షన్ లెక్కింపు సూత్రాన్ని వర్తింపజేయగా నిశ్చింతగా విశ్రమించండి. ఒక పెన్షన్ ప్లానర్ ఉపయోగించడం యొక్క ఫలితము ఏమిటంటే, మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో ఏడాదికి మీకు ఎంత ఆదాయం అవసరమవుతుంది మరియు ప్రశాంతమైన మరియు స్వతంత్రమైన భవిష్యత్తు ఉండేలా చూసుకోవడానికి మీరు ఈ రోజున ఎంత సొమ్ము ప్రక్కన పెట్టాల్సి ఉంటుంది అనేదాన్ని మీరు చూస్తారు. ఒక రిటైర్‌మెంట్ క్యాలికులేటర్, మీ రిటైర్‌మెంట్ ప్లానింగ్ లక్ష్యాలను సాధించడానికి సహాయపడగల ఆర్థిక సాధనాల రకాలపై దృష్టి సారించడానికి కూడా మీకు వీలు కల్పిస్తుంది.

పెన్షన్ లెక్కింపు సూత్రము

పెన్షన్ లెక్కింపు సూత్రము ఆదాయం యొక్క ప్రస్తుత విలువ, ద్రవ్యోల్బణం యొక్క ఊహించిన రేటు, మీరు రిటైర్ కావడానికి ముందు మీరు పొదుపు చేసుకోవడానికి మీకు మిగిలి ఉన్న సమయమును పరిగణిస్తుంది. పెన్షన్ లెక్కింపు సూత్రమును ఉపయోగించుకొని, మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో మీరు ఎంత మొత్తం వార్షిక ఆదాయం లేదా భవిష్యత్ విలువను సృష్టించుకోవాల్సి ఉంటుందో రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ మీకు చూపుతుంది. ప్రాథమికమైన పెన్షన్ లెక్కింపు సూత్రము FV=PV(1+r) ^n, ఇక్కడ FV అంటే భవిష్యత్ విలువ/ఆదాయం, PV అంటే ప్రస్తుత విలువ/ ఆదాయం, r అనేది ఊహించిన ద్రవ్యోల్బణం రేటు, మరియు n అనేది రిటైర్‌మెంట్ కావడానికి మిగిలి ఉన్న సమయం.

మాన్యువల్ గా లెక్క చేసుకోవడానికి మీరు ఈ సూత్రమును ఉపయోగించడం కంటే, ఒక పెన్షన్ ప్లానర్ ఉపయోగిస్తే మీకు సమయం మరియు శక్తి ఆదా అవుతుంది. ఒక నెలవారీ పెన్షన్ క్యాలికులేటర్ యొక్క ప్రక్రియ పూర్తిగా రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ తో ఆటోమేట్ చేయబడి ఉంటుంది కాబట్టి తప్పుగా లెక్కించే ముప్పును కూడా త్రోసివేస్తుంది. ఒకసారి మీరు మీ వివరాలను ఉంచారంటే, చక్కని రిటైర్‌మెంట్ క్యాలికులేటర్, మీ రిటైర్‌మెంట్ కోసం సకాలములో మీరు ఎంత మొత్తం పొదుపును కూడగట్టుకున్నారో మీకు చూపించడానికి ద్రవ్యోల్బణం కొరకు ఆపత్కాల నిధిపై మీ రాబడి రేటును సర్దుబాటు చేస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ ని ఎలా ఉపయోగించాలి?

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ అనేది, ఒకవేళ మీరు మీ ప్రస్తుత జీవనశైలిని నిర్వహించుకోవాలనుకుంటే మీకు ఎంత మొత్తం వార్షిక ఆదాయం అవసరమవుతుందో లెక్కించుకోవడానికి మీకు వీలు కల్పించే ఒక చేతి సాధనము. నేపధ్యములో ఒక పెన్షన్ క్యాలికులేటర్ సూత్రమును ఉపయోగించుకోవడం ద్వారా, ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్, పెన్షన్ ప్లానర్ పనుల నుండి ఒక ఊహాత్మక పనిని తీసుకుంటుంది. కేవలం కావలసిన ఆవశ్యక సమాచారం ఉంచండి మరియు మీ రిటైర్‌మెంట్ ప్లానర్ మరియు మార్గదర్శిగా ఉండేందుకు ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి క్యాలికులేటర్ కు వీలు కల్పించండి.

రిటైర్‌మెంట్ ప్లానర్ ఆన్‌లైన్ ఉపయోగించడానికి దశలు:

 • ఈ క్షణానికి మీ వయస్సును సంవత్సరాలలో ఎంటర్ చేయండి.
 • రిటైర్‌మెంట్ నాటికి మీరు ఆశించిన వయస్సును ఇవ్వండి.
 • జీవితకాలవ్యవధి ఆకాంక్షను ఎంటర్ చేయండి, మీకు ఎన్ని సంవత్సరాలు పెన్షన్ సంపాదనలు అవసరమవుతాయో ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ క్యాలికులేటర్ లెక్క కడుతుంది.
 • ప్రస్తుత ఆదాయం మరియు రిటైర్‌మెంట్ అనంతరం కావాల్సిన నెలవారీ/వార్షిక ఆదాయాన్ని ఎంటర్ చేయండి.
 • ఊహించబడిన ఒక ద్రవ్యోల్బణ రేటును ఎంపిక చేసుకొని ద్రవ్యోల్బణం కొరకు సర్దుబాటు చేయండి.

రిటైర్‌మెంట్ తర్వాత మీకు ఎంత మొత్తం వార్షిక ఆదాయం కావాల్సి ఉంటుందో నిర్ధారించడానికి రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్, పెన్షన్ లెక్కింపు సూత్రాన్ని వర్తింపజేసుకోనివ్వండి. ప్రస్తుతమున్న రిటైర్‌మెంట్ మదుపులు మరియు వాటి సంభావ్య రాబడులు (నెలవారీ భవిష్యనిధి చందాలు, షేర్లు, బంగారం మదుపులు, భూమి/ఆస్తి పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ రాబడులు) వంటి వివరాలను జోడించడం ద్వారా, మీరు మరింత కచ్చితమైన రిటైర్‌మెంట్ ప్లానర్ సలహాను పొందగలుగుతారు.

ఈ వివరాలన్నింటినీ పరిగణించుకున్న తర్వాత, మీకు ఉన్న సమయం లోపల మీ రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి కోసం మీరు ఇంకా ఎంత ఎక్కువ మదుపు మరియు పొదుపు చేయాల్సి ఉంటుందో మీకు ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ సూచిస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లానర్ ఆన్‌లైన్ ఉపయోగించుకోవడం సులభము మరియు ఖర్చు లేనిది. ఈ పెన్షన్ క్యాలికులేటర్ తో అనేక లెక్కింపుల యొక్క అంతిమ ఫలితాలను మీరు సరిచూసుకోగలుగుతారు. మీరు చేయవలసిందల్లా, కేటాయించబడిన ఆయా బాక్సులలో విలువలను ఎంటర్ చేయడం ద్వారా రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ అడిగే ప్రాథమిక ప్రశ్నలకు జవాబులివ్వడమే. రిటైర్‌మెంట్ ప్లానర్ క్యాలికులేటర్, పెన్షన్ లెక్కింపు సూత్రమును వర్తింపజేసిన తర్వాత సెకెన్ల వ్యవధిలోనే విలువలను ప్రదర్శిస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానర్ మరియు రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ అనేది, నేటి నుండి మొదలై రిటైర్‌మెంట్ వరకూ ప్రతినెలా మీరు పొదుపు చేసుకోవాల్సిన ప్రశస్తమైన డబ్బు మొత్తాలను మీరు లెక్క కట్టుకోవడానికి సహాయపడేందుకై ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక విశ్వసనీయమైన సాధనము. మీ రిటైర్‌మెంట్ కొరకు ప్రణాళిక చేసుకోవడమనేది అనేక ప్రయోగాలు మరియు పొరపాట్ల పని కావాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్ ప్లానర్ లక్ష్యాలను మొదట్లోనే ఏర్పరచుకోవడానికై ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ని ఉపయోగించుకోండి.

ఒక రిటైర్‌మెంట్ క్యాలికులేటర్‌ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఏవేవి?

ఒక కచ్చితమైన పెన్షన్ ప్లానర్ అనేది విసుగు రహితమైన రిటైర్‌మెంట్ ని సులువుగా ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడే ఒక ఆవశ్యకమైన సాధనము. ఈ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ సాధనం ఆన్‌లైన్ లభ్యత ఉన్నందువల్ల మరియు వాడకానికి ఉచితం కావున, మీరు కొద్ది నిముషాల్లోనే మీ రిటైర్‌మెంట్ ప్లాన్ ని సరిచూసుకోవచ్చు. మీ మార్గాన్ని సంతోషదాయకమైన రిటైర్‌మెంట్ కు చేసుకోవడానికి గాను ఈ రిటైర్‌మెంట్ ప్లాన్ చుట్టూ మీ డబ్బును మదుపు చేసుకోండి.

