ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 41 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పుగా తెలియజేయడం మరియు జప్తు వ్యవహరించబడుతుంది. వివాదరహితమైన క్లాజ్: ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 45 యొక్క సారాంశము ఇలా చెబుతుంది
1) పాలసీ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత, అంటే, పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే దాని నుండి ఎటువంటి జీవిత బీమా పాలసీ ప్రశ్నించబడదు.
2) బీమా యొక్క ఒక పాలసీని మోసము ఆధారంగా పాలసీ యొక్క బీమా తేదీ నుండి లేదా ముప్పు వర్తింపు ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ యొక్క పునరుద్ధరణ తేదీ నుండి లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే అప్పటి నుండి మూడు సంవత్సరాల వ్యవధి లోపున ఏ సమయములోనైనా ప్రశ్నించవచ్చు: అప్పుడు, దేని ఆధారంగా అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
3) సబ్ సెక్షన్ (2)లో ఏది ఎలా ఉన్నప్పటికిన్నీ, బీమా చేసిన వ్యక్తి తనకు అత్యుత్తమంగా తెలిసిన మేరకు మరియు నమ్మకం మేరకు ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా చెప్పడం లేదా అణచివేయడం నిజమని నిరూపించగలిగితే, లేదా వాస్తవాన్ని అణిచివేయడానికి ఏ విధమైన ఉద్దేశపూర్వక ఉద్దేశ్యం లేదని లేదా ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా పేర్కొనడం లేదా అణచివేయడం బీమాదారుకు తెలిసి జరగలేదని నిరూపితమైనప్పుడు ఏ బీమాదారు కూడా మోసం ఆధారాలపై జీవిత బీమా పాలసీని తిరస్కరించరు: ఒకవేళ మోసం జరిగియున్న పక్షములో, పాలసీదారు జీవించిలేని సందర్భములో, వాటిని తిరస్కరించే బాధ్యత లబ్ధిదారులపై ఉంటుంది.
4) ఒక జీవిత బీమా పాలసీని పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ జరిగిన తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల లోపున ఏది తర్వాత వస్తే దాని ప్రకారం, బీమా చేయబడిన వ్యక్తి యొక్క జీవిత కాలపు అంచనాకు సంబంధించిన ఏదైనా వాస్తవ ప్రకటన లేదా వాస్తవ సత్యం పాలసీ జారీ చేయబడిన లేదా పునరుద్ధరించబడిన లేదా రైడర్ జారీ చేయబడిన ప్రతిపాదన పత్రము లేదా ఇతర పత్రములో తప్పుగా చేయబడిందని లేదా త్రొక్కిపెట్టబడిందనే ఆధారాలతో ఎప్పుడైనా ప్రశ్నార్ధకమవుతుంది: అప్పుడు, దేని ఆధారంగా జీవిత బీమా పాలసీ తిరస్కరించాలనే అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది: ఇంకా తదుపరి, మోసం జరిగిందనే ఆధారంగా కాకుండా, తప్పుగా పేర్కొనడం లేదా వాస్తవ సత్యాన్ని త్రొక్కిపెట్టి ఉంచడం వల్ల పాలసీని తిరస్కరించిన పక్షంలో, అలా తిరస్కరించబడిన తేదీ వరకు పాలసీపై వసూలు చేసిన ప్రీమియములు అటువంటి తిరస్కరణ తేదీ నుండి తొంభై రోజుల వ్యవధి లోపున బీమా చేయబడిన వ్యక్తికి లేదా బీమా చేయబడిన వ్యక్తి యొక్క చట్టబద్ధ ప్రతినిధులు లేదా నామినీలు లేదా అసైనీలకు చెల్లించబడతాయి.
5) ఈ విభాగంలోని ఏదీ కూడా, వయస్సు ఋజువు కోసం ఏ సమయంలో అయినా కాల్ చేయడానికి బీమాదారు అర్హత కలిగి ఉన్నట్లయితే, పాలసీని ప్రశ్నించకుండా వారిని నిరోధించదు మరియు పాలసీ నిబంధనల కారణంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క వయస్సును ప్రతిపాదనలో తప్పుగా పేర్కొనబడినట్లు తదనంతర ఋజువుపై సర్దుబాటు చేయబడినంత మాత్రాన ఏ పాలసీ ప్రశ్నార్థకమైనట్లుగా భావించబడదు.