మీ 30 ఏళ్ల వయస్సులో టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
పురుషులు లేదా స్త్రీలు అనే తేడా లేకుండా, 30 ఏళ్ల వయసు లోపు వ్యక్తులు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానులను ఎంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అది వారి జీవిత భాగస్వామి మరియు పిల్లల కోసమైనా, లేదా తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల కోసమైనా, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 30 ఏళ్ల వయసులో ఉన్నవారికి సహాయకరమైనదిగా నిరూపితమవుతుంది.
మీ కుటుంబానికి రక్షణ
మీ కుటుంబాన్ని రక్షించుకోవడం అనేది మీ 30 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలలో ఒకటి. మీరు జీవితంలో ఈ దశలోనికి అడుగుపెడుతున్నప్పుడు, పిల్లలను పెంచడం, ఇంటి ఖర్చులను నిర్వహించడం మరియు అప్పులు చెల్లించడం వంటి బాధ్యతలు ప్రధాన ప్రాధాన్యతలుగా మారవచ్చు. ఒక కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒకవేళ మీకు ఏమి జరిగినా సరే, మీ ప్రియమైనవారు ఎటువంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా చూసుకోగలదు.
ప్రీమియములకు స్థోమత
మీ 30 ఏళ్ల వయస్సులో ప్రీమియంలు మీ 20 ఏళ్ల వయసులో కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, మీ 40 లేదా 50 ఏళ్ల వయసు వరకు వేచి ఉండటంతో పోలిస్తే అవి ఇప్పటికీ చాలా సరసమైనవిగానే ఉంటాయి. మీ 30 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కట్టడం వల్ల దీర్ఘకాలిక కవరేజీని పొందుతూనే తక్కువ ప్రీమియంల నుండి ప్రయోజనం పొందడానికి మీకు వీలు కలుగుతుంది.
మహిళల కోసం ఆర్థిక భద్రత
30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు, టర్మ్ ఇన్సూరెన్స్ తమ ప్రియమైనవారికి ఆవశ్యకమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది, తద్వారా వారు తమ భవిష్యత్తును నిర్మించుకోవడంపై దృష్టి సారించగలుగుతారు. మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఆయుర్దాయం కారణంగా తక్కువ ప్రీమియములను అందించవచ్చు మరియు మహిళల ఆరోగ్యానికి నిర్దిష్టమైన కవరేజీ ఎంపికలను కలిగి ఉంటుంది.
ఆదాయం భర్తీ చేసుకోవడం
మీ 30 ఏళ్ళ వయస్సు అనేది మీ సంపాదన సామర్థ్యాన్ని కాపాడుకోవడాన్ని చాలా కీలకం చేస్తూ సాధారణంగా ఆదాయపు ఎదుగుదల కాలముగా ఉంటుంది. మీరు ఇకపై వారికి అన్నీ సమకూర్చడానికి మీరు అక్కడ లేకపోయినా, మీ కుటుంబం తనఖా చెల్లింపులు మరియు రోజువారీ జీవన ఖర్చులు వంటి ఆర్థిక బాధ్యతలను తీర్చుకోవడం కొనసాగించేలా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక రక్షణగా ఉపయోగపడుతుంది.
కవరేజీలో వెసులుబాటు
మీ ఆర్థిక లక్ష్యాలు మరియు జీవనశైలికి సరిపోయేలా మీరు వెసులుబాటు గల కవరేజీ ఎంపికలను ఎంచుకోవచ్చు. మీరు జీతం తీసుకుంటున్న ఉద్యోగి అయినా లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారైనా, టర్మ్ ఇన్సూరెన్స్ ను మీ అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి టర్మ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకుంటూ, అపసవ్య ఆదాయ పోకడల్ని పరిగణనలోకి తీసుకునే కవరేజ్ ఎంపికలను అందించగలదు.
పన్ను ప్రయోజనాలు
ఇతర పాలసీల లాగానే, టర్మ్ ఇన్సూరెన్స్, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C క్రింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. మీరు చెల్లించే ప్రీమియంలను మీ పన్ను చెల్లించదగిన ఆదాయం నుండి తగ్గించుకోవచ్చు, అది విలువైన కవరేజీని పొందడంతో పాటు పన్నులను ఆదా చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది.
30 ఏళ్ల వయసు లోపు వ్యక్తులకు అందుబాటులో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానుల రకాలు
సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల మీ ప్రీమియములు మరియు కవరేజీ వ్యవధి నుండి అత్యుత్తమ ప్రయోజనాలను పొందవచ్చు. పరిగణించడానికి సామాన్యంగా అందుబాటులో ఉండే కొన్ని ఎంపికలు ఇక్కడ ఉన్నాయి.
స్థాయి టర్మ్ ఇన్సూరెన్స్
ఇది అత్యంత సర్వ సాధారణమైన టర్మ్ ఇన్సూరెన్స్ రకం, ఇందులో కవరేజ్ మొత్తము అనేది పాలసీ వ్యవధి అంతటా ఒకేలా నిలిచి ఉంటుంది. ఇది స్థిరమైన రక్షణను అందిస్తుంది మరియు తనఖాలు లేదా చదువుల ఖర్చులు వంటి పెద్ద ఆర్థిక బాధ్యతలను కవర్ చేయడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది 30 ఏళ్ల వయస్సు లోపు వ్యక్తులకు అనువైనదిగా ఉంటుంది.
పెరుగుతున్న టర్మ్ ఇన్సూరెన్స్
ఈ ప్లానుతో, భరోసా సొమ్ము క్రమం తప్పని అంతరాలలో పెరుగుతూ ఉంటుంది, కాలక్రమేపీ తమ ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయని ఆశించే వారికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది. మీ కుటుంబ అవసరాలు వృద్ధి అయ్యేకొద్దీ ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మీ కవరేజీ ఉండేలా ఇది చూసుకుంటుంది.
తగ్గుతున్న టర్మ్ ఇన్సూరెన్స్
ఈ రకమైన ప్లాను తరచుగా లోన్లు వంటి నిర్దిష్ట ఆర్థిక నష్ట బాధ్యతలను కవర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. తగ్గుతున్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క భరోసా సొమ్ము తగ్గిపోతున్న అప్పు లేదా తనఖాకు అనుగుణంగా కాలక్రమేపీ తగ్గుతూ వస్తుంది, ఇది 30 ఏళ్ల వయసులో పెద్ద లోన్లను కవర్ చేయాలని చూసేవారికి సరసమైన ఎంపిక అవుతుంది.
ప్రీమియం తిరిగి రాకతో టర్మ్ ఇన్సూరెన్స్
సాంప్రదాయక టర్మ్ ప్లానుల మాదిరిగా కాకుండా, ఈ ఎంపిక పాలసీదారు కాలావధి అంతటా జీవించి ఉంటే చెల్లించిన ప్రీమియములను వాపసు అందజేస్తుంది. ఇది ఎక్కువ ఖరీదైన ప్లానుగా ఉంటుంది, అయితే రక్షణ మరియు పెట్టుబడి మధ్య సమతుల్యతను కోరుకునే వారికి, ఇది ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటుంది.
ఉమ్మడి టర్మ్ ఇన్సూరెన్స్
ఈ ప్లాన్ మిమ్మల్ని మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరినీ ఒకే ఒక్క పాలసీ కింద కవర్ చేస్తుంది. ప్రత్యేకించి భాగస్వాములిద్దరూ ఆర్థిక బాధ్యతలను పంచుకుంటూ ఉంటే, జంటలు ఆర్థిక రక్షణ పొందడానికి గాను ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం.
మీ 30 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు పరిగణించవలసిన విషయాలు
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానులు కీలకమైన కొనుగోలు అవుతాయి. పరిగణించాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.
కవరేజ్ మొత్తము
లోన్లు, పిల్లల చదువులు మరియు ఇతర భవిష్యత్తు ఖర్చులు వంటి మీ ఆర్థిక బాధ్యతల ఆధారంగా తగిన కవరేజీని నిర్ణయించుకోండి. మీ ఆర్థిక అవసరాలపై ఆధారపడి మొదట్లో ₹50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ లేదా ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడం గురించి పరిగణించండి. మీ బాధ్యతలు పెరిగే కొద్దీ, తగినంత రక్షణ ఉండేలా చూసుకోవడానికై మీరు ₹1.5 కోట్లు, ₹2 కోట్లు లేదా ₹5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడానికి కూడా మీరు చూడవచ్చు.
పాలసీ అవధి
పాలసీ కాలావధి మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనువుగా సరిపోవాలి. బాగుండాలంటే, మీ పిల్లలు ఆర్థికంగా స్వతంత్రులు అయ్యే వరకు లేదా మీరు గణనీయమైన అప్పులు తీరే వరకు ఈ ప్లాన్ మిమ్మల్ని కవర్ చేస్తుండాలి. మీ ఋణబాధ్యతలతో సరిపోవడానికి గాను ఎంత కాలం మీ కవరేజ్ ఉండాలో అంచనా వేయడానికై టర్మ్ ఇన్స్యూరెన్స్ క్యాలికులేటర్ ని ఉపయోగించండి.
పెంపొందిత రక్షణ కొరకు రైడర్లు
రైడర్లు అనేవి మీ పాలసీ కవరేజీని పెంపొందించే యాడ్-ఆన్లు. మీ 30 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, క్లిష్టమైన అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణం లేదా వైవర్ ఆఫ్ ప్రీమియం వంటి రైడర్లను జోడించడాన్ని పరిగణించండి. ఈ రైడర్లు మరణానికి అతీతంగా, తీవ్రమైన అనారోగ్యాలు లేదా వైకల్యాలు వంటి ఊహించని పరిస్థితుల కోసం అదనపు ఆర్థిక రక్షణను అందిస్తాయి.
వృత్తి మరియు ఆరోగ్యము
ప్రీమియములను నిర్ణయించడంలో మీ వృత్తి మరియు ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు అధిక-ప్రమాదం ఉండే వృత్తిలో పనిచేస్తుంటే లేదా ఇప్పటికే ఆరోగ్య పరిస్థితులు ఉండి ఉంటే, మీ ప్రీమియములు ఎక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ, మీ 30 ఏళ్ల వయసులో, ఈ అంశాలు సాధారణంగా తక్కువ ఆందోళన కలిగించవచ్చు మరియు మీరు ఇప్పటికీ సరసమైన ధరకు సమగ్రమైన పాలసీని తీసుకోవచ్చు.
విభిన్న జనాభా వర్గాల కోసం ప్రత్యేక పరిగణనలు
గృహిణులు, సీనియర్ సిటిజన్లు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు వంటి నిర్దిష్ట సమూహాలకు, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు వారి విశిష్టమైన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఇంట్లో-ఉండే జీవిత భాగస్వాముల కోసం ఆర్థిక కవరేజీని అందిస్తుంది. అదేవిధంగా, సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ వయస్సుకు మించి కవరేజ్ అందించే పాలసీలను అన్వేషించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
నా 30 ఏళ్ల వయసులో నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా?
అవును, మీ 40 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం. ఇది మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది మరియు తనఖాలు, పిల్లల చదువులు మరియు ఇతర బాధ్యతలు వంటి ఎదుగుతున్న బాధ్యతలను నిర్వర్తించడానికి సహాయపడుతుంది.
మీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొరకు మీరు ఎంత మొత్తము చెల్లించాల్సి ఉంటుంది?
మదుపు చేయడమనేది మీ ఆదాయం మరియు అప్పుల ఆధారంగా ఉండాలి. మీ కుటుంబానికి సమగ్ర రక్షణ కల్పించడానికై మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు కవరేజీని ఎంచుకోవడమనేది సాధారణమైన సూత్రం అవుతుంది.
ఒక టర్మ్ ప్లాన్ కు అత్యుత్తమ కాలావధి ఏమిటి?
టర్మ్ ప్లాన్ కు అనువైన వ్యవధి అనేది మీరు ఆర్థికంగా ఆధారపడటం ముగిసే వరకు లేదా గణనీయమైన అప్పులు తిరిగి చెల్లించబడే వరకు ఉండాలి. 30 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులకు తరచుగా 20 నుండి 30 సంవత్సరాల కాలావధి అనుకూలంగా ఉంటుంది.
మీరు మీ 30 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానుతో రైడర్లను కొనుగోలు చేయగలుగుతారా?
అవును, క్లిష్టమైన అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణం మరియు వైవర్ ఆఫ్ ప్రీమియం వంటి రైడర్లను మీ కుటుంబ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కి చేర్చుకోవచ్చు. అనారోగ్యం లేదా అంగవైకల్యం వంటి నిర్దిష్ట ఘటనల విషయంలో ఈ రైడర్లు అదనపు రక్షణను అందించగలవు మరియు ఆర్థిక భద్రతను నిర్ధారించగలవు.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనడం అనేది పన్ను ఆదాకు సహాయపడుతుందా?
ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడమనేది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C క్రింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. చెల్లించిన ప్రీమియంలు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి తగ్గించబడతాయి, అది మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతూ పన్నులపై ఆదా చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.