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ ఉపయోగించడం పట్ల ఈ క్రింది విధమైన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

ఒక చక్కని రిటైర్‌మెంట్ ప్లానర్ కి ప్రాప్యతను పొందండి

రిటైర్‌మెంట్ ఫండ్ క్యాలికులేటర్ మీ రిటైర్‌మెంట్ ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేసుకోవడంలో సహాయపడుతుంది. మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల్లో ప్రపంచాన్ని చుట్టిరావాలనుకున్నా లేదా ప్రశాంతంగా ఉండే ఇరుగుపొరుగులో స్థిరపడాలనుకున్నా, మీ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి మీకు కొంత నిర్దిష్ట మొత్తం కావాల్సి ఉంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానర్ అనేది, మీ వృత్తిపరమైన ఆదాయం ఆగిపోయిన తర్వాత సైతమూ మంచి జీవితం గడపడానికి మీకు ఎంత డబ్బు అవసరమై ఉంటుందో మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక కరదీపిక.

మీ ఆర్థిక వ్యవహారాల యొక్క స్పష్టమైన లెక్కను పొందండి

సంపూర్ణం అనేది దాని విడిభాగాల మొత్తముకంటే పెద్దది. ఈ రోజున మీరు ఎంత సంపాదిస్తున్నారు, రిటైర్‌మెంట్ తర్వాత సుఖంగా జీవించడానికి ఎంత మొత్తం కావాల్సి ఉంటుంది, ఇంకా మీ కోసం మరియు మీ ప్రియమైనవారి కోసం ప్రశాంతమైన జీవనానికి భవిష్యత్తు కోసం మీరు ఎంత మదుపు చేశారు అనే విషయాలు మీకు ఇదివరకే తెలుసు. ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి క్యాలికులేటర్ ఈ అన్ని విచ్చలవిడి వివరాలను కలుపుకొని పెన్షన్ లెక్కింపు సూత్రాన్ని వర్తింపజేస్తుంది, మరియు మీకు సంపూర్ణమైన మదుపు-రాబడి సన్నివేశం యొక్క ఒక స్పష్టమైన దృశ్యాన్ని ఇస్తుంది.

వాడకానికి సులువుగా ఉండే ఒక రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ యొక్క ప్రయోజనాలను రాశి చేసుకోండి

మనలో అనేకమంది లెక్కల్లో నిష్ణాతులు కాదు. చెప్పుకోవాలంటే, ఏదేని రిటైర్‌మెంట్ ప్లానర్ సాధనము సులభంగా మరియు వాడకానికి నేరుగా ఉండడమనేది చాలా కీలకం. ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానర్ ఈ అవసరాలను తీరుస్తుంది. కావలసియున్న మదుపరి వివరాలు మీరు బుక్స్ నుండి తెలుసుకోగలిగినట్టి సులువైనవి మరియు ముక్కుసూటిగా ఉండేవి, అవి—మీ ప్రస్తుత వయస్సు, బహుశా రిటైర్‌మెంట్ సమయానికి వయస్సు, నెలసరి ఆదాయం, నెలసరి ఖర్చులు మరియు ప్రస్తుతమున్న పెట్టుబడులు. ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ క్యాలికులేటర్ లోని పెన్షన్ లెక్కింపు సూత్రము సెకెన్ల కాల వ్యవధిలో ఫలితాలను మనముందు ఉంచుతుంది.

మీ సమయం మరియు శక్తిని ఆదా చేసుకోండి

మీ రిటైర్‌మెంట్ కొరకు మీరు మాన్యువల్ గా ప్లాన్ చేసుకోవాలంటే, అది సమయం-గడిచిపోయేది మరియు అలసట కలిగించే ప్రక్రియ అవుతుంది. మీరు ప్రశాంతంగా రిటైర్ కావడానికి ఎంత మొత్తం కావాల్సి ఉంటుందో, దాన్ని మీరు మొదటిగా లెక్కించుకోవాలి, మరి ఆ తర్వాత, ఈ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎటువంటి మదుపు మీకు సహాయపడుతుందో లెక్క కట్టుకోవాలి. పెన్షన్ క్యాలికులేటర్ అన్ని వివరాలనూ పరిగణించుకొని పొడవైన లెక్కింపులను కొద్ది సెకెన్లలోనే చేయగలుగుతుంది.

ఒక సమగ్రమైన విశ్లేషణ చేయండి

రిటైర్‌మెంట్ ప్లానింగ్ యొక్క అంతిమ లక్ష్యం ఒకటే అయి ఉంటుంది—అది, మీరు మామూలుగా జీవిస్తున్న సౌకర్య స్థాయిలో మీ మిగతా జీవితాన్ని గడపడానికి గాను తగినన్ని నిధులు ఉండేలా చూసుకోవడమే. అయినప్పటికీ, మీ రిటైర్‌మెంట్ ప్లాన్ చేసుకోవడానికి అనేకమైన విభిన్న మార్గాలు ఉన్నాయి.

 • తక్కువ రిస్కు ఉండే PPF లో మదుపు చేయడం అనేది సరిపోతుందా?
 • మీరు మరింత దూకుడుగా SIP లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయాల్సి ఉంటుందా?
 • ఒక గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ మీ కొరకు అత్యుత్తమ ఐచ్ఛికం అవుతుందా?

రిటైర్‌మెంట్ ప్లానింగ్ విషయానికి వస్తే ఒక రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి క్యాలికులేటర్ మీ ఆప్తమిత్రుడు అవుతుంది. ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లానర్, వివిధ ఆర్థిక సాధనాలలో మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను బాగా దగ్గరగా సాధించడానికి ఏవి సహాయపడతాయో పోల్చి చూసుకునే అవకాశాన్ని మీకు అందజేస్తుంది. మీకు ప్రస్తుతమున్న మదుపులను మీరు ఎలా మార్పుచేర్పులు చేసుకోవచ్చునో చెప్పడం ద్వారా, ఈ పెన్షన్ ప్లానర్ మీ రిటైర్‌మెంట్ అవసరాలకు బాగా సరిపోయే మంచి ఆర్థిక సాధనాల వైపుకు మిమ్మల్ని నడిపిస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ని ఉచితంగా ఉపయోగించుకోండి

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు వాడకానికి ఉచితం, ఒక రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ ఉపయోగించుకొని మీరు ఎంతో చేసుకోవచ్చు. మీ భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా మీ ప్రస్తుత మదుపులను తిరిగి సర్దుబాటు చేసుకోవడానికై మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు లెక్క చేసుకోవడానికి నెలసరి పెన్షన్ క్యాలికులేటర్ పొందండి.

రిటైర్‌మెంట్ కొరకు ఎంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి?

పనిచేస్తున్న వ్యక్తి రిటైర్‌మెంట్ మదుపుల కోసం తన నెలవారీ ఆదాయములో కనీసం 10-15 % ఆదాయాన్ని ప్రక్కన పెట్టాలనేది సామాన్యమైన నియమము. మీరు రిటైర్‌మెంట్ ప్లాన్ మొదలుపెట్టడానికి ఇది అతి శ్రేష్టమైన చోటు అయి ఉండగా, మీ రిటైర్‌మెంట్ అనంతర అవసరాలన్నింటినీ తీర్చడానికి అది సరిపోకపోవచ్చు.

మీ రిటైర్‌మెంట్ తర్వాత మీ నెలసరి ఆదాయములో ఎంతవరకు తగ్గిపోతుందో కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అనేక మందికి, రిటైర్‌ అయిన తర్వాత నెలవారీ ఆదాయం సుమారు 75% తగ్గిపోతుంది. రిటైర్‌మెంట్ ప్లానర్ లో ద్రవ్యోల్బణం తీరులు, సంభావ్య ఖర్చులు, మరియు రాబడిలో ఊహించిన లోటు అన్నింటినీ పరిగణించుకొని, చింతలేని విశ్రాంత జీవనం గడపడానికి మీకు ఎంత మొత్తం అవసరమై ఉంటుందో మీరు లెక్కకట్టుకోవచ్చు.

అనేకమంది ఆర్థిక నిపుణులు ఒక ఆపత్కాల నిధి గనక రిటైర్‌మెంట్ కొరకు రు. 1 కోటిని కేటాయించినట్లయితే అది మంచి ఆకాంక్ష అవుతుందని అంగీకరిస్తారు. అయినప్పటికీ, మీ అవసరాలకు సరిపోయే రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి విలువను పొందడానికి గాను మీ నిర్దిష్టమైన ఖర్చులు, ఆదాయం, మరియు భవిష్యత్తు కొరకు ఆశలు, వీటన్నింటినీ మనసులో ఉంచుకోవడం ఆవశ్యకం.

