ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు

సులువైనది, ప్రామాణికం మరియు సమర్థవంతమైనది

మీ నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను మనసులో ఉంచుకొని ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క సరల్ ప్లానులు రూపొందించబడ్డాయి. మీరు సులభంగా అర్థం చేసుకోవడానికై ప్రయోజనాలు ప్రామాణికం మరియు సులువు చేయబడ్డాయి మరి తద్వారా మీ మరియు మీ కుటుంబ భవిష్యత్తును సుస్థిరం చేసుకొనేటప్పుడు ఒక విజ్ఞత గల నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి

  • అర్థం చేసుకోవడానికి సులువు

    కనీస మద్దతుతో అర్థం చేసుకోగలిగేలా చాలా సరళంగా నిర్మించబడిన ప్లానులు

  • స్పష్టంగా పేర్కొనబడిన ముందస్తు ప్రయోజనాలు

    మీరు ప్లాన్ ని కొనడానికి ముందే, మేము మీ కోసం స్పష్టంగా పేర్కొనియున్నాము కాబట్టి ప్రయోజనాలను తెలుసుకొని అర్థం చేసుకుంటారు

  • ప్రామాణికం చేయబడిన అందజేత

    ఒక విజ్ఞత గల నిర్ణయం తీసుకోవడం మీ హక్కు, ప్రామాణికం చేయబడిన అందజేతలతో దాన్ని సులభంగా చేసుకోండి.

  • పన్ను ప్రయోజనాలు

    ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము మీరు చెల్లించే ప్రీమియములు అదే విధంగా మీరు అందుకునే ప్రయోజనాలపై కూడా పన్ను ప్రయోజనాలు పొందండి

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులను పరిగణించడానికి కొన్ని అంశాలు

  • మీరు సుస్థిరపరచుకోవాలనుకునే అవసరాన్ని మీ ఆర్థిక అవసరముగా ఎంచుకుంటాయి

  • మీ జీవిత దశ ఆధారంగా ప్లాన్

  • మీ ప్రయోజనాలను అర్థం చేసుకోండి

  • వివిధ ప్లాను మరియు ఫీచర్ ఐచ్ఛికాల నుండి ఎంచుకోబడ్డాయి

సరల్ ప్లాన్


మీ ప్రాథమిక ఆర్థిక లక్ష్యాలను తీర్చుకోవడం మరియు భవిష్యత్తు యొక్క అనిశ్చితుల నుండి మీ కుటుంబాన్ని రక్షించాలనే విషయానికి వచ్చినప్పుడు, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు అనేవి మీ వరకు మీకు కచ్చితంగా అవసరమైనట్టివి. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లాన్ అందజేతలతో మీ కుటుంబం యొక్క భవిష్యత్ సంక్షేమం కోసం తెలియజేయబడిన ఒక ఆర్థిక నిర్ణయాన్ని తీసుకోండి. సులువైనవి మరియు అర్థం చేసుకోగలిగినవి అయిన ప్రామాణిక ప్రయోజనాలు మరియు పాలసీ షరతుల యొక్క ప్రయోజనావకాశాల్ని ఆనందించండి.

బీమాదారుల వ్యాప్తంగా ప్రామాణికమైన మరియు ఏకరూపమైన బీమా ఉత్పత్తులను అందించడానికి గాను రూపకల్పన చేయబడి, IRDAI-ఆమోదిత సరల్ ప్లానులు మీ నిర్దిష్ట ఆర్థిక అవసరాలను మనసులో ఉంచుకొని రూపొందించబడ్డాయి.

  • భవిష్యత్తులో మీ ఆర్థికపరమైన ఆవశ్యకతలను తీర్చుకోవడానికి, మీ వృత్తిపరమైన ఆదాయము ఆగిపోగానే మిమ్మల్ని మంచి స్థితిలో ఉంచగలిగిన ఒక పెన్షన్ ప్లాను మీకు కావాల్సి ఉంటుంది.
  • మీ అకాల మరణము యొక్క దురదృష్టకరమైన సంఘటనలో, ఒక శుద్ధమైన రక్షణ అవధి ప్లాను ప్రయోజనాలు మీ ప్రియమైన వారికి ఆర్థిక భద్రతను అందించుటలో ఒక్క ఉదుటున ముందుకు రాగలవు.

శుద్ధమైన రక్షణ సరల్ పాలసీ మరియు ఒక పెన్షన్ ప్లానుతో సరల్ స్కీము ప్లానులు మీ ప్రాథమికమైన ఆర్థిక మరియు బీమా ఆవశ్యకతలను కవర్ చేస్తాయి.

మీరు సరల్ ప్లానులను ఎందుకు ఎంచుకోవాలి?


‘సరల్’ అనే పదానికి అర్థం సరళమైనది (నేరుగా) అని. సరల్ ప్లానులు దానికి న్యాయం చేయడానికి రూపొందించబడ్డాయి— సరళము మరియు అర్థం చేసుకోవడానికి సులువైనవి. మీరు ఏ బీమా కంపెనీ నుండి ఒక సరల్ ప్లాన్ ను కొంటారనేదానితో సంబంధం లేకుండా, అందజేతలు క్రమబద్ధం చేయబడ్డాయి, మరియు ప్రాథమిక ఉత్పాదన ఒకటిగానే ఉంటుంది.

అర్థం చేసుకోవడానికి సులువు

మార్కెట్ లో అనేకమైన బీమా ఉత్పత్తులు వెల్లువెత్తుతుండగా, మీ అవసరాల కోసం సరియైనదానిని ఎంచుకోవడమనేది ఒక ప్రక్రియ అవుతుంది. మీరు శ్రద్ధగా పరిశీలించాల్సి ఉంటుంది, ఉత్పాదనను పరిశోధించాలి, పాలసీ పత్రాలను క్షుణ్ణంగా చదవాలి, అన్ని చేకూర్పులు మరియు మినహాయింపులను పరిగణించాలి, మరి ఆ తర్వాత మీ అవధి ప్లాన్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది ఒక మంచి ప్రక్రియ, ప్రత్యేకించి మొట్టమొదటగా బీమా కొనుగోలు చేసే వారికి మరియు కొత్తగా పెట్టుబడి చేసేవారికీ.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు పరిభాషతో తూనిక చేయబడలేదు. అవి సరళంగా నిర్మించబడి, భవిష్యత్-సమృద్ధమై, కనీస తోడ్పాటుతో మరియు అయోమయం లేకుండా సులువుగా అర్థం చేసుకోదగిన 'సరల్’ ప్లానులు.

ప్రామాణికం చేయబడిన అందజేతలు

భారతదేశం బహుముఖమైన ప్రజా సమాజాలకు నెలవుగా ఉంది. అటువంటి వైవిధ్యమైన ఆదాయాలు గల భారీ ప్రజానీకము వ్యాప్తంగా సమానత్వం మరియు ప్రామాణికమైన అందజేతల నిర్వణ అనేది సులభమైన పని కాదు. పైపెచ్చు, అనేకమంది ప్రజలు అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఉంటారు మరియు బీమా ఉత్పత్తులను కొనడానికి అవసరమైనట్టి స్వీకారయోగ్యమైన ఆదాయ ఋజువును కలిగి ఉండరు. ఇది ప్రత్యేకించి స్వయం-ఉపాధి పొందుతున్నవారు మరియు అనియత రంగములో పనిచేస్తూ సంవత్సరానికి రు. 3-5 లక్షలు లేదా అంతకు తక్కువ సంపాదిస్తున్నవారి పట్ల అక్షర సత్యము.

సరల్ ప్లానులు మీ వయసు, లింగము, కులము, విద్యార్హతలు, లేదా ఆదాయముచే ప్రభావితం కాకుండా ప్రామాణికమైన అందజేతలను కలిగి ఉంటాయి. ప్రామాణికమైన మరియు పారదర్శకమైన అందజేతల యొక్క మనశ్శాంతితో ఒక సూచిత నిర్ణయాన్ని తీసుకోండి.

స్పష్టంగా పేర్కొనబడిన ప్రయోజనాలు

బీమా ఉత్పత్తుల తప్పుడు అమ్మకాలను నిలువరించడానికి గాను, సరల్ ప్లానులు స్పష్టంగా పేర్కొనబడిన మరియు అర్థం చేసుకోవడానికి సులభమైన ప్రయోజనాలను జాబితా చేస్తాయి. ఈ పారదర్శకతయే సరల్ ప్లానుల యొక్క ఎంతో ప్రియమైన అంశము, ఎందుకంటే ఇది ఊహాత్మకమైన పని యొక్క అవసరాన్ని తగ్గిస్తుంది. మీరు ఇండియాఫస్ట్ సరల్ ప్లానులను కొనడానికి ముందు, మీకు సరల్ స్కీము అందించే లాభాలు మరియు ప్రయోజనాల గురించి మీవద్ద మొత్తం సమాచారం మరియు లోతైన అవగాహన పొంది నిశ్చింతను పొందవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులతో, మీరు అటూ ఇటూ ప్రాకులాడనవసరం లేదు, ‘ఇందులో నాకేమి ఉంది?” అని. మొట్టమొదటి నుండీ స్పష్టంగా నిర్వచించబడిన ప్రయోజనాలు మరియు నిబంధనలను సరల్ ప్లానులు జాబితా చేస్తాయి.

పరిమితమైన కనీస నిర్బంధాలు

ఒక అవధి బీమా ప్లాన్ లేదా ఒక పెన్షన్ యాన్యువిటీ ఉత్పాదన మీ కోసం ఒక ఆవశ్యకమైన ఆర్థిక నిర్ణయాన్ని అందజేస్తుంది. అయినప్పటికీ, మీకు ఏ పాలసీ అందజేయబడుతోంది అనేదాని ఆధారంగా బీమాదారులు కూడా నిర్దిష్టమైన ప్రాతిపదిక కలిగి ఉంటారు. ఉదాహరణకు, ఎవరైనా వ్యక్తికి ఒక అవధి ప్లానును అండర్‌రైటింగ్ చేసే ముందుగా, బీమాదారు లింగము, వృత్తి, విద్యార్హతలు, నివాస స్థలము, ఆదాయం మొదలగు వంటి అంశాల లోనికి చూస్తారు. ఆమోదించబడిన పాలసీతో సైతమూ, అనేకమంది తాము ఆశించిన భరోసా మొత్తము తమకు ఇవ్వబడలేదని కనుగొంటారు. ఈ ప్రారంభ పరిశీలనలు మీ తరఫున అనుకూలంగా పనిచేయకపోవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు భారతీయ పౌరులు అందరికీ వారి చదువు, శ్రేణి, లేదా వృత్తితో నిమిత్తం లేకుండా అందరికీ ఉద్దేశించబడ్డాయి. కనీస నిర్బంధాలతో ఆర్థిక భద్రతను పొందండి.

పన్ను ప్రయోజనాలు

బీమా కొనుగోలును మీరు పన్ను ప్రయోజనాలు మరియు మినహాయింపులను కోరడానికి ఉపయోగించుకోవచ్చు అనేది బీమా ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఒక ప్రయోజనంగా ఉంది. మీరు ఏ సరల్ పాలసీని ఎంచుకున్నారన్నదానితో సంబంధం లేకుండా, మీరు సరల్ స్కీము కొరకు చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు అందుకుంటారు మరియు పాలసీ అవధి యొక్క ముగింపులో మరణ/ మెచ్యూరిటీ ప్రయోజనాలను అందుకుంటారు.

దేశములో ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టాల ఆధారంగా ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు పన్ను ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లాన్‌లు

బీమా ఉత్పత్తులు ఎల్లప్పుడూ చట్టపరమైన భాషతో బరువెక్కి ఉంటాయి. అనేక సంవత్సరాలుగా, ఈ పరిభాష బీమా ఉత్పత్తులను అర్థం చేసుకోవడం కష్టమయ్యేలా చేసింది, తాము దేనికోసం చెల్లిస్తున్నామో అనేదాని గురించి అనేకమంది అయోమయానికి గురయ్యేలా చేసింది. ఇండియాఫస్ట్ లైఫ్ బీమా ఈ పరిభాషను సరళం చేయడం మరియు మీకు సంబంధిత సమాచారాన్నంతటినీ సులభంగా అర్థమయ్యే తీరులో ఇవ్వడంలో నమ్మకం ఉంచుతుంది. IRDAI-ఆమోదిత ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు అదే సంప్రదాయములో కొనసాగుతాయి—సరల్ ప్లానులు, సరల్ ప్రయోజనాలు.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ పెన్షన్ ప్లాన్

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ పెన్షన్ ప్లాన్ అనేది ఒక సింగిల్-ప్రీమియం, అనుసంధానం - కాని, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత ఇమ్మీడియేట్ యాన్యువిటీ పాలసీ. ఈ సరల్ స్కీము రెండు సరళమైన యాన్యువిటీ ఆప్షన్ల క్రింద ప్రామాణికమైన ప్రయోజనాలను అందిస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాను అనేది, స్థోమతకు తగిన ఖరీదులో జీవిత వర్తింపు మరియు ఆర్థిక రక్షణ అందించడానికి ఉద్దేశించబడియున్న ఒక అనుసంధానించబడని, నాన్- పార్టిసిపేటింగ్, వ్యక్తిగతమైన శుద్ధ అవధి బీమా పాలసీ అయి ఉంది. ఈ సరల్ పాలసీ మీ ప్రియమైనవారిని 40 సంవత్సరాల వరకూ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

సరల్ ప్లానుల కొరకు పరిగణించాల్సిన అంశాలు ఏవేవి?


సరల్ ప్లానులు అనేవి రెగ్యులేటర్-తప్పనిసరియైనవి, మరియు అవి పాలసీదారులందరికీ ప్రామాణికమైన ప్రయోజనాలను అందిస్తాయి. సరల్ స్కీము అంశాలు, నిర్దిష్ట సరల్ పాలసీ షరతులు మరియు నిబంధనలు, మరియు ప్రాథమిక సరల్ ప్లాన్ ప్రయోజనాలు బీమాదారులందరి వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. సరల్ ప్లానులతో, వ్యత్యాసము కలిగించేవి ప్రీమియం ఛార్జీలు, సులభమైన ఆన్-బోర్డింగ్, విక్రయానంతర మద్దతు, బీమాదారు యొక్క విశ్వసనీయత, మరియు క్లెయిము పరిష్కార నిష్పత్తి. మీరు ఒక సరల్ ప్లాన్ ఎంచుకొనే ముందుగా, పరిగణించాల్సిన కొన్ని కీలకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి:

మీరు సుస్థిరపరచుకోవాలనుకునే అవసరాన్ని ఎంచుకోండి

మీకు మీరుగా వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, మీ ఆర్థిక లక్ష్యాలు ఏవేవి అని. జీవిత వర్తింపును ఆనందిస్తూనే మీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తును సుస్థిరం చేయాలని మీరు ఆశిస్తున్నారా లేదా మీ రిటైర్-అనంతర కాలానికి పొదుపు చేసుకోవాలనుకుంటున్నారా? మీ మరణం తర్వాత సైతమూ మీ జీవిత భాగస్వామి ఆదాయాన్ని అందుకొనేలా చూసుకోవాలని మీరు అనుకుంటున్నారా? మీ ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోండి, మరియు మీరు సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్న అవసరాన్ని ఎంచుకోండి.

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులతో, మీరు శుద్ధమైన సంరక్షణ ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమాతో మీ జీవితాన్ని రక్షించుకునేలా ఎంచుకోవచ్చు. రిటైర్‌మెంట్-అనంతరం మీ ఆదాయాన్ని భర్తీ చేయగల ఒక పెన్షన్ నిధిని మీరు సృష్టించుకోవాలనుకుంటే, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ పెన్షన్ ప్లాను మీకు సరియైనది.

మీ జీవిత దశ ఆధారంగా ప్లాన్

మీ ప్రధాన ఆర్థిక లక్ష్యము తరచుగా మీరు ఏ జీవితదశలో ఉన్నారనేదాన్ని ప్రతిఫలిస్తుంది. కుటుంబం లోని బాధ్యతాయుతమైన సంపాదనాపరుడిగా, మీ అకాల మరణం సంభవించిన పక్షములో మీ ప్రియమైన వారికి ఏమి జరుగుతుందో అని మీరు రాత్రివేళల్లో ఆలోచిస్తూ ఉంటారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అటువంటి పరిస్థితి గనక వస్తే, ఆర్థికపరమైన కష్టాల నుండి వారిని రక్షించడమనేది మీ బాధ్యతగా ఉంటుంది. ఒక సరల్ స్కీము అవధి ప్లాను భవిష్యత్తులో మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తూనే మీ జీవిత వర్తింపు అవసరాలను నెరవేరుస్తుంది.

మీకు వయసు పెరిగే కొద్దీ, మీ సంపాదన ఆగిపోగానే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని కూడా మీరు ఆలోచించడం మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు కూడా తమ ప్రియమైన వారిపై భారంగా ఉండాలని అనుకోరు. ఒక సరల్ స్కీము పెన్షన్ ప్లానుతో, మీరు రేపటి కొరకు ఈ రోజే సుస్థిరపరచుకోవడం మొదలుచేయవచ్చు. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులలో ఒకదాన్ని ఎంచుకునే ముందుగా, మీ జీవిత దశను పరిగణించండి మరియు మొదటగా అత్యంత ప్రాధాన్య అవసరాన్ని తీర్చే ప్లాన్ ని ఎంపిక చేసుకోండి.

మీ ప్రయోజనాలను అర్థం చేసుకోండి

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులతో, సరల్ స్కీము ప్లానులు మరియు ఇండియాఫస్ట్ లైఫ్ బీమాను ఎంచుకోవడం ద్వారా మీరు పొందే లాభాలు మరియు ప్రయోజనాలు మీ కోసం స్పష్టంగా పేర్కొనబడ్డాయి. సరల్ పాలసీలో అందించబడే ప్రయోజనాల్ని అర్థం చేసుకోండి—మెచ్యూరిటీ/మరణ ప్రయోజనాలు, ప్రీమియం చెల్లింపు షరతులు, జీవిత కవరేజీ ఆవశ్యకతలు, పన్ను ప్రయోజనాలు, లోన్ సౌకర్యాలు మొ. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానుల నుండి మీరు ఏమేమి పొందగలుగుతారని మీరు తెలుసుకున్నప్పుడు, సంపూర్ణ మనశ్శాంతితో మీరు ఒక తెలియజేత నిర్ణయాన్ని తీసుకోవచ్చు.

వివిధ ప్లాను మరియు ఫీచర్ ఐచ్ఛికాల నుండి ఎంచుకోండి

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ ప్లానులు అర్థం చేసుకోవడానికి మరియు వాడటానికి సులభమైన ప్రయోజనాలు మరియు అంశాలను అందించడానికి రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాను, క్రమం తప్పని ప్రీమియం చెల్లింపుదారులకు, పరిమిత ప్రీమియం సరల్ ప్లానులు, మరియు సింగిల్ ప్రీమియం చెల్లింపుదారులకు బహుళ ప్రీమియం చెల్లింపు అవధి (PPT) ఆప్షన్లను కలిగియుంది. PPT, పాలసీ అవధి, ప్రీమియం చెల్లింపు అంతరము, భరోసా మొత్తము, యాన్యువిటీ ఆప్షన్లు (సరల్ పెన్షన్ ప్లానుల కొరకు), మరియు మరెన్నో ప్లాన్ ఫీచర్లను ఎంచుకోండి. మీ సరల్ పాలసీ ప్రామాణిక ప్రయోజనాలను అందిస్తుందని నిశ్చింతగా ఉండండి, ఐతే సరల్ ప్లాన్ మీ అవసరాలకు కచ్చితంగా సరిపోయేలా చూసుకోవడానికి మీరు ప్లాన్ ఫీచర్లు మరియు ఆప్షన్లను ఎంచుకోవచ్చు.