ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
కనిష్టం
- 18 సంవత్సరాలు
గరిష్టం
- 50 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
కనిష్టం
గరిష్టం
కనిష్టం
గరిష్టం
0, 3 లేదా 5 సంవత్సరాల కోసం ఆప్షన్లు
కనిష్టం
గరిష్టం
నెలవారీగా
మూడు నెలలకు ఒక మారు
అర్ధ సంవత్సరం వారీ
సంవత్సరం వారీ
పరిమిత ప్రీమియం
నెలవారీ, త్రైమాసికం వారీ, అర్ధ సంవత్సరం వారీ, సంవత్సరం వారీ
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పు ప్రకటన అనేదానితో వ్యవహరించబడుతుంది.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 45 ఇలా చెబుతుంది
ఒక సమీకృతమైన పొదుపు మరియు బీమా ప్లాన్ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్‌ని పరిచయం చేస్తున్నాము. ఈ అనుసంధానితం-కాని, పార్టిసిపేటింగ్ ప్లాన్, పరిమిత ప్రీమియం, జీవిత బీమా ప్లాన్ డబ్బును-ఆదా చేసే ప్లాన్‌గా పని చేస్తుంది, ఇది రిస్క్ కవర్ మరియు మీ ప్రీమియం చెల్లింపు అవధి మరియు విరామ సంవత్సరం (ఎంపిక చేసుకొని ఉంటే) పూర్తయిన మీదట గ్యారంటీగా నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. పాలసీ అవధి ముగిసే సమయానికి, ఒకవేళ ప్రకటించబడితే, మీరు కూడగట్టుకున్న సింపుల్ రివర్షనరీ బోనస్ మరియు టెర్మినల్ బోనస్ రూపంలో పెంపొందించబడిన ప్రయోజనాలను కూడా అందుకుంటారు.
లేదు, ఈ పాలసీలో లోన్ అనుమతించబడదు.
అవును, దూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపానికి పాలసీ డాక్యుమెంట్ అందుకున్నప్పటి నుండి ఉన్న 30 రోజుల లోపు వ్యవధి తప్ప, మొదటి 15 రోజులలోపున ఏవైనా నిబంధనలు మరియు షరతులతో మీరు ఏకీభవించనట్లయితే, అందుకు మీ కారణాలను తెలియజేస్తూ మీరు మీ పాలసీ డాక్యుమెంటును తిరిగి ఇవ్వవచ్చు. మేము ప్రో రేటా రిస్క్ ప్రీమియం, స్టాంప్ డ్యూటీ మరియు వైద్య ఖర్చులు ఏవైనా ఉంటే తీసివేసిన తర్వాత మీ ప్రీమియంను తిరిగి చెల్లిస్తాము,
మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీకు ఏదైనా రీఫండ్ వస్తుందా?
ఔను. మేము చెల్లించిన ప్రీమియమునకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము.
i ని తగ్గించుకొని: పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం,
ii ని తగ్గించుకొని. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ
iii ని తగ్గించుకొని. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
మీ పాలసీ యొక్క పూర్తి ప్రయోజనాలను ఆనందించడానికి గాను మీ పాలసీని కొనసాగించడం మంచిదని సలహా ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మీరు మీ పాలసీని సరెండర్ చేయాల్సి వస్తుందని మేము అర్థం చేసుకుంటాము. రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములను చెల్లించిన తర్వాత పాలసీ హామీతో కూడిన సరెండర్ విలువను పొందుతుంది. సరెండర్ చేయబడిన సమయములో హామీ ఇవ్వబడిన సరెండర్ విలువ (జీఎస్‌వీ) లేదా ప్రత్యేక సరెండర్ విలువ (ఎస్ఎస్‌వి) కంటే ఎక్కువ సొమ్ము చెల్లించబడుతుంది. జీఎస్‌వీ అనేది ప్రీమియం కొరకు జీఎస్‌వీ కారకాంశం * ఏదైనా ఉంటే అదనపు ప్రీమియం మరియు వర్తించే పన్నులతో సహా చెల్లించబడిన మొత్తం ప్రీమియము, ప్లస్ సింపుల్ రివర్షనరీ బోనస్ కొరకు జీఎస్‌వీ కారకాంశం * ఏదైనా ఉంటే కూడగట్టిన సింపుల్ రివర్షనరీ బోనస్, అందులో సరెండర్ తేదీ వరకూ చెల్లించిన గ్యారంటీడ్ రెగ్యులర్ ఆదాయాల మొత్తం తీసివేయగా వచ్చినది. ఎస్ఎస్‌వీ అనేది (చెల్లించిన మొత్తం ప్రీమియముల సంఖ్య/ పాలసీ అవధి అంతటా చెల్లించాల్సిన మొత్తం ప్రీమియముల సంఖ్య)*(వార్షిక గ్యారంటీడ్ రెగ్యులర్ ఆదాయం* గ్యారంటీడ్ రెగ్యులర్ ఆదాయ అవధి) ప్లస్ కూడగట్టిన సింపుల్ రివర్షనరీ బోనస్, దాన్ని సరెండర్ సమయం లోని ఎస్ఎస్‌వి కారకాంశముతో గుణించి, ప్లస్ టెర్మినల్ బోనస్, ఏదైనా ఉంటే* అందులో సరెండర్ తేదీ వరకూ చెల్లించిన గ్యారంటీడ్ రెగ్యులర్ ఆదాయాల మొత్తం తీసివేయగా వచ్చినది. *టెర్మినల్ బోనస్, సరెండర్ మీదట ఏదైనా ఉంటే, పాలసీ పూర్తిగా పెయిడ్-అప్ అయిన షరతుకు లోబడి వర్తిస్తుంది. జిఎస్‌వి మరియు ఎస్ఎస్‌వి కారకాంశములు అనుబంధం-1 తో జతచేయబడ్డాయి.
చెల్లించిన ప్రీమియములు# మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను* ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
పాలసీలో ప్రాథమిక భరోసా సొమ్ము అనేది ఒక నోషనల్ భరోసా సొమ్ము, అది బోనస్ మొత్తమును లెక్కించడానికి ఉపయోగించబడుతుంది మరియు మెచ్యూరిటీలో చెల్లించబడదు. ప్రాథమిక భరోసా సొమ్ము మీ (జీవిత బీమా చేయబడిన వ్యక్తి యొక్క) వయస్సు, లింగము, వార్షిక ప్రీమియం, ప్రీమియం చెల్లింపు అవధి లేదా పాలసీ అవధి మరియు ఎంపిక చేసుకున్న విరామ సంవత్సరం ఆధారంగా లెక్కించబడుతుంది.
భరోసా ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము | భరోసా ఇవ్వబడే గరిష్ట ప్రాథమిక మొత్తము |
---|---|
రూ. 75,000 లు | బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఎటువంటి పరిమితీ లేదు |
పాలసీ కొరకు అర్హతా ప్రాతిపదిక ఈ క్రింది విధంగా ఉంటుంది-
కనీస వయస్సు (చివరి జన్మదినం నాటికి) | గరిష్ట వయస్సు (చివరి జన్మదినం నాటికి) | |
---|---|---|
ప్రవేశము | 18 సంవత్సరాలు | 50 సంవత్సరాలు |
మెచ్యూరిటీ | 34 సంవత్సరాలు | 75 సంవత్సరాలు |
మీరు మీ అవసరం ప్రకారం ప్రీమియములను నెలవారీగా, మూడు నెలల వారీగా, అర్ధ-సంవత్సరం వారీ, లేదా సంవత్సరం వారీగా చెల్లించడానికి ఎంచుకోవచ్చు. ప్రీమియం పరిమితులు ఈ దిగువ విధంగా పేర్కొనబడ్డాయి:
అంతరము | కనీస ప్రీమియమ్ | గరిష్ట ప్రీమియం |
---|---|---|
సంవత్సరం వారీ | రూ. 24,000 లు | బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఎటువంటి పరిమితీ లేదు |
అర్ధ సంవత్సరం వారీ | రూ. 12,286 లు | |
మూడు నెలలకు ఒక మారు | రూ. 6,216 లు | |
నెలవారీగా | రూ. 2,088 లు |
ప్రీమియం మొత్తాలు అదనపు ప్రీమియం (ఏదైనా ఉంటే) కి ప్రత్యేకమైనవి మరియు వర్తించే విధంగా పన్నులు ఉంటాయి.
మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము, అది ప్రీమియం గడువు తేదీ తర్వాతి ప్రీమియం చెల్లింపు కోసం అందించబడిన సమయం, ఆ సమయంలో పాలసీ రిస్క్ కవర్ తో సహా అమలులో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఈ పాలసీ, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ వ్యవధి సందర్భంగా ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక మరణించిన పక్షములో, బాకీ పడి ఉన్న ప్రీమియములను మినహాయించుకొని మరణ ప్రయోజనం నామినీ (లు)/అపాయింటీ/ చట్టబద్ధ వారసులకు చెల్లించబడుతుంది.
కంపెనీచే ప్రకటించబడి యున్న బోనస్ పాలసీ ప్రకారం, ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ యందు గల బోనస్‌లలో సింపుల్ రివర్షనరీ బోనస్ (ఎస్ఆర్‌బి) మరియు టెర్మినల్ బోనస్ (టిబి) ఉన్నాయి.
ఈ పాలసీలో, జీవిత బీమా చేయబడిన వ్యక్తికి నెలవారీ, మూడు నెలల వారీ, అర్ధ సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ ప్రీమియం చెల్లింపులు చేసే ఐచ్ఛికం ఉంటుంది.
కారుణ్య వ్యవధి తర్వాత పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియము బాకీ ఉన్నట్లయితే, పాలసీ గనక గ్యారంటీడ్ సరెండర్ విలువను పొందక పోయి ఉంటే, పాలసీ ల్యాప్స్ అవుతుంది. రిస్క్ కవర్ ఆపివేయబడుతుంది మరియు ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు. రెండు సంవత్సరాల కంటే తక్కువగా పూర్తి ప్రీమియంలు చెల్లించిన పక్షములో పాలసీ లాప్స్ అవుతుంది
అయినప్పటికీ, మీరు మీ లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరణ వ్యవధి లోపున పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణపై మరింత సమాచారం కోసం మీరు ఈ దిగువన తదుపరి విభాగాలను చూడవచ్చు.
ఒకవేళ పాలసీ గనక గ్యారంటీడ్ సరెండర్ విలువను పొందిన తర్వాత మీరు ప్రీమియంలు చెల్లించడం ఆపివేసినట్లయితే, కారుణ్య వ్యవధి ముగింపులో మీ పాలసీ పెయిడ్-అప్ గా చేయబడుతుంది.
ఒకసారి పాలసీ పెయిడ్-అప్ గా మారినదంటే:
మీ పాలసీ తగ్గించబడిన ప్రయోజనాలతో కొనసాగుతుంది - కనీసం రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియం చెల్లించి ఉన్నట్లయితే
*టెర్మినల్ బోనస్, మరణం / మెచ్యూరిటీ మీదట ఏదైనా ఉంటే, కనీసం ఐదు పూర్తి సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లించబడిన షరతుకు లోబడి వర్తిస్తుంది
పాలసీని పునరుద్ధరించడానికి గల ఆప్షన్లు ఏవేవి?
మీరు ఈ క్రింది విధంగా ఒక నిర్దిష్ట వ్యవధి లోపున మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు–
చెల్లించబడని మొదటి ప్రీమియము యొక్క గడువు తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున, ఐతే మెచ్యూరిటీ తేదీకి ముందే పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈ కాలవ్యవధిలో మరణం జరిగిన పక్షములో, చెల్లించబడే విలువ, ఏదైనా ఉంటే అది తప్ప ఇతరత్రా ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు. ఒకవేళ పాలసీ పునరుద్ధరించబడితే, అప్పుడు పాలసీ, బకాయీ ఉన్న బోనసులు ఏవైనా ఉంటే అన్నిటినీ కూడగట్టుకుంటుంది. వడ్డీ ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారవచ్చు. సంతృప్తికరమైన వైద్య మరియు ఆర్థిక పూచీకత్తుకు లోబడి పునరుద్ధరణ ఆధారపడి ఉంటుంది.