రిటైర్‌మెంట్ ప్లానులను అన్వేషించండి

ఇండియాఫస్ట్
గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్

Buy Online

ఇండియాఫస్ట్
ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్

GET A QUOTE

ఇండియాఫస్ట్
లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

BUY ONLINE

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లానర్/పెన్షన్ క్యాలికులేటర్, అంచనా వేయబడిన జీవితకాల ఆకాంక్షను ఎందుకు అడుగుతుంది?

ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానర్, మీ విశ్రాంత జీవితాన్ని సుఖంగా గడపడానికి మీకు ఎంత రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి అవసరమవుతుందో లెక్క చేస్తుంది. ఇది చేయడానికి గాను, ఆపత్కాల నిధి మీకు ఎంతకాలం ఉండాలో లెక్క చేసుకోవడం రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ కు అవసరమవుతుంది. ఒకవేళ మీరు 60 ఏళ్ళ వయసులో రిటైర్ అయ్యారనుకోండి, మరియు జీవిత కాలం 85 సంవత్సరాల వరకూ ఉండొచ్చని అనుకున్నారనుకోండి. ఆ పరిస్థితిలో, ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్, రిటైర్‌మెంట్ తర్వాత ఆ 25 సంవత్సరాల నిర్వహణకు మీకు ఎంత ఆపత్కాలనిధి అవసరమవుతుందో లెక్కింపు చేసుకోవాల్సి ఉంటుంది.

నేను ఒక పెన్షన్ క్యాలికులేటర్ ని ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి?

మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకోవాలంటే ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ వంటి నమ్మదగిన రిటైర్‌మెంట్ ప్లానర్ ఆవశ్యకమవుతుంది. మీ ప్రస్తుత జీవనశైలి మరియు ఖర్చుల ఆధారంగా భవిష్యత్తులో మీకు మీరుగా నిలదొక్కుకోవడానికి మీకు ఎంత మొత్తం అవసరమవుతుందో ఒక రిటైర్‌మెంట్ ప్లానర్ లెక్క కడుతుంది. ఒకవేళ మీకు కావలసిన ఆపత్కాల నిధి మీరు మొదట్లో ఊహించినదానికంటే ఎక్కువ అని మీరు గ్రహించినట్లయితే, మీ మదుపులు మీ రిటైర్‌మెంట్ అవసరాలకు కుదిరిపోయేలా మీరు తిరిగి సవరించుకోవచ్చు. ఒక పెన్షన్ లెక్కింపు సూత్రమును ఉపయోగించడమనేది సమయం వృధా అయ్యే ప్రక్రియ కాబట్టి ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ ఎంచుకోవడం ద్వారా మీరు సులభంగా ప్రక్కకు అడుగువేయవచ్చు.

ఒక రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఉపయోగించడానికి అవసరమైన వివరాలు ఏవేవి?

ఒక రిటైర్‌మెంట్ ప్లానర్ కు కావలసిన సమాచారము సులువు మరియు ప్రాథమికం. అందులో ఇవి ఉంటాయి:

 • మీ ప్రస్తుత వయస్సు
 • రిటైర్‌మెంట్ నాటికి మీ వయస్సు
 • మీరు అంచనా వేసుకున్న జీవితకాల ఆకాంక్ష
 • మీ ప్రస్తుత వార్షికాదాయము
 • మీ ఆదాయం వార్షికంగా పెరిగే రేటు
 • ప్రస్తుత రిటైర్‌మెంట్ పొదుపులు మరియు పెట్టుబడుల ఆపత్కాల నిధి
 • మీరు ప్రస్తుతం కలిగియున్న మదుపుల రకాలు
 • మొత్తం నెలవారీ ఖర్చులు
 • అంచనా వేయబడిన ద్రవ్యోల్బణ రేటు

మీరు ఈ అంచనాలను ఇచ్చారంటే, మీ కోసం రిటైర్‌మెంట్ ఫండ్ క్యాలికులేటర్ క్షణాల్లో కష్టపడి పనిచేస్తుంది. ఇవ్వబడిన డేటాకు పెన్షన్ లెక్కింపు సూత్రాన్ని వర్తింపజేయడం ద్వారా, ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానర్ మీకు మీ రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి లక్ష్యాన్ని అందిస్తుంది. రిటైర్‌మెంట్ అవసరాలు మరియు వివిధ రకాల పెన్షన్ ప్లానులు మరియు మదుపు కొరకు మార్గాలను నెరవేర్చుకోవడానికై మీ నెలసరి పొదుపుల లోనికి కూడా మీకు ఒక గ్రాహ్యత వస్తుంది.