పాలసీ అమలులో ఉన్నప్పుడు లేదా చెల్లించబడని మొదటి ప్రీమియం యొక్క గడువు తేదీ నుండి కారుణ్య కాలవ్యవధి ముగిసే లోపున జీవిత భరోసా పొందిన వ్యక్తి అకాలములో మరణించిన పక్షములో, ఆయా ఉదంతమును బట్టి మరణించిన తేదీ నాటికి అధిక ఫండ్ విలువకు సమానమైన సొమ్ము, లేదా భరోసా సొమ్ము, ఏదో ఒకటిని నామినీ (లు)/ అపాయింటీ/చట్టబద్ధ వారసులు పాలసీ క్రింద మరణ ప్రయోజనం అందుకుంటారు (విభాగం 3 లో పేర్కొనబడినట్లుగా). లైఫ్ ఆప్షన్ మరియు ఎక్స్‌ట్రా షీల్డ్ ఆప్షన్ కోసం విభాగం 3లో పేర్కొనబడిన విధంగా మరణ ప్రయోజనం మరియు కుటుంబ రక్షణ ఆప్షన్ కోసం, విభాగం 3లో పేర్కొనబడిన విధంగా మరణ సమయంలో చెల్లించాల్సిన మొత్తం ఏదైనా ఒకటి చెల్లించబడుతుంది
- ఒక ఏకమొత్తము చెల్లింపుగా; లేదా
- పాలసీ అవధి సందర్భంగా ఏ సమయములోనైనా / జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన మీదట పాలసీదారు/నామినీచే ఎంచుకోబడిన విధంగా 5 సంవత్సరాల వ్యవధి పాటుగా నెలసరి కంతులుగా. మరణ ప్రయోజనం యొక్క కంతుల చెల్లింపు విషయంలో, కంతు ప్రయోజన మొత్తము టోకు మొత్తము (S అనుకోండి) ను యాన్యువిటీ అంశముచే భాగించడం ద్వారా లెక్కించబడుతుంది, (అనగా a(n)(12)) i.e. S/a(n)(12), ఇందులో n అనేది 5 సంవత్సరాల కంతుల వ్యవధి. యాన్యువిటీ అంశమును లెక్కించడానికి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఉన్న SBI సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 22-23 కు అమలులో ఉన్న సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు సాలుకు 2.70 గా ఉంది. ఒకసారి వాయిదా చెల్లింపు మొదలయిందంటే, వాయిదా కాలవ్యవధి అంతటా ఈ చెల్లింపు అదే మట్టములోనే నిలిచి ఉంటుంది. యాన్యువిటీ అంశమును లెక్కించడానికి ఉపయోగించబడే వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సర సమీక్షకు లోబడి ఉంటుంది మరియు SBI సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటులో మార్పు ఉన్న పక్షములో అదీ మారుతుంది.
అన్ని ప్లాన్ ఐచ్ఛికాలకూ పైవి వర్తిస్తాయి.
ఈ ఐచ్ఛికం గనక నామినీ (లు)/ అపాయింటీ/చట్టబద్ధ వారసుల కొరకు ఎంచుకోబడి ఉంటే, ఆయా ఉదంతమును బట్టి సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో అయినా బ్యాలెన్స్ మరణ ప్రయోజనాన్ని విత్‌డ్రా చేయమని అడగవచ్చు. ఈ వ్యవధిలో నిధుల పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడవు.
ఒకవేళ నామినీ మైనర్ అయిన పక్షములో అపాయింటీకి సొమ్ము చెల్లించబడుతుంది. అయినప్పటికీ, ఏ సమయములోనైనా సరే, పాలసీ అవధి కాలములో చెల్లించిన మొత్తం ప్రీమియముల యొక్క 105% కు తక్కువగా మరణ ప్రయోజనము ఉండబోదు.
ఒక యాక్సిడెంట్ కారణంగా మరణానికి కారణమైన సంఘటన పాలసీ వ్యవధి సందర్భంగా సంభవించిన పక్షములో మరియు పాలసీ గడువు ముగిసిన తర్వాత ప్రమాద మరణం సంభవించిన పక్షములో, ప్రమాదం జరిగిన తేదీ నుండి 180 రోజుల లోపున, ప్రమాద మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది, అనగా., పాలసీ అవధి చివరి రోజున కూడా ప్రమాదం సంభవించినప్పటికీ సైతమూ, రిస్క్ కవర్ రద్దుతో సంబంధం లేకుండా 180 రోజుల పాటు కవర్ అందించబడుతుంది.
తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీల విషయంలో, జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన మీదట, పాలసీ ప్రారంభంలో పాలసీదారుచే ఎంపిక చేయబడిన చెల్లింపు ఐచ్ఛికం ప్రకారం, నామినీ/అపాయింటీ/ చట్టబద్ధ వారసులకు, తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము యొక్క అత్యధికానికి సమానమైన సొమ్ము లేదా మరణ సమాచారం అందుకోబడిన తేదీ నాటికి ఉన్న ఫండ్ విలువ చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.
పెయిడ్-అప్ భరోసా సొమ్ము అనేది భరోసా సొమ్ము* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ అవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) గా పేర్కొనబడుతుంది.
మరణ ప్రయోజనంపై పాక్షిక విత్‌డ్రాయల్స్/ వ్యవస్థీకృత పాక్షిక విత్‌డ్రాయల్స్ యొక్క ప్రభావము ఏమిటి?
జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క అకాల మరణం సంభవించిన పక్షములో, నామినీ(లు)/ అపాయింటీ/చట్టబద్ధ వారసులు మరణ ప్రయోజనాన్ని అందుకుంటారు, ఇక్కడ జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన తేదీకి తక్షణ 2 వ మునుపటి సంవత్సరంలో ఫండ్ విలువ నుండి చేసిన పాక్షిక/క్రమబద్ధమైన పాక్షిక ఉపసంహరణలకు సమానమైన మొత్తంలో బీమా మొత్తం తగ్గించుకోబడుతుంది.
పాలసీ గనక తగ్గించుకోబడిన పెయిడ్-అప్ హోదాను పొందినట్లయితే మరణ ప్రయోజనం ఏమిటి?
జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన తేదీకి తక్షణ మునుపటి 2 సంవత్సరాలలో చేసిన పాక్షిక/క్రమబద్ధమైన పాక్షిక ఉపసంహరణల మొత్తమును, మరణానికి సంబంధించిన సమాచారం లేదా ఫండ్ విలువను అందుకున్న తేదీ నాటికి భరోసా మొత్తము/పెయిడ్ అప్ భరోసా మొత్తము నుండి తగ్గించుకోబడుతుంది.
పెయిడ్-అప్ భరోసా సొమ్ము లేదా ఫండ్ విలువలో అత్యధిక మొత్తానికి సమానమైన మొత్తము (మరణానికి సంబంధించిన సమాచారం అందుకున్న తేదీ నాటికి) నామినీ(లు)/అపాయింటీ/చట్టబద్ధ వారసులకు చెల్లించబడుతుంది, కాగా పాలసీ మాత్రం తగ్గించుకోబడిన పెయిడ్-అప్ స్థితిలో ఉంటుంది.
ఫ్యామిలీ కేర్ ఐచ్చికం: తగ్గించుకోబడిన పెయిడ్-అప్ పాలసీలో జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో, పాలసీదారు ప్రీమియములను చెల్లించడం ఆపివేసిన చోట, తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ములో అత్యధికం లేదా ఫండ్ విలువ చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.
మరణానికి ముందు తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ కోసం మరణ సంబంధిత ఛార్జీలు ఏవైనా ఉంటే, అవి పెయిడ్-అప్ భరోసా సొమ్ము ఆధారంగా లెక్కించబడతాయి. మరణించిన తేదీ అనంతరం వసూలు చేసుకోబడిన FMC మినహా మిగిలిన అన్ని ఛార్జీలు మరణం యొక్క సమాచారం తేదీ నాటికి అందుబాటులో ఉన్న ఫండ్ విలువకు తిరిగి జోడించబడతాయి.