₹2 కోట్ల అవధి బీమా అంటే ఏమిటి?
నామినీకి మరణ ప్రయోజనముగా ₹2 కోట్ల చెల్లింపును అందించే అవధి జీవిత బీమా పాలసీని సూచించడానికి ఇది ప్రత్యక్ష మార్గముగా ఉంటుంది. ఈ చెల్లింపు పాలసీ నిబంధనలకు మరియు క్లెయిము యొక్క సందర్భ పరిస్థితులకు లోబడి ఉంటుంది.
అవధి బీమా ప్లానులు సాపేక్షంగా తక్కువ ఖర్చుతో అధిక కవరేజీని ఎలా అందిస్తాయో అందుకు బాగా-సుపరిచితంగా ఉన్నాయి. ఈ ప్లానుల గురించి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్లాన్ యొక్క అత్యంత ప్రాథమిక వెర్షన్ మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. మీరు అనుకూలీకరణలను ఎంచుకొని ఉంటే తప్ప, లెవల్ అవధి ప్లానులతో మెచ్యూరిటీ ప్రయోజనాలు గానీ లేదా ఇతర అదనపు క్లెయిములు గానీ ఏవీ ఉండవు. మీరు అలా చేశారంటే, అది మీ ప్రీమియం మొత్తములో ప్రతిఫలించడానికి లోబడి ఉంటుంది.
₹2 కోట్ల అవధి బీమా ప్లాన్ ఎందుకు కొనాలి?
జీవిత భరోసా పొందిన వ్యక్తి అకాల మరణం సంభవించినప్పుడు ₹2 కోట్ల అవధి బీమా ప్లాన్ మీ కుటుంబానికి గణనీయమైన ఆర్థిక భద్రతను అందజేస్తుంది.
ఇది, మీ కుటుంబం తమ జీవనశైలిని నిర్వహించుకోగలిగేలా, రోజువారీ ఖర్చులను తీర్చుకోగలిగేలా మరియు ఆర్థిక ఒత్తిడి లేకుండా చదువు మరియు వివాహం వంటి భవిష్యత్తు లక్ష్యాలను నెరవేర్చుకోగలిగేలా చూసుకుంటుంది.
ఈ రకమైన కవర్ అధిక-రిస్క్ అయితే అధిక-చెల్లింపు పనులు లేదా అధిక జీవన వ్యయం వంటి అనేక రకాల ఏర్పాట్లలో ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, ₹2 కోట్ల అవధి బీమా భరోసా మొత్తాన్ని ఎంచుకోవడానికి ఇది మంచి ఒక ఆర్థిక నిర్ణయంగా చెప్పుకోవచ్చు.
₹2 కోట్ల అవధి బీమా ప్లాన్ ఎలా పని చేస్తుంది?
₹2 కోట్ల అవధి ప్లాన్ స్వచ్ఛమైన రక్షణ సూత్రంపై పనిచేస్తుంది:
పాలసీదారు యొక్క ప్రీమియములు: మీరు బీమా కంపెనీకి క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తారు.
కవరేజీ వ్యవధి: ఈ పాలసీ, అవధి అనబడే ఒక నిర్దిష్ట కాలవ్యవధికి కవరేజీని అందిస్తుంది.
మరణ ప్రయోజనం: ఒకవేళ జీవిత బీమా పొందిన వ్యక్తి అవధి సమయంలో మరణించినట్లయితే, నామినీ ₹2 కోట్ల మరణ ప్రయోజనాన్ని అందుకుంటారు.
మెచ్యూరిటీ ప్రయోజనం లేదు: ఒకవేళ జీవిత బీమా పొందిన వ్యక్తి అవధి అంతటా జీవించి ఉన్నట్లయితే, ఇతర జీవిత బీమా ప్లానుల మాదిరిగా కాకుండా, అవధి ప్లాన్లు మెచ్యూరిటీ ప్రయోజనాలను అందించవు.
₹2 కోట్ల అవధి బీమా ప్లాను యొక్క ప్రయోజనాలు ఏవేవి?
స్థోమతకు తగిన ప్రీమియములు: ఇతర బీమా ఉత్పత్తులతో పోలిస్తే అవధి ప్లానులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
అధిక కవరేజీ: పోల్చి చూస్తే, తక్కువ ప్రీమియంతో గణనీయమైన కవరేజీని అందిస్తాయి.
ఆర్థిక భద్రత: మీరు లేనప్పుడు మీ కుటుంబం యొక్క ఆర్థిక సుస్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.
సరియైన ₹2 కోట్ల అవధి బీమా ప్లానును ఎంచుకోవడం ఎలా?
₹2 కోట్ల భరోసా సొమ్ముతో సరియైన అవధి బీమా ప్లాన్ ఎంచుకోవడం అనేది అనేక అంశాలను పరిగణన లోనికి తీసుకోవడం ఇమిడి ఉంటుంది. సరియైన పాలసీని ఎంచుకోవడమనే విషయానికి వస్తే, ఈ క్రింది చిట్కాలు మీకు మార్గదర్శకంగా పని చేస్తాయి:
మీ అవసరాలను అంచనా వేసుకోండి: మీ కుటుంబ ఆర్థిక అవసరాలు, కర్తవ్యబాధ్యతలు, మరియు భవిష్యత్ లక్ష్యాలను మదింపు చేసుకోండి.
ప్లానులను పోల్చి చూసుకోండి: ప్రీమియంలు, ఫీచర్లు మరియు ప్రయోజనాల ఆధారంగా విభిన్న అవధి ప్లానులను పోల్చడానికి ఆన్లైన్ కంపారిజన్ సాధనాలను ఉపయోగించండి.
క్లెయిము పరిష్కార నిష్పత్తిని చెక్ చేసుకోండి: మీ కుటుంబం యొక్క క్లెయిమ్ తక్షణమే గౌరవించబడేలా చూసుకోవడానికి అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో ఉన్న బీమా సంస్థను ఎంచుకోండి.
రైడర్లు మరియు ఆడ్-ఆన్ లు: మీ పాలసీని పెంపొందించుకోవడానికి గాను, తీవ్రమైన అనారోగ్య రక్షణ, ప్రమాదవశాత్తు మరణ ప్రయోజనం లేదా ప్రీమియం మినహాయింపు వంటి అదనపు రైడర్లను పరిగణించండి.
పాలసీ కాలవ్యవధి: మీ ఆర్థిక లక్ష్యాలు మరియు కర్తవ్య బాధ్యతలకు సరిగ్గా కుదురుబాటు అయ్యే పాలసీ అవధిని ఎంపిక చేసుకోండి.
ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాలు: మీ ఆర్థిక ప్రణాళికకు సరిపోయే అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్ల కోసం చెక్ చేయండి.
మీ ₹2 కోట్ల అవధి బీమా ప్లాన్ కొరకు ప్రీమియం మొత్తమును లెక్కించుకోవాలనుకుంటున్నారా? ఆన్లైన్ క్యాలికులేటర్ ద్వారా ఇక్కడ ఆ పని చేయండి!
₹2 కోట్ల అవధి బీమా చెల్లింపుకు పన్ను విధించబడుతుందా?
₹2 కోట్ల అవధి బీమా ప్లాను నుండి వచ్చే చెల్లింపు ప్రముఖంగా ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 10 (10 డి) క్రింద పన్ను-రహితంగా ఉంటుంది. అంటే దీని అర్థం, మరణ ప్రయోజనం ఆదాయపు పన్నుకు లోబడి ఉండదు. అయినప్పటికీ, ఈ మినహాయింపుకు అర్హత పొందడానికి గాను, చెల్లించిన ప్రీమియంలు భరోసా సొమ్ములో 10% మించకుండా చూసుకోవడం చాలా అవసరం.
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ₹2 కోట్ల అవధి బీమా ప్లాన్ ఎందుకు కొనాలి?
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ₹2 కోట్ల అవధి బీమా ప్లానుని ఎంచుకోవడం అనేక ప్రయోజనాలతో కూడుకొని ఉంటుంది:
సమగ్రమైన కవరేజీ: మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి విస్తృతమైన కవరేజీని అందిస్తుంది.
సరసమైన ప్రీమియములు: అధిక-విలువ కవరేజ్ కోసం సరసమైన ప్రీమియం రేట్లను అందిస్తాయి.
అదనపు రైడర్లు: మీ పాలసీని అనుకూలీకరించడానికి వివిధ రైడర్లల అందుబాటు.
అధిక క్లెయిం సెటిల్మెంట్ రేషియో: అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో అవాంతరాలు లేని క్లెయిము ప్రక్రియ జరిగేలా చూసుకుంటుంది.
అనుకూలమైన చెల్లింపు ఐచ్ఛికాలు: మీ ఆర్థిక ప్రణాళికకు సరిపోయే అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు.
కస్టమర్ మద్దతు: పాలసీ నిర్వహణ మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఘనమైన కస్టమర్ మద్దతు.
సరియైన జీవిత బీమా ప్లాన్ ఎంచుకోవడంలో సహాయం కావాలా? మాకు ఇప్పుడే 8828840199 పై కాల్ చేయండి లేదా ఇక్కడ ఒక కాల్ బుక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
₹2 కోట్ల అవధి బీమా ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
మీరు సురక్షితపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న భరోసా సొమ్ముతో సంబంధం లేకుండా, అవధి జీవిత బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి గాను మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. మీరు ప్లాన్ పొందగలిగి ఉండేలా నిర్ధారించుకోవడానికి గాను మీరు కోరుకునే అవధి పాలసీ యొక్క అర్హతా ప్రాతిపదికలను పరిశీలించుకోండి.
అంతిమ ఆమోదం పూచీకత్తు బృందం వద్ద ఉంటుంది కాబట్టి, రెగ్యులర్ అవధి ప్లాన్‌కు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ₹2 కోట్ల అవధి బీమా ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
₹2 కోట్ల భరోసా సొమ్ము నాకు సరిపోతుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది?
జీవిత బీమా కోసం ఉత్తమమైన భరోసా సొమ్ము మీ వార్షిక ఆదాయం యొక్క 10 రెట్లతో పాటు మీ కర్తవ్యబాధ్యతలు అన్నింటినీ తీర్చగలిగే విలువ అయి ఉండాలి. మీరు ఆన్లైన్ అవధి బీమా కాలిక్యులేటర్‌ని ఉపయోగించి దీన్ని మాన్యువల్‌గా లెక్కించవచ్చు లేదా మీ కోసం ఒక నిపుణుడితో దీన్ని చేయించవచ్చు.
₹2 కోట్ల కవరేజీని అందించే ప్లాన్ కోసం అవధి బీమా ప్రీమియం మొత్తం ఎంత ఉంటుంది?
₹2 కోట్ల అవధి బీమా ప్రీమియం జీవిత భరోసా పొందిన వారి వయస్సు మరియు లింగం, అలాగే భరోసా సొమ్ము వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు మీరు అవధి బీమా ప్రీమియం కాలిక్యులేటర్‌ని ఉపయోగించుకోవచ్చు లేదా మీకు సహాయం చేయడానికి బీమాదారు ప్రతినిధిని అయినా సంప్రదించవచ్చు.
ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి పాలసీ కాలావధి అంతటా జీవించి ఉంటే ఏమి జరుగుతుంది?
ఒకవేళ మీరు ఒక స్థాయి అవధి బీమా పాలసీని ఎంచుకుని, పాలసీ కాల వ్యవధి పాటు జీవించి ఉంటే, క్లెయిమ్ చేయడానికి గాను అవధి బీమా యొక్క మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏవీ ఉండవు. అయినప్పటికీ, మీ ప్లాన్‌కి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటే, మీరు ప్లాన్ మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం రిటర్న్‌ను క్లెయిము చేసుకోవచ్చు.
₹2 కోట్ల అవధి బీమా ప్లానుతో ఏయే రైడర్లు అందుబాటులో ఉన్నాయి?
రైడర్ల లభ్యత ఎంచుకున్న ప్లాన్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎంచుకున్న ప్లాన్ కొరకు ఏ రైడర్లను జోడించవచ్చునో మీరు చెక్ చేసుకోవచ్చు.