Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఇఎంఐ క్యాలికులేటర్ అంటే ఏమిటి?

మీ లక్ష్యం ఒక కలల ఇల్లు అయినా, ఒక లగ్జరీ కార్ అయినా, లేదా ఎంతగానో ఎదురు చూసిన ఒక విహారయాత్ర అయినా, మీ ఉద్దేశ్యాలను సాధించడానికి గాను మార్గసూచీని ఏర్పరచుకోవడానికి ఒక ఇఎంఐ క్యాలికులేటర్ మీకు సహాయపడగలుగుతుంది. ఋణాలు అనేవి మీ కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి గాను ఆర్థికపరమైన వనరులు. ఒక లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ తో, మీరు ఇఎంఐ చెల్లింపులను త్వరగా కూర్పు చేసుకోవచ్చు మరియు నేడు మీ కలలను నెరవేర్చుకోవడానికి దగ్గరగా రావచ్చు. 
 

ఇఎంఐ అనేది ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ కు సంక్షిప్త రూపం. ఇఎంఐ లు అనేవి, ఋణగ్రహీత ఏ రకమైన లోన్ చెల్లించడానికైనా బ్యాంకుకు చెల్లించే నిర్ధారిత మొత్తాలుగా ఉంటాయి. మీకు అనేక కారణాల కొరకు ఋణ సేవలు అవసరం కావచ్చు. ఒక శెలవుకు రాబోయే ఖర్చులను తీర్చుకోవడం కోసం, లేదా ఒక అత్యవసర పరిస్థితి కోసం, ఒక కొత్త వీల్స్ సెట్ కొనుగోలు చేయడానికి ఒక కార్ లోన్, లేదా ఒక ఇల్లు కొనుగోలు చేయడానికి ఒక దీర్ఘావధి లోన్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

మీ అవసరముపై ఆధారపడి, మీరు ఒక లోన్ పొందవచ్చు మరియు ఆ మొత్తాన్ని నెలసరి కంతుల (ఇఎంఐ లు) ద్వారా చెల్లించివేయవచ్చు. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు ఋణదాతకు అసలు మరియు వడ్డీ మొత్తమును తిరిగి చెల్లించుటకు వ్యవస్థీకృతమైన మరియు సుస్థిరమైన మార్గాన్ని అందిస్తాయి. 

tax cal
Banner

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Guaranteed Protection Plus Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్

Dropdown Field
పన్ను ఆదా
Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • మీ మనీబ్యాక్ పొందడానికి ఆప్షన్ (ROP)
  • బహుళ లైఫ్ ఐచ్ఛికాలు
  • అనుకూలమైన ప్రీమియం షరతులు
  • అదే పాలసీ క్రిందనే మీ జీవిత భాగస్వామికి బీమా చేయండి.
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ వర్తింపు ఉంటుంది
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇఎంఐ క్యాలికులేటర్ ఉపయోగించడమెలా?

స్టెప్ 1:

ప్రాథమిక వివరాలు

లోన్ మొత్తాన్ని ఎంటర్ చేయండి.

select-stategy

స్టెప్ 2:

కాలావధి

నిర్దిష్ట కాలవ్యవధిలో మీరు తిరిగి చెల్లించాలనుకుంటున్న లోన్ కాలావధిని ఎంచుకోండి.

premium-amount

స్టెప్ 3:

వడ్డీ రేటు

లోన్ పై ప్రాధాన్యతా వడ్డీ రేటును ఎంటర్ చేయండి.

select-stategy

ఇఎంఐ క్యాలికులేటర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

మీరు ఒక లోన్ తీసుకోవడానికి ముందు సరియైన వివరాలు మరియు అంకెలను పొందడానికి లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ మీకు సులభమైన మార్గమునిస్తుంది.

అది మీకు త్వరిత ఫలితాలను ఇస్తుంది

కొద్ది సెకెన్ల లోపుననే మీకు ఇఎంఐ మొత్తము, లోన్ పై చెల్లించవలసియున్న మొత్తం వడ్డీ డబ్బు ఎంత చెల్లించాలో, అదే విధంగా లోన్ కాలావధి చివరికి మీరు చెల్లించాల్సిన బాధ్యత ఉన్న పూర్తి మొత్తము (అసలు మొత్తము + వడ్డీ) ఎంతో మీకు తెలిసిపోతుంది.

calci

ఒక ఇఎంఐ స్థోమతకు తగినదేనా అని నిర్ణయించుకోవడానికి అది మీకు సహాయపడుతుంది

వాడకానికి సులభంగా ఉండే ఇఎంఐ వడ్డీ క్యాలికులేటర్ తో, ఇఎంఐ ఎలా మారుతుందో చూడడానికి మీరు ఎదురుచూస్తూ ఉంటే, మీరు లోన్ యొక్క కాలావధిని గానీ లేదా అసలు మొత్తాన్ని గానీ మార్చవచ్చు. ఇఎంఐ సూత్రము ఆధారంగా మీరు ఎంత లోన్ మొత్తాన్ని పొందవచ్చునో లెక్క కట్టుకోవడానికి ఇఎంఐ మొత్తం క్యాలికులేటర్ మీకు సహాయపడుతుంది.

calci

అది లోన్ కొనుగోలు మరియు ఆర్థిక వ్యవహారాల ప్రణాళికకు సహాయపడుతుంది

ఇఎంఐ వడ్డీ క్యాలికులేటర్ అనేది, ఒక లోన్ కోసం మీరు షాపింగ్ చేసేటప్పుడు ఉపయోగించడానికి ఒక తెలివైన సాధనము. మీ ఇఎంఐ లు ఎలా ప్రభావితమవుతున్నాయో చూడడానికి మీరు వడ్డీ రేట్లను మార్చుకోవచ్చు కాబట్టి, మీకు అత్యుత్తమంగా సరిపోయే దానిని కనుక్కోవడానికై అనేక బ్యాంకుల నుండి మీరు ఒక వ్యయ పోలికను చేసుకోవచ్చు. మీరు ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ ను ఒక హోమ్ లోన్ క్యాలికులేటరుగా గానీ, వ్యక్తిగత లోన్ క్యాలికులేటరుగా గానీ లేదా కార్ లోన్ క్యాలికులేటరుగా గానీ ఉపయోగిస్తున్నా, మీరు ప్రతిసారీ ఖచ్చితమైన లెక్కలు పొందేలా చూసుకుంటూ ఇఎంఐ లెక్కింపు సూత్రము ఒకటిగానే ఉంటుంది.

calci

అది ఇఎంఐ క్యాలికులేషన్ సూత్రాన్ని మాన్యువల్ గా ఉపయోగించే అవసరం లేకుండా చేస్తుంది

లోన్ కాలావధి యొక్క తొలి సంవత్సరాలలో మీరు ఎక్కువ వడ్డీ మరియు తక్కువ అసలు చెల్లించేలాగా చూసుకోవడానికి గాను ఇఎంఐ క్యాలికులేషన్ సూత్రము రూపొందించబడింది. ఇఎంఐ లు చెల్లించడం మరియు లోన్ ని తిరిగి చెల్లింపును మీరు మొదలు చేయగానే, ఈ నిల్వమొత్తం నెమ్మదిగా వెనక్కి చేయబడుతుంది, తద్వారా ఇఎంఐ యొక్క గణనీయమైన ఎక్కువ భాగము అసలు మొత్తము చెల్లింపు కోసం మళ్ళించబడుతుంది.

ఒక లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ తో, మీరు మాన్యువల్ గా ఎటువంటి లెక్కలూ చేయాల్సిన అవసరం లేదు —మీరు తెలుసుకోవలసిందల్లా, మీకు ఏది కావాలో దానిని పొందుటకు ఇఎంఐ క్యాలికులేటర్ ని ఎలా ఉపయోగించాలనేదే. ఇఎంఐ అమౌంట్ క్యాలికులేటర్ మరియు ఇఎంఐ క్యాలికులేషన్ ఫార్ములా మీ కోసం పని చేస్తాయి.

calci

How do Retirement Calculators work?

ఇఎంఐ క్యాలికులేటర్లు ఎలా పని చేస్తాయి?

ఇఎంఐ క్యాలికులేటర్లు అనేవి అంతర్నిర్మిత ఇఎంఐ క్యాలికులేషన్ సూత్రముపై పనిచేసే సాధనాలు. ఇఎంఐ లెక్కించు సూత్రము:

ఇఎంఐ = P X R X (1 + R)N/((1 + R)N - 1)

అందులో,

  • P = లోన్ మొత్తము
  • R = వడ్డీ రేటు
  • N = లోన్ కాలావధి నెలలలో

ఇండియాలో ఇఎంఐ క్యాలికులేటర్ ఉపయోగించడానికి మీరు ఈ సులువైన వివరాలను నింపి కూర్చుంటే, ఇఎంఐ క్యాలికులేషన్ సూత్రము మీ కోసం దాని పని అది చేసుకుపోతుంది. ఇఎంఐ అమౌంట్ క్యాలికులేటర్, ఒక నిర్దిష్ట లోన్ మొత్తాన్ని ఒక నిర్ధారిత సంవత్సరాల సంఖ్యకు, ఋణదాతచే పేర్కొనబడిన వడ్డీ రేటుతో తీసుకోవడానికి గాను మీరు చెల్లించబోతున్న ఇఎంఐ మొత్తమును నిర్ధారించడానికి మీకు సహాయపడుతుంది.

bmi-calc-mob
bmi-calc-desktop

ఇఎంఐ క్యాలికులేటర్ల రకాలు ఏవేవి?

మీకు నిర్దిష్ట వివరాలను అందించడానికి అనుకూలీకృతం చేయబడిన ఇఎంఐ క్యాలికులేటర్ల యొక్క విభిన్న రకాలు అనేకం ఉన్నాయి. మొత్తమ్మీద ఇఎంఐ క్యాలికులేషన్ సూత్రము లేదా ఇఎంఐ సూత్రము ఒకటే అయి ఉంటుంది కాబట్టి, వేర్వేరు రకాల ఇఎంఐ క్యాలికులేటర్లు లోన్ మొత్తాన్ని వేర్వేరుగా తీసుకోవచ్చు.

హోమ్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్

హోమ్ లోన్ క్యాలికులేటర్ తో, మీ హోమ్ లోన్ ఇఎంఐ ని నిర్ధారించడానికి మీరు ఇఎంఐ సూత్రమును ఉపయోగించవచ్చు.

cover-life

పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్

వ్యక్తిగత లోన్లు అనేవి సురక్షితం చేయబడని ఋణాలు. మీకు మీరుగా ఎటువంటి ఆర్థిక స్థితిలో ఉండబోతున్నారు అనే విషయాన్ని మీరు కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. మీరు తెలియజేత నిర్ణయాన్ని చేయడానికి మీకు పర్సనల్ లోన్ క్యాలికులేటర్ సహాయపడగలుగుతుంది.

wealth-creation

కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్

అనేకమంది వ్యక్తులకు వాహనాలు అత్యావశ్యకమైనవి. మొత్తంగా ఒక వాహనం మీకు ఎంత ఖరీదు (అసలు వ్యయం మరియు వడ్డీ) అవుతుంది అని అర్థం చేసుకోవడానికి ఒక కార్ లోన్ క్యాలికులేటర్ మీకు సహాయపడుతుంది.   

secure-future

ఫ్లోటింగ్ మరియు ఫ్లాట్ ఇఎంఐ వడ్డీ రేటు క్యాలికులేటర్

మీరు ఎంచుకున్న లోన్ ని బట్టి, మీకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు అయినా ఉంటుంది లేదా నిర్ధారిత వడ్డీ రేటు అయినా ఉంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క ఇఎంఐ వడ్డీ రేటు క్యాలికులేటర్ తో, వడ్డీ రేటు మారే కొద్దీ మీరు ఎంత మొత్తం మీరు బాకీ ఉన్నారు అనేదాన్ని లెక్కించడంలో మీరు కచ్చితంగా అగ్రభాగంలో ఉంటారు.

many-strategies

తరచుగా అడిగే ప్రశ్నలు

బాకీపడిన అసలు మరియు వడ్డీని ఇఎంఐ ల ద్వారా చెల్లించడమెలా?

Answer

ఇఎంఐ రెండు ప్రధాన భాగాంశాలను కలిగి ఉంటుంది—అసలు మరియు వడ్డీ. లోన్ కాలావధి ప్రారంభములో, ఇఎంఐ లో ఎక్కువ భాగం వడ్డీ మొత్తమును చెల్లించడానికి మళ్ళించబడుతుంది, కాగా మిగిలినది అసలు మొత్తము చెల్లింపుకు ఉపయోగించబడుతుంది. కాలావధి పురోగమించే కొద్దీ, లోన్ తిరిగిచెల్లింపును మీరు పూర్తి చేసేవరకూ మీ ఇఎంఐ లో ఎక్కువ అంటే ఎక్కువ భాగం అసలుకు నిర్దేశించబడుతుంది.

మీరు మీ ఇఎంఐ చెల్లింపును తప్పినట్లయితే ఏమి జరుగుతుంది?

Answer

నెలసరి ఇఎంఐ క్యాలికులేటరును ఉపయోగించడం యొక్క ప్రయోజనాలలో ఒకటి ఏదంటే, ప్రతి నెలా లోన్ తిరిగిచెల్లింపు కొరకు ఎంత మొత్తమును బడ్జెట్ చేసుకోవలసి ఉంటుందో మీరు ముందస్తుగానే తెలుసుకొంటారు. ఒక ఇఎంఐ ని తప్పించుకోవడం లేదా వదిలివేయడం అనేది మీ ఆర్థికపరమైన ఆరోగ్యానికి మంచిది కాదు. మీ క్రెడిట్ స్కోరు పడిపోయే అవకాశముంటుంది, మరియు మీ బ్యాంకు ఒక గణనీయమైన ఆలస్యపు రుసుమును విధిస్తుంది. మీ ఇఎంఐ పై వైఫల్యం చెందడం భవిష్యత్తులో ఎక్కువ మొత్తం ఇఎంఐ ఉండేలా కూడా ఫలితం ఇస్తుంది. ఇండియాలోని ఇఎంఐ క్యాలికులేటరుతో మీ ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేసుకోండి, తద్వారా మీరు చెల్లింపులను తప్పించుకోరు.

కార్ లోన్ కోసం నా ఇఎంఐ ని లోన్ కాలావధి ప్రభావితం చేస్తుందా?

Answer

లోన్ కాలావధి మరియు ఇఎంఐ మొత్తము పరస్పరము విలోమానుపాతములో ఉంటాయి. కాబట్టి లోన్ కాలావధి ఎంత ఎక్కువ ఉంటే, ఇఎంఐ మొత్తము అంత తక్కువ ఉంటుంది. దీనికి విరుద్ధంగా, తక్కువ కాలావధి ఉంటే ఎక్కువ మొత్తములో ఇఎంఐ లు ఉంటాయి. ఇఎంఐ యందు అసలు మరియు వడ్డీ చెల్లింపులు కలిగి ఉంటాయని గమనించడం ఆవశ్యకం. ఎక్కువ కాలవ్యవధి ఇఎంఐ యొక్క వడ్డీ అంశమునకు మీరు చెల్లించాల్సిన డబ్బు మొత్తమును పెంచుతుంది. కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరు మీకు ఈ విడదీతను ఇస్తుంది, తద్వారా మీరు మీ కోసం మీకు మీరుగా అత్యుత్తమ ఎంపికను చేసుకోవచ్చు.

కార్ ఇఎంఐ ఎలా లెక్కించబడుతుంది?

Answer

కార్ లోన్ అనేది సురక్షితం చేయబడిన లోన్, ఒక వాహనం కొనడానికి దానిని మీరు ఒక ఆర్థికసహాయ సంస్థ లేదా బ్యాంకు నుండి తీసుకోవచ్చు. కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేషన్ సూత్రము అనేది, వేర్వేరు రకాల ఇఎంఐ క్యాలికులేటర్లలో ఉపయోగించే సూత్రము లాగానే ఉంటుంది. ఇఎంఐ = [P x r (1+r) n] / [(1+r) n-1] ఇందులో P = అసలు/లోన్ మొత్తము, r = వడ్డీ రేటు, మరియు n = లోన్ కాలావధి నెలలలో. ఇఎంఐ సూత్రమును వర్తింపు చేయడానికి మరియు ప్రతి నెలా ఋణదాతకు మీరు ఎంత తిరిగి చెల్లింపు చేయాల్సి ఉంటుంది అని నిర్ధారించుకోవడానికి కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరును ఉపయోగించండి.

నేను ఇఎంఐ లను ఎప్పుడు మరియు ఎలా చెల్లించాలి?

Answer

లోన్ పంపిణీ జరిగిపోగానే, ఇఎంఐ లు లేదా సరిసమానం చేయబడిన నెలసరి కంతులు ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీన బాకీ ఉంటాయి. అత్యధిక ఉదంతాలలో, ఇఎంఐ మీ బ్యాంక్ ఖాతా నుండి ఋణదాతకు దానంతట అదే జమ చేయబడుతుంది. ఇఎంఐ చెల్లింపులను కవర్ చేయడానికి గాను మీరు తర్వాతి-తేదీ వేయబడిన చెక్కులు కొన్నింటిని ఇవ్వవలసి ఉంటుంది. చుక్కలు వేయబడిన గీతపై సంతకం చేయడానికి ముందుగా కంతు మొత్తాలు మీ స్థోమతకు తగ్గట్టుగా ఉన్నాయని చూసుకోవడానికి ఒక నెలసరి ఇఎంఐ క్యాలికులేటరును ఉపయోగించండి.

హోమ్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ ఉపయోగించడం యొక్క ప్రయోజనావకాశాలు ఏవి?

Answer

ఒక హోమ్ లోన్ క్యాలికులేటరు మీకు లోన్ మొత్తాన్ని, చెల్లించాల్సిన వడ్డీ రేటును, కొనుగోలు యొక్క మొత్తం ఖరీదును, వడ్డీని, మరియు నెలసరి తిరిగిచెల్లింపు లేదా ఇఎంఐ మొత్తాన్ని చూపుతుంది. ఒక హోమ్ లోన్ క్యాలికులేటరు ఇఎంఐ లెక్కింపు సూత్రము ఉపయోగించడాన్ని మీ కోసం సులభం మరియు త్వరితం చేస్తుంది. మీరు ఇఎంఐ మొత్తమును చూడగానే, తిరిగిచెల్లింపును మీకు సౌకర్యవంతంగా చేసుకోవడానికి గాను మీరు లోన్ కాలావధిని తారుమారు చేసుకోవచ్చు. ఒక హోమ్ లోన్ క్యాలికులేటరుతో, లోన్ ఆఫర్లను పోల్చుకోవడం మరియు మీ కోసం అత్యుత్తమమైన దాన్ని ఎంచుకోవడం సులభం చేసుకుంటూ మీరు కచ్చితమైన ఇఎంఐ సూత్రము లెక్కింపులను చేసుకోవచ్చు. ఒకవేళ మీ లోన్ పై పాక్షిక చెల్లింపులు చేయాలని మీరు నిర్ణయించుకుంటే, ముందస్తు చెల్లింపు మీ లోన్ ని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక హోమ్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరు మీకు చూపుతుంది.

మీ హోమ్ లోన్ దిశగా ఇఎంఐ చెల్లింపు మీ పన్ను బాధ్యతను ఎలా తగ్గించగలుగుతుంది?

Answer


స్వంతంగా ఇంటిని కలిగి ఉండడం అనేది ఒక స్వప్నం సాకారమైనట్లు. అయినప్పటికీ, అది ఒక పెట్టుబడి ఖర్చు, మరియు హోమ్ లోన్ కు మీరు సైనప్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది తద్వారా మీరు కొనుగోలు చేయగలుగుతారు. భారత ప్రభుత్వము తన్ను తగ్గింపులు మరియు మినహాయింపులను పొందుటకు ఇంటి స్వంతదారులకు అనేక మార్గాలను కల్పించింది. హోమ్ లోన్ కు మీ పన్ను బాధ్యతలను తగ్గించడానికై సెక్షన్ 80C క్రింద తగ్గింపులకు అర్హత ఉంటుంది.

1) హోమ్ లోన్ ఇఎంఐ వడ్డీ చెల్లింపులను భారత ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 24 క్రింద క్లెయిము చేసుకోవచ్చు.

2) నిర్మాణానికి-పూర్వము మీరు చెల్లించిన హోమ్ లోన్ వడ్డీపై మీరు తగ్గింపును క్లెయిము చేసుకోవచ్చు.

3) సెక్షన్ 80C క్రింద, మీరు అసలు తిరిగి చెల్లింపు మొత్తముపై రు. 1.5 లక్షల వరకూ పన్ను తగ్గింపును పొందవచ్చు.

4) స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఖర్చుల కొరకు మీరు సెక్షన్ 80C తగ్గింపులను క్లెయిము చేయవచ్చు

5) మీరు సెక్షన్ 80EE క్రింద అదనపు తగ్గింపులను (రు. 50,000) వరకూ మరియు సెక్షన్ 80EEA క్రింద (రు. 1.5 లక్షల వరకూ) క్లెయిము చేసుకోవచ్చు.

6) ఒక ఇంటి యొక్క సహ-స్వంతదారులు ఇద్దరూ కూడా తమ స్వంత ఆదాయపు పన్ను రిటర్నులలో తగ్గింపులను క్లెయిము చేసుకోవచ్చు.

హోమ్ లోన్ పైన ఇఎంఐ ఎలా లెక్కించబడుతుంది?

Answer

ప్రతి నెలా ఋణదాతకు మీరు ఎంత బాకీ ఉన్నారు అని నిర్ధారించడానికి హోమ్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్లు ఒక నిర్ధారిత ఇఎంఐ లెక్కింపు సూత్రమును ఉపయోగిస్తాయి. తిరిగి చెల్లింపు షెడ్యూలును లెక్కించడానికి గాను హోమ్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్లకు అసలు మొత్తము లేదా అప్పుగా తీసుకున్న మొత్తము, లోన్ కాలావధి నెలల్లో, మరియు నెలసరి వడ్డీ రేటు అవసరమై ఉంటుంది. మీ హోమ్ లోన్ ఇఎంఐ ని నిర్ధారించడానికి మీరు ఇఎంఐ లెక్కింపు సూత్రమును ఉపయోగించవచ్చు. మాన్యువల్ గా చేసే లెక్కింపులు ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి మరియు మానవ తప్పిదాలకు అవకాశం ఉంటుంది. ఇండియాఫస్ట్ లైఫ్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ తో, మీ ప్రాంతములో మీరు ఆటోమేటెడ్ హోమ్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ యొక్క నిపుణులుగా ఉంటారు.

ఒక పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ లోన్ ఎంపికను నిర్ణయించడంలో ఎలా సహాయపడగలుగుతుంది?

Answer

విభిన్న ఋణదాతలు మరియు సంస్థల నుండి ఋణాలను పోల్చి చూసుకోవడానికి ఒక పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరు మీకు సహాయపడుతుంది. ప్రతి బ్యాంకు వేర్వేరు వడ్డీ రేట్లను వసూలు చేస్తుంది, మరియు లోన్ కాలావధులు కూడా ఋణమిచ్చే సంస్థపై ఆధారపడి వ్యత్యాసంగా ఉంటాయి. మీరు చెల్లించబోయే ఇఎంఐ ని నిర్ధారించడానికై, పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరుకు మీరు లోన్ మొత్తము, నెలల్లో కాలావధి, మరియు వడ్డీ రేటును ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్సనల్ లోన్ క్యాలికులేటరు సహాయముతో మీకు అందుబాటులో ఉన్న లోన్ ఐచ్ఛికాలను పోల్చుకోవడం ద్వారా, అత్యంత స్థోమత గల వడ్డీ రేట్లను మరియు తిరిగిచెల్లింపు షెడ్యూలును అందించే ఒకదానిని మీరు ఎంపిక చేసుకోవచ్చు.

పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ యొక్క ప్రయోజనావకాశాలు ఏవి?

Answer

ఒక వ్యక్తిగత లోన్ అనేది ఇండియా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన లోన్ ఉత్పత్తుల్లో ఒకటి, ఎందుకంటే ఇది భద్రత అవసరం లేనిది మరియు ద్వైపాక్షిక-రహితమైన లోన్. ఒక వ్యక్తిగత లోన్ ఇఎంఐ క్యాలికులేటరు ఉపయోగించడం వల్ల మీకు అనేక  ప్రయోజనావకాశాలు ఉన్నాయి:
 

మీరు సైనప్ చేసే ఇఎంఐ మొత్తము మీరు సౌకర్యంతంగా చెల్లించదగిన కొంత మొత్తముగా ఉంటుంది.

ఈ అంశాలు మీ వ్యక్తిగత లోన్ చెల్లింపులను ఎలా ప్రభావితం చేస్తాయో చూడడానికి వివిధ లోన్ మొత్తాలు, కాలావధులు, మరియు వడ్డీ రేట్లను ప్రయోగం చేయడానికి వ్యక్తిగత లోన్ ఇఎంఐ క్యాలికులేటరు మీకు సహాయపడుతుంది.

వ్యక్తిగత లోన్ క్యాలికులేటరు సహాయముతో ఇఎంఐ లను గణించడం ద్వారా మీ సమయము మరియు శ్రమను ఆదా చేసుకోండి, అది కొన్ని సెకెన్లలోనే కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.

మీ లోన్ యొక్క కాలావధిలో వడ్డీ రేటు గనక పెరిగితే లేదా తగ్గితే ఏమి జరుగుతుంది?

Answer

ఒక నిర్ధారిత-రేటు ఋణములో, లోన్ యొక్క కాలావధి అంతటా వడ్డీ రేటు ఒకే విధంగానే నిలిచి ఉంటుంది. ఒక ఫ్లోటింగ్ రేటు విషయములోనైతే, ఆ రేటు మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి లోన్ కాలావధిలో మీ వడ్డీ రేటు పైకి మరియు క్రిందికి వెళ్ళవచ్చు. వడ్డీ రేట్లు మారినప్పటికీ సైతమూ అనేక బ్యాంకులు చెల్లించవలసిన ఇఎంఐ ఒకే తీరులో ఉండేలా చూసుకుంటాయి. రేటు పెరిగినప్పుడు, ఇఎంఐ సూత్రము ఇఎంఐ యొక్క అత్యధిక గణనీయ భాగమును వడ్డీ చెల్లింపుల దిశగా కేటాయింపు చేస్తుంది. రేటు తగ్గిపోయినప్పుడు, ఎక్కువ మొత్తము అసలు మొత్తం నుండి తగ్గించుకోబడుతుంది.

కార్ లోన్ ఇఎంఐ నిర్ధారితమా, లేదా భవిష్యత్తులో అది మారగలుగుతుందా?

Answer

మీకు అవసరమున్న లోన్ మరియు దానిని మీకు అందజూపుతున్న ఋణదాతపై ఆధారపడి, మీ లోన్ కు ఫ్లోటింగ్ లేదా నిర్ధారిత వడ్డీ రేటు ఉండవచ్చు. ముఖ్యంగా, కార్ లోన్ అవధి అంతటా ఒకే రీతిలో నిలిచి ఉండే నిర్ధారిత వడ్డీ రేటుతో ఆటో లోన్లు వస్తాయి. కొన్ని బ్యాంకులు మరియు సంస్థలు మార్కెట్ ఒడిదుడుకులచే ప్రభావితమయ్యే ఫ్లోటింగ్ వడ్డీ రేటును అందిస్తాయి, అది, మీ ఇఎంఐ ఎంత అసలుకు వెళుతుంది మరియు వడ్డీ తిరిగిచెల్లింపుకు ఎంత వెళుతుందనే దాన్ని ప్రభావితం చేస్తుంది. వడ్డీ రేటు ఫ్లోటింగ్ అయినప్పటికీ సైతమూ, మీ ఇఎంఐ కేటాయింపు మారుతుంది కానీ కార్ లోన్ ఇఎంఐ మొత్తాలు నిర్ధారితంగానే నిలిచి ఉంటాయి.

మీ పర్సనల్ లోన్ ఇఎంఐ ని తగ్గించుకోవడం ఎలా?

Answer

మీరు మీ పర్సనల్ లోన్ ఇఎంఐ ని తగ్గించుకోగలగడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
 

మీరు లోన్ యొక్క కాలావధిని పెంచవచ్చు. ఒక పర్సనల్ లోన్ యొక్క అవధి ఇఎంఐ మొత్తమునకు విలోమానుపాతములో ఉంటుంది, అనగా దీర్ఘావధికి తిరిగిచెల్లింపు షెడ్యూలు మరింత పొడిగింపు వ్యవధికి విస్తరించబడి ఉంటుంది కాబట్టి చిన్న ఇఎంఐ చెల్లింపులు అవసరమవుతాయి.

ఒక స్టెప్-డౌన్ ఇఎంఐ చెల్లింపు షెడ్యూలు కొరకు ఎంపిక చేసుకోండి. అటువంటి షెడ్యూలులో, మొదటి రోజుల వ్యవధిలో మీరు పెద్ద ఇఎంఐ మొత్తాన్ని చెల్లిస్తారు.

ప్రస్తుత ఋణదాతతో చర్చలు జరపడం ద్వారా లేదా మీకు తక్కువ వడ్డీ రేటుకు అప్పు ఇచ్చే ఋణదాతకు మారడం ద్వారా మీరు మీ పర్సనల్ లోన్ ఇఎంఐ ని తగ్గించుకోవచ్చు.

కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేటర్ యొక్క ప్రయోజనావకాశాలు ఏవి?

Answer

ఒక కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరు అనేది, ఒక కారుకు మొత్తంగా చివరికి ఎంత చెల్లిస్తారు, ఎంతకాలం చెల్లిస్తారు మరియు ఏ రేటుతో చెల్లిస్తారు అని మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడే మీ చేతిలోని సాధనము. ఇఎంఐ సూత్రము లెక్కింపును వేగవంతం, సులభం చేయడానికి మరియు కచ్చితమని నిరూపించడానికి కార్ లోన్ క్యాలికులేటరును ఉపయోగించండి. మీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకోవడానికి మరియు మీ కార్ లోన్ కు మీరు వాస్తవంగా చెల్లిచాల్సిన మొత్తమును విడదీయుట కొరకు కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరు మీకు సహాయపడుతుంది.

మీ ఇఎంఐ పైన పాక్షిక చెల్లింపుల ప్రభావం ఏమిటి?

Answer

లోన్ అనేది చేతిలో ఉండే ఆర్థిక సాధనం కాబట్టి, అనేకమంది వ్యక్తులు సాధ్యమైనంత త్వరగా ఋణం నుండి విముక్తి పొందాలనుకుంటారు. ఋణం నుండి విముక్తి పొందడమనేది మీ ప్రాథమిక లక్ష్యం ఐతే, లోన్ పై పాక్షిక చెల్లింపులు చేసే ఐచ్ఛికం మీకు ఉంటుంది. మీ లోన్ ని పాక్షికంగా గానీ లేదా పూర్తిగా గానీ ముందస్తుగా చెల్లించడానికి మీరు ఎంచుకోవచ్చు. మీ లోన్ ని పాక్షికంగా ముందస్తుగా చెల్లించడం ద్వారా, మీరు భవిష్యత్తులో చెల్లించాల్సి ఉన్న ఇఎంఐ కంతు మొత్తాలను తగ్గించుకోవచ్చు. గమనిక: లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకులకు ముందస్తు చెల్లింపు అపరాధ రుసుము లేదా నిర్ణీత సంవత్సరాల సంఖ్య ఉంటుంది, ఆ కాలములో ముందస్తు చెల్లింపు అనుమతించబడదు. మీ బ్యాంకును కనుక్కోండి మరియు లోన్ మొత్తమును పాక్షికంగా చెల్లించిన తర్వాత మీ ఇఎంఐ లు ఎలా మారతాయో అర్థం చేసుకోవడానికి కార్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరును ఉపయోగించండి.

పర్సనల్ లోన్ ఋణవిమోచన షెడ్యూలు అంటే ఏమిటి?

Answer

ఋణవిమోచన అనేది ఒక లోన్ ను చెల్లింపు షెడ్యూలు ముగిసేవరకూ మరియు లోన్ పూర్తిగా చెల్లించబడే వరకూ నిర్ధారిత చెల్లింపు విడతలుగా విడదీసే ఒక ఆర్థికపరమైన ప్రక్రియ. ఒక పర్సనల్ లోన్ ఋణవిమోచన షెడ్యూలు అనేది, ప్రతినెలా ఎన్ని ఇఎంఐ లను చెల్లించాల్సి ఉంటుంది, మరియు ఒక్కో ఇఎంఐ యొక్క వడ్డీ మరియు అసలుకు ఎంత మొత్తం నిర్దేశించబడి ఉంటుంది అని జాబితా చేసే ఒక పట్టిక. మీరు ఒక పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలికులేటరును ఉపయోగించునప్పుడు, మీరు ఒక పర్సనల్ లోన్ ఋణవిమోచన షెడ్యూలుకు ప్రాప్యత పొందుతారు, అది షెడ్యూలు చేయబడిన చెల్లింపులు, అసలు తిరిగిచెల్లింపు, మరియు వడ్డీ ఖర్చులను జాబితా చేస్తుంది.

ఉపయోగించడానికి సులభంగా ఉండే మా క్యాలికులేటర్లతో మీ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి.

హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్

Savings

టర్మ్ ప్రీమియం కాలిక్యులేటర్

Savings

ఆదాయపు పన్ను క్యాలికులేటర్

Savings

రిటైర్‌మెంట్ క్యాలికులేటర్

Savings

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

Savings

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ క్యాలికులేటర్

Savings

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్

Savings

కాస్ట్ ఆఫ్ డిలే క్యాలికులేటర్

Savings

యులిప్ క్యాలికులేటర్

Savings

పిపిఎఫ్ క్యాలికులేటర్

Savings

హెచ్ఆర్ఏ క్యాలికులేటర్

Savings

ఇఎంఐ క్యాలికులేటర్

Savings

బిఎంఐ క్యాలికులేటర్

Savings

మీ పాలసీ ఎలా పనిచేసిందో కనిపెట్టండి

Savings

ఫండ్ అలొకేషన్ క్యాలికులేటర్

Savings

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail