యజమాని - ఉద్యోగి గ్రూపు
- Answer
-
ప్రవేశము వద్ద వయస్సు
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 85 సంవత్సరాలు
మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు: 86 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
ప్రవేశము వద్ద వయస్సు
మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు: 86 సంవత్సరాలు
ప్రవేశము వద్ద వయస్సు
మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు: 86 సంవత్సరాలు
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్ అనేది, ఖాతాదారులు, క్రెడిట్ కార్డుదారులు, డిపాజిటర్/క్రెడిటర్ గ్రూపులు, ప్రభుత్వ ఏజెన్సీలు, పాఠశాల/కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక రంగ గ్రూపులు, అనుబంధ గ్రూపులు, యజమాని-ఉద్యోగి గ్రూపులు మొదలగువంటి ఒకే విధమైన ఆసక్తి ఉన్న వ్యక్తుల గ్రూపుకు అందించబడే పాల్గొనడం లేని, అనుసంధానితం కాని, వార్షికంగా నవీకరణ చేయబడే గ్రూప్ ప్రొటెక్షన్ ప్లాన్ అయి ఉంది.
ప్రస్తుతం మీరు ఈ దిగువ కనబరచిన పన్ను ప్రయోజనాలకు అర్హులుగా ఉన్నారు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. అయినప్పటికీ, మీ పన్ను సలహాదారును సంప్రదించవలసిందిగా మీకు సలహా ఇవ్వబడుతోంది.
చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు ఏవేవి?
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. ఈ పాలసీని కొనుగోలు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
మరణ ప్రయోజనాలు పన్నురహితంగా ఉంటాయా?
అవును, ఆదాయపు పన్ను చట్టము, 1961 సెక్షన్ 10(10) D క్రింద మరణ ప్రయోజనాలు పన్నురహితంగా కూడా ఉంటాయి.
వాలంటరీ కవర్ | నిర్బంధ కవర్ | |
---|---|---|
పద్ధతి | ఈ స్కీము ప్లాన్ యొక్క ప్రారంభంలోనే అర్హతగల తన సభ్యులకు తెరవబడి ఉంటుంది. ఆసక్తిగల సభ్యులు మాస్టర్ పాలసీదారు వద్ద అందుబాటులో ఉన్న సభ్యత్వ ఫారమును పూరించాల్సి ఉంటుంది. వారు కొన్ని నిర్దిష్ట పూచీకత్తు అవసరాలను కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. | నిర్దేశించిన పరిమితుల ప్రకారం మాస్టర్ పాలసీ ఆటోమేటిక్ గా గ్రూపులో అర్హతగల సభ్యులందరినీ చేరి ఉంటుంది (ఒకసారి వారు పూచీకత్తు అవసరాలు ఏవైనా ఉంటే వాటిని నెరవేర్చినపుడు) |
ప్రీమియం చెల్లింపు | మాస్టర్ పాలసీదారు అయిన మీచే కంపెనీకి ప్రీమియం చెల్లించబడుతుంది. దానిని మామూలుగా మీ సభ్యుల నుండి సేకరించుకుంటారు. | మాస్టర్ పాలసీదారు అయిన మీచే కంపెనీకి ప్రీమియం చెల్లించబడుతుంది. మీరు మీ సభ్యుల నుండి దానిని సేకరించుకోవచ్చు లేదా సేకరించుకోకపోవచ్చు. |
బీమా వర్తింపు | ప్రీమియం అందుకోబడిన తర్వాత మరియు అన్ని పూచీకత్తు ప్రాతిపదికలు ఏవైనా ఉంటే, నెరవేర్చిన తర్వాత ప్రారంభమవుతుంది. | ప్రీమియం అందుకోబడిన తర్వాత మరియు అన్ని పూచీకత్తు ప్రాతిపదికలు ఏవైనా ఉంటే, నెరవేర్చిన తర్వాత ప్రారంభమవుతుంది. |
ఉదాహరణ | మాస్టర్ పాలసీదారు: బ్యాంక్ సభ్యులు: సేవింగ్స్ ఖాతాల కస్టమర్ల ప్రీమియం: సభ్యుల సమ్మతి తీసుకున్న తర్వాత వారి పొదుపు ఖాతా నుండి నేరుగా తీసివేసుకొని బ్యాంకుచే అది చెల్లించబడుతుంది. | మాస్టర్ పాలసీదారు: ఎబిసి కంపెనీ లిమిటెడ్ సభ్యులు: ఉద్యోగుల ప్రీమియము: కంపెనీచే చెల్లించబడుతుంది. ఉద్యోగులకు అదనపు ప్రయోజనంగా లైఫ్ కవర్ అందించబడుతుంది. |
* మీరు, మాస్టర్ పాలసీదారు ప్రతిపాదన ఫారమును పూరించాల్సి ఉంటుంది మరియు అవసరమైన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తదనంతరం మేము మీకు కొటేషన్‌ను జారీ చేస్తాము. ఈ కొటేషన్‌ను మీరు ఆమోదించిన తర్వాత మీకు మాస్టర్ ప్లాన్ జారీ చేయబడుతుంది.
మేము, మాస్టర్ పాలసీదారు అయిన మీకు పాలసీ మొదలైన తేదీ నుండి 1 సంవత్సరం లోపున చెల్లించాల్సిన ప్రీమియములన్నింటికీ 30 రోజుల కారుణ్య వ్యవధిని అందజేస్తాము. మీ సభ్యులు ప్లాన్/కవర్ యొక్క 6 ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించేలా చూసుకోవడానికి గాను మీరు కారుణ్య వ్యవధి ముగిసే లోపున ప్రీమియములను చెల్లించాల్సి ఉంటుంది. కారుణ్య వ్యవధి సందర్భంగా దురదృష్టవశాత్తూ సభ్యుడు మరణించిన పక్షములో, సభ్యుని కవర్ చేసిన కాలానికి చెల్లించాల్సియున్న ప్రీమియమును తగ్గించుకున్న తర్వాత మరణ ప్రయోజనంలో మిగిలిన మొత్తాన్ని నామినీ/అపాయింటీ/చట్టబద్ధమైన వారసులు అందుకుంటారు. ఒకవేళ కారుణ్య వ్యవధి లోపున బకాయి ప్రీమియమును చెల్లించని పక్షములో కవర్ ఆగిపోతుంది మరియు ప్లాన్/సభ్యత్వం రద్దు చేయబడుతుంది. ఈ కాలవ్యవధిలో, పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.
ఒకవేళ, మాస్టర్ పాలసీదారు (ఎంపిహెచ్) అయిన మీరు కారుణ్య వ్యవధి పూర్తికాకముందే సభ్యుని నుండి ప్రీమియంను సేకరించుకొని, దానిని మాకు జమ చేయని పక్షములో (ఏ కారణం చేతనైనా), సభ్యుడు గనక అతను/ఆమె ప్రీమియం చెల్లించారని మరియు సరైన రసీదును పొందారని నిరూపించగలిగి, అతను/ఆమె సముచితంగా బీమా చేయబడ్డారని నమ్మేలా చేయగలిగితే మేము ఆ సభ్యునికి కవరేజీని అందించడం కొనసాగిస్తాము.
బీమా చేయబడిన సభ్యుడు లేదా నామినీ/అపాయింటీ/ చట్టబద్ధమైన వారసుల పేరిట, ఆయా ఉదంతమును బట్టి, బీమా చేయబడిన వ్యక్తికి లేదా నామినీ/ అపాయింటీ/ చట్టబద్ధమైన వారసుల యొక్క నిర్దిష్ట బ్యాంక్ ఖాతాకు ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానం ద్వారా క్లెయిమ్ చెల్లింపు చేయబడేలా చూసుకోవడానికి మేము సంపూర్ణంగా బాధ్యత వహిస్తాము.
ప్లాన్ కాలావధి సందర్భంగా దురదృష్టవశాత్తూ సభ్యుడు/జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన ఉదంతములో, మేము నామినీ/అపాయింటీ/ చట్టబద్ధమైన వారసులకు భరోసా సొమ్మును చెల్లిస్తాము.
ఈ ప్లాన్ లో 'మాస్టర్ పాలసీదారు' మరియు 'సభ్యుడు' చేరి ఉంటారు.
మాస్టర్ పాలసీదారు ఎవరు?
మాస్టర్ పాలసీదారు మీరే, ఏవైనా అనిశ్చితుల నుండి ఉద్యోగులను మరియు వారి కుటుంబాలను సురక్షితంగా ఉంచుకోవడానికి గాను ఈ ప్లాన్ ని తన సభ్యులు/కస్టమర్లు/ ఉద్యోగులకు అందించే మాస్టర్ పాలసీదారు అయిన సంస్థ. మాస్టర్ పాలసీదారు మాస్టర్ ప్లాన్ ని కలిగి ఉంటారు మరియు ఆపరేట్ చేస్తారు.
సభ్యుడు అంటే ఎవరు?
సభ్యుడు అనే వ్యక్తి ఒక సంస్థ యొక్క సభ్యుడు/కస్టమర్/ఉద్యోగి/ అనుబంధ సంస్థ లేదా సమూహంతో అనుబంధించబడిన ఏ వ్యక్తి అయినా అయి ఉండవచ్చు. ఈ ప్లాన్ క్రింద సభ్యుడికి జీవిత భరోసా కల్పించబడుతుంది. సభ్యుడి జీవితంపై ప్రయోజనాలు చెల్లించబడతాయి.
ఒక సభ్యుడికి వయస్సు పరిమితులు ఇలా ఉంటాయి –
వయస్సు | యజమాని - ఉద్యోగి గ్రూపు | యజమాని కానివారు-ఉద్యోగుల గ్రూపు |
---|---|---|
ప్రవేశము వద్ద కనీస వయస్సు | చివరి పుట్టినరోజు నాటికి 18 సంవత్సరాలు | చివరి పుట్టినరోజు నాటికి 14 సంవత్సరాలు |
ప్రవేశము వద్ద గరిష్ట వయస్సు | చివరి పుట్టినరోజు నాటికి 85 సంవత్సరాలు | చివరి పుట్టినరోజు నాటికి 85 సంవత్సరాలు |
మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు | చివరి పుట్టినరోజు నాటికి 86 సంవత్సరాలు | చివరి పుట్టినరోజు నాటికి 86 సంవత్సరాలు |
కనీస గ్రూపు సైజు మరియు గరిష్ట గ్రూప్ సైజు | గరిష్ట గ్రూప్ సైజు |
---|---|
EPFO ఆవశ్యకతల మేరకు, NEE గ్రూపులకు 50 మంది సభ్యులు మరియు గ్రూప్ టర్మ్ భరోసా క్రింద EDLIకి 20 బదులుగా EE గ్రూపులకు 10 మంది సభ్యులు | పరిమితి లేదు |
గ్రూపు సైజు 500 కంటే ఎక్కువ ఉన్నప్పుడు గ్రూప్ యొక్క వాస్తవ అనుభవం ఆధారంగా ప్రీమియంపై అనుభవపూర్వక సర్దుబాట్లు వర్తిస్తాయి.
ఇది ప్రతి సంవత్సరమూ నవీకరణ చేసుకోదగిన ప్లాన్. ఇది జారీ చేయబడిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు గ్రూప్ యొక్క సభ్యులకు అందుబాటులో ఉంటుంది.
ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్ క్రింద చెల్లించబడే మెచ్యూరిటీ లేదా జీవించియున్న ప్రయోజనం ఏదీ ఉండదు.
అవును, మాస్టర్ పాలసీదారు/ సభ్యుడు ఇండియా ఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌ని జోడించుకోవడానికి ఒక ఎంపికను కలిగి ఉంటారు. (UIN: 143B002V01), ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ అడిషినల్ బెనిఫిట్ రైడర్ (యుఐఎన్: 143B018V01), ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ ప్రొటెక్షన్ రైడర్ (యుఐఎన్: 143B003V01) మరియు ఈ పాలసీకి ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ డిజేబిలిటీ రైడర్ ప్లాన్ (UIN: 143B004V01). 5 ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ అనేది అనుసంధానం- కాని, పాల్గొనడం లేని గ్రూప్ రైడర్, కవర్ చేయబడిన ఏదైనా క్లిష్టమైన అనారోగ్యం నిర్ధారణ అయిన ఉదంతములో మీ సభ్యులకు ఆర్థిక రక్షణను అందించడానికి ఇది రూపొందించబడింది. ఈ రైడర్, ఈ దిగువ కనబరచిన విధంగా 3 ప్రయోజన ఎంపికల నుండి ఎంచుకోవడానికి వెసులుబాటును అందిస్తుంది:
1. క్లిష్టమైన అస్వస్థత (సిఐ) ప్రయోజనం 40 షరతులతో
2. క్లిష్టమైన అస్వస్థత (సిఐ) ప్రయోజనం 20 షరతులతో
3. క్లిష్టమైన అస్వస్థత (సిఐ) ప్రయోజనం 5 షరతులతో
రైడర్ కవర్ ప్రారంభంలో మాస్టర్ పాలసీదారు/సభ్యుడు పైన కనబరచిన ప్రయోజన ఎంపికలలో దేనినైనా ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ రైడర్‌ను ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 30% కి మించకూడదు. కవర్ రైడర్ షరతులపై వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్ పై అందుబాటులో ఉన్న రైడర్ బ్రోచర్‌ను చూడండి.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ అడిషినల్ బెనిఫిట్ రైడర్ ప్లాన్ అనేది అనుసంధానం-కాని, భాగస్వామ్య యేతర గ్రూప్ రైడర్, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగిన పక్షములో మీ సభ్యుల ఆర్థిక భద్రతను పెంపొందించడానికి రూపొందించినది. ఈ రైడర్ ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ టర్మ్ ప్లాన్ క్రింద ఈ క్రింది ప్రయోజనాన్ని అందిస్తుంది:
స్పౌస్ కవర్ (జీవితభాగస్వామి వర్తింపు): రైడర్ కాల వ్యవధిలో జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో, లబ్ధిదారు రైడర్ బీమా సొమ్ముకు సమానమైన ఏకమొత్తం ప్రయోజనాన్ని అందుకుంటారు. పాలసీలో స్పౌస్ కవర్, బేస్ పాలసీలో సభ్యుడి మరణ ప్రయోజనం యొక్క 50% కి గరిష్టంగా పరిమితం చేయబడింది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ అడిషినల్ ప్రొటెక్షన్ రైడర్ ప్లాన్ అనేది అనుసంధానం-కాని, భాగస్వామ్య యేతర గ్రూప్ రైడర్, ఏదైనా యాక్సిడెంట్ కారణంగా మరణం లేదా సభ్యుడు ఏదైనా టెర్మినల్ వ్యాధితో రోగనిర్ధారణ చేయబడిన పక్షములో మీ సభ్యుల కొరకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి రూపొందించిన ఒక-సంవత్సరపు నవీకరణ సమూహానికి మరియు ఇతర దీర్ఘావధి సమూహ ఉత్పత్తులకు దానిని జతచేయవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ డిజేబిలిటీ రైడర్ ప్లాన్ అనేది అనుసంధానితం కాని, పాల్గొనడం-లేని గ్రూప్ రైడర్, ఇది ఒక-సంవత్సరం పునరుద్ధరణ చేయదగిన గ్రూపు మరియు ప్రమాదవశాత్తూ సంపూర్ణ శాశ్వత వైకల్యం ప్రయోజనం (ఎటిపిడి) లేదా ప్రమాద ఘటన మరియు/లేదా అనారోగ్యం కారణంగా సంపూర్ణ శాశ్వత వైకల్యం (టిపిడి) లేదా ప్రమాద ఘటన మరియు/లేదా అనారోగ్యం కారణంగా పాక్షిక శాశ్వత వైకల్యం (పిపిడి) విషయంలో మీ సభ్యులకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి రూపొందించబడిన ఇతర దీర్ఘకాలిక గ్రూపు ఉత్పాదనలకు జోడించబడి ఉండవచ్చు.
ఒకవేళ మీరు ఈ రైడర్‌ను ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 100% కి మించకూడదు.
మాస్టర్ పాలసీదారు అయిన మీరు, ఎప్పుడైనా ప్లాన్ ని సరెండర్ చేయవచ్చు. అయినప్పటికీ, బీమా సర్టిఫికెట్‌లో కనబరచిన విధంగా అవధి ముగిసే వరకు వ్యక్తిగత సభ్యుడుగా కవరేజీని కొనసాగించుకోవడాన్ని సభ్యుడు ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ క్రింద ఎటువంటి సరెండర్ లేదా పెయిడ్-అప్ విలువ చెల్లించబడదు.
ఈ ఉదంతములో, కవర్ మరియు ప్రీమియం ప్లాన్ అనేవి సంవత్సరంలో మిగిలి ఉన్న కాలవ్యవధికి, అంటే మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణకు వచ్చే వరకూ నిలిచి ఉంటాయి.
ఉదాహరణకు:
ప్లాన్ అవధి: ఏప్రిల్ 1, 2014 నుండి మార్చి 31, 2015 వరకు
కొత్త సభ్యులు చేరతారు: 1 నవంబర్, 2014
ప్రీమియములు లెక్కించవలసిన కాలం: 5 నెలలు (నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి).
వాలంటరీ కవర్ | నిర్బంధ కవర్ | |
---|---|---|
మాస్టర్ పాలసీదారు | పథకంలో పాల్గొనడానికి ఎంచుకుంటారు | పథకంలో పాల్గొనడానికి ఎంచుకుంటారు |
సభ్యులు | ప్లాన్ లో పాల్గొనడానికి మరియు తదనుగుణంగా ప్రీమియములు చెల్లించడానికి ఎంచుకోవచ్చు | ప్లాన్ లో పాల్గొనాల్సిన కర్తవ్యబాధ్యత ఉంటుంది |
జీవిత వర్తింపు | వ్యక్తిగత సభ్యుడి జీవితంపై ఉంటుంది | వ్యక్తిగత సభ్యుడి జీవితంపై ఉంటుంది |
కనీస కవర్ | గరిష్ట కవర్ |
---|---|
ఒక్కొక్క సభ్యునికి రు. 5,000/- | పూచీకత్తుకు లోబడి |
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
అన్నింటినీ వీక్షించండి