ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 55 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ అనేది అనుసంధానితం కాని రైడర్. మరణం, ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం మరియు క్లిష్టమైన అనారోగ్యాలు వంటి ఏవైనా రాబోయే దురదృష్టకర సంఘటనల నుండి మీ ప్రియమైన వారిని మరింతగా రక్షించడంలో రైడర్ మీకు సహాయపడుతుంది. మీరు కొనుగోలు చేసి ఉన్న పాలసీ ప్రయోజనాలను మరింతగా పెంపొందించుకోవడానికి గాను మీరు దీనిని మీ బేస్ పాలసీకి జోడించుకోవచ్చు.
బేస్ మరియు రైడర్ పాలసీలు రెండూ అమలులో ఉన్నట్లయితే, ఈ ఈ పాలసీ క్రింది ఘటనలలో ముందుగా జరిగిన దానిపై, అన్ని భవిష్యత్ ప్రీమియంలను మాఫీ చేస్తుంది:
ఎ. మరణము
బి. ప్రమాద సంబంధిత సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము
సి. క్లిష్టమైన అస్వస్థత
ఔను, మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు.
ఒకవేళ మీరు పాలసీ షరతులు మరియు నిబంధనలో దేనికైనా అంగీకరించని పక్షములో, పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున అందుకు కారణమును పేర్కొంటూ పాలసీని మాకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.
మీ పాలసీని మీరు తిరిగి ఇచ్చినప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందుతారా?
ఔను. మేము చెల్లించిన ప్రీమియమునకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము.
i ని తగ్గించుకొని: పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం
ii ని తగ్గించుకొని. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ
iii ని తగ్గించుకొని. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
ఔను. వర్తించే ఈ పన్నులను పాలసీదారు అయిన మీరే భరించవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను నియమనిబంధనల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పుకు లోబడి ఉంటాయి. 1961
మీరు ఈ రైడర్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు రైడర్ ప్లాన్ యందు అంతర్లీనంగా అందుబాటులో ఉన్న కవర్ కోసం 3 విభిన్న ఆప్షన్ల నుండి ఎంచుకోవచ్చు. ఆప్షన్లు ఈ దిగువన ఇవ్వబడ్డాయి -
ఆప్షన్ | ప్రయోజనం |
---|---|
మరణంపై ప్రీమియం వైవర్ | ఈ ఆప్షన్, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, పాలసీదారు యొక్క మరణంపై బేస్ పాలసీ కింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది (బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులు అయినప్పుడు మాత్రమే). |
ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థత (రోగ నిర్ధారణ) పై ప్రీమియం యొక్క వైవర్ | ఈ ఆప్షన్, ఈ క్రింది ఘటనలలో ఏదైనా ఒకటి లేదా ఏకకాలంలో జరగడంపై బేస్ పాలసీ క్రింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది; రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్న రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క నిర్ధారిత రోగనిర్ధారణ. |
మరణం లేదా ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థతపై ప్రీమియం యొక్క వైవర్ | ఈ ఆప్షన్ ఈ క్రింది ఘటనలలో ఏదైనా లేదా ఏకకాలంలో జరిగితే, బకాయీ ఉండి చెల్లించవలసిన అన్ని భవిష్యత్ ప్రీమియమ్‌లను మాఫీ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది - జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క మరణం లేదా జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం ధృవీకరించబడిన నిర్ధారణపై, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భరోసా ఇవ్వబడుతుంది.ఈ ఆప్షన్ కొరకు ఎంచుకోవడానికి, బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులై ఉండాలి |
ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత వైకల్యం (ఎటిపిడి) మరియు క్లిష్టమైన అనారోగ్యం యొక్క వివరణాత్మక నిర్వచనాల కోసం ముఖ్యమైన నిర్వచనాలను చూడండి
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనంపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ఆదాయపు పన్ను చట్టము, 1961 ప్రకారము పన్ను ప్రయోజనాలు సమయానుగుణంగా చేయబడే మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
ప్రాతిపదిక | కనిష్టం | గరిష్టం |
---|---|---|
ప్రవేశ వయస్సు | 18 సంవత్సరాలు | 55 సంవత్సరాలు |
ప్రీమియం | రు. 500 |
|
రైడర్ అవధి | 5 సంవత్సరాలు (బేస్ ప్లాన్ యొక్క అత్యుత్తమ పాలసీ అవధి / ప్రీమియం చెల్లింపు వ్యవధి కనీసం 5 సంవత్సరాలు ఉండాలి) | బేస్ ప్లాన్ యొక్క ప్రీమియం చెల్లింపు అవధి లాగానే (వీటిలో ఏది ముందు జరిగితే దానికి లోబడి: గరిష్టంగా 30 సంవత్సరాలు లేదా పాలసీదారు వయస్సు 70 సంవత్సరాలకు మించనప్పుడు (చివరై జన్మదినం నాటికి) |
ప్రీమియం చెల్లింపు అవధి | రైడర్ పాలసీ అవధి లాగానే | రైడర్ పాలసీ అవధి లాగానే |
ఔను, మీ పాలసీని సరెండర్ చేయమని మేము ప్రోత్సహించనప్పటికీ కూడా, దానిని మీరు సరెండర్ చేయడానికి ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాలసీలో ఎటువంటి సరెండర్ విలువ ఉండదని మీరు గమనించగలరు.
ఏవిధంగానైనా ల్యాప్స్ కాకుండా నివారించడానికి గాను ప్రీమియములను గడువు తేదీలలో లేదా అంతకు ముందే చెల్లించాలి. మీరు గడువు తేదీలలో మీ బకాయి ప్రీమియం చెల్లింపును తప్పిన పక్షములో, మీకు నెలవారీ రూపంలో 15 రోజులు మరియు ఇతర ప్రీమియం చెల్లింపు రూపాల కోసం 30 రోజుల కారుణ్య వ్యవధి అందించబడుతుంది.
మీ పాలసీ ప్రయోజనాలు అన్నీ ఈ కారుణ్య వ్యవధిలో కొనసాగుతాయి మరియు పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.
ప్రీమియం చెల్లింపు రూపాలు మరియు మోడల్ కారకాంశాలు బేస్ పాలసీ లాగానే ఉంటాయి.
బేస్ పాలసీ ల్యాప్స్ అయిన పక్షములో, అప్పుడు రైడర్ పాలసీ రద్దు అవుతుంది. ఒకవేళ మీరు కారుణ్య వ్యవధి ముగిసే లోపున బకాయీ ఉన్న మీ ప్రీమియములను చెల్లించకపోతే, మీ పాలసీ ల్యాప్స్ అవుతుంది. కేవలం మొదటి చెల్లించని ప్రీమియం గడువు తేదీ నుండి వడ్డీ/ఆలస్య రుసుములతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రీమియమును చెల్లించడం ద్వారా మీరు ఒక నిర్దిష్ట వ్యవధి లోపున మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.
బేస్ ప్లాన్ ఆధారంగా చెల్లించబడని మొదటి రెగ్యులర్ ప్రీమియము యొక్క పునరుద్ధరణ తేదీ లోపున, ఐతే మెచ్యూరిటీ తేదీకి ముందే పునరుద్ధరణ చేసుకుంటున్నంత కాలమూ మీరు ల్యాప్స్ అయిన మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణ అనేది కంపెనీచే లేవనెత్తబడిన వైద్య మరియు ఆర్థిక ఆవశ్యకతలను సంతృప్తిపరచడానికి లోబడి ఉంటుంది. వైద్య ఖర్చు ఏదైనా ఉంటే, దానిని మీరే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పునరుద్ధరణ వ్యవధి ఆఖరు నాటికి మీ పాలసీని పునరుద్ధరించకపోతే, పాలసీ రద్దు చేయబడుతుంది మరియు మీరు ఏ ప్రయోజనాలనూ అందుకోవడానికి అర్హులు కాబోరు.
ఎ. ఆత్మహత్య మినహాయింపు:
పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య కారణంగా మరణం విషయంలో, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో కనీసం 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.
B. ప్రమాదకారణంగా సంపూర్ణ మరియు శాశ్వత అంగవైకల్యము
ప్రమాదకారణంగా సంపూర్ణ మరియు శాశ్వత వైకల్యం కోసం ఏదైనా క్లెయిము ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించినట్లయితే లేదా క్రింది పరిస్థితులలో దేని కారణంగా అయినా ఉత్పన్నమైతే, ప్రయోజనం చెల్లించబడదు –
1. తెలిసి గానీ లేదా మానసిక స్థితి బాగా లేనప్పుడు గానీ ఉద్దేశపూర్వకంగా స్వయంగా-చేసుకున్న గాయం, ఆత్మహత్య లేదా ఆత్మహత్యాయత్నం;
2. బీమా చేయబడిన వ్యక్తి మత్తుమందులు, మద్యము, నార్కోటిక్స్ లేదా సైకోట్రోపిక్ పదార్థాల ప్రభావంలో ఉండటం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క న్యాయబద్ధమైన నిర్దేశాలు మరియు ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాటిని తీసుకోకపోయి ఉండటం;
3. యుద్ధం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్య, విరోధాలు (యుద్ధం ప్రకటించినా లేదా ప్రకటించకపోయినా), సాయుధ లేదా నిరాయుధ సంధి, పౌరయుద్ధం, ఎదురుతిరగడం, ఎదురుదాడి, తీవ్రవాద చర్య, విప్లవం, తిరుగుబాటు, సైనిక చర్య లేదా అధికార స్వాధీనత, అల్లర్లు లేదా పౌర కల్లోలం, సమ్మెలు;
4. వాణిజ్యపరంగా లైసెన్స్ పొందిన విమానంలో విశ్వసనీయమైన ప్రయాణికుడిగా తప్ప, ఏదైనా విమానయాన కార్యక్రమంలో బీమా చేయబడిన వ్యక్తి పాల్గొనడం;
5. బీమా చేయబడిన వ్యక్తి నేరపూరిత చర్యలు లేదా చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొనడం;
6. కవర్ అమలు లోనికి వచ్చిన తేదీకి ముందు జరిగిన ప్రమాదం కారణంగా ఏదైనా వైకల్యం
7. కవర్ అమలు లోనికి వచ్చిన తేదీకి ముందు మరియు/లేదా తర్వాత ఏదైనా రకమైన అనారోగ్యం, వ్యాధి లేదా పుట్టుకతో వచ్చిన క్రమరాహిత్యాల కారణంగా ఏదైనా వైకల్యం;
8. వృత్తిపరమైన క్రీడ(లు) లేదా ఈతకొట్టడం/డైవింగ్ లేదా స్వారీ లేదా ఏదైనా రకమైన సాహస సవారీతో సహా అయితే వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఏవైనా ప్రమాదకర సాధనలలో పాల్గొనడం; శ్వాస ఉపకరణం ఉపయోగించి గానీ లేదా ఉపయోగించకుండా గానీ నీటి అడుగున కార్యకలాపాలు; యుద్ధ కళలు; వేటాడటం; పర్వతారోహణ; పారాచూటింగ్; బంగీ-జంపింగ్ వంటి వాటిలో పాల్గొనడం;
9. అణు కాలుష్యం; అణు ఇంధన పదార్థాల రేడియో-ధార్మికత, ప్రేలుడు లేదా ప్రమాదకర స్వభావం లేదా అణు ఇంధన పదార్థాల ద్వారా కలుషితమైన అణు ఇంధన సామాగ్రి లేదా ఆస్తి లేదా అటువంటి స్వభావం నుండి ఉత్పన్నమవుతున్న ప్రమాదం;
C. క్లిష్టమైన అనారోగ్యం కొరకు మినహాయింపులు
కవర్ చేయబడిన క్లిష్టమైన అనారోగ్యం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా క్రింది సందర్భాలలో ఏదైనా ఒక దాని నుండి జరిగినట్లయితే లేదా సంభవించినట్లయితే, జీవిత భరోసా పొందిన వ్యక్తి ఈ రైడర్ క్రింద ఎటువంటి ప్రయోజనాలకు అర్హులు కాబోరు:
1. కవర్ చేయబడిన క్లిష్టమైన అనారోగ్యం రోగనిర్ధారణ అయిన 30 రోజుల లోపున బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే.
2. తెలివిగా ఉన్నప్పుడు గానీ లేదా మానసిక స్థితి సరిగా లేనప్పుడు గానీ ఏదైనా వైద్య పరిస్థితి లేదా వైద్య ప్రక్రియ కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్వీయ-గాయం చేసుకోవడం, ఆత్మహత్యకు ప్రయత్నించడం;
3. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి ఏవైనా వైద్య పరిస్థితులతో బాధపడి ఉన్నట్లయితే, లేదా జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి ఏదైనా వైద్య ప్రక్రియకు గురైనట్లయితే, ఆ వైద్య పరిస్థితి లేదా ఆ వైద్య ప్రక్రియ ఏదైనా పుట్టుకతో వచ్చిన క్రమరాహిత్యం లేదా లోపం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించి ఉన్నట్లయితే;
4. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి ఏవైనా వైద్య పరిస్థితులతో బాధపడి ఉన్నట్లయితే, లేదా జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి ఏదైనా వైద్య ప్రక్రియకు గురైనట్లయితే, ఆ వైద్య స్థితి లేదా ఆ వైద్య ప్రక్రియ మద్యసేవనం లేదా మత్తుమందుల దురుపయోగం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించి ఉన్నట్లయితే
5. నీటిలో దూకడం లేదా సవారీ లేదా ఏదైనా రకమైన రేసుతో సహా * హానికారకమైన కార్యకలాపాలలో నిమగ్నం కావడం లేదా పాల్గొనడం; యుద్ధ కళలు; వేటాడటం; పర్వతారోహణ; పారాచూటింగ్; బంగీ-జంపింగ్; శ్వాస ఉపకరణం ఉపయోగించినా లేదా ఉపయోగించకుండా నీటి అడుగున కార్యకలాపాలలో పాల్గొనడం;
*హానికారకమైన కార్యకలాపాలు అనగా, బీమా చేయబడిన సభ్యుడు తాను శిక్షణ పొందినా, పొందకపోయినా వారికి సంభావ్యతగా ప్రమాదకరమైన ఏదైనా సాహసక్రీడ లేదా సాధన లేదా అభిరుచి
6. బీమా చేయబడిన వ్యక్తి నేరపూరితమైన ఉద్దేశ్యముతో నేరపూరిత చర్యలు లేదా చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొనడం.
7. అణు కాలుష్యం నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా వైద్య స్థితి లేదా వైద్య ప్రక్రియ; అణు ఇంధన పదార్థాల రేడియోధార్మిక, ప్రేలుడు లేదా ప్రమాదకర స్వభావం లేదా అణు ఇంధన పదార్థాల ద్వారా కలుషితమైన ఆస్తి లేదా అటువంటి స్వభావం నుండి ఉత్పన్నమయ్యే ప్రమాదం కోసం.
8. యుద్ధం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్య, విరోధం (యుద్ధం ప్రకటించబడినా లేదా ప్రకటించకపోయినా), సాయుధ లేదా నిరాయుధ సంధి, పౌరయుద్ధం, తిరుగుబాటు, ఎదురుదాడి, విప్లవం, ప్రతీకార చర్య, మిలిటరీ చర్య ఫలితంగా తలెత్తిన ఏదైనా వైద్య పరిస్థితి లేదా ఏదైనా వైద్య ప్రక్రియ కోసం, లేదా శాంతి సమయంలో అధికారం, అల్లర్లు లేదా పౌర గందరగోళం, సమ్మెలు లేదా ఏదైనా నావికా, సైనిక లేదా వైమానిక దళ ఆపరేషన్‌లో పాల్గొనడం కోసం.
9. బీమా చేయబడిన వ్యక్తి ఏదైనా విమానయాన చర్యలో పాల్గొనడం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా వైద్య పరిస్థితి కోసం లేదా ఏదైనా వైద్య ప్రక్రియ కోసం, సాధారణ మార్గాలలో మరియు షెడ్యూలు చేయబడిన కాలపట్టిక ప్రకారం విశ్వసనీయంగా, ఛార్జీలు చెల్లించి ప్రయాణిస్తున్న సాధారణ ప్రయాణీకుడు మరియు విమానయాన పరిశ్రమలో ఉద్యోగి అయిన పైలట్ లేదా గుర్తింపు పొందిన విమానయాన సంస్థ యొక్క క్యాబిన్ సిబ్బంది.
10. నిర్వచనాలలో కనబరచినట్లుగా వ్యాధి నిర్దిష్టమైన మినహాయింపులు.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పు ప్రకటన అనేదానితో వ్యవహరించబడుతుంది.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 45 ఇలా చెబుతుంది
.
1) పాలసీ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత, అంటే, పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే దాని నుండి ఎటువంటి జీవిత బీమా పాలసీ ప్రశ్నించబడదు.
2) బీమా యొక్క ఒక పాలసీని మోసము ఆధారంగా పాలసీ యొక్క బీమా తేదీ నుండి లేదా ముప్పు వర్తింపు ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ యొక్క పునరుద్ధరణ తేదీ నుండి లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే అప్పటి నుండి మూడు సంవత్సరాల వ్యవధి లోపున ఏ సమయములోనైనా ప్రశ్నించవచ్చు: అప్పుడు, దేని ఆధారంగా అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
3) సబ్ సెక్షన్ (2)లో ఏది ఎలా ఉన్నప్పటికిన్నీ, బీమా చేసిన వ్యక్తి తనకు అత్యుత్తమంగా తెలిసిన మేరకు మరియు నమ్మకం మేరకు ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా చెప్పడం లేదా అణచివేయడం నిజమని నిరూపించగలిగితే, లేదా వాస్తవాన్ని అణిచివేయడానికి ఏ విధమైన ఉద్దేశపూర్వక ఉద్దేశ్యం లేదని లేదా ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా పేర్కొనడం లేదా అణచివేయడం బీమాదారుకు తెలిసి జరగలేదని నిరూపితమైనప్పుడు ఏ బీమాదారు కూడా మోసం ఆధారాలపై జీవిత బీమా పాలసీని తిరస్కరించరు: ఒకవేళ మోసం జరిగియున్న పక్షములో, పాలసీదారు జీవించిలేని సందర్భములో, వాటిని తిరస్కరించే బాధ్యత లబ్ధిదారులపై ఉంటుంది.
4) ఒక జీవిత బీమా పాలసీని పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ జరిగిన తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల లోపున ఏది తర్వాత వస్తే దాని ప్రకారం, బీమా చేయబడిన వ్యక్తి యొక్క జీవిత కాలపు అంచనాకు సంబంధించిన ఏదైనా వాస్తవ ప్రకటన లేదా వాస్తవ సత్యం పాలసీ జారీ చేయబడిన లేదా పునరుద్ధరించబడిన లేదా రైడర్ జారీ చేయబడిన ప్రతిపాదన పత్రము లేదా ఇతర పత్రములో తప్పుగా చేయబడిందని లేదా త్రొక్కిపెట్టబడిందనే ఆధారాలతో ఎప్పుడైనా ప్రశ్నార్ధకమవుతుంది: అప్పుడు, దేని ఆధారంగా జీవిత బీమా పాలసీ తిరస్కరించాలనే అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది: ఇంకా తదుపరి, మోసం జరిగిందనే ఆధారంగా కాకుండా, తప్పుగా పేర్కొనడం లేదా వాస్తవ సత్యాన్ని త్రొక్కిపెట్టి ఉంచడం వల్ల పాలసీని తిరస్కరించిన పక్షంలో, అలా తిరస్కరించబడిన తేదీ వరకు పాలసీపై వసూలు చేసిన ప్రీమియములు అటువంటి తిరస్కరణ తేదీ నుండి తొంభై రోజుల వ్యవధి లోపున బీమా చేయబడిన వ్యక్తికి లేదా బీమా చేయబడిన వ్యక్తి యొక్క చట్టబద్ధ ప్రతినిధులు లేదా నామినీలు లేదా అసైనీలకు చెల్లించబడతాయి.
5) ఈ విభాగంలోని ఏదీ కూడా, వయస్సు ఋజువు కోసం ఏ సమయంలో అయినా కాల్ చేయడానికి బీమాదారు అర్హత కలిగి ఉన్నట్లయితే, పాలసీని ప్రశ్నించకుండా వారిని నిరోధించదు మరియు పాలసీ నిబంధనల కారణంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క వయస్సును ప్రతిపాదనలో తప్పుగా పేర్కొనబడినట్లు తదనంతర ఋజువుపై సర్దుబాటు చేయబడినంత మాత్రాన ఏ పాలసీ ప్రశ్నార్థకమైనట్లుగా భావించబడదు.
ఈ రైడర్ క్రింద చెల్లించబడే మెచ్యూరిటీ లేదా జీవించియున్న ప్రయోజనం ఏదీ ఉండదు.
మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్‌తో ఒత్తిడి లేని రిటైర్‌మెంట్ ని కనుగొనండి. ఇది మీ ఆర్థిక వ్యవహారాలను వృద్ధి చేయడానికై ఘనమైన రాబడిని వాగ్దానం చేస్తుంది మరియు మరింత ఆదా చేయడానికి మీకు వీలు కలిగిస్తుంది. అదనపు ప్రయోజనాలతో మీ పొదుపును మరియు పన్ను లాభాలను పెంచుకోండి.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి