అస్వీకార ప్రకటన
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఇక ముందుకు) 'ఇండియాఫస్ట్ లైఫ్' గా పిలువబడుతుంది, మీ వ్యక్తిగత సమాచారము, అవగాహన మరియు సమాచార వినిమయము కొరకు ఈ సైట్ ("వెబ్‌సైట్") ని నిర్వహణ చేస్తుంది. ఈ వెబ్‌సైట్ ని స్వేచ్ఛగా బ్రౌజ్ చేయండి. వెబ్‌సైట్ పై ప్రదర్శించబడిన సామాగ్రిలోని కాపీరైటుకు సంబంధించిన నోటీసులు అన్నింటిని మరియు ఇతర స్వాధీనతా సమాచారమును కూడా అలాగే ఉంచుతూ, అట్టి సామాగ్రిని మీరు వాణిజ్య-యేతర, వ్యక్తిగత వాడకమునకు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయినప్పటికీ, ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క లిఖితపూర్వక అనుమతి లేనిదే మీరు వెబ్‌సైట్ యొక్క విషయాంశాలను వచనము, బొమ్మలు, శ్రవణ మరియు వీడియోతో సహా (ఇకనుండి ముందుకు "విషయాంశము” అని పిలువబడుతుంది) బహిరంగ లేదా వాణిజ్య అవసరాలకు పంపిణీ, మార్పుచేర్పులు, ప్రసారము, పునర్వినియోగం, నివేదన లేదా వాడకము చేయకూడదు.
ఈ వెబ్‌సైట్ కు మీ అందుబాటు మరియు వాడకము కూడా వర్తించు అన్ని చట్టాలు మరియు ఈ క్రింది విషయాలకు లోబడి ఉంటుంది:
- ఈ వెబ్‌సైట్ ని అందుబాటు చేసుకోవడం మరియు బ్రౌజ్ చేయడం ద్వారా మీరు ఎటువంటి పరిమితి లేదా అర్హత లేకుండా షరతులు మరియు నిబంధనలను స్వీకరిస్తున్నారు.
- ఈ వెబ్‌సైట్, ఇతర వెబ్‌సైట్లు, వెబ్ పేజీలు మరియు సేవలకు లింకులను కలిగి ఉండవచ్చు. అటువంటి ప్రతి వెబ్‌సైట్, వెబ్ పేజీ మరియు ఏదేని ఇతర వెబ్‌సైట్ లేదా వెబ్ సర్వీస్ పై సేవల యొక్క మీ వాడకము సంబంధిత వెబ్‌సైట్ లేదా వెబ్ సర్వీస్ యొక్క షరతులు మరియు నిబంధనలు ఒకవేళ ఏవైనా ఉంటే, వాటిని బట్టి ఉంటుంది.
- ఇతర వెబ్‌సైట్లు, వెబ్ పేజీలు మరియు సేవలలో ఇండియాఫస్ట్ లైఫ్ కు చెందిన విషయాంశాల కొరకు ఇండియాఫస్ట్ లైఫ్ జవాబుదారీ లేదా బాధ్యత వహించబోదు.
- ఉత్పాదన / ప్లాను యొక్క పేరు ఏ విధంగానూ బీమా ఒప్పందము యొక్క నాణ్యత, దాని భవిష్య సంభావ్యతలు లేదా రాబడులను సూచించదు. ఒక విక్రయ తీర్మానానికి వచ్చే ముందుగా, ప్రమాద అంశాలు, షరతులు మరియు నిబంధనల గురించి మరిన్ని వివరాల కొరకై దయచేసి సేల్స్ బ్రోచరును జాగ్రత్తగా చదవండి. రైడర్లు తప్పనిసరి ఏమీ కాదు మరియు నామమాత్రపు అదనపు ఖరీదుతో లభిస్తాయి. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు దయచేసి సంబంధిత రైడర్ బ్రోచరును చదవండి.
