కుటుంబ టర్మ్ ఇన్స్యూరెన్స్ (అవధి బీమా) అంటే ఏమిటి?
ఇది ఒకే ఒక్క ప్లాన్ క్రింద ఒక కుటుంబంలోని అనేకమంది సభ్యులను కవర్ చేసే ఒక రకమైన పాలసీ. పాలసీ వ్యవధి సందర్భంగా బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే, కుటుంబ టర్మ్ ఇన్స్యూరెన్స్ లబ్ధిదారులకు మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. మీరు చుట్టూ లేనప్పుడు సైతమూ మీ ఇంటి వారి అవసరాలు తీర్చబడేవిధంగా నిర్ధారిస్తూ, ఇది మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడానికి రూపొందించబడింది.
ఒక సింగిల్ టర్మ్ జీవిత బీమా పాలసీ సౌకర్యవంతమైనదిగా మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా చేస్తూ అనేకమంది కుటుంబ సభ్యులను కవర్ చేస్తుంది. ఇది ప్రాథమిక సంపాదనదారుడు, జీవిత భాగస్వామి మరియు పిల్లలకు కవరేజీని అందిస్తుంది, మొత్తం కుటుంబానికి ఆర్థిక రక్షణను నిర్ధారిస్తుంది.
మీ కుటుంబానికి సరియైన భరోసా సొమ్మును ఎంచుకోండి, తద్వారా వారు తగినంత ఆర్థిక తోడ్పాటు లేకుండా మాత్రం ఉండిపోరు. మా ₹5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
కుటుంబం కోసం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు
ఇంటిలో ప్రతి ఒక్కరూ గణనీయంగా దోహదపడుతున్న ఒక గృహస్థును పరిగణించండి, అందువల్ల దాదాపు అందరు సభ్యులకూ కవరేజ్ అవసరం అవుతుంది, తద్వారా వారు లేనప్పుడు ఎవరూ బాధపడకుండా ఉంటారు. కుటుంబం కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పరిగణించడానికి ఇదొక మంచి కారణము.
అది అందించే ప్రయోజనాలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి.
కుటుంబం కోసం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే అది మీ ప్రియమైనవారికి ఆర్థిక భద్రత ఉండేలా చూసుకుంటుంది. పాలసీదారు మరణించిన సందర్భంలో, బీమా చెల్లింపు అనేది రోజువారీ ఖర్చులను కవర్ చేయడానికి, ఋణాలు చెల్లించడానికి మరియు చదువులు లేదా పెళ్ళి వంటి భవిష్యత్ లక్ష్యాలకు నిధులు సమకూర్చడానికి సహాయపడుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర రకాల జీవిత బీమా ప్లానుల తో పోలిస్తే, సాపేక్షంగా మరింత సరసమైనవిగా ఉంటాయి, దీనివల్ల కుటుంబాలు తమ బడ్జెట్ కు భారం కాకుండా గణనీయమైన కవరేజీని పొందడం సులభతరం అవుతుంది.
కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ దిశగా చెల్లించబడిన ప్రీమియంలు అదనపు పొదుపును అందిస్తూ వర్తించే పన్ను చట్టాల క్రింద పన్ను మినహాయింపులకు అర్హమైనవిగా ఉన్నాయి.
పాలసీ మీ ఆర్థిక లక్ష్యాలకు కుదురుబాటు అయ్యేలా చూసుకుంటూ, మీ కుటుంబ అవసరాల ఆధారంగా మీరు కవరేజ్ మొత్తము మరియు పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు.
మీ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉందని తెలుసుకోవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది, వారి భవిష్యత్తు గురించి చింతించకుండా జీవితంలోని ఇతర అంశాలపై దృష్టి ఉంచడానికి మీకు వీళు కలిగిస్తుంది.
కుటుంబం కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానుల రకాలు ఏవేవి?
కుటుంబంలోని అనేకమంది సభ్యులను కవర్ చేసే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసేటప్పుడు కూడా, మీరు ఎంచుకోవాల్సిన ఉప-రకాల ప్లాన్ల శ్రేణి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రధానంగా మీ బీమా ప్రదాత వద్ద అందుబాటులో ఉన్న ఐచ్ఛికాలపై ఆధారపడి ఉంటుంది.
ఇది పాలసీ వ్యవధి అంతటా స్థిరమైన భరోసా సొమ్మును అందిస్తుంది. నిలకడైన మరియు ఊహించదగిన కవరేజీని ఇష్టపడే కుటుంబాలకు ఇది అనువుగా ఉంటుంది.
పెరుగుతున్న టర్మ్ ఇన్సూరెన్స్
ఈ రకమైన ప్లానులో, భరోసా సొమ్ము వార్షికంగా పెరుగుతుంది, అది పెరుగుతున్న ఆర్థిక బాధ్యతలు ఉన్న కుటుంబాలకు అనుకూలమైనదిగా చేస్తుంది.
తగ్గుతున్న టర్మ్ ఇన్సూరెన్స్
సాధారణంగా ఇంటి లోన్ వంటి అప్పులను కవర్ చేయడానికి ఉపయోగించబడుతుంది, మీరు దానిని తిరిగి చెల్లించేకొద్దీ అది తగ్గుతున్నట్లుగా భరోసా సొమ్ము కాలక్రమేణా తగ్గుతుంది. గణనీయంగా అప్పులు ఉన్న కుటుంబాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
కుటుంబం కోసం గ్రూపు టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్
సాధారణంగా ఉద్యోగదాతలచే అందించబడే ఈ రకమైన ప్లాన్, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఉద్యోగి కుటుంబాన్ని కవర్ చేస్తుంది. కుటుంబం కోసం గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వల్ల బేసిక్ కవరేజ్ లభిస్తుంది మరియు వ్యక్తిగత పాలసీలతో అనుబంధం చేసుకోవచ్చు.
రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్
పాలసీదారు పాలసీ వ్యవధి అంతటా జీవించి ఉంటే, ఈ ప్లాను చెల్లించిన ప్రీమియములను తిరిగి ఇస్తుంది. తమ బీమా ప్లానులో పొదుపు అంశాన్ని కోరుకునే కుటుంబాలకు ఇది ఆకట్టుకునేలా ఉండవచ్చు.
మీ కుటుంబం కోసం అత్యుత్తమ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంచుకోండి
మీ కుటుంబం కోసం అత్యుత్తమమైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో ఈ క్రింది దశలు మీకు సహాయపడతాయి, అది మీ జీవిత భాగస్వామికి మాత్రమే అయినా, లేదా కొంతమంది ఇతర సభ్యులకు అయినా కావచ్చు.
మీ కుటుంబము యొక్క ఆర్థిక అవసరాలను అంచనా వేయండి
మీ రోజువారీ ఖర్చులు, చదువుల ఖర్చులు మరియు దీర్ఘకాలిక లక్ష్యాలతో సహా మీ కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలను అంచనా వేసుకోండి. తగినంత భరోసా సొమ్మును నిర్ణయించడానికి అది సహాయపడుతుంది.
ఒక ఆన్లైన్ క్యాలికులేటర్ వాడండి.
మీరు ఆశించిన కవరేజ్ మొత్తం, పాలసీ వ్యవధి మరియు ఇతర అంశాల ఆధారంగా ప్రీమియమును నిర్ణయించడంలో ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్లు మీకు సహాయపడతాయి.
విభిన్నమైన ప్లానులను పోల్చండి
కవరేజ్, ప్రీమియం మరియు ప్రయోజనాల యొక్క అత్యుత్తమ సమ్మేళనాన్ని అందించేదాన్ని కనుగొనడానికి వివిధ కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులను చూడండి.
క్లిష్టమైన అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణం మరియు వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్లు వంటి యాడ్-ఆన్ కవర్లు మీ కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజీని పెంచుతాయి.
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మరియు కస్టమర్ సర్వీస్
విశ్వసనీయతను నిర్ధారించుకోవడానికి అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మరియు సానుకూల కస్టమర్ సమీక్షలు ఉన్న బీమాదారు సంస్థను ఎంచుకోండి.
కుటుంబ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ఎందుకు ఎంచుకోవాలి?
మీ కుటుంబానికి కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరైన జోడీ అని మీరు ఎందుకు భావించాలో అనేందుకు కొన్ని కారణాలను చూడండి.
కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకే పాలసీ క్రింద సమగ్రమైన కవరేజీని అందిస్తుంది, ఇది నిర్వహణకు సులభతరం చేస్తుంది మరియు కుటుంబ సభ్యులందరూ రక్షించబడేలా నిర్ధారిస్తుంది.
ప్రతి కుటుంబ సభ్యునికీ విడివిడిగా పాలసీలు కొనుగోలు చేయడానికి బదులుగా, కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ఖర్చుతో కవరేజీని అందిస్తుంది.
అనేక వ్యక్తిగత పాలసీలకు బదులుగా ఒక పాలసీని నిర్వహించడం వల్ల ప్రీమియం చెల్లింపులు మరియు పాలసీ-ట్రాకింగ్ సులభతరం అవుతుంది.
వెసులుబాటు (ఫ్లెక్సిబిలిటీ)
మీ కుటుంబ అవసరాలు క్రమేపీ వృద్ధి చెందుతున్నప్పుడు కవరేజ్ మొత్తాలను సర్దుబాటు చేయడానికి మరియు రైడర్లను జోడించడానికి ఈ ప్లానులు వెసులుబాటును అందిస్తాయి.
ప్రధాన సంపాదనాపరుడు కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ కొనడాన్ని ఎందుకు పరిగణించాలి?
ఇంటిలో ప్రధాన సంపాదనదారుడు ఇంటిని చూసుకునే వ్యక్తిగా పరిగణించబడతారు. ఇతర కుటుంబ సభ్యులు దోహదం చేస్తున్ననప్పటికీ సైతమూ, ఇంటి కీలక ఆర్థిక అవసరాలు సాధారణంగా ఇంటి యజమాని భుజస్కంధాలపైనే ఉంటాయి.
ప్రాథమిక సంపాదనాపరుడు కుటుంబానికి తగిన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడాన్ని ఎందుకు పరిగణించాలో ఇక్కడ ఉంది.
కుటుంబ ఆర్థిక భవిష్యత్తును రక్షించుకోవడం
ప్రాథమిక సంపాదనదారుగా, మీ ఆదాయం మీ కుటుంబం యొక్క జీవనశైలి, చదువులు మరియు భవిష్యత్తు లక్ష్యాలకు తోడ్పడుతుంది. మీరు లేనప్పుడు ఈ లక్ష్యాలు రాజీ పడకుండా కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది.
అనేక కుటుంబాలు ఇళ్ళు లేదా కార్లు వంటి ప్రధాన కొనుగోళ్ల కోసం లోన్ లపై ఆధారపడతాయి. ప్రాథమిక సంపాదనదారుడు మరణించిన పక్షములో, కుటుంబంపై ఆర్థిక ఒత్తిడిని నివారించుకుంటూ, వచ్చిన బీమా చెల్లింపును ఈ అప్పులను తిరిగి చెల్లించడానికి వాడుకోవచ్చు.
కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియములు మీ మొత్తం పన్ను బాధ్యతను తగ్గిస్తూ పన్ను తగ్గింపులకు అర్హత పొందవచ్చు.
మీ పిల్లల చదువులను కవర్ చేయడం లేదా మీ జీవిత భాగస్వామి ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవడం వంటి మీ ఆర్థిక బాధ్యతలకు కుదురుబాటు అయ్యేలా మీరు పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు.
ఒక గృహిణి తన కుటుంబం కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చునా?
ఒక హోమ్‌మేకర్ లేదా గృహిణి తన కుటుంబం కోసం కవరేజ్ పొందడానికి ఒక టర్మ్ లైఫ్ ప్లాన్ కొనాలని కోరుకునే వివిధ పరిస్థితులు ఉన్నాయి. ఇది సాంప్రదాయమైన ఎంపిక కాకపోవచ్చు. అయినప్పటికీ, అండర్ రైటింగ్ బృందం ఆమోదం మరియు ఇతర ఆవశ్యకతలను నెరవేర్చడానికి లోబడి, బహుశా అది సాధ్యం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన పరిగణన అంశాల్ని చూద్దాం.
ఒక గృహిణి సాంప్రదాయ ఆదాయాన్ని సంపాదించలేకపోవచ్చు, కానీ ఇంటి నిర్వహణలో ఆమె పాత్ర ఎంతో అమూల్యమైనది. కొందరు బీమాదారులు కుటుంబ శ్రేయస్సుకు గృహిణుల దోహదాన్ని గుర్తిస్తూ గృహిణుల కోసం ప్రత్యేకంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నారు.
ఒక గృహిణి తన భర్త కవరేజీని భర్తీ చేయడానికి కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు, ఆమె చుట్టుపట్ల మనకు లేకపోయినా కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చబడేలా అది చూసుకుంటుంది.
గృహిణి లేని పరిస్థితుల్లో, బీమా చెల్లింపు పొందడమనేది కుటుంబం యొక్క జీవన ప్రమాణాలను నిర్వహించడం, పిల్లల సంరక్షణ లేదా ఇంటికి సహాయం వంటి అదనపు ఖర్చులను భరించడంలో కుటుంబానికి సహాయపడుతుంది.
₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వంటి అధిక కవరేజీని గనక మీరు ఎంచుకుంటే, మీ పాలసీ మీకు ఎంత ఖరీదు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మా ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌తో ప్రీమియం అంచనాలను పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీ కుటుంబం కోసం ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి
ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడమనేది మామూలుగా విసుగు-రహితమైన ప్రక్రియ. మీరు అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి.
కవరేజ్, ప్రీమియం మరియు అదనపు ప్రయోజనాల ఆధారంగా వివిధ కుటుంబ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లానులను పోల్చడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించండి.
ఆన్లైన్ టర్మ్ ఇన్స్యూరెన్స్ క్యాలికులేటర్ ఉపయోగించండి ప్రీమియంని అంచనా వేయడానికి గాను మీ వయస్సు, ఆశించిన భరోసా సొమ్ము మరియు పాలసీ వ్యవధి వంటి వివరాలను ఎంటర్ చేయండి.
మీరు ఒక ప్లాన్‌ను ఎంచుకున్న తర్వాత, మీ వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు ఫారమును పూరించండి.
గుర్తింపు ఋజువు, చిరునామా ఋజువు మరియు ఆదాయ ఋజువు వంటి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని, ప్రీమియమును ఆన్లైన్లో చెల్లించండి.
వెరిఫికేషన్ తర్వాత, బీమాదారు పాలసీని జారీ చేస్తారు మరియు మీరు దానిని వారి వెబ్సైట్ లేదా యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఒక కుటుంబం కోసం అత్యుత్తమ జీవిత బీమా పాలసీ ఏది?
ఒక కుటుంబానికి అత్యుత్తమ జీవిత బీమా పాలసీ మీ నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు మరియు బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. విభిన్న జీవిత బీమా పాలసీలను పోల్చడం మరియు సమగ్రమైన కవరేజీని అందిస్తూ మీ ఆర్థిక ప్రణాళిక లోనికి కుదురుబాటయ్యే ఒకదానిని ఎంచుకోవడం ముఖ్యము.
ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ని కొనుగోలు చేయవచ్చునా?
వ్యక్తులు మరియు కుటుంబాలు ఇరువురికీ టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకే పాలసీ కింద అనేకమంది సభ్యులను కవర్ చేస్తుంది, అయితే వ్యక్తిగత టర్మ్ ఇన్సూరెన్స్ ఒక వ్యక్తిని మాత్రమే కవర్ చేస్తుంది.
టర్మ్ పాలసీని మీరు నగదుగా మార్చుకోవచ్చునా?
సాధారణంగా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు నగదు విలువ కాంపొనెంటును కలిగి ఉండవు, కాబట్టి వాటిని నగదుగా మార్చుకోలేరు. మరణ ప్రయోజనాన్ని అందించడమే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం.
సీనియర్ సిటిజన్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయవచ్చునా?
అవును, సీనియర్ సిటిజన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయవచ్చు. విభిన్నమైన ప్లాన్ ఐచ్ఛికాల కోసం మీ బీమాదారును కనుక్కోండి.
నా కుటుంబం కోసం నేను టర్మ్ ఇన్సూరెన్స్ పై లోన్ తీసుకోవచ్చునా?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు నగదు విలువను కూడబెట్టుకోవు కాబట్టి, అవి సాధారణంగా లోన్ సౌకర్యాలను అందించవు. లోన్ లను సాధారణంగా హోల్ లైఫ్ లేదా ఎండోమెంట్ పాలసీలపై తీసుకోవచ్చు.
నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఎంత కవరేజ్ అవసరమై ఉంటుంది?
అవసరమైన కవరేజ్ మీ కుటుంబము యొక్క ఆర్థికపరమైన అవసరాలు, ప్రస్తుత ఆదాయం మరియు భవిష్యత్తు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. సముచితమైన భరోసా సొమ్మును నిర్ణయించుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించాల్సిందిగా సిఫార్సు చేయబడుతుంది.
భార్యాభర్తలు ఇరువురూ సింగిల్ -టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవరేజ్ పొందవచ్చునా?
అవును, కొన్ని కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు ఉమ్మడి మరణ ప్రయోజనాన్ని అందిస్తూ, భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే పాలసీ క్రింద కవరేజీని అనుమతిస్తాయి.
నా కుటుంబానికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం పాలసీ వ్యవధి ఎంత ఉండాలి?
పాలసీ కాలవ్యవధి అనేది మీ ఆర్థికపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉండాలి, అంటే మీ పిల్లలు ఆర్థికంగా స్వతంత్రులు అయ్యే వరకు లేదా మీ తనఖా పూర్తిగా చెల్లించబడే వరకు వ్యవధి ఉండాలి.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పునరుద్ధరించుకోవచ్చునా?
అవును, అనేక మంది బీమాదారులు గడువు ముగిసిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని సాధారణంగా నిలిచిపోయి బకాయి ఉన్న ప్రీమియములు మరియు వర్తించే పెనాల్టీలను చెల్లించడం ద్వారా ఒక నిర్దిష్ట వ్యవధిలోపున పునరుద్ధరణకు అనుమతిస్తారు.
నా కుటుంబానికి కనీస భరోసా సొమ్ము విలువ ఎంత ఉండాలి?
భరోసా సొమ్ము మీ కుటుంబం యొక్క జీవన ఖర్చులు, అప్పులు, మరియు భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను తీర్చగలిగేలా ఉండాలి. మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు కవరేజీని ఎంచుకోవాలని తరచుగా సిఫార్సు చేయబడుతుంది.