Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ముఖ్య విశేషాంశాలు

ఆదాయం వెసులుబాటు

మొదటి పాలసీ నెల నుండి లేదా మీ ప్రాధాన్యతల ప్రకారం ఇమ్మీడియేట్, ఇంటర్మీడియట్ లేదా డిఫర్డ్ వంటి సౌకర్యవంతమైన ఆదాయ ఐచ్ఛికాలను పొందండి. 

cover-life

దీర్ఘ-కాలిక రక్షణ

ప్లాన్‌ తో మీరు ఎంచుకున్న ఆదాయ ఐచ్ఛికంపై ఆధారపడి, 30 లేదా 40 సంవత్సరాల పాటు విశ్వసనీయమైన ఆదాయ ప్రవాహం ఉండేలా చూసుకోండి.

wealth-creation

కుటుంబ రక్షణ

సమగ్ర జీవిత బీమా వర్తింపుతో మొత్తం పాలసీ వ్యవధి అంతటా మీ కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తు ఉండేలా చూసుకోండి.

secure-future

పొదుపు రివార్డులు

దీర్ఘకాలిక పొదుపు కోసం సకాలములో ప్రీమియం చెల్లింపులు చేసి మా లాయల్టీ ప్రయోజనాలతో రివార్డులు పొందండి

many-strategies

తప్పిన ప్రీమియం రక్షణ

మీరు ఒక ప్రీమియం తప్పినప్పటికీ సైతమూ లైఫ్ కవర్ కొనసాగుదల ప్రయోజనంతో, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా జీవిత వర్తింపుతో కొనసాగండి.

cover-life

మీ తేదీని ఎంచుకోండి

మా 'సేవ్ ది డేట్' ఫీచర్‌తో మీ ప్రత్యేకమైన ఒక రోజు కోసం మీ ఆదాయాన్ని షెడ్యూలు చేసుకోండి

cover-life

మహిళల కోసం అదనపు ప్రయోజనాలు

మహిళా స్వీకర్తల కోసం రూపొందించబడిన పెంపొందిత ఆదాయ ప్రయోజనాలను ఆనందించండి.

wealth-creation

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్ కొనడం ఎలా?

Step 1

Enter Details

Fill in basic information like name, mobile number, and the person you're buying the plan for.

choose-plan

Step 2

Choose Income Option

Pick from Immediate, Intermediate, or Deferred Income Options.

premium-amount

Step 3

Decide Premium

Select a premium amount and frequency. Start investing with just ₹4,176 per month.

select-stategy

Step 4

Review Quote

Check the provided quote to ensure it fits your needs.

make-payments

Step 5

Make Payment

Use any online payment method to complete your purchase, and your policy will be issued.

choose-plan

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద కనీస వయస్సు

Answer
  • 90 రోజులు

ప్రవేశము వద్ద గరిష్ట వయస్సు

Answer
  • తక్షణ ఆదాయం మరియు మధ్యంతర ఆదాయం ఐచ్ఛికం:

    పిపిటి 6 – 50 సంవత్సరాల కొరకు

    పిపిటి 8 మరియు 10 – 55 సంవత్సరాల కొరకు

  • డిఫర్డ్ ఆదాయ ఐచ్ఛికం:

    పిపిటి 6 – 50 సంవత్సరాల కొరకు

    పిపిటి 8 మరియు 10 – 60 సంవత్సరాల కొరకు

మెచ్యూరిటీలో కనీస వయస్సు

Answer
  • 30 సంవత్సరాలు

మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు

Answer
  • 90 సంవత్సరాలు

ప్రీమియం చెల్లింపు అవధి (పిపిటి, సంవత్సరాలలో)

Answer
  • ఆప్షన్లు: 6 / 8 / 10

పాలసీ అవధి (పిటి, సంవత్సరాలలో)

Answer
  • ఆప్షన్లు: 30 / 40

ప్రీమియం చెల్లింపు అంతరము మరియు కనీస ప్రీమియం (₹)

Answer
  • సంవత్సరం వారీ: 48,000

  • అర్ధ సంవత్సరం వారీ: 24,571

  • మూడు నెలల వారీ: 12,432

  • నెలవారీగా: 4,176

భరోసా సొమ్ము (₹)

Answer
  • కనీసం: 4,80,000

  • గరిష్టం: బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారము ఎటువంటి పరిమితీ లేదు

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

నేను మీకు ఎలా సహాయపడగలను?

View All FAQ

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్ అంటే ఏమిటి?

Answer

ఇది 6, 8 లేదా 10 సంవత్సరాల తక్కువ కాలపు చెల్లింపు నిబద్ధతను అందించే మరియు మీ ప్రియమైనవారు రక్షింపబడేలా చూసుకోవడానికై జీవిత వర్తింపుతో పాటుగా 30 లేదా 40 సంవత్సరాలు క్రమం తప్పని ఆదాయాన్ని అందించే ఒక అనుసంధానితం-కాని, పాల్గొనడం-లేని, వ్యక్తిగతమైన పొదుపు, పరిమిత ప్రీమియం చెల్లింపు గల జీవిత బీమా ప్లాన్. కేవలం ఇది మాత్రమే కాదు, మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నప్పటికీ సైతమూ, మీ జీవిత వర్తింపు ప్రయోజనం కొనసాగేలా ఈ పాలసీ చూసుకుంటుంది, అలా ఒక సంవత్సరం పాటు జీవిత వర్తింపుతో మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది.

ఇండియాఫస్ట్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్ యొక్క ప్రయోజన ఐచ్ఛికాలు ఏవేవి?

Answer

ఈ ప్లాన్ లో మూడు ఆదాయ ఐచ్ఛికాలు ఉన్నాయి. ఆదాయ ఐచ్ఛికం, పాలసీ అవధి, ప్రీమియం చెల్లింపు అవధి మరియు ప్రారంభంలో ఎంపిక చేసుకున్న వార్షికం చేయబడిన ప్రీమియం మొత్తము ఆ తదనంతరం మార్చలేనిది.

 

ఆదాయ ఐచ్ఛికం/ ఆదాయ చెల్లింపు అంతరముసంవత్సరం వారీఅర్ధ సంవత్సరం వారీమూడు నెలలకు ఒక మారునెలవారీగా
తక్షణ ఆదాయ ఐచ్ఛికం12వ నెల ముగింపులో6వ నెల ముగింపులో3వ నెల ముగింపులో1వ నెల ముగింపులో
మధ్యంతర ఆదాయ ఐచ్ఛికం60వ నెల ముగింపులో54వ నెల ముగింపులో51వ నెల ముగింపులో49వ నెల ముగింపులో
డిఫర్డ్ ఆదాయ ఐచ్ఛికం120వ నెల ముగింపులో114వ నెల ముగింపులో111వ నెల ముగింపులో109వ నెల ముగింపులో


గమనిక: అన్ని ప్రయోజనాలు ఎరియర్స్ గా చెల్లించబడతాయి, అనగా, నిర్దిష్టంగా పేర్కొన్న అంతరము ముగింపులో.

 

మీరు మీ ఆదాయాన్ని అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ అంతరములో పొందడానికి కూడా ఎంచుకోవచ్చు. ఆ ఉదంతములో, మొదటి ఆదాయపు కంతు చెల్లింపు క్రింది విధంగా చేయబడుతుంది:

 

ఆదాయ ఐచ్ఛికం/ ఆదాయ చెల్లింపు అంతరముసంవత్సరం వారీ

 

అర్ధ సంవత్సరం వారీ

మూడు నెలలకు ఒక మారునెలవారీగా
తక్షణ ఆదాయ ఐచ్ఛికం12వ నెల ముగింపులో6వ నెల ముగింపులో3వ నెల ముగింపులో1వ నెల ముగింపులో
మధ్యంతర ఆదాయ ఐచ్ఛికం60వ నెల ముగింపులో54వ నెల ముగింపులో51వ నెల ముగింపులో49వ నెల ముగింపులో
డిఫర్డ్ ఆదాయ ఐచ్ఛికం120వ నెల ముగింపులో114వ నెల ముగింపులో111వ నెల ముగింపులో109వ నెల ముగింపులో

ఇండియాఫస్ట్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్ లో అదనపు ఫీచర్లు ఏవైనా ఉన్నాయా?

Answer
  • సేవ్ ది డేట్ ఫీచర్

మా బీమా పొదుపు ప్లాన్‌ - సేవ్ ది డేట్ ఫీచర్ తో వెసులుబాటును అనుభవించండి! ఇతర ఆదాయపు పన్ను ఆదా పథకాల మాదిరిగా కాకుండా, మీరు వార్షిక ఆదాయ చెల్లింపులను ఎంచుకోవచ్చు మరియు జీవించియున్న ప్రయోజనాలను పొందడానికి గాను మొదటి ఆదాయ గడువు తేదీ తర్వాత 365 రోజుల లోపున ఒక తేదీని ఎంచుకోవచ్చు. దానిని ఏదైనా ప్రత్యేక తేదీతో సమన్వయం చేసుకోండి, అది పుట్టినరోజులు లేదా వార్షికోత్సవాలు కావచ్చు. సంవత్సరానికి వడ్డీ 3.0% వంతున అప్పటి వరకు నెలవారీగా చక్రవడ్డీతో కలిపి ఎంచుకోబడిన ఈ తేదీనాడు చెల్లింపులు జరుగుతాయి. గుర్తుంచుకోండి, చివరి కంతు మెచ్యూరిటీ తేదీ నాడు చెల్లించబడుతుంది. పాలసీ ప్రారంభ సమయంలో ఒకసారి ఎంచుకున్నారంటే, ఆ ఎంపిక పాలసీ వ్యవధి అంతటా స్థిరంగా ఉంటుంది.

 

  • అడ్వాన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ (రిన్యూవల్)

ఈ పొదుపు పాలసీతో పునరుద్ధరణ ప్రీమియంలపై రాయితీలను అన్‌లాక్ చేయండి. ఆర్థిక సంవత్సరం లోపున పదకొండు నెలల వరకూ ప్రీమియం గడువు తేదీకి కనీసం ఒక నెలకు ముందు ప్రీమియములను చెల్లించండి మరియు పొదుపు ఆనందాన్ని పొందండి. త్రైమాసికం ప్రారంభంలో 5-సంవత్సరాల జి-సెక్ బాండ్ రాబడి ఆధారంగా రాయితీ రేటు లెక్కించబడుతుంది. మార్పులకు ఐఆర్‌డిఏఐ ఆమోదం అవసరం అవుతుంది, మరియు ముందస్తు ప్రీమియం చెల్లింపు తేదీ నుండి పూర్తి నెలలలో గడువు తేదీ వరకూ రేటు లెక్కించబడుతుంది.

 

  • జీవిత వర్తింపు కొనసాగింపు ప్రయోజనం

జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనముతో పొదుపు ప్లానుతో మా జీవిత బీమాతో మీ ప్రియమైనవారి భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. చెల్లించని మొదటి ప్రీమియం తర్వాత సైతమూ, పూర్తి మరణ ప్రయోజనం ఒక సంవత్సరం పాటు నిలిచి ఉంటుంది. ఈ వ్యవధి తర్వాత ఉన్న ఐచ్ఛికాలలో, అన్ని ప్రీమియంలను వడ్డీతో పాటు చెల్లించడం ద్వారా పాలసీని పునరుద్ధరించుకోవడం, వడ్డీతో పాటు ఒక బకాయీ ప్రీమియం చెల్లించడం ద్వారా వ్యవధిని పొడిగించుకోవడం లేదా బాకీ ఉన్న ప్రీమియంలను చెల్లించకుండా తగ్గించబడిన పెయిడ్-అప్ ప్రయోజనాలతో కొనసాగించడం వంటివి ఉన్నాయి.

తప్పుడు లేదా సరికాని సమాచారమును సమర్పించినట్లయితే ఏమి జరుగుతుంది?

Answer

ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పు ప్రకటన అనేదానితో వ్యవహరించబడుతుంది. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 45 ఇలా చెబుతుంది

 

  1. పాలసీ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత, అంటే, పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే దాని నుండి ఎటువంటి జీవిత బీమా పాలసీ ప్రశ్నించబడదు.
  2. బీమా యొక్క ఒక పాలసీని మోసము ఆధారంగా పాలసీ యొక్క బీమా తేదీ నుండి లేదా ముప్పు వర్తింపు ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ యొక్క పునరుద్ధరణ తేదీ నుండి లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే అప్పటి నుండి మూడు సంవత్సరాల వ్యవధి లోపున ఏ సమయములోనైనా ప్రశ్నించవచ్చు. అప్పుడు, దేని ఆధారంగా అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
  3. సబ్‌సెక్షన్ (2)లో ఏది ఎలా ఉన్నప్పటికిన్నీ, బీమా చేసిన వ్యక్తి తనకు అత్యుత్తమంగా తెలిసిన మేరకు మరియు నమ్మకం మేరకు ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా చెప్పడం లేదా అణచివేయడం నిజమని నిరూపించగలిగితే, లేదా వాస్తవాన్ని అణిచివేయడానికి ఏ విధమైన ఉద్దేశపూర్వక ఉద్దేశ్యం లేదని లేదా ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా పేర్కొనడం లేదా అణచివేయడం బీమాదారుకు తెలిసి జరగలేదని నిరూపితమైనప్పుడు ఏ బీమాదారు కూడా మోసం ఆధారాలపై జీవిత బీమా పాలసీని తిరస్కరించరు:  ఒకవేళ మోసం జరిగియున్న పక్షములో, పాలసీదారు జీవించిలేని సందర్భములో, వాటిని తిరస్కరించే బాధ్యత లబ్ధిదారులపై ఉంటుంది.
  4. ఒక జీవిత బీమా పాలసీని పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ జరిగిన తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల లోపున ఏది తర్వాత వస్తే దాని ప్రకారం, బీమా చేయబడిన వ్యక్తి యొక్క జీవిత కాలపు అంచనాకు సంబంధించిన ఏదైనా వాస్తవ ప్రకటన లేదా వాస్తవ సత్యం పాలసీ జారీ చేయబడిన లేదా పునరుద్ధరించబడిన లేదా రైడర్ జారీ చేయబడిన ప్రతిపాదన పత్రము లేదా ఇతర పత్రములో తప్పుగా చేయబడిందని లేదా త్రొక్కిపెట్టబడిందనే ఆధారాలతో ఎప్పుడైనా ప్రశ్నార్ధకమవుతుంది: అప్పుడు, దేని ఆధారంగా జీవిత బీమా పాలసీ తిరస్కరించాలనే అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది: ఇంకా తదుపరి, మోసం జరిగిందనే ఆధారంగా కాకుండా, తప్పుగా పేర్కొనడం లేదా వాస్తవ సత్యాన్ని త్రొక్కిపెట్టి ఉంచడం వల్ల పాలసీని తిరస్కరించిన పక్షంలో, అలా తిరస్కరించబడిన తేదీ వరకు పాలసీపై వసూలు చేసిన ప్రీమియములు అటువంటి తిరస్కరణ తేదీ నుండి తొంభై రోజుల వ్యవధి లోపున బీమా చేయబడిన వ్యక్తికి లేదా బీమా చేయబడిన వ్యక్తి యొక్క చట్టబద్ధ ప్రతినిధులు లేదా నామినీలు లేదా అసైనీలకు చెల్లించబడతాయి.
  5. ఈ విభాగంలోని ఏదీ కూడా, వయస్సు ఋజువు కోసం ఏ సమయంలో అయినా కాల్ చేయడానికి బీమాదారు అర్హత కలిగి ఉన్నట్లయితే, పాలసీని ప్రశ్నించకుండా వారిని నిరోధించదు మరియు పాలసీ నిబంధనల కారణంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క వయస్సును ప్రతిపాదనలో తప్పుగా పేర్కొనబడినట్లు తదనంతర ఋజువుపై సర్దుబాటు చేయబడినంత మాత్రాన ఏ పాలసీ ప్రశ్నార్థకమైనట్లుగా భావించబడదు.

ఈ పాలసీలో ఏవైనా రైడర్లు అందుబాటులో ఉన్నాయా?

Answer

ఔను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఓపి) రైడర్ (UIN:143B017V01) ఎంచుకునే ఒక ఆప్షన్  కలిగి ఉన్నారు. ఈ రైడర్ ని మీరు ఎంచుకున్నప్పుడు, ఒకవేళ పాలసీదారు / బీమా పొందిన వ్యక్తి గనక రైడర్ ఐచ్ఛికం క్రింద పేర్కొనబడినట్లుగా మరణం, ప్రమాద కారణంగా సంపూర్ణ శాశ్వత అంగ వైకల్యం లేదా క్లిష్ట అస్వస్థతను అనుభవించిన పక్షములో, మీ బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములు మాఫీ చేయబడటం ద్వారా మీకు మద్దతును ఇస్తుంది. పాలసీదారు/ జీవిత భరోసా పొందిన వ్యక్తి కొరకు ఆప్షన్లు ఈ దిగువ కనబరచిన విధంగా ఉన్నాయి.

 

ఆప్షన్ప్రయోజనం
మరణంపై ప్రీమియం వైవర్ఈ ఆప్షన్, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, పాలసీదారు యొక్క మరణంపై బేస్ పాలసీ కింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది (బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులు అయినప్పుడు మాత్రమే).
ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థత (రోగ నిర్ధారణ) పై ప్రీమియం యొక్క వైవర్ఈ ఆప్షన్, ఈ క్రింది ఘటనలలో ఏదైనా ఒకటి లేదా ఏకకాలంలో జరగడంపై బేస్ పాలసీ క్రింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది - రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్న రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క నిర్ధారిత రోగనిర్ధారణ.
మరణం లేదా ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థతపై ప్రీమియం యొక్క వైవర్

ఈ ఆప్షన్ ఈ క్రింది ఘటనలలో దేనిలోనైనా ముందుగా జరిగే మరియు చెల్లించవలసిన అన్ని భవిష్యత్ ప్రీమియమ్‌లను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది - జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క మరణం లేదా జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం ధృవీకరించబడిన నిర్ధారణపై, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భరోసా ఇవ్వబడుతుంది.  

ఈ ఆప్షన్ కొరకు ఎంచుకోవడానికి, బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులై ఉండాలి 

ఒకవేళ మీరు ఈ రైడర్‌ను ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం, ఎంచుకున్న రైడర్ ఎంపికపై ఆధారపడి బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 30% లేదా 100% కి మించకూడదు. అదనంగా, రైడర్ యొక్క అవధి గనక బేస్ పాలసీ క్రింద బకాయీ పడియున్న ప్రీమియం చెల్లింపు కాల వ్యవధిని మించి ఉంటే రైడర్ అందించబడదు.

నేను ఈ పాలసీలో ఒక లోన్ పొందవచ్చునా?

Answer

స్వాధీనం చేసుకున్న సరెండర్ విలువ మొత్తం ఏదైనా ఉంటే, దానిలో 80% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు.  పొందగలిగినట్టి కనీస లోన్ మొత్తము రు.25,000 గా ఉంటుంది.

 

  • అమలులో కొనసాగుతున్న మరియు పూర్తిగా చెల్లించబడిన పాలసీల కోసం, ఒకవేళ బకాయి ఉన్న లోన్ వడ్డీతో పాటు సరెండర్ విలువలో 90% కి మించి ఉంటే, లోన్‌ని పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవలసిందిగా పాలసీదారుకు కంపెనీ నోటీసును పంపిస్తుంది. నోటీసు అందిన తదనంతరం లోన్‌ని తిరిగి చెల్లించనట్లయితే, ఏవైనా ప్రయోజనాలను చెల్లించడానికి ముందు వాటిని మేము వడ్డీతో సహా బకాయి ఉన్న లోన్ కు సర్దుబాటు చేస్తాము. బకాయి ఉన్న లోన్ ని వడ్డీతో సహా వసూలు చేసుకున్న మీదట, మిగిలిన ప్రయోజనం ఏదైనా ఉంటే, అది చెల్లించబడుతుంది.
  • అమలులో కొనసాగుతున్న మరియు పూర్తిగా చెల్లించబడిన పాలసీలు కాకుండా, పెయిడ్-అప్ ఉదంతాల కోసం బకాయి ఉన్న లోన్ వడ్డీతో పాటుగా సరెండర్ విలువను మించిపోయినప్పుడల్లా, లోన్‌ని పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవలసిందిగా పాలసీదారుకు కంపెనీ నోటీసును పంపిస్తుంది. పేర్కొనబడిన నిర్ణీత వ్యవధి లోపున లోన్‌ని తిరిగి చెల్లించకపోతే, పాలసీ తప్పనిసరిగా సరెండర్ చేయబడుతుంది మరియు సరెండర్ రాబడి లేదా పెయిడ్-అప్ విలువ నుండి బకాయీ ఉన్న లోన్ వడ్డీతో పాటుగా తిరిగి వసూలు చేసుకోబడుతుంది.
  • లోన్ పై వడ్డీ రేటును లెక్కించడానికి ఉపయోగించే ప్రాతిపదిక గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 10-సంవత్సరాల G-సెక్ రేటు ప్లస్ 250 బేసిస్ పాయింట్ల సంపూర్ణ మార్జిన్‌, అది సమీప 50 బేసిస్ పాయింట్ల వరకు రౌండ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో అలా గ్రహించబడిన వడ్డీ రేటు వర్తిస్తుంది.
  • ప్రస్తుతానికి, ఆర్థిక సంవత్సరం 2022-23 కొరకు సంవత్సరానికి 10.00% రేటు (సామాన్యవడ్డీ)తో ఉంటుంది, అది ఐఆర్‌డిఎఐ ఆమోదానికి లోబడి మాచే ఎప్పటికప్పుడు సమయానుగుణంగా మార్పు చేయబడవచ్చు. లోన్ వడ్డీ రేటు లెక్కించు పద్ధతిలో ఏదైనా మార్పు ఐఆర్‌డిఎఐ నుండి ముందస్తు ఆమోదమునకు లోబడి ఉంటుంది.

మీరు పాలసీని సరెండర్ చేయవచ్చునా?

Answer

మీ పాలసీ యొక్క పూర్తి ప్రయోజనాలను ఆనందించడానికి గాను మీ పాలసీని కొనసాగించడం మంచిదని సలహా ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మీరు మీ పాలసీని సరెండర్ చేయాల్సి వస్తుందని మేము అర్థం చేసుకుంటాము.

ఒకవేళ మీరు కనీసం మొదటి రెండు పూర్తి పాలసీ సంవత్సరాల పాటు మీ ప్రీమియంలను చెల్లించి ఉన్నట్లయితే, మీ పాలసీ సరెండర్ విలువను పొందుతుంది.

మీ పాలసీ సరెండర్ విలువను పొందిన తర్వాత ఏ సమయంలోనైనా మాకు వ్రాతపూర్వక అభ్యర్థనను సమర్పించడం ద్వారా మీరు పాలసీ వ్యవధి సందర్భంగా ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు. దయచేసి గుర్తుంచుకోండి, ఒకసారి మీరు మీ పాలసీని సరెండర్ చేశారంటే, ఇక ఆ తర్వాత మీరు దానిని పునరుద్ధరించుకోలేరు.

సరెండర్ మీద చెల్లించబడే మొత్తము హామీ ఇవ్వబడిన సరెండర్ విలువ (GSV) మరియు ప్రత్యేక సరెండర్ విలువ (SSV) కంటే అధికంగా ఉంటుంది.

గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ (GSV) అనేది జీఎస్‌వీ కారకాంశము* చెల్లించబడిన మొత్తం ప్రీమియములు మైనస్ సరెండర్ తేదీ వరకు పాలసీ క్రింద అదివరకే చెల్లించబడిన సర్వైవల్ ప్రయోజనాలు మరియు లాయల్టీ క్యాష్‌బ్యాక్ మరియు గ్యారెంటీడ్ క్యాష్‌బ్యాక్, ఏదైనా ఉంటే వాటి మొత్తం కూడిక.

జీఎస్‌వీ కారకాంశములు పాలసీ సరెండర్ చేయబడిన సంవత్సరం మరియు పాలసీ అవధిపై ఆధారపడి ఉంటాయి.

ప్రత్యేక సరెండర్ విలువ ఈ దిగువ విధంగా లెక్కించబడుతుంది:

ఎస్ఎస్‌వి కారణాంశము1 * గరిష్టంగా [(మరణంపై పెయిడ్-అప్ భరోసా సొమ్ము), (మెచ్యూరిటీపై పెయిడ్-అప్ భరోసా సొమ్ము, మైనస్ ఆ తేదీ నాటికి చెల్లించబడిన సర్వైవల్ ప్రయోజనాలు)]

ప్లస్

ఎస్ఎస్‌వి కారణాంశము2a * (పెయిడ్-అప్ ఆదాయం)

ప్లస్

ఎస్ఎస్‌వి కారణాంశము 2b * (భవిష్యత్ లాయల్టీ ఆదాయము, డిఫర్డ్ ఆదాయ ఐచ్ఛికం క్రింద పూర్తిగా పెయిడ్-అప్ పాలసీలకు వర్తిస్తుంది)

ప్లస్

ఎస్ఎస్‌వి కారణాంశము3 * [(మెచ్యూరిటీపై పెయిడ్-అప్ భరోసా సొమ్ము)]

ప్లస్

ఎస్ఎస్‌వి కారణాంశము4 * [(పెయిడ్-అప్ గ్యారంటీడ్ క్యాష్‌బ్యాక్)] 

గ్యారంటీడ్ సరెండర్ విలువ కారకాంశాలపై మరిన్ని వివరాల కోసం, దయచేసి పాలసీ డాక్యుమెంటును చదవండి, లేదా మా వెబ్‌సైట్ www.indiafirstlife.com సందర్శించండి లేదా మీ ఆర్థిక సలహాదారును సంప్రదించండి

ఎస్ఎస్‌వి కారణాంశములలో ఏదైనా మార్పు నిబంధనాయుత ఆమోదమునకు లోబడి ఉంటుంది.

ఈ పాలసీలో ఏయే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి?

Answer

చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.

పాలసీని పునరుద్ధరించడానికి గల ఆప్షన్లు ఏవేవి?

Answer

చెల్లించబడని మొదటి రెగ్యులర్ ప్రీమియము యొక్క గడువు తేదీ నుండి 5 సంవత్సరాల లోపున, ఐతే మెచ్యూరిటీ తేదీకి ముందే పునరుద్ధరణ చేసుకుంటున్నంత కాలమూ మీరు దానిని చేసుకోవచ్చు:

  1. పాలసీ యొక్క పునరుద్ధరణ కొరకు లిఖితపూర్వక అభ్యర్థనను సమర్పించడం ద్వారా;
  2. వడ్డీతో పాటు చెల్లించబడని ప్రీమియములన్నింటినీ చెల్లించడం; మరియు
  3. మంచి ఆరోగ్యం యొక్క డిక్లరేషన్ ఇవ్వడం మరియు అవసరమైతే మీ స్వంత ఖర్చుతో వైద్య పరీక్ష చేయించుకోవడం. 

మా బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ పాలసీకి అనుగుణంగా మాత్రమే పాలసీ దాని ప్రయోజనాలన్నిటితో పాటుగా పునరుద్ధరించబడుతుంది. పునరుద్ధరణ కొరకు ఆర్థిక సంవత్సరం 23 లో విధించబడే ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 9.50% గా ఉంది, అది కాలానుగుణంగా సవరించబడవచ్చు. పునరుద్ధరణ వడ్డీ రేటులో ఏదైనా మార్పు ఐఆర్‌డిఎఐ నుండి ముందస్తు ఆమోదమునకు లోబడి ఉంటుంది.

ల్యాప్స్ అయిన పాలసీ యొక్క పునరుద్ధరణ విషయంలో, పాలసీ ల్యాప్స్ స్థితిలో ఉన్నప్పుడు వర్తించే విధంగా మరియు బకాయీ ఉన్న అన్ని సర్వైవల్ ప్రయోజనాల చెల్లింపులు ఎలాంటి వడ్డీ లేకుండా ఏకమొత్తంగా చెల్లించబడతాయి.

పెయిడ్-అప్ పాలసీ యొక్క పునరుద్ధరణ విషయంలో, పాలసీ పెయిడ్-అప్ స్థితిలో ఉన్నప్పుడు అమలులో ఉన్న పాలసీ కొరకు వర్తించే విధంగా మరియు బకాయీ ఉన్న అన్ని సర్వైవల్ ప్రయోజనాలలో ఇప్పటికే చెల్లించిన ఏదైనా పెయిడ్-అప్ సర్వైవల్ బెనిఫిట్ చెల్లింపులను మినహాయించుకొని మిగతా సొమ్ము ఎలాంటి వడ్డీ లేకుండా ఏకమొత్తంగా చెల్లించబడుతుంది.

పునరుద్ధరణపై, పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం అన్ని ప్రయోజనాలు అమలులో ఉన్న పాలసీ కోసం పునరుద్ధరించబడతాయి. ఒకవేళ ల్యాప్స్ అయిన పాలసీ గనక పునరుద్ధరణ వ్యవధి ముగిసే వరకూ పునరుద్ధరించబడకపోతే, పాలసీ రద్దు చేయబడుతుంది మరియు మీరు ఏ ప్రయోజనాలనూ అందుకోవడానికి అర్హులు కాబోరు.

మీ పాలసీలో అందుబాటులో ఉండే ఫ్రీ లుక్ వ్యవధి ఎంత?

Answer

దూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపానికి పాలసీ డాక్యుమెంట్ అందుకున్నప్పటి నుండి ఉన్న 30 రోజుల లోపు వ్యవధి తప్ప, మొదటి 15 రోజులలోపున ఏవైనా నిబంధనలు మరియు షరతులతో మీరు ఏకీభవించనట్లయితే, మీరు మీ పాలసీని తిరిగి ఇవ్వవచ్చు. రద్దు చేయడానికి గల కారణాలను పేర్కొంటూ మీరు ఒరిజినల్ పాలసీ పత్రమును మరియు ఒక లిఖితపూర్వక అభ్యర్థనను మాకు పంపించాల్సి ఉంటుంది.

మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందారా?

ఔను. మేము దీనికి సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము -

చెల్లించబడిన ప్రీమియం

తగ్గించుకొని: i. ప్రో-రేటా రిస్క్ ప్రీమియం

ii ని తగ్గించుకోండి. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ

iii ని తగ్గించుకొని. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే

ప్రొ-రేటా రిస్క్ ప్రీమియం అనేది వర్తింపు యొక్క వ్యవధికి అనుపాతపు రిస్క్ ప్రీమియం అయిన చోట 

సుదూర మార్కెటింగ్‌ యందు విజ్ఞాపన యొక్క ప్రతీ చర్య (లీడ్ జనరేషన్‌తో సహా) మరియు ఈ క్రింది రూపాల ద్వారా బీమా ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రతి కార్యాచరణ చేరి ఉంటుంది: (i) వాయిస్ రూపం, ఇందులో టెలిఫోన్ చేయడం ఉంటుంది; (ii) సంక్షిప్త సందేశ సేవ (SMS); (iii) ఎలక్ట్రానిక్ రూపం, ఇందులో ఇ-మెయిల్, ఇంటర్నెట్ మరియు ఇంటరాక్టివ్ టెలివిజన్ (DTH); (iv) నేరుగా తపాలా మెయిల్ మరియు వార్తాపత్రిక మరియు మ్యాగజైన్ చేర్పులను కలిగి ఉండే భౌతిక రూపం; మరియు, (v) స్వయంగా కాకుండా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా విజ్ఞాపన

ఇండియాఫస్ట్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్ లో అధిక ప్రీమియం పాలసీల కొరకు ఏవైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా?

Answer

ఒకవేళ మీచే వార్షికం చేయబడిన అధిక ప్రీమియం ఎంచుకోబడి ఉంటే మేము మెరుగైన బేస్ ఆదాయాన్ని చెల్లిస్తాము. వార్షికం చేయబడిన ప్రీమియం బ్యాండ్లు ఇవి - 48,000 - 99,999 | 1,00,000 -2,49,999 | 2,50,000 – 4,99,999 | 5,00,000 మరియు ఆపై

మీరు మీ ప్రీమియములను చెల్లించడం తప్పితే ఏమి జరుగుతుంది?

Answer

మీ ఆర్థిక సుస్థిరత్వాన్ని కాపాడుకోవడానికి గాను తప్పిన ప్రీమియం చెల్లింపులను ముందుకు తీసుకువెళ్ళడం ఆవశ్యకం. ఒకవేళ మీరు మీ ప్రీమియములను చెల్లించడం తప్పిన పక్షములో ఏమి జరుగుతుందో ఇక్కడ:  మీకు పొదుపు బీమా ప్లాన్ ఉన్నా లేదా మరొక జీవిత బీమా ప్లాన్ ఉన్నా కూడా, జరగబోయే పరిణామాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం.

ఒకవేళ మీరు మీ ప్రీమియములను చెల్లించడం తప్పిన పక్షములో ఏమి జరుగుతుందో ఇక్కడ:

  • గ్యారంటీడ్ సరెండర్ విలువ స్వాధీనత

    • మొదటి రెండు సంవత్సరాల ప్రీమియములను పూర్తిగా చెల్లించిన తర్వాత ఈ పాలసీ హామీ ఇవ్వబడిన సరెండర్ విలువను పొందుతుంది.

  • పాలసీ ల్యాప్స్ కావడం

    • ఒకవేళ కారుణ్య వ్యవధి లోపున ప్రీమియములను చెల్లించకపోతే మరియు పాలసీ గనక హామీ ఇవ్వబడిన సరెండర్ విలువను పొందని పక్షములో, అది లాప్స్ అవుతుంది.

    • రిస్క్ కవర్ రద్దయిపోతుంది, మరియు తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు. అయినప్పటికీ, పునరుద్ధరణ వ్యవధి లోపున మీరు ల్యాప్స్ అయిన మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.

  • ల్యాప్స్ అయిన పాలసీని జప్తు చేయడం

    • పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పాలసీ ల్యాప్స్ లోనే ఉండి మరియు పునరుద్ధరించబడకపోతే, ఎటువంటి ప్రయోజనాన్ని చెల్లించకుండానే అది ముందస్తుగా జప్తు చేయబడుతుంది.

  • జీవిత వర్తింపు కొనసాగింపు ప్రయోజనం

    • ఒకవేళ పాలసీ సరెండర్ విలువను పొందిన తర్వాత మీరు ఒక ప్రీమియం చెల్లించడం తప్పినా సరే, మీరు మా జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనానికి అర్హులుగా ఉంటారు. వివరాల కొరకు బ్రోచర్ లోని విభాగం 5 ని చదువుకోండి.

  • పెయిడ్-అప్ / తగ్గించబడిన పెయిడ్-అప్ ప్రయోజనాలు

    • కనీసం రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములను చెల్లించి ఉన్నట్లయితే, కారుణ్య వ్యవధి లోపున ప్రీమియం చెల్లించబడని పక్షంలో అది పాలసీ పెయిడ్-అప్‌ విలువను పొందుతుంది.

    • తగ్గించబడిన ఒక పెయిడ్-అప్ పాలసీని షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున పునరుద్ధరించవచ్చు.

    • తగ్గించబడిన పెయిడ్-అప్ రూపంలో ఉన్న పాలసీని పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పునరుద్ధరించకపోతే, అది పాలసీ యొక్క మెచ్యూరిటీ లేదా మరణం లేదా సరెండర్ వరకూ తగ్గించబడిన పెయిడ్- అప్ రూపంలోనే కొనసాగుతుంది.

    • మరణంపై లేదా మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము పెయిడ్-అప్ ప్రయోజనాలు ఆదాయ ప్రయోజనాలతో సహా ఈ పాలసీ క్రింద చెల్లించబడిన మొత్తం ప్రీమియంల కంటే తక్కువ ఉండకూడదు.

  • తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద ప్రయోజనాలు

    • మరణ ప్రయోజనం: ప్రయోజనం ఈ క్రింది వాటిలో ఏది అధికంగా ఉంటుందో అది:

      • మరణంపై పెయిడ్-అప్ భరోసా సొమ్ము

      • మెచ్యూరిటీపై పెయిడ్-అప్ భరోసా సొమ్ము మైనస్ ఈనాటికి చెల్లించబడిన సర్వైవల్ ప్రయోజనాలు, లేదా

      • మరణించిన తేదీ నాటికి వర్తించే సరెండర్ విలువ

    • సర్వైవల్ బెనిఫిట్ (జీవించియున్న ప్రయోజనం): మొదట్లో ఎంచుకున్న ఆదాయ ఐచ్ఛికం మరియు చెల్లింపు అంతరం ఆధారంగా పెయిడ్-అప్ ఆదాయం మరియు పెయిడ్-అప్ గ్యారంటీడ్ క్యాష్‌బ్యాక్, ఒకవేళ వర్తిస్తే, చెల్లించబడుతుంది.

    • మెచ్యూరిటీ ప్రయోజనం: మెచ్యూరిటీ ప్రయోజనం అనేది మెచ్యూరిటీపై పెయిడ్-అప్ భరోసా సొమ్ముగా ఉంటుంది.

      ఒకవేళ ప్రీమియముల చెల్లింపు తప్పినప్పటికీ, పాలసీ ప్రయోజనాలు మరియు విలువను నిర్వహించుకోవడానికి ఐచ్ఛికాలు అందుబాటులో ఉన్నాయని ఈ నిబంధనలు నిర్ధారిస్తాయి.

ఈ పాలసీ క్రింద అందుబాటులో ఉండే ప్రీమియం చెల్లింపు రూపాలు ఏవేవి?

Answer

ప్రతిపాదన ఫారములో మీచే ఎంచుకోబడినట్లుగా, మీరు నెలవారీ/ త్రైమాసికం/ అర్ధ వార్షిక/ వార్షిక చెల్లింపు రూపం ద్వారా రెగ్యులర్ ప్రీమియములను మాకు చెల్లించవచ్చు. కనీస ప్రీమియం ప్రాతిపదికలకు లోబడి ప్రీమియం చెల్లింపు అంతరమును ఏదైనా పాలసీ వార్షికోత్సవంనాడు మార్చుకోవచ్చు. వార్షిక ప్రీమియంలపై ఈ క్రింది ప్రీమియం అంతరము కారకాంశాలు వర్తిస్తాయి:

 

ప్రీమియం అంతరమువార్షిక ప్రీమియముపై వర్తింపు చేయబడే కారణాంకము
సంవత్సరం వారీ1.00
అర్ధ సంవత్సరం వారీ0.5119
మూడు నెలలకు ఒక మారు0.2590
నెలవారీగా0.0870

 

ఏవిధంగానైనా ల్యాప్స్ కాకుండా నివారించడానికి గాను ప్రీమియములను గడువు తేదీలలో లేదా అంతకు ముందే చెల్లించాలి. మీరు గడువు తేదీలలో మీ బకాయి ప్రీమియం చెల్లింపును తప్పిన పక్షములో, మీకు నెలవారీ రూపంలో 15 రోజులు మరియు ఇతర ప్రీమియం చెల్లింపు రూపాల కోసం 30 రోజుల కారుణ్య వ్యవధి అందించబడుతుంది.

అందుబాటులో ఉన్న ఆదాయ చెల్లింపు అంతరములు ఏవేవి?

Answer

ఆదాయాన్ని సంవత్సరం వారీగా, అర్ధ- సంవత్సరం వారీగా, త్రైమాసికంగా లేదా నెలవారీ అంతరాలలో తీసుకోవచ్చు. దిగువ పట్టిక ప్రకారం అందులోని కారకాంశాలతో వార్షిక ఆదాయాన్ని గుణించడం ద్వారా ఆదాయ కంతు మొత్తము నిర్ణయించబడుతుంది

 

ఆదాయం చెల్లింపు అంతరముకారకాంశము
సంవత్సరం వారీ1.00
అర్ధ సంవత్సరం వారీ0.49
మూడు నెలలకు ఒక మారు0.24
నెలవారీగా0.08

 

ఎంచుకున్న ఆదాయ చెల్లింపు అంతరము ప్రకారం ఆదాయ ప్రయోజనాలు ఎరియర్స్ లో చెల్లించబడతాయి. 

ఏ పాలసీ వార్షికోత్సవం నాడైనా సరే, కనీసం ఒక నెల ముందుగానే ముందస్తు నోటీసును ఇవ్వడం ద్వారా, పాలసీదారు తన ప్రాధాన్యత ప్రకారం ఆదాయ అంతరమును మార్చుకోవచ్చు. ఈ ఐచ్ఛికాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వినియోగించుకోవచ్చు.

తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?

Answer

మీరు గడువు తేదీలలో మీ బకాయి ప్రీమియం చెల్లింపును తప్పిన పక్షములో, మీకు నెలవారీ రూపం క్రింద 15 రోజులు అయితే ఇతర ప్రీమియం చెల్లింపు రూపాల కోసం 30 రోజులకు తక్కువ కాకుండా కారుణ్య వ్యవధి అందించబడుతుంది. కారుణ్య వ్యవధి సందర్భంగా ఎంచుకున్న ప్రయోజన ఐచ్ఛికం ప్రకారం జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణం లేదా ఏదైనా వర్తింపు ఘటన సంభవించిన పక్షములో, మరణించిన తేదీ లేదా వర్తింపు ఘటన జరిగిన తేదీ వరకు చెల్లించని బకాయి ప్రీమియంలను తగ్గించుకున్న తర్వాత మిగిలిన సొమ్మును మేము చెల్లిస్తాము. ఈ కాలవ్యవధిలో పాలసీ అమలులో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది.

ఇండియాఫస్ట్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్ లో ఆదాయపు ఐచ్ఛికాలు ఎలా పని చేస్తాయి?

Answer

అన్ని ఆదాయ ఐచ్ఛికాలలోనూ, మీరు నిర్దిష్ట కాలవ్యవధికి గాను  ప్రీమియములు చెల్లిస్తారు మరియు ఎంచుకున్న పాలసీ వ్యవధి ముగిసే వరకూ క్రమం తప్పని ఆదాయం అందుకుంటూ ఉంటారు. ఆదాయం ప్రారంభమయ్యే సమయం మరియు ఆదాయం పెరుగుదల అనేది ఎంచుకోబడిన ఆదాయ ఐచ్ఛికంపై ఆధారపడి ఉంటుంది.  

చెల్లించదగిన ఆదాయపు మొత్తము రెండు కాంపొనెంట్లను కలిగి ఉంది:

  • బేస్ ఆదాయము: పాలసీ అవధి ప్రారంభంలో మీరు అర్హత పొంది ఉండే వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క శాతము. ప్రవేశ వయస్సు, లింగం, ప్రీమియం మొత్తము, ప్రీమియం చెల్లింపు వ్యవధి, పాలసీ అవధి మరియు ఎంచుకోబడిన ఆదాయ ఐచ్ఛికం ఆధారంగా ప్రాథమిక ఆదాయం మారుతూ ఉంటుంది.
  • లాయల్టీ ఆదాయము: ఎంచుకోబడిన ఆదాయ ఐచ్ఛికం మరియు ప్రీమియం చెల్లింపు అవధి ప్రకారం, ప్రీమియముల చెల్లింపుపై ప్రతి సంవత్సరం అందించబడే బేస్ ఆదాయముపై పెరుగుదలలు.
     

a. తక్షణ ఆదాయ ఐచ్ఛికం
 

I. సర్వైవల్ బెనిఫిట్ (జీవించియున్న ప్రయోజనం)
 

  • బేస్ ఆదాయం అనేది మొదటి పాలసీ సంవత్సరం ముగింపులో మొదలవుతుంది^ మరియు పాలసీ అవధి ముగింపు వరకూ కొనసాగుతుంది.
  • ఆ సంబంధిత సంవత్సరానికి చెల్లించాల్సి ఉన్న అన్ని ప్రీమియములు చెల్లించబడి ఉంటే, ప్రతి సంవత్సరం చెల్లించదగిన బేస్ ఆదాయము ఈ దిగువన ఇవ్వబడిన పట్టిక ప్రకారం లాయల్టీ ఆదాయముచే పెంపుదల చేయబడుతుంది. 
  • పాలసీదారు తన బకాయి ప్రీమియం చెల్లించడం ఆపివేసిన తర్వాత లేదా ప్రీమియం చెల్లింపు అవధి ముగిసిన తర్వాత (ఏది ముందు వస్తే దాని ప్రకారం) చెల్లించాల్సియున్న ఆదాయం ఆగిపోతుంది.
     

లాయల్టీ ఆదాయము (బేస్ ఆదాయములో పెరుగుదల %)
 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ సంవత్సరం
12345678910
60%6%12% 18% 24%30%     
80%8%16% 24% 32%40%48%56%   
100%10%20%30% 40%50%60%70% 80%90%

 

II. మెచ్యూరిటీ ప్రయోజనం
 

బకాయి ఉన్న ప్రీమియములు అన్నీ చెల్లించబడినట్లయితే, పాలసీ వ్యవధి ముగిసే వరకు జీవించియున్న మీదట, మెచ్యూరిటీపై భరోసా సొమ్ము చెల్లించబడుతుంది. 

అందులో,

మెచ్యూరిటీపై భరోసా సొమ్ము పాలసీ క్రింద చెల్లించాల్సియున్న మొత్తం వార్షికం చేయబడిన ప్రీమియములన్నింటి మొత్తములో 100%కి సమానం.
 

ప్రదర్శనాత్మకము
 


సవి, ఆరోగ్యంగా ఉన్న 30 సంవత్సరాల వయసు గల కొత్తగా తల్లి అయిన మహిళ, పెరుగుతున్న తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి రెండవ ఆదాయం కావాలని కోరుకుంటుంది. ఆమె ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ యొక్క 'ఇమ్మీడియేట్ ఇన్‌కమ్' ఎంపికను కొనుగోలు చేయడానికి ఎంచుకుంటారు మరియు 30 సంవత్సరాల పాలసీ అవధితో 10 సంవత్సరాల పాటు వార్షిక ప్రీమియం రూ. 1,00,000 (పన్నులు మినహాయించి) చెల్లించాలని ఎంచుకుంటారు. ఆమె వార్షిక ఆదాయ చెల్లింపు అంతరమును ఎంచుకుంటారు.
 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ కాలవ్యవధివార్షిక ప్రీమియంబేస్ ఆదాయము (వార్షికంగా)2 వ సంవత్సరం నుండీ ఇక ముందుకు బేస్ ఆదాయములో పెరుగుదల %
10 సంవత్సరాలు30 సంవత్సరాలురు. 1,00,000రు. 22,153ప్రతి సంవత్సరమూ 10%

ఆ సంబంధిత సంవత్సరానికి చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు చెల్లించబడి ఉంటే, ప్రీమియం చెల్లింపు అవధి (పిపిటి) ముగిసే వరకూ ప్రతి సంవత్సరం సవి గారికి చెల్లించాల్సిన ఆదాయం పెరుగుతుంది. ఈ క్రింది పట్టిక ఆదాయ షెడ్యూలును చూపిస్తుంది
 

పాలసీ సంవత్సరం యొక్క ముగింపుఆదాయం 
122,153<--ఈ సంవత్సరం నుండి ఆదాయం చెల్లించదగినదిగా ఉంటుంది
224,369 
326,584
428,799
531,015 
633,230
735,445
837,661 
939,876
10 నుండి 3042,091 
మెచ్యూరిటీ ప్రయోజనం10,00,000 

 

ప్రీమియం చెల్లింపు అవధి మరియు పాలసీ అవధి యొక్క విభిన్న సమ్మేళనాల కోసం దిగువ పట్టిక బేస్ ఆదాయాన్ని చూపిస్తుంది
 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ కాలవ్యవధి
30 సంవత్సరాలు40 సంవత్సరాలు
6 సంవత్సరాలు16,88717,609
8 సంవత్సరాలు20,23121,320
10 సంవత్సరాలు22,15323,475

 

పట్టికలో చూపించబడిన ఆదాయం పై 4.a.I సెక్షన్ లో వివరించబడినట్లుగా పెరుగుతుంది.
 

b. మధ్యంతర ఆదాయ ఐచ్ఛికం
 

I. సర్వైవల్ బెనిఫిట్ (జీవించియున్న ప్రయోజనం)

  • 5వ పాలసీ సంవత్సరం ఆఖరు నుండి ఆదాయం చెల్లించబడుతుంది^ మరియు పాలసీ అవధి ముగింపు వరకూ కొనసాగుతుంది. 
  • ఆ సంబంధిత సంవత్సరానికి చెల్లించాల్సి ఉన్న అన్ని ప్రీమియములు చెల్లించబడి ఉంటే, బేస్ ఆదాయము ఈ దిగువన ఇవ్వబడిన పట్టిక ప్రకారం ప్రతి సంవత్సరమూ లాయల్టీ ఆదాయముచే పెంపుదల చేయబడుతుంది. ప్రతి సంవత్సరమూ ఆదాయం పెరిగినప్పటికీ సైతమూ, ఐదవ పాలసీ సంవత్సరం ఆఖరులోనే మొదటి ఆదాయం చెల్లించబడుతుంది. 
  • Iపాలసీదారు తన బకాయి ప్రీమియం చెల్లించడం ఆపివేసిన తర్వాత లేదా ప్రీమియం చెల్లింపు అవధి ముగిసిన తర్వాత (ఏది ముందు వస్తే దాని ప్రకారం) ఆదాయం పెరగడం ఆగిపోతుంది. 
     

లాయల్టీ ఆదాయము (బేస్ ఆదాయములో పెరుగుదల %) 
 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ సంవత్సరం
12345678910
60%5%10%15%20%25%    
80%10%20% 30% 40%50%60%70%  
100%15%30%45%60%75%90%105%120%135%

 

II. మెచ్యూరిటీ ప్రయోజనం 

బకాయి ఉన్న ప్రీమియములు అన్నీ చెల్లించబడినట్లయితే, పాలసీ వ్యవధి ముగిసే వరకు జీవించియున్న మీదట, మెచ్యూరిటీపై భరోసా సొమ్ము చెల్లించబడుతుంది. 

అందులో, 

Sమెచ్యూరిటీపై భరోసా సొమ్ము(SAM) పాలసీ క్రింద చెల్లించాల్సియున్న మొత్తం వార్షికం చేయబడిన ప్రీమియములన్నింటి మొత్తములో 100%కి సమానం.
 

ప్రదర్శనాత్మకము
 

35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన ప్రణవ్ అనే వ్యక్తి, ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్‌ను 'ఇంటర్మీడియట్ ఇన్‌కమ్' ఆప్షన్ క్రింద వార్షిక ప్రీమియం  రూ.2,00,000 (పన్నులు మినహాయించి) లను 10 సంవత్సరాల పాటు చెల్లించేలా 30 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకుంటారు.  అతను వార్షిక ఆదాయ చెల్లింపు ఐచ్ఛికమును ఎంచుకుంటారు. 

 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ కాలవ్యవధివార్షిక ప్రీమియంకుటుంబ ఆదాయము (వార్షికంగా) 2 వ సంవత్సరం నుండీ ఇక ముందుకు బేస్ ఆదాయములో పెరుగుదల % I5వ పాలసీ సంవత్సరం ఆఖరు నుండి ఆదాయం చెల్లించబడుతుంది
10 సంవత్సరాలు30 సంవత్సరాలురు 2,00,000రు. 46,28815% ప్రతి ఏటారు. 74,061

 

ఆ సంబంధిత సంవత్సరానికి చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు చెల్లించబడి ఉంటే, ప్రీమియం చెల్లింపు అవధి (పిపిటి) ముగిసే వరకూ ప్రతి సంవత్సరం ప్రణవ్ గారికి చెల్లించాల్సిన ఆదాయం పెరుగుతుంది. ఈ క్రింది పట్టిక ఆదాయ షెడ్యూలును చూపిస్తుంది: 
 

పాలసీ సంవత్సరం యొక్క ముగింపుఆదాయం 
1- 
2- 
3- 
4- 
574,061<--ఈ సంవత్సరం నుండి ఆదాయం చెల్లించదగినదిగా ఉంటుంది
681,004 
787,947  
894,890  
91,01,834 
10 నుండి 301,08,777 
మెచ్యూరిటీ ప్రయోజనం20,00,000  

 

ప్రీమియం చెల్లింపు అవధి మరియు పాలసీ అవధి యొక్క విభిన్న సమ్మేళనాల కోసం దిగువ పట్టిక బేస్ ఆదాయాన్ని చూపిస్తుంది

 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ కాలవ్యవధి
30 సంవత్సరాలు40 సంవత్సరాలు
6 సంవత్సరాలు54,22654,859
8 సంవత్సరాలు67,206 69,084
10 సంవత్సరాలు74,061 76,701 

 

పట్టికలో చూపించబడిన ఆదాయం పై 4.b.I సెక్షన్ లో వివరించబడినట్లుగా పెరుగుతుంది.
 

c. డిఫర్డ్ ఆదాయ ఐచ్ఛికం
 

I. సర్వైవల్ బెనిఫిట్ (జీవించియున్న ప్రయోజనం)

  • 10వ పాలసీ సంవత్సరం ఆఖరు నుండి మొదలై మీకు ఆదాయం చెల్లించబడుతుంది^ మరియు పాలసీ అవధి ముగింపు వరకూ కొనసాగుతుంది. 
  • బకాయి ఉన్న ప్రీమియములు అన్నీ చెల్లించబడి ఉంటే, లాయల్టీ ఆదాయం 16వ పాలసీ సంవత్సరం నుండి మొదలై పాలసీ అవధి ముగిసే వరకూ, ప్రతి 5 సంవత్సరాలకు (దిగువ ఉన్న పట్టిక ప్రకారం) బేస్ ఆదాయాన్ని పెంచుతుంది. 

 

లాయల్టీ ఆదాయము (బేస్ ఆదాయములో పెరుగుదల %) పాలసీ అవధి = 30 సంవత్సరాలుపాలసీ అవధి = 40 సంవత్సరాలు
పాలసీ సంవత్సరం/ ప్రీమియం చెల్లింపు అవధి6 సంవత్సరాలు8 సంవత్సరాలు10 సంవత్సరాలు6 సంవత్సరాలు8 సంవత్సరాలు10 సంవత్సరాలు
1-150%0%0%0%0%0%
16-20 15%30%45%15%30%45%
21-2530%60%90%30%60%90%
26-30 45%90%135%45%90%135%
31-35వర్తించదువర్తించదువర్తించదు60% 120%180% 
36-40 వర్తించదువర్తించదువర్తించదు75%150%225% 

 

  • అదనంగా రెండు క్యాష్‌బ్యాక్‌లు కూడా చెల్లించబడతాయి; అనగా.; ఏకమొత్తం ప్రయోజనం యొక్క 2 కంతులు రెండూ వార్షికం చేయబడిన ప్రీమియముకు సమానము 3వ పాలసీ సంవత్సరం ఆఖరులో మరియు ప్రీమియం చెల్లింపు అవధి ముగింపులో చెల్లించబడతాయి.
క్యాష్‌బ్యాక్ రకంలాయల్టీ క్యాష్‌బ్యాక్ ఎప్పుడు చెల్లించబడుతుంది?
లాయల్టీ క్యాష్‌బ్యాక్3వ పాలసీ సంవత్సరం ఆఖరులో చెల్లించబడుతుంది
గ్యారంటీడ్ క్యాష్‌బ్యాక్ప్రీమియం చెల్లింపు అవధి ఆఖరులో చెల్లించబడుతుంది

 

II. మెచ్యూరిటీ ప్రయోజనం
 

బకాయి ఉన్న ప్రీమియములు అన్నీ చెల్లించబడినట్లయితే, పాలసీ వ్యవధి ముగిసే వరకు జీవించియున్న మీదట, మెచ్యూరిటీపై భరోసా సొమ్ము చెల్లించబడుతుంది.

అందులో,

మెచ్యూరిటీపై భరోసా సొమ్ము పాలసీ క్రింద చెల్లించాల్సియున్న మొత్తం వార్షికం చేయబడిన ప్రీమియములన్నింటి మొత్తములో 150%కి సమానం.

 

ప్రదర్శనాత్మకము

 

వైభవ్ అనే ఆరోగ్యవంతుడైన 40 ఏళ్ల మనిషి 10 సంవత్సరాల పాటు వార్షిక ప్రీమియం రూ.5,00,000 (పన్నులు మినహాయించి) చెల్లించేలా 30 సంవత్సరాల పాలసీ అవధిని ఎంచుకోవడం ద్వారా  డిఫర్డ్ ఇన్‌కమ్ ఆప్షన్ క్రింద ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్‌ను కొనుగోలు చేశారు. అతను వార్షిక ఆదాయ చెల్లింపు ఐచ్ఛికమును ఎంచుకుంటారు. 
 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ కాలవ్యవధివార్షిక ప్రీమియం10వ పాలసీ సంవత్సరం ఆఖరు నుండి ఆదాయం చెల్లించబడుతుంది
10 సంవత్సరాలు30 సంవత్సరాలురు. 5,00,000రు. 2,23,146

 

10వ పాలసీ సంవత్సరం చివరి నుండి వైభవ్‌ గారికి క్రమం తప్పని ఆదాయం చెల్లించబడుతుంది. దీనికి అదనంగా లాయల్టీ ఆదాయము కూడా చెల్లించదగినదిగా ఉంటుంది. ఈ దిగువ పట్టిక చెల్లించదగిన ఆదాయ ప్రయోజనాన్ని చూపిస్తుంది

 

పాలసీ సంవత్సరం యొక్క ముగింపుక్యాష్‌బ్యాక్‌లుఆదాయం 
1 -
2 -
32,50,000 -
4 -
5 -
6 -
7 -
8 -
9 -
102,50,000 2,23,146 <--ఈ సంవత్సరం నుండి ఆదాయం చెల్లించదగినదిగా ఉంటుంది
11-15 2,23,146 
16-20 3,23,562
21-25 4,23,977
26-30  5,24,393 
మెచ్యూరిటీ ప్రయోజనం 75,00,000 

 

ప్రీమియం చెల్లింపు అవధి మరియు పాలసీ కాలవ్యవధి యొక్క విభిన్న సమ్మేళనాల కొరకు 10వ పాలసీ సంవత్సరం ముగిసే నాటికి వైభవ్ కు చెల్లించవలసిన ఆదాయాన్ని ఈ దిగువ పట్టిక చూపిస్తుంది.
 

ప్రీమియం చెల్లింపు అవధిపాలసీ కాలవ్యవధి
30 సంవత్సరాలు40 సంవత్సరాలు
6 సంవత్సరాలు1,11,6991,24,236
8 సంవత్సరాలు1,78,6681,89,378
10 సంవత్సరాలు2,23,1462,29,824 

 

పట్టికలో చూపించబడిన ఆదాయం పై 4.c.I సెక్షన్ లో వివరించబడినట్లుగా పెరుగుతుంది.

^ఒకవేళ ఎంచుకోబడిన ఆదాయం చెల్లింపు అంతరం వార్షికం అయి ఉంటే. వార్షిక ఆదాయ చెల్లింపు అంతరము కాకుండా ఇతరత్రా అన్ని ప్రయోజనాలు ఎరియర్స్ గా చెల్లించబడతాయి, అనగా, నిర్దిష్టంగా పేర్కొన్న అంతరము ముగింపులో.

మరణ ప్రయోజనం (అన్ని ఆదాయ ఐచ్ఛికాలకూ వర్తిస్తుంది)


పాలసీ అవధి సందర్భంగా జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో, పాలసీ అమలులో ఉండి మరియు అన్ని ప్రీమియంలు చెల్లించబడి ఉన్నప్పుడు, మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దు చేయబడుతుంది. 

మరణ ప్రయోజనం దీనిపై అత్యధికంగా ఉంటుంది: 

  • మరణంపై భరోసా సొమ్ము 
  • మరణించిన తేదీ నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియముల యొక్క 105%
  • మెచ్యూరిటీపై భరోసా సొమ్ము మైనస్ ఈనాటికి చెల్లించబడిన సర్వైవల్ ప్రయోజనాలు
  • మరణించిన తేదీ నాటికి సరెండర్ విలువ


మరణంపై భరోసా సొమ్ము వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 10 రెట్లు, మెచ్యూరిటీపై భరోసా సొమ్ము పాలసీ క్రింద చెల్లించాల్సిన మొత్తం వార్షికం చేయబడిన ప్రీమియంల మొత్తంలో X%, ఇక్కడ X% అనేది ఇమ్మీడియేట్ మరియు ఇంటర్మీడియేట్ ఆదాయ ఎంపికలకు 100% మరియు డిఫర్డ్ ఆదాయ ఎంపిక కోసం 150% ఉంటుంది.

కాగా, వార్షికం చేయబడిన ప్రీమియం పాలసీదారుచే ఎంచుకోబడిన ఒక సంవత్సరములో పన్నులు, రైడర్ ప్రీమియములు, అండర్‌రైటింగ్ (పూచీకత్తు) అదనపు ప్రీమియములు మరియు మోడల్ ప్రీమియముల కొరకు లోడింగులు ఏవైనా ఉంటే, వాటిని మినహాయించుకొని, చెల్లించదగిన ప్రీమియం మొత్తముగా ఉంటుంది.

ఇక్కడ, చెల్లించిన మొత్తం ప్రీమియంలు అంటే ఏదైనా అదనపు ప్రీమియం, ఏదైనా రైడర్ ప్రీమియం మరియు వర్తించే పన్నులు మినహా, అందుకోబడిన మొత్తం ప్రీమియంలు అని అర్థం.

పైన పేర్కొనబడిన మరణ ప్రయోజనము పాలసీ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయములోనైనా / జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన మీదట ఒక టోకు మొత్తముగా గానీ లేదా పాలసీదారు/ నామినీ ఎంచుకోబడిన విధంగా 5 సంవత్సరాల వ్యవధి పాటుగా నెలసరి కంతులలో గానీ చెల్లించబడుతుంది. 

ఒకవేళ జీవిత భరోసాదారు ఆత్మహత్యకు పాల్పడిన (ఆత్మహత్య మినహాయింపు) పక్షములో ఏమి జరుగుతుంది?

Answer

పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య కారణంగా మరణం విషయంలో, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name
ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్
Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guaranteed Pension Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

Dropdown Field
రిటైర్‌మెంట్
Product Description

మీ బంగారు సంవత్సరాలను నిజంగా బంగారంగా చేసుకోండి! మీరు జీవించి ఉన్నంత కాలమూ గ్యారంటీగా ఆదాయాన్ని ఇవ్వడానికై రూపొందించబడిన గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి చేయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం అందుకోండి
  • 5 విభిన్న యాన్యువిటీల నుండి ఎంచుకోండి.
  • కొనుగోలు ధర తిరిగిరావడం
  • క్లిష్టమైన జబ్బులపై కవర్
  • పెరుగుతున్న యాన్యుటీ (పెన్షన్) ఎంపిక
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail