ఇండియాఫస్ట్ లైఫ్ యందు, సంస్థ యొక్క విలువల పట్ల మా ఉద్యోగుల అంకితభావం మరియు నిబద్ధతకు మేము ఎంతో గొప్పగా విలువనిస్తాము. 2019లో, మేము మా ఉద్యోగి విలువ ప్రతిపాదన (EVP)ని స్పష్టంగా నిర్వచించడానికి మా పయనాన్ని ప్రారంభించాము మరియు మా ఉద్యోగుల వలయం లోపున అనేక చర్చోపచర్చలు మరియు ఆలోచనలు చేసిన తర్వాత, మేము దానిని “ఇవ్వడం మరియు పొందడం” యొక్క కలయికగా నిర్వచించాము, ఇందులో 'ఇవ్వడం' అనేది మేము నిర్వచించిన విలువల యొక్క ప్రదర్శన మరియు స్వరూపం రూపంలో ఉద్యోగుల నుండి ఆశించబడటాన్ని సూచిస్తుంది - నిజాయితీగా ఉండండి, సహాయకారిగా ఉండండి, కొత్తగా ఆలోచించండి, మరిన్ని చేయండి అని, కాగా 'పొందడం' అనేది C.A.R.E రూపంలో ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ఉద్యోగులు ఏమి ఆశించవచ్చునో సూచిస్తుంది. – వ్యక్తులు మరియు వారి విజయాన్ని జరుపుకోవడం, వృద్ధిని అత్యంత వేగవంతం చేయడం, సాధనలను గుర్తించడం మరియు ఉద్యోగులను సాధికారపరచడం.