మీ అవసరాన్ని బట్టి, మీరు పాలసీ అవధిగా 16 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యన ఎంచుకోవచ్చు. పాలసీ అవధి అనేది ప్రీమియం చెల్లింపు అవధి, విరామ సంవత్సరం మరియు హామీతో కూడిన క్రమం తప్పని ఆదాయ అవధి యొక్క మొత్తంగా ఉంటుంది. మీ ప్రీమియం చెల్లింపు అవధి (సంవత్సరాలు) ఎల్లప్పుడూ గ్యారంటీడ్ రెగ్యులర్ ఆదాయ అవధి (సంవత్సరాలు) కి సమానంగా ఉంటుందని గమనించాలి. ప్రీమియం చెల్లింపు అవధి అనేది మీరు ప్రీమియం చెల్లించే మొత్తం సంవత్సరాల సంఖ్య అయి ఉండగా, గ్యారెంటీడ్ రెగ్యులర్ ఆదాయ అవధి మీరు గ్యారంటీడ్ నెలవారీ చెల్లింపులను అందుకునే మొత్తం సంవత్సరాల సంఖ్య అయి ఉంటుంది. 0, 3, లేదా 5 సంవత్సరాల విరామ వ్యవధి, ప్రీమియం చెల్లింపు వ్యవధిని పూర్తి చేయడం మరియు మొదటి ఆదాయము చెల్లింపు యొక్క ప్రారంభం సంవత్సరాల మధ్యకాలముగా ఉంటుంది. ఈ వ్యవధి సందర్భంగా, అమలులో ఉన్న ఒక పాలసీ కొరకు, మరణ ప్రయోజనం కొనసాగినప్పటికీ మరియు బోనస్ కూడగట్టబడినా, హామీతో కూడిన క్రమం తప్పని ఆదాయం ఎటువంటిదీ చెల్లించబడదు.
ప్రవేశము వద్ద వయస్సు (సంవత్సరాలు) | ప్రీమియం చెల్లింపు అవధి (సంవత్సరాలు) |
---|---|
18-35 | 8 నుండి 11 |
36-45 | 9 నుండి 11 |
46-50 | 9 నుండి 10 |
ప్రీమియం చెల్లింపు అవధి | విరామ సంవత్సరం | హామీ ఇవ్వబడే క్రమం తప్పని ఆదాయ అవధి | పాలసీ కాలవ్యవధి |
---|---|---|---|
8 | 0 | 8 | 16 |
8 | 3 | 8 | 19 |
8 | 5 | 8 | 21 |
9 | 0 | 9 | 18 |
9 | 3 | 9 | 21 |
9 | 5 | 9 | 23 |
10 | 0 | 10 | 20 |
10 | 3 | 10 | 23 |
10 | 5 | 10 | 25 |
11 | 0 | 11 | 22 |
11 | 3 | 11 | 25 |
11 | 5 | 11 | 27 |
పాలసీ అవధి ముగిసిన మీదట, మీకు గ్యారంటీ ఇవ్వబడిన నెలసరి ఆదాయము యొక్క చివరి కంతుతో పాటుగా ఏవైనా కూడగట్టిన సులువైన రివర్షనరీ మరియు టెర్మినల్ బోనసులు ఏవైనా ప్రకటించబడి ఉంటే, వాటినీ అందుకుంటారు. దీనిని మెచ్యూరిటీ ప్రయోజనము అంటారు.
మెచ్యూరిటీ ప్రయోజనమును అందుకున్న మీదట, పాలసీ రద్దు అవుతుంది మరియు ఇక ఎటువంటి ప్రయోజనాలూ చెల్లించబడవు.
అక్కడ మరణంపై మీదట భరోసా సొమ్ము వీటిలో అత్యధికమైనది:
ఇక్కడ మరణంపై చెల్లించాల్సిన సంపూర్ణ భరోసా సొమ్ము అనేది ప్రాథమిక భరోసా సొమ్ము మరియు మెచ్యూరిటీపై కనీస గ్యారంటీడ్ భరోసా సొమ్ము సున్నా అయి ఉంటుంది
నామినీ(లు) పాలసీ ప్రారంభంలో ఎంచుకున్నట్లుగా 5, 10 లేదా 15 సంవత్సరాల వ్యవధిలో ఒకేసారి ఏకమొత్తము సొమ్ముగా లేదా నెలవారీ కంతుల రూపములో మరణ ప్రయోజనాన్ని పొందే ఐచ్ఛికాన్ని కలిగి ఉంటారు. వాయిదా కంతులలో మరణ ప్రయోజనం చెల్లింపు విషయంలో; మరణ ప్రయోజనాన్ని కారకాంశముచే గుణించడం ద్వారా నెలసరి వాయిదా మొత్తం లెక్కించబడుతుంది, ఇక్కడ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన సమీక్షకు లోబడి చేసే ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఆధారంగా కారకాంశం వస్తుంది. ఒకసారి వాయిదా చెల్లింపు మొదలయిందంటే, వాయిదా కాలవ్యవధి అంతటా ఈ చెల్లింపు అదే మట్టములోనే నిలిచి ఉంటుంది.
మాకు మరణం గురించి తెలియజేయడంలో ఆలస్యమైన పక్షములో, మరణ తేదీ అనంతరం చెల్లించబడిన మొత్తం గ్యారెంటీడ్ రెగ్యులర్ ఆదాయ ప్రయోజనం మరణంపై చెల్లించాల్సిన మరణ ప్రయోజనం నుండి తిరిగి వసూలు చేసుకోబడుతుంది.
* టెర్మినల్ బోనస్, మరణం మీదట ఏదైనా ఉంటే, కనీసం ఐదు పూర్తి సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లించబడిన షరతుకు లోబడి వర్తిస్తుంది
పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య కారణంగా మరణం విషయంలో, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో కనీసం 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.
మరిన్ని వివరాల కోసం, దయచేసి మా వెబ్‌సైట్ www.indiafirstlife.com ను చూడండి
జీవిత భరోసా పొందిన వ్యక్తిగా మీరు, ఈ పాలసీలో జీవించియున్న ప్రయోజనంగా గ్యారంటీడ్ రెగ్యులర్ ఆదాయాన్ని అందుకుంటారు. ఈ నెలవారీ ఆదాయ చెల్లింపులు వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 105% నుండి 125% ప్రాతిపదికన జీవిత భరోసా పొందిన వ్యక్తి వయస్సు, లింగం, విరామ సంవత్సరం మరియు మొదట్లో ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధిపై ఆధారపడి ఉంటాయి. జీవించియున్న ప్రయోజనం యొక్క చెల్లింపు, పాలసీ లోని మీ ప్రీమియం చెల్లింపు అవధి పూర్తయిన తర్వాత మొదలవుతుంది. పాలసీ యొక్క చివరి నెల లేదా మరణం యొక్క తేదీ ఏది ముందు వస్తే అంతవరకూ మీరు జీవించియున్న ప్రయోజనం అందుకుంటూ ఉంటారు.
ఈ క్రింది పట్టిక వార్షిక ఆదాయ శాతమును అందజేస్తుంది. నెలవారీ గ్యారెంటీడ్ రెగ్యులర్ ఆదాయం కోసం, వార్షిక గ్యారెంటీడ్ రెగ్యులర్ ఆదాయ ప్రయోజనం 12 తో భాగించబడుతుంది.
ప్రవేశము వద్ద వయస్సు | పిపిటి | విరామ సంవత్సరం | వార్షికం చేయబడిన ఒక ప్రీమియం యొక్క % గా సంవత్సరం వారీ గ్యారంటీడ్ రెగ్యులర్ ఆదాయము |
---|---|---|---|
18-35 | 10, 11 | 0 | 118% |
3 | 120% | ||
5 | 125% | ||
8, 9 | 0 | 110% | |
3 | 120% | ||
5 | 125% | ||
36-45 | 9,10,11 | 0 | 110% |
3 | 115% | ||
5 | 115% | ||
46-50 | 9,10 | 0 | 105% |
3 | 110% | ||
5 | 115% |
15 లేదా 20 సంవత్సరాల మొత్తం పాలసీ అవధి అంతటా జీవిత బీమా వర్తింపుతో పాటుగా అనుకూలవంతమైన ప్రీమియములు, హామీతో కూడిన జీవన ప్రయోజనాలు, మరియు బోనసులు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) అందించే ఈ హామీతో కూడిన పొదుపు జీవిత బీమా ప్లానుతో ఒక వ్యక్తిగతీకృతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి