కార్పొరేట్ సామాజిక బాధ్యత

తన ఉద్యోగుల, ఏజెంట్ల మరియు పంపిణీదారుల యొక్క క్రుషిని సమాజ అభివ్రుద్ధి కార్యక్రమాల్లోకి మార్చడానికి ఇండియాఫస్ట్ లైఫ్ కుటుంబం నిరంతరం శ్రమిస్తుంది.

మైక్రో ఇన్సూరెన్సుతో మాస్ మార్కెట్ కు సహాయపడుట
బీమా సామాన్య ప్రజలకు చేరువ కావాలంటే, భారతదేశానికి న్యాయమైన, పారదర్శక, ఖర్చుతక్కువ మరియు క్రమబద్ధీకరించబడిన ఆర్థిక ఇన్ క్లూజన్ మోడల్ అవసరం. న్యాయమైన ధర, సరళ, సమగ్ర మరియు ప్రభావవంతమైన సర్వీసు ను మాస్ మార్కెట్ కి బీమాను అందించేందుకు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్సులో మేము ప్రయాణం చేపట్టాము. బీమా పరిశ్రమను అందుబాటు ధరలో ఉంచడమే కాకుండా, మాస్ మార్కెట్ కి అందుబాటులో ఉంచేందుకు మరియు ఆకర్షణీయంగా చేసేందుకు మా క్రుషిని మేము చానలింగ్ చేస్తున్నాము,

ఆర్థికంగా ఇన్క్లూజివ్ బీమా (పిఎంజెజెబివై):
ఇండియాఫస్ట్ లైఫ్ అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ స్కీములో క్రియాశీలంగా పాల్గొనే బీమా కంపెనీ. పి ఎం జె జె బి వై అనేది రూ. 330 ఫిక్స్ డ్ ఆదాయం మరియు రూ. 200,000 బీమా గల గ్రూప్ టర్మ్ అష్యూరెన్స్ కవర్ కి అనుసంధానం చేయబడిన బ్యాంకు అకౌంట్. కంపెనీ ఈ స్కీమును పూర్తిగా ఇంటిగ్రేషన్ చేయబడిన టెక్నాలజీని మరియు ఖర్చు తక్కువ పంపిణీ మోడల్ని ఉపయోగించి తన బ్యాంకు భాగస్వాముల ద్వారా ఈ స్కీమును అందిస్తోంది. జూన్ 2015లో ప్రారంభించినప్పటి నుంచి ఈ స్కీమ్ కింద ఒక సంవత్సరంలో దాదాపుగా 25 లక్షల జీవితాలకు బీమా చేయబడింది.

విలేజ్ లెవెల్ ఎంట్రప్రెన్యువర్స్ (విఎల్ఇలు) ద్వారా తన ఉత్పాదనల పంపిణీకి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇన్ క్లూజివ్ అభివద్ధి మేంటిల్ ని ఇండియాఫస్ట్ లైఫ్ గర్విస్తోంది. ఉభయ పార్టనర్స్ యొక్క టెక్నాలజీ పోర్టల్స్ కలయిక వల్ల పంపిణీ ప్రక్రియ పూర్తిగా నిరంతరాయంగా జరుగుతుంది. ఇండియాపస్ట్ లైఫ్ ఈ గ్రామ స్థాయి ఎంట్రప్రెన్యువర్స్ ని చేతిలో ఉంచుకుంటుంది మరియు మెరుగైన సామాజిక మరియు ఆర్థిక అభివ్రుద్ధిలో కీలక పాత్ర పోషించడానికి సి ఎస్ సి కదలిక ద్వారా గ్రామీణ భారతదేశంలో నైపుణ్యాలకు సాన పెడుతోంది.

మారుమూల గ్రామాల ప్రజలకు బీమాను వ్యాపింపజేయుట
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో మరియు మాస్ మార్కెట్ ఇన్సూరెన్స్ వ్యూహంలో భాగంగా, భారతదేశంలోని మారుమూల గ్రామీణ జిల్లాల్లో ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను పంపిణీ చేసేందుకు ‘ఐఎఫ్ఎంఆర్ రూరల్ చాన్సల్’తో ఒప్పందం కుదుర్చుకోవడమైనది. భారతదేశంలో తమిళనాడు వ్యాప్తంగా అయిదు జిల్లాల్లో సేవలందిస్తున్న నాలుగు కేంద్రాల్లో క్షేత్రీయ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ (కెజిఎఫ్ఎస్) ద్వారా జీవిత బీమా పాలసీలను ఇండియాఫస్ట్ లైఫ్ అందిస్తుంది.

మా ఉద్యోగులు వాళ్ళ సమాజాలకు ఎలా సహాయపడతారు
పండుగ సీజనులో, భారతీయులమైన మనం గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మన జీవితాల్లో నవ్వులు చిందిస్తాము. ఇండియాఫస్ట్ లైఫ్ ప్రాంగణంలో స్టాల్స్ ని నెలకొల్పేందుకు ఎన్ జి ఒలను ఏర్పాటు చేయడం ద్వారా, మేము మా ఉద్యోగుల వేడుకలను పెంచుతాము.

ఇండియాఫస్ట్ లైఫ్ ఉద్యోగులు ఉదారంగా కొన్న గిఫ్టు వస్తువులను తమ ఆత్మీయులకు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చి సంతోషపెట్టడమే కాకుండా ఆపన్నులకు మరియు అనాధలకు బట్టలు, బ్యాగులు, ఆటవస్తువులు, పుస్తకాలు, దినపత్రికలు తదితర వాటిని కూడా దానం చేస్తారు.

ఇండియాఫస్ట్ లైఫ్ లో సిఎస్ఆర్ అనేది నిరంతర ప్రక్రియ. ఇది అందరికీ ప్రమేయం ఉండేలా చూస్తుంది, తద్వారా గర్వపడేలా చేస్తుంది, కేవలం సంస్థ మాత్రమే కాదు, కంపెనీతో ముడిపడివున్న వారందరికీ. ‘ధాత్రుత్వం ఇంటి వద్ద ప్రారంభమవుతుంది’ అన్న సామెతగా, సమాజానికి మద్దతు ఇచ్చేందుకు మరియు వాపసు ఇచ్చేందుకు ఇండియాఫస్ట్ లైఫ్ ద్రుష్టిపెడుతుంది, ఆర్థిక లాభాల ద్వారా కావచ్చు లేదా ఆపన్న హస్తం అందించడం అయివుండొచ్చు.