Power of Compounding

  • yr
    1 yr 99 yrs
  • yr
    1 yrs 99 yrs
  • %
    |
    1%
    |
    30%

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏమిటి?  

కాంపౌండింగ్ అనేది, దాని గుణకపు ప్రభావం కారణంగా ఒక విశ్వసనీయమైన సంపద ఉత్పన్నకారిగా చేసే ఒక సులువైన భావజాలము. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది అసలు మొత్తము మరియు మునుపటి కాలవ్యవధుల నుండి కూడగట్టుకున్న వడ్డీ పైన వడ్డీని సంపాదిస్తుంది కాబట్టి, ఒక మదుపు పెరగడానికి మరియు మరింత డబ్బు చేసుకోవడానికి సంభావ్యతను అది తెలియజేస్తుంది.    

సులువైన మాటల్లో చెప్పాలంటే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే వడ్డీపై వడ్డీ సంపాదించుకోవడం (చక్రవడ్డీ) అన్నమాట. కూడగట్టుకున్న ఈ ప్రభావము మీకు అధిక రాబడులను ఇవ్వడానికి మీ మదుపును పెంపొందిస్తుంది మరియు మీరు మదుపు చేస్తున్నంత కాలమూ ఎక్కువగా సంపాదించుకునే వీలు కలిగిస్తుంది.  మదుపుపై ఆశించబడిన రాబడులను నిర్ధారించుకోవడానికి కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తి మీకు సులభంగా సహాయపడగలుగుతుంది.  

కాంపౌండింగ్ శక్తి ఎలా పనిచేస్తుంది?  

చక్రవడ్డీ యొక్క శక్తి ఒక దీర్ఘ-కాలిక మదుపు వ్యూహముగా అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. అది నిరంతరంగా వడ్డీని లేదా మీ అసలు మొత్తముపై సంపాదించుకున్న డివిడెండ్లను తిరిగి మదుపు చేయడం ద్వారా మీ కోసం మీ డబ్బును మరింత సంపాదించేలా చేస్తుంది. ఆ ప్రభావంగా, అది మీ డబ్బును సంపదను ఉత్పన్నం చేసే మూలముగా మార్పిడి చేస్తుంది. ఒకవేళ సరియైన ఆస్తిలో గనక మదుపు చేసినట్లయితే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అసాధారణమైన రాబడులను ఉత్పన్నం చేసుకోవడానికి మీకు వీలు కలిగిస్తుంది.  

అత్యుత్తమమైన భాగం ఏదంటే, ఒకవేళ మీరు కొంత పెట్టుబడి మొత్తమును మదుపు చేసినట్లయితే, అధిక రాబడులను నిర్ధారణ చేసుకోవడానికి మీరు చక్రవడ్డీ క్యాలికులేటర్ ఉపయోగించవచ్చు మరియు నిర్ణీత రాబడి రేటుతో కొంత కాలవ్యవధి పాటు వడ్డీ కూడగట్టడానికి అనుమతించవచ్చు. కాంపౌండింగ్ క్యాలికులేటరు యొక్క శక్తి అనేది మీ ఆర్థిక ప్రణాళికకు భద్రత మరియు స్పష్టతను జోడించే ఒక శక్తివంతమైన సాధనము.  

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ /చక్రవడ్డీ క్యాలికులేటరును ఉపయోగించుకోవడం ఎలా?   

కాంపౌండింగ్ అనేది దీర్ఘ-కాలిక సంపద సృష్టికి ఎలా దోహదపడుతుందో చూడడానికి క్యాలికులేటరు కాంపౌండింగ్ క్యాలికులేటరు మీకు సహాయపడగలుగుతుంది.  

కాంపౌండింగ్ సూత్రము యొక్క శక్తి, అసలు పెట్టుబడిపై లాభాన్ని మాత్రమే సంపాదించే సామాన్య వడ్డీ రేట్ల కంటే వేగంగా అదనపు సంపాదనలను పొందడానికి సహాయపడుతుంది.   

మీ అసలు మొత్తము వడ్డీని సంపాదించిన ప్రతి సారీ, కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తి మొత్తం సొమ్మునూ కొత్త అసలుగా చూస్తుంది. ఇది ప్రతి చెల్లింపు వ్యవధికీ కొనసాగుతుంది, మరియు డబ్బు మొత్తం పెరుగుతూనే ఉంటుంది.  

చక్రవడ్డీ క్యాలికులేటర్ అనేది, ఈ చక్రవడ్డీ సూత్రమును ఉపయోగించి మీరు ఆన్‌లైన్ చక్రవడ్డీని లెక్కించడానికి వీలు కలిగిస్తుంది:  

A = P (1+r/n) ^nt  

  •  A = మదుపు యొక్క మెచ్యూరిటీ మొత్తం  

  •  P = మదుపు చేసిన అసలు మొత్తము  

  •  r = వడ్డీ రేటు   

  •  n = సంవత్సరానికి ఎన్నిసార్లు వడ్డీ కూడగట్టబడినదో ఆ సంఖ్య  

  •  t = మదుపు యొక్క అవధి లేదా కాలవ్యవధి  

    పవర్ ఆఫ్ కాంపౌండింగ్ (చక్రవడ్డీ) క్యాలికులేటరును అర్థం చేసుకోవడానికి, మీరు చేయాల్సిందంతా ఈ క్రింది స్టెప్స్ పాటించడమే:  

    స్టెప్ 1: మీ మదుపు మొత్తమును నిర్ధారించుకొనుట. మీకు కావాల్సియున్న ఆశించిన మెచ్యూరిటీ విలువ మీకు తెలిసి ఉంటే, దానిని సంపాదించడానికి మీరు మదుపు చేయాల్సిన అసలు మొత్తమును చూడడానికి కాంపౌండింగ్ క్యాలికులేటర్ పైన స్లైడరును సర్దుబాటు చేయండి.  

    స్టెప్ 2: మీరు ఎంత తరచుగా మదుపు చేస్తారో ఆ అంతరాన్ని ఎంచుకోండి - వార్షికమా, అర్ధ-సంవత్సరమా, మూడు నెలలా లేదా నెలవారీ చెల్లింపులా.  

    స్టెప్ 3: మీరు క్రమం తప్పకుండా మదుపులు చేయబోయే కాల వ్యవధిని ఎంపిక చేయండి – 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకా అలా...  

    స్టెప్ 4: మీరు మదుపుచేసి ఉంచాలనుకుంటున్న కాలవ్యవధిని ఎంచుకొనుట. ఉదాహరణకు., మీరు మీ మదుపు పట్ల 5 సంవత్సరాల పాటు చెల్లింపులు చేయవచ్చు, అయితే 10 సంవత్సరాల పాటు అలాగే మదుపును ఉంచాలని అర్థం.  

    స్టెప్ 5: ఆశించిన రాబడి రేటును అనగా., వడ్డీ రేటును ఎంచుకోండి.   

    పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ఇప్పుడు మీకు మీ రాబడుల యొక్క మెచ్యూరిటీ విలువను అందిస్తుంది.  

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటరును ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనాలు  

రాబడులను అంచనా వేయడానికి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ఒక విశ్వసనీయమైన ఆర్థిక సాధనము. మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీరు ఏయే మదుపులు చేయాల్సి ఉంటుంది, మరియు ఎంత వ్యవధికి చేయాలో మీకు స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇది మీ మదుపు ఒత్తిడిని సులభతరం చేస్తుంది.   

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు ఈ క్రింది విధాలుగా ప్రయోజనం చేయగలుగుతుంది:  

  • ఆర్థికపరమైన ప్రణాళికను సరళతరం చేస్తుంది: చక్రవడ్డీ క్యాలికులేటర్ ఇండియా అప్పటికప్పుడే కచ్చితమైన మదుపు మెచ్యూరిటీ విలువను అందిస్తుంది. ఇది మీ ఐచ్ఛికాలను కుదించుకోవడానికి మరియు మీ లక్ష్యాలను నెరవేర్చే సరియైన దానిని కనుక్కోవడానికి మీకు సహాయపడగలుగుతుంది.   

  • మదుపులను పోల్చి చూసుకోండి: బహుళ మదుపుల సన్నివేశాలను మదింపు చేసుకోవడంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు సహాయపడుతుంది. మదుపు మొత్తము, కాలావధి, లేదా రాబడి రేటును వ్యత్యాసపరచడానికి మీరు గణాంకాలను మార్పుచేర్పులు చేసుకోవచ్చు మరియు ప్రతి సందర్భమూ మీ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు చూపుతుంది. మీరు మీ దీర్ఘ-కాలిక లక్ష్యాలకు సరిపోయేలా అత్యుత్తమ సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఈ సమాచారము వీలు కలిగిస్తుంది.  

  • తెలివిగా నిర్ణయాలు చేయుట: చక్రవడ్డీ క్యాలికులేటర్ శక్తితో, ఫలితాలు పారదర్శకంగా మరియు తప్పుపట్టలేనివిగా ఉంటాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మదుపు ప్రయాణాన్ని కూడా పేర్కొంటుంది, అది మీ లక్ష్యాల కొరకు ప్రణాళిక చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.   

  • మీ సంపదను పెంచుకోండి: ఒక చిన్న మదుపు దీర్ఘకాలములో ఎంత గణనీయంగా పెరగగలుగుతుందో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు చూపుతుంది. ఇది, మీరు మరింత పొదుపు చేయడానికి మరియు మరింత మదుపు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఎక్కువ కూడగట్టుకోవడం అంటే ఎక్కువ ఎదుగుదల మరియు ఆపత్కాల నిధి వృద్ధి అయ్యే ప్రక్రియను పెంపొందిస్తుందన్న మాట.  

ఉదాహరణతో చక్రవడ్డీని లెక్కించడం ఎలా?   

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ను మరింత బాగా అర్థం చేసుకోవడానికి, ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉదాహరణ ఉంది.  

మీకు సంవత్సరానికి 10% వడ్డీని చెల్లించే ఒక రు.1000 ల మదుపు మొత్తం ఉందని అనుకోండి, 1 వ సంవత్సరం ఆఖరుకు మీకు అది రు.1100 లు అవుతుంది. ఇప్పుడు 2 వ సంవత్సరములో, ఈ పూర్తి మొత్తము రు. 1100 పై వడ్డీ లెక్కించబడుతుంది, అలా మీకు రు.1210 వస్తుంది.  3 వ సంవత్సరంలో, మీరు రు.1210 పై 10% వడ్డీ సంపాదించుకుంటారు, అది రు.1331 అవుతుంది, అలా ముందుకు సాగుతుంది. 

చక్రవడ్డీ ప్రయోజనాలతో మీరు మీ పొదుపును ఎలా మెరుగుపరచుకోవచ్చు?  

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ దీర్ఘకాలికం కోసం చేసే మదుపులకు అత్యుత్తమంగా పనిచేస్తుంది. చక్రవడ్డీ యొక్క శక్తిని గరిష్టం చేసుకోవడానికి గాను త్వరగా మొదలుపెట్టవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. కాంపౌండింగ్ యొక్క సంపూర్ణ ప్రయోజనాలను పొందడానికై, విత్‌డ్రాయల్స్ చేయడం మానుకోవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ఉపయోగించడానికి ముందు, మీ ప్రాధాన్యతలను పేర్కొనడం, మీ మదుపు లక్ష్యాలను గుర్తించడం, మరియు ఒక కాంపౌండింగ్ మదుపును చేయడానికి ముందు మీ ముప్పు విభక్తమును అంచనా వేసుకోవడం తప్పనిసరి అవుతుంది.   

ఇన్‌వెస్ట్‌మెంట్ మరియు సేవింగ్స్ ప్లాన్‌లు

Knowledge Centre

Power of Compounding - Compound Interest Calculator FAQs
  • వడ్డీ ఎంత తరచుగా కూడగట్టుకోబడుతుంది?

    చక్రవడ్డీ క్యాలికులేటర్ ఇండియా, వడ్డీని రోజువారీ, నెలవారీ, మూడునెలలవారీ, అర్ధ-సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ అంతరాలలో కూడగట్టుకుంటుంది. తక్కువ కాలానికి కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం వల్ల మీ రాబడులు వేగంగా ద్విగుణీకృతం అవుతాయి.   

  • ప్రతిరోజూ లేదా నెలకొకసారి కూడగట్టుకోవడం మంచిదేనా?

    ఒక సాధారణ నియమముగా, ప్రతిరోజూ కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం ఉత్తమం. నెలవారీ కూడగట్టుకోవడంతో పోలిస్తే వడ్డీ మొత్తము కొద్దిగా అధికంగా ఉంటుంది, ఎందుకంటే వడ్డీ రోజువారీగా ప్రతిరోజూ లెక్కించబడుతుంది. కాబట్టి, చేర్చబడిన వడ్డీ ఆధారంగా మొత్తము ప్రతిరోజూ అధికంగా పెరుగుతుంటుంది. కూడగట్టుకునే వ్యవధి ఎంత తక్కువైతే, రాబడి అంత ఎక్కువగా ఉంటుంది. దీనిని మీరు కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తితో మీకు మీరుగా చూసుకోవచ్చు, డబ్బు యొక్క భవిష్యత్ విలువను అంచనా వేసుకోవడానికి అది మీకు సహాయపడుతుంది.  

  • వడ్డీ రేటు ఎంత తరచుగా కూడగట్టుకోబడుతుంది?

    చక్రవడ్డీ క్యాలికులేటర్ ఇండియా, వడ్డీని రోజువారీ, నెలవారీ, మూడునెలలవారీ, అర్ధ-సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ అంతరాలలో కూడగట్టుకుంటుంది. తక్కువ కాలానికి కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం వల్ల మీ రాబడులు వేగంగా ద్విగుణీకృతం అవుతాయి.   

  • ఏది ప్రాధాన్యతగా ఉంటుంది, రోజువారీ లేదా నెలవారీ చక్రవడ్డీయా?

    ఒక సాధారణ నియమముగా, ప్రతిరోజూ కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం ఉత్తమం. నెలవారీ కూడగట్టుకోవడంతో పోలిస్తే వడ్డీ మొత్తము కొద్దిగా అధికంగా ఉంటుంది, ఎందుకంటే వడ్డీ రోజువారీగా ప్రతిరోజూ లెక్కించబడుతుంది. కాబట్టి, చేర్చబడిన వడ్డీ ఆధారంగా మొత్తము ప్రతిరోజూ అధికంగా పెరుగుతుంటుంది. కూడగట్టుకునే వ్యవధి ఎంత తక్కువైతే, రాబడి అంత ఎక్కువగా ఉంటుంది. దీనిని మీరు కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తితో మీకు మీరుగా చూసుకోవచ్చు, డబ్బు యొక్క భవిష్యత్ విలువను అంచనా వేసుకోవడానికి అది మీకు సహాయపడుతుంది.  

  • పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని ఉపయోగించుకొని ఒకరు ఎలా మిలియనీర్ కాగలుగుతారు?

    పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని ఉపయోగించుకొని మిలియనీర్ కావడానికి గాను, మీరు సాధ్యమైనంత త్వరగా విధిగా కాంపౌండింగ్ సాధనాలలో మదుపు చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలావధికి మదుపు చేస్తూనే ఉండండి మరియు ఒక విత్‌డ్రాయల్ చేయాలనే ఉత్సుకతను నిరోధించుకోండి. మీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మరియు ఆ డబ్బును మీ మదుపు కూడగట్టుకోవడానికి జోడించండి. అది ఒక సైజులో ఆపత్కాల నిధిగా పెరగడానికి సహాయపడుతుంది. మదుపులపై రాబడులను నిర్ధారించుకోవడానికి కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తి మీకు సహాయపడుతుంది.    

  • చక్రవడ్డీని లెక్కించడానికి సూత్రము ఏది?

    చక్రవడ్డీ క్యాలికులేటర్ అనేది, ఈ చక్రవడ్డీ సూత్రమును ఉపయోగించి మీరు ఆన్‌లైన్ చక్రవడ్డీని లెక్కించడానికి వీలు కలిగిస్తుంది:  

    A = P (1+r/n) ^nt  

    •    A = మదుపు యొక్క మెచ్యూరిటీ మొత్తం  

    •    P = మదుపు చేసిన అసలు మొత్తము  

    •    r = వడ్డీ రేటు   

    •    n = సంవత్సరానికి ఎన్నిసార్లు వడ్డీ కూడగట్టబడినదో ఆ సంఖ్య  

    •    t = మదుపు యొక్క అవధి లేదా కాలవ్యవధి  

  • సామాన్య వడ్డీ నుండీ చక్రవడ్డీని ఏది వ్యత్యాసం చేసి చూపుతుంది?

    సామాన్య వడ్డీ కేవలం అసలు మొత్తము లేదా లోన్ మొత్తం పైనే లెక్కింపు చేయబడుతుంది, కాగా చక్రవడ్డీ అనేది అసలు మొత్తము అదే విధంగా మునుపటి కాలావధులకు కూడగట్టబడిన వడ్డీ ఆధారంగా లెక్కింపు చేయబడుతుంది.  సులువైన మాటల్లో చెప్పాలంటే, చక్రవడ్డీ యొక్క శక్తి అనేది వడ్డీపై వడ్డీ సంపాదించుకోవడం అన్నమాట.   

  • చక్రవడ్డీలో వడ్డీ రేటును లెక్కించడం ఎలా?

    మీరు చక్రవడ్డీ సూత్రమును ఉపయోగించి చక్రవడ్డీ యొక్క వడ్డీ రేటును లెక్కించవచ్చు. ఇందుకోసం, మీరు తెలుసుకోవాల్సినది: 

    1. మీ మదుపు యొక్క అసలు మొత్తము 

    2. అందించబడే వడ్డీ రేటు 

    3. సంవత్సరానికి ఎన్నిసార్లు మీ వడ్డీ కూడగట్టబడినదో ఆ సంఖ్య 

    4. మీరు మదుపుచేసి అలాగే ఉంచే సంవత్సరాల సంఖ్య 

    పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ఉపయోగించడమనేది ఒక సులువైన మార్గము, అది మీరు వేరియబుల్స్ అన్నింటినీ జోడించనిస్తుంది మరి ఆ తర్వాత మీకు రాబడి మొత్తమును ఇవ్వడానికి ఆటోమేటిక్ గా దానిని లెక్కింపు చేస్తుంది. 

  • మూడునెలల వారీగా చక్రవడ్డీని లెక్కించడం ఎలా?

    చక్రవడ్డీ సూత్రము:  

    A = P (1+r/n) ^nt  

     A = మదుపు యొక్క భవిష్యత్ విలువ  

      P = మదుపు చేసిన అసలు మొత్తము  

      r = వడ్డీ రేటు   

       n = సంవత్సరానికి ఎన్నిసార్లు వడ్డీ కూడగట్టబడినదో ఆ సంఖ్య  

       t = మదుపు యొక్క అవధి లేదా కాలవ్యవధి  

    మొత్తము మూడునెలల వారీగా కూడగట్టుకున్నప్పుడు, దాని అర్థం ఏమిటంటే, డబ్బు సంవత్సరానికి 4 సార్లు కూడగట్టబడుతుందన్నమాట, అనగా., n = 4. కాబట్టి చక్రవడ్డీ సూత్రము ఈ క్రింది విధంగా ఉంటుంది:  

    A = P (1 + r/4)4t