- యూనిట్ అనుసంధానిత జీవిత బీమా ఉత్పాదనలు సాంప్రదాయక బీమా ఉత్పాదనలకు భిన్నంగా ఉంటాయి మరియు అవి మార్కెట్ ముప్పులకు లోబడి ఉంటాయి. దయచేసి మీ విక్రయ ప్రతినిధి లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా కంపెనీచే జారీ చేయబడిన పాలసీ పత్రము నుండి అనుబంధిత ముప్పులు మరియు వర్తించు రుసుముల గురించి తెలుసుకోండి. యూనిట్ అనుసంధానిత జీవిత బీమా పాలసీలలో చెల్లించిన ప్రీమియము పెట్టుబడి మార్కెట్లతో ముడిపడి ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ముప్పులకు లోబడి ఉంటుంది మరియు యూనిట్ల యొక్క నవ్ లు పెట్టుబడి మార్కెట్ ను ప్రభావపరచే ఫండ్ మరియు కారకాంశాల యొక్క పనితీరుపై ఆధారపడి పైకీ క్రిందికీ వెళుతుండవచ్చు మరియు బీమా చేయబడిన వ్యక్తి అతని/ఆమె యొక్క నిర్ణయాలకు తానే బాధ్యులుగా ఉంటారు.
- యూనిట్ అనుసంధానిత బీమా ఒప్పందము క్రింద అందించబడే వివిధ ఫండ్స్, ఆ ఫండ్స్ యొక్క పేర్లు అయి ఉంటాయి మరియు ఏ విధంగానూ ఈ ప్లానుల యొక్క నాణ్యత, వాటి భవిష్యత్తు లేదా రాబడులను సూచించవు. యూనిట్ అనుసంధానిత ఫండ్స్ మార్కెట్ ముప్పులకు లోబడి ఉంటాయి మరియు ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ యొక్క ఉద్దేశ్యము నెరవేరబడుతుందని ఎటువంటి భరోసా గానీ లేదా హామీ గానీ ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ యొక్క గతకాలపు పనితీరు వాటి యొక్క భవిష్య పనితీరును ఏ మాత్రమూ సూచించదు.
- ఆదాయపు పన్ను చట్టము, 1961 తో సహా ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు ఉంటాయి మరియు సమయానుగుణంగా అవి మార్పులకు గురవుతుంటాయి.
- ఎటువంటి పరిస్థితుల్లోనూ, నిర్లక్ష్యముతో సహా ఐతే దానికే పరిమితం కాకుండా, ఇండియాఫస్ట్ లైఫ్ లేదా దాని డైరెక్టర్లు లేదా ఉద్యోగులు ఈ సైటు లేదా ఇందులోని సమాచారము యొక్క వాడకము మరియు/ లేదా వాడకము యొక్క అశక్తత కారణంగా ఏర్పడినట్లు ఆరోపించబడిన ఏవేని ప్రత్యేక లేదా పర్యవసానాత్మక నష్టాలకు, ఇండియాఫస్ట్ లైఫ్ మరియు/లేదా దాని ఉద్యోగులు లేదా డైరెక్టర్లకు సంభావ్య నష్టాల గురించి తెలియజేసి ఉన్నప్పటికీ సైతమూ అందుకు వారు బాధ్యత వహించబోరు.
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
ఇండియాఫస్ట్ లైఫ్, రెండు భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (44% వాటా) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (30% వాటా) లచే ప్రోత్సహించబడింది, తమ హక్కుదారులకు అందించే విలువ ప్రతిపాదనను సమృద్ధం చేసేందుకు అవి తమ అడుగుజాడ మరియు అనుభవాన్ని కొనసాగిస్తున్నాయి. మారిషస్ యొక్క చట్టాల క్రింద చేర్చుకోబడి మరియు వార్‌బర్గ్ పిన్కస్ ఎల్.ఎల్.సి చే నిర్వహించబడుతున్న ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ స్వంతంగా ఉన్న కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ చే చేర్చుకోబడిన కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇండియాఫస్ట్ లైఫ్ యందు 26 శాతం వాటా కలిగి ఉంది.
రిజిస్టర్డు ఆఫీసు:
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.
ఐ.ఆర్.డి.ఎ.ఐ రిజిస్ట్రేషన్ నం: నం. 143 | CIN:U66010MH2008PLC183679
పైన ప్రదర్శించబడిన ఇండియాఫస్ట్ లైఫ్ వ్యాపార చిహ్నం (ట్రేడ్ లోగో) ఇండియాఫస్ట్ లైఫ్ బ్రాండ్స్ లిమిటెడ్ కు సంబంధించినది మరియు లైసెన్సు క్రింద ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చే ఉపయోగించబడుతోంది.