డా. పూనమ్ టాండన్
ఛీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్
డా. పూనమ్ టాండన్ గారు మా కంపెనీ యొక్క ఛీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కామర్స్ యందు బ్యాచిలర్ డిగ్రీ (ఆనర్స్), జంషెడ్‌పూర్‌లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మరియు ముంబైలోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీని కలిగి ఉన్నారు. ఆమె భారత బ్యాంకర్ల సంస్థ యొక్క ధృవీకృత అసోసియేట్ గా ఉన్నారు. ఆమె 2010 ఫిబ్రవరి 25 నుండి అమలు లోనికి వచ్చిన విధంగా మా కంపెనీలో చేరారు. ఇంతకుముందు, ఆమె మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో చీఫ్ మేనేజర్ (పెట్టుబడులు)గా పని చేశారు. ఆమె మా కంపెనీలో అంతర్గతంగా పెట్టుబడి పనితీరును పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉన్నారు.
విరాజ్ ఎం నాదకర్ణి
ఫండ్ మేనేజర్ - ఈక్విటీ
విరాజ్ గారు ఒక కంపెనీ సెక్రెటరీ, పుణె, సింబయోసిస్ నుండి ఎం.బి.ఎ (ఆర్థికశాస్త్రము) పట్టా పొందారు మరియు అతను పుణె విశ్వవిద్యాలయము నుండి కామర్స్ లో మాస్టర్స్ పట్టా కూడా పొందియున్నారు. అతనికి ఆర్థికశాస్త్ర రంగములో, ప్రధానంగా ఈక్విటీలలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అతనికి గణాంకాల విశ్లేషణలో అనుభవం ఉంది మరియు ఈక్విటీ మార్కెట్ స్థితిగతులను అర్థం చేసుకుంటారు. ఈ పదవికి ముందు అతను సీనియర్ రీసర్చ్ అనలిస్టుగా ఏంజెల్ బ్రోకింగ్, ఫార్చూన్ ఫైనాన్షియల్స్ తో పని చేశారు. అక్కడ అతను సంస్థాగత ఫ్రంట్ పై ప్రాథమిక పరిశోధన నిర్వహించారు మరియు బహుళ రంగాల మార్గాన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ,
విరాజ్ గారు ఈక్విటీ కొరకు ఫండ్ మేనేజరుగా ఉన్నారు.
సందీప్ శిర్షత్
ఫండ్ మేనేజర్ - ఫిక్సెడ్ ఇన్‌కమ్
సందీప్ శిర్షత్
ఫండ్ మేనేజర్ - ఫిక్సెడ్ ఇన్‌కమ్
సందీప్ బి.కాం పట్టభద్రులు మరియు అర్హత పొదిన కాస్ట్ అకౌంటెంట్ (ICWAI) అయి ఉన్నారు. అతను మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్, పిఎంఎస్ అదే విధంగా బీమా రంగాలలో 22 సంవత్సరాలకు పైగా పని చేశారు. గతంలో ఆయన మల్టీ-ఆక్ట్ ఈక్విటీ రీసర్చ్ (పి.ఎం.ఎస్), మ్యాట్రిక్స్ ఎ.ఎం.సి, హెచ్.ఎస్.బి.సి (సంస్థాగత ఫండ్ సేవలు), మరియు యుటిఐ ఎ.ఎం.సి ప్రైవేట్ లిమిటెడ్ (యుటిఐ ఎం.ఎఫ్) తో పని చేశారు. అతనికి ఫండ్ మేనేజ్‌మెంట్ - డెట్ మరియు బ్యాలన్స్డ్ ఫండ్స్, ట్రెజరీ మేనేజ్‌మెంట్, ఫండ్ అకౌంటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్స్, మ్యూచువల్ ఫండ్ కాంప్లియెన్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ విధులకు సంబంధించిన ఐటి ప్రాజెక్టులలో డొమైన్ నిపుణుడిగా అనుభవం ఉంది.
ఈ రోజున, ఆయన మా కంపెనీలో భాగంగా, ఫిక్సెడ్ ఇన్‌కమ్ కొరకు ఫండ్ మేనేజరుగా ఉన్నారు. ఈ రోజున, ఆయన మా కంపెనీలో భాగంగా, ఫిక్సెడ్ ఇన్‌కమ్ కొరకు ఫండ్ మేనేజరుగా ఉన్నారు.