మెచ్యూరిటీ నాటికి వయస్సు
- Answer
-
గరిష్టం
- 55 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
గరిష్టం
కనిష్టం
గరిష్టం
కనిష్టం
గరిష్టం
ఒక్కో సభ్యుడికి నిర్ధారిత కవర్ ఆప్షన్ ₹2 లక్షలు
a) జూన్, జూలై మరియు ఆగస్టులో నమోదు కొరకు – పూర్తి వార్షిక ప్రీమియం రు.436 /- చెల్లించవలసి ఉంటుంది
b) సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబరులో నమోదు కొరకు – ప్రో-రేటా ప్రీమియం రు. 342 /- చెల్లించవలసి ఉంటుంది
c) డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరిలో నమోదు కొరకు – ప్రో-రేటా ప్రీమియం రు. 228 /- చెల్లించవలసి ఉంటుంది.
d) మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలలో నమోదు కొరకు – ప్రో-రేటా ప్రీమియం రు. 114 /- చెల్లించవలసి ఉంటుంది
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
పద్ధతి
మొదటిసారి ప్రవేశించేటప్పుడు 18 నుండి 50 సంవత్సరాల వయస్సు శ్రేణిలో ఉండి ఏవైనా పాల్గొంటున్న బ్యాంకులు/ పోస్టాఫీసులలోని సేవింగ్స్ ఖాతాదారులు అందరూ చేరడానికి అర్హులుగా ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి ఒకటి లేదా వివిధ బ్యాంకులు/పోస్టాఫీసులలో బహుళ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, వ్యక్తి ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులుగా ఉంటారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ ప్రాథమిక కేవైసీ డాక్యుమెంటుగా ఉంటుంది. ఆసక్తిగల సభ్యులు మాస్టర్ పాలసీదారు వద్ద అందుబాటులో ఉన్న సభ్యత్వ ఫారమును పూరించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు.
మాస్టర్ పాలసీదారు వద్ద అందుబాటులో ఉన్న సభ్యత్వ ఫారమును పూరించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఒక సంవత్సరం పాటు కవర్ కొనసాగుతుంది, ఇందు కోసం నిర్దేశిత ఫారములను నిర్దేశిత సేవింగ్స్ బ్యాంక్ / పోస్టాఫీసు ఖాతా నుండి ఆటో-డెబిట్ ద్వారా చేరడానికి/చెల్లించడానికి తొలి సంవత్సరానికి పైన పేర్కొనబడిన మినహాయింపుతో ప్రతి సంవత్సరం మే 31వ తేదీ లోపున ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకం నియమాల ప్రకారం ప్రీమియం చెల్లింపుతో నమోదు ఆలస్యం కావచ్చు మరియు/లేదా కాబోయే కవర్ కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ తో సాధ్యం కావచ్చు, దీని కోసం మంచి ఆరోగ్యం యొక్క స్వీయ-ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం ద్వారా ప్రీమియం యొక్క ఆటో-డెబిట్ తేదీ నుండి పథకం నియమాలు మరియు/లేదా ఎప్పటికప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా రిస్క్ ఉంటే అది మొదలవుతుంది.
మొదటిసారిగా నమోదు చేసుకున్న చందాదారులకు, పథకం లోనికి నమోదు చేసుకున్న తేదీ నుండి మొదటి 30 రోజుల (లీన్ పీరియడ్) సందర్భంగా సంభవించే మరణానికి (ప్రమాద సంఘటన కారణంగా కాకుండా) బీమా రక్షణ అందుబాటులో ఉండదు, మరియు లీన్ వ్యవధిలో మరణం సంభవిస్తే (ప్రమాద సంఘటన కారణంగా కాకుండా) ఎటువంటి క్లెయిము అనుమతించబడదు.
ఎప్పుడైనా పథకం నుండి నిష్క్రమించి ఉన్న వ్యక్తులు, పథకం నియమాలు మరియు/లేదా ఎప్పటికప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఏదైనా ఉంటే, మంచి ఆరోగ్యం యొక్క డిక్లరేషన్‌ను సమర్పించడం ద్వారా భవిష్యత్తు సంవత్సరాలలో పథకంలో మళ్లీ చేరవచ్చు. తాత్కాలిక వ్యవధిలో బీమా ప్రయోజనాల మినహాయింపు మొదటి సంవత్సరంలో లేదా ఆ తర్వాత పథకం నుండి నిష్క్రమించిన చందాదారులకు కూడా వర్తిస్తుంది మరియు వారు ఏ తేదీలోనైనా మళ్లీ చేరవచ్చు. భవిష్యత్ సంవత్సరాల్లో, అర్హత గల కేటగిరీలోకి కొత్తగా ప్రవేశించినవారు లేదా ఇంతకుముందు చేరని లేదా తమ సభ్యత్వాన్ని నిలిపివేయని, ప్రస్తుతం అర్హత ఉన్న వ్యక్తులు 30 రోజుల తాత్కాలిక కాలవ్యవధిలో, ఏదైనా ఉంటే, మరియు మంచి ఆరోగ్యం యొక్క స్వీయ-ధృవీకరణ పత్రం సమర్పణకు లోబడి బీమాదారు యొక్క విచక్షణను బట్టి పథకం నియమాల ప్రకారం మరియు/లేదా ఎప్పటికప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం పథకం కొనసాగుతున్నప్పుడు చేరగలుగుతారు.
ప్రీమియం చెల్లింపు | బీమా వర్తింపు | ఉదాహరణ |
---|---|---|
మాస్టర్ పాలసీదారు అయిన మీచే కంపెనీకి ప్రీమియం చెల్లించబడుతుంది. దానిని మీ సభ్యుల నుండి సేకరించుకుంటారు. | ప్రీమియం అందుకోబడిన తర్వాత మరియు అన్ని పూచీకత్తు ప్రాతిపదికలు ఏవైనా ఉంటే, నెరవేర్చిన తర్వాత ప్రారంభమవుతుంది | మాస్టర్ పాలసీదారు: బ్యాంక్ సభ్యులు: సేవింగ్స్ ఖాతాల కస్టమర్లు ప్రీమియమ్: సభ్యుల సమ్మతి తీసుకున్న తర్వాత వారి పొదుపు ఖాతా నుండి నేరుగా తీసివేసుకొని బ్యాంకుచే అది చెల్లించబడుతుంది |
ప్రస్తుతం మీరు ఈ దిగువ కనబరచిన పన్ను ప్రయోజనాలకు అర్హులుగా ఉన్నారు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. అయినప్పటికీ, మీ పన్ను సలహాదారును సంప్రదించవలసిందిగా మీకు సలహా ఇవ్వబడుతోంది.
చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు ఏవేవి?
వర్తించే పన్ను చట్టాల ప్రకారం, ప్లాన్ క్రింద ప్రీమియం చెల్లింపుదారుని బట్టి చెల్లించిన ప్రీమియం పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉంటుంది.
ప్రీమియం చెల్లింపుదారు |
---|
సభ్యులు |
మాస్టర్ పాలసీదారు అయిన మీరు ప్రీమియం చెల్లిస్తారు, అయితే సభ్యుల నుండి దానిని వసూలు చేసుకుంటారు. మాస్టర్ పాలసీదారు అయిన మీకు వర్తించే తగ్గింపులు ఏవీ ఉండవు. అయినప్పటికీ, మీ సభ్యులు ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 80సి క్రింద పన్ను తగ్గింపులను కోరవచ్చు. |
మరణ ప్రయోజనాలు పన్నురహితంగా ఉంటాయా?
అవును, ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 10(10) D క్రింద మరణ ప్రయోజనాలు కూడా పన్ను రహితంగా ఉంటాయి, కాలానుగుణంగా పన్ను చట్టాల ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్లాన్ అనేది, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగియున్న బ్యాంక్ /పోస్ట్ ఆఫీస్ కస్టమర్ల గ్రూపుకు అందించబడే పాల్గొనబడే, అనుసంధానితం కాని, సంవత్సరం వారీగా నవీకరణ చేసుకోదగిన గ్రూపు సంరక్షణ ప్లానుగా ఉంటుంది.
ఈ పాలసీలో 'మాస్టర్ పాలసీదారు' మరియు సభ్యుడు చేరి ఉంటారు.
2a. మాస్టర్ పాలసీదారు ఎవరు?
మాస్టర్ పాలసీదారు మీరే, ఏవైనా అనిశ్చితుల నుండి తన సభ్యులు/ కస్టమర్లు తమ కుటుంబాలను సురక్షితంగా ఉంచుకోవడానికి గాను ఈ పాలసీని అందించే మాస్టర్ పాలసీదారు అయిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థలు లేదా పోస్ట్ ఆఫీస్. మాస్టర్ పాలసీదారు పాలసీని కలిగి ఉంటారు మరియు ఆపరేట్ చేస్తారు. అయినప్పటికీ, వ్యక్తులు ఈ పాలసీ క్రింద నమోదు చేసుకోవడానికి ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా సంప్రదించవచ్చు.
2b. సభ్యుడు అంటే ఎవరు?
సభ్యుడు అంటే, మొదటి సారి కవర్ కోసం దరఖాస్తు చేసే సమయంలో, ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండి 18 నుండి 50 సంవత్సరాల వయస్సు సమూహములో ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు. ఈ పాలసీ క్రింద సభ్యుడికి జీవిత భరోసా కల్పించబడుతుంది. సభ్యుడి జీవితంపై ప్రయోజనాలు చెల్లించబడతాయి.
ఒక సభ్యుడికి వయస్సు పరిమితులు ఇలా ఉంటాయి –
ప్రవేశము వద్ద గరిష్ట వయస్సు | ప్రవేశము వద్ద గరిష్ట వయస్సు | మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు |
---|---|---|
చివరి పుట్టినరోజు నాటికి 18 సంవత్సరాలు | 50 సంవత్సరాలు (సమీప జన్మదినం నాటికి) | 55 సంవత్సరాలు (సమీప జన్మదినం నాటికి) |
సుదూర మార్కెటింగ్ కొరకు మొదటి 15 రోజుల (ఫ్రీ-లుక్ వ్యవధి) లోపున తప్ప, మిగతా అన్ని ఛానల్స్ కొరకు పాలసీ డాక్యుమెంట్ అందుకున్నప్పటి నుండి 30 రోజుల లోపున ఏవైనా నిబంధనలు మరియు షరతులతో మీరు ఏకీభవించనట్లయితే, మీరు మీ పాలసీని తిరిగి ఇవ్వవచ్చు. అందుకు మీ కారణాలను మీరు తెలియజేస్తూ పాలసీని మాకు తిరిగి ఇవ్వవచ్చు. స్టాంప్ డ్యూటీ, ప్రో- రేటా రిస్క్ ప్రీమియం మరియు వైద్య పరీక్షపై కంపెనీ చెల్లించిన ఛార్జీలు ఏవైనా ఉంటే, వాటిని మినహాయించుకున్న తర్వాత మేము మీ కాంట్రిబ్యూషన్‌ను తిరిగి వెనక్కి ఇస్తాము
పాలసీ సంవత్సరంలో సభ్యులు ఎప్పుడైనా స్కీములో చేరడానికి అనుమతించబడతారు మరియు సభ్యుడికి కవరేజీ, చెల్లించిన దామాషా ప్రీమియం ప్రకారం పాలసీ క్రింద సభ్యుడు నమోదు చేసుకున్న తేదీ నుండి అమలు అవుతుంది.
కనీస గ్రూపు సైజు | గరిష్ట గ్రూప్ సైజు |
---|---|
50 మంది సభ్యులు | పరిమితి లేదు |
ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద మెచ్యూరిటీ లేదా జీవించియున్న ప్రయోజనం చెల్లించబడదు.
ఈ ప్లాన్ ఒక్కో సభ్యుడికి రు. 2 లక్షల నిర్ధారిత కవర్ ఆప్షన్ కలిగి ఉంది. పాలసీలో అందరు సభ్యులూ ఒకే మొత్తం యొక్క రిస్క్ కవర్‌ని అందుకుంటారు.
మాస్టర్ పాలసీదారు అయిన మీరు, ఎప్పుడైనా ప్లాన్ ని సరెండర్ చేయవచ్చు. అయినప్పటికీ, బీమా సర్టిఫికెట్‌లో కనబరచిన విధంగా సభ్యుడి యొక్క వ్యక్తిగత కవరేజ్ అవధి ముగిసే వరకు వ్యక్తిగత సభ్యుడుగా కవరేజీని కొనసాగించుకోవడాన్ని సభ్యుడు ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ క్రింద ఎటువంటి సరెండర్ లేదా పెయిడ్-అప్ విలువ చెల్లించబడదు.
ఇది ప్రతి సంవత్సరమూ నవీకరణ చేసుకోదగిన ప్లాన్. నమోదు చేసుకోబడిన తేదీ మరియు ఛార్జ్ చేయబడిన ప్రో రేటా ప్రీమియం ఆధారంగా ఇది గ్రూప్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది.
మేము, మాస్టర్ పాలసీదారు అయిన మీకు పాలసీ మొదలైన తేదీ నుండి లేదా చివరి నవీకరణ తేదీ నుండి 1 సంవత్సరం లోపున చెల్లించాల్సిన ప్రీమియములన్నింటినీ నవీకరణ చేయించుకోవడానికి 30 రోజుల కారుణ్య వ్యవధిని అందజేస్తాము. మీ సభ్యులు ప్లాన్/కవర్ యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించేలా చూసుకోవడానికి గాను మీరు కారుణ్య వ్యవధి ముగిసే లోపున ప్రీమియములను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కారుణ్య వ్యవధి లోపున బకాయి ప్రీమియమును చెల్లించని పక్షములో, అప్పుడు కవర్ ఆగిపోతుంది మరియు ప్లాన్/సభ్యత్వం రద్దు చేయబడుతుంది.
ఇది ఒకే ఒక్క ప్రీమియం చెల్లింపు ప్లాన్, ఇది మీరు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లించాలని మరియు పాలసీ వ్యవధి అంతటా ప్లాన్ యొక్క ప్రయోజనాలను ఆనందించాలని సూచిస్తుంది.
పాలసీ అవధి సందర్భంగా దురదృష్టవశాత్తూ సభ్యుడు/జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన ఉదంతములో, మేము నామినీ/అపాయింటీ/ చట్టబద్ధమైన వారసులకు నిర్ధారిత భరోసా సొమ్మును చెల్లిస్తాము. 1 జూన్ 2021న లేదా ఆ తర్వాత మొదటిసారిగా నమోదు చేసుకున్న చందాదారులకు, పథకం లోనికి నమోదు చేసుకున్న తేదీ నుండి మొదటి 30 రోజుల (లీన్ పీరియడ్) సందర్భంగా సంభవించే మరణానికి (ప్రమాద సంఘటన కారణంగా కాకుండా) బీమా రక్షణ అందుబాటులో ఉండదు, మరియు లీన్ వ్యవధిలో మరణం సంభవిస్తే (ప్రమాద సంఘటన కారణంగా కాకుండా) ఎటువంటి క్లెయిము అనుమతించబడదు. బీమా చేయబడిన సభ్యుడు లేదా నామినీ/అపాయింటీ/ చట్టబద్ధమైన వారసుల పేరిట, ఆయా ఉదంతమును బట్టి, బీమా చేయబడిన వ్యక్తికి లేదా నామినీ/అపాయింటీ/ చట్టబద్ధమైన వారసుల యొక్క నిర్దిష్ట బ్యాంక్ ఖాతాకు ఏదైనా ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానం ద్వారా క్లెయిమ్ చెల్లింపు చేయబడేలా చూసుకోవడానికి మేము సంపూర్ణంగా బాధ్యత వహిస్తాము.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పు ప్రకటన అనేదానితో వ్యవహరించబడుతుంది.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 ఇలా చెబుతుంది.
Prohibition of Rebate: Section 41 of the Insurance Act, 1938 as amended from time to time-
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి